1
00:00:14,724 --> 00:00:16,767
న్యాయాధిపతులు గ్రంథంలో,

2
00:00:16,851 --> 00:00:20,771
యుద్ధంలో తన మనుషులను ఎలా ఎంచుకోవాలని
దేవుడిని గిడియన్ అడుగుతాడు.

3
00:00:23,607 --> 00:00:28,279
తన మనుషులను నది దగ్గరకు తీసుకెళ్లి, తాగమని
చెప్పమని గిడియన్కు ప్రభువు చెబుతాడు.

4
00:00:30,364 --> 00:00:34,952
పొట్ట నిండా కుక్కల మాదిరి నీళ్లు నింపుకునే
మనుషులు, అతనికి శ్రేయస్కరం కాదు.

5
00:00:37,455 --> 00:00:38,914
గిడియన్ చూశాడు

6
00:00:39,582 --> 00:00:43,836
కొందరు మోకరిల్లి, ఒకవైపు నీరు తాగుతూ
మరోవైపు చేతిలో ఈటెలతో

7
00:00:44,962 --> 00:00:46,422
చుట్టూ పరికిస్తున్నారు.

8
00:00:48,966 --> 00:00:50,760
వాళ్లు కొందరే అయినా,

9
00:00:52,511 --> 00:00:54,597
అతనికి కావాల్సినది వాళ్లే.

10
00:00:55,639 --> 00:00:57,391
పొజిషన్, ఆయుధాలు.

11
00:00:59,268 --> 00:01:02,104
సిద్ధం. గురి పెట్టండి. కాల్చండి.

12
00:01:04,231 --> 00:01:06,275
వెనుకకు. వెనుకకు.

13
00:01:08,110 --> 00:01:10,988
సిద్ధం. గురి పెట్టండి. కాల్చండి.

14
00:01:12,698 --> 00:01:15,826
ఇన్సిర్లిక్ ఎయిర్ బేస్
రెండు వారాల క్రితం

15
00:01:15,951 --> 00:01:17,328
అల్ఫా, దగ్గరకు రండి.

16
00:01:24,251 --> 00:01:26,629
కెమికల్ కహానీపై
ముందుకు సాగేందుకు అనుమతి.

17
00:01:26,712 --> 00:01:27,838
అదిరింది!

18
00:01:29,715 --> 00:01:33,594
వాడు మళ్లీ సిరియాకు వచ్చాడు.
మరో దాడి ఆసన్నమైందని ఇంటెల్ ధృవీకరణ.

19
00:01:33,677 --> 00:01:34,887
ఆగు, డానీ ఎక్కడ?

20
00:01:34,970 --> 00:01:37,765
మెడికల్ రూంలో తనకు సెలైన్ పెట్టారు.
తలనొప్పి వచ్చిందట.

21
00:01:37,848 --> 00:01:38,682
తలనొప్పా?

22
00:01:38,766 --> 00:01:40,392
పరుగు వల్ల డీహైడ్రేట్ అయ్యాడు.

23
00:01:40,476 --> 00:01:41,560
పరుగు కాదులే.

24
00:01:41,644 --> 00:01:43,854
ఎలక్ట్రోలైట్స్ ఇస్తున్నాను.
బాగుంటాడు.

25
00:01:43,938 --> 00:01:46,732
అతని భార్య బిడ్డకు జన్మనివ్వనుండడంతో
భయపడుతున్నాడు.

26
00:01:46,816 --> 00:01:47,775
బూజర్ బిడ్డ కోసం!

27
00:01:48,526 --> 00:01:50,361
అవును, అవును. లెక్రోన్.

28
00:01:50,444 --> 00:01:52,404
బుల్లి బూజర్ ఉండడం మంచిదేలే.

29
00:01:52,488 --> 00:01:54,490
ఐదడుగులు రెండు అంగుళాలకు చేరినా సరే!

30
00:01:54,573 --> 00:01:56,283
నువ్వో వెధవవి. 5 అ. 3 అం.

31
00:01:56,367 --> 00:01:58,118
సరే, గయ్స్. అనవసర మాటలు ఆపండి.

32
00:01:58,619 --> 00:02:00,204
డానీ, నీకెలా ఉంది?

33
00:02:00,287 --> 00:02:01,956
బాగా దారుణంగా, సర్.

34
00:02:02,915 --> 00:02:05,125
సరే. అయితే, యుద్ధం మొదలుపెడదాం.

35
00:02:06,085 --> 00:02:06,961
సరే, అబ్బాయిలు.

36
00:02:07,044 --> 00:02:10,881
మనం తీరం దాటాక 800 మీటర్ల దూరంలో
దేశీయ చేపల ట్రాలర్లో వెళతాం.

37
00:02:10,965 --> 00:02:13,050
మన లక్ష్యం వైపు తూర్పుకు ఈతకొడతాం.

38
00:02:13,133 --> 00:02:14,718
అధిక అలల తాకిడి 0232 ఉంటుంది.

39
00:02:14,802 --> 00:02:15,928
మధ్యధరా సముద్రం
సిరియన్ తీరం నుంచి 5 కి.మీ.

40
00:02:16,011 --> 00:02:18,889
అక్కడంతా చీకటిగా ఉంటుంది.
చంద్రుడి వెలుగు 14 శాతమే.

41
00:02:29,275 --> 00:02:30,860
గట్టి సున్నపురాయితో ఉండే

42
00:02:30,943 --> 00:02:33,737
ఈ సొరంగాలు 20 లేదా 30 అడుగులు
ఉన్నట్లు కనబడుతోంది.

43
00:02:33,821 --> 00:02:35,865
బ్యాట్మాన్, సిగ్నోర్ దళం వచ్చినా సరే,

44
00:02:35,948 --> 00:02:37,199
వెళ్లడం అసాధ్యం.

45
00:02:38,075 --> 00:02:41,704
సమాచారం అందించే ఉత్తమ మార్గం,
ప్రవేశ మార్గం దగ్గర రిలేలు,

46
00:02:41,787 --> 00:02:43,706
దారి వెంట పరికరాలు వదలడమే.

47
00:02:43,789 --> 00:02:48,168
మనం క్రిప్ట్లో యాక్సెస్ పాయింట్కు చేరాక
మన కమ్యూనికేషన్ తిరిగి తేవాలి.

48
00:02:48,294 --> 00:02:50,546
సరే, మనం సొరంగ మ్యాప్లను
నమ్మగలమా, సర్?

49
00:02:50,629 --> 00:02:53,132
సిరియన్ డెమోక్రటిక్ దళాలు
లోకల్ ట్రూపర్ ఇచ్చారు

50
00:02:53,215 --> 00:02:55,843
అతను కాంపౌండ్ కింద సొరంగాల్లో
ఆడుకుంటూ పెరిగాడు.

51
00:02:55,926 --> 00:02:57,386
అది అతనికి వ్యక్తిగతం.

52
00:02:57,469 --> 00:03:00,639
అతని కుటుంబాన్ని కహానీ చంపేశాడు.
మన ఆపరేషన్లో తోడుంటాడు.

53
00:03:01,098 --> 00:03:02,099
సరే.

54
00:03:03,434 --> 00:03:04,810
ఐదు కి.మీ.ల దూరంలో, సర్.

55
00:03:06,562 --> 00:03:09,064
అందరూ, పైనుంచి
దూకేందుకు సిద్ధమవండి.

56
00:03:13,152 --> 00:03:15,404
ఫీల్డ్ బాగుంది, చీఫ్. మీ అంచనా?

57
00:03:15,487 --> 00:03:17,156
కహానీ రాడార్లో ఉన్నాడు.

58
00:03:17,239 --> 00:03:20,492
కాంపౌండ్ కు కాపలా తక్కువ ఉంటుందని
నాకు అనిపిస్తోంది.

59
00:03:20,576 --> 00:03:24,747
మనం అనుకున్నది జరగకపోతే,
మనకు 10 మైళ్ల దూరంలో క్యూఆర్ఎఫ్ ఉంటుంది.

60
00:03:25,331 --> 00:03:26,457
సరిగ్గా ఉంది, సర్.

61
00:03:28,125 --> 00:03:28,959
ఒప్పుకుంటాను.

62
00:03:30,210 --> 00:03:34,131
నిశ్శబ్దంగా ఉంచాలి. వెళ్లి, వచ్చేటప్పుడు.
మనం వచ్చామని ఎవరికీ తెలియకూడదు.

63
00:04:05,287 --> 00:04:07,581
మీకు తెలిసినట్లు బ్వోరా
ప్లాటూన్ చేరుకుంది.

64
00:04:07,665 --> 00:04:12,086
కాక్స్ ఇక్కడే ఉండే అవకాశం ఇచ్చాడు,
తిరిగి రావడంలో భాగంగా అప్పగించాలి.

65
00:04:12,795 --> 00:04:15,464
మేము వెళ్లిపోయేందుకు
ఇక్కడకు రామని చెప్పాను.

66
00:04:15,547 --> 00:04:18,175
ఇంకా ఈ సన్నాసి సంగతి చూడాలి.
మనం ఆల్ఫా.

67
00:04:18,759 --> 00:04:20,636
-నీ మాట నిజం.
-అది పూర్తి నిజం.

68
00:04:20,719 --> 00:04:22,304
సరే. మంచిది.

69
00:04:23,555 --> 00:04:25,140
అంతటా పరిశీలించండి, బాయ్స్.

70
00:04:26,517 --> 00:04:27,726
ఇది జరిగేలా చేద్దాం.

71
00:04:43,826 --> 00:04:44,827
వెళ్లండి.

72
00:04:47,538 --> 00:04:48,372
వెళదాం పదండి.

73
00:05:36,128 --> 00:05:38,630
లెక్రోన్, ఫ్లెచర్, కామ్స్ కొనసాగించండి.

74
00:05:39,840 --> 00:05:41,216
-విన్నాం.
-అలాగే, సరే.

75
00:06:24,343 --> 00:06:25,928
యాక్సెస్ పాయింట్, 60 అడుగులు.

76
00:06:42,152 --> 00:06:43,445
సర్, జీక్ సూచిస్తోంది.

77
00:06:44,238 --> 00:06:46,907
ఆగండి! ఈఓడీ ముందుకు రండి!
కామ్స్ వద్దు!

78
00:06:56,792 --> 00:06:58,210
వైట్ లైట్తో పరిశీలించాలి.

79
00:07:19,940 --> 00:07:21,900
ఇవి విరిగిపడే చరియలు, సర్.

80
00:07:23,152 --> 00:07:25,112
ఈ చోటు పేలేందుకు సిద్ధంగా ఉంది.

81
00:07:25,195 --> 00:07:28,699
సమాచారం బయటకు పంపు. యాక్సెస్ పాయింట్కు
వెళ్లలేమని తెలియాలి.

82
00:07:28,782 --> 00:07:29,700
అలాగే, సర్.

83
00:07:34,329 --> 00:07:36,707
ఎదురుదాడి! ఎదురుదాడి, వస్తున్నారు!

84
00:07:37,666 --> 00:07:38,709
ఎంతమంది వచ్చారు?

85
00:07:38,959 --> 00:07:41,378
వెనుకవైపు భారీ దాడి, సర్.
వారికి రక్షణ అవసరం!

86
00:07:41,461 --> 00:07:44,089
క్రాస్ పొజిషన్ కోసం
ఫైర్ టీంను కలిపి ఉంచుదాం.

87
00:07:44,173 --> 00:07:45,340
-అర్ధమైంది.
-కదలండి!

88
00:07:46,466 --> 00:07:47,968
లెక్రోన్! నువ్వేం చెబుతావు?

89
00:07:49,178 --> 00:07:50,679
లెక్రోన్, వెనుక చూసుకో!

90
00:07:56,351 --> 00:07:57,603
ఛ! లెక్రోన్ కు తగిలింది!

91
00:07:57,853 --> 00:07:59,021
వెళ్లండి, వెళ్లండి!

92
00:08:01,315 --> 00:08:03,233
వెళుతూ ఉండండి! వెళ్లండి!

93
00:08:04,526 --> 00:08:05,485
ఆపండి!

94
00:08:08,614 --> 00:08:09,489
రక్షణ పొందండి!

95
00:08:09,948 --> 00:08:11,241
రక్షణ పొందండి!

96
00:08:13,994 --> 00:08:15,871
బార్నెస్, ఆ వెధవను చంపెయ్!

97
00:08:18,540 --> 00:08:19,499
వాళ్ల అంతు చూడు!

98
00:08:25,130 --> 00:08:25,964
సురక్షితం!

99
00:08:26,048 --> 00:08:28,133
వీళ్లను బయటకు తీసుకెళ్లండి!

100
00:08:28,217 --> 00:08:29,801
లోపలకు వచ్చేశారు! కిందకు!

101
00:08:33,013 --> 00:08:34,973
వెనుక క్రిప్ట్ వైపుకు! వెంటనే! పదండి!

102
00:08:47,694 --> 00:08:49,613
వాళ్లను వెనుకకు తీసుకురండి!

103
00:08:49,738 --> 00:08:51,865
ఎడమవైపు వెళ్లండి!
ఎడమవైపు 50 అడుగులు!

104
00:08:51,949 --> 00:08:52,824
వెళ్లండి!

105
00:08:53,784 --> 00:08:54,826
వెళుతున్నాం!

106
00:09:01,124 --> 00:09:02,334
బార్నెస్! ఆ సంగతి చూడు!

107
00:09:08,882 --> 00:09:11,218
పద. నిన్ను పట్టుకున్నా, సోదరా!

108
00:09:14,471 --> 00:09:16,306
-చివరివాడు!
-చివరివాడు! సరే!

109
00:09:17,266 --> 00:09:19,268
అదిలా ఇస్తావా? వచ్చెయ్!

110
00:09:29,861 --> 00:09:32,281
సర్, మనం క్యూఆర్ఎఫ్ ను వెంటనే
వేగవంతం చేయాలి!

111
00:09:32,614 --> 00:09:35,742
హేయ్! నీ మనిషిని శాంతించమను!
మన ప్రాణనష్టం ఎంత, రెల్?

112
00:09:35,867 --> 00:09:39,037
ఇద్దరు చనిపోయారు,
బార్నెస్ ఊపిరి తీసుకోలేకపోతున్నాడు.

113
00:09:39,871 --> 00:09:43,041
హేయ్, సోదరా!
హేయ్, హేయ్! నా మాట విను.

114
00:09:43,667 --> 00:09:46,753
మిమ్మల్ని బయటకు తీసుకెళతా.
చూసుకుంటాను, సోదరా.

115
00:09:49,965 --> 00:09:51,967
-మాలొరీకి తగిలింది!
-వస్తూనే ఉన్నారు!

116
00:09:57,014 --> 00:09:59,099
బూజర్! నాతో రా! సమాచారం పంపించాలి.

117
00:09:59,182 --> 00:10:01,268
క్యూఆర్ ఒకటి పొందాలి! పదండి!

118
00:10:01,893 --> 00:10:04,479
క్రౌలీ! యాక్సెస్ పాయింట్కు పద! వెళ్లు!

119
00:10:04,563 --> 00:10:05,772
వెళ్లండి, వెళ్లండి!

120
00:10:08,025 --> 00:10:10,027
ట్రిప్ వైర్. క్రాస్కు సిద్ధం. ఇక్కడే.

121
00:10:10,110 --> 00:10:11,278
-జాగ్రత్త!
-ఎక్కడుంది?

122
00:10:11,361 --> 00:10:13,905
-జాగ్రత్త. ట్రిప్ వైర్, కాళ్లు జాగ్రత్త!
-ఎక్కడ?

123
00:10:13,989 --> 00:10:16,742
క్రౌలీ, ట్రిగ్గర్ను చూడు.
విషయం చెప్పు. వెంటనే!

124
00:10:16,825 --> 00:10:17,826
సర్, చూస్తున్నా.

125
00:10:21,246 --> 00:10:22,497
ఏం చెబుతావు, బూజర్?

126
00:10:22,581 --> 00:10:23,665
బయటకు వెళ్లే దారుంది.

127
00:10:23,832 --> 00:10:26,084
సమాచారం పైకి పంపు, క్యూఆర్ఎఫ్కు పంపు!

128
00:10:32,257 --> 00:10:36,511
ట్రూప్ లతో సంప్రదింపు. చాలామంది చనిపోయారు.
క్యూఆర్ఎఫ్ ఆరంభించాలి. వెంటనే.

129
00:10:37,679 --> 00:10:39,306
వద్దు! వద్దు! వెనక్కు రా.

130
00:10:39,806 --> 00:10:41,016
ఆ ట్రూపర్ ను ఆపండి!

131
00:11:16,593 --> 00:11:19,805
హేయ్, పికాసో.
ఏం చిత్రిస్తున్నావో చూపిస్తావా?

132
00:11:33,527 --> 00:11:34,694
అదేంటి?

133
00:11:57,843 --> 00:11:59,803
అది బాగానే ఉంటుందా, నాన్నా?

134
00:12:05,934 --> 00:12:06,935
నాన్నా!

135
00:12:21,116 --> 00:12:21,950
లూసీ!

136
00:12:46,349 --> 00:12:48,810
డానీ. బాగున్నావా? డానీ?

137
00:12:53,857 --> 00:12:55,567
పైకి లే, రీస్, పద!

138
00:12:58,361 --> 00:13:00,655
రీస్! మేలుకో!

139
00:13:03,033 --> 00:13:04,659
పద, బాబూ! పైకి లే!

140
00:13:08,205 --> 00:13:10,248
కోర్టీస్, నీ వైపు వస్తున్నాను!

141
00:13:17,214 --> 00:13:18,215
కోర్టీస్!

142
00:13:21,718 --> 00:13:22,719
నాతో వెనుక రా!

143
00:13:26,640 --> 00:13:28,183
కాల్పులు ఆపండి!

144
00:13:28,266 --> 00:13:30,143
-కాల్పులు ఆపండి! మనవాళ్లే!
-రీస్!

145
00:13:30,227 --> 00:13:31,895
-మాట్లాడు, కోర్టీస్!
-ఎంతమంది?

146
00:13:31,978 --> 00:13:33,230
సోదరా, సమాచారం ఏంటి?

147
00:13:45,575 --> 00:13:47,244
రండి. పదండి, పదండి.

148
00:14:20,986 --> 00:14:23,196
తీసుకెళ్లేందుకు వస్తున్నారు!
ఆ చోటుకు వెళదాం!

149
00:14:23,280 --> 00:14:25,323
-రెండు నిమిషాలు!
-కోర్టీస్, పద!

150
00:14:25,407 --> 00:14:27,284
-పైకి! పైకి!
-పైకి రండి!

151
00:14:27,367 --> 00:14:29,995
-పైకి, పైకి, పదండి.
-నిన్ను తీసుకెళతాం!

152
00:14:30,161 --> 00:14:33,206
-పదండి.
-త్వరగా! పదండి, వెళ్లండి!

153
00:14:33,290 --> 00:14:36,334
-ఆ కాల్పులు ఆపేలా చేయండి.
-వేగంగా కాల్పులు జరపండి!

154
00:14:36,793 --> 00:14:38,670
వెళ్లండి! వాళ్లకు మద్దతివ్వండి!

155
00:14:44,467 --> 00:14:46,344
సర్! మీరు దీనిలోకి ఎక్కాలి!

156
00:14:46,428 --> 00:14:47,971
నా మనుషుల లెక్క కావాలి!

157
00:14:48,054 --> 00:14:50,223
అర్ధమైంది.
ఈ చోటు నుంచి మీరు వెళ్లాలి!

158
00:14:50,307 --> 00:14:51,683
మా వాళ్లను బీచ్ దాటించాలి!

159
00:14:51,766 --> 00:14:54,519
మీరే చివరి వ్యక్తి.
మాట ఇస్తున్నాను!

160
00:14:56,855 --> 00:14:58,481
ఆ కాలిని ఎవరైనా ఒత్తండి!

161
00:14:58,898 --> 00:15:00,233
నాడి అందడం లేదు.

162
00:15:04,362 --> 00:15:06,698
కోర్టీస్! నన్ను చూడు! నా వైపు చూడు!

163
00:15:06,990 --> 00:15:09,409
కోర్టీస్! కళ్లు తెరువు!

164
00:15:09,868 --> 00:15:11,453
నాతో ఉండు, సోదరా.

165
00:15:11,536 --> 00:15:13,371
-రక్తం కారడం ఆపండి.
-నాతో ఉండు.

166
00:15:13,455 --> 00:15:15,957
-ఇంకా ఒత్తిడి ఇవ్వాలి.
-కానివ్వు, సోదరా.

167
00:15:49,407 --> 00:15:50,408
హలో?

168
00:15:51,910 --> 00:15:52,911
మిసెస్ రీస్?

169
00:15:53,536 --> 00:15:56,373
మీ సర్వీస్ మెంబర్
మీతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు.

170
00:15:58,958 --> 00:15:59,876
జేమ్స్?

171
00:16:01,628 --> 00:16:04,422
-లారెన్? లారెన్? నువ్వేనా?
-జేమ్స్, హమ్మయ్య!

172
00:16:05,632 --> 00:16:08,176
వాళ్లు రాత్రంతా కుటుంబాలకు
ఫోన్ చేస్తున్నారు.

173
00:16:12,305 --> 00:16:14,683
ఏం జరిగింది? నాకు చెప్పు.

174
00:16:19,229 --> 00:16:21,523
సరిగా జరగలేదు. వాళ్లు...

175
00:16:24,359 --> 00:16:26,444
వాళ్లంతా చనిపోయారు.
అందరూ చనిపోయారు.

176
00:16:27,696 --> 00:16:31,366
నేను ఇంకా బూజర్, అంతే.
మిగిలిన అందరూ...

177
00:16:33,535 --> 00:16:35,537
మిగిలిన ఎవరూ తప్పించుకోలేదు.

178
00:16:37,747 --> 00:16:38,873
ఇది దారుణమైనది.

179
00:16:39,958 --> 00:16:40,917
సరే.

180
00:16:44,587 --> 00:16:45,714
ఐ లవ్యూ.

181
00:16:46,172 --> 00:16:48,174
నువ్వు... ఇంటికి రా, చాలు.

182
00:16:48,883 --> 00:16:52,345
నేను... నీ కోసమే ఉన్నాను. సరేనా?

183
00:17:01,354 --> 00:17:04,232
నేను స్పెషల్ ఏజెంట్
రాబర్ట్ బ్రిడ్జర్, ఎన్సీఐఎస్.

184
00:17:04,816 --> 00:17:08,278
స్పెషల్ ఏజెంట్ డానియెల్ స్టబ్స్తో
ఇన్సిర్లిక్ ఎయిర్ ఫోర్స్

185
00:17:08,361 --> 00:17:13,116
బేస్లో, లెఫ్టినెంట్ కమాండర్ జేమ్స్ రీస్,
సీల్ టీం సెవెన్ను, మిషన్ 6-4-4,

186
00:17:13,199 --> 00:17:15,744
ఓడిన్ స్వోర్డ్ పై ఇంటర్వ్యూ చేయబోతున్నాను.

187
00:17:17,078 --> 00:17:20,290
కమాండర్, మీ మిషన్ గురించి
వివరాలు చెబుతారా?

188
00:17:20,707 --> 00:17:24,294
ఎస్డీఎఫ్కు మద్దతు ఇవ్వడం,
డా. జహాన్ కహానీని పట్టుకోవడం మా పని,

189
00:17:24,377 --> 00:17:26,546
తన రసాయన
ఆయుధాల ప్రోగ్రాంపై సమాచారం.

190
00:17:26,629 --> 00:17:29,048
-రెండు వారాల ముందు అందిన సమాచారం.
-ఎవరి నుంచి?

191
00:17:29,758 --> 00:17:32,343
టబారీ మూసా.
అలెప్పో బయట ఆయుధాల డీలర్.

192
00:17:33,428 --> 00:17:34,763
ఎస్డీఎఫ్ కు కీలక సోర్స్.

193
00:17:37,515 --> 00:17:39,809
ఈ ఆపరేషన్ ఎవరితో డిజైనా చేశారంటే...

194
00:17:39,893 --> 00:17:41,269
కమాండర్ విలియం కాక్స్.

195
00:17:42,145 --> 00:17:43,146
ఏవైనా అనుమానాలు?

196
00:17:43,563 --> 00:17:46,566
లేదు. లేదు. మూసా సమాచారం ధృడమైనది.

197
00:17:46,649 --> 00:17:49,527
గత రెండేళ్లలో కహానీ గురించి
రెండు స్పష్టమైన సమాచారాలు.

198
00:17:49,611 --> 00:17:52,030
కాంపౌండ్ లో కహానీపై
క్యూఆర్ఎఫ్ కు తెలిసిందా?

199
00:17:52,947 --> 00:17:53,948
ఏమీ లేదు.

200
00:17:54,073 --> 00:17:58,870
ఆడియో లాగ్ల ప్రకారం, నాలుగు మైక్లలో
నీ సమాచారం అందలేదు. ఎందుకు?

201
00:18:00,079 --> 00:18:02,457
ప్రతిజాగ్రత్తలు,
ఆ ప్రదేశంలో బాంబులు.

202
00:18:02,540 --> 00:18:06,044
కామ్స్ ఆపడం ప్రామాణికం. తను కాంపౌండ్ దగ్గర
ఉన్నాడని సంకేతముందా?

203
00:18:06,211 --> 00:18:08,129
బాంబులు గల ఆ ప్రాంతం చూపుతావా?

204
00:18:08,213 --> 00:18:11,090
-క్యూఆర్ఎఫ్కు మొబైల్ ల్యాబ్ చూసింది.
-ఆప్ సంగతి వరకే.

205
00:18:11,257 --> 00:18:13,009
బాంబులు ఎక్కడున్నాయి?

206
00:18:19,432 --> 00:18:20,308
సరిగ్గా ఇక్కడ.

207
00:18:21,518 --> 00:18:23,686
కేవలం బాంబులే,
సాధారణం కానిదేమీ లేదు.

208
00:18:23,770 --> 00:18:26,314
మాపై ఆకస్మిక దాడి కోసం
సాయుధ విధేయులున్నారు.

209
00:18:26,397 --> 00:18:27,982
మా రాక సంగతి వాళ్లకు తెలుసు.

210
00:18:28,066 --> 00:18:31,611
కమాండర్, ఆపరేషన్లో ఏ సమయంలో
మీరు గుర్తించారు...

211
00:18:31,694 --> 00:18:35,907
స్పెషల్ వార్ఫేర్ ఆపరేటర్ సెకండ్ క్లాస్,
డానీ మిచెల్ అనారోగ్యంగా ఉన్నారా?

212
00:18:41,996 --> 00:18:43,164
మన్నించండి, ఏమిటి?

213
00:18:45,166 --> 00:18:48,169
ఎస్ఓ టూ మిచెల్,
నీ దళంలో అతి చిన్న సభ్యుడు,

214
00:18:48,253 --> 00:18:50,421
అతను పేలుడు ఏర్పాటుకు
కొంత కాలం ముందు

215
00:18:50,505 --> 00:18:52,841
ఆపరేషన్లో ఓ ఎపిసోడ్ ఎదుర్కున్నాడు.

216
00:18:55,718 --> 00:18:56,719
జెంటిల్మెన్.

217
00:18:58,304 --> 00:19:00,265
మీరొక విషయం అర్ధం చేసుకోవాలి.

218
00:19:00,849 --> 00:19:03,601
నేనిప్పుడు 12 మందిని
శవపేటికలలో ఇంటికి తీసుకెళ్లాలి.

219
00:19:04,394 --> 00:19:07,188
మీరు డాని మిచెల్ గురించి
ప్రశ్నలు అడుగుతారా?

220
00:19:08,731 --> 00:19:11,860
భయాందోళనకు గురైనది ఎస్డీఎఫ్ ట్రూపర్ .
డానీ కాదు.

221
00:19:12,694 --> 00:19:15,947
-మిషన్ లాగ్లలో డానీ మిచెల్ అనుంది.
-కాదు. నేనక్కడే ఉన్నాను.

222
00:19:16,030 --> 00:19:17,782
-అది డానీ కాదు.
-ఆగు, కమాండర్.

223
00:19:17,866 --> 00:19:19,617
మాకు తెలిసినది చెబుతున్నాం.

224
00:19:27,584 --> 00:19:30,086
ఇది గట్టి చప్పుడు, బూజర్.
ఇది భారీ పేలుడు.

225
00:19:30,211 --> 00:19:31,796
రమీరెజ్, డానీలకు సాయం కావాలి!

226
00:19:31,880 --> 00:19:33,798
డానీ! శాంతంగా ఉండు!

227
00:19:34,132 --> 00:19:35,091
భారీ కాల్పులు!

228
00:19:35,174 --> 00:19:36,634
డానీ! ఏం జరుగుతోంది--

229
00:19:52,442 --> 00:19:54,110
అది జరిగినది అలా కాదు.

230
00:19:55,987 --> 00:19:57,947
ఆ మాటలు నేనెప్పుడూ చెప్పలేదు.

231
00:20:01,159 --> 00:20:03,161
ఈ ఇంటర్వ్యూ త్వరగా జరిగిందేమో.

232
00:20:03,244 --> 00:20:05,413
-నేవీ మమ్మల్ని--
-నేవీ అనకండి.

233
00:20:05,496 --> 00:20:08,791
అవునా? మీరు నేవీ కాదు.
పోలీసులు కావాలనుకుంటారు అంతే.

234
00:20:09,876 --> 00:20:11,586
అది ఎలా జరిగిందో నాకు తెలుసు.

235
00:20:11,669 --> 00:20:14,339
ఆ చోటు బాంబులతో,
సాయుధ విధేయులతో నిండిపోయింది,

236
00:20:14,422 --> 00:20:16,424
మా ఎస్డీఎఫ్ ట్రూపర్కు నిగ్రహం పోయింది.

237
00:20:20,678 --> 00:20:21,721
మాట్లాడు, డానీ.

238
00:20:21,804 --> 00:20:23,765
-బాగా శబ్దంగా ఉంది.
-ఏం చెబుతావు?

239
00:20:23,848 --> 00:20:25,808
-శాంతించు, డానీ!
-ఇక్కడ ఎక్కువ శబ్దం.

240
00:20:25,892 --> 00:20:29,646
డానీ! నన్ను చూడు. నిన్ను తీసుకెళతా,
సోదరా. పటుకున్నాను!

241
00:20:29,771 --> 00:20:30,855
నిన్ను పట్టుకున్నా.

242
00:20:33,441 --> 00:20:37,654
ఆడియో అంతటా సూచించేది
మిచెల్ పేలుడు చేశాడనే.

243
00:20:38,363 --> 00:20:41,783
దయచేసి, సమయం తీసుకుని,
లాగ్లను సమీక్షించు.

244
00:20:42,158 --> 00:20:45,244
తర్వాత నీ వాంగ్మూలం మార్చాలంటే
మాకు చెప్పు.

245
00:20:46,204 --> 00:20:49,457
శారీరకంగా బాగున్నావు, కమాండర్.
అంతా పరిగణించాం.

246
00:20:50,333 --> 00:20:52,293
తప్పకుండా, డాక్టర్.
అతనిని చూడండి.

247
00:20:52,961 --> 00:20:55,546
నా మనుషులు సంక్లిష్ట పరిస్థితికి
సిద్ధంగా ఉంటారు.

248
00:20:56,297 --> 00:20:58,800
నీకెలా ఉంటుంది, కమాండర్, మాములుగా?

249
00:20:59,258 --> 00:21:02,011
ఏవైనా మసకబారడం, తలనొప్పులు,
జ్ఞాపకం లేకపోవడం?

250
00:21:03,888 --> 00:21:04,889
జ్ఞాపకాలు పోవడమా?

251
00:21:05,598 --> 00:21:08,434
మెదడుకు గాయమయినా,
శారీరక గాయాలు త్వరగా తగ్గుతాయి.

252
00:21:08,518 --> 00:21:10,770
నాడీ మార్గాలకు ఎక్కువ సమయం అవసరం.

253
00:21:10,853 --> 00:21:12,981
బాధ, నష్టాలకు ఒత్తిడి తోడవ్వడం--

254
00:21:13,064 --> 00:21:15,066
లక్షణాలు తెలుస్తున్నాయా, రీస్?

255
00:21:17,193 --> 00:21:18,945
లేదు, సర్. లేదు...

256
00:21:20,780 --> 00:21:22,991
మేము మరిన్ని పరీక్షలు చేయగలం.

257
00:21:23,116 --> 00:21:25,827
వాటిని బాల్బోవాలో చేయించుకుంటాను,
చేయించుకోవచ్చంటే.

258
00:21:25,910 --> 00:21:27,620
ఎంఆర్ఐ అయితే బాగుంటుంది.

259
00:21:27,704 --> 00:21:29,914
సరే. అదీ, మా వాళ్లు ఇంటికి వెళ్లిపోయారు.

260
00:21:30,873 --> 00:21:33,251
నేను వాళ్ల కుటుంబాల దగ్గరకు వెళ్లాలి.

261
00:21:35,086 --> 00:21:38,339
మీరు అతనిని ఆపితే మినహా,
రీస్ విమానయానం చేయడం పర్వాలేదు.

262
00:21:39,007 --> 00:21:41,509
అతను దేశానికి చేరాక
వార్కామ్ సంప్రదించవచ్చు.

263
00:21:44,053 --> 00:21:45,263
సరే, కమాండర్.

264
00:21:46,514 --> 00:21:49,517
కానీ మళ్లీ కలిసే వరకు, విశ్రాంతి తీసుకో.

265
00:21:50,435 --> 00:21:53,021
బోలెడంత విశ్రాంతి. మద్యం వద్దు.

266
00:22:03,906 --> 00:22:05,324
మనం కహానీని కనిపెట్టాలి.

267
00:22:11,289 --> 00:22:13,207
మనం కనిపెట్టాక, వాడి తల ఒలుస్తాను.

268
00:22:13,916 --> 00:22:14,917
తప్పకుండా.

269
00:22:19,380 --> 00:22:23,509
డానీ అయితే అదే చేసేవాడు.
ఆ 23 ఏళ్ల పిల్లాడికి మరీ కోపం.

270
00:22:31,893 --> 00:22:32,894
డానీ కోసం.

271
00:22:33,603 --> 00:22:35,188
సోదరభావం చిరకాలం నిలవాలి.

272
00:22:45,156 --> 00:22:46,699
నాకు విస్కీ ఇస్తారా, నీట్?

273
00:22:55,249 --> 00:22:56,626
మనం ఎవరికోసం తాగుతున్నాం?

274
00:23:03,091 --> 00:23:05,134
కాంట్రాక్టరువా లేక విలేఖరివా?

275
00:23:06,094 --> 00:23:09,305
నీ మణికట్టు మీద ముద్ర.
సర్వీస్ మెంబర్లను లోనికి రానీయరు.

276
00:23:09,388 --> 00:23:11,265
ఎప్పుడూ నియమాలు ఉల్లంఘించలేదా?

277
00:23:12,391 --> 00:23:14,477
అంటే, అక్కడ ఎయిర్మేన్తో ఉన్నాను.

278
00:23:14,936 --> 00:23:19,440
అతను 12 మంది సీల్స్ ని మోసుకెళ్లిన
రవాణా గురించి చెప్పాడు.

279
00:23:20,191 --> 00:23:22,360
కలర్ గార్డ్ లేదు. ర్యాంప్ వేడుక లేదు.

280
00:23:22,777 --> 00:23:24,195
అబ్బో. నువ్వు విలేఖరివి.

281
00:23:24,529 --> 00:23:26,280
కేటీ బ్యురానెక్. వోల్ట్ స్ట్రీం.

282
00:23:26,531 --> 00:23:30,284
-మరుసటి రౌండ్ కు కడతాను, కమాండర్.
-నేనే కొనుక్కుంటా, ధన్యవాదాలు.

283
00:23:30,368 --> 00:23:31,953
టీమ్ జనాల గురించి రాస్తాను.

284
00:23:32,453 --> 00:23:35,039
స్పెక్ ఆప్స్పై అతిగా ఆధారపడడంపై
సిరీస్ రాశా--

285
00:23:35,123 --> 00:23:36,124
ఆ. నేనది చదివాను.

286
00:23:36,207 --> 00:23:39,252
కమాండర్, ఇక్కడ జరిగేదాని గురించి
జనాలేమీ పట్టించుకోరు.

287
00:23:39,335 --> 00:23:42,672
పన్నెండు మంది సీల్స్ చనిపోతే,
కమాండ్ నుంచి ప్రకటన ఉండదా?

288
00:23:42,839 --> 00:23:44,132
వాళ్లేం దాస్తున్నారు?

289
00:23:47,093 --> 00:23:50,388
నీ వెతుకులాట ఏదైనా
నేను, బూజర్ ఏమీ చెప్పము.

290
00:23:50,471 --> 00:23:51,472
బూజర్ ఎవరు?

291
00:24:02,817 --> 00:24:04,902
నేను కథలను లీక్ చేయను, మిస్ బ్యురానెక్.

292
00:24:06,404 --> 00:24:08,865
మా పనిని విమర్శించేవారితో
అసలు చేయను.

293
00:24:08,948 --> 00:24:12,451
నీ పనిని విమర్శించను,
మీ అసైన్మెంట్లను ప్రశ్నిస్తాను.

294
00:24:22,837 --> 00:24:24,005
నీ కృషి కోసం.

295
00:25:00,374 --> 00:25:02,960
మెల్లగా, జాగ్రత్తగా, బాస్.

296
00:25:20,561 --> 00:25:23,314
రీస్! పైకి లే!

297
00:25:23,397 --> 00:25:25,274
రీస్, పైకి లే!

298
00:25:25,650 --> 00:25:27,944
రీస్! పైకి లే!

299
00:25:28,069 --> 00:25:29,070
కమాండర్.

300
00:25:30,154 --> 00:25:34,367
అందరూ దిగిపోయారు, సర్.
లేపుదామని కొన్ని ప్రయత్నాలు చేశాను.

301
00:25:59,558 --> 00:26:03,729
నార్త్ ఐలాండ్ నావల్ ఎయిర్ స్టేషన్
కొరనాడో, సీఏ

302
00:26:12,697 --> 00:26:15,241
ఊబర్కి కాల్ చేస్తున్నానని చెప్పకు.

303
00:26:18,369 --> 00:26:21,872
ఈ రాత్రికి వస్తున్నావని
పుకారు విన్నాను. అలా, అనుకున్నా...

304
00:26:27,920 --> 00:26:29,005
అరె, బాబూ.

305
00:26:36,178 --> 00:26:37,263
ధన్యవాదాలు, బెన్.

306
00:26:39,432 --> 00:26:41,517
-ఇంటికి తీసుకెళతా, సోదరా.
-సరే.

307
00:26:47,940 --> 00:26:50,318
కాసేపు డ్రైవ్ చేయాలేమో?
నా మెదడు సరికావాలా?

308
00:27:04,957 --> 00:27:06,917
ఏం జరిగిందో నాకు చెబుతావా?

309
00:27:07,043 --> 00:27:09,462
నీకెంత వరకు తెలుసు?
ఏజెన్సీ మాట వింటే--

310
00:27:09,545 --> 00:27:11,088
ఏజెన్సీ సోది చెప్పింది.

311
00:27:11,172 --> 00:27:13,174
అంటే, అదంతా మండించే సోది.

312
00:27:13,257 --> 00:27:14,091
నీకది తెలుసు.

313
00:27:17,803 --> 00:27:18,929
అది ఓ ఏర్పాటు.

314
00:27:19,180 --> 00:27:20,264
ఏమంటున్నావు?

315
00:27:20,348 --> 00:27:23,309
మమ్మల్ని రప్పించాలని
కహానీపై తప్పుడు సమాచారం ఇచ్చారు.

316
00:27:25,519 --> 00:27:26,771
ఇరానియన్లు.

317
00:27:28,564 --> 00:27:31,275
బహుశా. రష్యన్లు అయినా కావచ్చు.
అసాద్ కావచ్చు.

318
00:27:31,609 --> 00:27:32,610
ఛత్.

319
00:27:33,152 --> 00:27:35,654
మన సిగ్నల్స్ మార్చే
సామర్ధ్యం ఎవరికుంటుంది?

320
00:27:35,738 --> 00:27:37,198
ఏమంటున్నావు? అడ్డుకోవడమా?

321
00:27:37,281 --> 00:27:41,077
డిజిటల్ రికార్డ్ మార్చడం.
గొంతులు, మొహాలు మార్చడం.

322
00:27:43,371 --> 00:27:44,872
సోదరా, అది...

323
00:27:45,247 --> 00:27:48,417
అది చాలా అధిక స్థాయి
ఎలక్ట్రానిక్ యుద్ధ సామర్ధ్యం.

324
00:27:49,752 --> 00:27:51,712
అది అతి శక్తివంతమైన వారే చేయగలరు.

325
00:27:56,550 --> 00:27:59,970
విను, పర్షియా హౌస్లో
నాకు కొందరు తెలుసు, కాల్స్ చేస్తాను.

326
00:28:00,054 --> 00:28:03,349
చూడాల్సినది ఏమైనా చూద్దాం.
అక్కడ మొదలుపెడదాం.

327
00:29:11,667 --> 00:29:13,085
ఇది చాలు, ఇక ఉమ్మెయ్.

328
00:29:13,169 --> 00:29:15,713
-నా పని పూర్తి కాలేదు.
-నీ నిద్రా సమయం దాటింది.

329
00:29:21,677 --> 00:29:22,678
హలో?

330
00:29:23,262 --> 00:29:24,263
నాన్నా!

331
00:29:25,890 --> 00:29:27,766
హేయ్, బగ్.

332
00:29:29,768 --> 00:29:30,895
ఇంటికి వచ్చేశావు.

333
00:29:33,314 --> 00:29:35,316
వచ్చేశాను. ఇంటికి.

334
00:29:36,192 --> 00:29:38,527
రేపటి వరకు రావని
అమ్మ చెప్పింది, కానీ

335
00:29:38,611 --> 00:29:40,654
-ఇవాళే వస్తావని నాకు తెలుసు.
-ఔనా?

336
00:29:41,655 --> 00:29:44,241
నిన్ను చూసుకో. ఎంత పొడుగయ్యావో.

337
00:29:45,367 --> 00:29:47,995
నా గదిలో కొన్ని దిండ్లు,
కుక్కిన జంతువులు ఉన్నాయి.

338
00:29:48,078 --> 00:29:49,997
-నీకు వాటిని చూపించాలి.
-సరే.

339
00:29:50,080 --> 00:29:54,001
నా దగ్గరో మంచి ఆలోచన కూడా ఉంది.
నాకు నిజంగా కుక్క కావాలి.

340
00:29:54,084 --> 00:29:54,919
సరే.

341
00:29:55,002 --> 00:29:57,171
లూసీ, నువ్వు వెళ్లి పడుకుంటే

342
00:29:57,254 --> 00:29:59,715
నాన్న లోపలకు వచ్చి
నీకు పక్క సర్దుతారు.

343
00:29:59,798 --> 00:30:01,550
-నిన్ను కలుస్తాను.
-ఇక రా.

344
00:30:07,765 --> 00:30:08,974
లోపలకు వెళ్లు.

345
00:30:09,934 --> 00:30:11,685
సరే, నిన్ను లోపల కలుస్తాను.

346
00:30:38,295 --> 00:30:42,508
సరే. నీకు పక్క సర్దుతాను.
నాకోసం ఎదురుచూశావు, సంతోషం. ధన్యవాదాలు.

347
00:30:47,096 --> 00:30:48,222
బాగున్నావా?

348
00:30:49,473 --> 00:30:51,016
ఆ. బాగున్నాను.

349
00:30:51,517 --> 00:30:52,726
అది నొప్పిగా ఉందా?

350
00:30:53,185 --> 00:30:55,020
లేదు. ఇదేమీ లేదు.

351
00:30:55,646 --> 00:30:56,647
కచ్చితంగానా?

352
00:30:57,606 --> 00:31:00,025
అవును. కచ్చితంగా. బాగున్నాను.

353
00:31:00,776 --> 00:31:02,903
నేను వెళ్లాక
నువ్వేం చదువుతున్నావు?

354
00:31:02,987 --> 00:31:04,655
ద గర్ల్ హూ డ్రాంక్ ద మూన్.

355
00:31:05,072 --> 00:31:06,574
దానిలో ఇంద్రజాల శక్తులున్నాయి.

356
00:31:07,533 --> 00:31:08,867
నువ్వూ కొంచెం చదువుతావా?

357
00:31:09,493 --> 00:31:12,580
నాన్న బాగా అలిసిపోయారు.
ఇక ఆయన పడుకుంటారు, సరేనా?

358
00:31:12,788 --> 00:31:16,083
ఆయన స్నానం చేయాలి,
దారుణంగా వాసన వస్తున్నారు.

359
00:31:19,837 --> 00:31:20,796
అలాగే.

360
00:31:23,716 --> 00:31:25,467
అక్కడ అదేంటి, కొత్త డ్రాయింగా?

361
00:31:25,593 --> 00:31:28,554
దేవుడా, మంచిదానివి అవుతున్నావు, పాపా.
ఇది చూడు.

362
00:31:28,637 --> 00:31:29,972
నా కుటుంబం

363
00:31:30,055 --> 00:31:31,307
ఇదెవరు గీశారు?

364
00:31:31,390 --> 00:31:35,227
-నాన్నా, నువ్వు వెళ్లేముందే అది గీశాను.
-నేనిది ఇదివరకు చూడలేదు.

365
00:31:35,603 --> 00:31:36,812
నీకు చూపించాను.

366
00:31:37,646 --> 00:31:39,064
నువ్వు బాగుందన్నావు.

367
00:31:42,985 --> 00:31:44,069
నీది వేళాకోళం.

368
00:31:44,278 --> 00:31:47,781
వేళాకోళం ఆడాను, ఎప్పుడూ సరదానే.

369
00:31:48,115 --> 00:31:50,576
నా చిన్ని దేవతను నవ్వించడానికి
ఏదైనా సరే.

370
00:31:52,911 --> 00:31:54,371
-గుడ్ నైట్.
-ఐ లవ్యూ.

371
00:31:54,830 --> 00:31:55,873
ఐ లవ్యూ.

372
00:32:03,547 --> 00:32:04,548
అలాగే.

373
00:32:09,136 --> 00:32:11,096
నిన్ను తేవడానికి నేను రావాల్సింది.

374
00:32:16,518 --> 00:32:19,480
పర్వాలేదు. బెన్ వచ్చాడు.

375
00:32:23,692 --> 00:32:27,363
వాళ్లు నాకు చెప్పిన ఒకే విషయం ఏమిటంటే
నీకు స్పృహ తప్పిందని

376
00:32:27,446 --> 00:32:29,156
ఇంకా రహస్యంగా ఉండాలని.

377
00:32:31,116 --> 00:32:34,828
నువ్వు పరీక్ష చేయించుకోవాలి, జేమ్స్.
అపాయింట్మెంట్ తీసుకుంటాను.

378
00:32:34,912 --> 00:32:35,913
బాగానే ఉన్నాను.

379
00:33:13,909 --> 00:33:17,538
-రమిరెజ్! ఆగు! నీ వైపు వస్తున్నా.
-గోడ వైపు!

380
00:33:17,621 --> 00:33:19,790
రీస్! రా, బాబూ! పైకి లే!

381
00:33:24,920 --> 00:33:26,422
నువ్వు ఏమంటావు, నాన్నా?

382
00:33:27,506 --> 00:33:28,507
నాన్నా!

383
00:33:30,259 --> 00:33:31,176
జేమ్స్?

384
00:33:33,512 --> 00:33:34,346
ఏంటి?

385
00:33:34,722 --> 00:33:37,891
ఇంట్లో నీ మొదటి రోజును నేను, అమ్మ
ప్లాన్ చేశామని చెబుతున్నా.

386
00:33:38,809 --> 00:33:43,480
మనం చేస్తున్న కొత్త పని మీద
నాన్నకు చెప్పడం ప్రారంభించవచ్చుగా?

387
00:33:43,564 --> 00:33:46,900
నువ్వు లేనప్పుడు, అమ్మ నేను
స్టాండప్ పాడిల్ బోర్డింగ్ మొదలుపెట్టాం.

388
00:33:46,984 --> 00:33:49,528
అది సర్ఫింగ్,
సీ కయాకింగ్ కలిపి చేయడం లాంటిది.

389
00:33:49,862 --> 00:33:50,863
చాలా సరదాగా ఉంటుంది.

390
00:33:51,530 --> 00:33:56,160
ఇంకా బహుశా నాన్న వస్తానంటే
ఆయనను తీసుకెళ్లవచ్చు.

391
00:33:56,326 --> 00:33:58,620
నువ్వూ వస్తావా, నాన్నా?
నీకు నచ్చుతుంది.

392
00:33:58,704 --> 00:34:00,289
చివరిసారి నా సర్ఫింగ్...

393
00:34:01,749 --> 00:34:03,667
అది పెద్ద దారుణం. గుర్తుందా?

394
00:34:05,085 --> 00:34:09,590
అది తేలికే. లా హొల్లా కోవ్లో మొదలుపెడదాం,
ఉదయమే మొదలుపెడదాం,

395
00:34:09,757 --> 00:34:12,259
అక్కడ అలలు ఉండవు,
నీళ్లు ప్రశాంతంగా ఉంటాయి.

396
00:34:12,342 --> 00:34:14,511
ఇది పథకంలా ఉంది. మనం వెళదాం.

397
00:34:14,595 --> 00:34:17,264
మనం స్టాండప్ పాడిల్ బోర్డింగ్ చేద్దాం.

398
00:34:17,973 --> 00:34:19,641
మంచిది. సరదాగా ఉంటుంది.

399
00:34:20,768 --> 00:34:21,685
అలాగే.

400
00:34:22,936 --> 00:34:26,440
ప్రపంచ ప్రముఖ సినమన్ రోల్స్.
మనం వీటిని తిందామా?

401
00:34:26,523 --> 00:34:28,400
అది... పట్టుకోకు... వేడిగా ఉంది!

402
00:34:28,484 --> 00:34:29,735
అయ్యో దేవుడా!

403
00:34:32,237 --> 00:34:34,865
-బాగానే ఉందా?
-పర్వాలేదు. ఏమీ అనుకోకు.

404
00:34:39,203 --> 00:34:40,788
నీ సంగతేంటో చెప్పు--

405
00:34:43,123 --> 00:34:44,374
అది వార్కామ్ నుంచి.

406
00:34:47,628 --> 00:34:48,796
నేను రీస్ ను.

407
00:34:51,507 --> 00:34:54,176
లేదు, సర్. అది అసాధ్యం.

408
00:34:57,387 --> 00:34:58,931
సరే, సర్. నేను వస్తాను.

409
00:35:06,396 --> 00:35:09,900
ఇవాళ నా దగ్గరకు రావాలి.
రేపు కాదు, ఇవాళే. నేను వెళ్లాలి.

410
00:35:09,983 --> 00:35:11,693
-రీస్.
-కెప్టెన్, బూజర్ ఎక్కడ?

411
00:35:11,777 --> 00:35:14,780
మన్నించండి. శవపరీక్షకుడు శవం తీసుకెళ్లారు.
భేటీకి ఆగాలి.

412
00:35:14,863 --> 00:35:17,574
దాదాపు 30 నిమిషాలైంది.
రీస్, నీ వైపు ఉంటాను.

413
00:35:17,658 --> 00:35:20,202
కమాండర్ రీస్.
స్పెషల్ ఏజెంట్ హోల్డర్, ఎన్సీఐఎస్.

414
00:35:21,286 --> 00:35:22,162
-సర్--
-తప్పుకో.

415
00:35:31,421 --> 00:35:35,843
పెట్టీ ఆఫీసర్ విక్కర్ గురించి
నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి...

416
00:35:37,135 --> 00:35:38,220
ఆయన మానసిస స్థితిపై.

417
00:35:42,850 --> 00:35:45,352
నిన్న నేను ఇతనితో ఉన్నాను.
తను బాగానే ఉన్నాడు.

418
00:35:46,895 --> 00:35:49,273
తనను తాను కాల్చుకునే వీల్లేదు.

419
00:35:50,816 --> 00:35:52,526
-మన్నించాలి. నిన్నేనా?
-అవును.

420
00:35:53,360 --> 00:35:56,780
ఇన్సిర్లిక్ నుంచి కలిసి తిరిగొచ్చాం.
తను బాగున్నాడు.

421
00:35:59,116 --> 00:36:00,117
కమాండర్.

422
00:36:01,285 --> 00:36:02,286
అది కుదరదు--

423
00:36:02,494 --> 00:36:05,622
అది సాధ్యం కాదు.
వికర్స్ రెండు రోజుల క్రితం కాల్చుకున్నాడు.

424
00:36:05,706 --> 00:36:07,708
లేదు, సారీ,
నీది పూర్తిగా తప్పు.

425
00:36:08,292 --> 00:36:10,961
-హేయ్, చెప్పనా? ఊపిరి తీసుకో.
-అతనికి చెప్పు!

426
00:36:11,253 --> 00:36:13,255
కమాండర్ యుద్ధం నుంచి ఇపుడే వచ్చాడు.

427
00:36:13,380 --> 00:36:15,257
అవును. వికర్స్తో. నిన్ననే.

428
00:36:17,551 --> 00:36:18,552
సరే.

429
00:36:18,844 --> 00:36:23,432
పీఓ వన్ వికర్స్ ఆ మృతదేహాలతో పాటు
రెండు రోజుల క్రితమే ఇంటికి చేరారు.

430
00:36:24,099 --> 00:36:26,435
అదే రాత్రికి, తన ప్రాణం తీసుకున్నారు.

431
00:36:27,561 --> 00:36:29,271
ఈ ఉదయం పొరుగువారు చూశారు.

432
00:36:29,354 --> 00:36:32,232
కొరనాడో పోలీసులు మొదటగా
ఇక్కడకు వచ్చారు.

433
00:36:32,566 --> 00:36:34,234
నిజంగా మన్నించండి, కమాండర్.

434
00:36:35,277 --> 00:36:36,612
మెల్లగా, జాగ్రత్తగా, బాస్.

435
00:36:37,404 --> 00:36:38,655
మెల్లగా, జాగ్రత్తగా.

436
00:36:55,380 --> 00:36:56,381
రీస్.

437
00:36:57,549 --> 00:37:00,802
మనం ఇది ఇవాళ చేసే అవసరం లేదు.
సమయం తీసుకోవచ్చు.

438
00:37:00,886 --> 00:37:03,221
-తీసుకుంటా, నేను ఆగాలనుకుంటే.
-సరే.

439
00:37:03,972 --> 00:37:07,142
నీ కార్యాచరణ మేథస్సుపై
నీ పట్టింపులకు కట్టుబడతాము.

440
00:37:07,225 --> 00:37:08,268
పద.

441
00:37:08,393 --> 00:37:09,353
బస్కీలు, సిద్ధమా?

442
00:37:09,519 --> 00:37:10,395
సిద్ధం!

443
00:37:10,562 --> 00:37:11,897
-ఒకటి!
-ఒకటి!

444
00:37:11,980 --> 00:37:12,814
-రెండు!
-రెండు!

445
00:37:13,023 --> 00:37:16,652
సర్, ఇది ఆల్ఫా ప్లాటూన్పై
లక్షిత దాడి అని నా నమ్మకం.

446
00:37:17,819 --> 00:37:20,405
నా దళం 2018 నుంచి కహానీపై ఆరా తీస్తోంది,

447
00:37:20,656 --> 00:37:23,909
ఆ సమయంలో తన కుడ్స్ ఫోర్స్
లెఫ్టినెంట్లు ఇద్దరిని చంపాం.

448
00:37:24,034 --> 00:37:26,536
అలెప్పోలో నా మనిషికి
ఎవరో దొంగ సమాచారం ఇచ్చారు.

449
00:37:27,120 --> 00:37:28,288
ఇది ఒక ఉచ్చు.

450
00:37:28,413 --> 00:37:31,041
సోకామ్, సీఐఏలు మూసాపై ఆరా తీస్తున్నాయి

451
00:37:31,458 --> 00:37:33,877
సిరియాలో కార్యకలాపాలు ఆపేశాం,

452
00:37:35,170 --> 00:37:38,632
కానీ నాకు తెలియాల్సినది
ఆ ఆపరేషన్లో ఏం జరిగిందని?

453
00:37:41,051 --> 00:37:42,052
సర్?

454
00:37:42,135 --> 00:37:45,055
సరే, మిగిలిన ప్రత్యక్ష సాక్షి నువ్వొకడివే.

455
00:37:45,138 --> 00:37:47,349
కానీ ఈ ఫైల్లో ఏదీ జోడించలేదు.

456
00:37:51,395 --> 00:37:52,562
ఆ ఫైల్ జోడించినదే.

457
00:37:53,730 --> 00:37:57,693
మా ఆడియో రికార్డులను ఎవరో మార్చారని
మీరు గ్రహిస్తే, అర్ధం ఉంటుంది.

458
00:37:57,901 --> 00:38:00,445
స్పష్టత కోసం. అది నీ నమ్మకమా?

459
00:38:00,529 --> 00:38:04,700
ఒక ఎస్డీఎఫ్ ట్రూపర్ ఆందోళన చెంది
బాంబును పేల్చేశాడు.

460
00:38:05,117 --> 00:38:06,994
-ఎస్ఓ టూ మిచెల్ కాదా?
-అవును.

461
00:38:07,661 --> 00:38:10,247
అవును, సర్. నా వాంగ్మూలానికి కట్టుబడతాను.

462
00:38:10,580 --> 00:38:13,542
నా మాట నిజమైతే, ఆ ప్రదేశానికి
మన మనుషులను పంపకూడదు,

463
00:38:13,625 --> 00:38:15,919
మనం ఆ టెక్నాలజీ
ఎవరి దగ్గరుందో గుర్తించేవరకూ,

464
00:38:16,003 --> 00:38:19,965
అలాంటి పని చేసే సామర్థ్యం ఎవరికి ఉందో,
ఎవరది ఏర్పాటు చేశారో.

465
00:38:22,300 --> 00:38:26,513
పెట్టీ ఆఫీసర్ వికర్స్ ఇంటి దగ్గర
ఏం జరిగిందో చెప్పు.

466
00:38:26,722 --> 00:38:32,144
ఎన్సీఐఎస్ ప్రకారం, వికర్స్ మరణించిన
సమయాన్ని ప్రశ్నించావు.

467
00:38:34,396 --> 00:38:38,942
ప్రశ్నించాను, సర్,
బూజర్ ఎందుకు కాల్చుకున్నాడని.

468
00:38:41,194 --> 00:38:43,572
కానీ, అవును, నా టైం లైన్
కొద్దిగా గజిబిజి.

469
00:38:43,989 --> 00:38:47,451
మిషన్లో కమాండర్కు దెబ్బ తగలడంతో
అపస్మారక స్థితి ఎదుర్కున్నాడు.

470
00:38:49,202 --> 00:38:51,413
అతను తన పరిణామాలు ఎదుర్కుంటున్నాడు.

471
00:38:51,788 --> 00:38:54,791
మరి ఈ "పరిణామాలు"

472
00:38:55,709 --> 00:38:58,170
ఆపరేషన్ పై నీ జ్ఞాపకాలను
ప్రభావితం చేశాయా?

473
00:38:58,253 --> 00:39:00,213
అలాంటి ఆపరేషన్ మరిచిపోలేరు, సర్.

474
00:39:01,757 --> 00:39:02,758
లేదు, సర్.

475
00:39:09,139 --> 00:39:10,932
చూడు, రీస్,

476
00:39:12,100 --> 00:39:14,644
నీ నిబద్ధతను అభినందిస్తాను.

477
00:39:16,063 --> 00:39:19,858
జాబితా చేయబడి స్నైపర్ నుంచి
ట్రూప్ కమాండర్ కు చేరడం,

478
00:39:19,941 --> 00:39:23,612
చిన్న విషయం కాదు. కానీ 40 వయసులో,
యుద్ధంలో మొదట నిలబడతావు.

479
00:39:25,572 --> 00:39:27,657
కానీ నిన్ను నీవు సరిచేసుకోవాలి.

480
00:39:32,621 --> 00:39:35,582
దళంలో ఉన్నప్పుడు
ఉదయాన్నే శుభ్రం కావడం వదిలేయాలి.

481
00:39:36,249 --> 00:39:38,752
ఓ మార్గదర్శిగా జనాలు మనను చూస్తారు.

482
00:39:40,087 --> 00:39:41,254
ప్రత్యేకించి ఇప్పుడు.

483
00:39:43,965 --> 00:39:44,800
అవును, సర్.

484
00:39:45,967 --> 00:39:48,178
ప్లాటూన్లో ప్రతి సీల్ కు మరణానంతరం

485
00:39:48,261 --> 00:39:51,181
సిల్వర్ స్టార్ అందుకుంటారని మా సమాచారం,
వికర్స్తో సహా.

486
00:39:51,264 --> 00:39:52,099
రండి అమ్మాయిలు!

487
00:39:52,182 --> 00:39:55,268
ఖననానికి డిఫెన్స్ సెక్రటరీ
స్వయంగా వస్తున్నారు.

488
00:39:55,352 --> 00:39:57,437
కుటుంబాలు దానిని అభినందిస్తాయి.

489
00:39:58,105 --> 00:39:59,397
నిర్ధారణ అయిందా, సర్?

490
00:40:00,816 --> 00:40:03,401
-ఏంటి? పతకాలా?
-బూజర్ మరణానికి కారణం.

491
00:40:03,652 --> 00:40:05,654
శవపరీక్షకునితో మరోసారి తనిఖీ చేశాను.

492
00:40:06,363 --> 00:40:09,574
స్వయంగా చేసుకున్న గాయం నిర్ధారించారు.
నైన్ మిల్లీమీటర్.

493
00:40:11,618 --> 00:40:13,120
సర్, మన్నించండి, సర్.

494
00:40:14,037 --> 00:40:15,956
తాను టీమ్ తుపాకీతో కాల్చుకున్నాడా?

495
00:40:16,665 --> 00:40:17,791
అది అతని సొంత ఆయుధం.

496
00:40:18,625 --> 00:40:20,752
అది ప్లాటూన్ బహుమతి అనుకోవచ్చా?

497
00:40:23,630 --> 00:40:27,050
రీస్, ఈ ఖననాలకు వెళ్లడం
నీకు పర్లేదని కచ్చితమేనా?

498
00:40:28,176 --> 00:40:30,804
నువ్వు రాకపోవడంపై
ఏదైనా కారణం చెప్పగలం.

499
00:40:30,887 --> 00:40:32,055
నేనక్కడ ఉంటాను, సర్.

500
00:40:48,029 --> 00:40:49,156
తుఫాను వస్తోంది.

501
00:40:51,408 --> 00:40:53,493
నీకు మాట్లాడాలని లేకపోతే, వద్దు,

502
00:40:53,869 --> 00:40:58,165
అక్కడ కూర్చుని తెరచాప కట్టడం చూడు.
అది కూడా పరవాలేదు.

503
00:41:00,417 --> 00:41:02,502
ఈ బుల్లెట్లో ఏదైనా తేడా ఉందా?

504
00:41:13,388 --> 00:41:14,389
ఎలాంటిది?

505
00:41:16,725 --> 00:41:17,726
కాలిబర్.

506
00:41:18,977 --> 00:41:20,312
నాకు సిగ్ ఇష్టం.

507
00:41:21,229 --> 00:41:24,357
బూజర్, అతనికి నచ్చిన పిస్టల్
కస్టమ్ 1911-45.

508
00:41:27,652 --> 00:41:30,780
అతనికి నైన్ ఎంఎంలు నచ్చవు.
వాటిపై ద్వేషం.

509
00:41:33,533 --> 00:41:36,203
దుర్గుణాలపై ఎప్పుడూ చర్చించేవాడు.

510
00:41:37,120 --> 00:41:38,872
నైన్ మిల్లీమీటర్ వర్సెస్ 45.

511
00:41:40,457 --> 00:41:42,125
అధిక కెపాసిటీ మేగజైన్ కావాలా?

512
00:41:42,209 --> 00:41:44,502
లేదా దాని నుంచి ఎక్కువ సీసం
పంపాలా అని.

513
00:41:44,586 --> 00:41:46,379
ఫీల్డ్ లో, ఎప్పుడూ 45నే కోరాడు.

514
00:41:46,463 --> 00:41:48,882
తను చెప్పాడు, పాడు చేస్తానని,
పాడు చేయాలని.

515
00:41:48,965 --> 00:41:52,677
దానిలో రంధ్రాలు వద్దని,
కత్తి యుద్ధంలో పెన్ నైఫ్ వాడకూడదని.

516
00:41:54,846 --> 00:41:59,392
నేనది నమ్మను. బూజర్ తనను తాను
సిగ్తో కాల్చుకునే అవకాశం లేదు.

517
00:42:00,227 --> 00:42:01,311
అసలు కుదరదు.

518
00:42:02,604 --> 00:42:04,147
ఇది ఎవరు ఏర్పాటు చేసినా...

519
00:42:07,984 --> 00:42:10,946
వాళ్లు నకిలీ సాక్ష్యం తేగలరు,
బూజర్ను నకిలీ చేయలేరు.

520
00:42:13,990 --> 00:42:17,661
కొరనాడోలో సీల్స్ ను చంపే
వ్యక్తులు కుడ్స్ కు ఉన్నారా?

521
00:42:19,204 --> 00:42:20,997
నాకు చెబుతున్నది అదేగా.

522
00:42:21,248 --> 00:42:22,582
ఎవరో చేశారని.

523
00:42:25,543 --> 00:42:26,544
నేను చూడనా?

524
00:42:33,593 --> 00:42:35,387
"సోదరభావం చిరకాలం నిలవాలి."

525
00:42:35,679 --> 00:42:36,888
అదిరింది.

526
00:42:36,972 --> 00:42:38,807
టీమ్స్ ని మిస్ అవుతున్నాను.

527
00:42:42,811 --> 00:42:46,398
ఓ సందేశం పంపాలని
బూజర్ టీమ్ గన్ ఎంచుకుంటాడేమో.

528
00:42:47,023 --> 00:42:48,566
వీడ్కోలు చెప్పే తన మార్గం.

529
00:42:52,779 --> 00:42:53,780
కావచ్చు.

530
00:43:02,455 --> 00:43:06,876
నువ్వు, లోర్, ఇంకా లూస్ కలిసి
వారాంతం బోటు విహారానికి వెళ్లచ్చుగా,

531
00:43:07,669 --> 00:43:11,047
అంతా చూసేందుకు,
కాన్ పిచ్చి టీకీ శైలిలో?

532
00:43:12,007 --> 00:43:13,925
మార్కో బీచ్లో విహరించండి.

533
00:43:15,010 --> 00:43:16,219
చక్కని గాలి పీల్చుకో.

534
00:43:20,473 --> 00:43:22,225
నా మతి పోతోందని అనుకుంటావా?

535
00:43:25,729 --> 00:43:26,646
లేదు.

536
00:43:30,817 --> 00:43:33,945
నీ మెదడు బాగా కష్టపడిందని అంటాను.

537
00:43:36,489 --> 00:43:38,658
దాని అర్ధం, నేను నీ సోదరుడినని.

538
00:43:39,951 --> 00:43:43,496
నీకు ఏదైనా కావాలని అనిపిస్తే,
ఏదైనా సరే...

539
00:43:44,831 --> 00:43:45,957
నాకు కాల్ చెయ్.

540
00:43:48,043 --> 00:43:48,877
నాకది తెలుసు.

541
00:43:49,586 --> 00:43:52,297
మంచిది. సరే, మరొక బీర్.

542
00:44:18,865 --> 00:44:21,493
ప్రభావిత విలేఖరి కేటీ బ్యురానెక్ను
నియమించుకున్న వోల్ట్ స్ట్రీం

543
00:44:27,332 --> 00:44:29,542
మరిచిపోయిన సైనికులు:
అమెరికా స్పెషల్ ఆపరేషన్స్

544
00:44:37,717 --> 00:44:39,219
కేటీ బ్యురానెక్ను సంప్రదించండి

545
00:44:49,896 --> 00:44:53,483
నేను నిన్ను ఇన్సిర్లిక్లో కలిసినప్పుడు,
ఒంటరిగా ఉన్నానా?

546
00:44:57,654 --> 00:45:00,323
ఒంటరిగా ఉన్నానా?

547
00:45:04,119 --> 00:45:06,371
మిమ్మల్ని అడిగే విషయం
అన్యాయమని నాకు తెలుసు.

548
00:45:07,622 --> 00:45:10,792
మీరంతా చేసిన త్యాగాన్ని
నేను అభిందిస్తాను.

549
00:45:11,751 --> 00:45:13,837
ఇవాళ జాతి అంతా సంతాపం, ధన్యవాదాలను

550
00:45:14,546 --> 00:45:15,547
మీకు అందిస్తోంది,

551
00:45:16,214 --> 00:45:19,384
మేము ఈ సంఘ
ప్రతిష్టాత్మక సభ్యుడిని గౌరవిస్తాము.

552
00:45:20,260 --> 00:45:21,803
సిల్వర్ స్టార్ గ్రహీత,

553
00:45:22,554 --> 00:45:25,056
పెట్టీ ఆఫీసర్ ఫస్ట్ క్లాస్
విక్టర్ రమిరెజ్.

554
00:45:26,766 --> 00:45:27,976
సిద్ధం. చూడండి.

555
00:45:29,769 --> 00:45:31,438
గురి పెట్టండి. ఆయుధాలు.

556
00:45:33,606 --> 00:45:36,526
సిద్ధం. గురి పెట్టండి. కాల్చండి.

557
00:45:38,611 --> 00:45:40,363
వెనుకకు. కుడివైపు.

558
00:45:42,490 --> 00:45:45,243
సిద్ధం. గురిపెట్టండి. కాల్చండి.

559
00:45:46,327 --> 00:45:49,789
యునైటెడ్ స్టేట్స్
నావల్ స్పెషల్ వార్ఫేర్ కమాండ్

560
00:45:58,965 --> 00:46:01,301
ఇరాన్ తో ముడిపడిన రసాయన ఆయుధాలు

561
00:46:02,552 --> 00:46:04,429
ఇవాళ, మీకు జాతి సంతాపం చెబుతోంది...

562
00:46:04,512 --> 00:46:05,346
ఇరాక్

563
00:46:05,430 --> 00:46:11,186
...ధన్యవాదాలు, మేము ఈ సంఘ
ప్రతిష్టాత్మక సభ్యుడిని గౌరవిస్తాము.

564
00:46:11,811 --> 00:46:13,438
సిల్వర్ స్టార్ గ్రహీత,

565
00:46:14,105 --> 00:46:16,524
స్పెషల్ వార్ఫేర్ ఆపరేటర్
సెకండ్ క్లాస్,

566
00:46:17,525 --> 00:46:18,735
డొనాల్డ్ మిచెల్.

567
00:46:18,902 --> 00:46:21,571
సిద్ధం. గురిపెట్టండి. కాల్చండి.

568
00:46:31,664 --> 00:46:33,041
సందేశాలు కనిపించలేదు

569
00:46:33,750 --> 00:46:36,836
మిమ్మల్ని అడిగే విషయం
అన్యాయమని నాకు తెలుసు

570
00:46:37,420 --> 00:46:40,548
మీరంతా చేసిన త్యాగాన్ని
నేను అభినందిస్తాను.

571
00:46:42,675 --> 00:46:45,720
ఇవాళ మనం గౌరవించుకుందాం
సిల్వర్ స్టార్ గ్రహీత,

572
00:46:45,887 --> 00:46:49,516
పెట్టీ ఆఫీసర్ ఎర్నెస్ట్ "బూజర్" వికర్స్.

573
00:46:57,565 --> 00:46:58,983
-కమాండర్ రీస్.
-మేడం.

574
00:47:01,819 --> 00:47:05,156
మిసెస్ రీస్.
అడ్మిరల్ భార్య మీ గురించి అంతా చెప్పారు.

575
00:47:05,949 --> 00:47:08,743
స్థానిక పోటీలలో మీరు
వీళ్లలో చాలామందిని ఓడించారని.

576
00:47:09,244 --> 00:47:11,079
అది చూసేందుకు చాలా డబ్బు ఇస్తాను.

577
00:47:11,329 --> 00:47:13,039
ధన్యవాదాలు, మేడం సెక్రటరీ.

578
00:47:14,916 --> 00:47:16,543
నీ భర్తతో కాసేపు మాట్లడవచ్చా?

579
00:47:16,793 --> 00:47:17,794
తప్పకుండా.

580
00:47:24,801 --> 00:47:26,553
నేనంత రాజకీయవేత్తను కాను.

581
00:47:26,886 --> 00:47:30,640
నాకు అనిపించినదే మాట్లాడి, చేయడంతో,
పత్రికలు, ప్రజలకు నచ్చుతుంది.

582
00:47:30,723 --> 00:47:31,683
అవును, మేడం.

583
00:47:32,600 --> 00:47:37,230
ఇక, నీకు, ఈ కుటుంబాలకు
సొంత కాళ్లపై నిలబడేందుకు ఏం కావాలన్నా

584
00:47:37,313 --> 00:47:40,275
నేను అందిస్తానని చెప్పదలచుకున్నాను.

585
00:47:41,693 --> 00:47:42,694
ధన్యవాదాలు, మేడం.

586
00:47:46,739 --> 00:47:49,033
నిన్ను నావీ క్రాస్లో పెడుతున్నాను.

587
00:47:49,367 --> 00:47:51,744
-లేదు, నాకంత అర్హత లేదు.
-అవును, ఉంది.

588
00:47:52,453 --> 00:47:55,373
నిన్ను ఆ సొరంగాల నుంచి
బయటకు తేలేమని రేంజర్స్ అన్నా

589
00:47:55,456 --> 00:47:57,542
నీ మనుషులకు సాయం చేయాలని
ఒత్తిడి చేశావు.

590
00:48:00,169 --> 00:48:03,464
ఆ చోటుకు తిరిగి వెళ్లే సీల్స్ కు
ఏం జరిగినా సరే

591
00:48:03,548 --> 00:48:05,967
మనం వారి తరఫున ఉంటామని
ఇది చూపుతుంది.

592
00:48:06,050 --> 00:48:08,386
మేడం, సీల్స్ ను పంపుతున్నారా?

593
00:48:10,221 --> 00:48:13,558
నిఘా వైఫల్యంపై తెలుసుకునేందుకు
కార్యకలాపాలు ఆగాయనుకున్నాను.

594
00:48:13,641 --> 00:48:15,059
నీ మనిషి మూసాను కనుగొన్నాం.

595
00:48:15,351 --> 00:48:18,980
అతనికి మతి పోయింది,
తన జేబులో కుడ్స్ ఫోర్స్ డబ్బుంది.

596
00:48:23,276 --> 00:48:27,030
కహానీ మరుసటి అడుగుపై దృష్టి పెడుతున్నాను.
తనను కనిపెట్టిన వెంటనే...

597
00:48:28,281 --> 00:48:29,532
అక్కడికి వెళతాను.

598
00:48:30,825 --> 00:48:33,620
కహానీ చనిపోయాక,
మొదట నీకే తెలుస్తుంది.

599
00:48:41,085 --> 00:48:42,795
నీ దగ్గర 20ల నోట్లున్నాయా?

600
00:48:44,881 --> 00:48:45,965
జేమ్స్.

601
00:48:47,133 --> 00:48:49,510
నీ దగ్గర ఆయా కోసం చిల్లర ఉందా?

602
00:48:51,679 --> 00:48:52,889
నేను అనుకోవడం మనం...

603
00:48:53,348 --> 00:48:55,725
-తనకు మొబైల్ చెల్లింపు చేద్దాం.
-ఖననం ఖాళీ.

604
00:48:56,100 --> 00:48:58,686
మాలొరీ భార్య కనబడలేదు. అంటే,

605
00:48:59,562 --> 00:49:01,439
బూజర్కు ఇంకా ఎక్కువ దక్కాలి.

606
00:49:06,194 --> 00:49:09,030
ఎంఆర్ఐ షెడ్యూల్ కోసం
క్లినిక్ కు కాల్ చేశావా?

607
00:49:10,698 --> 00:49:11,699
జేమ్స్?

608
00:49:11,991 --> 00:49:13,034
నాకు బాగానే ఉంది.

609
00:49:58,579 --> 00:49:59,580
జేమ్స్.

610
00:50:08,005 --> 00:50:10,091
మనం ఇది అధిగమిద్దాం, సరేనా?

611
00:50:16,347 --> 00:50:17,890
బాగున్నాను, బంగారం.

612
00:50:17,974 --> 00:50:19,892
నేను బాగానే ఉన్నాను.

613
00:50:35,158 --> 00:50:36,367
ఏంటి? ఏంటి?

614
00:50:36,451 --> 00:50:40,246
అక్కడ ఊదా రంగు కారు చూశావా?
అక్కడ పార్క్ చేసి ఉంది.

615
00:50:40,997 --> 00:50:43,166
అది ఖననం దగ్గరుంది,
మనను అనుసరించింది.

616
00:50:46,502 --> 00:50:47,962
-కచ్చితమా?
-కచ్చితమే.

617
00:50:48,880 --> 00:50:51,257
లోపలకు వెళ్లు. లూసీని పట్టుకో.

618
00:51:28,544 --> 00:51:30,129
-చేతులు చూపించు!
-దేవుడా!

619
00:51:31,798 --> 00:51:33,341
క్షమించండి, కమాండర్.

620
00:51:35,426 --> 00:51:38,095
టీమ్లకు తెలియకుండా
నిన్ను కలవాలని.

621
00:51:45,019 --> 00:51:47,021
నాకు టీ ఏదైనా ఇస్తారా?

622
00:51:48,439 --> 00:51:49,982
ఏదైనా మద్యం ఉందా?

623
00:51:50,650 --> 00:51:52,109
తెరిచిన బాటిల్ ఒకటి ఉందను--

624
00:51:52,193 --> 00:51:54,987
-పర్వాలేదు, త్వరగా ముగుస్తుంది.
-ఒకటి చెబుతా, పర్వాలేదు.

625
00:51:55,154 --> 00:51:57,657
ధన్యవాదాలు. ముందు అలా జరగడంపై మన్నించాలి.

626
00:51:59,534 --> 00:52:01,077
నేను లూసీని పడుకోబెడతాను.

627
00:52:01,994 --> 00:52:02,912
అలాగే.

628
00:52:09,377 --> 00:52:11,170
ఇక, అది ఒక విషయం.

629
00:52:12,255 --> 00:52:14,966
బేస్ లు, ఔట్ పోస్ట్ ల మధ్య
18 నెలలు గడిపాను,

630
00:52:15,049 --> 00:52:17,009
కానీ నా మొహం మీద
ఎన్నడూ తుపాకీ లేదు.

631
00:52:19,679 --> 00:52:22,139
అయినా, నన్ను సంప్రదించినందుకు సంతోషం.

632
00:52:23,182 --> 00:52:25,977
గత రెండేళ్లుగా,
నీ దళం ప్రణాళిక అమలు, శిక్షణ మధ్య

633
00:52:26,102 --> 00:52:28,479
ఆరు నెలలు చొప్పున మారుతోంది.

634
00:52:28,563 --> 00:52:30,731
అది 67 శాతం తక్కువ నిలుపుదల సమయం--

635
00:52:30,815 --> 00:52:32,942
ఆప్టెంపో నిష్పత్తి కోసం సంప్రదించలేదు.

636
00:52:33,025 --> 00:52:35,403
ఇన్సిర్లిక్లో కలిసినపుడు
నేనెవరితో ఉన్నానని.

637
00:52:35,486 --> 00:52:38,197
లేదు, నువ్వడిగినది అది కాదు,
అయితే, అవునా?

638
00:52:38,406 --> 00:52:39,740
అంటే, సరిగ్గా కాదు,

639
00:52:41,284 --> 00:52:44,871
నీ స్నేహితుని మరణం చూశాను.
పీఓ వన్ వికర్స్. "బూజర్," కదా?

640
00:52:44,954 --> 00:52:47,540
పోలీసు రిపోర్టు కాపీ సంపాదించాను.

641
00:52:48,207 --> 00:52:50,001
ఇది అతని మరణ ధృవీకరణ పత్రం.

642
00:52:52,420 --> 00:52:53,629
ఆ తేదీని చూడు.

643
00:53:00,636 --> 00:53:04,765
నేను నిన్ను ఇన్సిర్లిక్లో కలిసినప్పటికే,
కొరనాడోలో, అతను చనిపోయాడు.

644
00:53:05,099 --> 00:53:09,145
మీ దళం విస్తరణ నమూనాను ఎందుకు తెచ్చానంటే
అధిక పని, అలసట

645
00:53:09,228 --> 00:53:12,607
మీ వాళ్ల మరణంలో పాత్ర పోషిస్తే,
అది మీ తప్పని అనుకోను.

646
00:53:12,690 --> 00:53:14,734
బాధ్యత వహించాల్సినది వేరే--

647
00:53:14,817 --> 00:53:15,943
నువ్వు వెళ్లే సమయం.

648
00:53:16,569 --> 00:53:19,614
నన్ను శత్రువు అనుకుంటావని తెలుసు,
కానీ నాకు నిజం కావాలి.

649
00:53:19,697 --> 00:53:23,075
ఈ దారుణ వ్యవస్థ నిన్ను, నీ వారిని
చెత్త పరిస్థితిలో ఉంచితే--

650
00:53:23,159 --> 00:53:27,455
నీ సమయానికి ధన్యవాదాలు, మిస్ బ్యురానెక్.
మీ రాకకు సంతోషం.

651
00:53:32,126 --> 00:53:35,296
సరే, అయితే, మరో వారం పాటు ఊళ్లోనే ఉంటాను.

652
00:53:35,671 --> 00:53:37,882
అందుకే, నీ మనసు మారితే...

653
00:53:42,386 --> 00:53:43,512
ధన్యవాదాలు.

654
00:54:03,532 --> 00:54:05,034
మనం కహానీని కనిపెట్టాలి.

655
00:54:07,495 --> 00:54:09,455
మనం కనిపెట్టాక, వాడి తల ఒలుస్తాను.

656
00:54:09,789 --> 00:54:11,415
సోదరభావం చిరకాలం నిలవాలి.

657
00:54:12,583 --> 00:54:14,126
కనిపెట్టాక, వాడి తల ఒలుస్తాను.

658
00:54:39,610 --> 00:54:40,695
ఎల్సీడీఆర్ జేమ్స్ రీస్

659
00:54:58,629 --> 00:55:01,215
ఆ ఆపరేషన్లో నాకు ఏదో జరిగిందనుకుంటా.

660
00:55:06,262 --> 00:55:07,888
నేను క్లినిక్కు కాల్ చేయాలి.

661
00:55:25,448 --> 00:55:27,867
-ఎన్గ్రాం అంటే ఏమిటో తెలుసా?
-లేదు, తెలియదు.

662
00:55:27,950 --> 00:55:30,244
అది మెదడు పరిశోధనలో "కీలక అంశం."

663
00:55:30,327 --> 00:55:33,164
జ్ఞాపకాలను ఎన్కోడింగ్ చేసేందుకు
భౌతిక మార్గం.

664
00:55:33,372 --> 00:55:36,042
ఇది ఆరోగ్యకరమైన రీకాల్ విజువలైజేషన్,

665
00:55:36,250 --> 00:55:37,918
ప్రతి మెమరీకి ప్రత్యేక మ్యాప్.

666
00:55:38,294 --> 00:55:41,047
కానీ, మన జ్ఞాపక మార్గాలకు
ఆటంకం ఏర్పడితే,

667
00:55:41,338 --> 00:55:43,215
గందరగోళం వంటి వాటికి దారితీస్తుంది.

668
00:55:43,299 --> 00:55:45,384
పాత జ్ఞాపకాలు కొత్తవాటిపై చేరతాయి.

669
00:55:46,677 --> 00:55:50,056
దానితో, ఏడాది క్రితం జ్ఞాపకం
నిన్ననే జరిగినట్లు అనిపిస్తుంది.

670
00:55:50,139 --> 00:55:54,101
-మెదడుకు తేడా తెలియదు.
-అది స్పృహ తప్పేలా చేయగలదా?

671
00:55:54,310 --> 00:55:57,646
చేయవచ్చు. మీ అనుమతితో,
సన్నిహితంగా చూద్దాం.

672
00:56:01,734 --> 00:56:04,195
మీ మెదడుపై వివరణాత్మక మ్యాప్
స్కాన్ అందిస్తుంది.

673
00:56:04,278 --> 00:56:07,573
ఇందుకు గంట కంటే తక్కువే పడుతుంది.
ముగిశాక పిలుస్తాము.

674
00:56:25,925 --> 00:56:27,635
ఆరంభానికి దాదాపు సిద్ధం, జేమ్స్.

675
00:56:28,135 --> 00:56:29,136
విన్నాను.

676
00:56:51,826 --> 00:56:53,953
బాగుంది, జేమ్స్. విశ్రాంతిగా ఉండు.

677
00:56:54,036 --> 00:56:56,914
తరువాత స్కాన్లో
అతి సుదీర్ఘ దశ మొదలవుతుంది.

678
00:57:16,308 --> 00:57:17,977
రమిరెజ్, మిచెల్లకు సాయం కావాలి.

679
00:57:18,060 --> 00:57:20,062
-పెద్ద శబ్దం.
-డానీ. దగ్గరకు వెళ్లకు.

680
00:57:20,146 --> 00:57:22,606
-పెద్ద శబ్దం, రమ్!
-లేదు, చూసుకుందాం...

681
00:57:22,898 --> 00:57:23,899
డానీ!

682
00:57:24,191 --> 00:57:25,025
-లేదు.
-హేయ్.

683
00:57:25,109 --> 00:57:26,110
డానీ!

684
00:57:26,902 --> 00:57:29,155
వద్దు!

685
00:57:34,326 --> 00:57:35,703
డానీ, వద్దు!

686
00:57:54,763 --> 00:57:56,056
బాగున్నామా, డాక్టర్?

687
00:58:45,981 --> 00:58:47,942
మీరు బూజర్ను ఇలాగే చంపారా?

688
00:58:49,485 --> 00:58:50,819
పిరికిపందల పద్ధతి.

689
01:00:42,639 --> 01:00:44,808
ఎల్సీడీఆర్ జేమ్స్ రీస్

690
01:00:55,778 --> 01:00:59,365
మీరు లోరెన్ రీస్ ను చేరుకున్నారు.
బీప్ తర్వాత సందేశం ఇవ్వండి.

691
01:01:00,699 --> 01:01:02,826
లోర్, ఇది... నేనే. ఇది నిజం.

692
01:01:02,910 --> 01:01:05,245
ఇప్పుడు నన్ను చంపాలని చూశారు.
నా గన్తోనే.

693
01:01:05,329 --> 01:01:08,582
లూసీని తీసుకుని, ఇంటి నుంటి బయటపడు.
క్షేమంగా ఉన్నాక కాల్ చెయ్.

694
01:01:14,713 --> 01:01:15,964
పదండి! వెళ్లండి!

695
01:01:17,299 --> 01:01:20,636
-9-1-1, మీ అత్యవసరం ఏమిటి?
-నేను కమాండర్ జేమ్స్ రీస్ ను.

696
01:01:20,719 --> 01:01:23,806
మీరు 423 కేమన్ స్ట్రీట్ కు
గస్తీ యూనిట్లను పంపండి.

697
01:01:24,264 --> 01:01:26,725
మళ్లీ చెబుతున్నాను, 423 కేమన్ స్ట్రీట్.

698
01:02:40,591 --> 01:02:42,092
లేదు. లేదు.

699
01:03:16,668 --> 01:03:17,711
నన్ను క్షమించండి.

700
01:04:50,679 --> 01:04:52,681
ఉపశీర్షికలు అనువదించినది
కృష్ణమోహన్ తంగిరాల

