1
00:00:05,026 --> 00:00:06,945
ఏంటి ఇదంతా?

2
00:00:07,695 --> 00:00:09,447
నువ్వు చేసిన దారుణాలకు మూల్యం చెల్లించాలి కదా.

3
00:00:09,531 --> 00:00:10,532
నేనేం దారుణాలు చేశాను?

4
00:00:11,115 --> 00:00:14,452
చెడును నిర్మూలించడానికి నా జీవితాన్ని త్యాగం చేయడమా?

5
00:00:14,536 --> 00:00:17,205
ప్రమాదాలు లేకుండా చేయడమా? ఈ దేశాన్ని కాపాడటమా?

6
00:00:17,288 --> 00:00:19,832
ఇవన్నీ నీ ఇతర ఏజెంట్లకు చెప్పి చూడు.

7
00:00:21,960 --> 00:00:24,128
- ఏంటి?
- నువ్వు మమ్మల్ని బలి చేస్తున్నావు.

8
00:00:24,212 --> 00:00:25,672
మమ్మల్ని విసిరి పారేస్తున్నావు.

9
00:00:25,755 --> 00:00:27,715
నువ్వు అనధికారిక ఆపరేషన్లను నడుపుతూ,

10
00:00:28,800 --> 00:00:32,387
నీకు ముప్పు అనిపించినవారిని ఎవరినైనా
అంతం చేసేస్తావు, అది నీ వాళ్ళనైనా సరే.

11
00:00:32,469 --> 00:00:34,722
ఇప్పుడు మిషన్లంటే పద్ధతిగా,
మంచిగా చేయాలి అంటున్నావా?

12
00:00:34,806 --> 00:00:36,474
ఆ ఏజెంట్లు నిన్ను నమ్ముతున్నారు.

13
00:00:37,308 --> 00:00:39,060
ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతోందా?

14
00:00:40,019 --> 00:00:41,312
ఇదెలా పని చేస్తుంది అనుకున్నావు?

15
00:00:42,063 --> 00:00:45,149
అస్సెట్లను ఏరేయడం, మంచి వాళ్ళు చావడం మామూలే.

16
00:00:45,233 --> 00:00:47,485
స్వేచ్ఛ కోసం ఆ బలిదానాలు తప్పవు, అబ్బాయి.

17
00:00:48,194 --> 00:00:49,195
డిస్క్ ని సంపాదించాం.

18
00:00:54,075 --> 00:00:56,286
ఏం చేద్దామని నీ ప్లాన్?

19
00:00:56,369 --> 00:00:59,664
ఆర్కైవ్ ని దొంగిలించి, అంతా బయట పెట్టేద్దామనా?

20
00:00:59,747 --> 00:01:02,125
మీపై దేశద్రోహులు అనే ముద్ర వేయను అనుకున్నారా?

21
00:01:02,208 --> 00:01:03,585
నిజం తెలియాల్సిన అవసరం ఉంది.

22
00:01:03,668 --> 00:01:06,254
- నేనేం చెప్తే, అదే నిజం అవుతుంది.
- అది మాకు తెలుసు.

23
00:01:06,337 --> 00:01:09,257
నిజం ఏంటో మేము లోకానికి అర్థమయ్యేలా చెప్పనక్కర్లేదు.

24
00:01:09,340 --> 00:01:11,134
వీళ్ళకి చెప్తే చాలు.

25
00:01:11,217 --> 00:01:12,760
పదండి, పదండి!

26
00:01:12,844 --> 00:01:14,470
- పదండి!
- హేయ్!

27
00:01:14,554 --> 00:01:15,847
దగ్గరికి రావద్దు!

28
00:01:17,432 --> 00:01:18,641
పదండి, పదండి!

29
00:01:19,142 --> 00:01:20,810
- హేయ్!
- మోకాళ్ళపై కూర్చోండి!

30
00:01:25,190 --> 00:01:28,318
జాక్, నువ్వు నడిపే రహస్య ప్రోగ్రామ్ లో భాగంగా పని చేసే

31
00:01:28,401 --> 00:01:30,695
దేశ భక్తిగల మగవాళ్ళు,
ఆడవాళ్లు నీకు గుర్తున్నారు కదా?

32
00:01:31,821 --> 00:01:32,864
గుర్తు ఉంటారులే.

33
00:01:33,573 --> 00:01:37,577
నీ పనులు చేయించుకోవడానికి
ఒక్కొక్కరిని ప్రపంచంలోని ఒక్కో చోటకి పంపించావు కదా.

34
00:01:37,660 --> 00:01:39,204
నేను వాళ్ళని సంప్రదించి,

35
00:01:39,287 --> 00:01:43,041
నీ ఆర్కైవ్ లో ఉన్నదేంటో వాళ్లకి కూడా షేర్ చేశా,

36
00:01:44,209 --> 00:01:45,460
వాళ్లకి మరిన్ని వివరాలు కావాలట.

37
00:01:46,377 --> 00:01:52,217
కాబట్టి, ఆ వివరాల గురించి నీతో మాట్లాడటానికి,
వాళ్లనందరినీ ఇక్కడికి రమ్మని చెప్పా.

38
00:01:54,969 --> 00:01:55,970
చూడు, ఎంత పని చేశావో.

39
00:01:56,054 --> 00:01:58,014
మనం ఇవి చేయడానికే కదా ఇతనికి శిక్షణ ఇచ్చింది.

40
00:01:58,598 --> 00:02:01,726
ఒక ప్లాన్ వేసి, సవాళ్ళను అధిగమించి ముందుకు సాగడం.

41
00:02:03,978 --> 00:02:07,815
నువ్వు ఇక్కడికి వచ్చేలా చేశాం,
అప్పుడు అందరూ నీతో నేరుగా మాట్లాడవచ్చు కదా అని.

42
00:02:07,899 --> 00:02:11,194
నీ అస్సెట్ల మదిలో చాలా ప్రశ్నలు ఉంటాయని
నీకు అర్ధమయ్యే ఉంటుంది.

43
00:02:11,778 --> 00:02:14,656
పౌరుల మరణాల గురించి,
ఇష్టం వచ్చినట్టు పనులు చేసేయడం గురించి,

44
00:02:14,739 --> 00:02:18,910
అన్నింటికన్నా ముఖ్యంగా, తమ లాంటి ఏజెంట్లను
ఎందుకు చంపిస్తున్నావు అనే దాని గురించి.

45
00:02:20,662 --> 00:02:22,580
మంచి వాళ్ళని ఎందుకు చంపుతున్నావనే దాని గురించి.

46
00:02:26,960 --> 00:02:29,087
నేను ప్రేమించిన వాటన్నింటినీ, నేను నమ్మిన వాటన్నింటినీ,

47
00:02:29,170 --> 00:02:30,922
నువ్వు నాకు దూరం చేసి, నాశనం చేసేశావు.

48
00:02:31,965 --> 00:02:34,801
దాని వల్లే మన దేశం ఇంకా సురక్షితంగా ఉంది.

49
00:02:34,884 --> 00:02:37,345
కావచ్చు. కాకపోవచ్చు.

50
00:02:37,428 --> 00:02:39,847
కానీ నిజం అందరికీ తెలియాల్సిన అవసరముంది,
దాన్ని మేము బయటపెడతాం.

51
00:02:39,931 --> 00:02:41,891
నేను దీన్ని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కి పంపిస్తాను.

52
00:02:43,017 --> 00:02:44,519
ఇంతటితో నీ ప్రోగ్రామ్ ఖతమ్ అయిపోయింది.

53
00:02:45,979 --> 00:02:47,772
ఇది గెలుపు అని నిజంగా అనుకుంటున్నావా?

54
00:02:52,318 --> 00:02:53,319
లేదు.

55
00:02:55,029 --> 00:02:56,197
చాలా బాధగా ఉంది నాకు.

56
00:02:58,032 --> 00:02:59,075
నిన్ను నమ్మాను నేను.

57
00:03:00,660 --> 00:03:02,203
నువ్వు ఏం అడిగినా చేసి ఉండేదాన్ని.

58
00:03:04,414 --> 00:03:08,418
కానీ నీ పని పట్టడానికి, నీలా ఒక రాకాసిగా
మారాల్సి వస్తుందని మాత్రం నేను అనుకోలేదు.

59
00:03:17,218 --> 00:03:18,219
సిడ్నీ.

60
00:03:19,804 --> 00:03:22,390
నువ్వు రాకాసిగా మారాల్సిన అవసరం లేదు.

61
00:03:23,558 --> 00:03:26,811
మొదట్నుంచీ నీలో ఆ రాకాసి గుణం ఉంది.

62
00:03:47,665 --> 00:03:48,791
ఫెయిర్ బ్యాంక్స్ కు స్వాగతం

63
00:03:52,879 --> 00:03:54,047
సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ

64
00:04:51,229 --> 00:04:53,481
జేన్, మేము దార్లో ఉన్నాం. విల్లో క్రీక్ కి
దక్షిణాన పది కిలోమీటర్ల దూరంలో ఉన్నాం.

65
00:04:53,565 --> 00:04:55,775
సరే. పోలీసులకి సమాచారం అందిస్తున్నాం.

66
00:04:55,859 --> 00:04:57,151
మీరు వెళ్తున్న చోటికి బలగాలను పంపుతున్నా.

67
00:04:57,235 --> 00:04:58,486
ఏమైనా విజువల్స్ వచ్చాయేమో కనుక్కో.

68
00:04:59,279 --> 00:05:01,155
జియలాజికల్ శాఖ వాళ్ళు ఏమైనా ఫీడ్స్ పంపారా?

69
00:05:01,239 --> 00:05:04,450
లేదు, కానీ వైమానిక శాఖ వాళ్ళు
కార్గో రవాణా చేస్తున్న ఒక పైలట్ వివరాలు ఇచ్చారు.

70
00:05:04,534 --> 00:05:07,662
నెనానా డ్యామ్ కి దక్షిణాన
ఏదో జరుగుతోందని అతను చెప్పాడు.

71
00:05:07,745 --> 00:05:10,540
కనీసం నాలుగు పెద్ద కార్లు ఉన్నట్టు,
శవాలు డజనుకు పైగా ఉన్నట్టు చెప్పాడు.

72
00:05:10,623 --> 00:05:12,041
సరే, బలగాలను వెంటనే పంపించు.

73
00:05:13,835 --> 00:05:16,713
గుట్టుచప్పుడు కాకుండా రావాలని చెప్పు.
అక్కడ ఏం జరుగుతోందో మనకి తెలీనే తెలీదు.

74
00:05:17,881 --> 00:05:18,882
సరే.

75
00:05:20,633 --> 00:05:22,677
హాచ్, మనిద్దరం దీనికి ఇవాళే ముగింపు పలికేద్దాం, సరేనా?

76
00:05:23,803 --> 00:05:25,013
తప్పకుండా.

77
00:05:30,184 --> 00:05:35,857
అవును. కోట్లాది మంది ప్రాణాల కోసం
కొందరి ప్రాణాలను త్యాగం చేశా, అది నిజమే.

78
00:05:36,733 --> 00:05:39,569
మీరు ఏదైనా మిషన్ పనిలో ఉన్నప్పుడు,
దాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి

79
00:05:39,652 --> 00:05:41,362
ఏం చేయాలో, అది చేసి తీరుతారు కదా?

80
00:05:41,446 --> 00:05:43,364
అప్పుడు మీరు అనైతిక పనులు చేయరా ఏంటి!

81
00:05:44,365 --> 00:05:49,245
నేను మీ తప్పొప్పులని ఎంచను.
మీరు మిషన్ లో భాగంగా ఏం చేసినా పట్టించుకోను.

82
00:05:50,330 --> 00:05:53,291
కానీ నా విధేయతని ప్రశ్నించే ముందు,

83
00:05:53,374 --> 00:06:00,340
మనందరం కలిసి చేసిన మంచి పనుల గురించి
ఒక నిమిషం ప్రశాంతంగా ఆలోచించండి.

84
00:06:00,423 --> 00:06:04,385
అమెరికా, అమెరికాలా ఉందంటే, దానికి మనమే కారణం!

85
00:06:06,179 --> 00:06:08,014
ఈ ప్రోగ్రామ్ కి నష్టం కలిగించే పని
నేను చేయను కాక చేయను…

86
00:06:10,183 --> 00:06:16,856
మరీ ముఖ్యంగా మీలో ఏ ఒక్కరికీ కూడా
హాని కలిగించగల పనిని ఉద్దేశపూర్వకంగా నేను చేయను.

87
00:06:19,651 --> 00:06:22,570
కానీ నన్ను విలన్ గా చిత్రీకరించాలనుకుంటే…

88
00:06:23,696 --> 00:06:26,741
…దయచేసి

89
00:06:27,951 --> 00:06:29,953
నన్ను వీరోచితంగానైనా చిత్రీకరించండి!

90
00:07:33,141 --> 00:07:34,142
స్పెక్టర్ షెల్

91
00:07:34,225 --> 00:07:36,561
డిస్క్ నుండి అప్ లోడ్ అవుతోంది

92
00:07:49,324 --> 00:07:50,450
అబ్బా.

93
00:08:46,506 --> 00:08:47,507
రండి!

94
00:08:50,552 --> 00:08:52,971
రా, మార్క్స్! పద!

95
00:08:53,054 --> 00:08:55,640
ముందు వెళ్లి కవర్ అందించండి.
ఏదైనా స్పష్టంగా చెప్పండి.

96
00:08:56,140 --> 00:08:58,601
నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి! అప్రమత్తంగా ఉండండి.

97
00:09:38,892 --> 00:09:40,768
సరే మరి, మార్క్స్, నన్ను కవర్ చేయి. రెడీగా ఉన్నావా?

98
00:09:40,852 --> 00:09:42,979
- ఎక్కడికి వెళ్తున్నావు?
- హావ్లాక్ దగ్గరికి, సరేనా? రెడీగా ఉన్నావా?

99
00:09:43,062 --> 00:09:44,731
- హా.
- సరే, కానివ్వు ఇప్పుడు!

100
00:09:45,356 --> 00:09:46,357
వెళ్ళు!

101
00:09:51,196 --> 00:09:53,031
నీ ఆట ముగిసింది, సిడ్నీ!

102
00:09:53,865 --> 00:09:56,534
ఈ పంచాయతీని ముగించాల్సిన సమయం వచ్చింది.

103
00:09:57,994 --> 00:09:59,287
సిడ్నీ?

104
00:10:20,850 --> 00:10:24,729
నీతి నియమాలు అనుకుంటూ
రాబర్ట్ గొప్ప గొప్ప పనులను ముంచేశాడు,

105
00:10:25,438 --> 00:10:27,607
కానీ బంగారం, మనిద్దరికీ తెలుసు,

106
00:10:27,690 --> 00:10:32,028
సానుభూతి అనే పదాన్ని

107
00:10:32,111 --> 00:10:34,447
మన డిక్షనరీ నుండి తీసేయాలని.

108
00:10:38,785 --> 00:10:40,119
ఆఫ్ లైన్…

109
00:11:48,938 --> 00:11:50,273
దేవుడా.

110
00:13:17,652 --> 00:13:20,071
చంపేస్తానే నిన్ను!

111
00:13:41,718 --> 00:13:42,844
ఓరి దేవుడా.

112
00:14:56,709 --> 00:14:57,710
ఏమైంది?

113
00:15:01,464 --> 00:15:04,133
సిడ్నీ, చెప్పు. నీకు రక్తం వస్తోంది. ఏంటిది?

114
00:15:09,973 --> 00:15:12,934
- ఏమైంది? హా?
- తనని కత్తితో పొడిచారు.

115
00:15:14,852 --> 00:15:17,063
దేవుడా. ఎంత లోతుగా దిగింది?

116
00:15:17,146 --> 00:15:18,189
చాలా లోతుగా.

117
00:15:18,273 --> 00:15:20,066
- లోపలి దాకా.
- చాలా లోతుగా.

118
00:15:21,109 --> 00:15:23,152
సరే మరి, వెళదాం ఇక. తనని లేపుదాం. చలో.

119
00:15:23,236 --> 00:15:24,237
చలో.

120
00:15:34,622 --> 00:15:36,207
మార్క్స్!

121
00:15:36,291 --> 00:15:38,918
- మార్క్స్! ట్రక్కు దగ్గరికి పద.
- సాయపడండి!

122
00:15:39,002 --> 00:15:40,378
అడ్డు తీయండి! అడ్డు తీయండి!

123
00:15:45,174 --> 00:15:46,593
ఓకే. దేవుడా.

124
00:15:50,763 --> 00:15:52,765
- రక్తం చాలా పోతోంది.
- నా లివర్లోకి దిగింది.

125
00:15:52,849 --> 00:15:55,018
వాస్కులర్ సంబంధిత గాయం అయినట్టుంది.
మనం కోసి చూడాల్సి ఉంటుంది.

126
00:15:55,101 --> 00:15:57,312
ఏం దెబ్బతిందో చూడాలి మనం. రక్తాన్ని ఆపాలి.

127
00:15:57,395 --> 00:15:59,772
- నీళ్లు తీసుకురాగలరా? ద్రవాలు తీసుకురండి! కానివ్వండి!
- తెస్తున్నాం.

128
00:15:59,856 --> 00:16:01,733
చూడు. నన్ను చూడు.

129
00:16:01,816 --> 00:16:03,234
కాపర్ రివర్ కి గంట పడుతుంది.

130
00:16:03,318 --> 00:16:05,278
- మార్క్స్.
- హీలీ కూడా దగ్గరేం కాదు.

131
00:16:05,361 --> 00:16:07,947
ఫెయిర్ బ్యాంక్స్ కి కాల్ చేసి, ఇక్కడికి
ఎయిర్ అంబులెన్స్ ని ఎంత సేపట్లో పంపగలరో అడుగు.

132
00:16:08,031 --> 00:16:11,910
మనం కాపర్ రివర్ కి కాల్ చేసి, అంబులెన్స్ పంపమందాం,
ఒక ఆపరేటింగ్ రూమ్ ని సిద్ధంగా ఉంచమని చెపుదాం.

133
00:16:11,993 --> 00:16:12,994
చెప్పు.

134
00:16:13,077 --> 00:16:14,162
వెళ్ళిపో.

135
00:16:15,163 --> 00:16:17,916
లేదు. నిన్ను విడిచి నేను వెళ్లనే వెళ్ళను.

136
00:16:17,999 --> 00:16:19,751
ఈ పరిస్థితిని నీకు అనుకూలంగా వాడుకో.

137
00:16:21,544 --> 00:16:23,129
సవాళ్ళని స్వీకరించి, అధిగమించు.

138
00:16:28,343 --> 00:16:31,221
సరే మరి, మిత్రులారా. మనం తనని తరలించాలి. సరేనా?
మనం తనని తరలించాలి, ఓకేనా?

139
00:16:31,304 --> 00:16:34,224
సరే, మేము తనని తరలించాలి.
చలో. నేను పట్టుకున్నాలే. పద.

140
00:16:34,849 --> 00:16:36,434
- చలో.
- దుప్పట్లు. దుప్పట్లు.

141
00:16:36,517 --> 00:16:37,894
హా, కొన్ని దుప్పట్లు కావాలి.

142
00:16:40,897 --> 00:16:42,148
ఐ లవ్ యూ.

143
00:16:42,232 --> 00:16:44,108
- ఐ లవ్ యూ.
- దుప్పట్లు తీసుకురండి!

144
00:16:46,611 --> 00:16:49,030
- ఫ్రాంక్, ఫ్రాంక్, ఫ్రాంక్. ఫ్రాంక్.
- ఓకే. హా. హా.

145
00:16:49,113 --> 00:16:51,991
కాపర్ రివర్ అంత దూరం
తన ప్రాణాలు నిలవవని మనిద్దరికీ తెలుసు.

146
00:16:52,075 --> 00:16:54,577
సాల్ట్ క్రీక్ నదికి ఎగువ ప్రాంతంలో,
డెనీ వాళ్ళు ఉండే ఊరు ఒకటుంది.

147
00:16:54,661 --> 00:16:56,496
వాళ్ళ దగ్గర వైద్య సామాగ్రి ఉంది, ఒక డాక్టర్ ఉన్నారు.

148
00:16:56,579 --> 00:16:57,872
- సరే, అక్కడికే పదండి.
- సరే.

149
00:16:57,956 --> 00:16:59,332
ఎక్కడికి వెళ్ళాలో హాచ్ చెప్తాడు, సరేనా?

150
00:16:59,415 --> 00:17:02,877
- పద.
- ఫ్రాంక్.

151
00:17:02,961 --> 00:17:04,462
నన్ను అదుపులోకి తీసుకుంటాను అన్నావు కదా.

152
00:17:06,255 --> 00:17:08,174
అది జరిగేలా లేదు.

153
00:17:08,758 --> 00:17:10,051
అప్పుడే డిసైడ్ అయిపోకు.

154
00:17:11,386 --> 00:17:13,053
సరే. ఇక చలో.

155
00:17:19,101 --> 00:17:21,020
దరిద్రుడా… హేయ్!

156
00:17:21,104 --> 00:17:22,605
దేవుడా!

157
00:17:23,106 --> 00:17:24,107
అయ్యో.

158
00:18:08,276 --> 00:18:09,277
ఛ!

159
00:18:14,199 --> 00:18:15,658
దేవుడా.

160
00:18:17,118 --> 00:18:19,746
లీవై! కదలకు! కదలకు…

161
00:18:20,246 --> 00:18:21,497
దేవుడా.

162
00:18:25,585 --> 00:18:26,711
ఫ్రీజ్!

163
00:18:29,464 --> 00:18:30,715
ఏం చేస్తావు, ఫ్రాంక్?

164
00:18:30,798 --> 00:18:32,217
నన్ను కాలుస్తావా? హా? చంపేస్తావా నన్ను?

165
00:18:32,300 --> 00:18:33,760
కదలకు.

166
00:18:33,843 --> 00:18:35,929
ఇక్కడ విలన్ ని నేను కాదు, ఫ్రాంక్, అది నీకూ తెలుసు

167
00:18:36,012 --> 00:18:38,014
మేము ప్రపంచం మార్చే
పని చేస్తున్నామని నీతో అన్నాను కదా, ఫ్రాంక్.

168
00:18:38,723 --> 00:18:42,060
మేము ఆ పని చేశాం. బ్రాడ్ఫర్డ్ బండారాన్ని బయటపెట్టాం.

169
00:18:42,936 --> 00:18:45,063
అవినీతిమయమైన తన నెట్వర్క్ అంతా కుప్పకూలిపోతుంది.

170
00:18:46,064 --> 00:18:47,524
ఇప్పుడు నిన్ను అదుపులోకి తీసుకుంటున్నా.

171
00:18:47,607 --> 00:18:49,943
తను ఇంకేమేం ప్లాన్ చేస్తూ ఉండిందో
ఎవరికి తెలుసు, ఫ్రాంక్.

172
00:18:50,026 --> 00:18:51,819
ఎంత మంది ప్రాణాలు పోయి ఉండేవో?

173
00:18:51,903 --> 00:18:53,655
మేము అలా జరగనివ్వలేదు.
మేము వాళ్ళని కాపాడాము, ఫ్రాంక్.

174
00:18:54,239 --> 00:18:56,449
అది నిజం. నువ్వు నన్ను వదిలేయాలి.

175
00:18:56,533 --> 00:18:59,827
ఆ పని నేను చేయలేను. నేను మార్షల్ ని,
నువ్వు చట్టం నుండి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తివి.

176
00:19:01,663 --> 00:19:03,623
చట్టవ్యతిరేక పనులు చేసి,
చివరికి మంచే జరిగిందిగా అంటే కుదరదు, లీవై.

177
00:19:04,624 --> 00:19:06,709
జనాలు చనిపోయారు. నువ్వు బాధ్యత వహించాల్సిందే.

178
00:19:06,793 --> 00:19:08,086
- మోకాళ్ళ మీద కూర్చో.
- బాధ్యతా?

179
00:19:08,169 --> 00:19:09,379
నువ్వు బాధ్యత వహించావా, ఫ్రాంక్?

180
00:19:10,880 --> 00:19:12,048
నీ దగ్గర ఏమైనా రహస్యాలు ఉన్నాయా?

181
00:19:13,299 --> 00:19:15,301
మీ ఇంట్లో నాకు కనిపించిన తుపాకీ సంగతేంటి?

182
00:19:15,385 --> 00:19:17,971
- నిన్ను కాపాడటానికి నేను దాచాను కదా, అదే.
- లేదు. నేను ఇది చట్టప్రకారం చేయాలి.

183
00:19:18,054 --> 00:19:19,222
చట్టప్రకారమా?

184
00:19:20,682 --> 00:19:22,016
కావాలంటే, దాన్ని నువ్వు నమ్మవచ్చు.

185
00:19:23,518 --> 00:19:27,522
అది నిజం అన్నట్టే నువ్వు నటించవచ్చు,
కానీ నీ ముందు ఒక దారి ఉంది, ఫ్రాంక్.

186
00:19:28,106 --> 00:19:31,192
ఏది సరైనదో, ఏది కాదో నువ్వు ఎంచుకోవాలి.

187
00:19:32,235 --> 00:19:35,572
సిడ్నీని కాపాడతావా లేదా నన్ను అరెస్ట్ చేస్తావా?

188
00:19:37,198 --> 00:19:38,324
నీ ఇష్టం.

189
00:19:47,083 --> 00:19:48,710
ఛ.

190
00:19:49,627 --> 00:19:50,837
ఛ!

191
00:19:51,880 --> 00:19:53,006
ఛ!

192
00:20:11,566 --> 00:20:12,609
హేయ్.

193
00:20:13,401 --> 00:20:15,403
ఇక్కడ, కింద, తన ఎడమ వైపు.

194
00:20:22,160 --> 00:20:23,286
అబ్బా.

195
00:20:23,369 --> 00:20:24,996
ఓకే, ఒక్క నిమిషం.

196
00:20:28,458 --> 00:20:29,709
ఓకే.

197
00:20:32,712 --> 00:20:35,381
నేను దాన్ని క్లాంప్ చేయలేకపోతున్నా.
తనని నా వైపు తిప్పండి.

198
00:20:35,465 --> 00:20:37,508
- త్వరగా. త్వరగా.
- ఒక్క నిమిషం. సరే. ఎత్తనా?

199
00:20:37,592 --> 00:20:38,927
- ఓకే. సరే. త్వరగా.
- సరే.

200
00:20:39,010 --> 00:20:40,553
నీకు లోపల ఏమైనా కనిపిస్తోందా, స్టాగ్?

201
00:20:48,436 --> 00:20:52,273
ఓకే. అది కదలకుండా పట్టి ఉంచుతుందని ఆశిద్దాం.

202
00:20:52,357 --> 00:20:55,151
తను ఇప్పుడు స్థిరంగానే ఉన్నట్టుంది.
తను కదలకూడదు. కదలకుండా చూసుకోండి.

203
00:20:57,070 --> 00:20:58,404
తెప్పిస్తున్నా.

204
00:20:59,280 --> 00:21:00,323
ఓకే…

205
00:21:01,449 --> 00:21:03,618
తనకి డిస్ ఇన్ఫెక్ట్ చేసి, ఇంకో డ్రిప్ పెట్టు.

206
00:21:03,701 --> 00:21:07,372
కెనై, వెళ్లి ఇంకొన్ని దుప్పట్లు తీసుకురా, బంగారం.

207
00:21:13,378 --> 00:21:14,587
ఏంటి సంగతి?

208
00:21:15,755 --> 00:21:17,298
- తెలీట్లేదు.
- తెలీట్లేదు అంటే?

209
00:21:17,382 --> 00:21:18,383
పరిస్థితి అంత బాగాలేదు.

210
00:21:20,218 --> 00:21:21,386
నేను…

211
00:21:22,178 --> 00:21:23,930
- నేను అలా బయటకు వెళ్ళొస్తా.
- సరే, వెళ్ళు.

212
00:21:27,475 --> 00:21:28,560
ఎలా ఉంది తను?

213
00:21:30,812 --> 00:21:32,146
అంత బాగా లేదు.

214
00:21:33,189 --> 00:21:37,068
తన లివర్ దగ్గర ఉన్న వెయిన్ కోసుకుపోయింది.

215
00:21:37,694 --> 00:21:39,362
పోర్టల్ వెయిన్ అని అనుకుంటున్నాం.

216
00:21:39,445 --> 00:21:43,658
దాన్ని క్లాంప్ చేసి పెట్టాను,
మేము… మేము కొన్ని ద్రవాలు ఎక్కిస్తున్నాం.

217
00:21:43,741 --> 00:21:48,663
అలా ఎక్కించడం వల్ల తన ఒంట్లోని ద్రవాల స్థాయి
మెరుగుపడుతుంది, ఆక్సిజన్ స్థాయి కూడా పెరుగుతుంది,

218
00:21:49,247 --> 00:21:51,916
కానీ తనకి సరైన విధంగా
రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంది.

219
00:21:52,000 --> 00:21:54,127
- లేదంటే తన ఒంట్లో ఆక్సిజన్ ప్రమాద స్థాయికి పడిపోతుంది.
- అయితే?

220
00:21:54,878 --> 00:21:56,296
అది ఇక్కడ చేయడం కుదరదు.

221
00:21:58,464 --> 00:22:01,926
తన ఒంట్లో ఆక్సిజన్ స్థాయి 90లలో ఉంది,
ఇంకా పడిపోతూ ఉంది.

222
00:22:02,010 --> 00:22:06,848
క్షణక్షణానికి రక్తస్రావం అధికమై,
ఆ ఆక్సిజన్ స్థాయి పడిపోతూ ఉంటుంది.

223
00:22:07,724 --> 00:22:11,978
అది 80% కంటే కిందికి పడిపోతే, తన ప్రాణాలు పోతాయి.

224
00:22:14,022 --> 00:22:15,231
మరి ఇప్పుడేం చేద్దాం?

225
00:22:15,315 --> 00:22:16,566
ఎయిర్ అంబులెన్స్ చాలా దూరంలో ఉంది.

226
00:22:16,649 --> 00:22:18,568
కాపర్ రివర్లో రక్తం ఎక్కించే సదుపాయం లేదు.

227
00:22:18,651 --> 00:22:20,111
ఫెయిర్ బ్యాంక్స్ కి ఒకటిన్నర గంటనా?

228
00:22:20,195 --> 00:22:21,321
అంత సేపంటే కష్టం.

229
00:22:21,404 --> 00:22:24,282
ఒకవేళ ట్రాఫిక్ లేకపోయినా, అలా లేకపోతే వింతే అని చెప్పాలి,

230
00:22:24,365 --> 00:22:25,617
తను అంత సేపు ప్రాణాలతో ఉండలేదు.

231
00:22:25,700 --> 00:22:28,203
స్నో మెషిన్ బండి ఒకటి ఉంది.
దాని ద్వారా మంచులో అడ్డంగా వెళ్లిపోవచ్చు.

232
00:22:28,286 --> 00:22:30,747
అంతదూరం వెళ్ళడానికి సరిపడా
పెట్రోల్ అందులో ఉంటే, ఓకేనే అనిపిస్తోంది.

233
00:22:30,830 --> 00:22:32,957
ఇక్కడికి పెట్రోల్ వచ్చి ఒక వారంపైనే అయింది.

234
00:22:33,041 --> 00:22:34,417
తనని ఫెయిర్ బ్యాంక్స్ కి తీసుకెళ్ళాలి.

235
00:22:34,500 --> 00:22:37,170
తనని… తనని తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేద్దాం, సరేనా?

236
00:22:37,253 --> 00:22:39,714
తన గాయం ఎంత తీవ్రంగా ఉందో మీకు అర్థం అవ్వట్లేదు.

237
00:22:39,797 --> 00:22:42,550
తను ఇక్కడే ఉంటే చనిపోవడం ఖాయం, కదా?

238
00:22:43,676 --> 00:22:46,387
అంత సేపు ప్రయాణం అంటే తను బతకలేదు.

239
00:22:46,471 --> 00:22:48,389
ఓకే, మరేం చేద్దాం? మీరే చెప్పండి.

240
00:22:48,932 --> 00:22:50,183
అంటే, లోపల తను చనిపోతూ ఉంది.

241
00:22:50,266 --> 00:22:53,853
అదే జరిగితే, దానికి మనమే కారణం అవుతాం,
అలా జరగకూడదు అంటే, ఏదోకటి చేయాలి మనం.

242
00:22:53,937 --> 00:22:55,939
అంటే, మనం ఇక్కడ చేసేది ఇదే కదా?

243
00:22:56,022 --> 00:22:58,608
ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ
కలిసి పని చేస్తూ జీవనం సాగించడం.

244
00:23:02,529 --> 00:23:03,571
కాబట్టి…

245
00:23:04,197 --> 00:23:05,240
కుక్కలని ఉపయోగిద్దామా?

246
00:23:08,076 --> 00:23:10,745
క్యాపీ వీవర్ దగ్గర ఆరు హస్కీ కుక్కలు ఉన్నాయి.
అవి ట్యాంక్ ని లాగగలవు.

247
00:23:11,788 --> 00:23:13,915
వెళ్లి అతడిని తీసుకురా. శభాష్. తీసుకురా.

248
00:23:14,791 --> 00:23:16,167
ఓకే, చలో. ఈ పని కానిద్దాం.

249
00:23:19,546 --> 00:23:20,588
ఫ్రాంక్, ఆగలేక చెప్పేస్తున్నా,

250
00:23:20,672 --> 00:23:23,633
లాగడానికి కుక్కల సాయం తీసుకున్నా, మంచులో
దారికి ఏదోకటి ఎక్కడోక్కడ తప్పక అడ్డు ఉంటుంది.

251
00:23:23,716 --> 00:23:26,302
- దాని వల్ల ప్రయాణం కాస్త ఆలస్యమవుతుంది.
- తనని నేను చావనివ్వను, హాచ్.

252
00:23:27,679 --> 00:23:32,559
పాస్ ని దాటాక, నేను ఓల్డ్ గ్లేషియర్ నుండి
ఎఫ్ఐఏకి వెళ్లే మార్గంలో వెళ్తాను.

253
00:23:32,642 --> 00:23:34,602
అలా వెళ్తే నేరుగా హైవేకి వెళ్ళవచ్చు.

254
00:23:35,353 --> 00:23:38,231
నువ్వు షూటర్ బ్రౌన్ కి కాల్ చేయి.
అతను అక్కడికి దగ్గర్లోనే ఉంటాడు.

255
00:23:38,314 --> 00:23:40,900
అతడిని ట్రక్కు తీసుకుని, ఎఫ్ఐఏ మార్గం
స్టార్టింగ్ పాయింట్ కి రమ్మని చెప్పు, మేమక్కడికి వస్తాం.

256
00:23:40,984 --> 00:23:43,778
ఓకే, అక్కడి నుండి నేరుగా ఫెయిర్ బ్యాంక్స్ కి
వెళ్ళవచ్చు. తను బాగానే ఉందా?

257
00:23:45,196 --> 00:23:46,865
తను చావుతో పోరాడుతోంది.

258
00:23:47,657 --> 00:23:49,450
నువ్వు శరవేగంగా వెళ్లాల్సి ఉంటుంది.

259
00:23:50,034 --> 00:23:51,244
సరే మరి, ఇక బయలుదేరుతా.

260
00:23:52,704 --> 00:23:53,788
ఈ బ్యాగ్ వేసుకోండి.

261
00:23:55,206 --> 00:23:56,207
నా తుపాకీ తీసుకోండి.

262
00:23:56,291 --> 00:23:57,542
థ్యాంక్స్, రిఫ్.

263
00:24:02,255 --> 00:24:03,798
థ్యాంక్స్, బాసూ.

264
00:24:03,882 --> 00:24:04,883
సరే మరి.

265
00:24:14,183 --> 00:24:16,644
- సరే మరి, హాచ్.
- నువ్వు పాస్ ని దాటగానే,

266
00:24:16,728 --> 00:24:18,187
చాలా షార్ప్ కట్ ఉంటుంది, పడే అవకాశం ఉంది.

267
00:24:18,271 --> 00:24:20,315
- మన జీవితాల్లో అది మామూలే కదా, హాచ్?
- అవును.

268
00:24:21,941 --> 00:24:23,443
అంతా ఓకేనా?

269
00:24:23,526 --> 00:24:24,527
సరేనా?

270
00:24:25,403 --> 00:24:29,073
సరే. ఇక బయలుదేరుతాం. సరే మరి.

271
00:24:29,866 --> 00:24:31,034
చల్!

272
00:25:26,798 --> 00:25:28,967
కానివ్వండి! చల్! చల్!

273
00:26:05,169 --> 00:26:06,588
సరే మరి. షూట్, తనని ట్రక్కు ఎక్కిద్దాం.

274
00:26:09,507 --> 00:26:13,344
- లేదు. అస్సలు కుదరదు. తనని ఎక్కించుకోలేను.
- ఎందుకు?

275
00:26:13,428 --> 00:26:16,848
డానీ, ట్రూపర్ రీడ్, ఇంకా
పలువురి ప్రాణాలు పోవడానికి తనే కారణం.

276
00:26:16,931 --> 00:26:19,267
- షూటర్, చెప్పేది విను, సరేనా?
- ఫ్రాంక్, నీ డ్యూటీ నువ్వు చేయాలేమో,

277
00:26:19,350 --> 00:26:20,435
కానీ ఇందులో నేను భాగం కాలేను.

278
00:26:20,518 --> 00:26:22,437
నా గురించి ఏమైనా అనుకో,

279
00:26:22,520 --> 00:26:26,274
కానీ ఈమె నా కారణంగానే చనిపోయినా,
నాకు ఏ అపరాధభావమూ ఉండదు.

280
00:26:26,357 --> 00:26:27,901
నువ్వు ఇలా ప్రవర్తించే రకం కాదు, షూటర్. భలేవాడివే.

281
00:26:27,984 --> 00:26:31,029
నేను సాయపడాలని చట్టం ఏమీ లేదు,
అది అందరికన్నా నీకే బాగా తెలుసు కదా.

282
00:26:33,489 --> 00:26:35,783
నువ్వు చట్టాలను, నియమాలను
పట్టించుకునే వాడిలా నాకెప్పుడూ అనిపించలేదు,

283
00:26:35,867 --> 00:26:37,619
కానీ ఇప్పుడు వాటిని పట్టించుకుంటున్నావని అర్థమైంది,

284
00:26:37,702 --> 00:26:40,955
కాబట్టి నంబర్ ప్లేట్ లేదు కదా,
ముందు ఆ విషయంతో మొదలుపెడదామా?

285
00:26:41,039 --> 00:26:42,790
పోవయ్యా నువ్వు.

286
00:26:42,874 --> 00:26:45,376
లోపల ఏముందో చూద్దాం. ఏముంది, హా?

287
00:26:45,460 --> 00:26:46,711
సూపర్.

288
00:26:48,213 --> 00:26:50,715
హేయ్, ఓ మోటర్ వాహనంలో తెరిచి ఉన్న మద్యం బాటిల్ ఉంది.

289
00:26:50,798 --> 00:26:51,799
అదొక ఉల్లంఘన.

290
00:26:51,883 --> 00:26:55,094
సీట్ బెల్టు తీసేసి ఉంది, అది చట్టవ్యతిరేకం.
షూటర్, ఈ ఉల్లంఘనలు చాలు,

291
00:26:55,178 --> 00:26:58,348
నీ బండిని తోడేళ్ళ వేట కాలం ముగిసేదాకా సీజ్ చేయడానికి,

292
00:26:58,431 --> 00:26:59,849
కానీ అలా చేసినా నీకేం పర్వాలేదు, కదా?

293
00:26:59,933 --> 00:27:01,726
ఎందుకంటే, నీకు విస్కీ ఉంటే చాలు,
వేట-గీట అక్కర్లేదు.

294
00:27:02,977 --> 00:27:05,021
బాబోయ్, ఫ్రాంక్. ఇలా కానిస్తావా అయితే?

295
00:27:05,980 --> 00:27:07,232
ఇలానే కానిస్తా, షూట్.

296
00:27:08,274 --> 00:27:09,275
ఇప్పుడు తనని బండి ఎక్కిద్దాం.

297
00:27:10,818 --> 00:27:11,861
రా.

298
00:27:26,334 --> 00:27:27,502
ఓకే.

299
00:27:30,630 --> 00:27:31,673
కుక్కలని చూసుకో.

300
00:29:22,784 --> 00:29:24,369
ఫెయిర్ బ్యాంక్స్ ప్రావిడెన్స్ హాస్పిటల్

301
00:30:37,734 --> 00:30:40,403
నర్స్ అసిస్టెంట్ ఎవరైనా ఉంటే, ఫార్మసీకి రావాలి. కైల్…

302
00:30:44,574 --> 00:30:45,909
ఛ.

303
00:30:52,498 --> 00:30:54,626
- చెప్పు.
- ఫ్రాంక్, అతడిని కనుగొన్నాం.

304
00:30:55,752 --> 00:30:57,045
హావ్లాక్ ని కనుగొన్నాం.

305
00:31:00,715 --> 00:31:01,716
దేవుడా.

306
00:31:01,799 --> 00:31:04,761
- మోకాలికి ఏదో అయినట్టుందిగా, ఫ్రాంక్.
- మొత్తం శరీరానికి అయిందిలే.

307
00:31:07,013 --> 00:31:08,598
దీని గురించి ఓ బుష్ పైలట్ కాల్ చేసి చెప్పాడా?

308
00:31:09,098 --> 00:31:10,642
హా, అతను ఇంధనం తెచ్చుకోవడానికి వెళ్తున్నాడట.

309
00:31:11,517 --> 00:31:14,103
కానీ మేము వచ్చేసరికి, మొత్తం పూర్తిగా కాలిపోయింది.

310
00:31:18,066 --> 00:31:19,526
వేగంగా మలుపు తీసుకోవడం వల్ల జరిగిందా ఇది?

311
00:31:20,109 --> 00:31:23,071
కాదు. రోడ్డు మీద ఐస్ ఏర్పడటంతో
బండి కొంచెం స్లిప్ అయి, ఇంత దూరం వచ్చి పడింది.

312
00:31:23,655 --> 00:31:26,699
- ఈ యాక్సిడెంట్ సినిమాటిక్ గా జరిగిందని చెప్పవచ్చు.
- హా, ఎలా?

313
00:31:26,783 --> 00:31:31,496
అంటే, చివరికి మనం ఇతడిని ఏం చేయలేకపోయాం కానీ,
అలాస్కా ఇతని మరణానికి కారణమైంది.

314
00:31:33,706 --> 00:31:35,458
ఇతనే హావ్లాక్ అని పక్కాగా తెలుసా?

315
00:31:36,501 --> 00:31:38,461
బాగా కాలిపోవడంతో ప్రింట్స్ తీసుకోవడం కుదరలేదు,

316
00:31:38,545 --> 00:31:41,089
కానీ ఈ కారు దొంగిలించబడిందని రిపోర్ట్ చేశారు.

317
00:31:41,172 --> 00:31:42,632
ఇతని ఎత్తు, బరువు మ్యాచ్ అవుతున్నాయి.

318
00:31:43,341 --> 00:31:45,552
బాగా వేడిగా ఉండటం వల్ల డీఎన్ఏని
తీయడం కష్టంగా ఉంది, కదా?

319
00:31:46,344 --> 00:31:47,762
ఫ్రాంక్, ఇతను హావ్లాకే.

320
00:31:49,347 --> 00:31:52,559
విమానంలో ఉన్నప్పుడు సంకెళ్లను అన్ లాక్ చేయడానికి
మోలార్ దంతాన్ని ఉపయోగించి ఉంటాడని అనుకున్నాం కదా,

321
00:31:52,642 --> 00:31:54,852
ఇతనికి కూడా ఆ పన్ను లేదు మరి. చూడు.

322
00:31:58,857 --> 00:32:01,109
ఎట్టకేలకు ఇదంతా ముగిసిపోయిందంటే ఆశ్చర్యంగా ఉంది.

323
00:32:03,987 --> 00:32:05,280
ఇతని మరణానికి అలాస్కా కారణమైంది.

324
00:32:14,622 --> 00:32:16,958
టామీ, ఏంటి అప్ డేట్?

325
00:32:17,041 --> 00:32:19,002
ఆపరేషన్స్ మేనేజర్ సైట్లోనే ఉన్నాడు.

326
00:32:19,085 --> 00:32:22,255
టర్బైన్లని ఆఫ్ చేసి, ముక్కలు ముక్కలైన
బ్రాడ్ఫర్డ్ బాడీని కనుగొన్నారట.

327
00:32:22,881 --> 00:32:24,424
- బాబోయ్.
- హా.

328
00:32:24,507 --> 00:32:26,926
- ప్రభుత్వ డాక్టరుకి కాల్ చేశావా?
- హా, చేశా.

329
00:32:28,720 --> 00:32:29,971
హేయ్, స్కోఫీల్డ్ గురించి ఏమైనా తెలిసిందా?

330
00:32:31,598 --> 00:32:33,016
లేదు. ఇంకా ఏమీ తెలీలేదు.

331
00:32:56,164 --> 00:32:58,041
ఫెయిర్ బ్యాంక్స్ కోసం ప్రార్థించండి

332
00:33:07,759 --> 00:33:09,469
తర్వాతి ఆపరేషన్ కి కలుద్దాం మరి, ఏమంటావు?

333
00:33:09,552 --> 00:33:13,765
తర్వాతి ఆపరేషన్ ఫ్లోరిడా బీచ్ లో జరగాలని కోరుకుంటున్నా.

334
00:33:14,515 --> 00:33:17,769
- అక్కడ వేడి ఎక్కువ.
- మీరు కొంచెం తేడాలే.

335
00:33:46,714 --> 00:33:48,550
వచ్చినందుకు థ్యాంక్స్, టెడ్. అందుకు కృతజ్ఞులం.

336
00:33:49,676 --> 00:33:50,969
దీని వల్ల అయినా నగరం బయటకు రాగలిగానులే.

337
00:33:51,052 --> 00:33:52,387
హా. నీకు హాచ్ తెలుసు కదా?

338
00:33:53,388 --> 00:33:54,389
మీ నాన్న ఎలా ఉన్నాడు?

339
00:33:54,472 --> 00:33:58,351
ట్వెంటీ మైల్ నదిలో ఇద్దరం కలిసి
చేపలు పట్టాక, నేనతడిని కలవనే లేదు.

340
00:33:59,143 --> 00:34:00,353
ఇంకా సమస్యలు సృష్టిస్తున్నాడా?

341
00:34:00,436 --> 00:34:03,565
- ఇంకా మా అమ్మకి పిచ్చెక్కిస్తున్నాడు.
- మీ ఇద్దరి దగ్గరే కుదురుగా ఉంటాడు ఆయన.

342
00:34:03,648 --> 00:34:06,234
ఇక్కడికి వచ్చేటప్పుడు ఏం జరిగిందో చెప్పారు నాకు.

343
00:34:06,317 --> 00:34:09,821
వినేటప్పుడు, వివరాల్లో
ఏదో మిస్ అవుతున్నట్టుగా అనిపించింది.

344
00:34:12,448 --> 00:34:13,490
కాబట్టి ఏం జరిగిందో చెప్పండి.

345
00:34:14,492 --> 00:34:17,745
అది మాకు కూడా పూర్తిగా అర్థం కాలేదనే చెప్పాలి.

346
00:34:18,287 --> 00:34:20,247
సీఐఏకి ఇందులో పాత్ర ఉందని అంటున్నారు.

347
00:34:20,331 --> 00:34:22,249
ఒక మహిళ పాత్ర ఉందట, తన పేరు జాక్వెలిన్…

348
00:34:22,333 --> 00:34:24,627
- బ్రాడ్ఫర్డ్.
- హా. బ్రాడ్ఫర్డ్.

349
00:34:26,461 --> 00:34:30,717
చూడు, టెడ్… నాకు ఇదేం కొత్త కాదు.

350
00:34:31,383 --> 00:34:33,845
నేను నమ్మే రాజకీయ నాయకులని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.

351
00:34:33,928 --> 00:34:35,638
నాకు తెలిసిన గొప్పవారిలో నువ్వు కూడా ఒకడివి.

352
00:34:38,057 --> 00:34:41,352
అందుకే, నీకు ఇది వ్యక్తిగతంగా ఇవ్వాలనుకుంటున్నా.

353
00:34:55,658 --> 00:34:57,785
- ఏంటిది?
- నిజం.

354
00:34:58,536 --> 00:35:01,164
నువ్వు దీన్ని చూశాక, ఒకసారి మనం మాట్లాడుకోవాలి.

355
00:35:02,123 --> 00:35:04,959
మేము నమ్మే వాళ్ళ చేతిలోనే ఇది ఉండాలని
నిర్ధారించుకోవాలనుకుంటున్నాం, అంతే. ఎవరికైతే…

356
00:35:06,211 --> 00:35:09,672
ఎవరికైతే పూర్తి దర్యాప్తును ప్రారంభించగల
అధికారం ఉందో, వారి దగ్గర అన్నమాట.

357
00:35:11,549 --> 00:35:12,759
హా.

358
00:35:14,427 --> 00:35:15,637
గవర్నర్ లైనులో ఉన్నారు.

359
00:35:17,222 --> 00:35:18,681
నేను తర్వాత కాల్ చేస్తానని చెప్పు.

360
00:35:18,765 --> 00:35:20,266
వద్దు, టెడ్. కాల్ మాట్లాడు.

361
00:35:21,226 --> 00:35:23,770
గవర్నర్ కదా. మేము, మేము బయట వేచి ఉంటాం.

362
00:35:38,952 --> 00:35:40,453
ఏంటి?

363
00:35:41,246 --> 00:35:43,540
- నువ్వు నవ్వుతున్నావు. ఎందుకు?
- ఏదో పిచ్చిదిలే.

364
00:35:46,000 --> 00:35:47,001
ఎందుకో చెప్పు.

365
00:35:49,337 --> 00:35:50,505
తెలీదబ్బా, అంటే…

366
00:35:52,465 --> 00:35:55,760
నాకు తెలిసిన గొప్పవాడు,
అతనికి తెలిసిన గొప్పవాడికి డిస్క్ ఇచ్చాడు…

367
00:35:58,137 --> 00:35:59,347
అది నాలో ఆశను చిగురింపజేస్తోంది.

368
00:36:02,433 --> 00:36:05,061
- సెంటిమెంటల్ అవుతున్నావా?
- తొక్కేం కాదు.

369
00:36:05,144 --> 00:36:06,896
భలేవాడివే. నేను నిన్ను పొగిడా.

370
00:36:08,273 --> 00:36:09,566
నిజంగానే చెప్తున్నా. నాకది నచ్చింది.

371
00:36:11,025 --> 00:36:12,360
నాకు కూడా అది నచ్చింది…

372
00:36:13,319 --> 00:36:15,822
- కానీ అది నెత్తికి ఎక్కించుకోకు, సరేనా? హా.
- నువ్వూ నెత్తికి ఎక్కించుకోకు.

373
00:36:16,990 --> 00:36:19,158
పొగిడా కదా అని ఐస్ హాకీలో నిన్ను ఓడించకుండా ఉండను.

374
00:36:52,734 --> 00:36:53,776
ఇప్పుడెలా ఉంది?

375
00:37:06,456 --> 00:37:10,251
"అదృష్ట దేవత వరించింది" అని చెప్పాలా?

376
00:37:12,462 --> 00:37:13,796
ఎందుకంటే, అది అబద్ధమే అవుతుంది.

377
00:37:16,633 --> 00:37:18,301
ఇది నీకు కొత్తేమీ కాదు, కాబట్టి…

378
00:37:23,514 --> 00:37:24,933
ఇక్కడికి ఎలా తీసుకురాగలిగావు?

379
00:37:26,017 --> 00:37:27,143
చాలా మంది సాయపడ్డారులే.

380
00:37:34,859 --> 00:37:35,860
ఆర్కైవ్.

381
00:37:35,944 --> 00:37:37,195
అది సురక్షితంగానే ఉంది.

382
00:37:38,863 --> 00:37:40,365
నేను నమ్మిన వాళ్లకి ఇచ్చా.

383
00:37:41,574 --> 00:37:42,784
నిజం బయటపడుతుంది.

384
00:37:46,579 --> 00:37:48,414
చూడు, నీకు ఇంకో విషయం చెప్పాలి.

385
00:37:50,959 --> 00:37:53,211
ఒక కారు ప్రమాదం జరిగింది, లోపల ఒక శవం ఉంది.

386
00:37:56,965 --> 00:37:58,383
అది లీవైది అని అనుకుంటున్నావా?

387
00:37:59,842 --> 00:38:02,053
చాలా మంది అది అతని శవమే కావాలని కోరుకుంటున్నారు.

388
00:38:03,221 --> 00:38:04,931
వాళ్ళతో విభేదించాలని నాకు అనిపించలేదు.

389
00:38:07,058 --> 00:38:08,977
అంటే, 52 మంది ఖైదీలను కనిపెట్టడం నా పని.

390
00:38:09,060 --> 00:38:11,688
నీ భర్త పేరు ఆ జాబితాలో లేదు, కాబట్టి…

391
00:38:17,569 --> 00:38:18,570
ఏంటి?

392
00:38:19,946 --> 00:38:21,447
- పెద్ద విషయం కాదులే.
- లేదు, లేదు.

393
00:38:23,157 --> 00:38:24,409
నాకు అది పెద్ద విషయమే కావచ్చు.

394
00:38:28,705 --> 00:38:30,290
బ్రాడ్ఫర్డ్ గురించి ఆలోచిస్తున్నా.

395
00:38:32,333 --> 00:38:34,377
తను అక్కడ అన్న దాని గురించి.

396
00:38:36,129 --> 00:38:39,716
ఇన్నాళ్లూ, ఇందులో కూరుకుపోయి
నేను కొత్త మనిషిని అయిపోయానేమో అని…

397
00:38:41,426 --> 00:38:42,552
నాకు నేను చెప్పుకుంటూ ఉన్నా.

398
00:38:45,221 --> 00:38:47,098
నేనేం కొత్త మనిషిని కాలేదు.

399
00:38:49,726 --> 00:38:51,227
ఇది నన్నేం మార్చలేదు.

400
00:38:52,604 --> 00:38:56,149
నా వ్యక్తిత్వాన్ని ఇది బయటపెట్టింది అంతే.

401
00:38:56,232 --> 00:38:57,901
భలేదానివే. అలా అని నిజంగా అనుకుంటున్నావా?

402
00:39:06,242 --> 00:39:07,327
నేను…

403
00:39:09,537 --> 00:39:11,664
చనిపోయిన ఆ ఎయిర్ మార్షల్స్ గురించి ఆలోచిస్తున్నా.

404
00:39:12,290 --> 00:39:14,417
ఈ ఊర్లోని జనాల గురించి ఆలోచిస్తున్నా.

405
00:39:16,461 --> 00:39:18,004
నీ స్నేహితుడు, డానీ.

406
00:39:20,423 --> 00:39:23,718
నా వల్లే వాళ్ళందరూ చనిపోయారు.

407
00:39:25,762 --> 00:39:28,514
నేను సరైన పనే చేస్తున్నాను అనుకుని

408
00:39:28,598 --> 00:39:30,391
కావాలని చేశాను ఇదంతా.

409
00:39:30,475 --> 00:39:32,352
మా నాన్నకి నచ్చదు ఈ పని.

410
00:39:32,435 --> 00:39:34,312
నువ్వు ఎదుర్కున్న పరిస్థితులని
మీ నాన్న ఎదుర్కోలేదు కదా.

411
00:39:34,395 --> 00:39:37,857
ఆయన నియమాలు, పద్ధతుల ప్రకారం నడుచుకున్నాడు.

412
00:39:45,448 --> 00:39:47,825
ఇదుగో, ఇది తాగు. కానివ్వు.

413
00:39:53,540 --> 00:39:55,416
నువ్వు నా కూతురు, ర్యూబీ గురించి అడిగినప్పుడు…

414
00:39:57,418 --> 00:39:59,003
నేను నీకు పూర్తి నిజం చెప్పలేదు.

415
00:40:06,427 --> 00:40:10,557
ఆ రోజు వాళ్ళు నన్ను చంపడానికి రావడానికి కారణం,

416
00:40:10,640 --> 00:40:13,268
నాపై జరిపిన కాల్పుల్లో
బుల్లెట్ తగిలి తను చనిపోవడానికి కారణం,

417
00:40:15,061 --> 00:40:18,731
నేను కావాలని తీసుకున్న ఒక నిర్ణయం.

418
00:40:18,815 --> 00:40:19,941
నేను ఎంచుకున్న దారి.

419
00:40:22,193 --> 00:40:24,487
నేను నా కూతురిని ఖననం చేసేటప్పుడు,

420
00:40:25,321 --> 00:40:29,409
ఇక నుండి అన్నీ నియమాల ప్రకారమే చేస్తానని
నాకు నేను మాట ఇచ్చుకున్నా.

421
00:40:30,159 --> 00:40:33,830
అలా బలవంతంగా నడుచుకుంటూ వస్తున్నా.

422
00:40:36,416 --> 00:40:37,750
ఎందుకంటే, నియమాలను అనుసరించేటప్పుడు,

423
00:40:37,834 --> 00:40:39,961
మనం బుర్ర పెట్టి నిర్ణయాలు
తీసుకోవాల్సిన అవసరమే ఉండదు.

424
00:40:42,672 --> 00:40:46,384
ఏది సరైనది, ఏది సరైనది కాదు అనే
వ్యక్తిగత అభిప్రాయాలకు ఆస్కారమే ఉండదు.

425
00:40:47,427 --> 00:40:52,140
అప్పుడు మనం చేసే పనుల వల్ల
ఏం నష్టం జరిగినా, బాధ్యత మనది కాదు.

426
00:40:53,641 --> 00:40:56,394
మన పని మనం చేసుకుంటూ పోతుంటాం.
ఏదైనా జరిగితే, అది నియమాలపైకి తోసేయవచ్చు.

427
00:41:01,065 --> 00:41:02,317
కానీ నిన్ను ఒకటి అడుగుతున్నా, సిడ్,

428
00:41:03,651 --> 00:41:06,821
నియమాల ప్రకారమే పోతే,
న్యాయం దక్కుతుందని నిజంగా అనుకుంటున్నావా?

429
00:41:08,156 --> 00:41:09,407
లేదా, దాని కోసం జనాలు…

430
00:41:11,492 --> 00:41:12,869
కఠినమైన నిర్ణయాలను…

431
00:41:15,079 --> 00:41:18,291
ఒక్కోసారి అసాధ్యమైన నిర్ణయాలను
అప్పటికప్పుడు తీసుకోవాల్సి వస్తుందంటావా?

432
00:41:24,380 --> 00:41:26,466
నువ్వు చేసిన పనులన్నీ
నాకు ఓకే కాదు. నిజంగానే కాదు.

433
00:41:30,011 --> 00:41:31,888
కానీ వాటిని నువ్వు ఎందుకు
చేయాల్సి వచ్చిందో అర్థం చేసుకోగలను.

434
00:41:34,224 --> 00:41:37,810
ఒక మంచి పని చేయడం కోసం
నువ్వు ఇంత కష్టపడినందుకు మీ నాన్న కూడా సంతోషిస్తాడు.

435
00:41:50,281 --> 00:41:52,158
విచారణకు ముందు నన్ను కలుస్తావా?

436
00:41:55,453 --> 00:41:58,122
అసలు ఇది విచారణ దాకా
వెళ్తుందంటావా? ఒకసారి ఆలోచించు.

437
00:41:59,332 --> 00:42:00,959
నువ్వు సీఐఏ, లేదా బ్రాడ్ఫర్డ్ చేసిన దారుణాలను

438
00:42:01,042 --> 00:42:04,921
బట్టబయలు చేసినందుకు న్యాయశాఖ
నీపై కేసులు పెడుతుందంటావా?

439
00:42:05,505 --> 00:42:06,506
ఖచ్చితంగా పెడుతుంది.

440
00:42:07,674 --> 00:42:09,092
వాళ్ళు కోర్టు రూమ్ ని మూసేస్తారు.

441
00:42:10,510 --> 00:42:14,013
ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండటానికి
వాళ్ళు వీలైనన్ని దేశ భద్రతా ప్రోటోకాల్స్ ని

442
00:42:14,097 --> 00:42:15,682
అమలు చేస్తారు.

443
00:42:17,308 --> 00:42:22,105
కానీ ఈ విషయంలో శిక్ష పడకుండా
తప్పించుకోగలనన్న భ్రమలో నేనేం లేను.

444
00:42:28,027 --> 00:42:34,993
ఆర్కైవ్ ని ఒక స్నేహితుడికి ఇచ్చావు కదా,
అతనిపై నీకు నమ్మకం ఉందా?

445
00:42:39,122 --> 00:42:40,164
కొండంత నమ్మకం ఉంది.

446
00:42:42,250 --> 00:42:43,251
ఇక నేను బయలుదేరుతా.

447
00:43:01,477 --> 00:43:02,896
ఇంటికి వెళ్ళు, ఫ్రాంక్.

448
00:46:16,881 --> 00:46:18,049
అయితే…

449
00:46:20,718 --> 00:46:23,638
లూక్, నేను చాలా మాట్లాడుకున్నాం, మా ఇద్దరికీ…

450
00:46:23,721 --> 00:46:25,306
కాస్త దూరంగా ఉండాలనిపించి, వెళ్లాం.

451
00:46:28,476 --> 00:46:29,477
కానీ…

452
00:46:31,437 --> 00:46:33,356
మా ఇద్దరికీ అర్థం కాలేదు… అర్థం కావట్లేదు,

453
00:46:33,439 --> 00:46:38,444
ఒక కుటుంబంగా
మనం ఎలా కలిసి ముందుకు వెళ్ళగలం అనేది.

454
00:46:40,822 --> 00:46:45,493
కానీ ఏదేమైనా, మనం చేయాల్సిన పని అదే.

455
00:46:47,453 --> 00:46:48,580
ముందుకు వెళ్లడం.

456
00:46:49,622 --> 00:46:52,208
ఓకే. అది నిజమే. నాకు తెలుసు.

457
00:46:54,377 --> 00:46:56,087
ఇప్పుడు మన ముందు సందిగ్ధ పరిస్థితి ఉంది.

458
00:46:58,381 --> 00:47:00,842
నాన్నా, ఏదోకటి చెప్పు.

459
00:47:04,762 --> 00:47:06,472
నేను తుపాకీని అప్పజెప్పేస్తా.

460
00:47:06,556 --> 00:47:10,143
నేను ఏం చేశానో చెప్పేసి, పర్యవసానాలను అనుభవిస్తా.

461
00:47:11,519 --> 00:47:13,229
దాని వల్ల నా చెల్లి తిరిగి వస్తుందా?

462
00:47:14,147 --> 00:47:16,608
దాని వల్ల మళ్ళీ మనం ఒక కుటుంబం అవ్వగలమా?

463
00:47:16,691 --> 00:47:18,026
ప్యాడీ కూగన్ చనిపోయాడు.

464
00:47:19,110 --> 00:47:21,779
ర్యూబీ చనిపోయింది, ఇప్పుడు ఏమంటున్నావు?

465
00:47:22,405 --> 00:47:24,199
నిన్ను కూడా మేము దూరం చేసుకోవాలా?

466
00:47:24,824 --> 00:47:27,869
దాని వల్ల ఈ కుటుంబం
నాశనం అవ్వడం తప్ప జరిగేదేం లేదు.

467
00:47:31,956 --> 00:47:33,208
దాన్ని వదిలించుకోగలవా?

468
00:47:34,751 --> 00:47:36,794
- బాబూ, అలా చేయలేను. ఇది…
- దాన్ని వదిలించేసుకో.

469
00:47:42,342 --> 00:47:45,553
నేను… నేను ఆ పని ఒకసారి చేశా.
అందుకే మనం ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాం, సరేనా?

470
00:47:49,057 --> 00:47:53,519
ఓకే. ఈ విషయంలో నేను బాధ్యత వహించాల్సిందే.

471
00:47:54,062 --> 00:47:58,942
మరి లూక్ సంగతేంటి?

472
00:48:00,026 --> 00:48:02,403
నా సంగతేంటి?

473
00:48:04,531 --> 00:48:08,535
నువ్వు ఎంత మంచి చేశావో, అది కూడా చూడు, ఫ్రాంక్.

474
00:48:08,618 --> 00:48:11,037
నువ్వు చాలా చేశావు. దానికి మూల్యం చెల్లించుకున్నావు.

475
00:48:11,120 --> 00:48:12,497
మనందరం కూడా చెల్లించుకున్నాం.

476
00:48:14,624 --> 00:48:21,130
చెల్లించుకోవాల్సింది ఇంకేమైనా ఉంటే,
అది కలిసే చెల్లించుకుందాం.

477
00:48:30,348 --> 00:48:31,849
మనం ఇప్పుడు చేసేదేంటో మీకర్థమవుతోంది కదా?

478
00:48:34,686 --> 00:48:37,605
ఇవి మళ్ళీ మనల్ని వెంటాడతాయి.
పర్యవసానాలను ఎదుర్కోవాల్సిందే, లూక్.

479
00:48:39,440 --> 00:48:40,942
ఇది చాలా పెద్ద నిర్ణయం.

480
00:48:43,695 --> 00:48:44,696
హా. అవును.

481
00:48:47,490 --> 00:48:50,326
ఇక్కడ మనం సమిష్టిగా
ఒక కుటుంబంగా నిర్ణయం తీసుకుంటాం.

482
00:48:53,413 --> 00:48:55,039
నువ్వు మాకు ఇక్కడ ఉండటం కావాలి, నాన్నా.

483
00:48:57,000 --> 00:49:00,545
నాకు సంబంధించినంత వరకు, అది అస్సలు లేనే లేదు.

484
00:49:01,713 --> 00:49:04,132
ఆ తుపాకీని నేను అసలు చూడనే లేదు.

485
00:49:05,550 --> 00:49:06,801
నేను కూడా.

486
00:49:12,765 --> 00:49:14,058
ఇది పక్కాగా చేద్దామంటారా?

487
00:49:14,726 --> 00:49:15,727
హా.

488
00:49:17,020 --> 00:49:18,021
అవును.

489
00:49:23,651 --> 00:49:24,903
సమయం ఆసన్నమైంది.

490
00:49:26,529 --> 00:49:31,326
ఈ కుటుంబం… మనం ముందుకు
సాగిపోవాల్సిన సమయం ఆసన్నమైంది.

491
00:51:33,781 --> 00:51:35,408
దేవుడా.

492
00:51:35,491 --> 00:51:36,576
జీవితాన్ని అందంగా మలుచుకోండి

493
00:51:36,659 --> 00:51:39,287
- బేబీ, నాకేం ఐడియా వచ్చిందో చెప్పనా?
- చెప్పు.

494
00:51:39,370 --> 00:51:42,457
ఒక పెద్ద సిడార్ వుడ్ బాత్ టబ్బును తెచ్చుకుందాం.

495
00:51:43,750 --> 00:51:44,751
ఏమంటావు?

496
00:51:44,834 --> 00:51:48,546
దాన్ని గెస్ట్ క్యాబిన్స్ వెనుక ఉండే చెట్ల దగ్గర పెడదాం.

497
00:51:49,547 --> 00:51:52,508
దానికి కరెంట్ ఏమీ అక్కర్లేదు.
కట్టెలని కాల్చి నీటిని వేడి చేసుకోవచ్చు. ఏమంటావు?

498
00:51:54,886 --> 00:51:58,640
- ముందు అవుట్ లెట్ ని బాగు చేయాలేమో.
- లేదు, లేదు. అవుట్ లెట్ ని నేను బాగు చేసేశాగా.

499
00:51:58,723 --> 00:52:01,935
హేయ్, అమ్మా, ఎయిర్ ట్యాక్సీలో
డెలివరీతో పాటు ఫ్రోజెన్ పిజ్జాలు కూడా వచ్చాయి.

500
00:52:02,018 --> 00:52:04,562
- ఇప్పుడు కొంచెం తినవచ్చా?
- లేదు, నేను డిన్నర్ కి ప్లాన్ చేసేశా.

501
00:52:04,646 --> 00:52:07,690
- హేయ్, కీరా.
- హేయ్, మిసెస్ రెమ్నిక్.

502
00:52:07,774 --> 00:52:10,235
ఇది మీకు ఇవ్వమని అమ్మ ఇచ్చింది.

503
00:52:10,318 --> 00:52:13,112
- కొత్త ఇంట్లోకి వచ్చినందుకు కానుక అని చెప్పింది.
- ఇవన్నీ ఎందుకు!

504
00:52:13,863 --> 00:52:15,114
థ్యాంక్యూ.

505
00:52:16,074 --> 00:52:17,700
అబ్బా. దేవుడా. లూక్!

506
00:52:17,784 --> 00:52:18,785
ఏంటి?

507
00:52:18,868 --> 00:52:20,912
లూక్. నేను…

508
00:52:20,995 --> 00:52:23,456
నేను ముందే చెప్పా కదా…

509
00:52:23,540 --> 00:52:25,416
- హేయ్, కీరా. ఎలా ఉన్నావు?
- హేయ్.

510
00:52:25,500 --> 00:52:27,252
పెయింట్ డబ్బా మూతని అలా వదిలేయవద్దని.
ఎవరైనా తొక్కుతారు దాన్ని.

511
00:52:27,335 --> 00:52:29,337
- ఎవరు తొక్కారో చెప్పనా? నేనే.
- సారీ. ఓకే. సారీ.

512
00:52:29,420 --> 00:52:32,173
- సారీ చెప్పాల్సిందే. ఓకే.
- ఓకే, ఇది చాలా బాగుంది.

513
00:52:32,257 --> 00:52:34,133
మీ అమ్మకి నేను థ్యాంక్స్ చెప్పానని చెప్పు,

514
00:52:34,217 --> 00:52:36,219
- కానీ నేను కూడా ఒక నోట్ పంపిస్తాలే తనకి.
- వావ్. ఫ్రోజెన్ పిజ్జా.

515
00:52:36,970 --> 00:52:40,014
- డిన్నర్ కి పిజ్జాయే కదా.
- అమ్మ వద్దంటోంది.

516
00:52:40,098 --> 00:52:41,474
- ఏంటి?
- వద్దు.

517
00:52:41,558 --> 00:52:43,184
భలేదానివే. నేను దాన్ని కత్తిలా చేయగలను.

518
00:52:43,268 --> 00:52:45,395
ఆగు. ఆగాగు. నువ్వు అంతా పాడు చేస్తున్నావు.

519
00:52:45,478 --> 00:52:48,940
- పాడు చేస్తున్నానా? మేము పాడు చేస్తున్నాం.
- ఆపు.

520
00:52:49,023 --> 00:52:54,112
టై వల్ల నాకు ఊపిరాడట్లేదు
మీ సంపన్న సమాజంలో, నాకు కన్నీళ్లే మిగులుతున్నాయి

521
00:52:54,195 --> 00:52:55,613
నాన్నా, ఆపేయ్.

522
00:52:56,489 --> 00:52:57,824
నీవల్ల మాకు కాస్త ఇబ్బందిగా ఉంది.

523
00:52:57,907 --> 00:53:01,578
సమాజంతో పోటీ పడుతూ
క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాం

524
00:53:01,661 --> 00:53:04,873
సరే మరి, దీన్ని… దీన్ని నేను చూడలేను.

525
00:53:04,956 --> 00:53:06,207
…ఇంకా పెరిగిపోతోంది

526
00:53:07,876 --> 00:53:10,461
- భలేవాడివే.
- నీ వల్ల వాళ్ళు వెళ్లిపోయారు.

527
00:53:10,545 --> 00:53:12,505
ప్రేమలో ప్రాథమికాంశాలు

528
00:53:12,589 --> 00:53:14,757
- నువ్వు భలే రొమాంటిక్ అబ్బా.
- కానివ్వు, బేబీ.

529
00:53:14,841 --> 00:53:16,467
బహుశా ఇప్పుడు మనం వెళ్లాల్సిన సమయం అయిందేమో…

530
00:53:16,551 --> 00:53:21,347
లూకెన్బాక్, టెక్సస్
వేలన్, విల్లీ, ఇంకా మిత్రులు

531
00:53:24,100 --> 00:53:25,101
మన మొదటి బుకింగ్ కాల్ ఏమో అది.

532
00:53:25,184 --> 00:53:27,395
మనం జీవించే ఈ విజయవంతమైన జీవితం

533
00:53:27,478 --> 00:53:29,397
- పెయింటర్ ఏమో.
- అవును.

534
00:53:29,480 --> 00:53:31,232
పెయింటర్, అవుట్ లెట్ ని బాగు చేయగలడేమో.

535
00:53:31,316 --> 00:53:33,818
- అవునా? ఇలా రా, నన్ను బాగు చేయనివ్వు.
- వదులు.

536
00:53:34,986 --> 00:53:37,405
- హ్యాంక్ విలియమ్ విషాద గీతాలు
- హలో?

537
00:53:38,615 --> 00:53:40,033
అవును. తప్పకుండా, ఆయన ఇక్కడే ఉన్నాడు.

538
00:53:40,116 --> 00:53:41,117
నీకే ఫోన్.

539
00:53:42,160 --> 00:53:43,161
ఎవరు?

540
00:53:43,244 --> 00:53:44,370
ఏమో.

541
00:53:45,330 --> 00:53:46,331
హేయ్, లూక్.

542
00:53:47,540 --> 00:53:48,541
చెప్పండి.

543
00:53:48,625 --> 00:53:51,336
హేయ్, ఫ్రాంక్. ఎలా ఉన్నావు?

544
00:53:54,505 --> 00:53:56,049
రెండు నిమిషాల క్రితం వరకు బాగానే ఉన్నా.

545
00:53:56,132 --> 00:53:58,509
అది మంచి విషయం కాదు. నా గురించి బెంగే లేదా?

546
00:53:59,052 --> 00:54:00,053
కొంచెం కూడా లేదు.

547
00:54:01,846 --> 00:54:04,265
నేను ఎలా బురిడీ కొట్టించానో కూడా తెలుసుకోవాలని లేదా?

548
00:54:04,349 --> 00:54:06,601
ఊహించి చెప్పనా? జూలియన్ స్టీల్ శవం వాడుకున్నావు కదా.

549
00:54:06,684 --> 00:54:07,685
అదేనా అతని పేరు?

550
00:54:07,769 --> 00:54:10,063
అతని శవం, స్థానికులతో కలిసి
గాలిస్తున్నప్పుడు కనబడింది.

551
00:54:10,146 --> 00:54:12,065
ఎప్పుడోకప్పుడు పనికి వస్తుందని గ్రహించా.

552
00:54:12,148 --> 00:54:13,566
పైన చూడండి.

553
00:54:13,650 --> 00:54:15,818
హా, అతను ఓక్లహోమాకి చేరుకోనే లేదు, కదా?

554
00:54:15,902 --> 00:54:18,905
లేదు, కానీ నాకు ఉపయోగపడ్డాడు కదా.

555
00:54:21,282 --> 00:54:23,368
శవాన్ని తగలబెడితే, డీఎన్ఏ మారుతుందని ఆశించా,

556
00:54:23,451 --> 00:54:25,078
కానీ అదంతా నీకు తెలుసు కదా, ఫ్రాంక్?

557
00:54:27,080 --> 00:54:28,581
మరి ఎందుకు ఏమీ చెప్పలేదు?

558
00:54:28,665 --> 00:54:30,917
ఎందుకంటే, నువ్వు నా సమస్య కాదు, లీవై.

559
00:54:31,000 --> 00:54:33,586
- నిజమా?
- అవును, నిజమే, సరేనా?

560
00:54:33,670 --> 00:54:37,632
నువ్వు ప్రాణాలతో ఎక్కడో తిరుగుతూనే ఉన్నావని
నాకు ఏ అపరాధ భావమూ లేదు.

561
00:54:37,715 --> 00:54:40,093
మారుమూల ఉండే నా చిన్ని లోకానికి
నువ్వు వీలైనంత దూరంగా ఉన్నంత వరకు

562
00:54:40,176 --> 00:54:42,220
నాకు నీతో ఏ సమస్యా లేదు.

563
00:54:43,179 --> 00:54:45,223
- అది కష్టం.
- ఎందుకు?

564
00:54:46,266 --> 00:54:49,811
ఎందుకంటే, నీతో పాటు మారుమూలన ఉండే నీ చిన్ని లోకం,

565
00:54:49,894 --> 00:54:51,229
ఇప్పుడు అన్నింటికీ కేంద్ర భాగం కానుంది.

566
00:54:51,980 --> 00:54:53,398
ఎందుకో తర్వాత చెప్తాలే. ఉంటా.

567
00:54:53,481 --> 00:54:55,316
- ఇప్పుడు నాకు వేరే పనుంది.
- లేదు. ఇప్పుడే చెప్పు.

568
00:54:55,400 --> 00:54:59,195
నీ కుటుంబం ఇంట్లో క్షేమంగా ఉందని
నిర్ధారించుకోవడానికి కాల్ చేశాను, అంతే.

569
00:54:59,279 --> 00:55:00,947
చూడు, నా కుటుంబం జోలికి…

570
00:55:43,198 --> 00:55:44,449
ఈ పని ఖచ్చితంగా చేయాలనుకుంటున్నావా?

571
00:55:45,909 --> 00:55:46,993
హా.

572
00:55:48,494 --> 00:55:49,495
పక్కానా?

573
00:55:50,330 --> 00:55:52,665
- పక్కా.
- నీకు పిచ్చి అబ్బా.

574
00:56:01,591 --> 00:56:02,675
ఏం చెప్పమంటావు…

575
00:56:04,469 --> 00:56:05,595
నా భార్య అంటే నాకు ప్రాణం మరి.

576
00:57:18,751 --> 00:57:20,753
సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్

