1
00:00:07,238 --> 00:00:09,824
<font face="sans-serif" size="52">శాంగ్‌కు తలబిరుసు, గర్వం,
అపరిపక్వత ఉండవచ్చు,</font>

2
00:00:09,907 --> 00:00:11,617
<font face="sans-serif" size="52">కానీ అతను చెడ్డవాడు కాదు.</font>

3
00:00:11,700 --> 00:00:13,494
<font face="sans-serif" size="52">-మీకు సాయం చేయనా?
-రీజెస్ పాటాఫ్.</font>

4
00:00:13,577 --> 00:00:16,539
<font face="sans-serif" size="52">అన్ని వ్యాపార విషయాలలో
నేను శాంగ్‌ గారితో సంప్రదించాలి.</font>

5
00:00:16,622 --> 00:00:21,544
<font face="sans-serif" size="52">ఇక మీరు తెలుసుకుంటారు...
ఇది శాంగ్ ఆకాంక్షలకు ప్రతిరూపం అని.</font>

6
00:00:21,627 --> 00:00:22,586
<font face="sans-serif" size="52">మనకు యజమానులు ఎవరు?</font>

7
00:00:22,670 --> 00:00:24,088
<font face="sans-serif" size="52">శాంగ్‌కు ఒకే ఒక బంధువు ఉంది.</font>

8
00:00:24,171 --> 00:00:26,882
<font face="sans-serif" size="52">అతని తల్లి, బుసాన్‌లో జీవిస్తోంది,
ఆమెకు ఇంగ్లీషు రాదు.</font>

9
00:00:26,966 --> 00:00:28,217
<font face="sans-serif" size="52">నువ్వు ఇక్కడ ఏం చేస్తావు?</font>

10
00:00:28,300 --> 00:00:30,177
<font face="sans-serif" size="52">నేను శాంగ్‌కు సృజనాత్మక సలహాదారుని.</font>

11
00:00:30,261 --> 00:00:34,306
<font face="sans-serif" size="52">-''సృజనాత్మక సలహాదారు''?
-నా హోదా నేనే పెంచుకున్నా.</font>

12
00:00:35,724 --> 00:00:38,561
<font face="sans-serif" size="52">పూర్తి అధికారం బదిలీ అయ్యేలా
రాయించుకున్నాడని అంటున్నావా?</font>

13
00:00:38,644 --> 00:00:39,478
<font face="sans-serif" size="52">నేను ఇది నమ్మను.</font>

14
00:00:39,562 --> 00:00:42,606
<font face="sans-serif" size="52">నీకు ఆ వాసన వస్తోందా?
అతిగా మాగిన పళ్ళలా.</font>

15
00:01:17,433 --> 00:01:18,726
<font face="sans-serif" size="52">హలో?</font>

16
00:01:18,809 --> 00:01:21,520
<font face="sans-serif" size="52">ఎలేన్? నేను రీజెస్ పాటాఫ్‌ను.</font>

17
00:01:22,563 --> 00:01:25,691
<font face="sans-serif" size="52">పాటాఫ్ గారు... అంతా బానే ఉందా?</font>

18
00:01:26,692 --> 00:01:27,776
<font face="sans-serif" size="52">ఇప్పుడు...</font>

19
00:01:28,986 --> 00:01:30,487
<font face="sans-serif" size="52">ఉదయం 3 గంటలు కావస్తోంది.</font>

20
00:01:32,114 --> 00:01:34,533
<font face="sans-serif" size="52">మామూలు రోజులకన్నా
నువ్వు ఆఫీసుకు...</font>

21
00:01:34,617 --> 00:01:37,703
<font face="sans-serif" size="52">కాస్త ముందుగా రాగలవా అని
అడగటానికి కాల్ చేశాను.</font>

22
00:01:42,207 --> 00:01:45,753
<font face="sans-serif" size="52">తప్పకుండా. అత్యవసరమైన పని ఉంటే,
నేను ఉ.8 గంటలకు రాగలను.</font>

23
00:01:47,171 --> 00:01:48,505
<font face="sans-serif" size="52">అది నిరాశపరిచింది.</font>

24
00:01:49,173 --> 00:01:51,884
<font face="sans-serif" size="52">నువ్వు వెనువెంటనే వస్తావని ఆశించాను.</font>

25
00:02:14,323 --> 00:02:15,574
<font face="sans-serif" size="52">హలో?</font>

26
00:02:15,783 --> 00:02:18,577
<font face="sans-serif" size="52">ఎలేన్? నేను రీజెస్ పాటాఫ్‌ను.</font>

27
00:02:18,661 --> 00:02:20,746
<font face="sans-serif" size="52">అవును, పాటాఫ్‌ గారు, ఇందాకే మాట్లాడాం.</font>

28
00:02:20,829 --> 00:02:23,248
<font face="sans-serif" size="52">మామూలు రోజులకన్నా
నువ్వు ఆఫీసుకు...</font>

29
00:02:23,332 --> 00:02:26,418
<font face="sans-serif" size="52">కాస్త ముందుగా రాగలవా అని
అడగటానికి కాల్ చేశాను?</font>

30
00:02:29,755 --> 00:02:31,507
<font face="sans-serif" size="52">నేను 40 నిమిషాల్లో రాగలను.</font>

31
00:02:36,220 --> 00:02:37,930
<font face="sans-serif" size="52">మీ సెషన్ ముగిసింది</font>

32
00:02:55,531 --> 00:02:58,117
<font face="sans-serif" size="52">ద కన్సల్టెంట్ - ఎస్1</font>

33
00:03:16,260 --> 00:03:18,095
<font face="sans-serif" size="52">నా పేరు ఎలేన్ హేమన్.</font>

34
00:03:18,178 --> 00:03:21,432
<font face="sans-serif" size="52">ఇప్పుడు మంగళవారం
ఉదయం 3‌‌‌‌‌‌‌:23 కావస్తోంది,</font>

35
00:03:21,932 --> 00:03:24,059
<font face="sans-serif" size="52">ఇది రికార్డ్ చేసే సమయానికి,</font>

36
00:03:24,184 --> 00:03:27,980
<font face="sans-serif" size="52">ఎల్ఏ నడిబొడ్డున ఉన్న కాంప్‌వేర్
కార్యాలయాలకు కారులో వెళుతున్నాను.</font>

37
00:03:30,065 --> 00:03:34,695
<font face="sans-serif" size="52">నాకు ఏమైనా జరిగితే,
ఈ సందేశాన్ని నా క్లౌడ్ నుండి వెలికితీస్తే,</font>

38
00:03:34,778 --> 00:03:38,282
<font face="sans-serif" size="52">ఏం జరిగిందో తెలుసుకోవడానికి
ఇది సహాయపడుతుందని ఆశిస్తున్నా.</font>

39
00:03:40,993 --> 00:03:44,496
<font face="sans-serif" size="52">లాస్ ఏంజెలెస్‌లోని విజయవంతమైన
మొబైల్ గేమ్ స్టూడియోల్లో పనిచేసే</font>

40
00:03:44,580 --> 00:03:45,706
<font face="sans-serif" size="52">సృజనాత్మక సలహాదారుగా,</font>

41
00:03:46,457 --> 00:03:48,667
<font face="sans-serif" size="52">శ్రమను, ఎక్కువ పని గంటలను ఆశిస్తాను.</font>

42
00:03:50,461 --> 00:03:53,839
<font face="sans-serif" size="52">విజయం సాధించడానికి ఏం చేయడానికైనా
ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను.</font>

43
00:03:55,466 --> 00:03:57,968
<font face="sans-serif" size="52">కానీ ఈ మనిషి ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు,</font>

44
00:03:58,052 --> 00:04:00,679
<font face="sans-serif" size="52">ఈ పదవికి ఎలా వచ్చాడో తెలియదు,</font>

45
00:04:03,098 --> 00:04:05,601
<font face="sans-serif" size="52">ఇతనికి ఎలాంటి అధికారం ఉందో నాకు తెలియదు.</font>

46
00:04:10,439 --> 00:04:11,523
<font face="sans-serif" size="52">లోపలికి రండి.</font>

47
00:04:15,319 --> 00:04:16,737
<font face="sans-serif" size="52">ఎందుకు ఇంత సమయం పట్టింది?</font>

48
00:04:18,447 --> 00:04:21,825
<font face="sans-serif" size="52">-నేను వాలీ నుండి కారులో వచ్చాను.
-కాస్త దగ్గరగా ఉండలేవా?</font>

49
00:04:23,410 --> 00:04:26,246
<font face="sans-serif" size="52">ఇద్దరు వర్థమాన నటులతో
అపార్ట్‌మెంట్ పంచుకుంటున్నా.</font>

50
00:04:27,164 --> 00:04:29,333
<font face="sans-serif" size="52">మేము అలాంటి దాన్నే భరించగలం.</font>

51
00:04:29,416 --> 00:04:31,418
<font face="sans-serif" size="52">4866 మగ్నోలియా.</font>

52
00:04:34,922 --> 00:04:36,131
<font face="sans-serif" size="52">నా చిరునామా మీకు తెలుసా?</font>

53
00:04:36,215 --> 00:04:39,968
<font face="sans-serif" size="52">ఎలైజా మరియు డైసీలతో.</font>

54
00:04:40,052 --> 00:04:41,762
<font face="sans-serif" size="52">ఇంకా నటులు కాని నటులతో.</font>

55
00:04:42,596 --> 00:04:43,889
<font face="sans-serif" size="52">అదేంటి?</font>

56
00:04:44,807 --> 00:04:45,849
<font face="sans-serif" size="52">అది నా గురించా?</font>

57
00:04:45,933 --> 00:04:47,309
<font face="sans-serif" size="52">ఇది నీ ఉద్యోగ ఫైల్.</font>

58
00:04:47,392 --> 00:04:49,228
<font face="sans-serif" size="52">ఇది రికార్డుల గదిలో చూశాను.</font>

59
00:04:50,270 --> 00:04:52,689
<font face="sans-serif" size="52">-మనకు రికార్డుల గది ఉందా?
-అవును మరి.</font>

60
00:04:53,440 --> 00:04:56,401
<font face="sans-serif" size="52">నేను సంప్రదించిన
ప్రతీ కంపెనీకి రికార్డుల గది ఉంది.</font>

61
00:04:57,402 --> 00:05:00,322
<font face="sans-serif" size="52">నేను... నేను ప్రతీదీ
సర్వర్‌పై ఉందని అనుకున్నాను.</font>

62
00:05:01,031 --> 00:05:03,242
<font face="sans-serif" size="52">కాగితాలు వాడవద్దని శాంగ్ అనేవాడు.</font>

63
00:05:03,325 --> 00:05:05,744
<font face="sans-serif" size="52">ఈ ఫైళ్ళ నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు.</font>

64
00:05:05,828 --> 00:05:08,497
<font face="sans-serif" size="52">ఉదాహరణకు, కాంప్‌వేర్ ఉద్యోగుల
సగటు వయసు</font>

65
00:05:08,580 --> 00:05:12,126
<font face="sans-serif" size="52">27 ఏళ్ళని నీకు తెలుసా?
నీ వయసు 27 ఏళ్ళు.</font>

66
00:05:12,584 --> 00:05:16,004
<font face="sans-serif" size="52">సగటు విద్యార్హత
బ్యాచిలర్స్ డిగ్రీ అని తెలుసా?</font>

67
00:05:16,088 --> 00:05:17,798
<font face="sans-serif" size="52">నీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉంది.</font>

68
00:05:17,881 --> 00:05:20,843
<font face="sans-serif" size="52">సగటు జీతం 62,000 డాలర్లని తెలుసా?</font>

69
00:05:22,010 --> 00:05:24,429
<font face="sans-serif" size="52">విషాధకరంగా,
నీ జీతం ఇంతకంటే కాస్త తక్కువే.</font>

70
00:05:26,306 --> 00:05:28,809
<font face="sans-serif" size="52">మీరు ఉ. 3 కి కాల్ చేసి,
రాత్రి దుస్తులలో</font>

71
00:05:28,892 --> 00:05:31,645
<font face="sans-serif" size="52">పిలిపించింది,
నేను సగటు ఉద్యోగినని చెప్పడానికా?</font>

72
00:05:37,776 --> 00:05:40,779
<font face="sans-serif" size="52">వివిధ రకాల చుర్రోస్. రెండు లవంగాలవి,</font>

73
00:05:40,863 --> 00:05:44,449
<font face="sans-serif" size="52">రెండు మాచా-క్రంచ్‌వి,
రెండు పిస్తా కలిపిన డార్క్ చాక్లెట్‌వి.</font>

74
00:05:49,288 --> 00:05:51,123
<font face="sans-serif" size="52">-ఎలేన్?
-ఏంటి?</font>

75
00:05:51,999 --> 00:05:55,669
<font face="sans-serif" size="52">లవంగమా, మాచా-క్రంచా,
లేక పిస్తా కలిసిన డార్క్ చాక్లెటా?</font>

76
00:05:57,713 --> 00:05:59,548
<font face="sans-serif" size="52">నేను అల్పాహారం ఇష్టపడే వ్యక్తి కాను.</font>

77
00:05:59,631 --> 00:06:03,135
<font face="sans-serif" size="52">ఉదయం 3 గంటలకు చుర్రోస్ కావాలంటే
చాలా దూరం కారులో వెళ్ళాలి.</font>

78
00:06:04,136 --> 00:06:05,804
<font face="sans-serif" size="52">అంతే సంగతులు, డానా.</font>

79
00:06:11,643 --> 00:06:12,644
<font face="sans-serif" size="52">కూర్చో.</font>

80
00:06:21,445 --> 00:06:23,197
<font face="sans-serif" size="52">ఇక్కడ ఎందుకున్నాను, పాటాఫ్ గారు?</font>

81
00:06:25,616 --> 00:06:28,076
<font face="sans-serif" size="52">సోల్ విమానాశ్రయం నుండి
గంటా 20 నిమిషాల క్రితం</font>

82
00:06:28,160 --> 00:06:31,622
<font face="sans-serif" size="52">లాస్ ఏంజెలెస్ గమ్యస్థానానికి,
ఒక ఫ్లయిట్ బయలుదేరింది.</font>

83
00:06:31,705 --> 00:06:33,540
<font face="sans-serif" size="52">అందులో ఉన్న ప్రయాణీకురాలు</font>

84
00:06:33,624 --> 00:06:36,043
<font face="sans-serif" size="52">శాంగ్ గారి ప్రయోజనాలకు
చేటు చేసే వ్యక్తి.</font>

85
00:06:36,710 --> 00:06:39,671
<font face="sans-serif" size="52">ఆమె తన ప్రయాణం పూర్తి చేయకూడదు.</font>

86
00:06:42,966 --> 00:06:45,802
<font face="sans-serif" size="52">ఓ వాణిజ్య విమానాన్ని
తిరిగి వెళ్ళిపోయేలా చేయమంటారా?</font>

87
00:06:46,595 --> 00:06:47,429
<font face="sans-serif" size="52">దారిలో ఉండగా?</font>

88
00:06:47,512 --> 00:06:49,890
<font face="sans-serif" size="52">నువ్వు సహజంగానే
సమస్యలు పరిష్కరిస్తావు, ఎలేన్.</font>

89
00:06:49,973 --> 00:06:52,226
<font face="sans-serif" size="52">-నీ ఫైల్‌లో అలా ఉంది.
-అలా ఉందా?</font>

90
00:06:54,436 --> 00:06:57,898
<font face="sans-serif" size="52">ఈ విమానంలో వస్తున్న వ్యక్తి ఎవరు?</font>

91
00:07:03,528 --> 00:07:04,655
<font face="sans-serif" size="52">ఆన్ సీ-వూ.</font>

92
00:07:06,365 --> 00:07:07,366
<font face="sans-serif" size="52">శాంగ్ అమ్మగారా?</font>

93
00:07:08,325 --> 00:07:09,409
<font face="sans-serif" size="52">ఇక్కడికి వస్తోందా?</font>

94
00:07:10,535 --> 00:07:15,499
<font face="sans-serif" size="52">శాంగ్ సృష్టించిన ప్రతీదాన్ని
ఆమె ముక్కలు చేసి, నాశనం చేయాలనుకుంటోంది.</font>

95
00:07:17,709 --> 00:07:19,169
<font face="sans-serif" size="52">అతని కలను.</font>

96
00:07:20,879 --> 00:07:21,964
<font face="sans-serif" size="52">అతని గమ్యాన్ని.</font>

97
00:07:25,175 --> 00:07:26,802
<font face="sans-serif" size="52">దేనితో శృంగారం చేశాడు?</font>

98
00:07:26,885 --> 00:07:27,803
<font face="sans-serif" size="52">అతని ముఖంతో.</font>

99
00:07:28,387 --> 00:07:29,513
<font face="sans-serif" size="52">అతని నోటితో.</font>

100
00:07:30,180 --> 00:07:33,225
<font face="sans-serif" size="52">గొంతుతో చేశాడు, సరేనా...
అంటే, అంత బాగలేదు.</font>

101
00:07:33,308 --> 00:07:35,811
<font face="sans-serif" size="52">బుజ్జీ, ఇది అధికారులకు తెలియజేయాలి.</font>

102
00:07:35,894 --> 00:07:37,813
<font face="sans-serif" size="52">లేదు, లేదు. మేము తెలుపబోతున్నాం.</font>

103
00:07:37,896 --> 00:07:39,982
<font face="sans-serif" size="52">"మేము"? దీన్ని ఇంకా ఎవరు చూశారు?</font>

104
00:07:40,983 --> 00:07:42,442
<font face="sans-serif" size="52">నేను, ఎలేన్ అంతే.</font>

105
00:07:44,319 --> 00:07:46,113
<font face="sans-serif" size="52">మీరు మళ్ళీ
సమయం గడుపుతున్నారా?</font>

106
00:07:46,822 --> 00:07:50,158
<font face="sans-serif" size="52">లేదు, మేము గడపటం లేదు.
ఇద్దరం ఒకే మునిగే పడవలో ఉన్నాం.</font>

107
00:07:53,245 --> 00:07:54,246
<font face="sans-serif" size="52">అవును.</font>

108
00:08:00,711 --> 00:08:04,256
<font face="sans-serif" size="52">నేను పని తర్వాత వస్తాను,
నాకు షాపింగ్‌లో సాయం చేయి.</font>

109
00:08:04,840 --> 00:08:05,841
<font face="sans-serif" size="52">మంచి సమయం ముందుంది.</font>

110
00:08:06,758 --> 00:08:08,468
<font face="sans-serif" size="52">-నువ్వంటే ఇష్టం.
-సరదాగా గడుపు.</font>

111
00:08:10,012 --> 00:08:12,639
<font face="sans-serif" size="52">అలాగే, బంగారం, ఆ చెడ్డ మనిషి</font>

112
00:08:12,723 --> 00:08:15,934
<font face="sans-serif" size="52">నీ నోట్లో ఏదైనా పెట్టాలని చూస్తే,
వచ్చి అమ్మకు చెప్పు.</font>

113
00:08:16,685 --> 00:08:17,686
<font face="sans-serif" size="52">సరే.</font>

114
00:08:31,491 --> 00:08:32,451
<font face="sans-serif" size="52">ఏం జరిగింది?</font>

115
00:08:32,534 --> 00:08:35,287
<font face="sans-serif" size="52">అతను అభివృద్ధి పలకను మొత్తం చెరిపేశాడు.</font>

116
00:08:35,370 --> 00:08:37,706
<font face="sans-serif" size="52">-ఎప్పటి నుండి?
-ఉదయం 5:30 నుండి.</font>

117
00:08:49,843 --> 00:08:50,927
<font face="sans-serif" size="52">నువ్వు...</font>

118
00:08:51,511 --> 00:08:54,222
<font face="sans-serif" size="52">మనం పని చేస్తున్న ప్రతీదాన్ని
అతను నాశనం చేయకూడదు.</font>

119
00:08:54,306 --> 00:08:56,141
<font face="sans-serif" size="52">కెర్‌ఫఫుల్ కూడా పోయింది.</font>

120
00:08:56,224 --> 00:08:58,602
<font face="sans-serif" size="52">తొంభై ఐదు మంది
ఏం పని చేయాలా అని చూస్తున్నారు.</font>

121
00:08:58,685 --> 00:08:59,895
<font face="sans-serif" size="52">కెర్‌ఫఫుల్!</font>

122
00:09:02,397 --> 00:09:03,732
<font face="sans-serif" size="52">కుదరదు. వాడు అయిపోయాడు.</font>

123
00:09:04,816 --> 00:09:06,026
<font face="sans-serif" size="52">అయిపోయాడంతే.</font>

124
00:09:12,991 --> 00:09:14,201
<font face="sans-serif" size="52">ఎక్కడికి వెళుతున్నావు?</font>

125
00:09:14,826 --> 00:09:18,038
<font face="sans-serif" size="52">పది వారాలుగా మలవిసర్జన
చేస్తున్న పిల్లులను చిత్రీకరించాను.</font>

126
00:09:18,121 --> 00:09:21,166
<font face="sans-serif" size="52">ఎందుకు? శాంగ్ ఆ పని కోసం
నెలకు 5,800 డాలర్లు చెల్లించాడు.</font>

127
00:09:21,792 --> 00:09:23,126
<font face="sans-serif" size="52">దాంతో నేను సర్దుకుపోయాను.</font>

128
00:09:23,210 --> 00:09:27,255
<font face="sans-serif" size="52">ఇప్పుడు ఈ వెధవ ఉన్నట్టుండి వచ్చి,
అదంతా చెరిపేయవచ్చని అనుకుంటున్నాడు.</font>

129
00:09:27,339 --> 00:09:29,132
<font face="sans-serif" size="52">క్రెగ్, ఈరోజు సెలవు తీసుకో.</font>

130
00:09:29,216 --> 00:09:33,261
<font face="sans-serif" size="52">-తర్వాత బాధపడటం కన్నా ఇప్పుడు ఆలోచించు.
-నేను సవాళ్ళను ఎదుర్కొంటాను.</font>

131
00:09:33,345 --> 00:09:36,431
<font face="sans-serif" size="52">-సరే. అతను వింత మనోస్థితిలో ఉన్నాడు.
-వాడే ఒక వింత మనోస్థితి.</font>

132
00:09:36,890 --> 00:09:38,308
<font face="sans-serif" size="52">-పక్కకు జరుగు.
-హేయ్.</font>

133
00:09:39,226 --> 00:09:41,311
<font face="sans-serif" size="52">శాంగ్ తల్లి సోల్ నుండి వస్తోంది.</font>

134
00:09:41,395 --> 00:09:43,355
<font face="sans-serif" size="52">-ఏంటి?
-ఆమె ఎప్పుడైనా ఫ్లయిట్ దిగవచ్చు.</font>

135
00:09:43,438 --> 00:09:45,107
<font face="sans-serif" size="52">నాకు అది ఎందుకు చెప్పలేదు?</font>

136
00:09:46,149 --> 00:09:48,443
<font face="sans-serif" size="52">ఓరి దేవుడా!
దాదాపు రాజీనామా చేసేశాను.</font>

137
00:09:49,861 --> 00:09:51,738
<font face="sans-serif" size="52">ఆమె ఉద్దేశ్యాలేంటో నాకు తెలియదు.</font>

138
00:09:51,822 --> 00:09:54,324
<font face="sans-serif" size="52">ఆగు. ఆమె
తన న్యాయవాదులతో వస్తుందంటావా?</font>

139
00:09:59,621 --> 00:10:01,540
<font face="sans-serif" size="52">-మరి?
-వ్యూహం మారింది.</font>

140
00:10:01,623 --> 00:10:02,833
<font face="sans-serif" size="52">బాబులు, దగ్గరగా రండి.</font>

141
00:10:04,000 --> 00:10:06,545
<font face="sans-serif" size="52">ఇదే నాటకం.
మనం మన తలలు వంచుకుని,</font>

142
00:10:06,628 --> 00:10:08,547
<font face="sans-serif" size="52">ఏదో పనిలో ఉన్నట్టు కనపడదాం,
ఎందుకంటే,</font>

143
00:10:08,630 --> 00:10:10,674
<font face="sans-serif" size="52">కొత్త యజమాని ఎక్కువ రోజులు
ఉండబోవటం లేదు.</font>

144
00:10:36,992 --> 00:10:39,744
<font face="sans-serif" size="52">ఏమండి... నాకు సాయం చేస్తారా?</font>

145
00:10:41,246 --> 00:10:43,248
<font face="sans-serif" size="52">క్షమించండి. ఈ భాష నేను మాట్లాడను.</font>

146
00:10:44,583 --> 00:10:48,003
<font face="sans-serif" size="52">మీ భాషను మీరు ఎంచుకోవాలి అలాగే...</font>

147
00:10:48,086 --> 00:10:49,337
<font face="sans-serif" size="52">ఒక్క నిమిషం ఆగండి.</font>

148
00:10:49,421 --> 00:10:52,132
<font face="sans-serif" size="52">మొదట ఇది
కొన్ని వాణిజ్య ప్రకటనలని చూపిస్తుంది.</font>

149
00:10:53,675 --> 00:10:55,677
<font face="sans-serif" size="52">శాంగ్ వూ... నేను అతని తల్లిని...</font>

150
00:10:57,387 --> 00:11:00,474
<font face="sans-serif" size="52">-ఆన్ గారు?
-శాంగ్. శాంగ్ వూ.</font>

151
00:11:00,557 --> 00:11:02,559
<font face="sans-serif" size="52">అవును. మీరు సరైన చోటికే వచ్చారు.</font>

152
00:11:02,642 --> 00:11:05,312
<font face="sans-serif" size="52">నా పేరు ఎలేన్ హేమన్.
నేను మీ అబ్బాయితో పని చేశాను.</font>

153
00:11:05,395 --> 00:11:06,396
<font face="sans-serif" size="52">రండి, కూర్చోండి.</font>

154
00:11:07,397 --> 00:11:09,399
<font face="sans-serif" size="52">రోసీ, మాకు నీళ్ళు తీసుకొస్తావా?</font>

155
00:11:10,567 --> 00:11:11,776
<font face="sans-serif" size="52">మీ బ్యాగ్ తీసుకుంటా.</font>

156
00:11:18,450 --> 00:11:20,869
<font face="sans-serif" size="52">సహచరులారా, దయచేసి మీకొక విజ్ఞప్తి.</font>

157
00:11:30,754 --> 00:11:33,840
<font face="sans-serif" size="52">ఈరోజున మనకొక
ప్రత్యేకమైన సందర్శకురాలు వచ్చారు.</font>

158
00:11:34,341 --> 00:11:35,509
<font face="sans-serif" size="52">మామా శాంగ్.</font>

159
00:11:36,343 --> 00:11:41,765
<font face="sans-serif" size="52">ఆమె అందమైన అబ్బాయి ఇదే మట్టిపై
ఎంతో హింసాత్మకంగా, దారుణంగా చంపబడ్డాడు.</font>

160
00:11:42,807 --> 00:11:46,102
<font face="sans-serif" size="52">శాంగ్‌కు వినమ్రులైన సేవకులు
అందరి తరపున...</font>

161
00:11:47,354 --> 00:11:51,399
<font face="sans-serif" size="52">మమ్మల్ని మీ బాధను తీసేయనివ్వండి.</font>

162
00:12:21,763 --> 00:12:22,764
<font face="sans-serif" size="52">మాట్లాడండి.</font>

163
00:12:23,682 --> 00:12:24,891
<font face="sans-serif" size="52">మనసు విప్పి మాట్లాడండి.</font>

164
00:12:31,606 --> 00:12:33,608
<font face="sans-serif" size="52">మా అబ్బాయి...</font>

165
00:12:35,610 --> 00:12:37,320
<font face="sans-serif" size="52">చాలా మంచి అబ్బాయి.</font>

166
00:12:37,737 --> 00:12:39,406
<font face="sans-serif" size="52">శాంగ్ మంచి అబ్బాయి.</font>

167
00:12:41,533 --> 00:12:44,869
<font face="sans-serif" size="52">వాడి హృదయంలో ప్రేమ ఉండేది.</font>

168
00:12:45,787 --> 00:12:46,955
<font face="sans-serif" size="52">మనందరిని ప్రేమించాడు.</font>

169
00:12:48,415 --> 00:12:49,749
<font face="sans-serif" size="52">కానీ...</font>

170
00:12:50,584 --> 00:12:53,253
<font face="sans-serif" size="52">వాడిని దుష్టత్వం బలి తీసుకుంది.</font>

171
00:12:56,506 --> 00:12:59,676
<font face="sans-serif" size="52">అతని జ్ఞాపకార్థం, మనం కష్టపడి పని చేయాలి.</font>

172
00:13:40,508 --> 00:13:44,721
<font face="sans-serif" size="52">డానా, ఈ రాత్రి మామా శాంగ్ బసకు
ఏర్పాటు చేశామా?</font>

173
00:13:45,221 --> 00:13:47,515
<font face="sans-serif" size="52">ఆమె తన సూట్‌కేస్‌తో పాటు వచ్చింది.</font>

174
00:13:47,849 --> 00:13:49,601
<font face="sans-serif" size="52">నాకు ఎవరూ ఏమీ చెప్పలేదు.</font>

175
00:13:50,268 --> 00:13:52,187
<font face="sans-serif" size="52">ఆమెకు పెన్రిత్‌లో స్వీట్ బుక్ చేయి.</font>

176
00:13:52,270 --> 00:13:55,649
<font face="sans-serif" size="52">తనని సందర్శించే విఐపీలందరికీ
శాంగ్ అక్కడే ఏర్పాటు చేసేవాడు.</font>

177
00:13:55,732 --> 00:13:58,109
<font face="sans-serif" size="52">అతని తల్లికి అలాగే చేసి ఉండేవాడు.</font>

178
00:13:58,193 --> 00:13:59,694
<font face="sans-serif" size="52">సరే, నాకు గందరగోళంగా ఉంది.</font>

179
00:13:59,778 --> 00:14:02,072
<font face="sans-serif" size="52">నేను అతని సహాయకురాలినా,
లేదా ఇంకా నువ్వేనా?</font>

180
00:14:02,155 --> 00:14:04,491
<font face="sans-serif" size="52">నువ్వే సహాయకురాలు.
నేను సృజనాత్మక సలహాదారు.</font>

181
00:14:06,076 --> 00:14:08,078
<font face="sans-serif" size="52">మళ్ళీ గుర్తు చేయి. అదేంటి?</font>

182
00:14:09,829 --> 00:14:13,333
<font face="sans-serif" size="52">ఆ గాజు పగలగొట్టడానికి
ఎంత ఒత్తిడి పెట్టాల్సి ఉంటుంది?</font>

183
00:14:13,416 --> 00:14:15,210
<font face="sans-serif" size="52">-అప్‌స్కర్ట్ గ్యాలరీ?
-అవును.</font>

184
00:14:15,293 --> 00:14:17,712
<font face="sans-serif" size="52">దానిపై ఏనుగుని నిలబెట్టవచ్చు.</font>

185
00:14:17,796 --> 00:14:20,924
<font face="sans-serif" size="52">ఏనుగా, కుదరదు.
బహుశా రెండు ఖడ్గమృగాలను పెట్టచ్చేమో.</font>

186
00:14:21,007 --> 00:14:24,969
<font face="sans-serif" size="52">-రెండు ఖడ్గమృగాల బరువు ఏనుగు కంటే ఎక్కువ.
-అది సరైనది అనుకోను.</font>

187
00:14:26,388 --> 00:14:28,056
<font face="sans-serif" size="52">హేయ్, భోజనానికి వస్తావా?</font>

188
00:14:28,139 --> 00:14:30,600
<font face="sans-serif" size="52">లేదు, బిజీగా ఉన్నట్టు
నటించడంలో బిజీగా ఉన్నాం.</font>

189
00:14:30,684 --> 00:14:31,768
<font face="sans-serif" size="52">నీకేం తెలుసు?</font>

190
00:14:31,851 --> 00:14:35,647
<font face="sans-serif" size="52">ఏనుగుల బరువు 5,900 కేజీలు,
ఖడ్గమృగాల బరువు గరిష్టంగా 3,200 కేజీలు.</font>

191
00:14:35,730 --> 00:14:38,608
<font face="sans-serif" size="52">ఆ గాజు ఎంత బలమైనది అంటే,
ఏనుగు మనపై నాట్యమాడవచ్చు.</font>

192
00:14:38,692 --> 00:14:40,985
<font face="sans-serif" size="52">-దానిపై పందెం కాస్తావా?
-కాయను.</font>

193
00:14:41,945 --> 00:14:44,864
<font face="sans-serif" size="52">మేము వెళ్ళి...
మేము వెళ్ళి భోజనం చేస్తాం.</font>

194
00:14:46,491 --> 00:14:48,284
<font face="sans-serif" size="52">అశ్వదళం ఎప్పుడు వస్తోంది?</font>

195
00:14:48,743 --> 00:14:51,079
<font face="sans-serif" size="52">ఆమె ఇంకా ఎవరిని
పనిలో పెట్టుకోలేదేమో.</font>

196
00:14:51,162 --> 00:14:53,790
<font face="sans-serif" size="52">రెండు వారాలే అయ్యింది.
ఆమె ఇంకా శోకంలోనే ఉంది.</font>

197
00:14:53,873 --> 00:14:56,668
<font face="sans-serif" size="52">అవును, వాడికి కొరియన్ భాష తెలుసు.
ఎందుకు తెలియదు?</font>

198
00:14:56,751 --> 00:14:59,379
<font face="sans-serif" size="52">ఆమెకు ఏదేదో చెప్పి
ఆమె చేత సంతకం చేయిస్తే?</font>

199
00:14:59,462 --> 00:15:03,049
<font face="sans-serif" size="52">-అన్ని జవాబులు నాకెలా తెలుస్తాయి?
-ఇది కొన్ని నెలలు పట్టవచ్చు.</font>

200
00:15:03,133 --> 00:15:05,510
<font face="sans-serif" size="52">-అలా అయితే, మనం వేచి చూద్దాం.
-వద్దు!</font>

201
00:15:05,593 --> 00:15:07,095
<font face="sans-serif" size="52">శాంగ్‌కు ఏం చేశాడో తెలుసుగా.</font>

202
00:15:07,178 --> 00:15:09,848
<font face="sans-serif" size="52">అలాంటి వెధవ కింద
మనం పని చేయలేం, చేయగలమా?</font>

203
00:15:12,350 --> 00:15:14,018
<font face="sans-serif" size="52">మనలో కొంతమంది చేయగలరు.</font>

204
00:15:14,394 --> 00:15:17,021
<font face="sans-serif" size="52">ఈ ఉద్యోగ పదవి
నాకు ఆరు నెలలు ఉంటే చాలు.</font>

205
00:15:17,772 --> 00:15:20,984
<font face="sans-serif" size="52">శాంగ్ నాకు వ్యక్తిగత రెఫరెన్స్ రాయలేడు,
కానీ పాటాఫ్ రాయగలడు.</font>

206
00:15:21,067 --> 00:15:24,696
<font face="sans-serif" size="52">రాత్రి దుస్తులతో, జట్టుకు వేసే రింగుతో
యజమానిని ఆకట్టుకోగలవా?</font>

207
00:15:24,779 --> 00:15:28,908
<font face="sans-serif" size="52">నాకు ఉదయం 3 గంటలకు ఫోన్ చేశాడు,
747 విమానాన్ని మార్గమధ్యంలో ఆపడానికి.</font>

208
00:15:28,992 --> 00:15:30,160
<font face="sans-serif" size="52">వీడు చాలా తిక్కోడు.</font>

209
00:15:30,243 --> 00:15:32,579
<font face="sans-serif" size="52">-మనం సరైన పని చేయాలి.
-ఒప్పుకుంటాను.</font>

210
00:15:34,080 --> 00:15:35,915
<font face="sans-serif" size="52">నేను చాలా అలసిపోయాను.
నాకు తెలియదు...</font>

211
00:15:36,541 --> 00:15:37,751
<font face="sans-serif" size="52">సరైన పని ఏంటి?</font>

212
00:15:39,711 --> 00:15:42,839
<font face="sans-serif" size="52">-మామా శాంగ్‌కు ఆ వీడియో ఇస్తాం.
-ఆమె చూడాల్సిన పని లేదు.</font>

213
00:15:42,922 --> 00:15:46,968
<font face="sans-serif" size="52">ఆమె చూడాల్సిన అవసరం లేదు, కానీ అది
తొలగింపు ప్రక్రియను వేగవంతం చేస్తుంది.</font>

214
00:15:47,051 --> 00:15:48,845
<font face="sans-serif" size="52">ఇప్పుడు ఏం చేయబోతున్నాడు?</font>

215
00:15:54,184 --> 00:15:55,935
<font face="sans-serif" size="52">మీరు వెళుతున్నారా, పాటాఫ్ గారు?</font>

216
00:15:56,811 --> 00:16:01,024
<font face="sans-serif" size="52">డానా ఎంతో సహృదయంతో మామా శాంగ్‌కు
పెన్రిత్‌లో గది బుక్ చేసింది.</font>

217
00:16:01,107 --> 00:16:02,776
<font face="sans-serif" size="52">ఆమెను అక్కడికి తీసుకెళుతున్నా.</font>

218
00:16:03,818 --> 00:16:06,279
<font face="sans-serif" size="52">పాటాఫ్ గారు.
డానా ఇది మీకు ఇవ్వమన్నారు.</font>

219
00:16:06,362 --> 00:16:08,031
<font face="sans-serif" size="52">ఇది హోటల్ చిరునామా.</font>

220
00:16:08,114 --> 00:16:09,991
<font face="sans-serif" size="52">నన్ను కారు ఏర్పాటు చేయమంటారా?</font>

221
00:16:10,617 --> 00:16:14,454
<font face="sans-serif" size="52">తన తల్లిని నేను వ్యక్తిగతంగా చూసుకోవాలని
శాంగ్ కోరుకునేవాడు.</font>

222
00:16:14,537 --> 00:16:18,041
<font face="sans-serif" size="52">ఆమె సురక్షితంగా
హోటల్లో చెకిన్ అయ్యేలా చూసుకుంటాను.</font>

223
00:16:18,333 --> 00:16:21,002
<font face="sans-serif" size="52">ఇలా రండి, అమ్మగారు.</font>

224
00:16:23,296 --> 00:16:24,506
<font face="sans-serif" size="52">ఆమె సూట్‌కేసు.</font>

225
00:16:27,884 --> 00:16:30,637
<font face="sans-serif" size="52">నువ్వు లేకపోతే మేము ఏం చేస్తాం, ఎలేన్?</font>

226
00:16:37,519 --> 00:16:41,147
<font face="sans-serif" size="52">ఒకడు అమ్మ, కొడుకు,
ఇద్దరితోనూ పడుకుంటే వాడిని ఏమంటారు?</font>

227
00:16:41,231 --> 00:16:43,066
<font face="sans-serif" size="52">అందుకు ఏదో పేరు ఉండే ఉంటుంది.</font>

228
00:17:05,046 --> 00:17:10,343
<font face="sans-serif" size="52">హేయ్, ఇయన్, నేను నా ఉద్యోగ ఫైల్‌
చూడాలనుకుంటే, ఎవరిని అడగాలి?</font>

229
00:17:10,426 --> 00:17:13,054
<font face="sans-serif" size="52">విన్నపాన్ని రాసి ఇవ్వు,
ఈమెయిల్‌లో పంపుతారు.</font>

230
00:17:13,137 --> 00:17:15,348
<font face="sans-serif" size="52">కాదు, అంటే కాగితపు నకలు.</font>

231
00:17:15,431 --> 00:17:18,601
<font face="sans-serif" size="52">-రికార్డుల గదిలో ఏముందో చూాడాలనుకుంటున్నా.
-ఏంటి?</font>

232
00:17:18,977 --> 00:17:20,186
<font face="sans-serif" size="52">రికార్డుల గది.</font>

233
00:17:21,771 --> 00:17:23,940
<font face="sans-serif" size="52">నీకు రికార్డుల గది గురించి తెలియదా?</font>

234
00:17:24,399 --> 00:17:26,192
<font face="sans-serif" size="52">మనకు స్టోర్‌రూమ్ ఉందనుకుంటా.</font>

235
00:17:26,943 --> 00:17:27,944
<font face="sans-serif" size="52">ఎక్కడుంది?</font>

236
00:18:27,462 --> 00:18:28,838
<font face="sans-serif" size="52">-ఏం చేస్తున్నావు?
-ఛత్.</font>

237
00:18:29,964 --> 00:18:32,634
<font face="sans-serif" size="52">వద్దు! వద్దు, వద్దు, వద్దు.</font>

238
00:18:32,717 --> 00:18:34,969
<font face="sans-serif" size="52">నువ్వు ఇది మామా శాంగ్‌కు ఇవ్వకపోతే,</font>

239
00:18:35,053 --> 00:18:38,097
<font face="sans-serif" size="52">నేనిస్తా, ఎందుకంటే వాడుంటే
నేను రేపు ఇక్కడికి రాను.</font>

240
00:18:43,144 --> 00:18:45,229
<font face="sans-serif" size="52">సరే. నేను ఇస్తాను.</font>

241
00:18:46,564 --> 00:18:47,774
<font face="sans-serif" size="52">ఒట్టు?</font>

242
00:19:13,383 --> 00:19:14,467
<font face="sans-serif" size="52">ధన్యవాదాలు.</font>

243
00:19:19,097 --> 00:19:20,473
<font face="sans-serif" size="52">-హాయ్.
-హాయ్. చెకిన్ కోసమా?</font>

244
00:19:21,057 --> 00:19:22,684
<font face="sans-serif" size="52">ఒక అతిథి కోసం వచ్చాను.</font>

245
00:19:22,767 --> 00:19:24,560
<font face="sans-serif" size="52">కాంప్‌వేర్ పేరు మీద బుక్ అయ్యింది.</font>

246
00:19:27,146 --> 00:19:28,606
<font face="sans-serif" size="52">గదిని బుక్ చేశారు,</font>

247
00:19:28,690 --> 00:19:31,275
<font face="sans-serif" size="52">కానీ ఆ బుకింగ్ కింద
ఇంకా ఎవరూ చెకిన్ చేయలేదు.</font>

248
00:19:31,359 --> 00:19:32,360
<font face="sans-serif" size="52">ఆమె ఇక్కడకు లేదా?</font>

249
00:19:55,800 --> 00:19:56,634
<font face="sans-serif" size="52">హే.</font>

250
00:19:56,718 --> 00:19:59,512
<font face="sans-serif" size="52">నేను హోటల్ దగ్గరున్నా,
కానీ ఎవరూ చెకిన్ చేయలేదు.</font>

251
00:19:59,595 --> 00:20:01,014
<font face="sans-serif" size="52">ఏంటి? ఆమెతోనే వెళ్ళాడు కదా?</font>

252
00:20:02,015 --> 00:20:03,474
<font face="sans-serif" size="52">భోజనానికి తీసుకెళ్ళాడేమో.</font>

253
00:20:03,558 --> 00:20:07,103
<font face="sans-serif" size="52">బహుశా ముక్కలుగా కోయబడి,
అతని కారు డిక్కీలో ఉందేమో.</font>

254
00:20:11,441 --> 00:20:14,027
<font face="sans-serif" size="52">-ఛత్, ఇక్కడికి వచ్చాడు.
-మీ ఇంటికా?</font>

255
00:20:14,110 --> 00:20:16,237
<font face="sans-serif" size="52">కాదు, ఆఫీసుకి.
ఇప్పుడే వచ్చాడు.</font>

256
00:20:16,320 --> 00:20:18,281
<font face="sans-serif" size="52">-ఒంటరిగా ఉన్నాడా?
-తెలియదు.</font>

257
00:20:19,741 --> 00:20:20,742
<font face="sans-serif" size="52">ఆ, ఒంటరిగా ఉన్నాడు.</font>

258
00:20:20,825 --> 00:20:22,035
<font face="sans-serif" size="52">ఆమె ఎక్కడుందో అడుగు.</font>

259
00:20:22,118 --> 00:20:23,578
<font face="sans-serif" size="52">నువ్వే అడుగు.</font>

260
00:20:25,872 --> 00:20:27,290
<font face="sans-serif" size="52">సరే, నేనే అడుగుతాను.</font>

261
00:20:27,415 --> 00:20:28,499
<font face="sans-serif" size="52">సరే, ఉంటాను.</font>

262
00:20:41,471 --> 00:20:44,348
<font face="sans-serif" size="52">మరీ పొద్దు పోయాక
కాల్ చేస్తున్నావు, ఎలేన్.</font>

263
00:20:44,432 --> 00:20:48,811
<font face="sans-serif" size="52">నాకు తెలుసు, క్షమించండి. అది...
సిబ్బంది కొంత సేకరించారు,</font>

264
00:20:48,895 --> 00:20:52,065
<font face="sans-serif" size="52">మామా శాంగ్‌కు పువ్వులు పంపితే
బాగుంటుందని అనుకున్నారు,</font>

265
00:20:52,148 --> 00:20:54,192
<font face="sans-serif" size="52">లేదా కొన్ని పళ్ళను.</font>

266
00:20:54,650 --> 00:20:56,486
<font face="sans-serif" size="52">మా అందరికీ శాంగ్ అంటే ఎంతో ఇష్టం.</font>

267
00:20:56,569 --> 00:20:58,488
<font face="sans-serif" size="52">అది సరైనది అనుకుంటే చేయండి.</font>

268
00:20:59,155 --> 00:21:03,618
<font face="sans-serif" size="52">నేను వాటిని ఎన్నో గదికి
లేదా స్వీట్‌కు పంపాలి, పాటాఫ్ గారు?</font>

269
00:21:04,702 --> 00:21:07,705
<font face="sans-serif" size="52">మీరు ఆమెను పెన్రిత్ హోటల్లోకి
చెకిన్ చేయించారు కదా?</font>

270
00:21:07,789 --> 00:21:10,208
<font face="sans-serif" size="52">లేదు. శాంగ్ తల్లి
వేరే ఏర్పాట్లు చేసుకుంది.</font>

271
00:21:10,291 --> 00:21:12,210
<font face="sans-serif" size="52">మనం హోటల్‌ను రద్దు చేయవచ్చు.</font>

272
00:21:14,462 --> 00:21:15,797
<font face="sans-serif" size="52">ఆమె ఎక్కడ బస చేస్తోంది?</font>

273
00:21:17,256 --> 00:21:18,800
<font face="sans-serif" size="52">ఆమె నాకు చెప్పలేదు.</font>

274
00:21:20,093 --> 00:21:22,095
<font face="sans-serif" size="52">కానీ మీరు ఆమెను ఎక్కడో దింపారు కదా,</font>

275
00:21:22,178 --> 00:21:23,721
<font face="sans-serif" size="52">ఆమె సూట్‌కేసుతో పాటు?</font>

276
00:21:23,805 --> 00:21:25,932
<font face="sans-serif" size="52">మేము ఎక్కడికి వెళ్ళాం?</font>

277
00:21:26,682 --> 00:21:29,185
<font face="sans-serif" size="52">అవును, ప్రయత్నించి గుర్తు తెచ్చుకోండి.</font>

278
00:21:30,686 --> 00:21:33,856
<font face="sans-serif" size="52">హంసల్లా కనిపించే,
కాలి తెడ్లతో నడిచే పడవలను చూడటం,</font>

279
00:21:33,940 --> 00:21:37,193
<font face="sans-serif" size="52">అవి తమాషాగానే
ఉన్నాయని అనుకోవటం నాకు గుర్తుంది.</font>

280
00:21:40,530 --> 00:21:44,492
<font face="sans-serif" size="52">డానా, నువ్వు మెక్‌ఆర్థర్ పార్క్ ప్రాంతంలో
అన్ని హోటల్స్‌కు కాల్ చేసి</font>

281
00:21:44,575 --> 00:21:47,453
<font face="sans-serif" size="52">ఆన్ సీ-వూ అనే
ఆమెను చెకిన్ చేశారా అని కనుక్కోవాలి.</font>

282
00:21:47,537 --> 00:21:49,205
<font face="sans-serif" size="52">స్నానం చేస్తున్నా, ఎలేన్.</font>

283
00:21:49,413 --> 00:21:51,249
<font face="sans-serif" size="52">సరే, కానీ ఫోను చేతిలోనే ఉంది కదా.</font>

284
00:22:05,596 --> 00:22:08,182
<font face="sans-serif" size="52">ట్రాఫిక్. 30 నిమిషాలు. సారీ.
ప్యాటి.</font>

285
00:22:28,119 --> 00:22:29,328
<font face="sans-serif" size="52">ఏమండి.</font>

286
00:22:29,412 --> 00:22:33,166
<font face="sans-serif" size="52">వంగపూల రంగులో పెద్ద సూట్‌కేస్‌తో
50ల్లో ఉన్న ఓ కొరియన్ మహిళని చూశారా?</font>

287
00:22:33,249 --> 00:22:34,542
<font face="sans-serif" size="52">క్షమించాలి, చూడలేదు.</font>

288
00:22:39,130 --> 00:22:40,256
<font face="sans-serif" size="52">ఏమండి.</font>

289
00:22:40,923 --> 00:22:45,094
<font face="sans-serif" size="52">నడివయసు, వంగపూల రంగు సూట్‌కేసుతో
ఉన్న కొరియన్ మహిళ కోసం చూస్తున్నా.</font>

290
00:22:45,469 --> 00:22:46,470
<font face="sans-serif" size="52">చూడలేదు.</font>

291
00:22:58,566 --> 00:23:01,152
<font face="sans-serif" size="52">-క్రెగ్.
-పాటాఫ్ గారు.</font>

292
00:23:01,861 --> 00:23:04,071
<font face="sans-serif" size="52">ఇంకా పని చేస్తున్నావు. ఇది ప్రశంసనీయం.</font>

293
00:23:04,155 --> 00:23:06,240
<font face="sans-serif" size="52">ఇంటికి వెళ్లడానికి వేచి చూస్తున్నా.</font>

294
00:23:07,742 --> 00:23:08,868
<font face="sans-serif" size="52">ఏంటది?</font>

295
00:23:09,827 --> 00:23:11,746
<font face="sans-serif" size="52">ఇది ఇంకా పూర్తి కాలేదు.</font>

296
00:23:11,829 --> 00:23:13,456
<font face="sans-serif" size="52">మరి, నాకు వివరించు.</font>

297
00:23:14,874 --> 00:23:19,128
<font face="sans-serif" size="52">సరే. ఇది గాజుకి చెందిన
తనన శక్తికి సంబంధించినది.</font>

298
00:23:19,212 --> 00:23:20,880
<font face="sans-serif" size="52">ఈ నీలపు రేఖ కనపడుతోంది కదా?</font>

299
00:23:20,963 --> 00:23:23,674
<font face="sans-serif" size="52">గాజు మోసే బరువుని లెక్కించే
యుఆర్‌ఎల్‌కు సంధానించా.</font>

300
00:23:23,758 --> 00:23:27,094
<font face="sans-serif" size="52">గాజు ఎంత మందంగా ఉంటే,
మనం అంత బరువు మోపవచ్చు. కాబట్టి...</font>

301
00:23:28,137 --> 00:23:30,431
<font face="sans-serif" size="52">ఒక ఏనుగు, అది ఫర్వాలేదు.</font>

302
00:23:30,890 --> 00:23:34,518
<font face="sans-serif" size="52">ఆపై ఏనుగు, ఖడ్గమృగం,
అది కూడా ఫర్వాలేదు.</font>

303
00:23:35,978 --> 00:23:37,813
<font face="sans-serif" size="52">ఏనుగు, ఖడ్గమృగం, కోతి.</font>

304
00:23:40,566 --> 00:23:41,567
<font face="sans-serif" size="52">కోతి చెడ్డది.</font>

305
00:23:43,319 --> 00:23:44,862
<font face="sans-serif" size="52">అవి ఎక్కడికి పోయాయి?</font>

306
00:23:44,946 --> 00:23:48,032
<font face="sans-serif" size="52">-అవన్నీ కిందకు పడ్డాయి.
-కింద ఏముంది?</font>

307
00:23:48,115 --> 00:23:51,744
<font face="sans-serif" size="52">ఏమైనా ఉండవచ్చు.
లోహపు ముళ్ళు ఉండవచ్చు,</font>

308
00:23:52,161 --> 00:23:56,999
<font face="sans-serif" size="52">లేక ట్రాంపొలీన్లు ఉండవచ్చు లేదా... ఏవైనా.</font>

309
00:23:57,917 --> 00:24:00,670
<font face="sans-serif" size="52">అక్కడ ఏం ఉండాలని అనుకుంటున్నావు, క్రెగ్?</font>

310
00:24:02,546 --> 00:24:06,008
<font face="sans-serif" size="52">ఏం కనుక్కోవాలని అనుకుంటున్నావు,
నువ్వు పడిపోవడం ఆగినప్పుడు?</font>

311
00:24:08,386 --> 00:24:10,388
<font face="sans-serif" size="52">ఇది ఆడాలని ఉంది.
ఎప్పుడు సిద్ధమవుతుంది?</font>

312
00:24:12,348 --> 00:24:15,559
<font face="sans-serif" size="52">బహుశా మనం మొదట ఎలేన్‌తో మాట్లాడాలేమో?</font>

313
00:24:16,269 --> 00:24:17,186
<font face="sans-serif" size="52">ఎలేన్?</font>

314
00:24:19,105 --> 00:24:20,564
<font face="sans-serif" size="52">ఆమె మీ సృజనాత్మక సలహాదారు.</font>

315
00:24:20,648 --> 00:24:23,818
<font face="sans-serif" size="52">ఆమె ఇలాంటి పనులు చేస్తుంది,
మీరు చేయాల్సిన అవసరం లేకుండా.</font>

316
00:24:23,901 --> 00:24:25,111
<font face="sans-serif" size="52">అవుననుకో. ఎలేన్.</font>

317
00:24:25,194 --> 00:24:27,613
<font face="sans-serif" size="52">మనలో మాట,
అసలు తను ఇక్కడ చేసే పనేంటా అని</font>

318
00:24:27,697 --> 00:24:29,490
<font face="sans-serif" size="52">నేను ఆశ్చర్యపోతున్నాను.</font>

319
00:24:29,573 --> 00:24:30,574
<font face="sans-serif" size="52">చక్కటి పని.</font>

320
00:24:31,742 --> 00:24:32,994
<font face="sans-serif" size="52">థాంక్స్, యజమాని గారు.</font>

321
00:25:13,576 --> 00:25:16,037
<font face="sans-serif" size="52">-అతను దాన్ని చేయమన్నాడు.
-ఏంటి?</font>

322
00:25:16,120 --> 00:25:19,040
<font face="sans-serif" size="52">రెండేళ్ళలో, నేను ఇచ్చిన
ఒక్క ఆలోచనని శాంగ్ తీసుకోలేదు,</font>

323
00:25:19,123 --> 00:25:21,625
<font face="sans-serif" size="52">ఇక పాటాఫ్ వచ్చాడు,
వచ్చిన రెండు రోజుల్లోనే...</font>

324
00:25:21,709 --> 00:25:22,960
<font face="sans-serif" size="52">తను మామా శాంగ్‌ని చంపాడు.</font>

325
00:25:24,337 --> 00:25:26,505
<font face="sans-serif" size="52">-ఆగు, ఏంటి?
-తను ఎక్కడుందో నాకు తెలియదు.</font>

326
00:25:26,589 --> 00:25:28,174
<font face="sans-serif" size="52">డానాకు తన జాడ తెలియలేదు. నేను,</font>

327
00:25:28,966 --> 00:25:30,217
<font face="sans-serif" size="52">పోలీసులకు కాల్ చేయనా?</font>

328
00:25:30,301 --> 00:25:33,929
<font face="sans-serif" size="52">వద్దు. ఏమని? ఏమని చెప్తావు?
పర్యాటకురాలు కనపడం లేదనా.</font>

329
00:25:34,013 --> 00:25:37,892
<font face="sans-serif" size="52">ఏంటిది. బహుశా ఆమె శోకం నుండి
తేరుకోవడానికి కొంత సమయం కావాలేమో.</font>

330
00:25:42,104 --> 00:25:44,523
<font face="sans-serif" size="52">-శుభరాత్రి, క్రెగ్.
-ఆగు, ఆగు, ఆగు.</font>

331
00:25:44,607 --> 00:25:47,068
<font face="sans-serif" size="52">ఏంటి? నాపై కోప్పడుతున్నావా?</font>

332
00:25:47,860 --> 00:25:50,112
<font face="sans-serif" size="52">నీపై కోప్పడటానికి కూడా అలసటగా ఉంది.</font>

333
00:25:50,196 --> 00:25:52,740
<font face="sans-serif" size="52">నొస్తోంది. మూడు గంటలే నిద్రపోయాను.</font>

334
00:25:52,823 --> 00:25:55,326
<font face="sans-serif" size="52">నేను కేవలం టీ, చుర్రోస్ మాత్రమే తిన్నా.</font>

335
00:25:55,409 --> 00:25:59,121
<font face="sans-serif" size="52">స్పష్టంగా ఆలోచించలేకపోతున్నా,
ఇప్పుడు వాలీకి 40 నిమిషాలు బండి నడపాలి.</font>

336
00:25:59,205 --> 00:26:02,875
<font face="sans-serif" size="52">101 రహదారిని మూసేశారని విన్నావా?
నా జీవితం తగలడా!</font>

337
00:26:04,460 --> 00:26:06,670
<font face="sans-serif" size="52">కాన్యన్ పర్వతంపై
పాకుకుంటూ పోతున్నాయి.</font>

338
00:26:06,754 --> 00:26:08,881
<font face="sans-serif" size="52">నా బండి వస్తోంది. బానే ఉన్నావా?</font>

339
00:26:09,965 --> 00:26:11,175
<font face="sans-serif" size="52">ఎప్పుడూ బానే ఉంటాను.</font>

340
00:26:11,258 --> 00:26:14,804
<font face="sans-serif" size="52">సరే. కాస్తంత నిద్రపో,
ఎందుకంటే రేపు మనం పని చేయాలి.</font>

341
00:26:14,887 --> 00:26:16,555
<font face="sans-serif" size="52">-సరే.
-ఉంటాను.</font>

342
00:27:00,808 --> 00:27:03,436
<font face="sans-serif" size="52">సుస్వాగతం
మామా శాంగ్</font>

343
00:27:57,907 --> 00:28:00,784
<font face="sans-serif" size="52">రికార్డులు</font>

344
00:29:20,447 --> 00:29:22,449
<font face="sans-serif" size="52">సబ్‌టైటిల్ అనువాద కర్త
Pradeep Kumar Maheshwarla</font>

345
00:29:22,533 --> 00:29:24,535
<font face="sans-serif" size="52">క్రియేటివ్ సూపర్‌వైజర్
వలవల రాజేశ్వరరావు</font>

