1
00:00:26,089 --> 00:00:28,049
పైకి లే. ఎక్కడ ఉంది తను?

2
00:00:29,926 --> 00:00:31,886
బండిలో వెళ్తోందా? కాలినడకన వెళ్తోందా?

3
00:00:34,305 --> 00:00:35,682
స్కోఫీల్డ్ ఎక్కడ?

4
00:00:35,765 --> 00:00:36,891
ఎక్కడ ఉంది తను?

5
00:00:37,642 --> 00:00:39,102
తనని నువ్వు కనిపెట్టలేవు. నన్ను నమ్ము.

6
00:00:39,185 --> 00:00:40,812
నిన్ను నమ్మాలా? అది ప్రయత్నించి చూశాం కదా.

7
00:00:40,895 --> 00:00:43,940
- నీకెప్పుడైనా అబద్ధం చెప్పానా?
- తన గురించి నువ్వు నాకెప్పుడూ చెప్పలేదు.

8
00:00:44,607 --> 00:00:45,859
నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి.

9
00:00:45,942 --> 00:00:48,236
విమానాన్ని సీఐఏ వాళ్ళు కూల్చారని నీకు చెప్తూ ఉన్నా.

10
00:00:48,319 --> 00:00:50,029
అందులో తనకేమైనా సంబంధం ఉందేమో అనుకున్నా,

11
00:00:50,113 --> 00:00:53,074
కానీ అది అసలు తన ప్లానే అని
నాకు అస్సలంటే అస్సలు తెలీదు.

12
00:00:54,868 --> 00:00:59,205
డిశ్పాచ్, ఇక్కడ కొన్ని వాహనాలకు
యాక్సిడెంట్ అయింది. పోలీసులు నేల మీద పడున్నారు.

13
00:00:59,289 --> 00:01:01,332
అర్జెంటుగా అంబులెన్స్ పంపించండి.

14
00:01:08,631 --> 00:01:10,800
- ఎక్కడ ఉన్నావు?
- ఫ్రాంక్, నన్ను క్షమించు.

15
00:01:10,884 --> 00:01:14,596
నేను చేసిన పని నీకు నచ్చేది కాదని నాకు తెలుసు.

16
00:01:14,679 --> 00:01:16,639
నచ్చడమా? జనాల ప్రాణాలు పోయాయి, సిడ్నీ.

17
00:01:16,723 --> 00:01:18,433
అంతా వివరంగా చెప్పాలని నాకూ ఉంది.

18
00:01:18,516 --> 00:01:22,145
కుదిరితే తర్వాత ఎప్పుడైనా చెప్తాను,
కానీ ఇప్పుడు మాత్రం నిన్ను హెచ్చరించడానికి కాల్ చేశా.

19
00:01:22,228 --> 00:01:24,689
నాకు, బ్రాడ్ఫర్డ్ కి మధ్య జరిగే పోరులో

20
00:01:24,772 --> 00:01:25,773
నువ్వు దూరకు.

21
00:01:25,857 --> 00:01:27,150
ఎక్కడ ఉన్నావు నువ్వు అసలు?

22
00:01:27,233 --> 00:01:29,068
నువ్వు దూరితే, నీకే ప్రమాదం.

23
00:01:29,152 --> 00:01:31,196
అలా జరగడం నాకు అస్సలు ఇష్టం లేదు.

24
00:01:31,696 --> 00:01:33,781
దయచేసి చెప్పేది విను,
నీ క్షేమం కోసమే చెప్తున్నా, ఫ్రాంక్…

25
00:01:33,865 --> 00:01:35,783
ఇతరుల గురించి
నువ్వు ఎప్పుడు పట్టించుకున్నావు అసలు?

26
00:01:35,867 --> 00:01:37,076
ఇది ఎలా కనిపిస్తుందో నాకు తెలుసు.

27
00:01:37,660 --> 00:01:39,287
ఎక్కడ చూసినా గాయాలైన,
చనిపోయినవారే కనిపిస్తున్నారు, స్కోఫీల్డ్.

28
00:01:40,496 --> 00:01:41,497
నీకు అర్థం కావట్లేదు.

29
00:01:41,581 --> 00:01:42,999
విమానాన్ని కూల్చింది నువ్వేనని నాకు తెలుసు.

30
00:01:43,082 --> 00:01:45,126
నీ వల్ల ప్రాణాలు పోయాయి.

31
00:01:45,210 --> 00:01:47,795
- హేయ్, నువ్వు లొంగిపోవాలి.
- నేను లొంగిపోలేను. ఇప్పుడైతే అస్సలు లొంగిపోలేను.

32
00:01:47,879 --> 00:01:49,631
ముందు నేను చేయాల్సిన పని ఒకటుంది.

33
00:01:50,423 --> 00:01:52,634
- ఆర్కైవ్ పనేగా.
- ఈ విషయంలో

34
00:01:52,717 --> 00:01:54,761
ఏదోకటి చేయాలని
పూనుకునే రకమైన వాడివి నువ్వని నాకు తెలుసు.

35
00:01:54,844 --> 00:01:57,430
దీన్ని సరి చేయాలని, అడ్డుకోవాలని అనుకునేవాడివి నువ్వు.

36
00:01:57,513 --> 00:01:58,848
కానీ ఆ పని అస్సలు చేయకు.

37
00:01:58,932 --> 00:02:03,561
నీ మంచి కోసమే చెప్తున్నా, ఫ్రాంక్,
ఈ విషయంలో నువ్వు కలగజేసుకోకు.

38
00:02:03,645 --> 00:02:07,482
నీకు కూడా నేను ముందే చెప్పా, ఈ ఊర్లోని
జనాల జీవితాలతో నువ్వు చెలగాటమాడితే మాత్రం,

39
00:02:07,565 --> 00:02:08,941
తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని.

40
00:02:09,441 --> 00:02:11,402
కాబట్టి, ఇప్పుడు నీ చేత తప్పక చెల్లించేలా చేస్తా.

41
00:02:11,486 --> 00:02:13,321
ఎక్కడికి పారిపోతావో పో, ఎంత వేగంగా పోతావో పో,

42
00:02:13,404 --> 00:02:14,948
ఎందుకంటే, నేను నీకోసం వేట మొదలుపెడుతున్నా.

43
00:02:16,699 --> 00:02:18,159
అది నీకే నష్టం, ఫ్రాంక్.

44
00:02:18,243 --> 00:02:20,036
నాకు ఇప్పుడు అది తప్ప ఇంకేం చేయాలని లేదు.

45
00:02:21,287 --> 00:02:23,373
సరే. నేను హెచ్చరించనైతే హెచ్చరించా.

46
00:02:38,137 --> 00:02:39,264
ఫెయిర్ బ్యాంక్స్ కి స్వాగతం

47
00:02:43,351 --> 00:02:44,519
సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ

48
00:03:44,120 --> 00:03:45,371
ఫోర్ట్ వెయిన్రైట్
ఫెయిర్ బ్యాంక్స్, అలాస్కా

49
00:03:45,455 --> 00:03:46,915
హార్ట్ మన్, మార్షళ్ళ అదుపులో ఉన్నాడు.

50
00:03:46,998 --> 00:03:49,250
వాళ్ళు అతడిని ఎక్కడ ఉంచారో కనుగొనే పనిలో ఉన్నాం.

51
00:03:50,376 --> 00:03:52,837
- స్కోఫీల్డ్?
- ఎక్కడుందో తెలీదు.

52
00:03:53,546 --> 00:03:54,714
కానీ ఒక సమస్య ఎదురైంది.

53
00:03:54,797 --> 00:03:56,132
బెరింగ్ స్ట్రయిట్లో ఉన్న మన సిగిన్ట్ పోస్టుల్లో

54
00:03:56,216 --> 00:03:58,218
ఒకదానిలోకి హార్ట్ మన్ అక్రమంగా ప్రవేశించాడట.

55
00:03:58,301 --> 00:03:59,594
క్షతగాత్రులున్నారని పక్కా సమాచారం ఉంది.

56
00:03:59,677 --> 00:04:01,012
అతనికేం కావాలి?

57
00:04:01,095 --> 00:04:02,680
అది ఇప్పుడే చెప్పలేం, కానీ మన విశ్లేషకులు,

58
00:04:02,764 --> 00:04:04,807
అతను ఒక పెటబైట్ వరకు డేటాను
డౌన్లోడ్ చేసుకుని ఉండొచ్చని చెప్తున్నారు.

59
00:04:05,558 --> 00:04:06,893
దరిద్రుడు.

60
00:04:07,769 --> 00:04:11,022
హార్ట్ మన్ గాడి కౌంట్ డౌన్ స్విచ్చును
డెవలప్ చేసిన మహిళ ఉండేది ఫిలడెల్పియాలో కదా?

61
00:04:11,105 --> 00:04:12,106
అవును. హంటింగ్ పార్కులో.

62
00:04:12,190 --> 00:04:13,441
అప్పుడు హార్ట్ మన్ రష్యాలో ఉన్నాడు,

63
00:04:13,525 --> 00:04:16,151
అంటే, అతను ఆర్కైవ్ 6 ని డిజిటల్ గా పంపించి ఉండాలి.

64
00:04:16,235 --> 00:04:17,403
నాకు అర్థం కావట్లేదు, మేడమ్.

65
00:04:17,487 --> 00:04:19,906
బేరింగ్ స్ట్రయిట్లో ఉన్న సిగిన్ట్ పోస్టులన్నీ,
ట్రాన్స్ ఆర్కిటిక్ కేబుల్ ద్వారా

66
00:04:19,989 --> 00:04:22,158
బదిలీ అయ్యే డేటాను కలెక్ట్ చేస్తూ ఉంటాయి,

67
00:04:22,242 --> 00:04:25,912
అంటే, హార్ట్ మన్ దాన్ని కనుక
తన హ్యాకర్ ఫ్రెండుకి పంపి ఉంటే,

68
00:04:26,579 --> 00:04:28,039
దాన్ని మన పోస్టులు సేకరించి ఉండొచ్చు.

69
00:04:28,122 --> 00:04:29,666
అంటే, అది మన సర్వర్లలోనే ఉందని అర్థం.

70
00:04:29,749 --> 00:04:32,502
ఆ దరిద్రుడు మన పోస్టులోకి
అక్రమంగా ప్రవేశించింది కూడా ఆర్కైవ్ కోసమే.

71
00:04:33,044 --> 00:04:34,712
అతను డౌన్లోడ్ చేసుకుంది దాన్నే.

72
00:04:34,796 --> 00:04:36,172
ఒక హార్డ్ కాపీ చేసుకున్నాడు.

73
00:04:36,256 --> 00:04:39,592
ఒకవేళ అది అతని దగ్గర లేకపోతే,
తప్పకుండా స్కోఫీల్డ్ దగ్గర ఉండుంటుంది.

74
00:04:41,844 --> 00:04:43,012
సరే మరి, అందరూ వినండి.

75
00:04:43,638 --> 00:04:46,099
ఇది అదుపులోకి తీసుకొని లేపేసే ఆపరేషన్.

76
00:04:46,182 --> 00:04:48,893
మన ప్రధాన టార్గెట్, సిడ్నీ స్కోఫీల్డ్.

77
00:04:48,977 --> 00:04:54,732
ఆమె దగ్గర రహస్యమైన నిఘా సమాచారం ఉంది,
ఆమె చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని గమనించండి.

78
00:04:54,816 --> 00:04:57,819
మీరు ఏమాత్రం సంకోచించకుండా,
ఆలోచించకుండా ఆమెని చంపేయాల్సి ఉంటుంది.

79
00:04:57,902 --> 00:05:00,530
మన రెండవ టార్గెట్, లీవై టేలర్ హార్ట్ మన్.

80
00:05:01,489 --> 00:05:03,992
అతను కస్టడీలో ఉన్నాడు,
కానీ అతను ప్రాణాలతో ఉండకూడదు.

81
00:05:04,576 --> 00:05:06,035
గుట్టుచప్పుడు కాకుండా పని కానిచ్చేయండి.

82
00:05:06,119 --> 00:05:07,829
ఆధారాలు లేకుండా చూసుకోండి.

83
00:05:08,830 --> 00:05:09,956
ఇక పని మొదలుపెట్టండి.

84
00:06:00,381 --> 00:06:02,467
నీపై ఆధారపడాలని నాకు అస్సలు లేదు,

85
00:06:02,550 --> 00:06:03,718
కానీ నాకు నిజం కావాలి.

86
00:06:03,801 --> 00:06:05,136
అందుకని, నీ సాయం కావాలి నాకు.

87
00:06:05,220 --> 00:06:06,804
చెరసాలలో పెట్టేసి, సాయం చేయమంటే ఎలా!

88
00:06:06,888 --> 00:06:08,389
నువ్వు చెరసాలలోనే ఉండాలి, సరేనా?

89
00:06:08,473 --> 00:06:11,768
నా భార్యని కిడ్నాప్ చేశావు,
మా మనుషులని చంపావు, నీ భార్య పరారీలో ఉంది,

90
00:06:11,851 --> 00:06:14,646
ఇంకా జాక్వెలిన్ బ్రాడ్ఫర్డ్, ఫోర్ట్ వెయిన్రైట్ లో దిగింది.

91
00:06:14,729 --> 00:06:17,941
- తను దిగి ఎంత సేపైంది?
- లేదు, ఈ పరిస్థితి ఏంటి, అసలేం జరుగుతుందో చెప్పు.

92
00:06:22,362 --> 00:06:25,198
నువ్వు ఏదో కనుగొన్నావు కాబట్టే,
నిన్ను చంపడానికి సీఐఏ వాళ్ళు విమానాన్ని కూల్చారని

93
00:06:25,281 --> 00:06:26,449
అనుకున్నావు కదా.

94
00:06:27,534 --> 00:06:28,660
నువ్వు ఏం కనుగొన్నావు?

95
00:06:31,955 --> 00:06:33,331
సీఐఏ డేటాబేస్ ని కనుగొన్నా.

96
00:06:33,414 --> 00:06:34,624
ఆర్కైవ్ 6.

97
00:06:34,707 --> 00:06:38,086
అవును. బ్రాడ్ఫర్డ్ కొందరిని
టార్గెట్ చేసి చంపుతోందని ఆర్కైవ్ నిరూపిస్తుంది.

98
00:06:38,169 --> 00:06:41,631
తను శత్రువులను ఎంచుకుని,
న్యాయ విచారణ వంటివేవీ లేకుండా చంపేస్తోంది.

99
00:06:41,714 --> 00:06:44,133
అయితే, స్కోఫీల్డ్ మొత్తం ఏజెన్సీని
నేలమట్టం చేయాలని చూస్తోందా?

100
00:06:44,217 --> 00:06:45,218
ఏజెన్సీని కాదు. కాదు.

101
00:06:45,301 --> 00:06:47,929
తను బ్రాడ్ఫర్డ్ పని పట్టాలనుకుంటోంది,
తన ప్రోగ్రామ్ ని బయటపెట్టాలనుకుంటోంది.

102
00:06:48,012 --> 00:06:50,056
ఆ ప్రక్రియలో ఎవరికేం జరిగినా పట్టించుకోరు అన్నమాట.

103
00:06:51,683 --> 00:06:53,184
అది కాస్త సంక్లిష్టమైన విషయంలే.

104
00:06:53,268 --> 00:06:55,311
అది నువ్వు ఎవరి వైపు నుండి చూస్తున్నావు
అనే దానిపై ఆధారపడి ఉంటుందేమో.

105
00:06:55,395 --> 00:06:56,437
భలేవాడివే, ఫ్రాంక్.

106
00:06:56,521 --> 00:06:58,231
కోటి మంది మేలు కోసం, పది మంది గురించి ఆలోచించలేం.

107
00:06:58,314 --> 00:07:01,442
కొన్నిసార్లు అలాంటి పరిస్థితి తప్పక వస్తుందని
ఎవరికి అర్థం కాకపోయినా, నీకర్థం కావాలి కదా.

108
00:07:02,193 --> 00:07:03,444
నాకు అర్థమైంది ఏంటో చెప్తా, విను.

109
00:07:04,320 --> 00:07:06,531
ఈ తొక్కలో పంచాయితీని నేను ముగిస్తాను,
నీ భార్యని అరెస్ట్ చేస్తాను,

110
00:07:06,614 --> 00:07:09,367
తను ఇక జీవితాంతం జైల్లోనే గడుపుతుంది.

111
00:07:09,450 --> 00:07:10,952
అది మాత్రం పక్కా.

112
00:07:11,035 --> 00:07:13,037
తన వద్దకి బ్రాడ్ఫర్డ్ ముందు చేరుకుంటే,
అది అసాధ్యం, ఫ్రాంక్.

113
00:07:16,624 --> 00:07:19,961
ఫ్రాంక్, తను ఇక్కడికి వచ్చింది సిడ్నీని
అరెస్ట్ చేయడానికి కాదు, చంపడానికి.

114
00:07:20,044 --> 00:07:21,379
ఆర్కైవ్, సిడ్నీ దగ్గరే ఉందని తనకి తెలుసు.

115
00:07:21,462 --> 00:07:22,714
దాన్ని సిడ్నీ బయటపెడుతుందని కూడా తెలుసు,

116
00:07:22,797 --> 00:07:26,426
కాబట్టి సిడ్నీని ఆపడానికి, తన రహస్యాన్ని
కాపాడుకోవడానికి తను ఎంత దూరమైనా వెళ్తుంది.

117
00:07:26,509 --> 00:07:29,512
నువ్వు నన్ను ఇక్కడి నుండి విడిపిస్తే,
బ్రాడ్ఫర్డ్ ని అడ్డుకోవడంలో నీకు నేను సాయపడగలను.

118
00:07:29,596 --> 00:07:31,931
- అది జరగని పని.
- సరే. ఒకటి చెప్తా విను, ఫ్రాంక్.

119
00:07:32,015 --> 00:07:34,851
నా భార్యను సీఐఏ వాళ్ల నుండి కాపాడటం,
అలాగే నిజం బయటపడేలా చేయడం,

120
00:07:34,934 --> 00:07:39,522
నీ చేతిలో, నీ దగ్గర
ఇంకా మిగిలి ఉన్న సిబ్బంది చేతిలోనే ఉంది.

121
00:07:40,607 --> 00:07:42,358
నువ్వు త్వరగా పని మొదలుపెట్టాలి, ఫ్రాంక్,

122
00:07:42,442 --> 00:07:45,904
ఎందుకంటే తన ప్రాణం పోతే,
నిజం కూడా తనతో పాటే చనిపోతుంది.

123
00:07:49,407 --> 00:07:50,992
ఓకే, మిత్రులారా. అందరూ ఇలా రండి.

124
00:07:54,495 --> 00:07:58,791
మనం వెతకాల్సిన వాళ్ళ జాబితాలో ఇంకో కొత్త పేరు
వచ్చి పడింది, ఆ వ్యక్తి మనతో పాటు పని చేసిన వ్యక్తే.

125
00:07:58,875 --> 00:08:02,378
సిడ్నీ స్కోఫీల్డ్ పరారీలో ఉంది,
యుఎస్ఎం ఫ్లైట్ 207 కూలడంలో

126
00:08:02,462 --> 00:08:05,048
తన పాత్రపై తనని విచారించాల్సిన అవసరముంది.

127
00:08:05,131 --> 00:08:08,468
తను చివరిగా డాల్టన్ లో కనిపించింది.
అది ప్రాస్పెక్ట్ క్రీక్ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది.

128
00:08:08,551 --> 00:08:10,470
తను పరుగెడుతూ వెళ్తోంది,
కాబట్టి ఇంకా ఆ ప్రాంతంలోనే ఉండుంటుంది.

129
00:08:10,553 --> 00:08:13,723
రాష్ట్ర పోలీసులని, ఎఫ్.పీ.డీ వాళ్లని అలర్ట్ చేయండి,
ఇంకా సోషల్ మీడియాలో షేర్ చేయండి.

130
00:08:13,806 --> 00:08:15,558
బయట వీలైనన్ని చోట్ల తన ఫోటోలని అంటించండి.

131
00:08:15,642 --> 00:08:19,270
చూడండి, మనందరం అలసిపోయి ఉన్నామని నాకు తెలుసు.
మన దేహాలు స్ట్రెయిన్ అయి ఉన్నాయి. ఇంటికెళ్లాలని అందరికీ ఉంది.

132
00:08:19,354 --> 00:08:22,982
కాబట్టి, మనం ఇక్కడ ఉండటానికి కారణం
స్కోఫీల్డే అని మీకు గుర్తు చేస్తున్నా.

133
00:08:23,608 --> 00:08:26,486
మన ఆసుపత్రిలో ఖాళీ లేకుండా ఉండటానికి,
మన పిల్లలు భయపడటానికి తనే కారణం.

134
00:08:26,569 --> 00:08:29,489
ఒక వారం నుండి మన ఊరు,
చట్టపరిరక్షణ సంస్థల చేతుల్లో ఉండటానికి తనే కారణం.

135
00:08:29,572 --> 00:08:32,407
కాబట్టి ఎలాగైనా శక్తిని కూడదీసుకోండి.
అవసరమైతే కోపం తెచ్చుకోండి.

136
00:08:32,492 --> 00:08:35,786
ఎందుకంటే, ఈ మహిళని మనం పట్టుకునే దాకా
మన జీవితాలు సాధారణ స్థితికి రావు.

137
00:08:35,870 --> 00:08:39,707
ఇప్పుడు మన ముందు ఒకే లక్ష్యం ఉంది,
అది సిడ్నీ స్కోఫీల్డ్ ని వెతికి పట్టుకోవడం.

138
00:08:39,791 --> 00:08:41,166
కాబట్టి ఆ పని మీదే ఉందాం.

139
00:08:53,263 --> 00:08:56,140
నువ్వెవరో నాకు తెలుసు, విన్సెంట్. నిజంగానే చెప్తున్నా.

140
00:08:56,224 --> 00:08:58,601
రాబర్ట్ స్కోఫీల్డ్ కి
నువ్వు ఆప్త మిత్రుడివని నాకు తెలుసు.

141
00:08:59,185 --> 00:09:00,562
ఈ దేశంలో నీకు అతనే జీవితం ఇచ్చాడని తెలుసు.

142
00:09:00,645 --> 00:09:02,522
సిడ్నీ చిన్నపాపగా ఉన్నప్పటి నుండే
నీకు తెలుసని నాకు తెలుసు,

143
00:09:02,605 --> 00:09:04,482
అందుకే నువ్వు తనకి సాయపడి ఉంటావని అనుకుంటున్నా.

144
00:09:05,567 --> 00:09:07,360
ఎందుకంటే, నీకు తనంటే అభిమానం ఉంది.

145
00:09:08,027 --> 00:09:10,905
అందుకే ఆమెని సురక్షితంగా
తీసుకురావడంలో నీ సాయం నాకు కావాలి.

146
00:09:13,074 --> 00:09:15,243
నీకు సాయపడాలనుకున్నా, సాయపడలేని పరిస్థితి నాది.

147
00:09:15,910 --> 00:09:17,328
తనెక్కడ ఉందో నాకు తెలీదు.

148
00:09:17,412 --> 00:09:18,788
సిడ్నీ ఇప్పుడు పూర్తిగా ఆఫ్ లైన్ కి వెళ్ళిపోయింది.

149
00:09:19,330 --> 00:09:20,832
తనకి ఏం కావాలో నీకు తెలుసు.

150
00:09:21,624 --> 00:09:23,001
ఆర్కైవ్ ని బయటపెట్టాలనుకుంటోంది.

151
00:09:23,626 --> 00:09:26,838
బ్రాడ్ఫర్డ్ ని నాశనం చేయాలనుకుంటోంది,
అది చేసే తీరుతుందిలే.

152
00:09:27,672 --> 00:09:28,715
బ్రాడ్ఫర్డ్ ఇక్కడ ల్యాండ్ అయింది.

153
00:09:29,883 --> 00:09:32,594
కానీ, సిడ్నీని చంపడానికి
తనతో పాటు ఒక బృందాన్ని కూడా తీసుకువచ్చింది,

154
00:09:32,677 --> 00:09:35,471
అందుకే ముందు తన వద్దకి నేను చేరుకోవాలి.

155
00:09:35,555 --> 00:09:36,931
అదెలా చేయాలో చెప్పు.

156
00:09:40,810 --> 00:09:44,606
నువ్వు గాలిస్తున్న మహిళ గురించి
నీకు ఏమాత్రం తెలీదని నాకనిపిస్తోంది.

157
00:09:45,273 --> 00:09:48,443
సిడ్నీ జీవితంలో జరిగిన
సంఘటనలన్నీ కలిసి ఈ పరిస్థితికి దారి తీశాయి.

158
00:09:48,526 --> 00:09:51,905
తన తండ్రి హత్య, తన కుటుంబం పట్ల జరిగిన మోసం,

159
00:09:51,988 --> 00:09:54,157
గూఢచారిగా తను గడిపిన జీవితం.

160
00:09:54,741 --> 00:09:57,952
బ్రాడ్ఫర్డ్, తన రహస్యాన్ని కాపాడుకోవాలని, సిడ్నీతో పాటు,

161
00:09:58,036 --> 00:10:00,496
సిడ్నీకి ఆప్తులైన వాళ్లందరినీ వాడుకుంది.

162
00:10:01,080 --> 00:10:04,584
తను దాన్ని సరిచేయాలనుకుంటోంది.
నిజాన్ని బయటపెట్టాలని అనుకుంటోంది.

163
00:10:04,667 --> 00:10:07,962
సిడ్నీ ఏమీ తప్పించుకు తిరుగుతున్న
దోషి కాదు, తను ఏజెంట్.

164
00:10:08,046 --> 00:10:10,423
ఇందులో వైఫల్యానికి చోటే లేదు.

165
00:10:11,466 --> 00:10:13,343
అతిగా అనిపించినా వాస్తవం ఒకటి చెప్తున్నా,

166
00:10:13,426 --> 00:10:16,846
బ్రాడ్ఫర్డ్ తనని కనిపెడుతుందని నాకు భయం లేదు,

167
00:10:16,930 --> 00:10:21,351
బ్రాడ్ఫర్డ్ కన్నా తన వద్దకి
నువ్వు చేరుకుంటావా లేదా అన్నది కూడా అప్రస్తుతం.

168
00:10:21,434 --> 00:10:25,605
నిజం ఏంటంటే, స్కోఫీల్డ్ మాత్రం
తను అనుకున్న పని చేసి తీరుతుంది.

169
00:10:26,898 --> 00:10:29,234
ఎవరు నువ్వు? లే.

170
00:11:34,090 --> 00:11:35,091
- ఫ్రాంక్.
- చెప్పు.

171
00:11:35,174 --> 00:11:36,801
ఇక్కడున్నావా? ఈమె…

172
00:11:36,885 --> 00:11:39,554
జాక్వెలిన్ బ్రాడ్ఫర్డ్. సీఐఏ డెప్యూటీ డైరెక్టర్ ని.

173
00:11:39,637 --> 00:11:41,055
మీరెవరో తెలుసు నాకు.

174
00:11:43,766 --> 00:11:46,728
ఇక్కడ నువ్వు చాలా బిజీగా ఉన్నావని అర్థమవుతోంది.

175
00:11:47,312 --> 00:11:49,647
నువ్వు, నీ టీమ్ అదరగొట్టేస్తున్నారు.

176
00:11:51,482 --> 00:11:53,318
మనిద్దరం ఏకాంతంగా మాట్లాడుకోగల చోటు ఏమైనా ఉందా?

177
00:11:53,401 --> 00:11:54,777
యుఎస్ మార్షల్
ప్రత్యేక గాలింపు బృందం

178
00:11:54,861 --> 00:11:56,196
స్కోఫీల్డ్ గురించా?

179
00:11:56,279 --> 00:11:58,448
అదొక్కటే కాదు, కాస్త సంక్లిష్టమైన విషయంలే.

180
00:11:59,240 --> 00:12:04,162
ఒకటి మాత్రం పక్కాగా చెప్పగలను, అదేంటంటే
నీ కస్టడీలో ఉన్న ఇద్దరినీ నువ్వు నాకు అప్పగించాలి.

181
00:12:04,245 --> 00:12:07,207
ఒకరు విన్సెంట్ థియాగో అనే పేరుతో చలామణీ అవుతున్నాడు,

182
00:12:07,290 --> 00:12:10,710
ఇంకొకరు మాజీ సీఐఏ ఏజెంట్ అయిన లీవై హార్ట్ మన్.

183
00:12:10,793 --> 00:12:12,503
అతని కోడ్ పేరు, "హావ్లాక్."

184
00:12:12,587 --> 00:12:14,672
- అవును. ఇక్కడే ఉన్నాడా?
- ఇక్కడే ఉన్నాడు.

185
00:12:15,548 --> 00:12:16,883
- వారెంట్ ఉందా?
- నీకు అర్థం కావట్లేదు.

186
00:12:16,966 --> 00:12:18,968
- ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం.
- కోర్ట్ పత్రాలు ఉన్నాయా?

187
00:12:19,052 --> 00:12:20,720
అది నిజమే, కానీ వీళ్ళకి హక్కులు ఉన్నాయి.

188
00:12:20,803 --> 00:12:23,056
కాబట్టి మళ్ళీ అడుగుతున్నా.
మీ దగ్గర కోర్టు పత్రాలు ఏమైనా ఉన్నాయా?

189
00:12:23,139 --> 00:12:24,766
మార్షల్, నేనేం చర్చ పెట్టాలనుకోవట్లేదు.

190
00:12:24,849 --> 00:12:28,019
మీ కస్టడీలో ఉన్న ఈ ఇద్దరూ
చాలాప్రమాదకరమైన వాళ్ళు, అంతర్జాతీయ స్థాయి నేరస్థులు,

191
00:12:28,102 --> 00:12:30,980
వీళ్లిద్దరి వల్ల ఎంత ప్రమాదమో
నువ్వు అస్సలు ఊహించలేవు కూడా.

192
00:12:32,815 --> 00:12:33,816
కరెక్టే.

193
00:12:34,901 --> 00:12:36,611
చూడండి, మీరు లిటిల్ డయమీడ్ గురించి
ఎప్పుడైనా విన్నారా?

194
00:12:37,403 --> 00:12:40,114
- ఎక్స్ క్యూజ్ మీ?
- అది బేరింగ్ సీలో ఉన్న ఒక్క చిన్ని దీవి.

195
00:12:40,198 --> 00:12:42,075
జనాభా సుమారుగా 80 మంది ఉంటారు, అంతే.

196
00:12:42,158 --> 00:12:44,869
ఒక కొండ అంచున
చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఉంటారు వాళ్ళు

197
00:12:44,953 --> 00:12:47,413
మొత్తం అమెరికాలో అత్యంత మారుమూల ప్రాంతంలో
జీవించేది బహుశా వాళ్ళే కావచ్చు.

198
00:12:47,497 --> 00:12:48,581
సరే.

199
00:12:48,665 --> 00:12:50,833
దానికి రెండు మైళ్ళ దూరంలో బిగ్ లిటిల్ డయమీడ్ ఉంది,

200
00:12:50,917 --> 00:12:53,294
అది రష్యాలోని చకత్స్కీ డిస్ట్రిక్ట్ లో భాగం అన్నమాట.

201
00:12:53,378 --> 00:12:57,006
ఈ రెండు దీవులకు నడి మధ్యన
రష్యా-యుఎస్ సరిహద్దు ఉంటుంది.

202
00:12:57,090 --> 00:12:58,341
నువ్వేం చెప్పాలనుకుంటున్నావు?

203
00:12:58,424 --> 00:13:01,302
నేనేం చెప్పాలనుకుంటున్నానంటే,
అలాస్కా, రష్యాకి ఎంత దగ్గరగా ఉన్నా,

204
00:13:01,386 --> 00:13:03,179
అది రష్యాలో భాగం కాదు.

205
00:13:03,763 --> 00:13:05,348
బేరింగ్ సీలో చాలా దూరంలో ఉన్న

206
00:13:05,431 --> 00:13:08,643
లిటిల్ డయమీడ్ దీవి కూడా యుఎస్ లో భాగమే,

207
00:13:08,726 --> 00:13:10,770
మీరు ఇప్పుడు యుఎస్ లోనే ఉన్నారు.

208
00:13:10,853 --> 00:13:13,815
సీఐఏకి అమెరికాలో చట్టపరమైన అధికారం లేదు.

209
00:13:13,898 --> 00:13:16,651
కాబట్టి, ప్రభుత్వ అసిస్టెంట్ అటార్నీ జనరల్,
చట్టపరంగా వ్యవహరించడానికి

210
00:13:16,734 --> 00:13:20,196
మీకు అధికారం ఉందని
ఏమైనా కోర్ట్ ఆర్డర్ ఇచ్చి ఉంటే ఓకే,

211
00:13:20,280 --> 00:13:22,532
లేదంటే నా కమాండ్ సెంటర్ నుండి మీరు దొబ్బేయవచ్చు.

212
00:13:24,450 --> 00:13:25,994
మిస్టర్ రెమ్నిక్. ఫ్రాంక్.

213
00:13:26,578 --> 00:13:28,454
మన పరిచయం అపార్థాలతో మొదలైంది అనుకుంటా.

214
00:13:30,123 --> 00:13:31,666
అది నిజమే అనిపిస్తోంది.

215
00:13:33,710 --> 00:13:36,629
అతనేం చెప్పాడు నీకు? మంచి వాడని చెప్పాడా?

216
00:13:36,713 --> 00:13:38,923
సీఐఏ అక్రమ పనులు చేస్తోందని,

217
00:13:39,007 --> 00:13:43,678
అది అవినీతిమయమైనదని నిరూపించే
నిఘా సమాచారాన్ని దొంగిలించాడని చెప్పాడా?

218
00:13:43,761 --> 00:13:46,556
సీఐఏ అని చెప్పలేదు. మీరని చెప్పాడు.

219
00:13:48,766 --> 00:13:52,270
అతను నీకొక కట్టుకథ చెప్పాడు.
అతను ఎప్పుడూ చేసే పనే అది.

220
00:13:52,353 --> 00:13:54,898
హార్ట్ మన్, మానసికంగా మభ్యపెట్టడంలో శిక్షణ పొందాడు.

221
00:13:54,981 --> 00:13:56,900
జనాలను ఎలా ఏమార్చాలో అతనికి బాగా తెలుసు.

222
00:13:56,983 --> 00:13:58,776
తినరా, దరిద్రుడా.

223
00:13:58,860 --> 00:14:01,404
అతను నీకు ఆర్కైవ్ గురించి చెప్పాడు కదా,
అందులో ఏముందో ఎప్పుడైనా చూశావా?

224
00:14:01,487 --> 00:14:03,239
- లేదు, నేను చూడలేదు.
- అదీ మరి.

225
00:14:03,323 --> 00:14:06,326
అసలు లేని దాని గురించి
నీకు ఏవేవో కథలు చెప్పి నమ్మించాడు.

226
00:14:07,118 --> 00:14:08,536
అది మ్యాజిక్ ట్రిక్ అన్నమాట.

227
00:14:08,620 --> 00:14:10,455
కానీ దాన్ని ఎవరైనా నమ్మేస్తారు.

228
00:14:11,206 --> 00:14:13,082
లీవై హార్ట్ మన్ ఒక దేశద్రోహి.

229
00:14:13,166 --> 00:14:16,377
దేశద్రోహానికి పాల్పడటానికి తన భార్య సాయం తీసుకున్నాడు,

230
00:14:16,461 --> 00:14:17,921
మరి కథ అడ్డం తిరగ్గానే,

231
00:14:18,004 --> 00:14:20,131
ఆమె తన సేఫ్టీ తను చూసుకుంది.

232
00:14:20,882 --> 00:14:23,092
స్కోఫీల్డ్ విమానాన్ని కూల్చింది,

233
00:14:23,176 --> 00:14:25,011
ఆర్కైవ్ ని బయటపెట్టడానికి కాదు.

234
00:14:25,094 --> 00:14:26,846
తనని దోషిగా నిలబెట్టి,
తన జీవితాన్ని నాశనం చేయగల ఏకైక వ్యక్తిని

235
00:14:26,930 --> 00:14:29,390
చంపాలన్న ఉద్దేశంతోనే తను విమానాన్ని కూల్చింది.

236
00:14:29,474 --> 00:14:31,517
నువ్వు డీల్ చేసేది ఎలాంటి వాళ్లతోనో అర్థమైందా?

237
00:14:31,601 --> 00:14:33,895
చూడండి, మీ ఆర్కైవ్ లో ఏముందో
నాకు తెలీదు, అది నాకు అనవసరం కూడా.

238
00:14:33,978 --> 00:14:35,647
నేను స్కోఫీల్డ్ ని పట్టుకోవాలనుకుంటున్నా, అంతే.

239
00:14:35,730 --> 00:14:38,983
తన కారణంగా కొందరు చనిపోయారు,
దానికి తను శిక్ష అనుభవించాల్సిందే.

240
00:14:39,067 --> 00:14:41,736
కాబట్టి ఇక మీరు నాకు సెలవు ఇస్తే,
నేను ఆ పని మీద ఉంటా.

241
00:14:42,445 --> 00:14:44,405
ఇక్కడ నువ్వంటే అందరికీ చాలా అభిమానమని తెలుసు.

242
00:14:45,532 --> 00:14:48,701
- ఏమన్నారు?
- ఇక్కడి నుండి బయటకు వెళ్ళావు. మహానగరాన్నే చూశావు.

243
00:14:48,785 --> 00:14:52,247
అక్కడ ముగించుకుని,
సాదాసీదా జీవితం జీవించడానికి గూటికి వచ్చేశావు.

244
00:14:52,330 --> 00:14:54,832
ఈ ఊర్లో నువ్వు అసలు సిసలైన హీరోవి కదా.

245
00:14:54,916 --> 00:14:55,917
అవును.

246
00:14:56,626 --> 00:14:59,045
ఈ ఊరంటే ప్రేమ పొంగిపోయో,
మీ కూతురు చనిపోయిందన్న బాధతోనో

247
00:14:59,128 --> 00:15:01,130
నువ్వు ఇక్కడికి రాలేదని నాకు తెలుసు.

248
00:15:02,131 --> 00:15:05,677
పరాభవాన్ని భరించలేక,
ఈ మారుమూల ప్రాంతానికి పారిపోయి వచ్చావు,

249
00:15:05,760 --> 00:15:08,096
ఎందుకంటే అసలైన ప్రపంచంలో
నువ్వు బతకలేవు కాబట్టి.

250
00:15:09,514 --> 00:15:11,766
ఎందుకంటే, ఇక్కడ ప్రమాదమేమీ ఉండదు కాబట్టి.

251
00:15:11,849 --> 00:15:14,102
ఎందుకంటే, ఇది ముఖ్యమైన ప్రాంతమే కాదు కాబట్టి.

252
00:15:14,185 --> 00:15:18,273
ఇప్పుడు అసలైన పర్యవసానాలకు దారి తీయగల
అసలైన పరిస్థితి, అసలైన సమస్య

253
00:15:18,356 --> 00:15:20,316
నీ ముందుకు వచ్చింది.

254
00:15:20,400 --> 00:15:23,278
నన్ను పక్కకు పెట్టేస్తే,
తర్వాత నువ్వు చాలా అంటే చాలా బాధపడతావు.

255
00:15:24,821 --> 00:15:25,947
అది నిజమా?

256
00:15:26,030 --> 00:15:29,158
నువ్వు ఈ గది నుండి బయటకు వెళ్తే,
నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు.

257
00:15:31,286 --> 00:15:33,413
అది దాదాపుగా బెదిరింపులానే ఉంది.

258
00:15:34,038 --> 00:15:36,040
హెచ్చరిస్తున్నా అనుకో.

259
00:15:38,334 --> 00:15:40,587
సున్నితంగా నేను కూడా హెచ్చరిస్తున్నా.

260
00:15:42,255 --> 00:15:44,340
మీ ప్రాబల్యం ఇక్కడ తొక్క కూడా పని చేయదు.

261
00:15:45,592 --> 00:15:47,510
అలాగే మీ హోదా, మీకు రాజధానిలో ఉన్న పలుకుబడి కూడా.

262
00:15:47,594 --> 00:15:52,807
నిజానికి, మీకు వాషింగ్టన్ లో ఎంత పలుకుబడి ఉంటే,
ఇక్కడ మీకు అంత ఇబ్బంది ఎదురవుతుంది.

263
00:15:54,309 --> 00:15:56,978
కాబట్టి మీకు నచ్చింది చేసుకోండి.
నన్ను తక్కువ అంచనా వేసుకోండి. నాకది అలవాటే.

264
00:15:57,061 --> 00:15:59,314
కానీ నేను స్కోఫీల్డ్ ని అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తా,

265
00:15:59,397 --> 00:16:02,317
హార్ట్ మన్ ని, థియాగోని ఎఫ్.బీ.ఐ వాళ్లకి అప్పగించేస్తా.

266
00:16:02,400 --> 00:16:03,860
మీరు నా దారికి అడ్డు పడితే,

267
00:16:05,069 --> 00:16:06,905
మిమ్మల్ని కూడా బొక్కలో వేస్తా.

268
00:16:22,086 --> 00:16:23,880
ఫెయిర్ బ్యాంక్స్ అంతర్జాతీయ విమానాశ్రయం

269
00:17:02,794 --> 00:17:04,128
నేను సాయపడతాను, ఆగండి.

270
00:17:05,879 --> 00:17:07,590
- ఎప్పుడూ ఏదోకటి పడేస్తూనే ఉంటా.
- లేదులెండి.

271
00:17:08,465 --> 00:17:09,841
ఇంకేమైనా కావాలంటే సాయపడగలను.

272
00:17:09,926 --> 00:17:11,886
- లేదులే. థ్యాంక్స్.
- లేదా? సరే. ఏమైనా కావాలంటే చెప్పండి.

273
00:17:13,888 --> 00:17:16,139
- నిజానికి…
- చెప్పండి.

274
00:17:16,808 --> 00:17:18,643
…మీరు నాకొక విషయంలో సహాయపడవచ్చు.

275
00:17:18,725 --> 00:17:19,978
సూపర్. చెప్పండి.

276
00:17:24,065 --> 00:17:27,652
హేయ్, మిత్రులారా. షిల్లర్స్ ఫార్మసీ నుండి
ఇప్పుడే ఒకరు కాల్ చేసి, సమాచారం ఇచ్చారు.

277
00:17:27,735 --> 00:17:30,488
అక్కడ స్కోఫీల్డ్ ఉండగా ఒకరు చూశారట.
తనే అని ఆమె పక్కాగా చెప్తోంది.

278
00:17:30,572 --> 00:17:32,866
సరే. ఎఫ్.పీ.డీ వాళ్ళకి కాల్ చేసి,
మేము వస్తున్నామని చెప్పండి.

279
00:17:39,789 --> 00:17:42,333
బ్యూరో వాళ్ళు వస్తున్నారు, హార్ట్ మన్ ని
అదుపులోకి తీసుకోవడానికి సన్నద్ధమవుతున్నారు.

280
00:17:42,417 --> 00:17:44,210
ఇంకో గంటలో అక్కడికి చేరుకుంటారు.

281
00:17:44,294 --> 00:17:45,753
థియాగోని కూడా అదుపులోకి తీసుకుంటారు.

282
00:17:45,837 --> 00:17:47,130
అతనితోనే మనకి పెద్ద తలనొప్పి.

283
00:17:47,797 --> 00:17:49,841
హార్ట్ మన్ వల్ల ఇప్పుడు పెద్ద ప్రమాదమేమీ లేదులే.

284
00:17:50,383 --> 00:17:52,343
థియాగో తీగ లాగితే పెద్దాయన విషయం బయటపడుతుంది.

285
00:17:53,011 --> 00:17:55,346
- మన వాళ్ళు కొందరిని అటు పంపుదామా?
- ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వెళదాం.

286
00:17:55,430 --> 00:17:57,181
అన్నింటికన్నా ముందు స్కోఫీల్డ్ సంగతి చూడాలి.

287
00:17:58,850 --> 00:18:03,104
ఓ.ఎస్.బీ వాళ్లకి కాల్ చేసి, ఆర్కైవ్ ని ఎవరికైనా
పంపాలంటే, తను ఎక్కడికి వెళ్లే అవకాశం ఉందో కనుక్కో.

288
00:18:03,187 --> 00:18:05,690
తను పోస్ట్ చేసేది సెల్ఫీలను కాదు కదా.

289
00:18:05,773 --> 00:18:07,567
తనకి హై-సెక్యూరిటీ నెట్వర్క్ కావాలి.

290
00:18:07,650 --> 00:18:11,446
అంత పెద్ద సైజ్ డేటాను పంపగల సామర్థ్యం ఉన్న
ప్రదేశాలు ఇక్కడ ఎక్కువ ఉండకపోవచ్చు.

291
00:18:11,529 --> 00:18:15,074
పోలీసులందరూ గమనించాలి. చట్టం నుండి
తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తి కనిపించినట్టు రిపోర్ట్.

292
00:18:15,158 --> 00:18:18,912
చిరునామా, 2120 లాత్రాప్.
దగ్గర్లోని యూనిట్లు ప్రతిస్పందించి, సహాయపడండి.

293
00:18:18,995 --> 00:18:20,955
సదరు వ్యక్తి వద్ద ఆయుధాలు ఉండవచ్చు,
వారు ప్రమాదకరం కావచ్చు…

294
00:18:21,039 --> 00:18:24,667
అది తనే. మన టీమ్ కి తెలియజేయి. అక్కడికే వెళ్దాం.
పోలీసులకన్నా ముందు మనమే అక్కడికి వెళ్ళాలి.

295
00:18:24,751 --> 00:18:25,752
త్వరగా పోనివ్వు!

296
00:18:37,347 --> 00:18:39,098
- హేయ్, విన్నీ. మీ నాన్న ఉన్నాడా?
- హేయ్, ఫ్రాంక్.

297
00:18:39,182 --> 00:18:40,975
లేదు, బామ్మ ఇంట్లో సంపు పంపును బాగు చేస్తున్నాడు.

298
00:18:41,059 --> 00:18:44,229
- ఏంటి సంగతి?
- పరారీలో ఉన్న ఒక వ్యక్తి గురించి 911 కాల్ వచ్చింది.

299
00:18:44,312 --> 00:18:45,522
ఈ మహిళని చూశావా?

300
00:18:46,147 --> 00:18:48,399
ఈమెని నేను ఇక్కడ అస్సలు చూడలేదు.
కాల్ పక్కాగా ఇక్కడి నుండే వచ్చిందా?

301
00:18:48,483 --> 00:18:50,485
- షాప్ తెరిచిన్నప్పటి నుండి ఇక్కడే ఉన్నావా?
- దాదాపుగా. హా.

302
00:18:50,568 --> 00:18:52,153
- నాన్నకి కాల్ చేయనా?
- ఒక్క నిమిషం ఆగు.

303
00:18:52,737 --> 00:18:54,864
- మీ సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ చూపించండి.
- సరే.

304
00:19:02,747 --> 00:19:04,374
ఆపవద్దు. వెనుక పక్కకు తీసుకెళ్ళు.

305
00:19:15,969 --> 00:19:17,178
హలో.

306
00:19:17,262 --> 00:19:18,263
ఈ మహిళని చూశారా?

307
00:19:21,766 --> 00:19:23,226
హరోల్డోతో మాట్లాడింది ఈమెనే అనుకుంటా.

308
00:19:23,977 --> 00:19:25,019
హరోల్డో ఎవరు?

309
00:19:28,815 --> 00:19:30,149
బాత్రూమ్ కి వెళ్లాలంటే హాలుకు అటు వెళ్ళాలి.

310
00:19:32,360 --> 00:19:34,153
ఏం చేస్తున్నారు? మీరు ఇక్కడికి రాకూడదు.

311
00:19:34,237 --> 00:19:37,282
ఆగండి. ఆగండి! ఏం చేస్తున్నారు? ఆపండి!

312
00:19:37,991 --> 00:19:39,617
సరే, ఆపు. ఆపేసేయ్. తనే.

313
00:19:39,701 --> 00:19:40,785
తన చేతిలో ఏముంది?

314
00:19:41,327 --> 00:19:42,579
హెయిర్ డైలా ఉంది.

315
00:19:42,662 --> 00:19:45,164
గోద్రెజ్ హెయిర్ డైలా ఉంది. టెర్రకోటా చిల్లీ షేడ్.

316
00:19:45,248 --> 00:19:46,875
- ఏం టెర్రా?
- టెర్రకోటా చిల్లీ.

317
00:19:46,958 --> 00:19:48,751
అది మీడియం బోల్డ్ రెడ్ కలర్.
ఇప్పుడు బాగా కొంటున్నారు.

318
00:19:48,835 --> 00:19:49,878
కానీ అది నాకు సెట్ కాదు.

319
00:19:49,961 --> 00:19:51,087
తనతో మాట్లాడుతున్నది ఎవరు?

320
00:19:51,170 --> 00:19:52,380
అతని పేరు హరోల్డో.

321
00:19:59,178 --> 00:20:00,763
ఇంతకుముందు ఇక్కడే ఉన్నాడు.

322
00:20:08,438 --> 00:20:09,522
నీనా, హరోల్డోని చూశావా?

323
00:20:10,106 --> 00:20:11,858
అందరూ హరోల్డో కోసం వెతుకుతున్నారేంటి?

324
00:20:11,941 --> 00:20:14,861
- అందరూ అంటే?
- ప్యాంట్స్ సూట్ వేసుకొని ఉన్న ఒక పెద్దావిడ అడిగింది.

325
00:20:17,071 --> 00:20:18,072
హాచ్.

326
00:20:18,781 --> 00:20:21,075
హేయ్, చూడు, మేము వచ్చేసరికి ఆలస్యమైంది.
మాకన్నా బ్రాడ్ఫర్డ్ ముందు వచ్చేసింది.

327
00:20:32,170 --> 00:20:34,964
చౌడర్ హౌసులో రామీ ఇచ్చిన పార్టీలో
జరిగినదాని గురించే అయితే, అప్పుడు నేను తాగి ఉన్నా,

328
00:20:35,048 --> 00:20:37,467
- కానీ వాళ్ళు చెత్త చెత్త చేసే ముందే నేను వెళ్ళిపోయా…
- నోరు మూసేయ్.

329
00:20:37,550 --> 00:20:38,801
చెప్పేది విను.

330
00:20:41,095 --> 00:20:44,933
- నువ్వు ఈమెతో మాట్లాడావా?
- నేను… నేను మాట్లాడాననే అనుకుంటా.

331
00:20:45,475 --> 00:20:46,684
ఏం అడిగింది?

332
00:20:47,477 --> 00:20:49,729
తను… తనొక హెయిర్ డై కొనింది.

333
00:20:50,313 --> 00:20:53,650
అంతేనా? బాగా ఆలోచించి చెప్పు, హరోల్డో.

334
00:20:54,317 --> 00:20:55,818
తన ట్రిప్పుకు ఇంకా ఏమైనా కావాలా అని అడిగా,

335
00:20:55,902 --> 00:20:57,612
- కానీ, తను అదొక్కటి చాలు అంది.
- ట్రిప్పా?

336
00:20:58,279 --> 00:21:00,240
అవును. డెనాలీ స్టార్ ట్రెయిన్లో వెళ్తోందట.

337
00:21:00,823 --> 00:21:03,785
స్టేషన్ కి ఎటు వెళ్ళాలో అడిగింది, నేను చెప్పా.

338
00:21:08,081 --> 00:21:09,666
చూడండి, నేను ఇబ్బందుల్లో ఏమైనా ఉన్నానా?

339
00:21:09,749 --> 00:21:11,751
కావాలంటే నేను లాయరుతో
మాట్లాడుకోవచ్చు వంటిదేదో మీరు చెప్పాలి కదా?

340
00:21:11,834 --> 00:21:14,462
ఫెయిర్ బ్యాంక్స్ రైల్వే స్టేషన్ కి వెళ్ళండి.
డెనాలీ స్టార్ ట్రెయిన్ ని చెక్ చేయండి.

341
00:21:18,466 --> 00:21:19,717
నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఎలా!

342
00:21:19,801 --> 00:21:21,302
నాకు చలి పడదు!

343
00:21:21,386 --> 00:21:22,428
హేయ్!

344
00:21:24,222 --> 00:21:25,557
దరిద్రులారా!

345
00:21:27,684 --> 00:21:29,143
హేయ్, ఫ్రాంక్.

346
00:21:29,227 --> 00:21:31,604
- నాకొక ఆధారం దొరికినట్టుంది.
- బ్రిగ్స్ కాల్ చేసింది.

347
00:21:31,688 --> 00:21:33,273
నువ్వు అన్న ఆర్కైవ్ కి సంబంధించినది అన్నమాట.

348
00:21:33,356 --> 00:21:35,024
- హా.
- నువ్వన్నట్టు ఈ ఫైల్

349
00:21:35,108 --> 00:21:38,319
చాలా పెద్దదే అయితే, దాన్ని అప్ లోడ్ చేయడానికి
స్కోఫీల్డ్ కి ఎక్కువ దార్లు లేవనే చెప్పాలి,

350
00:21:38,403 --> 00:21:41,656
తన దగ్గర కంప్రెషన్ సాఫ్ట్ వేర్ లేదని అనుకుంటే,

351
00:21:41,739 --> 00:21:44,617
తనకి ఓ డేటా సెంటర్ కానీ,
లేదా డేటా సెంటర్ కి డైరెక్ట్ లింక్ ఉండే కేంద్రం కానీ

352
00:21:44,701 --> 00:21:46,578
అవసరం అవుతాయి.

353
00:21:46,661 --> 00:21:49,789
చాలా ఎక్కువ కరెంట్ ని
వినియోగించుకునే కేంద్రాలు అన్నమాట.

354
00:21:49,873 --> 00:21:51,124
మరి అలాంటివి ఎక్కడ ఉన్నాయి?

355
00:21:51,207 --> 00:21:53,501
ముందు ఫెయిర్ బ్యాంక్స్ యూనివర్సిటీలో ఉండే
డేటా సెంటర్ కి వెళ్తుందేమో అనుకున్నా,

356
00:21:53,585 --> 00:21:55,628
కానీ అక్కడ మెయింటెనెన్స్ పనులు
జరుగుతున్నాయని, సర్వర్లను కాలేజీ వాళ్ళు

357
00:21:55,712 --> 00:21:57,255
షట్ డౌన్ చేశారని ఇప్పుడే తెలిసింది.

358
00:21:57,338 --> 00:21:59,299
- తను ఇంకెక్కడికి వెళ్లే అవకాశముంది?
- ఏదైనా స్థావరానికి?

359
00:21:59,382 --> 00:22:01,509
ఏదైనా యుటిలిటీ కంపెనీకి? ఏమో.

360
00:22:01,593 --> 00:22:03,344
అది కనుగొనే ప్రయత్నమే చేస్తున్నా,
కానీ ఇంకాస్త సమయం కావాలి.

361
00:22:03,428 --> 00:22:05,889
కానీ స్కోఫీల్డ్ ఎంత ఎక్కువ సేపు
బయట ఉంటే, అంత ఎక్కువ ప్రమాదం.

362
00:22:05,972 --> 00:22:08,474
తను ఎక్కడికి వెళ్తోందో
బ్రాడ్ఫర్డ్ కన్నా ముందే మనం కనిపెట్టాలి.

363
00:22:14,981 --> 00:22:17,233
డెనాలీ స్టార్ ట్రెయిన్లోకి బోర్డింగ్ ప్రారంభమైంది.

364
00:22:17,317 --> 00:22:21,863
అది హీలీ, డెనాలీ, టల్కీట్నా,
వసీలా, యాంకరేజ్ స్టాప్స్ లో ఆగుతుంది.

365
00:22:22,739 --> 00:22:24,240
అయిదు నిమిషాల్లో బయలుదేరనుంది.

366
00:22:24,782 --> 00:22:26,284
ఆల్ఫా టీమ్, మీకు తను కనిపించిందా?

367
00:22:26,367 --> 00:22:28,369
ఇప్పుడు ట్రాక్స్ పై వెతుకుతున్నాం.

368
00:22:53,895 --> 00:22:55,021
మాకు తను కనిపించట్లేదు.

369
00:22:55,104 --> 00:22:56,648
తను అక్కడే ఉంది, సందేహమే లేదు.

370
00:22:56,731 --> 00:22:59,442
రైలు బయలుదేరనుంది.
తర్వాతి రైలు ఎక్కే వాళ్ళని గమనించమంటారా?

371
00:22:59,526 --> 00:23:01,569
లేదు! తను ఆ రైల్లోనే ఉంది.

372
00:23:01,653 --> 00:23:03,029
నీ టీమ్ ని లోపలికి పంపి, తనని పట్టుకోండి.

373
00:23:05,782 --> 00:23:08,576
రైలు ఎక్కండి.
ఆల్ఫా, మీరు వెనుక పక్క నుండి గాలించండి.

374
00:23:08,660 --> 00:23:10,828
ఎకో, మీరు ముందు పక్క నుండి
వెతుకుతూ వెనక్కి వెళ్ళండి.

375
00:23:32,141 --> 00:23:33,810
- వెనక్కి వెళ్ళు.
- ఏంటి?

376
00:23:33,893 --> 00:23:35,478
వెళ్లి గోడకు ఆనుకో, గోడ వైపు తిరిగి ఆనుకో.

377
00:23:35,562 --> 00:23:36,896
సరే.

378
00:23:38,731 --> 00:23:43,695
హైవేలో నువ్వు చేసిన విన్యాసానికి
ముగ్గురు ఫెడరల్ ఏజెంట్స్ చనిపోయారని

379
00:23:43,778 --> 00:23:46,155
ఇప్పుడే నాకు తెలిసింది.

380
00:23:47,198 --> 00:23:48,908
ఇంకో ఇద్దరు ఐసీయూలో ఉన్నారు!

381
00:23:51,077 --> 00:23:55,331
వాళ్లలో ఒకరు ఏజెంట్ లాఫ్ట్ క్విస్ట్. సైన్యంలో ఉన్నప్పుడు
మేమిద్దరమూ ఆఫ్ఘనిస్తాన్ లో కలిసి పని చేశాము.

382
00:23:55,415 --> 00:23:59,711
రెండు యుద్ధాల్లో పాల్గొన్నా ఏమీ కాలేదు అతనికి.
కానీ నీ వల్ల అతను భూమి మీద లేకుండా పోయాడు!

383
00:23:59,794 --> 00:24:01,504
దేవుడా!

384
00:24:02,422 --> 00:24:03,673
పైకి లే.

385
00:24:08,261 --> 00:24:09,929
ఇదేంటో తెలుసా?

386
00:24:11,681 --> 00:24:14,267
ఇది చేత్తో తయారు చేసిన ఫ్రాగ్ గ్రెనేడ్.

387
00:24:14,350 --> 00:24:17,270
వీటిని వెదురుతో, ఇంకా రేకు డబ్బాలతో
వియట్ కాంగ్ వాళ్ళు చేసేవారు.

388
00:24:18,021 --> 00:24:19,731
సరే. ఒక్క నిమిషం ఆగు.

389
00:24:19,814 --> 00:24:21,691
దీని రేంజ్ ఎంత ఉంటుందో పక్కాగా చెప్పలేను.

390
00:24:21,774 --> 00:24:24,485
అయిదు మీటర్ల రేడియస్ లో ఉండేవాళ్ళకి
చావు తప్పదని మాత్రం తెలుసు.

391
00:24:25,111 --> 00:24:27,572
కానీ అది నీకూ తెలుసు కదా?
ఎందుకంటే నువ్వు కూడా సైన్యంలో పని చేశావు.

392
00:24:28,364 --> 00:24:29,866
సైన్యంలో పని చేశావు కాబట్టి,

393
00:24:29,949 --> 00:24:33,369
చెరసాలలో ఉన్న వ్యక్తి దగ్గరికి
లోడ్ చేసి ఉన్న తుపాకీని తీసుకురావడం

394
00:24:33,453 --> 00:24:36,706
పిచ్చితనమే కాదు,
చట్టానికి వ్యతిరేకమని కూడా నీకు తెలిసే ఉంటుంది.

395
00:24:36,789 --> 00:24:38,958
ఇప్పుడు నేల మీద పడుకో!

396
00:24:39,918 --> 00:24:41,169
ఇప్పుడు…

397
00:24:41,753 --> 00:24:43,046
థ్యాంక్యూ.

398
00:24:46,382 --> 00:24:47,800
నీ జాకెట్ ని, తాళం చెవులని ఇవ్వు.

399
00:25:05,193 --> 00:25:08,071
ఈ ప్రాంతంలో డేటాను పంపగల కేంద్రాల
ప్రాథమిక జాబితాని ఓ.ఎస్.బీ పంపింది.

400
00:25:09,531 --> 00:25:10,698
అలాస్కా రాష్ట్రం

401
00:25:10,782 --> 00:25:12,742
ఇక్కడ చాలా ఉన్నాయి. కాస్త కుదించి పంపమని చెప్పు.

402
00:25:12,825 --> 00:25:16,746
ఆ రైలు ఎక్కడెక్కడ ఆగుతుందో చూడు,
ఆ ప్రాంతాల దగ్గర్లో ఏమైనా ఉన్నాయేమో చూడు.

403
00:25:17,789 --> 00:25:18,831
అక్కడి పరిస్థితి ఏంటో చెప్పండి.

404
00:25:18,915 --> 00:25:20,625
నేను లగేజ్, ఇంకా కార్గో బోగీల్లో చెక్ చేశా.

405
00:25:20,708 --> 00:25:22,585
ఆల్ఫా, ఎకో బృందాలు
ఇప్పుడు ప్యాసింజర్ బోగీల్లో చెక్ చేస్తున్నాయి.

406
00:25:22,669 --> 00:25:24,879
తను అక్కడే ఉంది. తప్పకుండా పట్టుకోవాలి.

407
00:25:28,883 --> 00:25:31,427
కమాండ్, నేను ఆల్ఫా మెంబర్ ని.
ఆరవ బోగీలో తను లేదు.

408
00:25:31,511 --> 00:25:33,805
ఎకో టీమ్ రిపోర్ట్ చేస్తున్నాం. తను ఇంకా కనబడలేదు.

409
00:25:33,888 --> 00:25:35,265
ప్రధాన టార్గెట్ కనిపించింది.

410
00:25:35,348 --> 00:25:37,517
రెడ్ హెడ్ రైల్లోనే ఉంది,
తన దగ్గర తుపాకి ఉంది, హింస ప్రయోగించే అవకాశముంది.

411
00:26:28,109 --> 00:26:29,235
హేయ్.

412
00:26:36,701 --> 00:26:40,413
నన్ను చంపడానికే నువ్వు ఇక్కడికి
వచ్చినట్లయితే, ఆ పని చేసి పుణ్యం కట్టుకో.

413
00:26:41,623 --> 00:26:43,708
ఎందుకంటే, నేను తక్కిన జీవితమంతా
జైల్లో గడపాల్సి వస్తుంది.

414
00:26:44,834 --> 00:26:46,002
అదెలా చేశావు?

415
00:26:46,085 --> 00:26:47,253
విమానాన్ని కూల్చడమా?

416
00:26:47,337 --> 00:26:50,381
లేదు. సిడ్నీని ఎలా ఒప్పించావు?

417
00:26:50,465 --> 00:26:53,134
ఆర్కైవ్ బయటపడాలంటే,
నేను చనిపోవాల్సిందే అని నువ్వు తనకి చెప్పావని

418
00:26:53,218 --> 00:26:55,011
స్పష్టంగా తెలిసిపోతోంది. కానీ అది ఎలా చేశావు?

419
00:26:55,094 --> 00:26:56,930
నేను తనని ఒప్పించాల్సిన అవసరమే రాలేదు.

420
00:26:57,013 --> 00:26:58,264
సిడ్నీ గురించి తెలుసుగా.

421
00:26:58,348 --> 00:27:00,475
తానెప్పుడూ సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటుంది.

422
00:27:00,558 --> 00:27:02,435
- సిడ్నీ నా చావుకు ముహూర్తం పెట్టేసింది.
- లేదు.

423
00:27:03,019 --> 00:27:06,773
తను తీసుకున్న నిర్ణయం నీకన్నా,
నాకన్నా, మనందరికన్నా పెద్దది.

424
00:27:06,856 --> 00:27:09,776
బ్రాడ్ఫర్డ్ ని అడ్డుకుని,
తన తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకోవడానికి

425
00:27:09,859 --> 00:27:12,320
తన ప్రాణాన్ని సైతం పణంగా పెడుతోంది.

426
00:27:13,321 --> 00:27:15,657
నా పాత్ర కేవలం సహాయసహకారాలు అందించడం మాత్రమే.

427
00:27:16,241 --> 00:27:19,661
సిడ్నీకి, తన మిషన్ ని కొనసాగించడంలో
వీలైనంత సాయం చేస్తా. ఆలా అని శపథం చేసుకున్నా.

428
00:27:20,286 --> 00:27:22,330
ఆ పనిలో భాగంగా
నిన్ను నువ్వు త్యాగం చేసుకోవాల్సి వచ్చినా కూడానా?

429
00:27:22,413 --> 00:27:25,708
తను, తన తండ్రి నాకు ఇచ్చిన దానితో పోలిస్తే
అది అసలు లెక్కే కాదు.

430
00:27:25,792 --> 00:27:27,502
వాళ్ళు నాకు ఆశ, విజన్ ఇచ్చారు.

431
00:27:28,086 --> 00:27:32,215
అలాంటి ఆశయాల సాధన కోసం
నా ప్రాణంతో సహా కొంతమంది ప్రాణాలు పోయినా

432
00:27:32,298 --> 00:27:34,133
పర్వాలేదు.

433
00:27:34,217 --> 00:27:38,846
అందుకే, మిషన్ ని విజయవంతంగా ముగించడానికి
నేను సిడ్నీకి నా వీలైనంత సాయం చేస్తా.

434
00:27:39,597 --> 00:27:42,058
మనిద్దరిలో నేను అనుకున్న దానికన్నా
కామన్ అంశాలు చాలానే ఉన్నాయి.

435
00:27:42,141 --> 00:27:43,309
అంటే?

436
00:27:53,069 --> 00:27:54,988
ఏంటిది? ఏం చేస్తున్నావు?

437
00:27:55,697 --> 00:27:58,283
నాకు సాయం చేయి, అప్పుడు నేను తనకి సాయపడగలను.

438
00:29:03,723 --> 00:29:05,350
హీలీ స్టేషన్ కి స్వాగతం.

439
00:29:05,433 --> 00:29:09,270
ఇది యాంకరేజ్ కి వెళ్లే రైలు,
ఇంకో అయిదు నిమిషాల్లో బయలుదేరుతుంది.

440
00:29:09,354 --> 00:29:10,355
తను తప్పించుకుని పోయింది.

441
00:29:10,438 --> 00:29:12,023
తప్పించుకుని పోయింది అంటే?

442
00:29:12,106 --> 00:29:14,150
మన వాళ్లకి గాయాలయ్యాయి,
కాబట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలి.

443
00:29:14,234 --> 00:29:16,027
స్థానికులు ఘటనా స్థలానికి
చేరుకోవడానికి పెద్ద సమయం పట్టదు.

444
00:29:16,110 --> 00:29:18,780
స్థానికుల సంగతి నేను చూసుకుంటా.
నాకు స్కోఫీల్డ్ గురించి చెప్పు.

445
00:29:18,863 --> 00:29:21,950
తను ఎక్కడుందో మాకు తెలీదు.
కానీ పెద్ద దూరం వెళ్లి ఉండదు.

446
00:29:22,033 --> 00:29:23,368
హీలీ దగ్గర రైలు దిగేసింది.

447
00:29:24,494 --> 00:29:26,579
హీలీ. నాకు ఆ జాబితా ఇలా ఇవ్వు.

448
00:29:28,540 --> 00:29:31,167
ఏంటి సంగతి? హీలీలో డేటా సెంటర్ ఏమైనా ఉందా?

449
00:29:31,251 --> 00:29:33,461
లేదు. దాదాపుగా డేటా సెంటర్ కి సమానమైన చోటు ఉంది.

450
00:29:33,545 --> 00:29:35,296
నెనానా హైడ్రోఎలక్ట్రిక్ డ్యామ్ ఉంది అక్కడ.

451
00:29:35,380 --> 00:29:38,466
అది బ్లాక్ ర్యాపిడ్స్ లో, సైన్యానికి చెందిన
శీతల వాతావరణ శిక్షణ కేంద్రానికి కరెంట్ సరఫరా చేస్తుంది,

452
00:29:38,550 --> 00:29:42,220
అంటే, ఆర్కైవ్ ని పంపడానికి తనకి కావాల్సిన
సురక్షితమైన శాటిలైట్ లింక్స్,

453
00:29:42,303 --> 00:29:43,805
ఇంకా బ్యాండ్ విడ్త్ అక్కడ లభిస్తాయి.

454
00:29:43,888 --> 00:29:45,890
వాళ్ళ అప్ లింక్ ని తను వాడుకోవాలని అనుకుంటోంది.

455
00:29:45,974 --> 00:29:47,642
అందుకే, తనకన్నా ముందు మనం అక్కడికి చేరుకోవాలి.

456
00:29:47,725 --> 00:29:49,143
టీమ్ కి ఈ విషయం చెప్పు. వేగంగా పోనివ్వు!

457
00:30:02,657 --> 00:30:04,492
- బయట రెండు డిగ్రీలు ఉంది ఉష్ణోగ్రత.
- హా. చచ్చిపొమ్మను.

458
00:30:04,576 --> 00:30:06,786
ఇతను లోపలికి ఇవే బట్టలతో వచ్చాడు,
వెళ్ళేటప్పుడు కూడా ఇవే బట్టలతో వెళ్తాడు.

459
00:30:06,870 --> 00:30:07,954
ఇతనేమీ మృగం కాదు.

460
00:30:09,747 --> 00:30:10,999
కాస్త దయ చూపండి.

461
00:30:13,418 --> 00:30:15,420
- తుపాకీ!
- దగ్గరికి రావద్దు. ఇప్పుడే!

462
00:30:15,503 --> 00:30:16,671
తుపాకీని పడేయ్.

463
00:30:17,255 --> 00:30:19,507
దగ్గరికి రావద్దని చెప్పు, లేదంటే కాల్చి పడేస్తా.

464
00:30:21,926 --> 00:30:23,303
ఎవరూ ఆవేశపడొద్దు.

465
00:30:25,138 --> 00:30:27,891
ఆఖరిసారి చెప్తున్నా. తుపాకీని కింద పడేయ్.

466
00:30:52,207 --> 00:30:53,208
అంతా రెడీగా ఉందా?

467
00:30:53,291 --> 00:30:55,835
మనం అనుకున్నట్టే
అన్నీ షెడ్యూల్ ప్రకారం సెట్ చేసి పెట్టా.

468
00:30:55,919 --> 00:30:57,587
చలో. మనకి ఎక్కువ సమయం లేదు.

469
00:31:07,305 --> 00:31:08,306
ఫ్రాంక్ ని మాట్లాడుతున్నా.

470
00:31:08,389 --> 00:31:09,891
ఒక సమస్య ఎదురైంది, ఫ్రాంక్.

471
00:31:09,974 --> 00:31:11,184
ఏదైనా మంచి వార్త చెప్పు, మార్క్స్.

472
00:31:11,267 --> 00:31:13,978
డెనాలీ స్టార్ రైల్లో ఫైటింగ్ జరిగిందని
ఇప్పుడే నాకొక రిపోర్ట్ అందింది,

473
00:31:14,062 --> 00:31:16,648
ఆ రైలు ఇప్పుడే హీలీ స్టేషన్లో ఆగింది.

474
00:31:16,731 --> 00:31:18,149
హా, ఫైటింగ్ అంటే?

475
00:31:18,233 --> 00:31:20,985
గాయాలు లాంటివి అయ్యాయట.
నాకు సమాచారం మాత్రమే అందింది. నీకు చెప్పాలని కాల్ చేశా.

476
00:31:21,069 --> 00:31:22,612
సాక్షులు కూడా ఉన్నారు.

477
00:31:24,280 --> 00:31:26,658
సరే. స్టేషన్ వాళ్ళని అడిగి సెక్యూరిటీ ఫుటేజ్ సంపాదించు.

478
00:31:26,741 --> 00:31:28,409
స్టేషన్ ని సీల్ చేసేయ్. మేము అక్కడికే వస్తున్నాం.

479
00:31:37,210 --> 00:31:38,336
తనే కదా?

480
00:31:39,045 --> 00:31:40,296
హా, తనే.

481
00:31:40,380 --> 00:31:41,422
ఏం చేస్తోంది అసలు తను?

482
00:31:42,131 --> 00:31:44,008
తెలీదు, హాచ్. అస్సలు తెలీట్లేదు.

483
00:31:54,686 --> 00:31:56,354
సిడ్ తెలివైన పిల్లే.

484
00:32:01,317 --> 00:32:02,610
అందరూ పొజిషన్లో ఉన్నారు కదా?

485
00:32:02,694 --> 00:32:05,405
మేము పొజిషన్లోనే ఉన్నాం. ఇంకా తను కనిపించట్లేదు.

486
00:32:06,030 --> 00:32:07,240
రెండో టీమ్, మీకేమైనా కనిపిస్తోందా?

487
00:32:10,034 --> 00:32:12,078
లేదు. ఇక్కడ ఏ అలికిడీ లేదు.

488
00:32:12,161 --> 00:32:14,455
అప్రమత్తంగా ఉండండి. తను ఇక్కడికే వస్తుంది.

489
00:32:33,474 --> 00:32:35,810
అతనికి తుపాకీ ఎలా దొరికిందో,
అసలు ఇంకా దారుణంగా కమాండ్ సెంటర్ కి

490
00:32:35,894 --> 00:32:36,895
కీ ఎలా దొరికిందో అర్థమవ్వట్లేదు.

491
00:32:39,480 --> 00:32:41,024
ఇది మన వాళ్లదే.

492
00:32:56,122 --> 00:32:58,750
ఫ్రాంక్, హావ్లాక్ తప్పించుకున్నాడు. పారిపోయాడు.

493
00:32:58,833 --> 00:32:59,834
ఏం జరిగింది అసలు?

494
00:32:59,918 --> 00:33:01,878
ఒక గార్డును కొట్టి, థియాగో దగ్గరికి వెళ్ళాడు.

495
00:33:01,961 --> 00:33:04,005
థియాగో పక్కదారి పట్టించాడు,
ఇక అతను తప్పించుకున్నాడు.

496
00:33:04,714 --> 00:33:07,717
సిడ్నీ కోసం గాలిస్తున్న వారిలో
కొంతమందిని అతని కోసం పంపుదామా?

497
00:33:09,385 --> 00:33:12,305
వద్దు. ముందు స్కోఫీల్డ్ సంగతి చూద్దాం. తను ముఖ్యం.

498
00:33:12,388 --> 00:33:13,598
హేయ్, ఫ్రాంక్. ఉన్నావా?

499
00:33:13,681 --> 00:33:15,099
ఒక్క నిమిషం, జేన్.

500
00:33:18,436 --> 00:33:19,938
ఆ లుక్ నాకు సుపరిచితమే. అది నాకు నచ్చని లుక్.

501
00:33:20,021 --> 00:33:21,606
రైల్లో తనని చూసినవాళ్ళు ఉన్నారు, కదా?

502
00:33:21,689 --> 00:33:23,107
- అవును.
- ఫార్మసీలో కూడా

503
00:33:23,191 --> 00:33:25,193
- తనని చూసినవాళ్లు ఉన్నారు.
- అది కాస్త వింతగానే ఉంది…

504
00:33:25,276 --> 00:33:28,738
తను స్కోఫీల్డ్. తను సీఐఏ ఏజెంట్, హాచ్.
హావ్లాక్ కి ట్రెయినింగ్ ఇచ్చింది తనే.

505
00:33:28,821 --> 00:33:30,907
కెమెరాలో పడకుండా ఎలా ఉండాలో తనకి తెలీదంటావా?

506
00:33:30,990 --> 00:33:32,325
పొరపాటు చేసేసిందేమో.

507
00:33:32,408 --> 00:33:35,286
హా, ఒకసారి అంటే అనుకోవచ్చు,
కానీ రైల్లో కూడా హడావిడి చేస్తుందంటావా?

508
00:33:35,954 --> 00:33:37,121
చూడు, జేన్.

509
00:33:37,205 --> 00:33:40,708
911 వాళ్లకి కాల్ చేసి, షిల్లర్స్ ఫార్మసీలో స్కోఫీల్డ్
కనిపించిందని వచ్చిన కాల్ తాలూకు రికార్డింగ్ అడుగు.

510
00:33:40,792 --> 00:33:42,835
- హావ్లాక్ సంగతేంటి?
- ముందు రికార్డింగ్ ని అడుగు.

511
00:34:04,274 --> 00:34:07,777
తను కనిపించింది. నదికి
దక్షిణ తీరం వైపు ఉంది. ఒంటరిగా వస్తోంది.

512
00:34:09,112 --> 00:34:10,988
టీమ్స్ అన్నీ పొజిషన్లోకి వెళ్ళాలి.

513
00:36:08,565 --> 00:36:09,941
నీ దారులు మూసుకుపోయాయి, సిడ్.

514
00:36:11,901 --> 00:36:13,111
అది ఎక్కడ?

515
00:36:21,744 --> 00:36:23,538
మీ నాన్నలాగే నీ దగ్గర కూడా మంచి హాస్య చతురతే ఉంది.

516
00:36:24,414 --> 00:36:25,665
అవును.

517
00:36:25,748 --> 00:36:27,959
మా నాన్న పోలికలు నాకు చాలానే వచ్చాయి.

518
00:36:28,668 --> 00:36:30,169
మంచివి, చెడ్డవి కూడా.

519
00:36:31,754 --> 00:36:34,841
ఏది మంచో, ఏది చెడో చెప్పే అర్హత నీకు లేనే లేదు.

520
00:36:34,924 --> 00:36:36,718
కానీ నువ్వు పొరబడుతున్నావు.

521
00:36:36,801 --> 00:36:42,223
అది చెప్పే అర్హత అందరికన్నా నాకే ఎక్కువ ఉంది.

522
00:36:43,850 --> 00:36:49,272
రోజుల తరబడి, ఏళ్ల తరబడి
నేను ఎన్ని దారుణాలు చూశానో నీకు తెలీను కూడా తెలీదు.

523
00:36:50,440 --> 00:36:52,859
అమాయకులపై ఊచకోతలు.

524
00:36:52,942 --> 00:36:54,861
స్నేహితులు మోసపోవడం.

525
00:36:55,528 --> 00:36:57,405
చిన్నారుల హత్యలు.

526
00:36:58,031 --> 00:37:00,700
ఫలానా ఆశయం కోసమని,
ఫలానా దేశం కోసమని చేసే దారుణాలు అన్నీ.

527
00:37:01,826 --> 00:37:04,120
ప్రపంచంలోని దారుణాలను
కళ్లారా చూశాక, వాటిని అనుభవించాక,

528
00:37:04,204 --> 00:37:08,124
అయితే కృంగిపోతాం, లేదా రాటుదేలిపోతాం.

529
00:37:09,209 --> 00:37:11,502
బయట రాక్షసత్వమే రాజ్యమేలుతోంది, సిడ్నీ.

530
00:37:12,253 --> 00:37:16,382
ఏదో అక్కడక్కడా కాదు.
అనుకోకుండా, తెలీకుండా చేసినవి కాదు.

531
00:37:17,342 --> 00:37:20,595
అసలైన రాక్షసత్వం.
కళ్ళకు కట్టినట్టు కనిపించే రాక్షసత్వం.

532
00:37:21,137 --> 00:37:26,267
దాన్ని ఎదుర్కోవాలంటే,
దృఢ సంకల్పం అవసరం అవుతుంది.

533
00:37:27,560 --> 00:37:31,564
మీ నాన్నకి విజన్ ఉంది, కానీ సంకల్పం లేదు.

534
00:37:32,649 --> 00:37:37,153
ఆయన దేన్ని అయితే మొదలుపెట్టాడో,
దాన్ని ముగించేంత తెగువ ఆయనకి లేదు.

535
00:37:39,322 --> 00:37:40,698
అందుకని ఆయన్ని చంపేశావు కదా.

536
00:37:41,282 --> 00:37:45,537
చెప్పా కదా, మనలో కొందరికి ఎక్కువ తెగువ ఉంటుంది,
కొందరికి తక్కువ తెగువ ఉంటుంది.

537
00:37:48,998 --> 00:37:51,000
ఇక ఆర్కైవ్ ఎక్కడ ఉందో చెప్పు.

538
00:37:54,546 --> 00:37:56,881
ఫ్రాంక్, నువ్వు అడిగినట్టే
911 ఫోన్ కాల్ రికార్డింగ్ సంపాదించాం.

539
00:37:57,632 --> 00:37:59,217
911, మీ ఎమర్జెన్సీ ఏంటో చెప్పండి.

540
00:37:59,300 --> 00:38:03,304
హాయ్. మీరు సిడ్నీ స్కోఫీల్డ్ అనే
ఓ మహిళ కోసం వెతుకుతున్నట్టు వార్తల్లో చూశాను.

541
00:38:03,388 --> 00:38:06,391
నేను… నేను ఇప్పుడే తనని
షిల్లర్స్ ఫార్మసీలో చూశాను అనుకుంటా.

542
00:38:06,474 --> 00:38:09,018
- అది స్కోఫీల్డే.
- తన గురించి తనే కాల్ చేసి చెప్పింది.

543
00:38:09,102 --> 00:38:10,228
ఎందుకలా చేసింది?

544
00:38:11,604 --> 00:38:13,273
వివియన్ పైక్ గుర్తుందా?

545
00:38:13,356 --> 00:38:14,524
హా. మనం పట్టుకున్న మహిళా ఖైదీ కదా.

546
00:38:14,607 --> 00:38:16,985
తను కూడా తన గురించి కాల్ చేసి చెప్పింది.
మనం తనని అదుపులోకి తీసుకోవాలని తన ప్లాన్.

547
00:38:17,068 --> 00:38:18,278
స్కోఫీల్డ్ కూడా పట్టుబడాలనుకుంటోందా?

548
00:38:18,361 --> 00:38:21,656
లేదు. స్కోఫీల్డ్ చాలా తెలివైనది. తనకి పట్టుబడాలని లేదు.

549
00:38:21,739 --> 00:38:23,616
తనని ఫాలో అవ్వాలని అలా చేసింది.

550
00:38:23,700 --> 00:38:25,910
పెద్ద సమయమేమీ పట్టదు, సిడ్నీ.

551
00:38:25,994 --> 00:38:29,622
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా
నిన్ను కనుగొనగలనని నీకు తెలిసి ఉండాలి కదా.

552
00:38:30,957 --> 00:38:33,251
నువ్వు నన్ను కనుగొంటావని నాకు తెలుసు.

553
00:38:33,334 --> 00:38:34,961
నిజం చెప్పాలంటే…

554
00:38:35,962 --> 00:38:37,630
నువ్వు కనుగొనేలానే మేము ప్లాన్ చేశాం.

555
00:38:51,644 --> 00:38:52,979
హేయ్, జాక్.

556
00:38:54,647 --> 00:38:55,899
నువ్వు రాగలిగినందుకు ఆనందంగా ఉంది.

557
00:39:54,999 --> 00:39:57,001
సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్

