1
00:00:09,345 --> 00:00:11,105
ఇది కాలిఫోర్నియా కాదు.

2
00:00:12,625 --> 00:00:14,545
ఇది న్యూయార్క్ కాదు.

3
00:00:16,065 --> 00:00:17,345
ఇది లండన్ కాదు.

4
00:00:18,825 --> 00:00:20,625
ఇది మార్బెలా.

5
00:00:25,105 --> 00:00:27,905
ఎట్టకేలకు ఏరోబిక్స్
కోస్టా డెల్ సోల్‌లో ప్రవేశించింది.

6
00:00:29,225 --> 00:00:30,745
పట్టించుకోలేదని విసిగిపోయావా?

7
00:00:30,825 --> 00:00:32,705
యంత్రాలు, బరువులతో ఇబ్బందిపడటంతోనా?

8
00:00:34,065 --> 00:00:39,185
ఫలించని లేదా రెచ్చగొట్టని
ఒంటరి వర్కవుట్‌లతో విసిగి పోయారా?

9
00:00:39,625 --> 00:00:42,305
మొత్తం శిక్షణ ఇక్కడ ఉంది.

10
00:00:43,265 --> 00:00:45,865
కాండోంగా క్లబ్‌కు స్వాగతం,

11
00:00:45,945 --> 00:00:50,025
స్పెయిన్‌లోని అత్యంత ప్రత్యేకమైన
ప్రాంతంలోని ఉత్తమ జిమ్.

12
00:00:50,105 --> 00:00:54,185
రండి, సరదాగా గడిపి,
మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి.

13
00:00:54,865 --> 00:00:55,865
ఈ రోజు నుండి,

14
00:00:55,945 --> 00:00:58,465
పుయెర్తో బానూస్‌లో
మీ శరీరంతో అపాయింట్మెంట్ ఉంది.

15
00:00:59,545 --> 00:01:01,465
కాండోంగా క్లబ్‌లో మాతో చేరండి!

16
00:01:03,425 --> 00:01:04,385
కట్!

17
00:01:06,225 --> 00:01:10,265
లోస్ ఫరాద్

18
00:01:54,465 --> 00:01:56,585
తను ఇక్కడేం చేస్తోంది?
ఏం చెప్పాను?

19
00:01:56,665 --> 00:01:58,385
డబ్బులిచ్చే వరకు రికార్డ్ చేయలేదు.

20
00:02:00,425 --> 00:02:01,425
సెషన్ రద్దయింది.

21
00:02:01,985 --> 00:02:03,585
-ఏంటి?
-డబ్బులివ్వనందుకు.

22
00:02:03,665 --> 00:02:05,225
నీకు ఈ ఉదయం వరకు ఉందన్నాను.

23
00:02:05,305 --> 00:02:06,625
నా మేనేజర్ నిన్న కట్టాడు.

24
00:02:06,705 --> 00:02:08,145
జెతో మాట్లాడావుగా, గాబీ.

25
00:02:08,225 --> 00:02:09,825
అవును. ఒట్టు తను కట్టాడు.

26
00:02:09,905 --> 00:02:11,705
అతనికి కాల్ చేయి, ఛ.

27
00:02:11,785 --> 00:02:13,945
క్షమించు, తాన్యా స్టూడియో ఖాళీ చేయాలి.

28
00:02:14,025 --> 00:02:15,705
నిజంగా బదిలీ చేశాము.

29
00:02:15,785 --> 00:02:17,465
8 గంటల రికార్డింగ్ బాకీ ఉన్నారు.

30
00:02:17,545 --> 00:02:18,705
కాదు, ఐదు.

31
00:02:18,825 --> 00:02:20,545
పోయిన నెల మూడింటి సంగతి?

32
00:02:24,265 --> 00:02:26,185
చెడిపోయిన పిల్ల.

33
00:02:28,705 --> 00:02:31,065
పూర్తి చేయనీ, నా సొంత డబ్బుతో కడతాను.

34
00:02:31,545 --> 00:02:32,545
ఇది బార్ కాదు.

35
00:02:32,625 --> 00:02:34,505
ఒక్క పాటనే.

36
00:02:34,545 --> 00:02:35,985
నాకు ప్రతి గంట ఎంతవుతుంది?

37
00:02:36,945 --> 00:02:38,705
నీ 80,000 పెసెటాలు కావాలి కదా?

38
00:02:38,825 --> 00:02:41,345
కంగారుపడకు, ఇప్పుడే తెస్తాను.

39
00:02:41,425 --> 00:02:42,345
సంగీతకారులు వద్దు.

40
00:02:42,425 --> 00:02:44,825
లేదు, సంగీతకారులు నేనొచ్చేవరకు ఉంటారు.

41
00:02:44,905 --> 00:02:46,065
ఇక్కడే ఉంటారు.

42
00:02:48,265 --> 00:02:49,265
ఫోన్ ఎత్తడం లేదు.

43
00:02:49,345 --> 00:02:51,305
ఎత్తడులే. నన్ను ఇంటికి తీసుకెళ్ళు.

44
00:03:51,905 --> 00:03:55,065
ప్రస్తుత స్థితి
దీర్ఘకాలిక మైలోయిడ్ లుకేమియా

45
00:04:10,145 --> 00:04:12,345
అవి చురుకుగా ఉన్నట్లు కనిపించట్లేదు.

46
00:04:12,425 --> 00:04:13,905
ఇందాకే తిన్నాయి కదా, ఛ.

47
00:04:13,985 --> 00:04:16,905
-మిగిలిపోయినవి తీసుకొను.
-ఎప్పుడైనా ఫిర్యాదులున్నాయా?

48
00:04:16,985 --> 00:04:18,585
ఓసారి శుక్లాలు ఉన్నది ఇచ్చావు.

49
00:04:18,665 --> 00:04:20,905
అవి శుక్లాలు కాదు,
అది నిన్ను బెదిరించింది.

50
00:04:23,265 --> 00:04:25,585
చూడు, ఇది నా దగ్గర ఉన్నవాటిల్లో మంచిది.

51
00:04:25,665 --> 00:04:27,105
వచ్చే నెల పులి వస్తోంది.

52
00:04:27,185 --> 00:04:29,305
-పులా?
-ఔను, పోర్చుగీస్ సర్కస్ నుండి.

53
00:04:29,345 --> 00:04:31,265
నాకిది ఇప్పుడే కావాలి, కుర్రో.

54
00:04:31,345 --> 00:04:33,025
అలా అయితే ఒకటి ఎంచుకోండి.

55
00:04:37,465 --> 00:04:39,225
లియో! మీ శ్రీమతి!

56
00:04:41,705 --> 00:04:44,545
తనకు ఆ పేపర్లు ఎలా దొరికాయి?

57
00:04:44,625 --> 00:04:46,705
నీ మనసులో చాలా విషయాలు ఉన్నాయి.

58
00:04:46,785 --> 00:04:49,625
వ్యాధికి సంబంధించిన ఏదైనా
ఆఫీసులో ఉంచమని చెప్పానుగా.

59
00:04:49,705 --> 00:04:51,985
ఇక ఆపు. ఇప్పుడేం చేద్దాం?

60
00:04:52,025 --> 00:04:53,785
మాట్లాడు. తనతో మాట్లాడు.

61
00:04:53,865 --> 00:04:55,545
ఎప్పుడు మాట్లాడాలి?

62
00:04:55,625 --> 00:04:57,705
మోంజెర్ వస్తాడు.
అన్నీ ఏర్పాటు చేయాలి.

63
00:04:57,785 --> 00:05:00,985
సరే, అలా అయితే నేను మాడ్రిడ్‌కు వెళ్తాను.

64
00:05:01,345 --> 00:05:02,825
సారా, హ్యూగోను తీసుకెళ్ళు.

65
00:05:05,785 --> 00:05:06,785
కొట్లాడతారు.

66
00:05:06,865 --> 00:05:09,425
కొట్లాడనివ్వు.
వారికి వీలునామా చూపించు అంతే.

67
00:05:09,905 --> 00:05:13,145
సరే, అలా అయితే సారా మీతో పాటు వేటకు రాదు.

68
00:05:13,225 --> 00:05:15,105
పర్లేదు, ఓస్కార్‌ను తీసుకెళ్తాను.

69
00:05:16,625 --> 00:05:17,985
వాళ్ళకు ఏం చెప్పాలి?

70
00:05:20,625 --> 00:05:21,865
నాకు నయమైందని చెప్పు.

71
00:05:22,665 --> 00:05:24,025
లియో...

72
00:05:24,105 --> 00:05:26,745
ఇంకేమైనా చెప్పావో, గందరగోళం అవుతుంది.

73
00:05:26,825 --> 00:05:29,145
వాళ్లతో మాట్లాడు, నువ్వు అందులో దిట్టవు.

74
00:05:29,225 --> 00:05:31,385
నేను తిరిగొచ్చాక, కుటుంబమంతా సమావేశమవుదాం.

75
00:05:32,385 --> 00:05:34,025
నేనేం చేస్తానో తెలుసా, లియో?

76
00:05:35,225 --> 00:05:36,585
ఆడదాన్ని తీసుకుంటాను.

77
00:05:44,265 --> 00:05:45,865
మాడ్రిడ్? ఎప్పటి వరకు?

78
00:05:45,985 --> 00:05:46,905
నాకు తెలియదు.

79
00:05:47,705 --> 00:05:50,465
ఒకట్రెండు రోజులు.
తాన్యా సంక్షోభాలు అంతసేపే ఉండేది.

80
00:05:50,545 --> 00:05:52,865
మీ నాన్నతో వేట ప్రయాణం సంగతేంటి?

81
00:05:52,945 --> 00:05:54,065
ఆయనతో నువ్వెళ్ళు.

82
00:05:54,145 --> 00:05:56,145
అలా మీరు దగ్గరవొచ్చు.

83
00:05:56,225 --> 00:05:58,905
దాని కోసం మేము వేటకు వెళ్లనవసరం లేదు.

84
00:06:08,025 --> 00:06:09,625
మా నాన్నకు క్యాన్సర్ ఓస్కార్.

85
00:06:16,505 --> 00:06:18,065
మా తమ్ముడికి, చెల్లికి తెలియదు.

86
00:06:19,145 --> 00:06:20,705
అందుకే మాడ్రిడ్ వెళ్తున్నాం.

87
00:06:25,825 --> 00:06:26,865
ఆయన చనిపోతాడా?

88
00:06:27,785 --> 00:06:28,985
లుకేమియా.

89
00:06:29,905 --> 00:06:33,785
ఎప్పటి నుంచో ఉన్నట్లనిపిస్తుంది,
బహుశా 20 ఏళ్ళు ఉండవచ్చు.

90
00:06:35,745 --> 00:06:37,065
ఇరవై ఏళ్ళు,

91
00:06:38,265 --> 00:06:39,185
లేదా ఒక నెల.

92
00:06:42,185 --> 00:06:43,905
ఆయన కూడా మాడ్రిడ్‌కు వెళ్లొద్దా?

93
00:06:44,865 --> 00:06:46,505
ఆ వేట పర్యటన ముఖ్యమైనది.

94
00:06:48,545 --> 00:06:50,065
తన ప్రధాన భాగస్వామి వస్తాడట.

95
00:06:50,945 --> 00:06:51,945
మోంజెర్ అల్ అసద్.

96
00:06:52,425 --> 00:06:54,305
అంటే వారు ఒప్పందం కుదుర్చుకుంటారు.

97
00:06:54,385 --> 00:06:55,865
నేనెందుకు వెళ్తున్నాను?

98
00:06:55,945 --> 00:06:57,385
ఆయన సామాను మోయడానికా?

99
00:06:57,465 --> 00:06:58,865
ఆయన మోయుమంటే మోయు.

100
00:07:02,225 --> 00:07:03,865
ముఖ్యమైన వ్యక్తులను కలుస్తావు,

101
00:07:04,345 --> 00:07:05,585
అవకాశాలను తెరిచేవారిని.

102
00:07:06,465 --> 00:07:09,545
అందుకే నువ్వు అక్కడ ఉండాలి,
వాళ్ళు నిన్ను చూడగలిగేలా.

103
00:07:12,105 --> 00:07:13,545
నాపామ్ విషయం బాగుండింది,

104
00:07:14,305 --> 00:07:15,625
కానీ మా నాన్న అంటాడు

105
00:07:15,705 --> 00:07:19,425
వేటకు వెళ్ళడం వలన నీ భాగస్వామి ఎవరని
తెలుసుకునే అవకాశముంటుందని.

106
00:07:25,265 --> 00:07:26,345
నీ బాయ్‌ఫ్రెండ్?

107
00:07:26,665 --> 00:07:27,905
నాన్నతో వెళ్తున్నాడు.

108
00:07:29,585 --> 00:07:30,745
ఏం మాట్లాడుతున్నావు?

109
00:07:32,305 --> 00:07:33,625
నిజంగానా?

110
00:07:34,385 --> 00:07:36,425
ఇది ఓస్కార్‌కు సంబంధించినది కాదు.

111
00:07:53,625 --> 00:07:57,225
సాల్వట్ మెడిసిన్

112
00:07:57,345 --> 00:07:58,585
లుకేమియా

113
00:08:19,065 --> 00:08:19,945
అది ఏంటి?

114
00:08:22,585 --> 00:08:24,905
-300 కిలోల సింహం.
-వాయబ్బో.

115
00:08:25,865 --> 00:08:27,505
ఇదేమో నేను

116
00:08:28,385 --> 00:08:32,065
యాంఫేటమిన్‌లను ఎక్కించబోతున్న డార్ట్.

117
00:08:32,145 --> 00:08:33,345
దేని కొరకు?

118
00:08:33,385 --> 00:08:34,705
దాన్ని పనిచేయించడానికి.

119
00:08:35,865 --> 00:08:37,465
దానికి యాంఫేటమిన్లు ఇస్తున్నారా?

120
00:08:37,545 --> 00:08:40,945
అవును, ఆరు గంటలకో షాట్,
దాంతో అది పేరుకుపోయి,

121
00:08:40,985 --> 00:08:42,865
రేపు అది చెలరేగి పోతుంది.

122
00:08:42,985 --> 00:08:45,825
-మంచి ఆలోచన.
-నా కూతురు చెప్పలేదా?

123
00:08:45,865 --> 00:08:47,185
దేని గురించి?

124
00:08:47,745 --> 00:08:49,825
సింహం మనతో పాటు వేటకు వస్తోంది అని.

125
00:08:50,825 --> 00:08:53,345
తీసుకో. దాన్ని వెనుక భాగంలో కాల్చు.

126
00:08:54,305 --> 00:08:55,145
ఏంటి?

127
00:08:55,225 --> 00:08:57,345
వెనుక భాగంలో, కింద, కాల్చు.

128
00:08:58,425 --> 00:09:00,265
నేను ఏనాడూ తుపాకీ పేల్చలేదు.

129
00:09:00,345 --> 00:09:02,945
ఫెయిర్‌గ్రౌండ్ రైఫిల్‌లాగా
ట్రిగ్గర్‌ లాగితే చాలు.

130
00:09:02,985 --> 00:09:03,985
అలాగే.

131
00:09:04,105 --> 00:09:06,305
-ఎక్కడో ఒక చోట ప్రారంభించాలి.
-అవును.

132
00:09:36,865 --> 00:09:38,865
-సారా, బుజ్జి.
-చెప్పు?

133
00:09:38,985 --> 00:09:40,745
ఒక విషయం అడుగుతాను,

134
00:09:41,105 --> 00:09:42,985
నీ చెల్లెలితో ఓపికగా ఉండు.

135
00:09:46,825 --> 00:09:49,545
ఆ డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో
తాన్యాకు ఎలా తెలిసింది?

136
00:09:50,985 --> 00:09:52,945
ఇప్పుడది ముఖ్యం కాదు.

137
00:09:52,985 --> 00:09:54,625
కలిసి ఉండడం ముఖ్యం.

138
00:09:56,825 --> 00:09:58,465
ఎవరూ బాధపడకుండా ఉండడానికి.

139
00:09:58,545 --> 00:10:00,745
నాన్న చనిపోతారని
నాకు అనుకోకుండా తెలిసింది!

140
00:10:00,865 --> 00:10:02,505
-నాన్న పోతారా?
-ఎవ్వరు పోరు.

141
00:10:02,585 --> 00:10:04,145
ఇది ఏం చెప్తుంది?

142
00:10:04,865 --> 00:10:07,625
"క్రానిక్ మైలోయిడ్ లుకేమియా,"
బుజ్జి. దీర్ఘకాలికమైనది.

143
00:10:07,945 --> 00:10:09,465
అంటే తీవ్రమైనది కాదు అని.

144
00:10:11,225 --> 00:10:12,865
సారా, నీకు తెలుసా?

145
00:10:14,225 --> 00:10:15,265
నాకు తెలుసు.

146
00:10:15,345 --> 00:10:17,745
చెకప్‌లకు నాన్నతో కలిసి వెళ్ళేదాన్ని.

147
00:10:17,865 --> 00:10:19,825
మాడ్రిడ్‌లో ఆ పార్టీ ఎందుకు చేశామని?

148
00:10:21,465 --> 00:10:23,065
ఆయన పుట్టినరోజు కోసం కాదా?

149
00:10:23,425 --> 00:10:24,705
కేక్ అందుకే, కానీ

150
00:10:24,745 --> 00:10:27,545
300 మంది అతిథులను పిలవడానికి కారణం ఉంది.

151
00:10:27,625 --> 00:10:30,345
నాన్నకు నయమైంది,
పెద్దగా జరుపుకోవాలనుకున్నారు.

152
00:10:31,865 --> 00:10:32,985
నమ్మశక్యంగా లేదు.

153
00:10:33,105 --> 00:10:35,185
నాన్నకు టెర్మినల్ క్యాన్సర్ ఉంటే

154
00:10:35,265 --> 00:10:36,865
అభిమాన కూతురుకు మాత్రమే తెలుసు.

155
00:10:36,945 --> 00:10:39,105
నాన్న వద్దనుకున్నది ఈ సీనే.

156
00:10:39,185 --> 00:10:41,225
ఏ సీన్?

157
00:10:41,545 --> 00:10:43,305
ఎందుకంటే మేము కూడా తన పిల్లలమే.

158
00:10:43,385 --> 00:10:45,385
హ్యూగో, దయచేసి. ఇంక చాలు.

159
00:10:45,865 --> 00:10:46,865
నాన్న ఇక్కడ ఉండాలి.

160
00:10:46,985 --> 00:10:49,505
-మోంజెర్‌ను కలుస్తున్నాడు.
-హా. సారా ఫ్రెండ్‌తో.

161
00:10:50,265 --> 00:10:51,705
జరిగేది స్పష్టంగా ఉంది.

162
00:10:51,745 --> 00:10:52,945
ఏది స్పష్టంగా ఉంది?

163
00:10:53,425 --> 00:10:54,945
నీ స్థానం పదిలం చేసుకునే తీరు.

164
00:10:54,985 --> 00:10:56,385
ఎవరూ తమను పదిలం చేసుకోరు.

165
00:10:56,465 --> 00:10:57,665
-నిజంగానా?
-కాదు.

166
00:10:59,185 --> 00:11:02,665
తాన్యా, నేను తెలివిలేని వాళ్ళమని
అనుకుంటున్నావా, సారా?

167
00:11:03,305 --> 00:11:05,945
మాడ్రిడ్ ప్రియుడిని గొప్పగా పరిచయం చేసి

168
00:11:06,025 --> 00:11:08,185
ఆఫ్రికా వ్యాపార విహారానికి తీసుకెళ్తుంది

169
00:11:08,265 --> 00:11:09,465
నాన్న చనిపోయేటప్పుడు.

170
00:11:09,545 --> 00:11:11,425
లియో ఫరాద్ చనిపోడు!

171
00:11:14,865 --> 00:11:17,465
ఎలాంటి చికిత్స కూడా అవసరం లేదు.

172
00:11:17,545 --> 00:11:19,985
జబ్బు తిరగబెట్టకుండా జాగ్రత్తగా ఉంటే చాలు.

173
00:11:20,065 --> 00:11:23,385
డాక్టర్లు స్పష్టంగా చెప్పారు.
తను సాధారణ జీవితాన్ని గడపొచ్చు.

174
00:11:26,825 --> 00:11:28,905
అంటే లుకేమియా చికెన్ పాక్స్ లాగానా?

175
00:11:28,985 --> 00:11:30,385
తెలివి లేకుండా మాట్లాడకు.

176
00:11:30,465 --> 00:11:31,305
బంగారు.

177
00:11:32,825 --> 00:11:34,985
ఇది చికెన్ పాక్స్ కాదు.

178
00:11:35,665 --> 00:11:37,305
అది ఇబ్బంది పెట్టే అవకాశముంది.

179
00:11:37,385 --> 00:11:39,505
అంటే నీ కూతురి పక్షం ఉంటావన్నమాట.

180
00:11:39,585 --> 00:11:41,625
ఎవ్వరూ ఎవరి పక్షం తీసుకోవడం లేదు.

181
00:11:41,705 --> 00:11:42,545
వట్టి మాటలే.

182
00:11:42,625 --> 00:11:43,905
మాటలు కాదు.

183
00:11:46,305 --> 00:11:47,625
అది వీలునామాలో ఉంది.

184
00:11:55,105 --> 00:11:56,225
ఏ వీలునామా?

185
00:12:00,945 --> 00:12:04,145
అంతా స్పష్టంగా ఉండాలని
మీ నాన్న కొన్ని వారాల కిందటే రాసాడు.

186
00:12:04,225 --> 00:12:05,345
తాన్యా.

187
00:12:06,385 --> 00:12:07,225
హ్యూగో.

188
00:12:08,785 --> 00:12:10,265
ఇప్పుడు వద్దు, సారా.

189
00:12:10,345 --> 00:12:12,345
మీ గదులలో ప్రశాంతంగా చదువుకోండి.

190
00:12:13,025 --> 00:12:14,705
ఇది చాలా పెద్ద డాక్యుమెంట్,

191
00:12:14,785 --> 00:12:16,465
దయచేసి ఎలాంటి వాదనలు వద్దు.

192
00:12:17,025 --> 00:12:18,025
అర్థం అయిందా?

193
00:12:19,505 --> 00:12:20,745
చాలా బాగా.

194
00:12:34,225 --> 00:12:36,905
నీ ఊపిరి బిగపట్టు.

195
00:12:36,985 --> 00:12:39,385
నీ చూపుడు వేలును మెల్లగా కదిలించు.

196
00:12:40,585 --> 00:12:42,345
షాట్‌తో నువ్వు ఆశ్చర్యపోవాలి.

197
00:12:45,665 --> 00:12:46,905
అద్భుతం.

198
00:12:46,985 --> 00:12:48,065
మళ్ళీ.

199
00:12:51,745 --> 00:12:53,905
మేలు. చూసావా? అంత కష్టమేం కాదు.

200
00:12:54,785 --> 00:12:57,225
హే లియో, జనం సాధారణంగా రైఫిల్ ఉపయోగించరా

201
00:12:57,305 --> 00:12:58,865
-వేటలో?
-నాకు గురి చేయొద్దు.

202
00:12:58,945 --> 00:13:01,025
హా, సరే. క్షమించండి.

203
00:13:01,905 --> 00:13:04,385
మోంజెర్ అల్ అసద్‌కు
కలాష్నికోవ్‌లు అంటే ఇష్టం.

204
00:13:04,985 --> 00:13:07,585
ఒకరికొకరం 20 ఏళ్ళుగా తెలుసు, కుటుంబంలాగా.

205
00:13:07,665 --> 00:13:09,145
తనకు సారా అంటే చాలా ఇష్టం.

206
00:13:09,225 --> 00:13:12,545
తనకు నాపామ్ గురించి చెప్పాక,
నిన్ను తీసుకురమ్మని చెప్పాడు.

207
00:13:12,625 --> 00:13:13,865
అబ్బో, ధన్యవాదాలు.

208
00:13:13,945 --> 00:13:15,025
-సరే, కాల్చు.
-సరే.

209
00:13:21,305 --> 00:13:22,945
మళ్ళీ. కాల్చు.

210
00:13:25,225 --> 00:13:27,145
నువ్వు శ్వాసను నియంత్రించడం లేదు.

211
00:13:27,225 --> 00:13:29,185
చూడు. జరుగు.

212
00:13:32,105 --> 00:13:34,025
క్రమశిక్షణ,

213
00:13:34,105 --> 00:13:36,905
ప్రశాంతత, చాలా ఓపిక అవసరం.

214
00:13:43,465 --> 00:13:44,305
-కానీయ్.
-ఛ!

215
00:13:45,225 --> 00:13:47,745
-శ్వాస తీసుకోవడం మర్చిపోవద్దు.
-సరే.

216
00:13:55,225 --> 00:13:56,865
అద్భుతం. కానీయ్, మళ్ళీ.

217
00:13:58,385 --> 00:14:01,185
ఆయుధాల డీలర్లు అంటే
అరణ్యాలు, ఎడారులు దాటి

218
00:14:01,265 --> 00:14:04,345
సైన్యాన్ని సన్నద్ధం చేసే వాళ్ళని
ఎప్పుడూ అనుకునేవాడిని.

219
00:14:11,945 --> 00:14:15,145
కానీ లియో కాలు బయటపెట్టకుండా
అన్నీ ఏర్పాటు చేసానని చెప్పాడు.

220
00:14:22,785 --> 00:14:25,465
లేదంటే ఫస్ట్ క్లాసులో ప్రయాణించడం

221
00:14:25,545 --> 00:14:27,905
మోంజెర్ అల్ అసద్‌ను కలవడానికి,

222
00:14:29,665 --> 00:14:32,505
తను లియోకు మిత్రుడితో పాటు
ప్రధాన కాంటాక్ట్

223
00:14:32,585 --> 00:14:34,945
మధ్య ప్రాచ్య మార్కెట్ విషయంలో.

224
00:14:39,945 --> 00:14:40,985
దక్షిణ యెమెన్

225
00:14:41,065 --> 00:14:44,625
సోవియట్ యూనియన్ రక్షణలో పనిచేసిన
అన్ని అరబ్ మరియు ఆఫ్రికన్

226
00:14:44,705 --> 00:14:47,705
గెరిల్లాలతో మోంజెర్‌కు సంబంధాలు ఉండినాయి.

227
00:15:02,305 --> 00:15:03,505
దక్షిణ యెమెన్‌లోని

228
00:15:03,585 --> 00:15:07,385
తన ప్రధాన కార్యాలయం నుండి
నియంత్రించిన నమ్మకమైన క్లయింట్.

229
00:15:10,985 --> 00:15:13,265
స్వాగతం! ఎలా ఉన్నావు, మిత్రమా?

230
00:15:13,345 --> 00:15:15,185
లియో ఏదైనా అమ్మాలనుకుంటే,

231
00:15:15,265 --> 00:15:18,705
మోంజెర్ కస్టమర్‌ను
పట్టుకునేవాడు,ఇద్దరూ కమీషన్‌ను

232
00:15:18,785 --> 00:15:20,065
సమంగా పంచుకునే వారు.

233
00:15:21,745 --> 00:15:24,945
దక్షిణ యెమెన్‌తో మోంజెర్‌కు ఉన్న
మంచి సంబంధాల కారణంగా,

234
00:15:25,025 --> 00:15:28,705
లియోకు డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ ఉంది,

235
00:15:28,785 --> 00:15:31,865
దానితో ఆయుధాల కొనడం, అమ్మడంలో
దేశ ప్రతినిధి అయ్యాడు.

236
00:15:32,985 --> 00:15:36,665
అంతే కాదు. తనకు
ఈ డాక్యుమెంట్‌కు యాక్సెస్ కూడా ఇచ్చాడు,

237
00:15:36,745 --> 00:15:37,825
మామూలుగా కనబడొచ్చు,

238
00:15:37,905 --> 00:15:41,505
కానీ అక్రమమైన రవాణాదారు,
ఇంకా చట్టపరమైన ఆయుధాల వ్యాపారి మధ్య

239
00:15:41,585 --> 00:15:42,865
తేడాను చూపిస్తుంది.

240
00:15:42,945 --> 00:15:46,065
దీనిని ఎండ్ యూజ్ సర్టిఫికెట్ అంటారు,

241
00:15:46,145 --> 00:15:49,265
అమ్మకానికి ప్రభుత్వం హామీ
ఇచ్చిందని నిరూపించడానికి

242
00:15:49,345 --> 00:15:51,465
దీనిని దేశాలు జారీ చేస్తాయి.

243
00:15:52,585 --> 00:15:55,465
ఆ డాక్యుమెంట్ కారణంగా,
లియో ఫరాద్ అన్ని కార్యకలాపాలను

244
00:15:55,545 --> 00:15:57,345
దక్షిణ యెమెన్ చట్టబద్ధం చేసింది.

245
00:15:58,665 --> 00:16:00,665
తదుపరి ఆర్డర్‌ పూర్తిగా ప్రామాణికం.

246
00:16:01,185 --> 00:16:03,265
మనకు మరిన్ని మాగజైన్లు కావాలి.

247
00:16:03,985 --> 00:16:06,945
ఆ సర్టిఫికేట్‌తో లియో
కలాష్నికోవ్‌లు కొన్నాడు

248
00:16:07,025 --> 00:16:09,825
పోలాండ్‌లో తన మిత్రుడు
కాస్పర్ ఫ్యాక్టరీ నుండి,

249
00:16:09,945 --> 00:16:13,305
అక్కడ తనకు కలాష్నికోవ్‌ల క్రేట్ నుండి

250
00:16:13,385 --> 00:16:16,585
యాంటీ ట్యాంక్ క్షిపణుల షిప్‌లోడ్ వరకు
ఏదైనా దొరుకుతాయి.

251
00:16:16,665 --> 00:16:19,985
పోలాండ్‌లోని ఆయుధాలను
యెమెన్‌కెళ్లే వ్యాపార ఓడలో ఎక్కించి

252
00:16:20,065 --> 00:16:22,545
వాటిని కొనుగోలుదారుడు కోరిన ఏదైనా

253
00:16:22,625 --> 00:16:24,185
మధ్యధరా నౌకాశ్రయంలో దించుతాను.

254
00:16:26,065 --> 00:16:27,705
అయితే ఏదీ యెమెన్‌కు చేరుకోదా?

255
00:16:30,985 --> 00:16:34,865
వారి ఎండ్ యూజ్ సర్టిఫికెట్ వాడుకున్నందుకు
వారికిచ్చే కమీషన్ మాత్రమే.

256
00:17:28,425 --> 00:17:31,065
నాకు అల్పాహారం పెడుతున్నారా లేదా?

257
00:17:31,145 --> 00:17:32,665
మీ ఇద్దరికీ తెలుసా?

258
00:17:32,745 --> 00:17:33,665
పెద్దదాన్నని.

259
00:17:33,785 --> 00:17:36,105
-అది ఏ అధికారం?
-నీకెప్పుడూ లేనిది!

260
00:17:36,185 --> 00:17:38,665
నువ్వనుకున్నట్లు లేనందుకు
నీకు కోపంగా ఉంది!

261
00:17:38,745 --> 00:17:40,545
కాదు, ఇద్దరు వెధవలలా ఉన్నందుకు.

262
00:17:40,625 --> 00:17:41,745
నాన్నకు అదలాగే ఉండాలట.

263
00:17:41,825 --> 00:17:43,025
దేని గురించి అంటావు?

264
00:17:43,865 --> 00:17:45,425
ఇది నాన్న రాసిన వీలునామా కాదు.

265
00:17:45,505 --> 00:17:48,185
సారా టిఫిన్ తిందాం.
తర్వాత ప్రశాంతంగా చర్చిద్దాం.

266
00:17:48,265 --> 00:17:49,745
నేనైతే ఆయనతో మాట్లాడతాను.

267
00:17:52,065 --> 00:17:53,265
ఎక్కడికి వెళుతున్నావు?

268
00:17:53,785 --> 00:17:55,985
నా సంచీ సర్దుకోడానికి. మార్బెలాకు పోతా.

269
00:18:08,825 --> 00:18:13,145
నిన్ను సరిగ్గా ఇదే చేయొద్దని చెప్పాను.

270
00:18:13,185 --> 00:18:14,625
నేను చేసేది ముఖ్యం కాదు.

271
00:18:15,305 --> 00:18:17,665
నిర్ణయించడానికి హ్యూగో, తాన్యాకు
మెజారిటీ ఉంది.

272
00:18:17,745 --> 00:18:19,385
నీకు కావాల్సింది అదే కదా?

273
00:18:19,425 --> 00:18:20,985
వాళ్ళు నీ తోబుట్టువులు, సారా.

274
00:18:21,065 --> 00:18:23,665
నాన్న తన వీలునామాను మార్చేలా
ఒప్పించావు. చాలమ్మా.

275
00:18:23,785 --> 00:18:27,145
లేదు, వీలునామా అందరికీ సమంగానే పంచుతుంది.

276
00:18:27,185 --> 00:18:29,905
నా తోబుట్టువులు ఎంత బాధ్యతలేని వారో
నీకే బాగా తెలుసు.

277
00:18:29,985 --> 00:18:32,145
వాళ్ళు కూడా నా పిల్లలే.

278
00:18:32,665 --> 00:18:34,785
నీకు చట్టబద్ధత కావాలంటే సంపాదించుకోవాలి.

279
00:18:34,865 --> 00:18:36,025
వారసత్వంగా రాదు.

280
00:18:39,385 --> 00:18:41,425
ఇన్నేళ్ళుగా నేనేం చేస్తున్నాను?

281
00:18:43,065 --> 00:18:44,425
పేపర్లపై సంతకం చేసేది ఎవరు?

282
00:18:45,825 --> 00:18:47,105
నాన్నతో పనిచేసేది ఎవరు?

283
00:18:47,825 --> 00:18:51,185
కంపెనీకోసం తనను అర్పించుకొని,
గంటలు, నెలలు గడిపేదెవరు?

284
00:18:51,305 --> 00:18:53,265
నాపామ్ చేసిన ఫ్రెండ్‌ను తెచ్చిందెవరు?

285
00:18:56,665 --> 00:18:58,185
చూడు, అది నీ సమస్య.

286
00:18:59,345 --> 00:19:02,345
అత్యంత తెలివైనదానివి,
సంస్కారవంతురాలివి, అన్నిట్లో

287
00:19:02,425 --> 00:19:03,545
గొప్పని అనుకుంటావు.

288
00:19:04,185 --> 00:19:05,145
వినిపించుకోవు.

289
00:19:05,185 --> 00:19:06,785
కచ్చితంగా వినిపింసుకుంటాను.

290
00:19:06,865 --> 00:19:08,145
లేదు, వినిపించుకోవు.

291
00:19:08,625 --> 00:19:10,385
అది బలానికి సంకేతమనుకుంటావు.

292
00:19:11,385 --> 00:19:12,505
కానీ అలా కాదు బంగారం.

293
00:19:13,425 --> 00:19:14,585
అది నీ బలహీనత.

294
00:19:52,385 --> 00:19:56,585
అయితే డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్,
ఎండ్ యూజ్ సర్టిఫికెట్ ఉంటే,

295
00:19:56,665 --> 00:19:59,385
ఎవరైనా మధ్యవర్తి కాగలరా?

296
00:19:59,425 --> 00:20:01,505
ఇకపై కాదు. నీకు పరిచయాలు ఉండాలి

297
00:20:01,585 --> 00:20:04,865
ప్రభుత్వాలతో సంబంధాలు,
అన్నిటికంటే ముఖ్యంగా నిధులుండాలి.

298
00:20:05,425 --> 00:20:06,345
నిధులా?

299
00:20:06,425 --> 00:20:09,145
అవును, కస్టమర్ తనకు
సరుకులు వచ్చే వరకు చెల్లించడు.

300
00:20:09,185 --> 00:20:10,665
ఏదైనా జరిగితే, నీదే బాధ్యత.

301
00:20:11,185 --> 00:20:13,585
అందుకే నువ్వు ఎవరితో పనిచేస్తున్నావు,

302
00:20:13,665 --> 00:20:15,425
కస్టమర్, మద్దతు తెలుసుకోవాలి.

303
00:20:15,505 --> 00:20:16,505
ప్రైవేట్ - వేట అడవి
అతిక్రమించరాదు

304
00:20:16,585 --> 00:20:17,865
మోంజెర్ నీకు అండ.

305
00:20:19,505 --> 00:20:22,025
అంటే దానర్థం అతడిని సింహాన్ని చంపనివ్వాలా?

306
00:21:08,665 --> 00:21:09,665
స్వాగతం!

307
00:21:09,745 --> 00:21:11,425
ఎలా ఉన్నావు, మిత్రమా?

308
00:21:12,185 --> 00:21:14,545
నిన్ను చూస్తే నాకెప్పుడూ సంతోషంగా ఉంటుంది.

309
00:21:15,665 --> 00:21:17,905
-స్వాగతం.
-నాకు కూడా.

310
00:21:19,345 --> 00:21:20,545
నా కోసం ఏం తెచ్చావు?

311
00:21:27,985 --> 00:21:30,185
యాంఫేటమిన్ మత్తులో ఆకలితో ఉన్న మగసింహం.

312
00:21:30,585 --> 00:21:32,985
నిన్ను తినలేదంటే
నీతో పడుకోవాలని చూస్తుందేమో.

313
00:21:34,825 --> 00:21:36,065
తన గురించి అడిగాను.

314
00:21:37,145 --> 00:21:39,265
హలో. నేను ఓస్కార్,
సారా బాయ్ ఫ్రెండ్.

315
00:21:40,505 --> 00:21:42,305
అయితే నువ్వేనన్నమాట, మి. నాపామ్.

316
00:21:42,385 --> 00:21:44,665
హా. మిమ్మల్ని కలవడం బాగుంది, మి. మోంజెర్.

317
00:21:45,265 --> 00:21:46,145
అంకుల్ అను.

318
00:21:46,665 --> 00:21:48,665
-సరే.
-సారా నా మేనకోడలు లాంటిది

319
00:21:52,105 --> 00:21:54,105
లియో నీ గురించి గొప్పగా చెప్తాడు.

320
00:21:54,185 --> 00:21:57,305
-నా గురించి అతిశయోక్తిగా చెప్తుంటాడు.
-అస్సలు కాదు.

321
00:21:57,865 --> 00:21:58,705
ఎలా అంటావు?

322
00:22:05,385 --> 00:22:06,465
జోక్ చేస్తున్నాను.

323
00:22:06,545 --> 00:22:08,305
పరిహాసాలు ఆడుతుంటాడు.

324
00:22:08,385 --> 00:22:09,505
అవును.

325
00:22:13,145 --> 00:22:14,505
నన్ను ఆటపట్టిస్తున్నావు.

326
00:22:15,185 --> 00:22:16,305
తనను కూడా పిలిచావా?

327
00:22:16,385 --> 00:22:18,785
పెద్ద నిధి, అందరికీ కావల్సినంత ఉంటుంది.

328
00:22:19,145 --> 00:22:21,905
ఆ చెత్తవెధవ ఇద్దరు గూండాలను
నా ఇంటికి పంపాడు.

329
00:22:21,985 --> 00:22:22,825
లియో...

330
00:22:22,905 --> 00:22:24,865
ఒకడు నా కూతురి తలకు గన్ గురిపెట్టాడు.

331
00:22:24,945 --> 00:22:27,025
-మూల్యం చెల్లిస్తాడు.
-ఓ అవునా?

332
00:22:27,465 --> 00:22:28,665
సమయం వచ్చినప్పుడు.

333
00:22:35,745 --> 00:22:36,705
మవాద్?

334
00:22:40,585 --> 00:22:41,425
స్వాగతం.

335
00:22:42,705 --> 00:22:45,705
నువ్వు రావాలని
నిర్ణయించుకున్నందుకు సంతోషం.

336
00:22:45,785 --> 00:22:48,865
ఎందుకు రాను?
వ్యాపారమే కదా?

337
00:22:50,425 --> 00:22:51,545
ఇంకా చంపే సింహాలు.

338
00:22:52,505 --> 00:22:55,145
నీతో, ఏది దారుణంగా ఉంటుందో తెలియట్లేదు.

339
00:22:56,545 --> 00:22:58,705
-ఏం జరుగుతోంది?
-విను అంతే.

340
00:22:59,225 --> 00:23:02,265
ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది.

341
00:23:02,745 --> 00:23:03,945
నాకు చెబుతున్నావా?

342
00:23:06,185 --> 00:23:07,145
లియో.

343
00:23:08,105 --> 00:23:09,185
మవాద్.

344
00:23:09,785 --> 00:23:11,025
నీకు తన అల్లుడు తెలుసా?

345
00:23:11,585 --> 00:23:13,425
ఎందుకు తెలియదు.

346
00:23:13,505 --> 00:23:15,905
"పుయెర్తో బానూస్‌లో
మీ శరీరంతో అపాయింట్‌మెంట్."

347
00:23:18,105 --> 00:23:19,145
చాలా ఒరిజినల్.

348
00:23:22,385 --> 00:23:24,185
సీఐఏను కూడా పిలిచావా?

349
00:23:24,265 --> 00:23:26,945
దానికి విరుద్ధం.
తనే మనల్ని పిలిచింది.

350
00:23:42,825 --> 00:23:43,705
హలో!

351
00:23:45,145 --> 00:23:46,545
-లియో.
-చూసి చాలా రోజులైంది.

352
00:23:47,185 --> 00:23:48,025
మీ రాక ఆనందం.

353
00:23:50,105 --> 00:23:51,145
మవాద్.

354
00:23:51,585 --> 00:23:53,705
-మళ్ళీ కలవడం బాగుంది.
-ప్రయాణం బాగుందా?

355
00:23:53,785 --> 00:23:55,345
అకస్మాత్తుగా, నా చుట్టూ

356
00:23:55,425 --> 00:23:58,545
రెండు బ్లాక్‌లకు చెందిన ఆయుధాల వ్యాపారులు,

357
00:23:58,625 --> 00:24:01,305
సోషలిస్టులు ఇంకా పెట్టుబడిదారులు ఉన్నారు.

358
00:24:01,385 --> 00:24:04,625
వారి ఇద్దరు అతిపెద్ద స్పాన్సర్‌లైన

359
00:24:04,705 --> 00:24:06,665
మోంజెర్ ఇంకా సీఐఏతో మిళితమైపోయాను.

360
00:24:10,945 --> 00:24:12,945
వాళ్లతో తాగడానికి నన్ను పిలవలేదు,

361
00:24:14,025 --> 00:24:16,505
కానీ ఆ సమ్మిట్ చాలా ముఖ్యాంశాలు చేస్తుంది.

362
00:24:27,185 --> 00:24:28,665
భావజాలాల గురించి చర్చించను.

363
00:24:29,225 --> 00:24:31,465
అందరికీ నచ్చినట్లు ఆలోచించే స్వేచ్ఛ ఉంది,

364
00:24:32,545 --> 00:24:35,225
మనందరం ఒకరికొకరు తెలుసు.

365
00:24:36,225 --> 00:24:37,505
చాలా బాగా తెలుసు.

366
00:24:37,585 --> 00:24:40,305
ముఖ్యమైన విషయమేమిటంటే, మనందరం ఈ రోజు ఇక్కడ

367
00:24:40,385 --> 00:24:44,185
ఆచరణాత్మక విషయాలను చర్చించడానికి
ఒకటే టేబుల్ చుట్టూ కూర్చున్నాం,

368
00:24:44,265 --> 00:24:46,065
అంటే వ్యాపారం గురించి.

369
00:24:46,145 --> 00:24:48,905
అందరూ తమ రాజకీయాలను వాకిలి
బయటే వదిలిపెడితే బాగుంటుంది.

370
00:24:48,985 --> 00:24:50,385
-ఎప్పుడూ చేస్తాను.
-మంచిది.

371
00:24:50,985 --> 00:24:51,825
లియో?

372
00:24:53,585 --> 00:24:55,025
నేను వింటున్నానులే.

373
00:24:56,105 --> 00:24:57,145
నికరాగ్వా.

374
00:25:00,025 --> 00:25:03,225
మా ప్రభుత్వం కాంట్రాలకు
మద్దతును పెంచబోతోంది.

375
00:25:03,305 --> 00:25:06,425
వారికి ఆయుధాలు కావాలి.
కానీ మావి కాదు. సోవియట్ లాంటివి.

376
00:25:07,305 --> 00:25:09,825
జీనా... నేను క్యూబన్లతో పనిచేస్తాను...

377
00:25:09,905 --> 00:25:11,065
రాజకీయాలొద్దు, లియో.

378
00:25:11,745 --> 00:25:12,745
ఇది వ్యాపారం.

379
00:25:13,345 --> 00:25:16,705
సీఐఏతో కలిసి పనిచేస్తానని తెలిస్తే,
కస్టమర్లు పోతారు.

380
00:25:16,785 --> 00:25:18,265
ఎవరికీ తెలియదు, లియో.

381
00:25:18,745 --> 00:25:19,985
ఇది ఒక్కసారే జరిగేది,

382
00:25:20,065 --> 00:25:22,665
మేమందరం ఇందులో ఉన్నాం,
నువ్వొక్కడివే కాదు.

383
00:25:23,665 --> 00:25:26,465
నా కేజీబీ కాంటాక్ట్‌కు గనుక తెలిసిపోతే

384
00:25:26,545 --> 00:25:27,985
నేను చచ్చినట్లే.

385
00:25:29,705 --> 00:25:31,025
తగిన విలువ ఉంటే మేలు.

386
00:25:31,105 --> 00:25:32,705
నీకు బాగానే ముట్టచెప్తారులే...

387
00:25:33,385 --> 00:25:35,425
నువ్వు, మోంజెర్, మీకు నచ్చిన

388
00:25:35,505 --> 00:25:37,785
ఆఫ్రికా విప్లవాల
ఆర్థిక సహాయానికి వాడొచ్చు.

389
00:25:40,385 --> 00:25:43,345
కాంట్రాలకు మీ సొంత రైఫిళ్లు ఇవ్వొచ్చు కదా?

390
00:25:43,425 --> 00:25:45,305
ఇవ్వలేం. కాంగ్రెస్ నిషేధం విధించింది.

391
00:25:45,945 --> 00:25:47,065
రష్యన్ వాటి విషయంలో

392
00:25:47,145 --> 00:25:49,545
కమ్యూనిస్ట్‌ల నుండి
కాంట్రాలకు అందినట్లుంటుంది.

393
00:25:51,985 --> 00:25:55,025
ఆయుధాలతో అట్లాంటిక్‌ను దాటడానికి
నాకు సర్టిఫికేట్ లేదు.

394
00:25:55,905 --> 00:25:56,785
అది నా దారి కాదు.

395
00:25:56,865 --> 00:25:59,265
ఓడను అల్జీసిరాస్ వెళ్లేలా
యెమెన్ కవర్ వాడుకో.

396
00:25:59,345 --> 00:26:01,985
దాటడానికి నీకు
హాండూరన్ సర్టిఫికేట్ జారీ చేస్తాం.

397
00:26:02,825 --> 00:26:04,145
అయితే...

398
00:26:04,225 --> 00:26:07,905
లియోకు ఈ నికరాగ్వా డీల్ ఇస్తున్నట్లయితే
అందులో నాకేముంది?

399
00:26:11,625 --> 00:26:12,665
ఇరాన్.

400
00:26:14,465 --> 00:26:15,305
ఏంటి?

401
00:26:15,385 --> 00:26:17,625
వారికి ఎఫ్-14ల కోసం
విడి భాగాలను అమ్ముతావు.

402
00:26:17,705 --> 00:26:19,625
ఇరాక్‌పై వారి యుద్ధానికి అవి అవసరం.

403
00:26:19,705 --> 00:26:22,385
కాంట్రాలకు ఆయుధాల కోసం ఆ నగదును వాడుతాం.

404
00:26:22,985 --> 00:26:26,785
నికరాగ్వాలో కమ్యూనిజం పతనానికి ఇరానియన్
అయాతోల్లాల ఆర్థిక సహాయం.

405
00:26:26,865 --> 00:26:29,065
మీరు స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నారు.

406
00:26:30,065 --> 00:26:33,345
ఇదంతా చాలా సున్నితమైనది.

407
00:26:34,145 --> 00:26:36,905
కొన్నేళ్లుగా సద్దాం హుస్సేన్‌కు
ఆయుధాలు అమ్ముతున్నాను.

408
00:26:36,985 --> 00:26:39,905
ఇరాకీ సైన్యం నా ఉత్తమ కస్టమర్లలో ఒకరు.

409
00:26:39,985 --> 00:26:41,585
-ఏంటి సమస్య?
-అంటే...

410
00:26:41,665 --> 00:26:44,505
ఇరాన్‌కు కూడా సరఫరా చేయడంపై
తెలిసిందని ఊహించుకో.

411
00:26:44,585 --> 00:26:45,865
మవాద్...

412
00:26:45,945 --> 00:26:47,705
ఇక్కడ అందరం రిస్క్ తీసుకుంటున్నాం.

413
00:26:47,785 --> 00:26:49,305
కేజీబీకి తెలిస్తే...

414
00:26:49,385 --> 00:26:52,585
సద్దాం హుస్సేన్ కేజీబీ కంటే
చాలా దారుణమైనవాడు.

415
00:26:53,105 --> 00:26:56,225
నేను అతని శత్రువైన ఇరాన్‌కు సరఫరా చేస్తే,

416
00:26:56,305 --> 00:26:57,705
నేను ద్రోహిని అవుతాను.

417
00:26:57,785 --> 00:27:00,345
దీని కంటే చిన్నవాటికే
జనాలను యాసిడ్లో ముంచుతాడు.

418
00:27:00,425 --> 00:27:03,545
ఎవరికీ తెలియదు, మవాద్.
ఇది ఒక రహస్య ఆపరేషన్.

419
00:27:03,625 --> 00:27:05,665
నాకు హామీలు కావాలి.

420
00:27:07,265 --> 00:27:08,825
నేను మీ హామీని.

421
00:27:08,905 --> 00:27:11,425
ఎందుకంటే వీటిలో ఏదైనా లీకైతే
అందరం ఇరుక్కుపోతాం.

422
00:27:12,985 --> 00:27:16,305
మహాశయులారా, మీ జీవితంలోనే
పెద్ద కమిషన్ సంపాదించనున్నారు.

423
00:27:16,385 --> 00:27:18,145
నేను అడిగేది ఏమిటంటే,

424
00:27:18,225 --> 00:27:19,865
మీరు అపనమ్మకం, భయంవంటివి

425
00:27:20,625 --> 00:27:21,825
పక్కన పెట్టి,

426
00:27:21,945 --> 00:27:23,505
బృందంగా పని చేయండి.

427
00:27:23,625 --> 00:27:25,225
ఎందుకంటే మీరు గమనించకపోయుంటే,

428
00:27:25,705 --> 00:27:27,025
మీ కోసం ఓ వార్త ఉంది.

429
00:27:29,345 --> 00:27:30,585
ప్రపంచం మారుతోంది.

430
00:27:31,225 --> 00:27:32,705
సహకరించుకోవడం నేర్చుకోవాలి.

431
00:27:39,345 --> 00:27:40,745
-ప్రపంచ శాంతికి.
-చీర్స్.

432
00:27:41,665 --> 00:27:43,505
అబ్బో. మీరు చాలా చిలిపి!

433
00:27:51,505 --> 00:27:52,825
జిమ్ ఎలా నడుస్తోంది?

434
00:27:52,945 --> 00:27:54,505
బాగా నడుస్తోంది.

435
00:27:54,585 --> 00:27:55,785
మంచిది.

436
00:27:55,865 --> 00:27:56,865
సంతోషం.

437
00:27:57,585 --> 00:28:00,425
సారా నీతో చాలా ఆనందంగా ఉందని విన్నాను.

438
00:28:02,345 --> 00:28:03,945
నాకు తెలియనిదేందంటే

439
00:28:04,025 --> 00:28:06,305
మార్బెలాకు తెచ్చినది
ఏరోబిక్స్ నేర్పడానికా,

440
00:28:06,385 --> 00:28:08,665
తన వ్యర్ధ తమ్ముడిని చూసుకోడానికా,

441
00:28:09,345 --> 00:28:11,585
లేదా నిన్ను తన వ్యాపారంలో వాడుకోవడానికా.

442
00:28:11,705 --> 00:28:14,785
అది చాలా మంచి ప్రశ్న. తననే అడుగు.

443
00:28:16,745 --> 00:28:18,665
బహుశా నువ్వు మూడూ చేయగలవేమో.

444
00:28:19,585 --> 00:28:21,185
అది అద్భుతమైన విషయం.

445
00:28:51,025 --> 00:28:51,905
కొత్త పాటనా?

446
00:28:53,665 --> 00:28:55,065
మార్బెలా వెళ్ళాలనుకోలేదా?

447
00:28:58,425 --> 00:28:59,945
తొందరపడతానని తెలుసుగా.

448
00:29:00,825 --> 00:29:04,425
నియంత్రణ కోల్పోయి
కొన్నిసార్లు చిక్కుల్లో పడతాను.

449
00:29:05,265 --> 00:29:08,225
అవును, నిన్ను బాగా అర్థం చేసుకుంటాను.

450
00:29:08,305 --> 00:29:10,145
అవునా?

451
00:29:14,985 --> 00:29:16,545
నాకు ఎంత ఇస్తావు?

452
00:29:18,145 --> 00:29:19,145
ఏంటి?

453
00:29:19,985 --> 00:29:20,905
నీకు మద్దతు కోసం.

454
00:29:21,705 --> 00:29:24,145
తాన్యా, ఇది నీ మద్దతను కొనడం గురించి కాదు.

455
00:29:24,665 --> 00:29:28,225
కుటుంబానికి ఏది మంచిదని మనిద్దరం
కలిసి నిర్ణయించడం గురించి.

456
00:29:30,345 --> 00:29:33,425
నిజమే. ఒకవేళ నేను
నా మద్దతును అమ్మదలచుకుంటే?

457
00:29:34,265 --> 00:29:36,025
నువ్వు అలా ఎందుకు చేస్తావు?

458
00:29:37,145 --> 00:29:38,625
ఎందుకంటే పట్టించుకోనని.

459
00:29:38,705 --> 00:29:41,305
ఆయుధాలు, యుద్ధాల గురించి
అసలు పట్టించుకోను...

460
00:29:41,385 --> 00:29:43,265
-తాన్యా నా మాట విను.
-వినాలని లేదు.

461
00:29:43,345 --> 00:29:45,825
నేను పట్టించుకునేది సంగీతం ఒక్కటే. అంతే.

462
00:29:45,905 --> 00:29:47,705
అయితే నేను లెక్కలు వేస్తూ ఉన్నాను.

463
00:29:47,785 --> 00:29:49,345
-అవునా?
-అవును.

464
00:29:49,425 --> 00:29:50,625
సంగీతకారుల ఖర్చు,

465
00:29:50,705 --> 00:29:53,705
టూర్ల కోసం ఓ ప్రోమో ప్రచారం,
ఒక సరైన ఆల్బం రికార్డు చేయడం.

466
00:29:53,785 --> 00:29:56,185
అంతా కలిపి 90 మిలియన్ పెసెటాలు అవుతుంది.

467
00:29:56,825 --> 00:29:59,865
తొంభై మిలియన్లు
ఐదేళ్ళ మద్దతుకు సరిపోతుంది.

468
00:29:59,945 --> 00:30:01,385
అది చాలా చిన్న మొత్తం

469
00:30:01,465 --> 00:30:04,265
నాన్న ఆ ఐదేళ్ళలో
సంపాదించినదానితో చూసుకుంటే.

470
00:30:05,945 --> 00:30:07,545
నీ కెరీర్‌కు డబ్బులు కట్టమంటావా?

471
00:30:08,105 --> 00:30:10,545
లేదు, లాంచ్‌కు కట్టు.

472
00:30:12,905 --> 00:30:13,945
చాలా మంచి విషయం.

473
00:30:15,345 --> 00:30:16,785
ఒకవేళ అది ఫలించకపోతే?

474
00:30:16,865 --> 00:30:18,905
రీలాంచ్‌కు మరో 90 మిలియన్లు.

475
00:30:18,985 --> 00:30:20,545
-అది ఫలిస్తుంది.
-లేదా ఫలించదు.

476
00:30:20,625 --> 00:30:22,905
జనం నిన్నో చెత్త గాయకురాలు అనుకోగలరు.

477
00:30:23,705 --> 00:30:26,025
హ్యూగో నేను అద్భుతం అంటాడేమో.

478
00:30:28,945 --> 00:30:30,545
నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తావా?

479
00:30:31,545 --> 00:30:33,185
మనకు చేతనైనదానితో పోరాడుతాం.

480
00:30:37,345 --> 00:30:38,465
ఇది ఎదురు ప్రతిపాదన.

481
00:30:38,865 --> 00:30:41,145
-చెప్పు విందాం.
-డెమోకు ఖర్చు పెడతాను,

482
00:30:41,225 --> 00:30:42,785
అది రికార్డ్ కంపెనీకిచ్చాక

483
00:30:42,865 --> 00:30:46,345
నిన్ను లాంచ్ చేస్తే, మనం భాగస్వాములై,
ప్రకటనలలో పెడదాం.

484
00:30:47,385 --> 00:30:49,225
-నాకే సాయం వద్దు.
-ఇది సాయం కాదు.

485
00:30:49,305 --> 00:30:50,585
అదే అనుకుంటాను.

486
00:30:52,105 --> 00:30:54,145
90 మిలియన్ల కోసం సూటిగా వెళ్ళాలిగా?

487
00:30:56,145 --> 00:30:57,385
హ్యూగో మారు ఆలోచించడు.

488
00:30:58,225 --> 00:30:59,185
తాన్యా...

489
00:31:00,465 --> 00:31:01,825
ఎందుకంటే హ్యూగో ఆలోచించడు.

490
00:31:02,985 --> 00:31:04,985
నిజంగా నిన్ను తన చేతుల్లో పెడుతావా?

491
00:31:10,705 --> 00:31:11,985
అది నీ ఇష్టమనుకో.

492
00:31:35,345 --> 00:31:36,305
హాయ్.

493
00:31:51,785 --> 00:31:54,105
సున్నాకి రెండు గోల్స్ తేడాతో ఓటమి.

494
00:31:54,185 --> 00:31:57,505
అట్లెటికో డి మాడ్రిడ్‌కి
మేల్కొలుపు పిలుపు...

495
00:31:57,585 --> 00:31:59,985
-సరే ఇక్కడే. నంబర్ 12.
-అలాగే.

496
00:32:00,945 --> 00:32:01,985
ఎంత అయ్యింది?

497
00:32:02,065 --> 00:32:03,145
2,500 పెసెటాలు.

498
00:32:11,345 --> 00:32:12,545
"మొఫ్లి."

499
00:32:12,625 --> 00:32:14,185
చాలా మేలు, ఏంటది అసలు.

500
00:32:27,905 --> 00:32:29,185
ఏంటి విశేషాలు?

501
00:32:29,265 --> 00:32:30,385
అదృష్టవంతుడవు.

502
00:32:30,465 --> 00:32:33,425
నిన్న కాల్ చేసుంటే,
ఖాళీ చేతులతో వెళ్ళేవాడివి.

503
00:32:33,505 --> 00:32:37,625
మాడ్రిడ్‌కు రావాలని అనుకోలేదు,
కానీ ఓ పనిబడింది.

504
00:32:37,705 --> 00:32:38,705
ఇప్పుడే కలుపుతారట.

505
00:32:39,225 --> 00:32:40,585
బీర్ కావాలా?

506
00:32:40,665 --> 00:32:42,465
-రమ్ అయితే మేలు.
-సరే.

507
00:32:42,545 --> 00:32:44,145
-వెనుక వేచి ఉండు.
-సరే.

508
00:32:50,785 --> 00:32:52,185
ఎలా ఉన్నావు, డానీ?

509
00:32:52,265 --> 00:32:53,585
బాగున్నాను. నువ్వు?

510
00:32:55,825 --> 00:32:56,785
బాగున్నాను.

511
00:32:58,505 --> 00:33:00,825
ఘాటుగా ఉందని కొంచెం కోకాకోలా కలిపాను.

512
00:33:00,905 --> 00:33:01,865
ధన్యవాదాలు.

513
00:33:01,985 --> 00:33:03,385
కోలాల గురించి విన్నావా?

514
00:33:03,465 --> 00:33:06,105
ఆపు, డానీ, రాత్రంతా చెప్తూనే ఉన్నావు.

515
00:33:06,185 --> 00:33:08,625
-ఏంటి?
-వాటికి ఓర్జీలు అంటే ఇష్టం.

516
00:33:09,105 --> 00:33:10,345
కోలాలకా?

517
00:33:10,425 --> 00:33:11,505
తనను పట్టించుకోకు.

518
00:33:11,585 --> 00:33:12,825
పిచ్చోడు.

519
00:33:12,945 --> 00:33:14,145
లేదు, లేదు.

520
00:33:14,225 --> 00:33:15,585
అధ్యయనం చేస్తున్నారు.

521
00:33:16,225 --> 00:33:20,025
యూనివర్శిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్‌కు చెందిన
ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు.

522
00:33:21,025 --> 00:33:22,225
హా, నిజమే.

523
00:33:23,145 --> 00:33:25,745
వాటికి నచ్చే ఓర్జీ ఏదో తెలుసా?

524
00:33:26,945 --> 00:33:28,625
-ఏది?
-లెస్బియన్.

525
00:33:32,905 --> 00:33:34,985
-అలా కనబడలేదే.
-కదా?

526
00:33:37,185 --> 00:33:39,145
హ్యూగో. ఎవరో నిన్ను అడుగుతున్నారు.

527
00:33:51,145 --> 00:33:52,185
ఎందుకొచ్చావు?

528
00:33:54,025 --> 00:33:55,305
నాకు తెలియదనుకున్నావా?

529
00:33:56,665 --> 00:33:59,265
మూడేళ్ళుగా ఆ పిచ్చామె దగ్గర
కోక్ కొంటున్నావు.

530
00:34:01,065 --> 00:34:04,265
పోలీసు ఇన్‌ఫార్మర్‌ కావడంతో
తనకు కూతురి కస్టడీ మాత్రమే ఉంది.

531
00:34:04,865 --> 00:34:06,305
దాని గురించి నాకేం తెలియదు.

532
00:34:07,105 --> 00:34:08,745
కమీషనర్ లోపెరా నాన్నకు చెప్పారు.

533
00:34:12,225 --> 00:34:14,745
నీకు తెలిసినట్లుగా, నాన్న కాన్సర్‌తో పాటు

534
00:34:14,785 --> 00:34:16,665
నాకు ఈ కుటుంబం గురించి అన్నీ తెలుసు.

535
00:34:20,265 --> 00:34:21,425
నీకేం కావాలి?

536
00:34:23,185 --> 00:34:24,265
నీకు సహాయం చేయడం.

537
00:34:33,185 --> 00:34:34,505
దాన్ని వదిలారు.

538
00:34:35,945 --> 00:34:37,625
ఇలా చాలా సార్లు చేసారా?

539
00:34:37,705 --> 00:34:39,025
అవును, చాలా సార్లు.

540
00:34:41,305 --> 00:34:42,985
పర్లేదులే.

541
00:34:50,305 --> 00:34:53,265
నాకూ నీలాగే నాన్న లేడు.

542
00:34:54,545 --> 00:34:59,145
చలితో, ఆకలితో, లక్ష్యాలతో ఉండటం
ఎలా ఉంటుందో నాకు తెలుసు.

543
00:35:01,625 --> 00:35:02,505
కానీ?

544
00:35:04,385 --> 00:35:06,905
దీనికి విరుద్ధంగా, అస్సలు కానీలు ఉండవు.

545
00:35:06,985 --> 00:35:10,105
ఓ అనాథ ఎల్లప్పుడూ మరింత స్వేచ్ఛగా,
మరింత సున్నితంగా ఉంటాడు.

546
00:35:11,985 --> 00:35:15,265
నా వరకైతే, నువ్వు ఓ ఖాళీ పేజీ లాంటివాడివి.

547
00:35:16,265 --> 00:35:19,225
శుభ్రంగా, ఇంకా వ్రాయనిది.

548
00:35:22,065 --> 00:35:24,065
దాని గురించి ఎప్పుడూ అలా అనుకోలేదు.

549
00:35:24,145 --> 00:35:25,105
నాకు నచ్చింది.

550
00:35:25,185 --> 00:35:26,745
అలా అయితే నువ్వు నమ్మాలి.

551
00:35:27,905 --> 00:35:29,425
ముఖ్యంగా, విశ్వాసంగా ఉండు.

552
00:35:30,665 --> 00:35:31,785
సారా పట్ల అంటారా?

553
00:35:32,745 --> 00:35:34,785
కాదు, సారా గురించి కాదు చెప్పేది.

554
00:35:36,025 --> 00:35:38,545
కుటుంబం పట్ల విశ్వాసపాత్రంగా ఉండాలి.

555
00:35:40,185 --> 00:35:41,905
విధేయత గురించి చెబుతున్నాను.

556
00:35:43,745 --> 00:35:46,225
నాకు మోంజెర్‌తో, నా వాళ్లతో ఉన్నట్లుగా.

557
00:35:47,105 --> 00:35:48,705
వాళ్ల వరకు, నచ్చని డీల్స్ చేసి,

558
00:35:48,745 --> 00:35:51,465
మవాద్‌లాంటి వెధవతో విస్కీ తాగుతాను.

559
00:35:52,145 --> 00:35:53,665
నీకు అర్థమవుతుందా?

560
00:35:53,745 --> 00:35:54,705
అవుతుంది.

561
00:35:55,385 --> 00:35:56,905
ఎందుకంటే ఈ ప్రపంచం పాడైపోయింది

562
00:35:56,985 --> 00:35:59,545
చాలా చెత్త, చాలా గందరగోళం ఉన్నాయి.

563
00:36:00,105 --> 00:36:01,865
కానీ నువ్వు విధేయంగా ఉంటే,

564
00:36:03,065 --> 00:36:04,185
అంతా సవ్యంగా అవుతుంది.

565
00:36:05,025 --> 00:36:08,585
అది మొదటి నియమం,
నిన్ను అయోమయపడకుండా చూసే నియమం.

566
00:36:17,425 --> 00:36:18,545
లియో...

567
00:36:20,225 --> 00:36:21,665
కేన్సర్‌పై సారా చెప్పింది.

568
00:36:23,265 --> 00:36:24,305
ఎలా ఉంది?

569
00:36:27,265 --> 00:36:29,665
నేను వందేళ్ళు బతుకుతానులే.

570
00:36:30,265 --> 00:36:31,465
ఛ.

571
00:36:34,705 --> 00:36:35,945
మీకు భయంగా లేదా?

572
00:36:38,425 --> 00:36:39,465
నీకు తెలుసా?

573
00:36:40,265 --> 00:36:43,225
టిబెట్‌లో సన్యాసులకు ఒక ఆచారం ఉంటుంది

574
00:36:43,265 --> 00:36:47,905
ఇసుక రేణువులతో బొమ్మలు గీసే ఆచారం.

575
00:36:47,985 --> 00:36:49,065
రంగురంగులది.

576
00:36:51,265 --> 00:36:52,665
అందంగా ఉంటుంది.

577
00:36:53,985 --> 00:36:59,145
రేణువులను సరిగా అమర్చాలంటే
ఐదేళ్ళు, 10 లేదా 15 ఏళ్ళు పడుతుంది.

578
00:36:59,945 --> 00:37:01,785
అవి చాలా సూక్ష్మంగా ఉంటాయి.

579
00:37:04,425 --> 00:37:08,185
వాళ్ళు పూర్తిచేసిన రోజు,
చివరి ఇసుక రేణువును పేర్చినరోజు

580
00:37:09,905 --> 00:37:11,265
వారేం చేస్తారో తెలుసా?

581
00:37:12,905 --> 00:37:14,745
పెయింటింగ్ మీద ఊదుతారు

582
00:37:16,945 --> 00:37:18,425
అంతా పాడై పోతుంది.

583
00:37:20,545 --> 00:37:21,585
ఎందుకలా చేస్తారు?

584
00:37:22,105 --> 00:37:25,665
ఏదీ మిగలదు, కాబట్టి దేనితో బంధం
పెట్టుకోకూడదని చూపించడానికి.

585
00:37:31,505 --> 00:37:34,705
టిబెట్ సన్యాసులు మూర్ఖులలాగా ఉన్నారు.

586
00:37:41,465 --> 00:37:43,625
20 ఏళ్లుగా,

587
00:37:43,705 --> 00:37:45,625
నా ఇసుక రేణువులను పేరుస్తున్నాను.

588
00:37:46,785 --> 00:37:48,265
ఫరాద్ రేణువులను.

589
00:37:51,145 --> 00:37:53,945
వాటిని ఎవరినీ ఊదనివ్వను.

590
00:37:55,305 --> 00:37:57,505
అందుకే నాకో బలమైన కుటుంబం కావాలి.

591
00:37:59,385 --> 00:38:00,425
అర్థమైందా?

592
00:38:06,905 --> 00:38:09,945
-హ్యూగో...
-నీకేం అర్థం కాదు.

593
00:38:11,705 --> 00:38:13,105
ఏం అర్థం కాదు నాకు?

594
00:38:13,185 --> 00:38:16,065
నాన్న చనిపోతే,
ఇది డ్రై క్లీనర్ వాటిని వారసత్వంగా

595
00:38:16,505 --> 00:38:19,945
పొందినట్లు నీకు అంతా వారసత్వంగా
వచ్చేస్తుందని అనుకుంటావు.

596
00:38:21,305 --> 00:38:23,745
హ్యూగో, నీ ముందో డీల్ ఉంచుతున్నాను.

597
00:38:23,785 --> 00:38:25,905
అదే అసలైన సమస్య, సారా.

598
00:38:25,985 --> 00:38:28,665
నువ్వు నన్ను లేదా తాన్యాను
సమస్య అనుకుంటావు.

599
00:38:29,745 --> 00:38:31,905
కానీ సమస్య అంకుల్ మోంజెర్.

600
00:38:32,545 --> 00:38:34,185
ఆయన ఒప్పందాలను చేతికిస్తాడు,

601
00:38:34,265 --> 00:38:37,025
సర్టిఫికేట్‌లిస్తాడు,
అన్నిటికీ హామీ ఇస్తాడు.

602
00:38:38,305 --> 00:38:40,785
అంకుల్ మోంజెర్ అద్భుతమైన వ్యక్తి కదా?

603
00:38:40,905 --> 00:38:44,145
-మంచివాడు, తెలివైనవాడు.
-అవును.

604
00:38:44,225 --> 00:38:46,985
కానీ ఆయన ముగ్గురు భార్యలున్న
సంప్రదాయవాద అరబ్బు కూడా.

605
00:38:47,065 --> 00:38:49,665
తన జీవితంలో ఏనాడూ

606
00:38:49,745 --> 00:38:52,505
అమ్మ తినే టేబుల్ మీద
తినడానికి ఏనాడు కూర్చోలేదు.

607
00:38:55,745 --> 00:39:00,745
కాబట్టి ఆడదానివైన నువ్వు
అంకుల్ మోంజెర్‌తో ఏదైనా చర్చిస్తావని

608
00:39:01,585 --> 00:39:03,505
నీకు ఎందుకు అన్పిస్తుందో నాకు తెలియదు.

609
00:39:05,225 --> 00:39:08,145
జోర్డాన్‌లో అల్ ఫతాతో చర్చలు
జరుపుతావని అనుకుంటున్నావా?

610
00:39:08,865 --> 00:39:10,265
లేదా యెమెన్‌లతో?

611
00:39:10,305 --> 00:39:11,465
లేదా ట్యునీషియన్‌లతో?

612
00:39:11,545 --> 00:39:13,465
అదంతా ఒంటరిగా చేస్తానని ఎవరన్నారు?

613
00:39:17,945 --> 00:39:20,905
సారా, నీ బాయ్ ఫ్రెండ్ ఫరాద్ కాదు.

614
00:39:37,025 --> 00:39:38,145
అది వచ్చింది.

615
00:39:39,705 --> 00:39:40,625
ఛ.

616
00:40:06,905 --> 00:40:08,105
దాన్ని కాల్చామా?

617
00:40:08,185 --> 00:40:09,265
తెలియదు.

618
00:40:10,265 --> 00:40:11,385
గాయపడి ఉండొచ్చు.

619
00:40:12,545 --> 00:40:13,945
నా కోసం ఇక్కడే వేచి ఉండు.

620
00:40:18,465 --> 00:40:19,665
ఏం చేయబోతున్నారు?

621
00:40:19,745 --> 00:40:21,465
-చూసొస్తాను.
-సరే.

622
00:40:27,065 --> 00:40:27,905
లియో!

623
00:40:30,185 --> 00:40:31,145
లియో!

624
00:40:34,665 --> 00:40:35,745
లియో!

625
00:40:44,705 --> 00:40:45,545
లియో!

626
00:40:49,225 --> 00:40:51,305
ఛ. లియో!

627
00:42:03,265 --> 00:42:04,305
ఛ.

628
00:44:31,225 --> 00:44:33,545
ఇప్పుడు. కాల్చు.

629
00:44:38,225 --> 00:44:39,265
నువ్వు కాల్చు.

630
00:44:40,465 --> 00:44:43,505
-నా దగ్గర బుల్లెట్లు అయిపోయాయి.
-ఇదిగో.

631
00:44:55,385 --> 00:44:58,665
చివర్లో నేను సింహాన్ని చంపలేదు.

632
00:45:02,065 --> 00:45:04,185
నాకు పోటీ లియో కాదు.

633
00:45:04,265 --> 00:45:06,865
అది ఫరాద్ కుటుంబంలో పనిచేయని భాగం.

634
00:45:08,345 --> 00:45:10,625
నన్ను ఓ ముప్పులాగా చూసిన భాగం.

635
00:45:20,825 --> 00:45:24,345
దీని గురించి చాలా ఆలోచించాను,
ఇదే మంచి నిర్ణయమనుకుంటాను.

636
00:45:24,425 --> 00:45:25,305
ఓస్కార్ సరైనవాడు.

637
00:45:25,385 --> 00:45:26,945
అందరూ ఫోటోకు రండి!

638
00:45:27,025 --> 00:45:28,945
అందరూ ఇష్టపడతారు,
దృఢ నిశ్చయంతో ఉంటాడు

639
00:45:29,025 --> 00:45:32,225
నేను ఇష్టపడే శక్తి ఉంది.

640
00:45:32,345 --> 00:45:37,585
నేను అల్జీరియన్ మూలాలు కలిగిన
అబ్బాయిని ఇష్టపడినప్పటికీ,

641
00:45:38,585 --> 00:45:41,985
అది మమ్మల్ని మరింత తెలివైనవారిగా
లేదా బలంగా చేయదు.

642
00:45:51,425 --> 00:45:53,585
ఏది ముఖ్యమంటే

643
00:45:53,665 --> 00:45:55,825
తను నా కూతురు కోరుకునే భర్త

644
00:45:55,905 --> 00:45:59,185
ఈ కుటుంబానికి కావాల్సిన సోదరుడు.

645
00:45:59,265 --> 00:46:01,345
-ప్రేమకు టోస్ట్ చెబుదాం.
-ప్రేమకు.

646
00:46:02,025 --> 00:46:03,185
ప్రేమకు.

647
00:46:03,705 --> 00:46:08,505
అలా ట్రోఫీగా చనిపోయిన సింహానికి బదులు
నాకు పెళ్లి దొరికింది.

648
00:46:09,825 --> 00:46:14,825
ఆ నిర్ణయంతో లియో ఆ కుటుంబానికి కావాల్సిన
ఆదేశాన్ని విధిస్తాడని అనుకున్నాను.

649
00:46:15,905 --> 00:46:17,545
అధికారం.

650
00:46:18,305 --> 00:46:21,465
కానీ ఫరాద్‌ల విషయంలో, ఒక్కటే ఆశించగలం...

651
00:46:23,305 --> 00:46:26,065
నీ కోసం ఎలాంటి యుద్ధం
ఎదురుచూస్తుంటుందో తెలియదు.

652
00:48:48,865 --> 00:48:50,865
ఉపశీర్షికలు అనువదించినది ఎన్. సుజాత దేవి

653
00:48:50,945 --> 00:48:52,945
క్రియేటివ్ సూపర్‌వైజర్
నల్లవల్లి రవిందర్ రెడ్డి

