1
00:00:07,633 --> 00:00:08,926
శత్రువుల నాశనం.

2
00:00:10,720 --> 00:00:14,014
అత్యంత శక్తితో, ఇంకా అత్యంత హింస.

3
00:00:15,391 --> 00:00:20,271
చివరకు, మనలో ఒకరు మాత్రమే నిలబడతాం.

4
00:00:24,358 --> 00:00:26,193
చాలా నిజం.

5
00:00:32,116 --> 00:00:33,032
ప్రీవియస్లీ

6
00:00:33,033 --> 00:00:34,159
ఈస్టర్ రాబోతోంది.

7
00:00:34,160 --> 00:00:36,453
యేసు క్రీస్తు పునరుత్థాన రోజునే

8
00:00:36,454 --> 00:00:39,497
మీ రెండవ రాక జరిగితే
ఎంత అద్భుతంగా ఉంటుంది?

9
00:00:39,498 --> 00:00:41,458
- ప్రెసిడెంట్‌ను చంపించావు.
- నాకు మరో దారి లేదు.

10
00:00:41,459 --> 00:00:44,919
అది ముగిసింది. నువ్వు నన్ను
మళ్ళీ ఇంకెప్పుడూ వినలేవు.

11
00:00:44,920 --> 00:00:46,254
ఆమె నిన్ను వాడుకుంటుంది!

12
00:00:46,255 --> 00:00:48,506
- నోరు ముయ్యి!
- నువ్వు దయనీయం అని అనుకునే

13
00:00:48,507 --> 00:00:49,966
ఆమె కోసం మనం దూరం కాకూడదు! కెవిన్!

14
00:00:49,967 --> 00:00:54,429
నువ్వు నీళ్ళల్లో ఎక్కడైనా
ఒక్క అడుగుపెట్టినా, మేము నిన్ను చంపేస్తాం.

15
00:00:54,430 --> 00:00:57,558
కానీ హోంలాండర్ ప్రపంచంలోనే అత్యంత
ప్రమాదకరమైన సైకిక్‌లను ఎందుకు తెచ్చాడు?

16
00:00:58,142 --> 00:01:00,311
- నిజంగా పోలీస్ అనుకున్నా.
- నాస్తికత్వానికి తావు లేదు.

17
00:01:01,812 --> 00:01:04,689
నిజంగానే పట్టించుకున్నాను.
అచ్చం నీలాగా ఉండేదానిని.

18
00:01:04,690 --> 00:01:07,442
ఆ ఇబ్బందిపెట్టే,
మంచి అమ్మాయిలా అలాగే ఉండు.

19
00:01:07,443 --> 00:01:09,069
- నీకు ఏమి కావాలి?
- నీ సహాయం.

20
00:01:09,820 --> 00:01:11,654
చూడు, బిల్లీకి మనస్సాక్షి లేదు.

21
00:01:11,655 --> 00:01:14,115
అతను చాలా దూరం వెళితే వెనక్కు లాగడానికి.

22
00:01:14,116 --> 00:01:15,450
కానీ నిజం ఏమిటంటే,

23
00:01:15,451 --> 00:01:17,452
అతని దారికి అడ్డువస్తే
నువ్వు నాశనం అయిపోతావు.

24
00:01:17,453 --> 00:01:20,330
ఎందుకంటే నిన్ను ఎవరు ప్రేమించినా,
వాళ్ళను చంపించేస్తావు, కదా?

25
00:01:20,331 --> 00:01:23,209
పైకప్పుపై డాప్లర్ సిస్టమ్ అమర్చాను,
తెలియని వస్తువులను గుర్తించేందుకు.

26
00:01:27,004 --> 00:01:28,296
ఫ్రెంచీ? ఫ్రెంచీ!

27
00:01:28,297 --> 00:01:29,756
నన్ను రక్షించినందుకు కృతజ్ఞతలు.

28
00:01:29,757 --> 00:01:33,552
లేదు, బంగారం. నువ్వు నన్ను రక్షించావు.

29
00:01:34,178 --> 00:01:35,888
వద్దు, అయ్యో, వద్దు.

30
00:02:08,295 --> 00:02:11,130
"నేను, సెర్జ్ ఎమిలియన్ లెస్ సెయింట్స్,

31
00:02:11,131 --> 00:02:15,009
మానసికంగా స్థిరత్వం లేని
ఇంకా బలహీనమైన శరీరంతో,

32
00:02:15,010 --> 00:02:17,679
నా చివరి వీలునామా
ఇంకా మరణశాసనం ప్రకటిస్తున్నాను."

33
00:02:17,680 --> 00:02:20,473
"నాకు వారసత్వంగా ఇవ్వగల
భౌతిక ఆస్తులు లేకపోయినప్పటికీ,

34
00:02:20,474 --> 00:02:24,435
ఈ ఉత్తరాన్ని స్వేచ్ఛా శిబిరం నుండి
దొంగిలించిన కార్డును

35
00:02:24,436 --> 00:02:28,022
బొద్దుగా, పెద్ద పేగు వ్యాధి ఉన్న
బర్ట్ అనే వ్యక్తి పాయువులో నుండి…

36
00:02:28,023 --> 00:02:32,151
తీసిన దానిమీద రాస్తున్నప్పుడు,

37
00:02:32,152 --> 00:02:35,530
నీకు ఇచ్చేందుకు
నా దగ్గర ఒకటి ఉందని గుర్తుకువచ్చింది."

38
00:02:35,531 --> 00:02:39,033
"అది నేను మీలో ప్రతి ఒక్కరి
పాయువులను చూశాక వచ్చిన జ్ఞానం."

39
00:02:39,034 --> 00:02:40,202
ఏంటి?

40
00:02:42,746 --> 00:02:43,664
ఇందులో అదే ఉంది.

41
00:02:45,749 --> 00:02:49,419
"బుచర్, నేను ఒకసారి టాయిలెట్‌లో కెమెరా
అమర్చాను, ఖచ్చితంగా సైన్స్ కోసమే,

42
00:02:49,420 --> 00:02:52,547
అదో పెద్ద కథ,
అనుకోకుండా నీది చిత్రీకరించాను."

43
00:02:52,548 --> 00:02:57,552
"హ్యూయీ ఇంకా ఎం.ఎం, శిబిరంలో మేము ముందుకు
వంగి కాంట్రాబాండ్ కోసం వెతుకుతున్నాము."

44
00:02:57,553 --> 00:03:02,223
"ఆనీ, నేను అనుకోకుండా నువ్వు, హ్యూయీ
లీనమై గడుపుతున్నప్పుడు లోపలకు వచ్చాను,

45
00:03:02,224 --> 00:03:03,224
మీరు నన్ను
గమనించలేదు."

46
00:03:03,225 --> 00:03:05,518
నేను… నేను ముందున్నది చదవను…

47
00:03:05,519 --> 00:03:06,561
అవును, అది మంచి ఆలోచన.

48
00:03:06,562 --> 00:03:10,733
"కొందరు దాన్ని చీకటి మట్టి గది అని,
కొందరు చెస్ట్‌నట్ బెలూన్ ముడి అంటారు."

49
00:03:11,859 --> 00:03:15,278
సరే. సరే. మంచిది.
అతను… అతను బొమ్మలు గీశాడు.

50
00:03:15,279 --> 00:03:17,864
ఇది ఎక్కువగా పాయువుకు సంబంధించినది, కానీ…

51
00:03:17,865 --> 00:03:20,033
సరే, అవును.
అతను విషయానికి వచ్చాడనుకుంటాను.

52
00:03:20,034 --> 00:03:24,580
"మనము కలిసి
మంచి, చెడు చాలా ఎదుర్కొన్నాము."

53
00:03:25,831 --> 00:03:29,668
"నేను నా రక్తసంబంధీకుల కంటే
ఎక్కువగా మీతో దగ్గరగా ఉన్నాను."

54
00:03:30,502 --> 00:03:33,339
"ఎంత దగ్గరగా అంటే
మీ అందరి పాయువులను చూశాను."

55
00:03:34,048 --> 00:03:37,468
"అది, నా ఉద్దేశంలో
కుటుంబానికి నిజమైన సంకేతం."

56
00:03:38,135 --> 00:03:39,969
"మీరు నా కుటుంబం."

57
00:03:39,970 --> 00:03:42,931
"నేను స్వర్గసీమలోకి వెళ్ళేందుకు
నా తప్పులను

58
00:03:42,932 --> 00:03:44,265
పూర్తిగా తుడిచానో లేదో తెలియదు,

59
00:03:44,266 --> 00:03:47,018
భయం లేదు, నేను ప్రశాంతంగా ఉన్నాను,

60
00:03:47,019 --> 00:03:49,521
ఎందుకంటే ఒక్క క్షణంపాటు,
నాకు భూమ్మీద స్వర్గం కనబడింది…

61
00:03:52,232 --> 00:03:53,734
నీ చేతుల్లో, బంగారం."

62
00:04:13,379 --> 00:04:15,213
{\an8}అమెరికా డెమోక్రటిక్ చర్చ్

63
00:04:15,214 --> 00:04:19,384
{\an8}మేవరిక్‌లకు, రాడికల్స్‌కు,
విప్లవకారులకు నా గౌరవం.

64
00:04:19,385 --> 00:04:22,345
{\an8}ఎందుకంటే ప్రపంచాన్ని మార్చగల శక్తివంతులే

65
00:04:22,346 --> 00:04:24,722
{\an8}సాధారణంగా అది చేస్తారు.

66
00:04:24,723 --> 00:04:29,185
ఈస్టర్ ఆదివారం, సాయంత్రం 4 గంటలకు
వైట్ హౌస్ నుండి ప్రత్యక్షప్రసారం,

67
00:04:29,186 --> 00:04:32,438
హోంలాండర్ ప్రపంచాన్ని
పునఃప్రారంభిస్తున్నాడు.

68
00:04:32,439 --> 00:04:34,942
ప్రసారం అవుతోంది,
వాట్‌బుక్‌లో, వాట్‌ట్యూబ్‌లో…

69
00:04:41,949 --> 00:04:45,953
పరవాలేదు. నేను నిన్ను గాయపరచడానికి రాలేదు.

70
00:04:47,079 --> 00:04:48,913
ఇంతకుముందులాగా అని అంటున్నావా?

71
00:04:48,914 --> 00:04:51,416
నిన్ను చూడు. ఏ హానీ జరగలేదు.

72
00:04:51,417 --> 00:04:52,875
నన్ను ఎలా కనుగొన్నావు?

73
00:04:52,876 --> 00:04:56,880
నేర విశ్లేషకులకు ఒక యువకుడు
కోల్వెరీడ్ బయట ఎగరడం కనిపించింది.

74
00:04:58,215 --> 00:04:59,508
అది దృష్టిని ఆకర్షించింది.

75
00:05:00,175 --> 00:05:01,343
నాకు నీ సాయం అవసరం లేదు.

76
00:05:03,053 --> 00:05:06,222
నాకు తెలుసు.
అది నువ్వు చాలా స్పష్టంగా చెప్పావు.

77
00:05:06,223 --> 00:05:09,768
కానీ నువ్వు దేవుడి కుమారుడివి కూడా,
నువ్వు గోదాములో పడుకోకూడదు.

78
00:05:10,352 --> 00:05:12,812
నువ్వు టవర్‌లో
ఒక అంతస్తు మొత్తం తీసుకోవచ్చు.

79
00:05:12,813 --> 00:05:15,606
దానిలో నీకు కావాల్సింది చేసుకో.
నీ ఇష్టానుసారం వచ్చి వెళ్ళు.

80
00:05:15,607 --> 00:05:17,067
నాకు నీ దరిదాపుల్లో ఉండాలని లేదు.

81
00:05:19,361 --> 00:05:22,113
ఇప్పుడు అన్నీ భిన్నంగా ఉన్నాయి.

82
00:05:22,114 --> 00:05:25,575
నేను ఎదిగాను. అమరుడిని అయ్యాను.

83
00:05:25,576 --> 00:05:27,285
అయితే నాకు ఏమయితే నీకేంటి?

84
00:05:27,286 --> 00:05:28,328
ఎందుకంటే మనము కుటుంబం.

85
00:05:28,996 --> 00:05:31,039
మన నరాల్లో ఒకే రక్తం పారుతోంది.

86
00:05:31,040 --> 00:05:33,082
అవును, నీకు నీ చెత్త
జాత్యహంకార నాన్న ఉన్నాడు,

87
00:05:33,083 --> 00:05:34,459
అందుకని నీకు నా అవసరం లేదు.

88
00:05:34,460 --> 00:05:36,295
సోల్జర్ బాయ్ ముఖ్యం కాదు.

89
00:05:37,212 --> 00:05:41,216
నువ్వు ఇంకా నేను… అదే ముఖ్యం.

90
00:05:44,303 --> 00:05:47,806
నాకు నువ్వు తెలుసు
ఎందుకంటే నేనే నువ్వు కాబట్టి.

91
00:05:50,642 --> 00:05:51,810
నువ్వే నేను కాబట్టి.

92
00:05:57,232 --> 00:05:58,400
నాన్నా.

93
00:06:06,200 --> 00:06:07,034
పోయి చావు.

94
00:06:08,869 --> 00:06:11,205
నేను నీలా ఏమీ లేను.

95
00:06:12,164 --> 00:06:14,499
నువ్వు ఇప్పటికే భూమ్మీద
అత్యంత శక్తివంతమైన వ్యక్తివి,

96
00:06:14,500 --> 00:06:18,128
అయినా ఒంటరి, దారుణమైన,
పనికిరాని వాడివి,

97
00:06:19,046 --> 00:06:21,381
నువ్వు కోరుకున్నది నీకు దొరకకపోతే
ఆగ్రహం వ్యక్తం చేస్తావు.

98
00:06:22,466 --> 00:06:24,927
నీకు మరింత శక్తి మెరుగ్గా ఏమి చేస్తుంది?

99
00:06:26,053 --> 00:06:31,140
అది నిన్ను ఇంకా ఒంటరిని,
దారుణమైన పనికిరాని వాడిగా చేస్తుంది.

100
00:06:31,141 --> 00:06:34,645
నిన్ను దేవుడు అనమని ప్రజలను భయపెడితే…

101
00:06:36,396 --> 00:06:39,399
నువ్వు దేవుడివి అయిపోవు.

102
00:06:41,276 --> 00:06:42,945
నీ అంతరంగానికి అది తెలుసు.

103
00:06:49,827 --> 00:06:51,078
పరవాలేదు.

104
00:06:58,168 --> 00:07:01,839
నీకు ఏమి జరుగుతోందో తెలియదు. పరవాలేదు.

105
00:07:08,137 --> 00:07:09,805
కానీ తెలుసుకుంటావు.

106
00:07:14,560 --> 00:07:17,770
ఆమె మాట్లాడదా, లేదా మాట్లాడలేదా?

107
00:07:17,771 --> 00:07:19,147
ఏమో తెలియదు.

108
00:07:19,148 --> 00:07:21,732
ఆ అమ్మాయిలో నిజమైన శక్తి ఉంది,

109
00:07:21,733 --> 00:07:23,776
"నీ చేయి విరిచేసి,
దానిని నీ లోపల పెడతా," లాంటిది.

110
00:07:23,777 --> 00:07:25,028
ఆమె చాలా ఎదుర్కొంది.

111
00:07:26,947 --> 00:07:30,575
సేజ్ ఏమంటుంది? ఆ ప్రయోగాలు
పని చేసినట్టు ఏమైనా సూచనలు ఉన్నాయా?

112
00:07:30,576 --> 00:07:33,787
లేదు. అంటే ఫ్రెంచీ మరణం వలన ఉపయోగం లేదు.

113
00:07:36,707 --> 00:07:38,332
సరే, నువ్వు చేరుకోవాల్సిన
చోటుకు చేరాక,

114
00:07:38,333 --> 00:07:39,959
తప్పనిసరిగా ఆ కట్టు మార్చుకో.

115
00:07:39,960 --> 00:07:41,210
- సరే.
- మంచిది.

116
00:07:41,211 --> 00:07:42,546
మనము ఎప్పుడు వెళుతున్నాము?

117
00:07:44,923 --> 00:07:46,258
అది మంచి ప్రశ్న.

118
00:07:47,009 --> 00:07:48,384
నీకు చెప్పానుగా, మనము పారిపోమని.

119
00:07:48,385 --> 00:07:52,180
నిన్ను పారిపోమనడం లేదు.
ఈ మనుషులను కాపాడమని అడుగుతున్నాను.

120
00:07:52,181 --> 00:07:56,559
వాళ్ళను కాపాడాలా? నిన్నటి దాకా
అతని అంగ చూషణ చేయాలనుకున్న వాళ్ళనా?

121
00:07:56,560 --> 00:07:59,270
ఖచ్చితంగా హోంలాండర్‌కు
విచిత్రమైన అంగం ఉండిఉంటుంది.

122
00:07:59,271 --> 00:08:01,856
మనము ఇంకా ఎక్కువ చేయగలం.
మనకు ఇంకా ఎక్కువ చేయాలని ఉంది.

123
00:08:01,857 --> 00:08:04,525
వీళ్ళను కాపాడడమే
మనలో ఎవరైనా చేయగలిగిన మంచి పని.

124
00:08:04,526 --> 00:08:06,527
వాళ్ళను కెనెడాకు పంపించి,

125
00:08:06,528 --> 00:08:09,989
నీ జట్టులో మిగిలిన వారితో కలిసి ఉండి,
జనానికి, ఒక్కొక్కరిగా సాయం చేయాలి.

126
00:08:09,990 --> 00:08:11,950
నువ్వు ఒక ఆత్మహత్యా మిషన్‌లో
చనిపోతున్నప్పుడా?

127
00:08:13,160 --> 00:08:14,785
మీకు అసలు ఒక ప్రణాళిక ఉందా?

128
00:08:14,786 --> 00:08:16,370
అంటే, ఆత్మహత్యకు, కెనడాకు మధ్య,

129
00:08:16,371 --> 00:08:18,540
అది నిజమైన గుర్రపు పందెం, కదా?

130
00:08:19,791 --> 00:08:22,461
అర్థమయింది. జోకులు ఆపేసి
పని చూడాలి. నేను వెళతాను.

131
00:08:26,173 --> 00:08:31,094
నేను ద సెవన్‌లో చేరాక, క్వీన్ మేవ్‌ను
కలుస్తున్నానని చాలా ఉత్సాహంగా ఉన్నాను.

132
00:08:32,054 --> 00:08:36,349
కానీ… మీ హీరోలను ఎప్పుడూ కలవలేదు.

133
00:08:36,350 --> 00:08:39,436
ఆమె కోపంగా ఉంది,
దృష్టి పెట్టలేకపోయింది, ఆమె…

134
00:08:40,312 --> 00:08:43,106
ఆమెలో చాలా భాగాలు అర్పించుకుంది,
తనలో ఇంక ఏమీ మిగలలేదు.

135
00:08:43,774 --> 00:08:46,567
ఇంక నేను ఎంత ఇబ్బందికరమైన పిల్లనంటే,

136
00:08:46,568 --> 00:08:51,322
"పోరాడేందుకు తగినది ఒకటి
ఉంటుంది," అంటూ తిరిగేదాన్ని.

137
00:08:51,323 --> 00:08:55,327
అలా నాకు ఎప్పుడూ జరగకుండా చూసుకుంటానని,
నాను నేను ప్రమాణం చేసుకున్నాను.

138
00:08:57,996 --> 00:08:58,997
కానీ అలానే జరిగింది.

139
00:09:00,666 --> 00:09:01,833
ఇకపై కాదు.

140
00:09:04,253 --> 00:09:08,005
నేను ఆత్మహత్య పర్యటనలో లేను.
అది విఫల ప్రయత్నం కాదు.

141
00:09:08,006 --> 00:09:10,008
అది గెలుపు గురించి కూడా కాదు. అది…

142
00:09:11,134 --> 00:09:14,930
అది మనకు వీలున్నంత వరకూ
కొనసాగే ప్రయత్నం గురించి.

143
00:09:18,100 --> 00:09:20,602
అందుకని, నన్ను ఇబ్బంది పెట్టే
చెత్తకు థాంక్యూ.

144
00:09:26,400 --> 00:09:29,569
అన్నట్టు, నాకు "మీ హీరోలను
ఎప్పుడూ కలవకండి," గురించి తెలియదు.

145
00:09:32,322 --> 00:09:33,824
అది నాకు బాగా పని చేసింది.

146
00:09:55,679 --> 00:09:58,890
హ్యాపీ యానివర్సరీ,
మిస్టర్ ఫస్ట్ జెంటిల్‌మెన్.

147
00:10:00,183 --> 00:10:04,229
దాన్ని టర్బైన్ గ్రేడ్ టైటానియంతో
ప్రత్యేకంగా చేయించాను.

148
00:10:05,939 --> 00:10:09,483
స్ట్రాప్‌లు బాలిస్టిక్ కేవ్లర్‌తో
మరింత బలోపేతం చేయబడ్డాయి.

149
00:10:09,484 --> 00:10:14,489
నేను నీతో ఎంత అసభ్యంగా ప్రవర్తించినా,
ఇది ఎప్పటికీ పేలదు.

150
00:10:16,700 --> 00:10:21,079
బేబీ, నేను నిన్ను కుదిర్చిన పెళ్ళి
చేసుకోవడం నా అదృష్టం.

151
00:10:29,963 --> 00:10:30,880
ఇంకా సమయం కావాలా?

152
00:10:30,881 --> 00:10:32,549
దానికి ప్రపంచంలో సమయం సరిపోదు.

153
00:10:33,967 --> 00:10:34,885
సమస్య ఏమిటి?

154
00:10:35,594 --> 00:10:36,761
నన్ను తప్పుగా అనుకోకు.

155
00:10:36,762 --> 00:10:39,889
మన కొత్త ప్రభువు రాకను ప్రకటిస్తూ
హోంలాండర్ ఇచ్చే

156
00:10:39,890 --> 00:10:43,018
ప్రసంగాన్ని రాసే అదృష్టం నాకు దక్కింది.

157
00:10:43,977 --> 00:10:44,811
కానీ?

158
00:10:45,771 --> 00:10:49,441
నేను అంతమంది జనం…

159
00:10:51,485 --> 00:10:55,947
హోంలాండర్ దైవత్వాన్ని
సందేహిస్తారని ఊహించలేదనుకుంటా.

160
00:10:58,033 --> 00:11:00,202
నీ దగ్గర ఇంకా
1995 నాటి షటో మార్గో వైన్ ఉందా?

161
00:11:00,744 --> 00:11:03,246
ఇమాక్యులేట్ కాన్సెప్షన్
శిశుకాముక ప్రీస్ట్ నుండి తీసుకున్నది?

162
00:11:04,748 --> 00:11:06,792
- దాన్ని తెరుద్దాము.
- మంచి ఆలోచన.

163
00:11:13,715 --> 00:11:17,093
చూడు, నీకు నామీద కోపంగా ఉందని తెలుసు,
కానీ నాకు ఇప్పుడు నిజంగా నీ అవసరం ఉంది.

164
00:11:17,094 --> 00:11:18,428
అతను ఏమి ఆలోచిస్తున్నాడు?

165
00:11:21,098 --> 00:11:23,600
నేను అతనిని ఒత్తిడి చేస్తే,
అతను హోంలాండర్‌ను మోసం చేస్తాడా?

166
00:11:25,560 --> 00:11:29,731
దయచేసి చెప్పు, ఇది ఏమైనా ఎనిమిదవ తరగతా?

167
00:11:32,859 --> 00:11:36,947
అయితే, సందేహించబోయే అందరి గురించి
నువ్వు ఏదైనా చేస్తే ఎలా ఉంటుంది?

168
00:11:37,906 --> 00:11:39,157
అంటే ఏంటి?

169
00:11:40,700 --> 00:11:42,243
నీకు తెలుసనుకుంటాను.

170
00:11:42,244 --> 00:11:43,495
లేదు, నాకు తెలియదు.

171
00:11:44,037 --> 00:11:44,996
సరే…

172
00:11:56,049 --> 00:12:00,637
నా ఉద్దేశ్యం, మనము ప్రపంచాన్ని
నమ్మించడంలో హోంలాండర్‌కు ఎలా సాయపడగలము?

173
00:12:01,596 --> 00:12:04,099
నేను అది ప్రతి రోజూ ఆలోచిస్తాను.

174
00:12:14,526 --> 00:12:15,360
యమ్.

175
00:12:27,164 --> 00:12:29,832
నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు,
నా దగ్గర పీచెస్ అనే కుక్క ఉండేది.

176
00:12:29,833 --> 00:12:30,833
అది చనిపోయింది.

177
00:12:30,834 --> 00:12:33,795
నేను దాని మీద నుండి వెళ్ళిన
స్కూల్ బస్‌లో ఉన్నాను.

178
00:12:34,379 --> 00:12:35,380
చాలా దారుణం.

179
00:12:37,340 --> 00:12:39,967
నేను దాని గొలుసును
నా దగ్గర చాలా రోజులు పెట్టుకున్నాను.

180
00:12:39,968 --> 00:12:43,305
నీకు తెలుసా నాకు దానిమీద ఉన్న
అమితమైన ప్రేమను గుర్తు చేసేది ఏదైనా.

181
00:12:44,431 --> 00:12:47,057
నువ్వు అదే చేస్తున్నావు, కదా?

182
00:12:47,058 --> 00:12:50,311
అందరూ నువ్వు నిరాశ్రయురాలివని, ఫ్రెంచీ
నిన్ను చేరదీశాడని అనుకునేలా చేశావు,

183
00:12:50,312 --> 00:12:52,647
కానీ నీకు తెలుసు జరిగింది
దానికి విరుద్ధమని.

184
00:12:54,107 --> 00:12:57,276
అతను నీ పెంపుడు జంతువు.
నీ ఒళ్ళో పెట్టుకునే కుక్క, నిజానికి.

185
00:12:57,277 --> 00:12:58,861
అవును, నువ్వు అతనిని మోసం చేశావు,

186
00:12:58,862 --> 00:13:01,573
కానీ నీకు అతనిని వాడుకోవడం ఇష్టమని
అతని గొలుసును గట్టిగా కట్టావు.

187
00:13:02,449 --> 00:13:04,909
నువ్వు అతని అంకితభావానికి
సంతృప్తి చెందావు.

188
00:13:04,910 --> 00:13:08,287
ఇంకెవరితోనే వెళ్ళిపోతాడని
నీకు అనిపించినప్పుడు,

189
00:13:08,288 --> 00:13:09,706
చివరకు అతనిని నాశనం చేశావు.

190
00:13:11,583 --> 00:13:14,419
అతనిని సంతోషపెట్టే వేటినైనా సరే,

191
00:13:15,378 --> 00:13:17,547
అతను నీకోసం
ఏమైనా చేయడానికి, చివరకు తన ప్రాణాలను కూడా

192
00:13:18,548 --> 00:13:19,883
ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు.

193
00:13:26,181 --> 00:13:28,308
అతను అలా చేసేలా చేశావు.
అతను అలా చేయాలనుకున్నావు…

194
00:13:43,406 --> 00:13:46,700
ఓయ్, ఓయ్! శాంతించు. నా మాట విను.

195
00:13:46,701 --> 00:13:49,704
సోల్జర్ బాయ్ పేలుడు శక్తి పని చేయాలంటే
వాడు పిచ్చి కోపంగా ఉండాలి, తెలుసా?

196
00:13:50,372 --> 00:13:53,374
నీకు కూడా కోపం తెప్పించడానికి
నిన్ను రెచ్చగొట్టాలని అనుకున్నాను.

197
00:13:53,375 --> 00:13:55,209
కానీ అది వ్యక్తిగతమైనది కాదు. నిజంగా.

198
00:13:55,210 --> 00:13:57,754
"ఓ, ఇక, శాశ్వతంగా…"

199
00:13:58,880 --> 00:14:02,550
"వీడుకోలు. వీడుకోలు…"

200
00:14:02,551 --> 00:14:03,717
ఏంటి?

201
00:14:03,718 --> 00:14:04,969
ఏమంటున్నావు?

202
00:14:04,970 --> 00:14:10,850
ఓథెలో. అది నాకు కంఠస్థం వచ్చు,
కానీ ఇప్పుడు అది… పోయింది.

203
00:14:11,643 --> 00:14:16,147
నా మెదడు గట్టిగా అరిచేది, ఇప్పుడు అది…

204
00:14:19,776 --> 00:14:21,110
అది పని చేసిందా?

205
00:14:21,111 --> 00:14:24,114
నేనూ మీలాగే తెలివిలేని దాన్ని.

206
00:14:29,077 --> 00:14:30,245
థాంక్యూ.

207
00:14:36,876 --> 00:14:39,420
బాగుంది. బాగుంది, బాగుంది.

208
00:14:39,421 --> 00:14:42,381
అయితే, ఇప్పుడు మనందరికి
ఎక్కువ రేడియేషన్ వస్తుంది,

209
00:14:42,382 --> 00:14:45,050
అది సరదాగా ఉంటుంది.

210
00:14:45,051 --> 00:14:47,720
అది ఫ్రెంచీ చేయడం పెద్ద విషయం.

211
00:14:47,721 --> 00:14:48,971
అది పనిచేస్తుంది.

212
00:14:48,972 --> 00:14:52,808
ఏయ్, నేను కూడా పని చేశాను.

213
00:14:52,809 --> 00:14:55,019
అంటే, నువ్వు మంచి అయుధానివి
అవుతావని నాకు తెలుసు,

214
00:14:55,020 --> 00:14:57,563
కానీ నువ్వు ఇంత బాగా ఉంటావని
నేను కలలో కూడా ఊహించలేదు.

215
00:14:57,564 --> 00:14:59,106
అయితే, ప్రణాళిక ఏంటి?

216
00:14:59,107 --> 00:15:02,276
హోంలాండర్ తను దేవుడని ప్రకటించేందుకు
ఈస్టర్‌ను ఉపయోగించుకుంటున్నాడు.

217
00:15:02,277 --> 00:15:04,028
అతను ఎప్పుడు, ఎక్కడ ఉంటాడో మనకు తెలుసు.

218
00:15:04,029 --> 00:15:05,613
హోంలాండర్ ప్రపంచ పునఃప్రారంభం.

219
00:15:05,614 --> 00:15:07,406
అది ఆ వాట్ స్టూడియోలాంటి
చెత్త అయితే,

220
00:15:07,407 --> 00:15:09,742
అతను అది ముగించాక,
పోలీసులతో అమెరికాపై దాడి చేస్తాడు.

221
00:15:09,743 --> 00:15:11,076
లక్షలాది మంది చనిపోతారు.

222
00:15:11,077 --> 00:15:12,911
అందుకని, స్పష్టతకు,

223
00:15:12,912 --> 00:15:15,914
మనము వైట్ హౌస్‌లోకి
చొరబడాలని అనుకుంటున్నామా?

224
00:15:15,915 --> 00:15:17,333
- అవును.
- మనము హోంలాండర్‌కు మన రాక

225
00:15:17,334 --> 00:15:19,960
- తెలుసని అనుకోవాలి.
- లేదు… అర్థమయింది. మారువేషాలు వేసుకోండి.

226
00:15:19,961 --> 00:15:23,256
మీరు వాళ్ళలా… ఆ సైనికులలా…
కుచ్చుల టోపీలు ధరిస్తారా?

227
00:15:25,508 --> 00:15:28,719
ఛ. అది ఇంగ్లాండ్‌లో. నన్ను పట్టించుకోకండి.

228
00:15:28,720 --> 00:15:31,013
మనము లోపలకు ఎలా వెళతాము?

229
00:15:31,014 --> 00:15:32,222
భూగర్భ సొరంగం గుండా.

230
00:15:32,223 --> 00:15:34,892
జేఎఫ్‌కే మారిలిన్‌ను రహస్యంగా కలిసేందుకు
ఉపయోగించిన గోప్యమైనది.

231
00:15:34,893 --> 00:15:37,603
మనము రహస్య అధ్యక్ష సొరంగాలు
చాలా సురక్షితమైనవని

232
00:15:37,604 --> 00:15:38,771
అనుకోవాలి.

233
00:15:38,772 --> 00:15:41,106
నిజమే, నా దగ్గర గత ఏడాది
సింగర్‌ను రక్షించినప్పటి

234
00:15:41,107 --> 00:15:42,650
బ్లూప్రింట్స్ ఉన్నాయి.

235
00:15:42,651 --> 00:15:44,485
ప్రతి తలుపు కోడ్, ప్రతి ప్రవేశ ద్వారం.

236
00:15:44,486 --> 00:15:45,903
తెలివైనవాడివి.

237
00:15:45,904 --> 00:15:50,325
అయితే, అందరూ ఏమంటారు?
ఒక్క చివరి ప్రయత్నం చేద్దామా?

238
00:16:03,713 --> 00:16:05,422
అయితే, మీ అందరికీ సరే అనేే అనుకుంటాను.

239
00:16:05,423 --> 00:16:09,511
లేదు. మీరంతా పూర్తిగా తెలివి తక్కువవాళ్ళు.

240
00:16:10,428 --> 00:16:13,305
హోంలాండర్ మీ అందరినీ చంపేస్తాడు,
నన్ను కనిపెట్టేస్తాడు.

241
00:16:13,306 --> 00:16:15,350
అయితే, నా మిగిలిన సమయంలో,

242
00:16:16,643 --> 00:16:18,978
నేను ఒర్లాండో‌లోని
హ్యారీ పోటర్ వరల్డ్‌కు వెళతాను.

243
00:16:19,562 --> 00:16:20,522
నాతో ఎవరు వస్తారు?

244
00:16:23,274 --> 00:16:26,277
మంత్ర దండాలను పైకి ఎత్తండి,
పిచ్చి మోహాలు! సేజ్ బయటకు!

245
00:16:40,375 --> 00:16:41,458
హోంలాండర్‌ను
నమ్ముతున్నాము

246
00:16:41,459 --> 00:16:43,586
నేను భంగకారకుడిని. అంతరాయం కలిగిస్తాను.

247
00:16:44,754 --> 00:16:47,131
నేను అనుకుంటున్నాను,
స్టార్‌లైటర్లు నా ఫ్యాక్టరీలో

248
00:16:47,132 --> 00:16:49,217
వేతనం పొందని ఉద్యోగులుగా
ఎందుకు పని చేయకూడదు?

249
00:16:50,343 --> 00:16:52,011
అంటే, బానిసలా?

250
00:16:52,846 --> 00:16:54,346
హోంలాండర్, నువ్వు రావడం సంతోషం.

251
00:16:54,347 --> 00:16:56,974
తెల్ల జాతి జనన రేట్ల గురించి
నీతో చాలా మాట్లాడాలి.

252
00:16:56,975 --> 00:16:59,435
మాకోసం తోటలో వేచి ఉంటావా?

253
00:16:59,436 --> 00:17:00,436
- ఓ నిమిషం చాలు.
- సరే.

254
00:17:00,437 --> 00:17:01,521
ఇటు వైపు.

255
00:17:03,440 --> 00:17:06,860
- అతను ఎవరు?
- గుంటర్ వాన్ ఎలిస్, ప్రపంచంలోనే ధనవంతుడు.

256
00:17:07,819 --> 00:17:10,529
పదిహేడు మంది పిల్లలు, ఔత్సాహిక వ్యోమగామి.

257
00:17:10,530 --> 00:17:11,447
అయితే?

258
00:17:11,448 --> 00:17:13,449
అంటే, అతను
కోటీశ్వరుల బృందానికి ప్రతినిధి,

259
00:17:13,450 --> 00:17:15,617
ఇంకా వాళ్ళకి… కొన్ని అభ్యర్థనలు ఉన్నాయి.

260
00:17:15,618 --> 00:17:16,785
నాకు దీనికి సమయం లేదు.

261
00:17:16,786 --> 00:17:19,414
అంటే, వాళ్ళు అమెరికాను
ప్రభావితం చేసే వర్గం.

262
00:17:20,165 --> 00:17:22,500
మీ చర్చ్ నిర్మాణానికి,
మనకు వాళ్ళ మద్దతు అవసరమవుతుంది.

263
00:17:27,046 --> 00:17:29,424
అతను విశ్వాసియేనా? వాళ్ళల్లో ఎవరైనా?

264
00:17:30,300 --> 00:17:33,260
- లేదా వాళ్ళకు నేనంటే భయం అంతేనా?
- థామస్ కూడా సందేహించాడు.

265
00:17:33,261 --> 00:17:38,141
కాలం గడిచేకోద్దీ, నిశ్చలమైన నీరు కూడా
రాయిని అరగదీస్తుంది.

266
00:17:38,850 --> 00:17:41,310
- ఓర్పు…
- నువ్వు వెళ్ళే చోటుకు, వేగంగా వెళ్ళు.

267
00:17:41,311 --> 00:17:43,896
మనము వాయిదా వేయడం గురించి
ఆలోచించాలనుకుంటా.

268
00:17:43,897 --> 00:17:45,355
అసాధ్యం.

269
00:17:45,356 --> 00:17:46,607
బుచర్ ప్రయోగశాల చూశారుగా.

270
00:17:46,608 --> 00:17:49,067
అతను సోల్జర్ బాయ్
పేలుడు విషయం తెలుసుకుంటే,

271
00:17:49,068 --> 00:17:52,696
లేదా ఏమాత్రం చిన్న అవకాశమున్నా సరే,
అతను మిమ్మల్ని శక్తిలేనివారిగా చేయవచ్చు…

272
00:17:52,697 --> 00:17:54,990
నాకు విలియం బుచర్ అంటే భయం అనుకుంటున్నావా?

273
00:17:54,991 --> 00:17:56,533
లేదు. అస్సలు అలా అనుకోవటం లేదు.

274
00:17:56,534 --> 00:17:59,328
అస్సలు లేదు.
మేము అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నాము.

275
00:17:59,329 --> 00:18:00,537
వేదికను ఇక్కడికి మార్చాము.

276
00:18:00,538 --> 00:18:04,708
మీ శుభ దినంనాడు ఎలాంటి అంతరాయాలు
రాకూడదని అనుకుంటున్నాము.

277
00:18:04,709 --> 00:18:07,420
దానితో నేను బాగా చేయగలగడానికి
నాకు మరింత సమయం దొరుకుతుంది.

278
00:18:08,505 --> 00:18:11,298
మీ ధర్మబద్ధమైన లక్ష్యంవైపు
మరింతమందిని మార్చడానికి.

279
00:18:11,299 --> 00:18:12,300
మహానుభావా!

280
00:18:15,720 --> 00:18:17,889
- ఇప్పుడు కాదు.
- నువ్వు నిర్ణయించకు, బ్రొహమ్మద్ ప్రవక్త.

281
00:18:18,473 --> 00:18:21,350
చూడండి, మీకు ఇక ద సెవన్ అవసరం లేదా?
తెలివైన నిర్ణయం, ఎప్పటిలాగే.

282
00:18:21,351 --> 00:18:24,394
నేను ఆలోచించేది,
మీకు కావాల్సింది ఒక ధర్మయోధుడు.

283
00:18:24,395 --> 00:18:27,314
అవును, పాతకాలంలో ఉన్న
ఆ బలమైన యోధుల లాగా?

284
00:18:27,315 --> 00:18:29,400
శిక్షించేవారు.
పవిత్ర చట్టాలను అమలు చేసేవారు.

285
00:18:30,151 --> 00:18:31,777
ధర్మయోధుల గురించి
ఎక్కడ తెలుసుకున్నావు?

286
00:18:31,778 --> 00:18:33,403
బైబిల్. అది ఎప్పుడైనా విన్నావా?

287
00:18:33,404 --> 00:18:37,032
అది బైబిల్‌లో లేదు.
నన్ను చెప్పనివ్వు. "ఇండియానా జోన్స్?"

288
00:18:37,033 --> 00:18:38,450
ఏంటి? కాదు.

289
00:18:38,451 --> 00:18:40,035
"రాబిన్ హుడ్: ప్రిన్స్ ఆఫ్ థీవ్స్."

290
00:18:40,036 --> 00:18:41,453
తెలుసా, అది డాక్యుమెంటరీ కాదు.

291
00:18:41,454 --> 00:18:42,372
కాదు, షెర్లాక్.

292
00:18:47,544 --> 00:18:50,463
- మీరు ఏమి…
- అతను ఒక వ్యోమగామి. అంతరిక్షానికి పంపాను.

293
00:18:51,172 --> 00:18:54,424
ఇక, నేను చెప్పేది విను.
నాకు ఇకపై ఎవరూ అవసరం లేదు.

294
00:18:54,425 --> 00:18:56,844
- నాకు కోటీశ్వరుల అవసరం లేదు…
- అంగీకరిస్తున్నాను, సర్.

295
00:18:56,845 --> 00:18:58,470
నేను చూపే కొంచెం ప్రేమ కోసం

296
00:18:58,471 --> 00:19:02,350
తమను తాము తగ్గించుకొనే ఆ చేపలతో
లైంగికంగా కలిసే మానసిన వికారులు అవసరంలేదు.

297
00:19:04,853 --> 00:19:05,936
నాపై మీ ఆలోచన అదేనా?

298
00:19:05,937 --> 00:19:06,896
మనము కలిసినప్పటి నుండి.

299
00:19:08,314 --> 00:19:13,694
నేను నా జీవితంలో ఇంత తక్కువగా
ఎవరినీ గౌరవించలేదు.

300
00:19:13,695 --> 00:19:18,867
నిజానికి, కెవిన్, నేను నిన్ను
చంపకపోవడానికి ఒకే ఒక కారణం ఏమిటంటే,

301
00:19:19,909 --> 00:19:23,912
నువ్వు నీ మనసు లోతుల్లో నుంచి

302
00:19:23,913 --> 00:19:26,708
నువ్వు ఎంత పనికిరాని వాడివో
నిజంగా తెలుసుకోవాలి అనే.

303
00:19:33,339 --> 00:19:34,548
సైకిక్‌లు స్థానాలలో ఉన్నారా?

304
00:19:34,549 --> 00:19:36,551
- దేశవ్యాప్తంగా.
- మంచిది.

305
00:19:37,594 --> 00:19:43,181
ప్రత్యక్ష ప్రసారం ముగిసిన మరుక్షణమే,
పాల నుండి నీళ్ళు వేరు చేయాలి.

306
00:19:43,182 --> 00:19:49,272
నా నిజాన్ని ఒప్పుకోనివాళ్ళు నా పవిత్ర
జ్వాలలో కాలిపోయే మొదటి వాళ్ళు అవుతారు.

307
00:19:51,065 --> 00:19:56,362
నవ్వు, ఫాదర్. ఏదో ఒక విధంగా,
అది అందమైన రోజు అవుతుంది.

308
00:20:18,551 --> 00:20:19,552
కిమికో?

309
00:20:20,803 --> 00:20:21,679
బుచర్ చేసింది తప్పు.

310
00:20:22,931 --> 00:20:24,891
నువ్వు కేవలం ఆయుధం మాత్రమే కాదు.

311
00:20:27,393 --> 00:20:29,979
మొదటి నుంచీ, ఫ్రెంచీ నువ్వు ఎవరో చూశాడు.

312
00:20:31,272 --> 00:20:33,733
అతను చూశాడు కాబట్టే, మేము చూశాము.

313
00:20:34,817 --> 00:20:38,279
అతను పోయాడు కాబట్టి
అదంతా కూడా పోయిందని కాదు.

314
00:20:40,865 --> 00:20:43,076
సరే. కొంచెం సరదాగా గడుపుదాము.

315
00:20:43,785 --> 00:20:44,911
రండి, మరి.

316
00:21:06,015 --> 00:21:08,976
ఇప్పుడు బాగా అవసరమైనది ఏంటో తెలుసా,

317
00:21:08,977 --> 00:21:11,228
నువ్వు నాతో మాట్లాడడం, పిచ్చి మొహమా.

318
00:21:11,229 --> 00:21:12,480
అది ఏంటి?

319
00:21:14,315 --> 00:21:17,693
ఏమీ లేదు. నీ ప్రసంగం వినడానికి
చాలా ఉత్సాహంగా ఉంది, బేబ్.

320
00:21:17,694 --> 00:21:19,362
ఖచ్చితంగా నువ్వు అది అదరగొట్టే ఉంటావు.

321
00:21:20,488 --> 00:21:24,450
మన ప్రత్యక్ష ప్రసారం మొదలవుతుంది
ఐదు, నాలుగు, మూడు…

322
00:21:29,455 --> 00:21:33,126
నా తోటి అమెరికన్‌లారా…

323
00:21:35,628 --> 00:21:36,878
ఈస్టర్ శుభాకాంక్షలు.

324
00:21:36,879 --> 00:21:40,465
{\an8}మనందరికీ తెలిసినట్లుగా హింసించబడి,

325
00:21:40,466 --> 00:21:44,052
{\an8}గౌరవాన్ని కోల్పోయి, చివరికి చంపబడిన
జీసస్‌ను స్మరించుకునే రోజు.

326
00:21:44,053 --> 00:21:45,804
జాతిని ఉద్దేశించి హోంలాండర్ ప్రసంగం

327
00:21:45,805 --> 00:21:48,724
అదంతా చక్కగా, బాగుంది.
కానీ మీరు అమెరికన్లు.

328
00:21:48,725 --> 00:21:51,519
మీకు చనిపోని దేవుడు ఉండాలి.

329
00:21:52,103 --> 00:21:56,982
తిరిగి పోరాడే దేవుడు.
మీరు నమ్మగలిగిన దేవుడు.

330
00:21:56,983 --> 00:22:01,362
{\an8}సరే, ఈరోజు, మీకు ఒక శుభవార్త తీసుకొచ్చాను.

331
00:22:02,613 --> 00:22:07,951
ఈమధ్య, నన్ను
ఒక అద్భుతమైన దేవకన్య కలిసి

332
00:22:07,952 --> 00:22:10,371
వరంగా సత్యాన్ని వెల్లడించింది.

333
00:22:11,497 --> 00:22:15,167
అవును. సరిగ్గా నేను అనుకున్నట్టుగానే
రహస్య సొరంగం వాసన వస్తోంది.

334
00:22:15,168 --> 00:22:17,461
నేను ఆమె కాంతిలో అభ్యంగనం చేశాను.

335
00:22:17,462 --> 00:22:21,381
ఆమె అమృత పెదాలు నా చెవిలో నిజం చెప్పాయి.

336
00:22:21,382 --> 00:22:24,843
నేను నా నిజమైన లక్ష్యం తెలుసుకున్నాను.

337
00:22:24,844 --> 00:22:27,721
కేవలం ప్రపంచంలోనే
గొప్ప హీరోను కావడమే కాదు,

338
00:22:27,722 --> 00:22:32,184
కానీ మానవాళిని అంతటినీ కాపాడాలి.

339
00:22:32,185 --> 00:22:38,024
నేను కావాలి… రెండవ రాక.

340
00:22:39,442 --> 00:22:43,779
కానీ ఒక విధంగా, నిజానికి,
నేను మొదటి రాకను.

341
00:22:43,780 --> 00:22:50,453
అమెరికా, నేను ప్రభువును, మీ రక్షకుడిని.

342
00:22:53,247 --> 00:22:54,916
నేను మీ దేవుడిని,

343
00:22:55,917 --> 00:23:00,921
{\an8}అందుకే, నేను ఈ ప్రపంచాన్ని ఒక కొత్త
స్వర్ణోదయం వైపు నడిపించబోతున్నాను,

344
00:23:00,922 --> 00:23:05,425
మీ దేవుడు మీ మధ్య సంచరిస్తూ,
కనిపిస్తూ, వినిపించే యుగం.

345
00:23:05,426 --> 00:23:09,805
మీ ప్రార్థనలకు నిజంగా సమాధానం దొరుకుతుంది,
మీరు హోంలాండర్.చర్చ్ ను సందర్శించినప్పుడు.

346
00:23:09,806 --> 00:23:11,598
{\an8}నేను తిరిగి కోరుకునేది ప్రేమ మాత్రమే.

347
00:23:11,599 --> 00:23:13,475
మేడమ్ ప్రెసిడెంట్,
భవనానికి ముప్పు ఉంది.

348
00:23:13,476 --> 00:23:15,644
ఒక చిన్న బృందం సొరంగాలలో చొరబడింది.

349
00:23:15,645 --> 00:23:17,479
అది బుచర్ ఇంకా అతని బృందం.

350
00:23:17,480 --> 00:23:21,149
కంగారు పడకు, మేము సిద్ధంగా ఉన్నాము.
ఆమెను సురక్షిత స్థావరానికి తీసుకెళ్ళండి.

351
00:23:21,150 --> 00:23:24,653
వాటిని హోంలాండర్ బైబిల్ రెండవ అధ్యాయంలో
వివరంగా పేర్కొనబడడం మీరు చూడవచ్చు.

352
00:23:24,654 --> 00:23:28,908
ఆగండి. ఆ బ్లూప్రింట్స్‌లో
ఇక్కడ తలుపులు లేవు.

353
00:23:29,659 --> 00:23:31,661
లేవు. అది కొత్తది.

354
00:23:34,372 --> 00:23:35,288
ఛ!

355
00:23:35,289 --> 00:23:39,000
హే, హే, హే! హ, హే! ఆనీ!

356
00:23:39,001 --> 00:23:40,168
ఆనీ, ఏమి జరుగుతోంది?

357
00:23:40,169 --> 00:23:41,379
అది సూప్ డాగ్ విజిల్!

358
00:23:44,048 --> 00:23:46,217
- కిందకు ఉండండి.
- ఛ!

359
00:23:53,850 --> 00:23:56,394
అత్యవసర పరిస్థితి. కాల్పులు జరిపారు.
ఒక ఏజెంట్‌కు గాయమయ్యింది.

360
00:23:58,771 --> 00:24:01,149
ఛా, నా జీవితం.

361
00:24:03,317 --> 00:24:04,485
మేడమ్ ప్రెసిడెంట్!

362
00:24:22,753 --> 00:24:23,754
ఆగండి, సరేనా?

363
00:24:27,508 --> 00:24:28,885
కుడివైపునకు. కుడివైపునకు వెళ్ళు!

364
00:24:29,427 --> 00:24:31,637
వచ్చావా, ఎప్పుడూ విమర్శించే చెత్తదానా!

365
00:24:39,312 --> 00:24:41,229
రోజంతా ఇక్కడే గడుపుతారా?
అక్కడ నుండి బయటపడండి!

366
00:24:41,230 --> 00:24:42,981
వెళ్ళండి!

367
00:24:42,982 --> 00:24:44,025
రండి!

368
00:24:54,785 --> 00:24:56,204
నువ్వు బాగానే ఉన్నావా?

369
00:24:59,248 --> 00:25:00,707
హోంలాండర్ ఓవల్ ఆఫీసులో ఉన్నాడు.

370
00:25:00,708 --> 00:25:01,917
మంచిది. తీసుకెళ్ళు.

371
00:25:01,918 --> 00:25:04,754
ఛ, లేదు.
అతను నా పేగులు తీసి మెడలో వేస్తాడు.

372
00:25:05,755 --> 00:25:07,089
కానీ మీరు బాగానే ఉంటారు.

373
00:25:09,342 --> 00:25:12,011
అది అటువైపు. మీకు అంతా మంచి జరగాలి.

374
00:25:22,355 --> 00:25:23,522
ఎడమవైపుకు.

375
00:25:28,819 --> 00:25:29,779
నీ పట్ల గర్వంగా ఉంది.

376
00:25:36,452 --> 00:25:37,453
ఛ.

377
00:25:55,930 --> 00:25:56,847
నువ్వు ఏడుస్తున్నావా?

378
00:25:59,850 --> 00:26:00,726
లేదు.

379
00:26:01,811 --> 00:26:04,479
స్టార్‌లైట్? అదంతా ఒక పరీక్ష.

380
00:26:04,480 --> 00:26:07,274
అవును! విశ్వం నా విధేయతకు
నాకు బహుమానం ఇస్తుంది.

381
00:26:07,275 --> 00:26:09,192
"రాబిన్ హుడ్: ప్రిన్స్ ఆఫ్ థీవ్స్" చివరలో

382
00:26:09,193 --> 00:26:11,111
షాన్ కాన్నెరీ కోస్ట్నర్‌కు ఇచ్చినట్టు.

383
00:26:11,112 --> 00:26:13,322
అబ్బా! నువ్వు ఒక పిచ్చివాడివి.

384
00:26:15,574 --> 00:26:16,575
నేను నిన్ను చంపేస్తా.

385
00:26:18,035 --> 00:26:20,329
ఆ తరువాత, హోంలాండర్ చివరకు చూస్తాడు.

386
00:26:21,247 --> 00:26:23,916
నేను అతని సంగతి చూసుకుంటాను.
వెళుతూనే ఉండండి.

387
00:26:38,139 --> 00:26:40,015
నాకు బుచర్ ఇంకా ఆ అమ్మాయి కావాలి అంతే.

388
00:26:40,016 --> 00:26:42,226
మిగిలినవారు ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు.

389
00:26:44,895 --> 00:26:46,813
హే, హే. వద్దు, వద్దు, వద్దు.
మనకు సమయం లేదు.

390
00:26:46,814 --> 00:26:48,983
హోంలాండర్ వెళ్ళేలోపు కిమికోను
అతని వద్దకు తీసుకెళ్ళు.

391
00:26:49,650 --> 00:26:50,734
నేను ఇది చూసుకుంటాను.

392
00:26:50,735 --> 00:26:52,361
సరే, అది ఎలా చేయగలవు?

393
00:26:53,279 --> 00:26:55,781
ఇది అన్సల్ ఐజీఎస్-300.

394
00:26:58,034 --> 00:27:00,494
నీకు ఉండేది నీకు ఉంది.
నాకు ఉండేది నాకు ఉంది.

395
00:27:07,418 --> 00:27:10,546
ఓయ్! రండి. ఇటువైపు!

396
00:27:14,091 --> 00:27:17,094
ఓయ్! ఈ చెత్త పాశవికమైనది.

397
00:27:30,441 --> 00:27:33,777
ఇది ఎందుకు చేస్తున్నావు, ఆ?
నీకు నిప్పంటుకుంటే, ఆర్పేందుకు ఉచ్చ కూడా

398
00:27:33,778 --> 00:27:36,071
పోయని వ్యక్తి కోసం
నీ ప్రాణాలను పణంగా పెడుతున్నావు.

399
00:27:36,072 --> 00:27:39,033
నేను అతని కుడిభుజాన్ని, బ్రో.
నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోస్తాడు.

400
00:27:39,158 --> 00:27:41,284
విను, నీకు భయంగా ఉందని నాకు తెలుసు.

401
00:27:41,285 --> 00:27:44,204
- నాకు దేనికీ భయం లేదు.
- డీప్… కెవిన్.

402
00:27:44,205 --> 00:27:48,083
నాకు అది నీ కళ్ళల్లో కనిపిస్తోంది,
హోంలాండర్ నిన్ను భయపెడుతున్నాడు,

403
00:27:48,084 --> 00:27:50,294
కానీ అతను నిన్ను అస్సలు గౌరవించడు.

404
00:27:51,295 --> 00:27:54,507
దాని నుండి, అతని నుండి
నీకు స్వేచ్ఛ కావాలని లేదా?

405
00:27:56,425 --> 00:27:58,718
- నీది చెత్త నోరు.
- ఇది నా గురించి కాదు.

406
00:27:58,719 --> 00:28:02,806
ఖచ్చితంగా అవును! నా దగ్గర అవన్నీ ఉండేవి!

407
00:28:02,807 --> 00:28:05,600
నీకు తెలుసా, అధికారం, గౌరవం,

408
00:28:05,601 --> 00:28:08,103
ఐఎండిబిప్రోలో టాప్ 50 స్టార్‌మీటర్.

409
00:28:08,104 --> 00:28:10,688
కానీ నువ్వు వచ్చాకే
అన్నీ చెడ్డగా జరగడం మొదలయింది.

410
00:28:10,689 --> 00:28:12,690
నేను అన్నీ కోల్పోయాను!

411
00:28:12,691 --> 00:28:16,528
నువ్వు ఆ పనికిరాని నిర్ణయాలు తీసుకున్నావు.
నీ జీవితం నాశనం చేసుకున్నావు.

412
00:28:16,529 --> 00:28:20,825
నువ్వు చిన్న పిల్లాడివి కావు. ఒక్కసారి,
నీకోసం నువ్వు కొంచెం బాధ్యత తీసుకో.

413
00:28:23,744 --> 00:28:24,870
లేదు!

414
00:28:30,876 --> 00:28:32,211
ఛ! బయటకు దారి లేదు.

415
00:28:33,129 --> 00:28:33,963
ఏంటి?

416
00:28:36,048 --> 00:28:37,383
బుచర్ ఎక్కడ?

417
00:28:50,479 --> 00:28:51,730
నాకు ఒక కొత్త ఉద్యోగం కావాలి.

418
00:28:54,024 --> 00:28:59,195
మిమ్మల్ని కేవలం మీ మనసులు తెరిచి
నాపై నమ్మకం ఉంచమంటున్నాను.

419
00:28:59,196 --> 00:29:04,242
నా నిజాన్ని స్వీకరించిన వాళ్ళకు
పాలు, తేనె ఉండే నేలకు స్వాగతం,

420
00:29:04,243 --> 00:29:06,536
ఎందుకంటే నేను మీ…

421
00:29:06,537 --> 00:29:08,873
నేను మీ ఫాదర్‌ను,
మీరు నా ప్రియమైన పిల్లలు.

422
00:29:13,377 --> 00:29:14,920
నేను…

423
00:29:19,633 --> 00:29:21,259
కానీ నేను ఏమి చేసినా సరే,

424
00:29:21,260 --> 00:29:24,763
మీలో కొంతమంది మనసులు
నన్ను ఎప్పటికీ స్వీకరించవు.

425
00:29:25,931 --> 00:29:29,351
నన్ను ఎప్పటికీ ప్రేమించవు.
నన్ను ఎప్పటికీ నమ్మవు.

426
00:29:31,312 --> 00:29:34,398
ఇలాంటి మతవిరోధులకు,
నేను వినాశనం చూపిస్తాను.

427
00:29:34,982 --> 00:29:36,941
{\an8}నన్ను నాశనం చేయాలనుకునే వాళ్ళు,

428
00:29:36,942 --> 00:29:40,862
మీరు దారుణమైన చావులు చస్తారు,

429
00:29:40,863 --> 00:29:43,531
మీ దుర్మార్గానికి సరిపడే విధంగా.

430
00:29:43,532 --> 00:29:45,241
నా పాలన శాశ్వతంగా ఉంటుంది,

431
00:29:45,242 --> 00:29:50,914
ఈ ప్రపంచం నిర్జీవంగా మారినా,
నేను జీవించే ఉంటాను.

432
00:29:50,915 --> 00:29:54,960
శాశ్వతంగా. గాడ్ ఆఫ్ ది ఆషెస్.

433
00:30:03,260 --> 00:30:05,054
గుడ్ ఈవెనింగ్, వెధవల్లారా.

434
00:30:07,431 --> 00:30:08,474
నాన్న ఇంటికి వచ్చారు.

435
00:30:13,020 --> 00:30:14,188
విలియం.

436
00:30:17,483 --> 00:30:21,403
నాకు నువ్వు మన ఒప్పందాన్ని
నెరవేర్చవని అనిపిస్తోంది.

437
00:30:26,450 --> 00:30:27,409
భూమి కాలిపోయినా చేస్తా.

438
00:30:30,538 --> 00:30:32,873
పాపం ఆ ఫ్రెంచ్ వాడు.

439
00:30:34,166 --> 00:30:37,002
అతను లేకుండా మీ చిన్న సైన్స్ ప్రయోగం
ఎలా కొనసాగుతోంది?

440
00:30:38,295 --> 00:30:39,213
అది తెలుసుకుందాము.

441
00:31:48,365 --> 00:31:52,410
ఛ! ఛ!

442
00:31:52,411 --> 00:31:55,496
- ఓరి దేవుడా. అయ్యో, ఛ, క్షమించు!
- ఆంబ్రోసియస్‌కు న్యాయం జరగాలి!

443
00:31:55,497 --> 00:31:57,790
- దేవుడా! ఛ! దూరంగా ఉండు.
- ఆంబ్రోసియస్‌కు న్యాయం జరగాలి!

444
00:31:57,791 --> 00:32:03,504
- ఆంబ్రోసియస్‌కు న్యాయం జరగాలి!
- ఆంబ్రోసియస్‌కు న్యాయం జరగాలి!

445
00:32:03,505 --> 00:32:04,922
ఆమె పేరు చెప్పు!

446
00:32:04,923 --> 00:32:09,469
- ఆంబ్రోసియస్‌కు న్యాయం జరగాలి!
- ఆంబ్రోసియస్‌కు న్యాయం జరగాలి!

447
00:32:09,470 --> 00:32:12,514
- నన్ను క్షమించు! అబ్బా ఛ!
- ఆంబ్రోసియస్‌కు న్యాయం జరగాలి!

448
00:32:41,085 --> 00:32:41,919
ఆ వెధవను పేల్చేయ్!

449
00:32:44,755 --> 00:32:45,631
లేదు, లేదు, లేదు.

450
00:33:12,199 --> 00:33:13,450
ఏంటి…

451
00:33:28,006 --> 00:33:29,383
చిన్న సన్నాసి వెధవ.

452
00:33:41,395 --> 00:33:43,147
అందరూ చనిపోతారు, నీతో మొదలు!

453
00:33:55,451 --> 00:33:57,870
దేని కోసం వేచి చేస్తున్నావు?
వెంటనే చెయ్, ఛ!

454
00:34:10,758 --> 00:34:11,592
ఏమయింది?

455
00:34:24,062 --> 00:34:27,691
{\an8}నేనది చేయలేను.

456
00:34:28,442 --> 00:34:29,401
{\an8}ఎందుకని?

457
00:34:31,028 --> 00:34:34,864
{\an8}నాకు కలగాల్సిన ఆగ్రహం.

458
00:34:34,865 --> 00:34:36,992
{\an8}అక్కడ అది లేదు.

459
00:34:38,827 --> 00:34:41,497
{\an8}నాకు బాధగా ఉంది అంతే.

460
00:34:50,130 --> 00:34:52,382
నిన్ను దృఢంగా చేసేది ఆగ్రహం కాదు.

461
00:34:58,847 --> 00:35:00,849
అది ఎప్పుడూ అక్కడ లేదు బంగారం.

462
00:35:03,101 --> 00:35:04,812
అది ఎప్పుడూ నీ దగ్గరే ఉంది.

463
00:37:08,936 --> 00:37:12,356
అధికారం ఇంకా శక్తి, బాబు.

464
00:37:14,983 --> 00:37:18,779
రక్తం ఇంకా ఎముకలు.

465
00:37:36,004 --> 00:37:38,840
ఇది ఫ్రెంచీకి చేసిన దానికి.

466
00:37:53,689 --> 00:37:57,526
వద్దు. దయచేసి ఆపు.

467
00:37:58,694 --> 00:37:59,986
నువ్వు నాకు రుణపడ్డావు.

468
00:37:59,987 --> 00:38:04,031
ఎన్నోసార్లు నిన్ను చంపగలిగినా, చంపలేదు.

469
00:38:04,032 --> 00:38:05,866
నిన్ను వదిలేశాను.

470
00:38:05,867 --> 00:38:11,288
నేను… నేను నీకు వాట్ ఇస్తాను.
నీకు వాట్ ఇస్తాను, సరేనా?

471
00:38:11,289 --> 00:38:14,500
దానికి నీకు ఇష్టం వచ్చింది చేసుకో. సరేనా?

472
00:38:14,501 --> 00:38:16,336
నేను…

473
00:38:17,254 --> 00:38:20,339
బెక్కా! నీకు నీ భార్య తిరిగి కావాలా?

474
00:38:20,340 --> 00:38:23,093
రూపం మార్చే వారిని ఆమెలా మారుస్తాను.

475
00:38:24,720 --> 00:38:25,803
చెప్పు, చాలు.

476
00:38:25,804 --> 00:38:28,055
నేను నువ్వు చెప్పింది చేస్తాను!

477
00:38:28,056 --> 00:38:30,266
ప్లీజ్! ఏదైనా చేస్తాను!

478
00:38:30,267 --> 00:38:32,436
నన్ను పెంట తినమంటావా?
నేను నీ పెంట తింటాను!

479
00:38:33,061 --> 00:38:36,314
{\an8}టీవీలో ప్రత్యక్షంగా తింటాను.

480
00:38:41,486 --> 00:38:42,487
అది నిజం కాదు, బాబూ.

481
00:38:42,904 --> 00:38:44,656
మాడలీన్, నువ్వు నాకు మాటిచ్చావు.

482
00:38:45,907 --> 00:38:47,200
అది నిజం కాదు.

483
00:38:48,660 --> 00:38:50,828
నువ్వు ఇలా చేయలేవు.

484
00:38:50,829 --> 00:38:52,747
నువ్వు ఇలా చేయలేవు!

485
00:38:52,748 --> 00:38:55,417
నేను హోంలాండర్‌ను.

486
00:38:56,209 --> 00:39:00,338
కాదు. కాదు, నువ్వు ఏమీ కావు.

487
00:39:02,340 --> 00:39:03,675
ఇంకా ఇది…

488
00:39:05,635 --> 00:39:07,136
ఇది నా బెక్కాకు చేసినదానికి.

489
00:39:07,137 --> 00:39:08,638
వద్దు, వద్దు, వద్దు.

490
00:40:29,845 --> 00:40:31,012
నిన్ను నేను చూసుకుంటా.

491
00:40:33,598 --> 00:40:35,308
శాంతించు. సరేనా?

492
00:40:37,811 --> 00:40:40,981
సరే. శాంతించు.

493
00:41:10,677 --> 00:41:14,430
{\an8}వైట్ హౌస్ నుండి వచ్చిన ఆ షాకింగ్ వీడియో
నిజమైనదని నిర్ధారణ అయ్యింది.

494
00:41:14,431 --> 00:41:17,433
{\an8}హోంలాండర్, ప్రపంచంలో
అత్యంత ప్రతిష్టాత్మక సూపర్‌హీరో,

495
00:41:17,434 --> 00:41:21,187
{\an8}తాను దేవుడనని ప్రకటించుకున్న రోజే
హత్య చేయబడ్డాడు.

496
00:41:21,188 --> 00:41:25,858
{\an8}నేను… ఏదైనా… నేను తింటాను
నీ… టీవీలో ప్రత్యక్షప్రసారంలో.

497
00:41:25,859 --> 00:41:28,319
{\an8}హోంలాండర్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు.

498
00:41:28,320 --> 00:41:31,238
{\an8}సీఐఏలోని ధైర్యవంతులైన పురుషులు
ఇంకా మహిళలు, నేరుగా నా ఆదేశాల మేరకు,

499
00:41:31,239 --> 00:41:35,911
{\an8}ప్రజాస్వామ్యానికి ఏర్పడ్డ భయంకరమైన
ముప్పును ఎదుర్కొన్నవారికి నా కృతజ్ఞతలు.

500
00:41:36,536 --> 00:41:38,954
{\an8}ఇంకా ఊహాగానాలు చేసేవారికి,

501
00:41:38,955 --> 00:41:40,539
{\an8}నేను చెప్పేది, వద్దు అనే.

502
00:41:40,540 --> 00:41:44,293
{\an8}నేను రాజీనామా చేయను.
నేను ఏమీ తప్పు చేయలేదు.

503
00:41:44,294 --> 00:41:47,129
{\an8}అది మాజీ ప్రెసిడెంట్ ఆష్లీ బ్యారెట్,

504
00:41:47,130 --> 00:41:50,507
{\an8}ఆమె కాంగ్రెస్‌లో ఎప్పుడూ లేని విధంగా
ఏకగ్రీవ ఓటింగ్ ద్వారా,

505
00:41:50,508 --> 00:41:54,679
{\an8}ఈ మధ్యాహ్నం అభియోగాలను ఎదుర్కొని,
వెంటనే పదవీచ్యుతులయ్యారు.

506
00:41:55,305 --> 00:42:00,059
అలా అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలి
వివాదాలతో నిండిన పదవీ కాలం ముగిసింది.

507
00:42:00,060 --> 00:42:01,853
- ఇదిగో.
- థాంక్యూ.

508
00:42:03,688 --> 00:42:04,856
నా సోదరుడు.

509
00:42:05,482 --> 00:42:06,608
బాగుంది.

510
00:42:07,901 --> 00:42:08,735
నేనది ప్రయత్నించనా?

511
00:42:09,569 --> 00:42:11,655
నువ్వు ఈ రోజు బాగా చేశావు, చిన్నీ. ఇదిగో.

512
00:42:13,490 --> 00:42:16,701
ఫ్రెంచీ నిన్ను చూసి ఉంటే
బాగుండేది అని అనిపిస్తోంది.

513
00:42:18,703 --> 00:42:19,537
అతను చూశాడు.

514
00:42:25,627 --> 00:42:29,047
ఇది మురికి అంగం రుచిలా ఉంది.
సంపన్నులు మురికి అంగం రుచి చూస్తారా?

515
00:42:44,896 --> 00:42:46,398
విను, మిత్రమా…

516
00:42:49,192 --> 00:42:53,822
నేను ఏమీ చెప్పలేను…
ఇది శాంతపరచడానికి,

517
00:42:55,156 --> 00:42:56,908
కానీ నువ్వు చేయాల్సింది చేశావు.

518
00:42:57,409 --> 00:42:59,536
నువ్వు సరైనది చేశావు, సరేనా?

519
00:43:06,418 --> 00:43:11,422
ఏదేమైనా, ఇక మనము ఈ చెత్తంతా
మన వెనుక వదిలేయవచ్చు.

520
00:43:11,423 --> 00:43:16,594
మనకు ఇకపై ఏ శక్తులు ఉండవు,
మనము… సాధారణ మనుషులమే.

521
00:43:17,387 --> 00:43:20,890
మనము ఎక్కడైనా ప్రశాంతమైన చోట,
తిరిగి ప్రారంభించవచ్చు.

522
00:43:21,558 --> 00:43:23,143
నువ్వు, నేను ఇంకా టెర్రర్.

523
00:43:24,102 --> 00:43:26,187
అది మీ అమ్మకు నచ్చుతుందనే అనుకుంటాను.

524
00:43:30,275 --> 00:43:31,609
నాకు మా నాన్న ఏంటో తెలుసు…

525
00:43:33,611 --> 00:43:35,280
ఆయన పోవడం మంచిదే.

526
00:43:37,741 --> 00:43:39,534
కానీ నువ్వు కూడా మంచివాడివి కావు.

527
00:43:42,579 --> 00:43:44,539
నేను ఆయనను కాదని నిన్ను ఎంచుకోను.

528
00:43:47,459 --> 00:43:49,336
నన్ను నేను ఎంచుకుంటాను.

529
00:43:50,462 --> 00:43:53,798
నన్ను క్షమించు, కానీ నాకు నీతో
కొత్తగా ప్రారంభించాలని లేదు.

530
00:43:56,092 --> 00:43:57,510
నేను ఇది ముగియాలని కోరుకుంటున్నాను.

531
00:44:15,195 --> 00:44:18,365
సరే, ఇప్పుడు నువ్వు ఇంకా నేనే, టెర్రర్.

532
00:44:26,790 --> 00:44:27,791
టెర్రర్?

533
00:45:25,598 --> 00:45:30,018
{\an8}చాలా కాలంగా, సూపర్‌హీరోల అత్యంత దారుణమైన
ప్రవర్తన అదుపు లేని స్థితిలో కొనసాగింది.

534
00:45:30,019 --> 00:45:32,813
హోంలాండర్ దగ్గర నేను నిర్బంధంలో ఉండగా

535
00:45:32,814 --> 00:45:34,356
ఏమైనా నేర్చుకున్నానంటే,

536
00:45:34,357 --> 00:45:38,610
అది మన సూపర్‌హీరోలతో మన సంబంధం గురించి
పూర్తిగా పునరాలోచించాలనే.

537
00:45:38,611 --> 00:45:43,615
అందుకే నేను వాట్‌కి తాత్కాలిక సీఈఓగా
తిరిగి రావడానికి ఒప్పుకున్నాను.

538
00:45:43,616 --> 00:45:45,868
చెత్త వెధవ.

539
00:45:45,869 --> 00:45:48,036
సంక్షోభ సమయంలో పునర్నిర్మాణ ప్రక్రియకు

540
00:45:48,037 --> 00:45:50,999
మన షేర్‌హోల్డర్లకు కావలసినది
స్థిరమైన నాయకత్వమే.

541
00:45:52,208 --> 00:45:56,628
వాట్ అత్యుత్తమమైన, అత్యంత లాభదాయకమైన
రోజులు ఇంకా ముందు ఉన్నాయని నమ్ముతాను.

542
00:45:56,629 --> 00:45:59,590
ఇప్పుడు వాట్ వినాల్సిన సమయం.

543
00:45:59,591 --> 00:46:01,217
హే, బుచర్, నేను…

544
00:46:16,649 --> 00:46:17,859
క్షమించు, మిత్రమా.

545
00:46:33,166 --> 00:46:34,000
ఛ.

546
00:47:35,770 --> 00:47:36,604
ట్రాఫిక్?

547
00:47:39,148 --> 00:47:43,402
అవును. వంతెన మీద యాక్సిడెంట్ జరిగింది.
సొరంగ మార్గం గుండా రావాల్సింది.

548
00:47:43,403 --> 00:47:45,571
నువ్వు నన్ను
ఆపే ప్రయత్నం చేస్తావనుకున్నాను.

549
00:47:45,572 --> 00:47:47,574
కానీ నువ్వు ఒంటరిగా రాకుండా ఉండాల్సింది.

550
00:47:49,117 --> 00:47:51,243
నీ సైన్యాన్ని తీసుకురావాల్సింది.

551
00:47:51,244 --> 00:47:54,622
లేదు, నువ్వు వైరస్‌ను విడుదల చేయాలనుకుంటే,
ఈపాటికి చేసేవాడివి.

552
00:47:55,123 --> 00:48:01,170
కాకపోతే… నేను సూప్ వెధవలు అందరూ
ఉదయం షిఫ్ట్‌కు వస్తారని వేచి చూస్తున్నాను.

553
00:48:03,506 --> 00:48:07,427
ఇప్పుడు ఖాళీగా ఉన్న భవనంలో
ఈ కణాన్ని వదలడం వలన ఉపయోగం ఉండదు, కదా?

554
00:48:09,804 --> 00:48:12,974
సరే, అంటే, ఇప్పుడు నేను ఒక సైన్యాన్ని
తెచ్చి ఉంటే బాగుండేదని అనిపిస్తోంది.

555
00:48:15,935 --> 00:48:17,061
వైరస్ ఎక్కడుంది, బుచర్?

556
00:48:19,439 --> 00:48:24,110
నేను దాన్ని నీటి ట్యాంకులో పడేశాను.
అది ఫ్రెంచీ ఆలోచన.

557
00:48:25,320 --> 00:48:27,196
పిచ్చి వెధవకు శాంతి కలగాలి.

558
00:48:29,282 --> 00:48:33,285
నేను ఈ ట్రిగ్గర్ లాగితే చాలు,

559
00:48:33,286 --> 00:48:36,496
అది వర్షంలా చావు రసాన్ని
99 అంతస్తులు అన్నింటిలో వెదజల్లుతుంది.

560
00:48:36,497 --> 00:48:39,082
అది రెండు రోజుల్లో
ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది.

561
00:48:39,083 --> 00:48:43,629
ఎందుకు? అంటే, మనము గెలిచాముగా.

562
00:48:43,630 --> 00:48:47,800
గెలిచామా? లేదు, మనము వాళ్ళని గాయపరిచామంతే.

563
00:48:48,551 --> 00:48:50,510
వాట్ ఉన్నంత వరకూ, సూప్‌లు ఉంటారు,

564
00:48:50,511 --> 00:48:52,971
ఎప్పుడో ఒకప్పుడు,
బయట ఉన్న ఎవడో ఒక నీచుడు

565
00:48:52,972 --> 00:48:54,723
తరువాతి హోంలాండర్ అవుతాడు,

566
00:48:54,724 --> 00:48:56,225
నీకు అది తెలుసు.

567
00:48:58,978 --> 00:48:59,812
లేదు.

568
00:49:02,899 --> 00:49:07,737
మనము మొత్తం సూప్స్ ఆలోచననే ముగించాలి.

569
00:49:10,615 --> 00:49:14,327
అది మనము… శాశ్వతంగా చేయాలి.

570
00:49:15,912 --> 00:49:17,747
అంటే, నీకు అది కనబడుతోంది, కదా?

571
00:49:19,540 --> 00:49:22,418
ఇదే. ఇదే ఆ ఘడియ.

572
00:49:23,127 --> 00:49:28,299
నువ్వు నన్ను దీనికోసం నరకంలోకి
లాక్కొచ్చావు, ఇప్పుడు.

573
00:49:29,550 --> 00:49:33,137
నీ… కానరీ పక్షిలా ఉండేందుకు.

574
00:49:34,305 --> 00:49:38,685
లేదా నీ కెస్లర్. లేదా లెన్నీలా ఉండేందుకు.

575
00:49:40,186 --> 00:49:43,230
కానీ ఇక్కడ ఒక విషయం ఉంది,
దానికి నీకు నా అవసరం లేదు.

576
00:49:43,231 --> 00:49:45,900
నీకు ఎప్పుడూ లేదు. నేను… ముందునుంచే
నీలో ఉంది. నాకది కనబడుతోంది.

577
00:49:46,609 --> 00:49:49,904
నీకు విరిగిన మనసు ఉండి ఉంటుంది,
కానీ నీకు ఒకటి ఉంది.

578
00:49:51,030 --> 00:49:55,159
నువ్వు రాక్షసుడివి కాదు, బుచర్.

579
00:49:57,328 --> 00:49:59,163
మనిషిగా ఉండడం బాధగా ఉంది.

580
00:50:03,710 --> 00:50:05,378
క్షమించు, మిత్రమా.

581
00:50:07,588 --> 00:50:11,175
సూపర్‌హీరోలు… ముగిసిపోయారు.

582
00:50:21,018 --> 00:50:21,936
నిన్ను అలా చేయనీయలేను.

583
00:50:22,729 --> 00:50:26,441
హ్యూయీ చిన్నోడు ఇంకా అతని తుపాకీ.

584
00:50:27,316 --> 00:50:30,737
నీ మిత్రుడిని కాల్చేందుకు
నీకు చాలా ధైర్యం కావాలి.

585
00:50:35,032 --> 00:50:36,242
తప్పనిసరి అయితే అదే వస్తుంది.

586
00:50:38,369 --> 00:50:39,327
లేదు.

587
00:50:39,328 --> 00:50:40,538
నీకు అది లేదు…

588
00:50:47,044 --> 00:50:48,045
కిందకు ఉండు.

589
00:52:04,038 --> 00:52:08,251
క్షమించు. నాకు చేయాలని లేదు…
నేను అలా చేయాలని అనుకోలేదు.

590
00:52:09,794 --> 00:52:11,546
నేను… అంబులెన్స్ పిలుస్తాను, సరేనా?

591
00:52:14,257 --> 00:52:15,299
నేను ఇబ్బందిపెట్టను.

592
00:52:19,554 --> 00:52:21,055
పరవాలేదు, హ్యూయీ.

593
00:52:22,557 --> 00:52:26,894
నేను నీకు ఏ అవకాశమూ ఇవ్వలేదు.
నేను… నేను ఆపబోవడం లేదు.

594
00:52:30,690 --> 00:52:34,986
ఆ రక్తం అంతా…
నేను మీ అందరినీ ఎదుర్కునేలా చేసింది.

595
00:52:37,738 --> 00:52:41,409
అందులో ఏదీ కూడా
ఇసుమంత కూడా మార్పు తీసుకురాదు.

596
00:52:44,287 --> 00:52:50,042
నువ్వు… నువ్వు నువ్వుగానే ఉన్నావు…
నేను… నేను ఏమి చేసినా కూడా.

597
00:53:00,136 --> 00:53:01,387
నాకు ఏమి చేయాలో తెలియడం లేదు.

598
00:53:02,305 --> 00:53:03,598
నువ్వు ఏమీ చేయనవసరం లేదు.

599
00:53:17,069 --> 00:53:22,783
నువ్వు నిజంగా… అచ్చం లెన్నీలానే ఉన్నావు.

600
00:54:10,790 --> 00:54:13,793
ఇక్కడ బుచర్ ఉండి ఉంటే, మనము అతనికోసం
ఏడుస్తున్నామని ఎగతాళి చేసేవాడు.

601
00:54:15,419 --> 00:54:19,340
కానీ అతను చనిపోయాడు, అందుకని,

602
00:54:20,508 --> 00:54:21,342
తన సంగతి వదిలేయండి.

603
00:54:22,510 --> 00:54:27,848
అంటే, అతను లోపాలు
ఇంకా తప్పుడు నిర్ణయాలు తప్ప ఇంకేమీ కాడు.

604
00:54:29,225 --> 00:54:32,686
కానీ హోంలాండర్‌ను ఆపగలననే ఆశ
తను ఎప్పుడూ వదిలేయలేదు,

605
00:54:32,687 --> 00:54:35,773
ఆ తరువాత అతను నిజంగా అది చేశాడు.

606
00:54:36,357 --> 00:54:41,153
అతనిని ప్రేమించినా, ద్వేషించినా,
ప్రపంచాన్ని సురక్షిత ప్రాంతంగా చేశాడు,

607
00:54:42,029 --> 00:54:43,531
అది అతనిని హీరోను చేస్తుంది.

608
00:54:46,075 --> 00:54:49,327
ఇంకా ఖచ్చితంగా అతను ఇప్పుడు
నరకంలో ఉండి ఉంటాడు,

609
00:54:49,328 --> 00:54:50,746
ఆ నవ్వు నవ్వుతూ,

610
00:54:52,039 --> 00:54:54,166
సైతానుపై దాడి చేస్తూ ఉంటాడు.

611
00:55:00,589 --> 00:55:01,757
అవును, అంతే.

612
00:55:06,512 --> 00:55:08,388
{\an8}అతను మా అమ్మ పక్కన ఉండడం
బాగుంది అనుకుంటాను.

613
00:55:08,389 --> 00:55:09,639
{\an8}రెబెక్కా బుచర్
జ్ఞాపకార్థం

614
00:55:09,640 --> 00:55:10,641
{\an8}తల్లి, భార్య
సోదరి, కూతురు

615
00:55:11,392 --> 00:55:13,144
అతను ఎప్పుడూ ఉండాలని కోరుకున్నది అక్కడే.

616
00:55:25,823 --> 00:55:26,866
బై.

617
00:55:42,381 --> 00:55:43,466
హ్యూయీ.

618
00:55:45,509 --> 00:55:46,677
పద వెళదాం, బాబు.

619
00:55:51,348 --> 00:55:52,891
మనము నిజంగా వెళుతున్నామా…

620
00:55:52,892 --> 00:55:54,560
రెనోలో పై అచ్ఛాదన లేని స్టీక్‌హౌస్‌కా?

621
00:55:56,020 --> 00:55:57,354
అవును, వెళుతున్నాము.

622
00:55:59,732 --> 00:56:00,566
నేను మాట ఇచ్చాను.

623
00:56:03,402 --> 00:56:04,570
అతనికి ఇది నచ్చేది.

624
00:56:08,574 --> 00:56:09,575
ఖచ్చితంగా.

625
00:56:22,379 --> 00:56:24,756
{\an8}విలియం బుచర్
ప్రియ జ్ఞాపకార్థం - ప్రేమించే భర్త

626
00:56:24,757 --> 00:56:27,843
ఓయ్, పోరా, సన్నాసులురా

627
00:57:21,647 --> 00:57:24,233
{\an8}కేఫ్ డి లా రివె డి
మార్సెయిల్

628
00:57:53,762 --> 00:57:56,557
- హలో?
- హ్యూ క్యాంప్‌బెల్, నేను బాబ్ సింగర్‌ని.

629
00:57:57,558 --> 00:57:59,684
మిస్టర్ ప్రెసిడెంట్, హాయ్.

630
00:57:59,685 --> 00:58:03,771
క్యాంప్‌బెల్, దేశం నీకు, నీ బృందానికి
రుణపడి ఉంది,

631
00:58:03,772 --> 00:58:06,608
కానీ నేను ఈ తియ్యటి కబుర్లు
చెప్పను, సరేనా?

632
00:58:06,609 --> 00:58:10,528
నాతో ప్రెసిడెంట్
తియ్యగా కబుర్లు చెప్పాలనుకోను, సర్.

633
00:58:10,529 --> 00:58:12,864
వాట్ ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉంది.

634
00:58:12,865 --> 00:58:18,036
ఆ వీ ఎక్కించిన పిచ్చి సన్నాసులకు ఇప్పుడు
అదుపులేదు, ఏం చేస్తున్నారో దేవుడికే తెలుసు

635
00:58:18,037 --> 00:58:21,414
అందుకే, మేము సూప్స్ వ్యవహారాల బ్యూరోను
మళ్ళీ స్థిరపరుస్తున్నాము.

636
00:58:21,415 --> 00:58:24,918
అది నడిపేందుకు మాకు ఒకరు కావాలి.
అందుకని, ఏమంటావు, బాబు?

637
00:58:24,919 --> 00:58:26,836
నువ్వు నేరుగా నాకే రిపోర్ట్ చేయాలి.

638
00:58:26,837 --> 00:58:29,757
అది… అద్భుతం. అది…

639
00:58:30,424 --> 00:58:33,010
అది గౌరవప్రదమైనది, సర్. అది కేవలం…

640
00:58:34,094 --> 00:58:35,720
చేయలేను, థాంక్యూ?

641
00:58:35,721 --> 00:58:37,180
"చేయలేను, థాంక్యూనా?"

642
00:58:37,181 --> 00:58:39,098
నేను… నిజంగా
ఆ ఆఫర్‌ను అభినందిస్తున్నాను.

643
00:58:39,099 --> 00:58:40,935
కాకపోతే నిజానికి నేను నా సొంత…

644
00:58:41,977 --> 00:58:44,020
స్టార్టప్ వెంచర్ మీద పని చేస్తున్నాను.

645
00:58:44,021 --> 00:58:46,481
ప్రైవేట్ సెక్టర్.

646
00:58:46,482 --> 00:58:48,984
నీ మనసు మార్చుకుంటే ప్రతిపాదన ఉంటుంది.

647
00:58:54,240 --> 00:58:56,241
క్యాంప్‌బెల్
ఆడియో విజువల్

648
00:58:56,242 --> 00:59:02,957
{\an8}సరే. నీకోసం జింజర్ బీర్,
జింజర్ క్యాండీలు ఇంకా…

649
00:59:03,791 --> 00:59:06,001
{\an8}- సాల్టీన్స్ తెచ్చాను.
- సాల్టీన్స్. సాల్టీన్స్ ఇవ్వు.

650
00:59:06,585 --> 00:59:07,878
అయితే, నువ్వు మిస్ అయింది ఏంటి?

651
00:59:09,213 --> 00:59:10,838
నేను వాంతి చేసుకున్నాను.

652
00:59:10,839 --> 00:59:13,299
ఆ తరువాత, మూత్రానికి వెళ్ళాను,
కానీ వెళ్ళేసరికి ఆలస్యమయింది.

653
00:59:13,300 --> 00:59:14,550
ఆ తరువాత మళ్ళీ వాంతయింది.

654
00:59:14,551 --> 00:59:16,636
ఆ తరువాత, మా అమ్మ కాల్ చేసింది.

655
00:59:16,637 --> 00:59:18,930
అది దారుణమైన విషయం అనుకుంటాను.

656
00:59:18,931 --> 00:59:21,224
ఆమె అరగంటసేపు
మనం పెళ్లి చేసుకోలేదని తిట్టింది.

657
00:59:21,225 --> 00:59:24,227
చూడు, మనము ఇప్పుడే కోర్టుకు వెళ్ళచ్చు,

658
00:59:24,228 --> 00:59:25,353
నువ్వు అదే కోరుకుంటే.

659
00:59:25,354 --> 00:59:26,521
లేదు. లేదు, నేను వెళ్ళలేను.

660
00:59:26,522 --> 00:59:28,274
ఎందుకంటే నాకు సరిపోయే షూస్ ఇవే.

661
00:59:30,985 --> 00:59:35,239
హే, ఖచ్చితంగా
నిన్ను ఆ షూస్‌లోనే పెళ్ళాడతాను.

662
00:59:36,282 --> 00:59:39,660
11-99 బ్రాడ్‌వేలో ఇంకా 96. దయచేసి
అతిసమీప ఆఫీసర్‌ను అభ్యర్థిస్తున్నాము.

663
00:59:41,620 --> 00:59:43,997
పార్క్‌వేలో ఒక నిర్మాణం ఉంది.
నిమిషంలో బలగాలు చేరతాయి.

664
00:59:43,998 --> 00:59:45,123
నువ్వు ఇది చేపడతావా?

665
00:59:45,124 --> 00:59:46,291
అవును.

666
00:59:46,292 --> 00:59:47,543
కానీ నేను నా షూస్ మార్చను.

667
00:59:56,510 --> 00:59:58,095
మీ అమ్మను జాగ్రతగా చూసుకో, రాబిన్.

668
01:00:30,586 --> 01:00:31,627
గార్త్ ఎన్నిస్ రచనలో డైనమైట్
ఎంటర్టెయిన్మెంట్ కామిక్ బుక్ సిరీస్ ఆధారం

669
01:00:31,628 --> 01:00:32,546
చిత్రణ
డారిక్ రాబర్ట్‌సన్

670
01:03:13,665 --> 01:03:15,750
సబ్‌టైటిల్ అనువాద కర్త సమత

671
01:03:15,751 --> 01:03:17,753
క్రియేటివ్ సూపర్‌వైజర్
రాధ

