1
00:01:16,665 --> 00:01:18,585
హే! హే!

2
00:01:26,305 --> 00:01:29,385
-పర్లేదు.
-ఏమండీ, సర్.

3
00:01:29,465 --> 00:01:30,345
తాన్యా ఎక్కడ?

4
00:01:30,465 --> 00:01:32,225
వెళ్ళాలి. పేరెంట్స్ వచ్చారు.

5
00:01:32,305 --> 00:01:33,865
-తాన్యా ఎక్కడ?
-భయపడకండి.

6
00:01:33,945 --> 00:01:36,265
నిజంగా, తాన్యా బాగుంది.

7
00:01:36,345 --> 00:01:38,705
తనకు ఏం కాలేదు. కంగారుపడకు.

8
00:01:38,785 --> 00:01:40,305
కంగారా, నా బొందా, లోపెరా!

9
00:01:40,385 --> 00:01:43,585
చెక్ చేయించడానికి తనను
ఆసుపత్రికి తీసుకెళ్లాం.

10
00:01:43,665 --> 00:01:45,945
-దేనికి?
-క్లినిక్‌కు. తను బాగుంది.

11
00:01:46,025 --> 00:01:47,225
వాళ్ళు తనను తాకలేదు.

12
00:01:47,305 --> 00:01:48,705
భయపెడదామని అనుకున్నారంతే.

13
00:01:48,785 --> 00:01:50,945
-విదేశీయులా?
-అవును.

14
00:01:51,025 --> 00:01:52,545
విదేశీయులని చెప్పింది.

15
00:01:59,065 --> 00:02:02,225
తనను ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి,

16
00:02:03,145 --> 00:02:06,105
తలకు తుపాకీని ఉంచి, బట్టలు తీయించారట.

17
00:02:06,945 --> 00:02:08,705
లియో, పద వెళ్దాం. కమాన్.

18
00:02:08,785 --> 00:02:10,985
ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్‌,
ఫోన్ చేశా...

19
00:02:11,025 --> 00:02:12,505
అప్పటికే వెళ్ళిపోయారు, ఛ!

20
00:02:12,585 --> 00:02:14,145
మేము చేయగలిగిందంతా చేస్తున్నాం.

21
00:02:14,225 --> 00:02:17,385
ఇంటీరియర్ సెక్రటరీకి ఫోన్ చేసాను.

22
00:02:18,105 --> 00:02:19,985
ఇది మా మొదటి ప్రాధాన్యత.

23
00:02:26,545 --> 00:02:28,265
-తాన్యా, బంగారం.
-హాయ్, బుజ్జీ.

24
00:02:29,465 --> 00:02:30,985
ఎలా ఉన్నావు?

25
00:02:31,545 --> 00:02:32,705
బాగానే ఉన్నాను.

26
00:02:32,825 --> 00:02:33,985
నిజంగా చెప్తున్నావా?

27
00:02:36,265 --> 00:02:38,345
మేమొచ్చేసాం, బుజ్జీ.

28
00:02:41,465 --> 00:02:42,985
పాసు పోసేసుకున్నాను.

29
00:02:43,865 --> 00:02:46,545
పర్లేదులే.

30
00:02:51,145 --> 00:02:52,665
పాసు పోసేసుకున్నాను

31
00:02:53,185 --> 00:02:55,465
ఇలా ఇక్కడ పెట్టేసరికి, నాన్నా.

32
00:03:10,025 --> 00:03:14,225
లోస్ ఫరాద్

33
00:03:32,945 --> 00:03:36,105
తను ఎలా ఉంటుందో తెలుసుగా, ఛ.
అన్నీ నమ్ముతుంది.

34
00:03:36,185 --> 00:03:39,425
వాళ్ళు ఆమెను మోసం చేసారు.
ఆమెను మోసం చేసారు...

35
00:03:43,945 --> 00:03:46,705
-తన రూమ్‌కు తీసుకెళ్తే మంచిదా?
-వద్దు, పర్లేదు.

36
00:03:47,825 --> 00:03:50,625
ఇది పెద్దది అవుతుంది.
లియోతో మామూలుగా ఉండదు.

37
00:03:50,705 --> 00:03:52,185
వాళ్ళు తనకు చేసినది...

38
00:03:52,265 --> 00:03:55,065
మనల్ని రెచ్చగొడుతున్నారు.
మనం ప్రతిస్పందించాలి.

39
00:03:56,145 --> 00:03:57,625
నేను చేయగలిగేది...

40
00:03:59,465 --> 00:04:00,865
నాకు సాయం చేయి.

41
00:04:06,065 --> 00:04:08,305
పాలిగ్రామ్‌కు చెందిన
ఫ్రెంచ్ వారని చెప్పారు.

42
00:04:08,385 --> 00:04:10,225
ఆర్టిస్ట్‌గా వారికి ఆమె అంటే ఇష్టం.

43
00:04:10,305 --> 00:04:11,585
వాళ్ళకు ఆమె పాటలు తెలుసు.

44
00:04:11,665 --> 00:04:14,065
ఎవరూ వినకపోతే వాళ్ళకెలా తెలుసు?

45
00:04:14,145 --> 00:04:16,425
ఎవరో వాళ్ళకు డెమో ఇచ్చారని చెప్పారు.

46
00:04:16,465 --> 00:04:17,705
నాకెలా తెలిస్తుంది?

47
00:04:17,825 --> 00:04:19,785
-నా చెల్లెలు తెలివిలేనిది.
-కాదు.

48
00:04:19,865 --> 00:04:21,825
తనకు 20 ఏళ్ళు, పెద్ద కలలున్నాయి.

49
00:04:21,945 --> 00:04:23,905
ఎవరూ ఆమెను భూమి మీదికి తీసుకురాలేదు.

50
00:04:23,985 --> 00:04:25,225
మొరాకన్‌లు అయ్యుంటారు.

51
00:04:25,305 --> 00:04:27,865
మొరాకన్, అల్జీరియన్,
సెర్బియన్ ఎవరైనా పట్టించుకోను.

52
00:04:27,905 --> 00:04:29,545
-మవాద్ పంపాడు.
-అది తెలియదులే.

53
00:04:29,625 --> 00:04:31,465
నాకు తెలుసు. ఎందుకిలా చేసాడో తెలుసా?

54
00:04:31,545 --> 00:04:34,145
నువ్వు ఆఫర్ చేసిన పడవ,
కానీ నేను అమ్మని పడవ.

55
00:04:34,225 --> 00:04:35,425
ఇది మళ్ళీనా, లియో?

56
00:04:35,465 --> 00:04:37,345
నీ చెత్త సాకులు చూసావా? కనబడ్డాయా?

57
00:04:37,465 --> 00:04:38,465
చాలు, లియో, ఊరుకో.

58
00:04:38,585 --> 00:04:41,305
నాన్న, అది మవాద్ అయ్యుంటే,
మూల్యం చెల్లిస్తాడు.

59
00:04:41,345 --> 00:04:43,105
ఓహ్ అవునా? ఏం చేస్తావేంటి?

60
00:04:43,345 --> 00:04:44,665
అతడిని కాలుస్తావా?

61
00:04:48,225 --> 00:04:49,585
పోలీసులు ఏమైనా చెప్పారా?

62
00:04:50,025 --> 00:04:51,425
వాళ్ళకు ఎవరూ దొరకరు.

63
00:04:52,305 --> 00:04:54,225
మనం మొదట రూఢీ పరచుకోవాలి.

64
00:04:54,305 --> 00:04:58,105
కానీ ఎవరో నా చెల్లెలి తలకు
తుపాకీ పెట్టారు.

65
00:04:58,185 --> 00:04:59,745
హ్యూగో, తను నా చెల్లెలు కూడా.

66
00:05:01,825 --> 00:05:03,265
మవాద్‌కు దీనితో ఏమొస్తుంది?

67
00:05:03,345 --> 00:05:04,465
పగ.

68
00:05:04,865 --> 00:05:06,025
వాడొక సైకో.

69
00:05:11,305 --> 00:05:12,825
రెచ్చగొట్టాలని చూస్తున్నాడు.

70
00:05:12,905 --> 00:05:13,825
సరిగ్గా చెప్పావు.

71
00:05:14,145 --> 00:05:16,545
మనం దాడి చేయాలని అనుకుంటున్నాడు.

72
00:05:16,625 --> 00:05:18,265
నాన్న వాడిని కలిస్తే

73
00:05:19,105 --> 00:05:20,465
మంచిదని అనిపిస్తుంది.

74
00:05:20,905 --> 00:05:23,985
-ఏం మాట్లాడుతున్నావు అసలు?
-నన్ను మాట్లాడనిస్తావా?

75
00:05:31,665 --> 00:05:32,905
నాన్నా.

76
00:05:33,225 --> 00:05:34,865
వాడే అయితే, నీకు తెలుస్తుంది.

77
00:05:35,225 --> 00:05:38,705
-ఉతికి పారేస్తాను.
-లియో నిన్ను నువ్వు నియంత్రించుకో.

78
00:05:38,785 --> 00:05:41,345
తిరిగి రా,
అప్పుడు పరిష్కారం వెతుకుదాం.

79
00:05:47,065 --> 00:05:48,505
అంటే, నేననుకోవడం,

80
00:05:49,225 --> 00:05:50,945
మనం ఉద్రేకపూరితంగా పనిచేస్తే,

81
00:05:51,665 --> 00:05:53,625
సరిగ్గా వాడు కోరుకునేదే చేస్తాం.

82
00:05:57,465 --> 00:05:58,625
కార్మెన్ మాట నిజమే.

83
00:06:03,025 --> 00:06:06,545
ఫరాద్‌లు తెలివిలేని మూర్ఖులు
కాదని చూపించుకోవలసి ఉండింది.

84
00:06:06,985 --> 00:06:08,705
నియంత్రణలో ఉండాల్సి వచ్చింది.

85
00:06:09,585 --> 00:06:13,425
ఎందుకంటే ఎప్పుడైనా అది
అధికారానికి మంచి సంకేతం.

86
00:06:14,385 --> 00:06:15,825
నన్నెవరు అనుకుంటున్నారు?

87
00:06:15,905 --> 00:06:18,425
చిన్న సందేశాలు పంపే కమోర్రా మాఫియోసోనా?

88
00:06:18,825 --> 00:06:20,665
నేను మూర్ఖుడినా ఏంటి?

89
00:06:21,025 --> 00:06:22,825
లియో, నా గురించి నీకు బాగా తెలుసు.

90
00:06:23,745 --> 00:06:26,305
నేను హెచ్చరించను, చర్య తీసుకుంటాను.

91
00:06:26,905 --> 00:06:29,105
-నీకది తెలియాలి.
-నిజమే.

92
00:06:29,785 --> 00:06:31,785
నా ఇంటికి దుండగులను పంపినప్పటిలా.

93
00:06:31,865 --> 00:06:32,705
ఏంటి?

94
00:06:33,345 --> 00:06:35,665
అది మొరాకో సీక్రెట్ సర్వీస్.

95
00:06:36,345 --> 00:06:37,625
సీఈఎస్‌ఐడీని అడుగు.

96
00:06:39,385 --> 00:06:43,345
20 ఏళ్లుగా మనం ఒకరికొకరు తెలుసు కాబట్టి
ఈ విషయం నమ్మకంగా చెబుతున్నాను.

97
00:06:43,785 --> 00:06:45,185
ఇరానియన్లు నీకు 8 మిలియన్లు

98
00:06:45,265 --> 00:06:47,465
మోసం చేసారని బాధపడుతుంటే
థెరపిస్ట్‌ను కలువు.

99
00:06:47,545 --> 00:06:49,105
-థెరపిస్టా?
-హా, థెరపిస్ట్‌.

100
00:06:49,185 --> 00:06:51,465
ఎందుకంటే నా కుటుంబానికి ఏదైనా జరిగితే,

101
00:06:51,545 --> 00:06:55,225
టెన్నిస్ తర్వాత నొప్పి, పాయెల్లా తింటే
విరేచనాలు, ఏం చేస్తానో తెలుసా?

102
00:06:56,625 --> 00:06:58,385
-నన్ను కాలుస్తావా?
-లేదు.

103
00:06:58,465 --> 00:07:00,945
ఇరాక్‌కు వెళ్లి
సద్దాం హుస్సేన్‌కు చెబుతాను

104
00:07:01,025 --> 00:07:02,985
ఇరానియన్ల విషయంలో ద్రోహం చేశావని.

105
00:07:03,425 --> 00:07:04,945
ఎన్నేళ్ళుగా యుద్ధం?

106
00:07:05,025 --> 00:07:06,465
ఐదు, ఆరు, ఏడు ఏళ్ళు?

107
00:07:07,505 --> 00:07:08,825
తన మిత్రుడు మవాద్

108
00:07:08,905 --> 00:07:12,385
బాగ్దాద్‌పై బాంబుదాడికి విమానాల
విడిభాగాలను అమ్మాడని తెలుసుకొని

109
00:07:12,465 --> 00:07:14,625
కచ్చితంగా కోపగించుకుంటాడు, కదా?

110
00:07:17,745 --> 00:07:19,225
ఆయన నిన్ను నమ్మడు.

111
00:07:19,305 --> 00:07:20,905
నేను బాగా నచ్చచెప్పగలను.

112
00:07:21,705 --> 00:07:22,945
ఏ ఆధారం లేకుండా?

113
00:07:24,345 --> 00:07:27,025
నాకు అన్నిచోట్లా శత్రువులున్నారు, లియో.

114
00:07:27,625 --> 00:07:29,825
చాలా మంది నన్ను తిడతారు.

115
00:07:30,305 --> 00:07:31,705
సద్దాంకు ఆ విషయం తెలుసు.

116
00:07:32,265 --> 00:07:33,465
ఆయన నిన్ను నమ్మడు.

117
00:07:36,185 --> 00:07:37,705
హెచ్చరించలేదని అనొద్దు.

118
00:07:38,305 --> 00:07:39,745
నన్ను భయపెడుతున్నావా?

119
00:07:45,465 --> 00:07:48,065
నీ కూతురులాగే నన్ను కూడా
పాసు పోసుకోమంటావా?

120
00:07:52,705 --> 00:07:54,345
లియో ప్రయత్నించాడు.

121
00:07:54,705 --> 00:07:55,945
ప్రయత్నం చేసాడు.

122
00:07:57,385 --> 00:08:01,385
కానీ కొన్నిసార్లు ప్రణాళికలు పని చేయకపోయే
అంతా అధ్వాన్నంగా అవుతుంది.

123
00:08:11,145 --> 00:08:13,025
ఆ కొట్టడం అపెటైజర్ మాత్రమే.

124
00:08:14,505 --> 00:08:16,305
మి. ఫరాద్!

125
00:08:16,385 --> 00:08:17,465
దయచేసి!

126
00:08:17,865 --> 00:08:22,225
ఎందుకంటే అసలు డ్రామా అక్కడికి
600 మైళ్ల దూరంలో జరిగింది.

127
00:08:22,505 --> 00:08:25,665
మొనాకో

128
00:08:37,705 --> 00:08:41,505
చాటూ మొనాకో

129
00:08:41,745 --> 00:08:44,625
ఖాలిద్, అల్జీరియాకు తీసుకెళ్లిన
తుపాకులు గుర్తున్నాయా?

130
00:08:45,265 --> 00:08:47,745
దేశభక్తితో కూడిన, ప్లాన్ ఉన్నట్లు తేలింది.

131
00:08:49,065 --> 00:08:50,265
చాలా పెద్దది.

132
00:08:50,345 --> 00:08:53,745
చాలా 70వ దశకానిది, ప్రధాన ఉగ్రవాదం.

133
00:09:05,385 --> 00:09:07,225
ఇది పీఎఫ్‌ఎల్‌పీ తరపున

134
00:09:07,305 --> 00:09:10,505
జరిగిన దాడి!

135
00:09:28,465 --> 00:09:33,265
ఖాలిద్ దానిని తాన్యా దాదాపు అత్యాచారానికి
గురైన వారంలోనే నిర్వహించడం కంటే

136
00:09:33,345 --> 00:09:35,105
మెరుగైనది ఏదీ ఆలోచించలేకపోయాడు.

137
00:09:35,185 --> 00:09:37,385
జరగండి, జరగండి! వెళ్దాం పద!

138
00:09:38,585 --> 00:09:39,425
జరగండి!

139
00:10:11,985 --> 00:10:13,545
రెండు గంటలు, కొంచెమైనా ఉండాలి.

140
00:10:13,625 --> 00:10:14,745
ఆదేశాలు పాటిస్తున్నా.

141
00:10:14,825 --> 00:10:16,385
ఆదేశాలా, తొక్కా.

142
00:10:17,745 --> 00:10:19,745
హే, ఎక్కడికి వెళ్తున్నావు?

143
00:10:19,865 --> 00:10:21,145
ఎవరో కలవడానికొచ్చారు.

144
00:10:21,225 --> 00:10:22,465
-ఎవరు?
-సీఈఎస్‌ఐడీ నుండి.

145
00:10:23,505 --> 00:10:24,745
నాతో రా.

146
00:10:26,545 --> 00:10:28,145
మవాద్‌తో సమస్య ఏంటి?

147
00:10:28,225 --> 00:10:29,745
వెధవలాగా ఉన్నందుకు తంతాను.

148
00:10:29,865 --> 00:10:32,065
న్యాయశాఖ మంత్రి కూడా వాడి సమర్థనా?

149
00:10:32,745 --> 00:10:34,425
సీఈఎస్‌ఐడీలో మీ బాస్ ఎవరు?

150
00:10:34,745 --> 00:10:36,065
నేను మవాద్ కోసం రాలేదు.

151
00:10:36,145 --> 00:10:37,385
అవునా? ఎంత యాదృచ్ఛికం.

152
00:10:37,465 --> 00:10:39,545
వాడిని తన్నగానే అందరికీ కోపం వస్తుంది.

153
00:10:39,625 --> 00:10:41,625
కానీ వాడు నీకిష్టమైన వాడు కాబట్టి...

154
00:10:42,225 --> 00:10:43,145
ఏంటి?

155
00:10:43,225 --> 00:10:45,825
...వచ్చే 48 గంటలలో.

156
00:10:45,865 --> 00:10:47,625
-ఏంటది?
-నువ్వు చెప్పు.

157
00:10:47,705 --> 00:10:50,585
వారి పేర్లతో కూడిన జాబితా
అధికారులకు ఇస్తారు...

158
00:10:50,625 --> 00:10:51,505
ఏంటి?

159
00:10:51,585 --> 00:10:52,425
...ప్రెస్‌కు.

160
00:10:52,505 --> 00:10:57,745
ఇజ్రాయెల్ మారణహోమ దేశం
చర్చలకు నిరాకరించినట్లయితే,

161
00:10:57,825 --> 00:11:01,185
బందీలను ఉరితీయడం మొదలుపెడతాం,

162
00:11:01,265 --> 00:11:05,185
ఇజ్రాయెల్ పాస్‌పోర్ట్‌లను
కలిగి ఉన్న వారితో మొదలుపెట్టి.

163
00:11:07,145 --> 00:11:09,425
-నీ మిత్రుడు ఖాలిద్...
-"నా మిత్రుడు ఖాలిద్."

164
00:11:10,945 --> 00:11:12,025
"మిత్రుడు ఖాలిద్..."

165
00:11:12,105 --> 00:11:13,825
నువ్వేమనుకుంటున్నావో తెలియదు,

166
00:11:13,905 --> 00:11:16,105
కానీ నాకు దీనితో ఏ సంబంధం లేదు.

167
00:11:19,425 --> 00:11:22,585
వీటిని

168
00:11:22,665 --> 00:11:24,345
ఐదు నెలల కిందట తీసారు.

169
00:11:24,825 --> 00:11:27,305
నికరాగ్వా విషయం బద్ధలవడానికి ముందు.

170
00:11:28,105 --> 00:11:30,065
నా ప్రమేయం ఉందని ఆరోపిస్తుంటే,

171
00:11:30,145 --> 00:11:31,505
మీకు నా గురించి తెలియనట్లే.

172
00:11:31,585 --> 00:11:33,185
నిన్ను కలవడానికి ఎందుకొచ్చాడు?

173
00:11:37,385 --> 00:11:38,465
నన్ను మందలించడానికి.

174
00:11:39,905 --> 00:11:42,225
-నిన్ను మందలించడానికా?
-అవును.

175
00:11:42,665 --> 00:11:43,825
విమర్శించడానికి

176
00:11:43,905 --> 00:11:47,585
నికరాగ్వాలో ఉన్న అమెరికన్లకు
సహాయం చేసినందుకు.

177
00:11:48,225 --> 00:11:51,505
ఖాలిద్ అంతే. తన మిత్రులు
సామ్రాజ్యవాదం కోసం పని చేస్తే

178
00:11:51,585 --> 00:11:54,545
దానిని అవమానంగా తీసుకుంటాడు.
చెబుతుంటాను, "నువ్వు ఇష్టమే,

179
00:11:54,625 --> 00:11:56,705
-"కానీ నేను వ్యాపారవేత్తను."
-చూడు,

180
00:11:56,785 --> 00:11:58,945
మీరిద్దరూ ఏం చేయాలనుకున్నారో తెలియదు...

181
00:11:59,025 --> 00:12:01,905
నా పిల్లల మీద ఒట్టు, జరిగింది ఇంతే.

182
00:12:01,985 --> 00:12:03,705
నేను పట్టించుకోను!

183
00:12:04,225 --> 00:12:05,265
నేను పట్టించుకోను.

184
00:12:06,025 --> 00:12:09,145
సీఈఎస్‌ఐడీ తరఫున రాలేదు.
నన్ను ప్రభుత్వం పంపించింది.

185
00:12:10,265 --> 00:12:13,385
ఆ హోటల్‌లో మూడు స్పానిష్ కుటుంబాలున్నాయి.

186
00:12:14,585 --> 00:12:18,385
నువ్వు అనుకుంటునట్లుగా,
అవి ఏవో మామూలు స్పానిష్ కుటుంబాలు కాదు.

187
00:12:18,465 --> 00:12:22,185
కాబట్టి నీ మిత్రుడికి ఫోన్ చేసి,
వారిని వదిలేయుమని చెప్తావు.

188
00:12:22,265 --> 00:12:23,985
ఖాలిద్‌ను సంప్రదించే దారి లేదు.

189
00:12:24,065 --> 00:12:25,425
కాబట్టి ఒక దారి వెతుకు.

190
00:12:25,745 --> 00:12:27,625
ఎందుకంటే వాళ్ళకు ఏమైనా జరిగితే,

191
00:12:28,065 --> 00:12:30,025
నీ జీవితాన్ని నరకం చేస్తాం.

192
00:12:30,105 --> 00:12:33,265
మా వద్ద మిమ్మల్ని 30 ఏళ్ళు
జైలులో పెట్టే సాక్ష్యాలున్నాయి.

193
00:12:33,345 --> 00:12:35,145
నిన్ను, నీ కూతురు సారాను.

194
00:12:35,865 --> 00:12:37,905
ఇంకా నీ భార్యకు చిల్లిగవ్వ కూడా రాదు,

195
00:12:37,985 --> 00:12:40,385
ఎందుకంటే మీ ఎకౌంటులను

196
00:12:40,665 --> 00:12:43,625
కార్లు, ఆస్తులు, పడవులను
సీజ్ చేయబోతున్నాం...

197
00:12:43,705 --> 00:12:45,425
పడవ. నాకు ఒక పడవే ఉంది.

198
00:12:48,425 --> 00:12:49,465
అయితే నీ పడవ.

199
00:12:49,905 --> 00:12:51,105
పాస్‌పోర్ట్.

200
00:12:52,145 --> 00:12:53,865
పాస్‌పోర్ట్
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా

201
00:12:56,905 --> 00:12:58,465
అటు, వెళ్ళు. వెళ్ళు.

202
00:13:03,665 --> 00:13:04,985
పాస్‌పోర్ట్.

203
00:13:12,345 --> 00:13:13,385
అందరూ యూదులా?

204
00:13:13,465 --> 00:13:14,905
ఇజ్రాయిలీ పౌరులు.

205
00:13:15,745 --> 00:13:19,385
-ఇటు. పద వెళ్దాం. పద!
-వెళ్ళండి, వెళ్ళండి.

206
00:13:20,145 --> 00:13:22,305
పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఓవర్.

207
00:13:22,585 --> 00:13:24,785
కుటుంబాలను వేరు చేయవద్దు.

208
00:13:29,705 --> 00:13:31,105
నాకు యూరోపియన్లు అవసరం లేదు.

209
00:13:32,825 --> 00:13:35,025
ఎన్ని జియోనిస్ట్ పాస్‌పోర్టులు?

210
00:13:35,105 --> 00:13:36,305
ఇరవై నాలుగు.

211
00:13:42,465 --> 00:13:43,985
తను అందరి కంటే పెద్దనా?

212
00:13:50,185 --> 00:13:51,305
వద్దు.

213
00:13:51,385 --> 00:13:54,465
మార్బెలాలో సామాజిక సంఘర్షణ
సృష్టించ దలచుకోలేదు.

214
00:13:55,305 --> 00:13:58,305
మవాద్, నేను ఒకరికొకరం
చాలా ఏళ్ళుగా తెలుసు, ఇంకా...

215
00:13:59,025 --> 00:14:00,425
కచ్చితంగా, సర్.

216
00:14:00,505 --> 00:14:02,145
ఎవరికీ ఎలాంటి ఇబ్బంది వద్దు.

217
00:14:02,825 --> 00:14:05,745
మాటిస్తున్నాను, మేము చూసుకుంటాం.
కంగారు పడకండి.

218
00:14:12,705 --> 00:14:15,025
ప్రభుత్వ ప్రతినిధి
నన్ను పరిష్కరించుమంటున్నాడు.

219
00:14:15,105 --> 00:14:15,945
సరే.

220
00:14:16,825 --> 00:14:18,945
తాన్యాకు జరిగినది ఎందుకు చెప్పలేదు?

221
00:14:19,025 --> 00:14:21,185
అది దేనినీ పరిష్కరించదు, హ్యూగో.

222
00:14:21,665 --> 00:14:22,585
అవును.

223
00:14:23,505 --> 00:14:25,105
అంటే తలవంచి, భరించాల్సిందేనా?

224
00:14:25,185 --> 00:14:26,065
ఇక చాలు, హ్యూగో.

225
00:14:26,385 --> 00:14:29,025
మవాద్, సీఈఎస్‌ఐడీ,
మార్బెలాలో సగం మనకు వ్యతిరేకం.

226
00:14:29,105 --> 00:14:30,985
ఇక ప్రభుత్వంతో కూడా గొడవపడతావా?

227
00:14:36,865 --> 00:14:38,785
హే, బుజ్జీ.

228
00:14:40,025 --> 00:14:42,545
లేదు, నేను చెప్పేది విను.

229
00:14:42,625 --> 00:14:43,745
ఇది నీ తప్పు కాదు.

230
00:14:43,825 --> 00:14:45,105
-అవును, నాదే.
-కాదు.

231
00:14:45,185 --> 00:14:47,465
అవును, నేను... నన్ను ఒంటరిగా వదిలేయ్!

232
00:14:50,905 --> 00:14:53,265
-తాన్యా, ఇటు రా.
-వద్దు!

233
00:14:56,265 --> 00:14:57,545
నాతో రండి.

234
00:15:06,185 --> 00:15:09,785
నేను ఖాలిద్, మవాద్ అనే రెండు పక్షాలతో
ఒకేసారి పోరాడలేను.

235
00:15:10,345 --> 00:15:12,465
మవాద్ అందరికీ ఫోన్ చేస్తున్నాడు.

236
00:15:12,545 --> 00:15:14,025
మనం అతడిని ఆపాలి.

237
00:15:14,105 --> 00:15:16,465
జెరోమ్‌తో మాట్లాడి,
ధర నిర్ణయించుమని చెప్పు.

238
00:15:17,265 --> 00:15:18,745
తాన్యాకు అలా జరిగాక కూడానా?

239
00:15:27,105 --> 00:15:28,785
సగం నిద్ర మాత్ర ఇచ్చాను.

240
00:15:33,065 --> 00:15:35,425
అబ్బా, హ్యూగో.
అతిగా స్పందించడం మానేయ్.

241
00:15:37,225 --> 00:15:38,825
అతిగా స్పందించడమా? నేనా?

242
00:15:38,905 --> 00:15:40,145
అవును, నువ్వే.

243
00:15:40,265 --> 00:15:43,505
నువ్వు ఎప్పుడూ మవాద్ దగ్గరకు
వెళ్ళాలని చూస్తున్నావు.

244
00:15:44,585 --> 00:15:46,545
అది మీ అల్లుడి తప్పు.

245
00:15:49,945 --> 00:15:52,185
అతడి చూసి ఏమైనా నేర్చుకోవచ్చు.

246
00:15:53,585 --> 00:15:55,345
ఏం నేర్చుకోవాలి? మోసం చేయటమా?

247
00:15:55,425 --> 00:15:57,385
కాదు. నిన్ను అదుపులో పెట్టుకోవడం.

248
00:16:01,225 --> 00:16:04,185
అమ్మా, జనం మనల్ని గౌరవిస్తే
చాలని అనుకుంటాను.

249
00:16:04,905 --> 00:16:05,865
నిజమే.

250
00:16:07,225 --> 00:16:09,265
మనల్నా లేదా నిన్నా?

251
00:16:11,865 --> 00:16:12,745
ఏంటి?

252
00:16:13,185 --> 00:16:16,425
బంగారం, జనం సమస్యలను
పరిష్కరించేవారిని గౌరవిస్తారు.

253
00:16:17,345 --> 00:16:19,465
తమ ఇష్టాన్ని విధించే వారిని గౌరవిస్తారు.

254
00:16:45,545 --> 00:16:47,345
వారు మిమ్మల్ని లాబీలో కలుస్తారు.

255
00:16:47,425 --> 00:16:48,585
మంచిది.

256
00:16:48,665 --> 00:16:50,225
అన్ని యూనిట్లను అప్రమత్తం చేశా.

257
00:17:40,905 --> 00:17:42,745
కాల్చొద్దు, కాల్చొద్దు!

258
00:17:52,065 --> 00:17:53,745
-ఏంటి?
-ఇద్దరు తప్పించుకున్నారు.

259
00:17:53,825 --> 00:17:55,665
మరి ఏం చేస్తున్నారు?

260
00:17:55,745 --> 00:17:56,905
జరుగు!

261
00:17:57,865 --> 00:17:58,785
శాంతంగా ఉండండి.

262
00:18:00,585 --> 00:18:01,625
దయచేసి.

263
00:18:02,145 --> 00:18:04,625
శాంతంగా ఉండండి. మనం మాట్లాడుకోవాలి.

264
00:18:10,665 --> 00:18:12,345
ఇక చర్చలేం లేవు!

265
00:18:13,065 --> 00:18:15,185
జియోనిస్ట్ సంస్థ సమాధానం చెప్పకపోతే,

266
00:18:15,585 --> 00:18:18,785
వారు మా 55 పీఎల్ఎఫ్ సోదరులను
విముక్తి చేయకపోతే

267
00:18:18,865 --> 00:18:20,425
రాబోయే అరగంటలో,

268
00:18:20,505 --> 00:18:23,265
మేము బందీలను ఉరి తీయడం మొదలుపెడతాం!

269
00:18:28,145 --> 00:18:29,665
ఇది మా తుది హెచ్చరిక!

270
00:18:43,985 --> 00:18:45,985
మీకు నష్టపరిహారం చెల్లించుమంటారా?

271
00:18:46,505 --> 00:18:48,065
ఇది నష్టపరిహారం కాదు.

272
00:18:48,865 --> 00:18:50,905
సారా, మీ నాన్నకు పిచ్చెక్కింది.

273
00:18:51,025 --> 00:18:52,905
మి. మవాద్‌ను కొట్టాడు.

274
00:18:53,265 --> 00:18:54,425
ఆయనను గాయపరిచాడు.

275
00:18:55,145 --> 00:18:58,305
మి. మవాద్‌పై చేసిన దాడిని
ఏదీ భర్తీ చేయలేదు.

276
00:18:59,825 --> 00:19:00,905
ఇది ఒక కొనుగోలు.

277
00:19:02,185 --> 00:19:03,305
మేము ఏం కొంటున్నాం?

278
00:19:03,905 --> 00:19:06,425
మీరు కొనుగోలు చేసేది మి. మవాద్ క్షమాపణను,

279
00:19:07,545 --> 00:19:09,025
ఇంకా ప్రతీకారం తీర్చుకునే

280
00:19:09,865 --> 00:19:11,185
ఆయన చట్టబద్ధమైన హక్కును.

281
00:19:11,305 --> 00:19:13,065
మరి మా చెల్లెలు సంగతి ఏంటి?

282
00:19:14,345 --> 00:19:18,105
చాలా చింతిస్తున్నాను,
కానీ మి. మవాద్‌కు దానితో ఏ సంబంధం లేదు.

283
00:19:24,265 --> 00:19:26,185
ఈ కొనుగోలు ఎంత ఉంటుంది?

284
00:19:26,745 --> 00:19:28,545
నా నుండి ఏం కోరుకుంటున్నారు?

285
00:19:28,905 --> 00:19:31,785
నేను ఫోన్ చేసానంటే ఇది అత్యవసరం అని.

286
00:19:31,865 --> 00:19:33,505
నేను చేయగలిగింది ఏం లేదు, లియో.

287
00:19:33,985 --> 00:19:35,425
ఖాలిద్‌కు మతి తప్పింది.

288
00:19:35,545 --> 00:19:37,025
నువ్వు చేస్తే ఫోన్ ఎత్తుతాడు.

289
00:19:37,385 --> 00:19:39,425
ఎప్పుడో ప్రయత్నించాను.

290
00:19:39,505 --> 00:19:40,865
అయితే మరింత ప్రయత్నించు.

291
00:19:42,025 --> 00:19:45,865
అరాఫత్ మండిపడుతున్నాడు.
మమ్మల్ని ఉగ్రవాదులుగా చూస్తున్నారు.

292
00:19:45,905 --> 00:19:46,865
టెలిఫోన్

293
00:19:46,905 --> 00:19:49,905
మోంజెర్, ఆ స్పెయిన్ దేశస్థులను
అక్కడి నుండి తప్పించాలి.

294
00:19:50,025 --> 00:19:52,985
గొప్ప ఇంటిపేర్లు ఉన్న
కుటుంబాల నుండి వచ్చారు, సరేనా?

295
00:19:53,065 --> 00:19:55,505
సీఈఎస్‌ఐడీ నన్ను ఆగకుండా వేధిస్తోంది.

296
00:19:55,585 --> 00:19:57,625
నా మీద కూడా ఒత్తిడి ఉంది.

297
00:19:57,665 --> 00:20:00,065
ముఖ్యంగా నువ్వు మవాద్‌ను కొట్టిన తర్వాత.

298
00:20:00,145 --> 00:20:01,665
దానికీ దీనికీ ఏం సంబంధం?

299
00:20:01,745 --> 00:20:02,625
అంతా.

300
00:20:02,665 --> 00:20:06,185
ఇరానియన్ల నుండి వచ్చిన డబ్బు గురించి మవాద్
ఇంకా కోపంగా ఉన్నాడు, సరేనా?

301
00:20:07,065 --> 00:20:08,185
వాడొక చెత్త వెధవ.

302
00:20:08,505 --> 00:20:10,985
సీఐఏ ద్వారా కూడా రక్షించబడిన వ్యక్తి.

303
00:20:11,065 --> 00:20:14,265
అతని మీదికి చేయి ఎత్తడం, ఏమనుకున్నావు?

304
00:20:14,585 --> 00:20:16,425
ప్రస్తుతం, నా సమస్య ఖాలిద్.

305
00:20:16,905 --> 00:20:20,265
లేదు. మవాద్ విషయం తేల్చు,
అప్పుడు ఖాలిద్ గురించి మాట్లాడదాం.

306
00:20:20,785 --> 00:20:21,665
సరేనా?

307
00:20:31,545 --> 00:20:33,505
హే, అయితే?

308
00:20:33,785 --> 00:20:35,065
ఆ పని మీదే ఉన్నాను.

309
00:20:35,665 --> 00:20:37,665
సీఈఎస్ఐడీ మమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టదు.

310
00:20:38,625 --> 00:20:40,345
ఖాలిద్ ఎవరినీ చంపడు.

311
00:20:42,025 --> 00:20:42,985
నిజమే చంపడు.

312
00:20:43,865 --> 00:20:44,665
పద వెళ్దాం.

313
00:21:05,185 --> 00:21:06,305
నాతో రండి.

314
00:21:13,105 --> 00:21:15,545
వద్దు, వద్దు. దయచేసి.

315
00:21:15,625 --> 00:21:17,345
లేదు, లేదు, తనతో నేనొస్తాను.

316
00:21:17,425 --> 00:21:19,065
-కంగారుపడకు.
-వద్దు, వద్దు.

317
00:21:58,825 --> 00:22:01,545
దురదృష్టవశాత్తు, మీ వాళ్ళు

318
00:22:01,625 --> 00:22:04,825
చర్చలు జరపడానికి నిరాకరిస్తున్నారు.

319
00:22:32,705 --> 00:22:35,025
1,50,000 డాలర్లు అనేది అసాధ్యమైన మొత్తం.

320
00:22:35,585 --> 00:22:36,545
అసాధ్యమా?

321
00:22:36,905 --> 00:22:38,825
నువ్వు చేసిన గందరగోళం తర్వాత.

322
00:22:39,465 --> 00:22:42,865
1,00,000 డాలర్లు నాకు మరింత సహేతుకంగా
అనిపించడం మొదలవుతుంది.

323
00:22:44,705 --> 00:22:48,265
ఇతరుల డబ్బుతో బేరసారాలు
చేయడం సరదా, కదా, బావగారు?

324
00:22:48,345 --> 00:22:49,425
సూటిగా చెప్తాను.

325
00:22:49,505 --> 00:22:51,745
మా చెల్లెల్ని నగ్నంగా,

326
00:22:51,825 --> 00:22:54,785
భయపడుతూ, ఏడుస్తూ ఉండేలా
వ్యసనపరుల మధ్యలో వదిలేసి,

327
00:22:54,865 --> 00:22:56,505
మీరు ఏమీ ఇవ్వరు.

328
00:22:57,025 --> 00:22:59,865
కానీ మవాద్‌ను తన్నినందుకు,
ఎంత అన్నావు?

329
00:23:00,665 --> 00:23:01,625
1,00,000 డాలర్లా?

330
00:23:02,545 --> 00:23:04,745
అది క్షమాపణ యొక్క ధర.

331
00:23:07,945 --> 00:23:11,065
సరే, మేము అది కొంటున్నాం కాబట్టి

332
00:23:11,145 --> 00:23:12,625
మాకు బోనస్‌ ఇవ్వాలి.

333
00:23:12,705 --> 00:23:14,025
-కాదా?
-బోనసా?

334
00:23:15,745 --> 00:23:16,705
ఏం బోనస్?

335
00:23:16,785 --> 00:23:17,825
ఈ బోనస్.

336
00:23:20,945 --> 00:23:23,425
-తెలివిలేదా వెధవ?
-పారిపో!

337
00:23:23,505 --> 00:23:24,505
పద!

338
00:23:24,585 --> 00:23:25,745
చెత్త వెధవ.

339
00:23:34,225 --> 00:23:35,105
ఎక్కు!

340
00:23:55,585 --> 00:23:57,185
లియో, ఇంకా సమయముంది.

341
00:23:57,265 --> 00:24:00,465
మన కుటుంబాన్ని సైన్యంలాగా మారుస్తావా?
హ్యూగోకు రైఫిల్ ఇస్తావా?

342
00:24:00,545 --> 00:24:01,705
ఆలస్యమైంది, కార్మెన్.

343
00:24:01,785 --> 00:24:02,945
వద్దు, లియో...

344
00:24:03,025 --> 00:24:04,105
వద్దు, వద్దు...

345
00:24:04,185 --> 00:24:06,065
అతడిని చంపిస్తావు. ప్లీజ్.

346
00:24:06,145 --> 00:24:07,825
రైఫిల్ ఓస్కార్ కోసం.

347
00:24:07,905 --> 00:24:09,985
అది కూడా మంచిది కాదు.
హ్యూగోకు అవమానం.

348
00:24:10,065 --> 00:24:12,345
-సమయానికి సంబంధించినది, కార్మెన్.
-లియో.

349
00:24:12,705 --> 00:24:13,905
లియో, ప్లీజ్.

350
00:24:17,385 --> 00:24:19,345
పోలీసులు శాంతించుమంటున్నారు, కానీ...

351
00:24:24,345 --> 00:24:25,465
ఇదిగో.

352
00:24:25,545 --> 00:24:27,905
-మవాద్ ఇంటికెళ్తున్నాం.
-దయచేసి వద్దు!

353
00:24:27,985 --> 00:24:28,905
నేను?

354
00:24:28,985 --> 00:24:30,065
నువ్వు ఇక్కడే ఉండు.

355
00:24:30,145 --> 00:24:31,625
-ఎందుకు?
-ఎందుకా?

356
00:24:31,705 --> 00:24:33,225
కావలసినంత రచ్చ చేసావు.

357
00:24:42,425 --> 00:24:43,345
సారా.

358
00:24:43,985 --> 00:24:45,025
సారా!

359
00:24:58,465 --> 00:24:59,745
అతడిని చంపేస్తారు.

360
00:25:27,825 --> 00:25:29,385
లేదు, ఖాలిద్ పిచ్చోడు కాదు.

361
00:25:33,025 --> 00:25:34,385
కాల్పులు ఆపండి!

362
00:25:40,225 --> 00:25:42,945
లేదు, లేదు, అలా జరగకూడదు.

363
00:26:15,505 --> 00:26:20,545
ప్రియమైన అంకుల్ ఖాలిద్‌కు
చంపగల సామర్థ్యం ఉండింది.

364
00:26:36,145 --> 00:26:39,585
ఆ స్థితికి చేరుకున్నప్పుడు,
అన్నీ విఫలమవుతాయి...

365
00:26:39,665 --> 00:26:43,465
ప్రణాళికలు, వ్యూహాలు,
చివరికి ఇంగిత జ్ఞానం కూడా.

366
00:26:44,065 --> 00:26:45,305
మీకు వేడిగా లేదా?

367
00:26:45,905 --> 00:26:47,425
చాలా వేడిగా ఉంది కదా?

368
00:26:52,185 --> 00:26:54,345
నాకు నీళ్ళు కావాలి.
కొంచెం నీళ్ళు తాగుతాను.

369
00:26:58,545 --> 00:27:00,145
ఇలా చెమటపట్టడం మంచిది కాదు.

370
00:27:05,585 --> 00:27:07,745
నేను స్నానం చేస్తాను, బుజ్జీ.

371
00:27:20,585 --> 00:27:21,665
లియో!

372
00:27:21,865 --> 00:27:23,105
నాన్న!

373
00:27:23,185 --> 00:27:24,505
-లియో!
-నాన్నా!

374
00:27:24,585 --> 00:27:25,825
-సాయం చేయి!
-నాన్నా!

375
00:27:25,905 --> 00:27:28,105
ఇంగిత జ్ఞానం పోయినప్పుడు,

376
00:27:28,185 --> 00:27:29,705
గందరగోళం మాత్రమే మిగులుతుంది.

377
00:27:30,065 --> 00:27:31,665
గందరగోళం వచ్చినపుడు,

378
00:27:32,065 --> 00:27:34,905
చెడుగా కాగల అన్నీ అద్వాన్నంగా అవుతాయి.

379
00:28:01,945 --> 00:28:02,865
ఆపు, హ్యూగో.

380
00:28:18,705 --> 00:28:20,785
అది గుండె నొప్పి కాదు.

381
00:28:21,105 --> 00:28:24,745
గత కొన్ని రోజుల ఒత్తిడి కారణంగా
కుప్పకూలాడని అనుకుంటున్నారు.

382
00:28:25,105 --> 00:28:26,745
లోపలికి వెళ్లి చూడొచ్చా?

383
00:28:26,825 --> 00:28:27,905
లేదు. ఉన్నంత సేపు

384
00:28:27,985 --> 00:28:30,625
తనకు మెలకువొచ్చే వరకు
తనను చూసేది నేనొక్కదాన్నే.

385
00:28:30,705 --> 00:28:31,865
విశ్రాంతి ఇవ్వాలి.

386
00:28:31,945 --> 00:28:33,465
తనకు శాంతి, ప్రశాంతత కావాలి.

387
00:28:34,425 --> 00:28:36,225
ఈ లోపు మనం ఏం చేయాలి?

388
00:28:36,305 --> 00:28:38,105
మనలో మనం మాట్లాడుకొని, నువ్వు

389
00:28:38,345 --> 00:28:40,105
చేసిన సమస్యలను పరిష్కరించాలి.

390
00:28:40,545 --> 00:28:41,705
మవాద్ అంటావా?

391
00:28:41,785 --> 00:28:43,265
మవాద్ ఏ డీల్ తీసుకోడు.

392
00:28:43,345 --> 00:28:44,745
మరి ఏదైనా ఆలోచించండి.

393
00:28:45,425 --> 00:28:48,985
అతను $150,000 బదులుగా ఒక మిలియన్ అడిగితే,
అది మీ సమస్య.

394
00:28:49,065 --> 00:28:51,465
ఎలాగూ ఏదోక రోజు అది మీ డబ్బే అవుతుంది.

395
00:28:51,545 --> 00:28:53,945
నాన్న వెనక్కి తిరిగేది లేదని చెప్పాడు.

396
00:28:55,785 --> 00:28:57,825
సారా, ఏదోకటి ఆలోచించు.

397
00:28:58,185 --> 00:28:59,545
దీన్ని పరిష్కరించు.

398
00:29:00,265 --> 00:29:02,145
-కానీ అమ్మా, చూడు...
-హ్యూగో!

399
00:29:02,225 --> 00:29:03,665
మీ నాన్న చనిపోవచ్చు.

400
00:29:04,105 --> 00:29:05,905
నిజంగా నీకది అర్థం కావట్లేదా?

401
00:29:10,345 --> 00:29:11,305
దేవుడా.

402
00:29:14,865 --> 00:29:17,465
మవాద్ డీల్‌కు ఒప్పుకోడు,
మనం మిలియన్ ఇచ్చినా కూడా.

403
00:29:18,385 --> 00:29:20,385
ముఖ్యంగా నాన్న హాస్పిటల్‌లో ఉండగా.

404
00:29:20,465 --> 00:29:21,705
హ్యూగో మూర్ఖుడని తెలుసు.

405
00:29:21,785 --> 00:29:24,145
అమ్మ మాట విన్నావు.
దీన్ని పరిష్కరించాలి.

406
00:29:24,865 --> 00:29:26,585
మనం ఇరుక్కుపోయాం, ఓస్కార్.

407
00:29:28,185 --> 00:29:29,065
సారా.

408
00:29:31,185 --> 00:29:32,345
సారా.

409
00:29:32,705 --> 00:29:34,145
బాగానే ఉన్నావా?

410
00:29:37,665 --> 00:29:38,665
కొంచెం మేలా?

411
00:29:39,105 --> 00:29:40,785
డాక్టర్‌ను కలుద్దామా?

412
00:29:40,865 --> 00:29:41,985
అవసరం లేదు.

413
00:29:42,065 --> 00:29:43,825
సరే, కానీ ఎలాగూ ఇక్కడున్నాంగా.

414
00:29:46,425 --> 00:29:48,065
దీనికి కారణం నేను గర్భవతినవడం.

415
00:29:50,665 --> 00:29:51,585
ఏంటి?

416
00:29:56,185 --> 00:29:57,385
నేను గర్భవతిని.

417
00:30:00,985 --> 00:30:02,625
మనకు కావలసినదే కదా?

418
00:30:59,385 --> 00:31:01,185
నేను పట్టించుకునేలా కనిపిస్తున్నానా?

419
00:31:03,025 --> 00:31:05,385
ఇదెంత సీరియస్ అనేది మీకర్థమైందో
నాకు తెలియదు.

420
00:31:06,065 --> 00:31:07,625
హా.

421
00:31:08,505 --> 00:31:10,025
ఏదో ఒకటి చేయండి.

422
00:31:11,545 --> 00:31:14,345
సమయం మించిపోతోంది, కార్మెన్.
ఇక మీ ఇష్టం.

423
00:31:59,185 --> 00:32:02,065
పిల్లలు అదృష్టాన్ని తెస్తారని అంటారు కదా?

424
00:32:04,425 --> 00:32:07,145
ఈ కుటుంబంలో, వారు గ్రెనేడ్ లాంచర్ తేవాలి.

425
00:32:11,825 --> 00:32:12,865
చింతించకు.

426
00:32:13,865 --> 00:32:15,065
అంతా సవ్యంగా జరుగుతుంది.

427
00:32:16,305 --> 00:32:17,385
ఈసారి కాదు, మానువెల్.

428
00:32:19,345 --> 00:32:21,985
హ్యూగో తొందరపడకుంటే, ఈ డీల్ పూర్తయ్యేది.

429
00:32:22,065 --> 00:32:23,785
హ్యూగోను నిందించకు.

430
00:32:23,865 --> 00:32:25,825
తను తొందరపడ్డాడంటే, అది మీ తప్పే.

431
00:32:25,905 --> 00:32:27,385
మవాద్‌తో చేరిక తిప్పికొట్టింది

432
00:32:27,465 --> 00:32:29,385
దాంతో తనను తాను నిరూపించుకోవాలని.

433
00:32:30,505 --> 00:32:32,825
నిజమే. నన్ను నేను నిందించుకోడం మేలు కదా?

434
00:32:33,785 --> 00:32:35,665
ఈ కుటుంబంతో వచ్చిన సమస్య అదే.

435
00:32:35,745 --> 00:32:37,185
అందరూ నిరూపించుకోవాలంటారు,

436
00:32:37,265 --> 00:32:39,705
గొడవ పడతారు, పోటీ పడతారు, ఇరికించుకుంటారు.

437
00:32:40,985 --> 00:32:42,185
వెళ్లిపోవచ్చు కదా?

438
00:32:44,945 --> 00:32:45,825
సారాతో పాటు.

439
00:32:46,545 --> 00:32:47,705
స్వతంత్రంగా ఉండండి.

440
00:32:48,665 --> 00:32:51,105
ఓ ఇల్లు తీసుకోండి.
తల్లిదండ్రులవుతారు కదా?

441
00:32:51,705 --> 00:32:53,745
బయటి నుంచి వ్యాపారంలో పాలుపంచుకోండి.

442
00:32:55,825 --> 00:32:56,945
సారా ఇష్టపడదు.

443
00:32:58,585 --> 00:32:59,825
ఇప్పుడు మీరో కుటుంబం.

444
00:33:14,825 --> 00:33:16,545
నేను నిన్ను అడిగేది సాయం కాదు.

445
00:33:17,185 --> 00:33:18,545
మర్యాదపూర్వక చిహ్నం.

446
00:33:19,785 --> 00:33:21,745
మర్యాదపూర్వకమైన చిహ్నం అడగడానికి

447
00:33:22,185 --> 00:33:24,985
ఇంత దూరం వచ్చావా?

448
00:33:25,585 --> 00:33:27,465
ఇది నేను నిన్ను అడిగే చివరి సాయం.

449
00:33:29,105 --> 00:33:31,625
నీకు లియో 20 ఏళ్లుగా తెలుసు.

450
00:33:32,385 --> 00:33:34,985
తను నీకు అవసరమైనప్పుడు అండగా
ఉన్నాడు, మోంజెర్.

451
00:33:35,905 --> 00:33:38,025
నాకు తెలుసు, కార్మెన్.

452
00:33:39,225 --> 00:33:40,745
మరి ఏదైనా చేయి.

453
00:33:42,905 --> 00:33:45,185
ఖాలిద్‌కు మతి పోయింది.

454
00:33:46,145 --> 00:33:47,585
అతడు ఎవరి మాటా వినడు.

455
00:33:47,665 --> 00:33:49,465
లియో పరిస్థితి విషమంగా ఉందని చెప్పు.

456
00:33:49,545 --> 00:33:52,145
అతడు నమ్మకపోతే,
నాకో, హాస్పిటల్‌కో ఫోన్ చేయొచ్చు.

457
00:33:52,225 --> 00:33:54,585
ఖాలిద్ పెద్ద సమస్యలో ఉన్నాడు.

458
00:33:54,665 --> 00:33:57,305
-ప్రస్తుతం, నేననుకోను...
-చెప్పి చూడు.

459
00:33:57,385 --> 00:33:59,705
తన మిత్రుడు లియో చనిపోవచ్చని చెప్పు,

460
00:34:00,665 --> 00:34:01,985
ఆ బందీలను విడిపించడమనేది

461
00:34:02,065 --> 00:34:04,425
తన కోసం చేసే చివరి సాయం కాగలదు.

462
00:34:04,505 --> 00:34:05,585
దయచేసి.

463
00:34:09,185 --> 00:34:10,185
దయచేసి.

464
00:34:18,265 --> 00:34:19,105
చూడు.

465
00:34:20,265 --> 00:34:21,865
మనం దూరం వెళ్ళక్కర్లేదు.

466
00:34:21,945 --> 00:34:24,585
శాన్ పెడ్రో డి అల్కాంటారాలో
మంచి ఇళ్ళున్నాయి.

467
00:34:24,665 --> 00:34:25,985
పోర్ట్ వెనుక.

468
00:34:26,065 --> 00:34:27,265
రెండోది చూడు.

469
00:34:28,425 --> 00:34:31,185
-నీకు మా ఇల్లు నచ్చలేదా?
-నచ్చింది.

470
00:34:31,265 --> 00:34:33,225
కానీ ఇక మనపై దృష్టి పెట్టాల్సిన సమయం.

471
00:34:33,265 --> 00:34:34,625
మన కుటుంబం మీద.

472
00:34:35,145 --> 00:34:37,025
నేనూ అదే ఆలోచిస్తున్నాను.

473
00:34:38,145 --> 00:34:39,785
నా దగ్గర ఒక ఆలోచన ఉంది.

474
00:34:40,225 --> 00:34:41,385
మవాద్‌ను మోసం చేయాలి.

475
00:34:43,265 --> 00:34:44,145
ఏంటి?

476
00:34:44,745 --> 00:34:46,225
తన నమ్మకం సంపాదించు.

477
00:34:47,425 --> 00:34:49,305
తను ఫరాద్‌లతో కలవడు.

478
00:34:49,425 --> 00:34:51,185
మా తమ్ముడు, మా నాన్న లేదా నాతో.

479
00:34:51,265 --> 00:34:52,745
ఆతడికి మా ధైర్యం నచ్చదు.

480
00:34:52,905 --> 00:34:54,585
కానీ నీకా బరువు లేదు.

481
00:34:55,905 --> 00:34:57,065
నేను నీ భర్తను.

482
00:34:57,585 --> 00:35:00,105
నీకు ఇంటి పేరు లేదు, చరిత్ర లేదు.

483
00:35:00,185 --> 00:35:02,385
మా నాన్న చెప్పినట్లు నువ్వు ఖాళీ పలకవు.

484
00:35:03,105 --> 00:35:05,985
నువ్వు ఈ కుటుంబ భవిష్యత్తని
అతడికి అనిపించేలా చేయి.

485
00:35:07,305 --> 00:35:08,745
మా నాన్న ఆరోగ్యం బాగాలేదు.

486
00:35:09,225 --> 00:35:11,465
హ్యూగో మూర్ఖుడు, నేనేమో ఒక మహిళను.

487
00:35:11,545 --> 00:35:12,985
నీకు ఆశలున్నాయని
తనకు తెలుసు.

488
00:35:13,745 --> 00:35:15,945
ఒక అనాథగా పెరిగి, ఇంత దూరం వచ్చావు.

489
00:35:16,265 --> 00:35:17,145
అవును.

490
00:35:17,745 --> 00:35:20,465
ఏదోక రోజు యజమాని అవుతాను కాబట్టి
మీ నాన్న కొట్టింది

491
00:35:20,545 --> 00:35:22,305
అతడు మర్చిపోవాలని చెప్పాలా?

492
00:35:22,425 --> 00:35:23,985
-ఒక డీల్ చెప్పు.
-ఏ డీల్?

493
00:35:24,065 --> 00:35:25,425
తనతో మార్కెట్లు పంచుకోవడం.

494
00:35:25,505 --> 00:35:27,025
అలా అంటే నన్ను పరీక్షిస్తాడు.

495
00:35:27,105 --> 00:35:29,225
కుటుంబాన్ని కాపాడడానికి
ఏదైనా సరే, ఓస్కార్.

496
00:35:30,545 --> 00:35:32,665
మీ నాన్నకు తెలిస్తే చంపేస్తాడు.

497
00:35:32,745 --> 00:35:34,785
హ్యూగో ఇంకా పడవ విషయంలో కోపం గుర్తుందా?

498
00:35:34,905 --> 00:35:36,585
ఎవరికీ తెలియక్కర్లేదు.

499
00:35:38,785 --> 00:35:40,425
మన మధ్యే ఉంటుంది.

500
00:35:41,505 --> 00:35:42,625
కేవలం నువ్వు, నేను.

501
00:35:43,265 --> 00:35:44,425
ఒక జట్టుగా.

502
00:35:47,745 --> 00:35:49,585
అయితే కలిసి మవాద్‌ను కలుద్దాం.

503
00:35:50,465 --> 00:35:51,905
నేను లియో ఫరాద్ కూతురును.

504
00:35:52,385 --> 00:35:53,665
అరబ్ ప్రపంచంలో

505
00:35:53,745 --> 00:35:55,265
అది వంశంలో భాగమైనట్లే.

506
00:35:57,385 --> 00:35:58,745
నువ్వు ద్రోహివి కావొచ్చు.

507
00:36:04,985 --> 00:36:05,905
సరే.

508
00:36:07,705 --> 00:36:09,865
మనం జట్టు అయితే, స్వతంత్రంగా ఉందాం.

509
00:36:10,665 --> 00:36:12,025
మన ఇంటితో మొదలుపెట్టి.

510
00:36:18,025 --> 00:36:19,265
నీకు కావాల్సింది ఎంచుకో.

511
00:36:44,105 --> 00:36:45,265
హే...

512
00:36:46,625 --> 00:36:47,745
హాయ్.

513
00:36:48,305 --> 00:36:49,505
ఎలా ఉంది?

514
00:36:50,265 --> 00:36:52,185
-బాగుంది.
-బాగుందా?

515
00:36:53,785 --> 00:36:55,305
ఎన్ని రోజులుగా ఇక్కడున్నాను?

516
00:36:55,905 --> 00:36:57,265
నాలుగు రోజులు.

517
00:37:01,425 --> 00:37:03,745
నాకేం ఇచ్చారు?

518
00:37:03,865 --> 00:37:06,225
నా మీది నుంచి రైలు పోయినట్లుంది.

519
00:37:06,265 --> 00:37:07,385
నీకేం బాగాలేదు.

520
00:37:07,465 --> 00:37:09,305
చాలా మత్తుమందులు ఇచ్చారు.

521
00:37:12,105 --> 00:37:13,905
-రక్తం విషయంగానా?
-కాదు.

522
00:37:13,985 --> 00:37:15,745
నీ లుకేమియా అదుపులో ఉంది.

523
00:37:16,385 --> 00:37:19,505
తేలికగా తీసుకోకపోతే
ఈ ఒత్తిడంతా దాన్ని పైకి తెస్తుంది.

524
00:37:19,985 --> 00:37:21,145
హే, హే, హే.

525
00:37:21,225 --> 00:37:22,585
-ఎటెళ్తున్నావు?
-నేను...

526
00:37:22,665 --> 00:37:24,745
-స్ట్రెచ్ చేయాలి.
-లేదు, అవసరం లేదు.

527
00:37:24,865 --> 00:37:27,585
డాక్టర్ వచ్చేవరకు కదలకుండా పడుకో.

528
00:37:27,945 --> 00:37:29,785
మమ్మల్ని చచ్చేంత భయపెట్టావు.

529
00:37:29,905 --> 00:37:31,425
అందుకే ప్రశాంతంగా ఉంటావా?

530
00:37:31,505 --> 00:37:33,305
లేదంటే నన్ను కూడా చేరుస్తారు.

531
00:37:40,185 --> 00:37:41,465
మవాద్‌కు ఏమైంది?

532
00:37:43,665 --> 00:37:45,505
కొత్తగా ఏం లేదు.

533
00:37:49,425 --> 00:37:50,265
మరి ఖాలిద్?

534
00:37:51,465 --> 00:37:52,945
ఏం లేదు.

535
00:37:59,265 --> 00:38:01,145
అంతా సర్డుకున్నట్లు కలొచ్చింది.

536
00:38:03,745 --> 00:38:05,505
నాకు ఎవరు సాయం చేసారో తెలుసా?

537
00:38:07,705 --> 00:38:09,025
సీఐఏ.

538
00:38:09,105 --> 00:38:10,265
సీఐఏనా

539
00:38:11,025 --> 00:38:12,265
లేదంటే జీనానా?

540
00:38:15,665 --> 00:38:18,145
మవాద్‌ను అదుపులో పెట్టగలిగేది
వారు మాత్రమే.

541
00:38:20,225 --> 00:38:21,625
హే, ఆమెను చూడు.

542
00:38:21,705 --> 00:38:22,705
నాన్నా.

543
00:38:24,025 --> 00:38:25,145
బంగారం.

544
00:38:25,505 --> 00:38:27,105
నిన్ను కలవడం చాలా బాగుంది.

545
00:38:29,905 --> 00:38:31,265
బాగున్నావు.

546
00:38:31,865 --> 00:38:33,745
-ఎలా ఉన్నావు?
-బాగున్నాను.

547
00:38:34,425 --> 00:38:36,185
భలే భయపెట్టావు.

548
00:38:36,905 --> 00:38:39,105
-నీ తమ్ముడు, చెల్లెలు?
-బాగున్నారు.

549
00:38:39,945 --> 00:38:41,265
అంతా సర్దుకుంటుంది.

550
00:38:41,745 --> 00:38:43,265
నేనెళ్ళి కాఫీ తెస్తాను.

551
00:38:43,305 --> 00:38:44,905
-సరే అమ్మ.
-శాంతంగా ఉండు.

552
00:38:52,105 --> 00:38:53,265
నేను చెప్పేది విను.

553
00:38:54,985 --> 00:38:56,745
అమ్మ పని గురించి మాట్లాడొద్దంది.

554
00:38:56,785 --> 00:38:58,185
నా దగ్గర ఓ ప్లాన్ ఉంది.

555
00:38:58,265 --> 00:38:59,265
ఓహ్ అవునా?

556
00:39:00,945 --> 00:39:02,265
నాన్న, చింతించకు.

557
00:39:03,025 --> 00:39:04,745
ఓస్కార్, నేను దీన్ని సరి చేస్తాం.

558
00:39:07,305 --> 00:39:08,465
నన్ను నమ్ము.

559
00:39:35,105 --> 00:39:35,945
ఇటు రా.

560
00:39:36,745 --> 00:39:37,625
త్వరగా!

561
00:39:38,585 --> 00:39:40,305
ముందుకు చూడు. సరే.

562
00:39:40,745 --> 00:39:42,145
-ఆయుధాలున్నాయా?
-లేవు.

563
00:39:42,225 --> 00:39:43,465
అతడి కాళ్ళు వెతుకు.

564
00:39:44,545 --> 00:39:45,585
కైరో?

565
00:39:46,665 --> 00:39:48,545
ఈజిప్టు ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం.

566
00:39:48,625 --> 00:39:50,705
నేను ఈజిప్టుకు వెళ్లుమని చెప్పలేదు.

567
00:39:51,105 --> 00:39:54,585
ఇజ్రాయెల్ ప్రభుత్వం పీఎల్ఎఫ్‌తో
ఏ ఒప్పందాన్నైనా నిరాకరిస్తుంది.

568
00:39:54,665 --> 00:39:56,225
సున్నిత స్థితిలో పడేస్తుంది.

569
00:39:56,985 --> 00:39:58,665
మేమిక బాధితులు వద్దనుకుంటున్నాం.

570
00:39:58,745 --> 00:40:01,225
అందుకే మధ్యంతర పరిష్కారం చెబుతున్నాం.

571
00:40:01,265 --> 00:40:03,745
నాకు మధ్యంతర పరిష్కారాలు వద్దు.

572
00:40:09,505 --> 00:40:11,785
అన్ని హామీలతో ఒక విమానం.

573
00:40:12,465 --> 00:40:15,305
ఇస్తాంబుల్‌కు వెళ్ళండి,
మీరడిగే ఏ గమ్యస్థానాన్నైనా

574
00:40:15,425 --> 00:40:17,425
గౌరవిస్తామని టర్కీ ప్రభుత్వం మాట.

575
00:40:17,505 --> 00:40:21,145
మేము ఇదంతా పారిపోవడానికి
చేసామని అనుకుంటున్నారా?

576
00:40:22,425 --> 00:40:24,225
ఇదంతా ఎందుకు చేసారో తెలుసు.

577
00:40:24,905 --> 00:40:27,385
ఇజ్రాయెల్ జైలులోని మీ మిత్రులకు
సాయం చేయాలని,

578
00:40:27,865 --> 00:40:29,385
కానీ మీరు వాస్తవికంగా ఉండాలి.

579
00:40:29,665 --> 00:40:32,865
ఏకైక దారి ఏదంటే
ఆ విమానాన్ని తీసుకొని, పారిపోయి,

580
00:40:32,945 --> 00:40:35,745
వారికి సాయం చేయడానికి
మరో దారి వెతుక్కోవడమే.

581
00:40:36,265 --> 00:40:38,785
లేదంటే జైలులో వారితో చేరడం.

582
00:40:42,745 --> 00:40:44,545
ఒక ముసాబిల్ జైలుకు వెళ్లడు.

583
00:40:45,265 --> 00:40:46,265
ఎందుకో తెలుసా?

584
00:40:49,465 --> 00:40:51,865
ఎందుకంటే తను అప్పటికే
చనిపోయినట్లు భావిస్తాడు.

585
00:40:57,465 --> 00:40:59,225
అప్పుడు అది ఇజ్రాయెల్‌కు విజయం.

586
00:40:59,785 --> 00:41:01,305
మీకు కావాల్సింది అదేనా?

587
00:41:01,945 --> 00:41:04,105
మీ ఇష్టం, మి. ఖాలిద్.

588
00:41:05,265 --> 00:41:06,265
నాకర్థం కావట్లేదు.

589
00:41:07,705 --> 00:41:09,305
టూరిస్ట్‌లతో నిండి పోయింది.

590
00:41:10,305 --> 00:41:14,185
వాళ్ళను బాల్కనీల నుండి తోసేయమంటారా?

591
00:41:14,625 --> 00:41:16,105
మీరలా చేస్తే, మిమ్మల్ని

592
00:41:16,865 --> 00:41:18,505
ప్రపంచమంతా ఖండిస్తుంది,

593
00:41:18,585 --> 00:41:20,905
ఇది పాలస్తీనాకు మరింత ఘోరమైనది.

594
00:42:05,065 --> 00:42:07,185
పర్లేదు, జెరోమ్, పర్లేదు.

595
00:42:16,665 --> 00:42:18,545
రానీయ్.

596
00:42:24,225 --> 00:42:25,265
మాట్లాడొచ్చా?

597
00:42:26,265 --> 00:42:29,105
అయితే వాళ్ళు నిన్ను
పంపించాలని తహతహలాడుతున్నారా?

598
00:42:30,145 --> 00:42:31,265
నన్నెవరూ పంపలేదు.

599
00:42:59,065 --> 00:43:00,425
హలో?

600
00:43:00,865 --> 00:43:03,225
-చావుకు దగ్గరైన వాడిలా లేదే నీ గొంతు.
-ఖాలిద్.

601
00:43:03,265 --> 00:43:05,025
నాకు మోంజెర్ చెప్పాడు

602
00:43:05,465 --> 00:43:07,505
నన్ను ఒప్పించగలవా అని చూడాలని

603
00:43:07,585 --> 00:43:09,145
అతడనుకునేలా చేసావని.

604
00:43:09,225 --> 00:43:10,305
లేదు, సోదరా.

605
00:43:10,425 --> 00:43:12,745
చాలా ఇబ్బందిలో ఉన్నాను.
నేను చెప్పేది విను.

606
00:43:12,865 --> 00:43:14,785
వాళ్ళను విడిపించు.

607
00:43:14,905 --> 00:43:17,105
వారు చర్చించాలనుకోవడం లేదు, లియో.

608
00:43:17,625 --> 00:43:19,385
వాళ్ళను చంపినా పట్టించుకోరు.

609
00:43:19,465 --> 00:43:21,065
దయచేసి అలా చేయొద్దు.

610
00:43:22,465 --> 00:43:25,505
అది నాపై కాదు, వలసపాలనకు గురైన,
స్థానభ్రంశం చెందిన

611
00:43:25,585 --> 00:43:27,185
పాలస్తీనా వారిపైనే ఆధారం.

612
00:43:27,265 --> 00:43:29,225
లేదు, ఖాలిద్. అది నీపై ఆధారపడింది.

613
00:43:29,305 --> 00:43:31,025
భాగం కావాలని నిర్ణయించావు.

614
00:43:31,105 --> 00:43:32,105
ఈ ఎంపిక నీదే.

615
00:43:32,425 --> 00:43:34,185
ఎందుకంటే నేనొక మాట ఇచ్చాను.

616
00:43:34,265 --> 00:43:37,665
ఖాలిద్, నువ్వు పిచ్చోడివి కాదు, యోధుడివి.

617
00:43:37,745 --> 00:43:39,985
ఇదొక ఆపరేషన్, బలిదానం కాదు.

618
00:43:40,065 --> 00:43:42,225
అది తప్పుగా జరిగుంటే, వెనక్కి వెళ్ళు.

619
00:43:42,905 --> 00:43:43,865
తెలుసా, లియో?

620
00:43:45,945 --> 00:43:49,425
ఐదు రోజులుగా ఇక్కడున్నాను,
ఎవరూ నాకు మద్దతు ఇవ్వడానికి ఫోన్ చేయలేదు.

621
00:43:51,985 --> 00:43:55,105
సాయం అడగడానికే చేసారు.

622
00:43:55,185 --> 00:43:56,945
ఖాలిద్...

623
00:43:57,025 --> 00:43:58,585
నిన్ను నిందించడం లేదు, లియో.

624
00:43:59,185 --> 00:44:00,625
నువ్వు హాస్పిటల్‌లో ఉన్నావు.

625
00:44:01,185 --> 00:44:03,985
కానీ నాకున్న అంతమంది స్నేహితులలో...

626
00:44:05,785 --> 00:44:06,825
ఎవరూ చేయలేదు.

627
00:44:11,905 --> 00:44:13,385
ఇవి విచిత్రమైన కాలాలు.

628
00:44:14,225 --> 00:44:16,545
ద్రోహులు మరియు కపటుల కాలాలు.

629
00:44:18,145 --> 00:44:19,465
నీకొకటి తెలుసా, లియో?

630
00:44:20,465 --> 00:44:22,185
నేను ద్రోహిని కాదు

631
00:44:23,585 --> 00:44:25,025
అలాగని కపటుడిని కాదు.

632
00:44:25,785 --> 00:44:27,305
పిచ్చోడివి కూడా కాదు.

633
00:44:48,025 --> 00:44:49,745
లియో హాస్పిటల్‌లో ఉన్నాడు.

634
00:44:50,465 --> 00:44:53,305
ఈ యుద్ధంలో అతడు చనిపోతే, హ్యూగోను ఆపలేం.

635
00:44:54,705 --> 00:44:56,625
-వాడొక ఆకతాయి.
-అవును.

636
00:44:57,145 --> 00:44:58,185
వాడొక ఆకతాయి.

637
00:44:58,865 --> 00:45:01,105
తుపాకీ పట్టుకున్న గుడ్డివాడి లాంటోడు కూడా.

638
00:45:01,185 --> 00:45:03,185
తనకు వ్యాపారం వారసత్వంగా రావచ్చు.

639
00:45:03,945 --> 00:45:06,505
వారిని ఒకటి, రెండు, ఐదు మిలియన్లు,
నీకు కావలసినంత

640
00:45:06,585 --> 00:45:08,225
ఇవ్వుమని పట్టుబట్టవచ్చు.

641
00:45:08,665 --> 00:45:10,185
అది వారిని అవమానించినట్లే.

642
00:45:12,145 --> 00:45:14,705
దీనంతటిలో నువ్వు ఎవరి ప్రతినిధివి?

643
00:45:16,465 --> 00:45:17,665
సారా?

644
00:45:18,065 --> 00:45:19,465
నేను నా ప్రతినిధినే.

645
00:45:20,225 --> 00:45:21,585
నువ్వెవరు?

646
00:45:21,665 --> 00:45:24,625
మాడ్రిడ్‌కు చెందిన
ఏరోబిక్స్ ఇన్‌స్ట్రక్టర్‌వా?

647
00:45:28,145 --> 00:45:29,265
మీ మిత్రుడిని కావచ్చు.

648
00:45:34,145 --> 00:45:35,945
నాకు మిత్రులు వద్దు.

649
00:45:38,905 --> 00:45:40,985
ఈసారి ఎవరైనా ఇరానియన్ మిమ్మల్ని వదిలేసి

650
00:45:41,065 --> 00:45:43,185
వెళ్ళినపుడు నేను మిమ్మల్ని కాపాడితే?

651
00:45:43,585 --> 00:45:45,385
నాపామ్ కోసం గొడవ పడే బదులు,

652
00:45:45,465 --> 00:45:47,225
మనం లాభాన్ని పంచుకుందాం.

653
00:45:48,585 --> 00:45:50,585
నీకు అట్లాంటి అధికారం లేదు.

654
00:45:51,305 --> 00:45:52,745
కానీ పొందగలను

655
00:45:53,265 --> 00:45:54,425
మీరు సాయం చేస్తే.

656
00:46:13,305 --> 00:46:15,545
ఈ పేర్ల వాళ్ళు నాతో రండి.

657
00:46:16,465 --> 00:46:17,985
రోసానా లోపెజ్.

658
00:46:20,025 --> 00:46:20,905
అక్కడికి.

659
00:46:21,985 --> 00:46:24,025
గ్రెగోరియా అలోన్సో.

660
00:46:26,985 --> 00:46:27,985
వెళ్ళు.

661
00:46:28,905 --> 00:46:29,785
కదులు!

662
00:46:31,545 --> 00:46:32,985
రూబెన్ నొతారియో.

663
00:46:35,345 --> 00:46:37,185
అక్కడ. వెళ్ళు.

664
00:46:38,665 --> 00:46:40,145
జోన్ వరెల్లాస్.

665
00:46:47,425 --> 00:46:50,625
బందీలను క్రమంగా విడుదల చేసేందుకు

666
00:46:50,705 --> 00:46:53,385
ఒప్పందం కుదిరినట్లు కనిపిస్తోంది.

667
00:46:53,465 --> 00:46:56,145
స్పానిష్ కుటుంబాలను మొదట విడుదల చేసారు,

668
00:46:56,225 --> 00:47:00,625
కిడ్నాపర్లు మధ్యప్రాచ్యానికి
బయలుదేరే ముందు.

669
00:47:01,185 --> 00:47:03,025
చర్చల వివరాలను

670
00:47:03,105 --> 00:47:05,625
మరికొద్ది గంటల్లో బహిరంగపరుస్తారు.

671
00:47:05,705 --> 00:47:08,465
వాషింగ్టన్‌లో వైట్ హౌస్
పీఎఫ్ఎల్‌పీ టెర్రరిస్టులకు

672
00:47:08,545 --> 00:47:11,105
రక్షణనిచ్చే ఏ ఒప్పందాన్ని అయినా

673
00:47:11,185 --> 00:47:13,825
తాము అంగీకరించమని ప్రకటించింది.

674
00:47:36,585 --> 00:47:38,185
చూడు, అక్కడున్నారు.

675
00:47:42,585 --> 00:47:43,985
నా చిట్టి తల్లి.

676
00:47:45,345 --> 00:47:46,465
తాన్యా!

677
00:47:47,505 --> 00:47:50,185
-ఆయనింకా బలహీనంగా ఉన్నాడు.
-నా బుజ్జీ.

678
00:47:50,265 --> 00:47:51,545
ఎలా ఉన్నావు, నాన్న?

679
00:47:51,625 --> 00:47:54,585
షేక్ హ్యాండ్ ఎందుకు? ముద్దివ్వు.

680
00:47:55,385 --> 00:47:56,545
అందగాడా.

681
00:47:57,145 --> 00:47:58,705
ఎప్పుడు వస్తావా అని చూశాను.

682
00:47:58,785 --> 00:48:00,065
నేను కూడా, బంగారం.

683
00:48:03,065 --> 00:48:04,185
ఎలా ఉన్నారు, లియో?

684
00:48:05,425 --> 00:48:07,105
కార్మెన్ చెప్పింది

685
00:48:07,665 --> 00:48:09,185
మవాద్‌తో నీ డీల్ గురించి.

686
00:48:09,625 --> 00:48:10,665
50,000 డాలర్లు.

687
00:48:11,465 --> 00:48:14,145
పూర్తిగా లాంఛనం,
అలా మొత్తం విషయాన్ని మరచిపోయేలా.

688
00:48:14,225 --> 00:48:15,905
-మవాద్ ఎప్పుడూ మర్చిపోడు.
-నాన్న.

689
00:48:15,985 --> 00:48:18,745
ముఖ్య విషయమేమిటంటే
మన మధ్య ఇక అపార్థాలు లేవు.

690
00:48:19,185 --> 00:48:20,625
వాటిని ఎలా నివారించాలి?

691
00:48:21,265 --> 00:48:24,145
నేను మధ్యవర్తిగా ఉండగలను,
మీరు అనుమతిస్తే.

692
00:48:24,265 --> 00:48:26,025
తనతో కాఫీ తాగాల్సి వస్తే,

693
00:48:26,105 --> 00:48:27,825
తాగుతాను, ఏం పర్లేదు.

694
00:48:27,905 --> 00:48:29,985
తను మవాద్‌కు మన డైరెక్ట్ లైన్‌గా ఉంటాడు.

695
00:48:30,065 --> 00:48:31,465
మనకు వేరే దారి లేదు.

696
00:48:32,745 --> 00:48:34,625
తను అది మాత్రమే చేసినంత కాలం.

697
00:48:35,185 --> 00:48:36,225
ఏమైంది?

698
00:48:36,305 --> 00:48:37,585
నన్ను నమ్మరా?

699
00:48:38,785 --> 00:48:40,265
ఎందుకు నమ్మడు?

700
00:48:40,345 --> 00:48:42,545
ఆయనకు తన మొదటి మనుమడిని ఇస్తున్నావు.

701
00:48:45,625 --> 00:48:47,625
-ఏంటి?
-అవును నిజమే.

702
00:48:48,305 --> 00:48:49,345
నిజంగానా?

703
00:48:51,345 --> 00:48:52,905
అద్భుతమైన విషయం!

704
00:48:53,945 --> 00:48:55,305
అత్తగారు.

705
00:49:00,785 --> 00:49:02,665
ఏడవడం మొదలుపెట్టకు సరేనా?

706
00:49:02,745 --> 00:49:04,745
ఈ రాత్రి డాన్ కార్లోస్‌లో తిందాం.

707
00:49:04,825 --> 00:49:06,945
వేడుక చేసుకోవడానికి. నాదే పార్టీ.

708
00:49:07,865 --> 00:49:08,745
హ్యూగో.

709
00:51:22,305 --> 00:51:24,305
సబ్‌టైటిల్ అనువాద కర్త ఎన్. సుజాత దేవి

710
00:51:24,385 --> 00:51:26,385
క్రియేటివ్ సూపర్‌వైజర్
నల్లవల్లి రవిందర్ రెడ్డి

