1
00:00:30,760 --> 00:00:32,094
నువ్వు నాతో వచ్చి ఉండాల్సింది.

2
00:00:33,596 --> 00:00:35,014
మనం కలిసి ఓ పరిష్కారం ఆలోచించి ఉండేవాళ్ళం.

3
00:00:36,683 --> 00:00:40,144
- నీకు సాయపడి ఉండేవాడిని.
- మాట్లాడవద్దు. విచారణ చేసేటప్పుడే నోరు తెరవాలి.

4
00:00:41,271 --> 00:00:45,066
నువ్వేం చేశావో నాకు తెలుసు.
నేను వింటూ ఉన్నాను, సిడ్.

5
00:00:46,484 --> 00:00:48,611
ఈ మిషన్ నాకు విముక్తి లాంటిది.

6
00:00:48,695 --> 00:00:53,283
దాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి
నేను ఏం త్యాగం చేయడానికైనా సిద్ధం.

7
00:00:53,867 --> 00:00:57,078
- మరి నువ్వు?
- ఫ్రాంక్, ఒక సమస్య ఎదురైంది.

8
00:00:57,745 --> 00:00:59,163
సరే, ఆ… ఇంతటితో ఇది ముగిసింది.

9
00:01:02,584 --> 00:01:03,918
బ్రిగ్స్, ఏంటి సంగతి?

10
00:01:09,757 --> 00:01:12,635
ఎలా దొరికిపోయావు అసలు?

11
00:01:12,719 --> 00:01:13,845
వీళ్ళకి తెలుసా?

12
00:01:13,928 --> 00:01:15,138
నీకు అప్పజెప్పిందే ఒక పని.

13
00:01:15,221 --> 00:01:17,599
మన గురించి వీళ్ళకి తెలుసా?

14
00:01:17,682 --> 00:01:21,185
ఇంకా తెలీదు. నువ్వు నోరు మెదపకు.
మిగతాది నేను చూసుకుంటా.

15
00:01:24,939 --> 00:01:27,567
మొదట, అతనికి సలహాలు, సూచనలు
ఏజెన్సీ వాళ్ళు ఇస్తున్నారు అనుకున్నా.

16
00:01:27,650 --> 00:01:29,194
కానీ ఇది నీ మిషన్ అని తర్వాత అర్థమైంది.

17
00:01:29,277 --> 00:01:31,738
నీకు కౌంట్ డౌన్ గురించి తెలుసు.
ఆర్కైవ్ గురించి తెలుసు.

18
00:01:31,821 --> 00:01:35,158
నేను చనిపోతే ఆర్కైవ్ బయటపడుతుందని కూడా తెలుసు.

19
00:01:35,241 --> 00:01:39,579
ఆ విమానాన్ని కూల్చింది నువ్వే.
అంత మంది చావడానికి కారణం నువ్వే.

20
00:01:39,662 --> 00:01:41,497
కానీ ఒకటి గుర్తుంచుకో,

21
00:01:41,581 --> 00:01:45,251
నన్ను చంపడం వలన నీ లక్ష్యం నెరవేరదు.

22
00:01:49,505 --> 00:01:52,383
షా, నేను ఫ్రాంక్ ని. స్కోఫీల్డ్ నీ కళ్లెదుటే ఉందా?

23
00:01:52,467 --> 00:01:55,178
నువ్వు తనని ఖైదీ దగ్గర
అస్సలు ఉండనివ్వకూడదు, వెంటనే తనని…

24
00:03:14,799 --> 00:03:16,050
ఫెయిర్ బ్యాంక్స్ కి స్వాగతం

25
00:03:20,138 --> 00:03:21,306
సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ

26
00:04:52,939 --> 00:04:54,148
దేవుడా.

27
00:04:58,361 --> 00:04:59,904
నిన్ను చంపాలన్న ఉద్దేశం మొదట నాకు లేనే లేదు.

28
00:05:10,123 --> 00:05:13,835
ఒక నెల క్రితం

29
00:05:15,503 --> 00:05:17,505
ప్యారిస్, ఫ్రాన్స్

30
00:05:26,389 --> 00:05:29,475
మనకి చిరాకు వచ్చే దాకా బెడ్ మీదనే పడుకుని ఉందాం.

31
00:05:30,101 --> 00:05:32,979
లేవకుండా ఎంత సేపు పడుకోగలమో చూడాలని ఉంది.

32
00:05:35,648 --> 00:05:37,275
నువ్వు ఇక్కడ ఉన్నందుకు ఆనందంగా ఉంది.

33
00:05:38,109 --> 00:05:40,403
ఇందాక అతిగా స్పందించా, అందుకు సారీ.

34
00:05:40,486 --> 00:05:42,155
అర్థం చేసుకోగలనులే. దాని గురించి వదిలేయి.

35
00:05:42,238 --> 00:05:43,990
నేను వేరే పేరు మీద వచ్చాలే.

36
00:05:44,073 --> 00:05:49,162
లాంగ్లీ వాళ్లకి తెలిసినంత వరకు,
నేను లక్సెంబర్గ్ లో ఒక అస్సెట్ ని కలిసే పనిలో ఉన్నా.

37
00:05:54,584 --> 00:05:57,295
అయింది. ఇది నా వేలు.

38
00:05:58,463 --> 00:06:00,757
దీన్ని చూసినప్పుడల్లా, నీకు నేను గుర్తురావాలి.

39
00:06:02,091 --> 00:06:03,092
రంగు బాగుంది.

40
00:06:08,890 --> 00:06:10,767
ఏం ఆలోచిస్తున్నావు?

41
00:06:10,850 --> 00:06:14,270
మన గురించి. మన భవిష్యత్తు గురించి.

42
00:06:14,354 --> 00:06:15,396
ఇంకా?

43
00:06:15,980 --> 00:06:17,065
మనం కలిసి జీవించాలని నా కోరిక.

44
00:06:18,775 --> 00:06:20,151
ఎలిజబెత్ ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నావా?

45
00:06:20,235 --> 00:06:22,654
తనని వాళ్ళు చంపేస్తారు, సిడ్.
తన ఆనవాలు లేకుండా చేస్తారు.

46
00:06:23,488 --> 00:06:24,822
అస్సెట్స్ వల్ల ప్రమాదం ఉందని అనిపించినప్పుడు…

47
00:06:26,115 --> 00:06:27,909
…వాళ్ళు చేసేది అదే.

48
00:06:27,992 --> 00:06:29,452
నీ వల్ల వాళ్లకి ప్రమాదమేం లేదు కదా.

49
00:06:29,536 --> 00:06:32,997
ఇప్పుడు ఉండకపోవచ్చు. కానీ, నా వల్ల
ఇక ఉపయోగం లేదని వాళ్లకి అనిపించినప్పుడు?

50
00:06:33,081 --> 00:06:35,583
డ్యూటీ బాగా చేశానని సన్మానాలేమీ చేయరు కదా?

51
00:06:35,667 --> 00:06:36,751
నాకు చాలా తెలుసు.

52
00:06:36,834 --> 00:06:39,629
మరేం చేద్దాం అంటావు? మిగిలిన జీవితాన్ని
గోవాకి వెళ్లి ఓ బీచ్ దగ్గర గడిపేద్దాం అంటావా?

53
00:06:39,712 --> 00:06:42,048
హా, అందులో తప్పేముంది?
లేదా మనకి పైచేయి ఇవ్వగల పనైనా చేయాలి.

54
00:06:44,050 --> 00:06:45,260
అది చాలా ప్రమాదకరం.

55
00:06:45,343 --> 00:06:46,427
బయటపడటానికి ఓ ప్లాన్ వేసి పెట్టుకోవడమా?

56
00:06:46,511 --> 00:06:49,389
లేదు. ఏజెన్సీ వాళ్లని బెదిరించి
లొంగదీసుకోవాలని చూడటం.

57
00:06:50,682 --> 00:06:52,308
నేను నిజంగానే చెప్తున్నా, లీవై.

58
00:06:52,392 --> 00:06:53,768
నువ్వు నన్ను నమ్మాలి.

59
00:06:59,899 --> 00:07:01,025
హలో.

60
00:07:02,151 --> 00:07:03,736
ఏంటి? ఎప్పుడు?

61
00:07:05,321 --> 00:07:06,489
సరే.

62
00:07:09,075 --> 00:07:10,493
ఫోన్ చేసింది ఎవరు?

63
00:07:18,418 --> 00:07:21,004
మిస్ స్కోఫీల్డ్, నా పేరు జేమ్స్ బీల్.

64
00:07:21,087 --> 00:07:23,965
ఇతను మన స్థానిక అస్సెట్ అయిన, టరీక్ హండీ.
ముందు ఉన్న బిజినెస్ ని ఇతనే చూసుకుంటాడు.

65
00:07:24,048 --> 00:07:25,258
ఇతడిని పట్టుకుంది మీరేనా?

66
00:07:25,341 --> 00:07:27,051
అవును, మేడమ్. నాలుగు గంటల క్రితం.

67
00:07:27,135 --> 00:07:28,636
అతను ఒక కోడ్ వర్డ్ చెప్పాడు.

68
00:07:28,720 --> 00:07:31,222
అతని దగ్గర ప్రభుత్వం జారీ చేసిన
రష్యన్ పాస్ పోర్ట్ ఉంది,

69
00:07:31,306 --> 00:07:33,099
అతను రష్యన్ ప్రభుత్వ మనిషని
మాకు అప్పుడే అర్థమైంది.

70
00:07:40,732 --> 00:07:42,650
అయితే, ఇతను గూఢచారా?

71
00:07:42,734 --> 00:07:45,570
ఇతను పేరు విక్టర్ వాస్. రష్యన్-అమెరికన్ అన్నమాట.

72
00:07:45,653 --> 00:07:49,490
సీఐఏ ఫీల్డ్ ఏజెంటుగా పదేళ్లు పని చేశాడు,
ఆ తర్వాత రష్యన్ల పక్షాన చేరాడు,

73
00:07:49,574 --> 00:07:50,950
డబ్బు కోసం వాళ్ళని కూడా మోసం చేశాడు.

74
00:07:52,076 --> 00:07:54,329
డబ్బు కోసం బ్లాక్ మార్కెట్ పంచన చేరిన నీచుడు.

75
00:07:54,412 --> 00:07:55,413
రహస్యాలను అమ్ముకుంటుంటాడు.

76
00:07:56,289 --> 00:07:58,750
రష్యన్ సెక్యూరిటీ ఏజెంట్స్ ఇతడిని
వేటాడుతున్నారని మిస్టర్ హండీకి చెప్పాడు.

77
00:07:59,375 --> 00:08:00,835
మీరు సాయపడగలరని చెప్పాడు.

78
00:08:00,919 --> 00:08:02,086
ఎందుకో నాకు అర్థం కాలేదు.

79
00:08:02,170 --> 00:08:03,963
ఇతడిని నేను చూడటం ఇదే మొదటిసారి.

80
00:08:06,633 --> 00:08:07,800
థ్యాంక్స్.

81
00:08:15,934 --> 00:08:18,603
నువ్వు వచ్చావు. స్వయంగా నువ్వే వచ్చావు.

82
00:08:21,064 --> 00:08:22,649
ఏదో ముఖ్యమైన విషయం అంటే, వచ్చా.

83
00:08:23,316 --> 00:08:27,070
అవును. మనిద్దరికీ పరిచయం లేదు,
కానీ మనం ఒకరికొకరం సాయం చేసుకోవచ్చు అనుకుంటా.

84
00:08:27,737 --> 00:08:28,905
ఓకే.

85
00:08:29,697 --> 00:08:30,990
కెమెరాలను ఆఫ్ చేయమని చెప్తావా?

86
00:08:32,242 --> 00:08:33,575
లేదు.

87
00:08:34,868 --> 00:08:37,454
మిస్టర్ వాస్, మీరు నన్ను రమ్మన్నారు, నేను వచ్చా.

88
00:08:37,539 --> 00:08:40,875
మీరెవరో నాకు తెలీదు, విషయం ఏంటో
వివరించే దాకా, నేను మీకు సాయపడలేను…

89
00:08:40,959 --> 00:08:43,294
సరే. నన్ను చంపాలని చూస్తున్నారు,
చంపినోళ్ళకి రివార్డ్ కూడా ఇస్తారు.

90
00:08:44,045 --> 00:08:46,172
నేనిక్కడ ఉన్నట్టు రష్యా వాళ్లకి తెలుసు.
ఒక బృందాన్ని పంపారు.

91
00:08:46,256 --> 00:08:50,009
నన్ను సురక్షిత ప్రాంతానికి తరలించండి.
కొత్త పేరు, కొత్త గుర్తింపు పత్రాలు కావాలి నాకు.

92
00:08:50,093 --> 00:08:51,386
అది జరగని పని.

93
00:08:52,095 --> 00:08:54,305
నా జీవితం నీ చేతుల్లోనే ఉంది, సిడ్నీ.

94
00:08:54,389 --> 00:08:57,684
లేదు, మీరు ఏజెన్సీని మోసగించినప్పుడే
మీ జీవితం ఖతమ్ అయిపోయింది.

95
00:08:59,978 --> 00:09:01,646
దయచేసి కెమెరాలను ఆఫ్ చేయి.

96
00:09:02,355 --> 00:09:04,065
ఇక నేను బయలుదేరుతా.

97
00:09:04,148 --> 00:09:05,984
ఆఫ్ఘనిస్తాన్ లో హక్కానీ నెట్వర్క్ వాళ్ళు

98
00:09:06,067 --> 00:09:10,405
మీ నాన్నపై, అతని బృందంపై మాటు వేసి
దాడి చేసినప్పుడు, ఆయన చనిపోయాడని చెప్పారు కదా నీకు.

99
00:09:10,488 --> 00:09:14,367
పారిపోయే అవకాశమున్నా,
అలా చేయక అక్కడే ఉన్నాడని నీకు చెప్పారు కదా.

100
00:09:14,951 --> 00:09:18,079
నలుగురి ప్రాణాలను కాపాడటానికి
తన ప్రాణాలను అర్పించాడని చెప్పారు కదా.

101
00:09:18,663 --> 00:09:19,789
ఏం మాట్లాడుతున్నారు?

102
00:09:22,292 --> 00:09:24,669
కానీ అది… అది నిజం కాదు.

103
00:09:25,253 --> 00:09:26,337
ఎవరు మీరు?

104
00:09:26,421 --> 00:09:29,674
నిజం ఏంటంటే, ఆ వివరాలని రహస్యంగా ఉంచారు,
ఎందుకంటే అవి అసలు జరగలేదు కాబట్టి.

105
00:09:29,757 --> 00:09:32,176
ఇదంతా నాకెలా తెలుసంటే, నేను అక్కడే ఉన్నాను.

106
00:09:32,260 --> 00:09:34,637
నాకు ఇంకేం తెలుసో నీకు తెలుసుకోవాలని ఉంటే,

107
00:09:34,721 --> 00:09:38,099
రష్యన్ ఏజెంట్లు ఇక్కడికి రాక ముందే
నన్ను ప్యారిస్ నుండి సురక్షితంగా తరలించేయ్.

108
00:09:38,182 --> 00:09:42,270
నేను చెప్పేది నిజం, సిడ్నీ, వాళ్ళు వస్తున్నారు.

109
00:09:50,862 --> 00:09:54,282
- ఇతను ఎక్కడ కనిపించాడు మీకు?
- చెప్పా కదా, అతనే మా వద్దకి వచ్చాడు.

110
00:09:54,365 --> 00:09:55,783
ఎలా?

111
00:09:55,867 --> 00:09:58,703
నేను ఈ ఊర్లో ఉన్నట్టు అతనికెలా తెలుసు?
నేను వచ్చి ఆరు గంటలే కదా అయింది.

112
00:09:59,954 --> 00:10:03,041
- నేను స్టేషన్ చీఫ్ కి కాల్ చేస్తా.
- వద్దు. ఎవరికీ కాల్ చేయకు.

113
00:10:03,958 --> 00:10:07,045
కెమెరాలను ఆఫ్ చేసి, ఫైళ్లను తొలగించండి.

114
00:10:07,128 --> 00:10:09,422
- ఇతను మనం వెతుకుతున్న వ్యక్తి.
- కానీ అతనే స్వయంగా వచ్చి లొంగిపోయాడు.

115
00:10:09,505 --> 00:10:12,342
నా గురించి, మా నాన్న మరణం గురించి
ఇతని దగ్గర సమాచారం ఉంది.

116
00:10:12,425 --> 00:10:14,219
కెమెరాల వల్ల అతను భయపడుతుంటే,
వాటిని ఆపేస్తే అయిపోతుంది.

117
00:10:14,302 --> 00:10:15,345
నాకు దీని రికార్డ్ ఏమీ అక్కర్లేదు.

118
00:10:15,428 --> 00:10:18,181
అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడో,
అతనికి ఇంకా ఏం తెలుసో అదే కావాలి నాకు.

119
00:10:25,730 --> 00:10:26,940
కెమెరాలని ఆపేయండి.

120
00:10:39,327 --> 00:10:40,578
ఇది ఎక్కడిది మీకు?

121
00:10:40,662 --> 00:10:42,830
మీ నాన్న దీన్ని పర్సులో ఉంచుకున్నాడు.

122
00:10:43,498 --> 00:10:45,250
మిగతా సగం నీ దగ్గర ఉంది.

123
00:10:45,333 --> 00:10:48,586
నీ చిన్నప్పుడు,
మీరిద్దరూ కలిసి చేసుకున్న ట్రెజర్ మ్యాప్.

124
00:10:48,670 --> 00:10:50,255
దీని ద్వారా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు?

125
00:10:51,965 --> 00:10:53,383
నాకు చాలా విషయాలు తెలుసని.

126
00:10:54,676 --> 00:10:57,971
నన్ను ప్యారిస్ నుండి తరలించేస్తే,
నీకు మరిన్ని విషయాలు చెప్తాను.

127
00:11:00,807 --> 00:11:02,517
నిన్ను ప్యారిస్ నుండి నేనెలా తరలించాలి?

128
00:11:04,561 --> 00:11:05,853
నన్ను హావ్లాక్ దగ్గరికి తీసుకెళ్ళు.

129
00:11:07,188 --> 00:11:09,232
మాఫియా వాళ్లలో అతనికి తెలిసిన వాళ్ళు ఉన్నారు.

130
00:11:09,983 --> 00:11:14,195
అతని సాయంతో నన్ను ఇక్కడి నుండి పంపించే
ఏర్పాటు చేయి, అప్పుడు నాకు తెలిసినదంతా చెప్తాను.

131
00:12:14,839 --> 00:12:17,842
సిడ్నీ! ఏం చేస్తున్నావు?

132
00:12:18,426 --> 00:12:19,928
సిడ్నీ!

133
00:13:03,471 --> 00:13:04,639
పద.

134
00:13:13,022 --> 00:13:15,900
వెళదాం పద. పద! పద.

135
00:13:22,991 --> 00:13:24,325
- వెళ్ళిపో.
- ఎవరు మీరు?

136
00:13:24,993 --> 00:13:26,077
- సమాధానం చెప్పండి.
- వెళ్ళిపో!

137
00:13:26,160 --> 00:13:27,579
మా నాన్న ఎలా తెలుసు మీకు?

138
00:13:27,662 --> 00:13:28,663
నేను…

139
00:13:29,539 --> 00:13:31,499
నేను మీ నాన్నని చంపిన ఏజెంట్ ని.

140
00:13:33,042 --> 00:13:34,502
క్షమించు.

141
00:13:38,923 --> 00:13:40,091
క్షమించు.

142
00:13:47,390 --> 00:13:48,850
అతను అబద్ధం చెప్తూ ఉండవచ్చా?

143
00:13:48,933 --> 00:13:50,310
చనిపోయేటప్పుడు అబద్ధం చెప్పి లాభమేంటి?

144
00:13:50,393 --> 00:13:53,062
మా నాన్నని అతను చంపనప్పుడు,
చంపానని ఎందుకు చెప్తాడు?

145
00:13:54,814 --> 00:13:56,274
ఇది నువ్వు లాంగ్లీకి చెప్పకూడదు.

146
00:13:56,357 --> 00:13:59,110
జనాలు చనిపోయారు.
సేఫ్ హౌస్ లోకి బయటి వాళ్ళు రాగలిగారు కూడా.

147
00:13:59,194 --> 00:14:00,486
నువ్వు వెళ్లినట్టు ఎవరికీ తెలీదు.

148
00:14:00,570 --> 00:14:03,865
వాళ్ళు కెమెరాలను ఆఫ్ చేసేశారని,
ఫుటేజీని తొలగించేశారని చెప్పావు కదా.

149
00:14:03,948 --> 00:14:05,909
సాక్షులు ఇప్పుడు ప్రాణాలతో లేరు.

150
00:14:05,992 --> 00:14:09,537
నువ్వు ప్యారిస్ లో ఉన్నట్టు వాస్ కి
ఎలా తెలుసో కనుగొనే సమయం మనకి ఉంది.

151
00:14:09,621 --> 00:14:11,539
మనిద్దరం కలిసి పని చేస్తున్నట్టు
అతనికెలా తెలుసో మనం కనుగొనవచ్చు.

152
00:14:11,623 --> 00:14:13,499
మన గుట్టు బయటపడిపోయింది, సిడ్.

153
00:14:13,583 --> 00:14:15,793
అందుకే దాని గురించి నేను లాంగ్లీకి రిపోర్ట్ చేయాలి.

154
00:14:15,877 --> 00:14:18,004
ఇదంతా వాళ్ళకెందుకు చెప్పాలి?
మీ నాన్న గురించి వాళ్ళు అబద్ధమాడారు.

155
00:14:18,087 --> 00:14:19,547
నాకు బ్రాడ్ఫర్డ్ పై నమ్మకముంది.

156
00:14:20,673 --> 00:14:23,885
చిన్నప్పటి నుండే ఆమె నాకు తెలుసు.
ఆమె మా కుటుంబంలో భాగమనే చెప్పవచ్చు.

157
00:14:23,968 --> 00:14:25,637
భలేదానివే. అమాయకంగా మాట్లాడుతున్నావు.

158
00:14:25,720 --> 00:14:28,431
బహుశా బ్రాడ్ఫర్డ్ గోరంత చెప్పి, కొండంత దాస్తుందేమో.

159
00:14:31,351 --> 00:14:33,269
అసలేం జరుగుతోంది?

160
00:14:36,940 --> 00:14:39,984
మన గురించి, మన భవిష్యత్తు గురించి బాగా ఆలోచించా.

161
00:14:40,068 --> 00:14:43,279
నా వల్ల ముప్పు ఉందని ఏజెన్సీ వాళ్లకి
అనిపించిన మరుక్షణం, నన్ను చంపేస్తారని అనుకుంటున్నా,

162
00:14:43,363 --> 00:14:45,073
ఇప్పటికే వాళ్ళు నన్ను ముప్పుగా
భావిస్తూ ఉంటారు కూడా.

163
00:14:45,156 --> 00:14:46,241
ఏం చేశావు నువ్వు?

164
00:14:46,324 --> 00:14:49,869
వాళ్ళని బెదిరించడానికి
ఏమైనా దొరుకుతుందేమో అని ఫిషింగ్ అటాక్ చేశా.

165
00:14:49,953 --> 00:14:53,498
నా కాంటాక్ట్ రిపోర్టులలోని ఒక దానిలో
ఒక కోడ్ ని పొందుపరిచా,

166
00:14:53,581 --> 00:14:57,210
దానితో ఆ ఫైల్, లాంగ్లీలో ఉండే
ఒకానొక గోప్యమైన సర్వర్లో ఉన్నట్టు తెలిసింది.

167
00:14:57,293 --> 00:15:00,505
- నీకు పిచ్చి పట్టింది.
- అందులోని ఒక ఫైల్ పేరు, ఆర్కైవ్ 6.

168
00:15:00,588 --> 00:15:03,007
- అయితే?
- ఆ ఫైల్ ని 20 ఏళ్ల క్రితమే క్రియేట్ చేశారు,

169
00:15:03,091 --> 00:15:05,218
మీ నాన్నగారే దాన్ని క్రియేట్ చేసింది,
ఇంకా యాక్టివ్ గానే ఉంది అది.

170
00:15:05,301 --> 00:15:09,806
మనం చేసిన పనుల తాలూకు వివరాలన్నింటినీ
వాళ్ళు ఆ ఆర్కైవ్ 6 లోనే స్టోర్ చేస్తారు అనుకుంటా,

171
00:15:09,889 --> 00:15:13,560
మీ నాన్నకి ఏమైంది అనే సమాచారం కూడా
అందులోనే ఉండే అవకాశముంది.

172
00:15:14,519 --> 00:15:18,356
- నువ్వు ఈ పనిని ఇప్పటికిప్పుడు ఆపేసేయ్.
- ఎందుకు ఆపాలి?

173
00:15:18,439 --> 00:15:22,485
వాళ్ళు మనతో అబద్ధాలు ఆడుతున్నారు, సిడ్.
మీ నాన్న గురించి, ఈ వాస్ గురించి.

174
00:15:22,569 --> 00:15:25,280
కానీ నేను ఆర్కైవ్ కి యాక్సెస్ సంపాదించగలిగితే,
నిజం బయటపడే అవకాశం ఉందేమో.

175
00:15:25,363 --> 00:15:27,532
నీకు కావాల్సింది నిజం కాదు,
వాళ్ళని గుప్పెట్లో ఉంచుకోవడానికి ఒక ఆధారం.

176
00:15:27,615 --> 00:15:29,200
ఒకవేళ నాకు ఆ రెండూ దొరికితే?

177
00:15:34,122 --> 00:15:35,582
అది చాలా ప్రమాదకరం.

178
00:15:35,665 --> 00:15:38,334
మనం కొంత కాలం ఆగి
బ్రాడ్ఫర్డ్ కి చెబుదామంటే, నాకు ఓకే.

179
00:15:38,418 --> 00:15:41,588
కానీ రక్షణ గల ఒక ఫైలును
నువ్వు దొంగిలిస్తావంటే నేను ఒప్పుకోను.

180
00:15:41,671 --> 00:15:44,924
- నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నా.
- అయితే, వాస్ విషయాన్ని మర్చిపోదామా?

181
00:15:45,008 --> 00:15:46,593
లేదు. అలా అని నేను అనలేదు.

182
00:15:46,676 --> 00:15:49,053
అతనికేం తెలుసో మనం వేరే మార్గంలో తెలుసుకోవాలి.

183
00:15:51,097 --> 00:15:53,892
అంటే, వాస్ గురించి
పూర్తి సమాచారం తెలుసుకోవడం దాదాపుగా అసాధ్యమే.

184
00:15:53,975 --> 00:15:55,059
వెతకండి

185
00:15:55,143 --> 00:15:56,352
అతను రష్యన్ల వైపుకు వెళ్ళక ముందే,

186
00:15:56,436 --> 00:15:59,564
వాస్ సమాచారాన్ని కప్పిపుచ్చడానికి
ఏజెన్సీ చాలా దూరం వెళ్ళింది.

187
00:15:59,647 --> 00:16:02,609
లాంగ్లీ వాళ్ళు నాకు యాక్సెస్ ఇచ్చిన
సమాచారంలో చాలా వరకు చెరిపేసినదే ఉంది.

188
00:16:02,692 --> 00:16:06,446
ఇతని దగ్గర నకిలీ ఆస్థి,
నకిలీ బ్యాంక్ రికార్డులు, నకిలీ పేర్లు ఉన్నాయి.

189
00:16:06,529 --> 00:16:09,616
ఇతను ఏజెన్సీ తరఫున పని చేశాడని
నిరూపించేది ఖచ్చితంగా ఏదోకటి ఉంటుంది.

190
00:16:10,408 --> 00:16:13,620
ఒక్క నిమిషం. దొరికింది. షారన్ టిడ్వెల్.

191
00:16:13,703 --> 00:16:14,704
ఎవరు?

192
00:16:15,455 --> 00:16:19,500
నేను న్యాయశాఖకు, ఏజెన్సీలో ఒకప్పుడు పని చేసిన
ఉద్యోగికి మధ్య జరిగిన ఈమెయిల్ కమ్యూనికేషన్ చూశాను.

193
00:16:20,710 --> 00:16:23,963
వాస్ కి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వమని ఆమెని కోరారు,

194
00:16:24,047 --> 00:16:26,507
కానీ ప్రతీకారంగా ఏమైనా చేస్తారేమో
అని భయపడి ఆమె దానికి ఒప్పుకోలేదు.

195
00:16:26,591 --> 00:16:28,176
కాబట్టి ఆమెకి సమన్లు ఇచ్చారు.

196
00:16:28,259 --> 00:16:31,054
అయితే ఈమెకి వాస్ గురించి తెలుసు అన్నమాట,
అతని రహస్యాలను దాచింది అన్నమాట.

197
00:16:32,972 --> 00:16:35,600
ఇదుగో, ఈమెనే షారన్ టిడ్వెల్.

198
00:16:35,683 --> 00:16:38,937
"అక్విజిషన్ సర్వీసుల్లో
ప్రొక్యూర్మెంట్ ఆఫీసరుగా పని చేసింది."

199
00:16:39,020 --> 00:16:42,565
అండర్ కవర్లో భాగంగా వాస్ కి ఉద్యోగాలని,
కరెన్సీని, బసలను, ఐడీలను ఏర్పాటు చేసి ఉంటుంది.

200
00:16:42,649 --> 00:16:44,526
గూఢచారులకి ట్రావెల్ ఏజెంట్ అన్నమాట.

201
00:16:44,609 --> 00:16:47,820
వాస్ గురించి ఈమెకి ఏదో ముఖ్యమైనదే
తెలిసి ఉంటుంది, లేకపోతే వాంగ్మూలం అడగరు కదా.

202
00:16:47,904 --> 00:16:49,572
మనం తనని కలవాలి.

203
00:16:52,575 --> 00:16:55,203
నాక్స్ విల్, టెన్నెసీ

204
00:17:01,876 --> 00:17:03,503
చాలా చాలా థ్యాంక్స్.

205
00:17:05,964 --> 00:17:07,090
హేయ్, షారన్.

206
00:17:07,674 --> 00:17:10,635
- గుడ్ మార్నింగ్.
- హలో. ప్రార్థన బాగుంది.

207
00:17:10,717 --> 00:17:12,678
మేము ప్రార్థన జరిగేటప్పుడు ఇక్కడ లేములే.

208
00:17:12,762 --> 00:17:14,931
విక్టర్ వాస్ గురించి మీతో మాట్లాడాలని వచ్చాం.

209
00:17:15,013 --> 00:17:17,392
సీఐఏలో ఒకప్పుడు మీకు పని అప్పిగిస్తూ ఉండిన
ఉద్యోగితో మేము పని చేస్తున్నాం.

210
00:17:17,475 --> 00:17:19,644
- మీరిక్కడికి వచ్చి ఉండాల్సింది కాదు.
- మీరు మాకు సాయం చేయగలరని…

211
00:17:19,726 --> 00:17:21,980
మీరేం అనుకున్నా, నాకు అనవసరం!
నేను మీతో మాట్లాడేది లేదు.

212
00:17:22,062 --> 00:17:25,649
కాబట్టి మీ దారిన మీరు వెళ్ళండి,
నా మానాన నన్ను వదిలేయండి.

213
00:17:25,733 --> 00:17:28,987
మీరు జీఎస్ఏలో పని చేశారని మీ కుటుంబానికి తెలుసా?

214
00:17:29,529 --> 00:17:30,738
మీరేం చేశారో వాళ్ళకి తెలుసా?

215
00:17:31,656 --> 00:17:35,034
నేను వాస్ తో ఎప్పుడూ మాట్లాడలేదు.
అసలు నేను అస్సెట్లతో మాట్లాడను.

216
00:17:35,869 --> 00:17:38,204
కానీ మీరు కీలకమైన సపోర్ట్ అందించారు కదా.

217
00:17:38,288 --> 00:17:39,497
హా, కానీ అతని గురించి నాకు తెలీదు.

218
00:17:39,581 --> 00:17:42,584
అతను ఫిరాయింపుదారుడు అయిపోయాడు.
చాలా కాలం అతను ఏమైపోయాడో, ఎక్కడున్నాడో తెలీదు.

219
00:17:42,667 --> 00:17:44,794
రాబర్ట్ స్కోఫీల్డ్ కి లింక్ ఉన్న
అతని రహస్య మిషన్ గురించి

220
00:17:44,878 --> 00:17:46,337
మీకేం తెలుసు?

221
00:17:46,838 --> 00:17:49,007
అతడిని ఏజెన్సీయే చంపించిందా?

222
00:17:51,259 --> 00:17:52,385
నువ్వు ఆయన కూతురివి కదా.

223
00:17:53,177 --> 00:17:54,554
అతడిని చంపమని ఇచ్చిన ఉత్తర్వును చూశారా?

224
00:17:54,637 --> 00:17:57,015
అయ్యయ్యో. నీకు ఈమధ్యే తెలిసిందా?

225
00:17:57,932 --> 00:18:00,059
అతడిని ఏజెన్సీ ఎందుకు చంపాలనుకుంది?

226
00:18:00,143 --> 00:18:03,771
నేను ప్రొక్యూర్మెంట్లో పని చేశా. వనరులని అందించా.

227
00:18:03,855 --> 00:18:06,357
ఎందుకు, ఏంటి అని వాళ్ళు
నాకు చెప్పేవారు కాదు, నేనూ అడిగే దాన్ని కాదు.

228
00:18:06,441 --> 00:18:08,443
అది నాకు అనవసరమైన విషయం.

229
00:18:08,526 --> 00:18:10,320
ఆ సమాచారం ఆర్కైవ్లో ఉందా?

230
00:18:10,904 --> 00:18:13,198
ఆర్కైవ్ 6. ఏంటది?

231
00:18:14,199 --> 00:18:15,408
మీరు జాగ్రత్తగా ఉండాలి.

232
00:18:16,367 --> 00:18:17,660
అందులో ఇంకేమేం రహస్యాలు ఉన్నాయి?

233
00:18:17,744 --> 00:18:21,539
నాకు తెలీదు. ఒకవేళ నాకు తెలిసినా,
మీకు చెప్పను కూడా చెప్పను.

234
00:18:22,749 --> 00:18:25,960
ఆర్కైవ్ 6 లో మా నాన్నని చంపమని
ఇచ్చిన ఉత్తర్వు ఏమైనా ఉందా?

235
00:18:26,461 --> 00:18:29,547
బంగారం, నువ్వు దీన్ని ఇంతటితో వదిలేయాలి.

236
00:18:30,048 --> 00:18:32,800
అలా చేస్తే, నీ తండ్రి లెగసీని కాపాడినదానివి అవుతావు.

237
00:18:32,884 --> 00:18:37,889
అతను మనకి హీరోగానే గుర్తుండాలి,
అదే అందరికీ మంచిది.

238
00:18:49,526 --> 00:18:50,652
నోట్లోనే ఆపేయ్, బయటకి అనకు.

239
00:18:50,735 --> 00:18:52,654
ఏంటి? నేను చెప్పింది నిజమే అన్న విషయమా?

240
00:18:55,114 --> 00:18:56,908
మనం ఆర్కైవ్ 6లో ఏముందో చూడాలి.

241
00:18:57,659 --> 00:18:59,410
దానికి నీ దగ్గర ప్లాన్ ఉందనే అనుకుంటున్నా.

242
00:19:01,955 --> 00:19:03,831
రేపు ఉదయం నువ్వు ఆఫీసుకు వెళ్ళు.

243
00:19:03,915 --> 00:19:06,334
నీ డివిజన్ చీఫ్ తో మాట్లాడు,

244
00:19:06,417 --> 00:19:08,545
నేను కరాచీకి వెళ్తున్నానని అతనికి చెప్పు.

245
00:19:08,628 --> 00:19:11,130
అక్కడి సరిహద్దు వెంబడి ఉన్న పరిస్థితుల కారణంగా

246
00:19:11,214 --> 00:19:13,132
మనిద్దరం టచ్ లో లేమని చెప్పు.

247
00:19:13,216 --> 00:19:14,676
మనం మాట్లాడి వారమైందని చెప్పు.

248
00:19:14,759 --> 00:19:17,220
నేను చేసే పనులేంటో నీకు తెలీను కూడా తెలీదని

249
00:19:17,303 --> 00:19:19,556
- వాళ్లకి అర్థమవ్వాలి.
- ఏం చేస్తున్నావు నువ్వు?

250
00:19:19,639 --> 00:19:22,267
నేను ఆర్కైవ్ 6ని యాక్సెస్ చేయబోతున్నాను.

251
00:19:22,350 --> 00:19:24,602
నేను అసలు లోపల ఏముందో తెలుసుకోకుండా,
అంతా పైపైనే చూస్తూ ఉంటే,

252
00:19:24,686 --> 00:19:26,521
దీన్నంతా ఎవరు నడిపిస్తున్నారో మనకి తెలీదు.

253
00:19:26,604 --> 00:19:29,941
బుధవారం నాడు,
నన్ను ప్యారిస్ లోని సేఫ్ హౌస్ లో కలుసుకో.

254
00:19:30,024 --> 00:19:32,694
నేనేం కనిపెట్టానో నీకు చెప్తా,
కానీ నువ్వు నాకొక మాట ఇవ్వాలి.

255
00:19:33,278 --> 00:19:35,363
నీకు ఏమైనా తేడాగా అనిపించినా,
అది రవ్వంత అనిపించినా కానీ,

256
00:19:35,446 --> 00:19:37,907
అస్సలు రాకు. సరేనా?

257
00:19:38,658 --> 00:19:41,160
- అలా అని నాకు మాట ఇవ్వు.
- తేడా అంటే?

258
00:19:43,037 --> 00:19:44,205
బ్రాడ్ఫర్డ్ నిన్ను పిలుస్తోంది.

259
00:19:47,458 --> 00:19:51,296
శుక్రవారం రాత్రి వేళ,
మన రహస్య కేంద్రంలోకి బయటి వాళ్ళు ప్రవేశించారు.

260
00:19:52,130 --> 00:19:53,381
అక్కడి మన స్థానిక అస్సెట్…

261
00:19:53,464 --> 00:19:54,632
బీల్, జేమ్స్

262
00:19:54,716 --> 00:19:56,593
…ఇంకా డెప్యూటీ స్టేషన్ చీఫ్, ఇద్దరూ చనిపోయారు.

263
00:19:57,760 --> 00:19:58,761
హండీ, కే

264
00:19:58,845 --> 00:20:00,972
- గతంలో మనకి అస్సెట్ గా పని చేసిన విక్టర్ వాస్ కూడా.
- వాస్ ఎవరు?

265
00:20:01,055 --> 00:20:05,059
అతనొక దేశద్రోహి, గత దశాబ్దంలో
మనం అతనిపై గట్టి నిఘానే ఉంచాం,

266
00:20:05,143 --> 00:20:08,229
కానీ అతను మన రహస్య కేంద్రం బయటే
విగత జీవుడై కనిపించాడు.

267
00:20:08,313 --> 00:20:10,815
కెమెరాలేమీ లేవు. రికార్డింగులని తొలగించేశారు.

268
00:20:10,899 --> 00:20:12,358
అతను దేని కోసం అక్కడికి వచ్చాడు?

269
00:20:12,442 --> 00:20:14,319
- అది నీకు తెలిసే ఉంటుందని అనుకుంటున్నాం.
- ఎందుకు?

270
00:20:14,402 --> 00:20:16,362
నిన్న రాత్రి హావ్లాక్, ప్యారిస్ లోనే ఉన్నాడు.

271
00:20:16,446 --> 00:20:17,447
అయితే?

272
00:20:18,323 --> 00:20:19,449
అది నీకు తేడాగా అనిపించట్లేదా?

273
00:20:19,532 --> 00:20:21,117
హావ్లాక్ కి వాస్ ఎవరో తెలీదు కదా.

274
00:20:21,201 --> 00:20:22,827
తెలీదని నీకు పక్కాగా తెలుసా?

275
00:20:22,911 --> 00:20:24,120
జాక్, ఏంటిది అంతా?

276
00:20:24,204 --> 00:20:27,916
మన సిగ్మా వాల్ట్ నెట్వర్కుపై
వరుస దాడులు జరిగినట్టు గుర్తించాము.

277
00:20:28,499 --> 00:20:31,961
ఐపీని ట్రేస్ చేయడం సాధ్యం కావట్లేదు,
కానీ అది లోపలి వాళ్ళ పనే అని అనిపిస్తోంది.

278
00:20:32,045 --> 00:20:33,713
ఈ పని హావ్లాక్ బాగా చేయగలడు.

279
00:20:33,796 --> 00:20:35,798
హావ్లాక్ ఫిరాయింపుదారుడు అయిపోయాడని అంటున్నావా?

280
00:20:35,882 --> 00:20:39,010
అలా అని నేను అనట్లేదు.
నీకు అతనిపై నమ్మకం ఉందా అని అడుగుతున్నా.

281
00:20:39,093 --> 00:20:41,095
మన నెట్వర్క్ ని హ్యాక్ చేయాల్సిన పని అతనికి ఏంటి?

282
00:20:41,179 --> 00:20:44,515
ఏమో మరి. కానీ అతనికి చాలా స్వేచ్చని ఇచ్చాం.

283
00:20:45,433 --> 00:20:48,853
అతనికి యాక్సెస్ ఉంది.
మాఫియా వాళ్ళలో అతనికి తెలిసినవాళ్ళు ఉన్నారు.

284
00:20:49,938 --> 00:20:51,147
నీకు అతనిపై నమ్మకం ఉందా?

285
00:20:51,940 --> 00:20:53,274
నాకన్నా అతనిపైనే నాకు నమ్మకం ఉంది.

286
00:20:55,235 --> 00:20:56,361
మా ఇద్దరికీ కాస్త ఏకాంతం ఇవ్వు.

287
00:21:03,701 --> 00:21:05,453
నువ్వు కూడా మీ నాన్నలాగే ప్రవర్తిస్తున్నావు.

288
00:21:06,079 --> 00:21:08,873
మీ నాన్న జనాలను గుడ్డిగా నమ్మేవాడు.

289
00:21:09,666 --> 00:21:12,418
మిషన్ కన్నా జనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు.

290
00:21:13,795 --> 00:21:14,921
అందుకే హత్యకు గురయ్యాడు.

291
00:21:19,717 --> 00:21:23,137
హావ్లాక్ పై ఓ కన్నేసి ఉంచు.
కానీ అతనికి కాస్త దూరంగానే ఉండు.

292
00:21:23,721 --> 00:21:26,182
నువ్వు క్షేమంగా ఉండటమే నాకు కావాలి.

293
00:21:31,521 --> 00:21:33,022
ఇప్పటికీ అతని గురించి ఆలోచిస్తుంటావా?

294
00:21:33,982 --> 00:21:35,191
ప్రతిరోజూ ఆలోచిస్తుంటా.

295
00:21:36,276 --> 00:21:39,195
మీ నాన్న చేసినంత బలిదానం ఇంకెవరూ చేయలేదు,

296
00:21:39,279 --> 00:21:42,323
అందుకే నీకు ఏమీ కాకుండా చూసుకుంటానని
నాకు నేను మాట ఇచ్చుకున్నా.

297
00:21:43,616 --> 00:21:45,118
కాస్త జాగ్రత్తగా ఉండు, సిడ్.

298
00:21:45,994 --> 00:21:47,579
హావ్లాక్ మీద ఓ కన్నేసి ఉంచుతా.

299
00:21:56,713 --> 00:21:57,755
తను అబద్ధమాడుతోంది.

300
00:21:59,549 --> 00:22:01,718
ఆ దరిద్రుడితో పడక పంచుకుంటోంది.

301
00:22:10,143 --> 00:22:12,770
బెదిరించి, గుప్పెట్లో పెట్టుకోవడం కోసం
ఫిషింగ్ చేయడం మంచిది కాదని నీకు చెప్పా.

302
00:22:12,854 --> 00:22:14,814
కానీ నువ్వు నా మాట వినలేదు,
ఇప్పుడు వాళ్లకి తెలిసిపోయింది.

303
00:22:14,898 --> 00:22:16,357
కానీ ఇందులో నీకు లింక్ ఉన్నట్టు ఆధారాలేవీ లేవులే.

304
00:22:18,568 --> 00:22:20,028
నా భయం నా గురించి కాదు, లీవై.

305
00:22:20,111 --> 00:22:22,238
నీ గురించే నా భయం అంతా.
నువ్వు నా మాట విని ఉండాల్సింది.

306
00:22:22,322 --> 00:22:25,366
నీకు ముప్పు ఉందని నీకు అనిపించి,
వాళ్ళని బెదిరించడానికి ఆయుధం కోసం వెతికే ప్రయత్నం చేశావు,

307
00:22:25,450 --> 00:22:28,244
- ఇప్పుడు చూడు ఏమైందో.
- నాకు ముప్పు మొదట్నుంచీ ఉంది. అదే నేను చెప్పేది.

308
00:22:28,328 --> 00:22:30,788
నా భయాలన్నీ నిజమేనని ఆర్కైవ్ 6 నిరూపించింది.

309
00:22:32,165 --> 00:22:34,834
ఇతరుల్లానే, నన్ను కూడా చంపాలని
సీఐఏ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు.

310
00:22:34,918 --> 00:22:36,169
ఇతరులంటే?

311
00:22:36,252 --> 00:22:38,421
ఆట్వాటర్ ప్రోటోకాల్ కింద గతంలో జరిపిన ఆపరేషన్ల గురించి

312
00:22:38,504 --> 00:22:40,673
పూర్తి సమాచారం ఆర్కైవ్ లో ఉంది.

313
00:22:40,757 --> 00:22:42,926
మనిద్దరం అనధికార మిషన్లపై పని చేస్తుంటాం.

314
00:22:43,009 --> 00:22:47,180
అవును. కానీ బ్రాడ్ఫర్డ్ నడిపే రహస్య ప్రోగ్రాంలో
మనిద్దరమే పని చేస్తున్నామని అనుకుంటున్నావా?

315
00:22:47,263 --> 00:22:49,807
బ్రాడ్ఫర్డ్, ఇలాంటి అనధికార ఆపరేషన్లను
ప్రపంచవ్యాప్తంగా రహస్యంగా నడిపిస్తోంది,

316
00:22:49,891 --> 00:22:50,892
మనలాంటి ఆపరేషన్లనే అన్నమాట.

317
00:22:50,975 --> 00:22:53,937
ఏ మాత్రం ఆలోచించకుండా
ఏజెంట్లను ఫీల్డులోకి పంపిస్తోంది.

318
00:22:54,020 --> 00:22:58,066
బయటపెట్టడానికి అనుమతుల్లేని,
రహస్యంగా ఉంచాల్సిన నిఘా సమాచారాన్ని వాళ్లకి ఇచ్చి,

319
00:22:58,149 --> 00:23:01,319
దాని సహాయంతో శత్రువులని బయటకు రప్పించి
వాళ్ళని పట్టుకోవడమో, చంపడమో చేస్తూ ఉంది.

320
00:23:01,402 --> 00:23:03,821
లండన్, కెయిరో, ఏథెన్స్.

321
00:23:03,905 --> 00:23:07,116
నేను కొన్నే ప్రింట్ చేశాను. ఇది ఆరంభం మాత్రమే.

322
00:23:07,200 --> 00:23:08,409
ఇది రహస్య ప్రోగ్రామ్.

323
00:23:08,493 --> 00:23:09,953
ఇది పూర్తిగా అనధికార ప్రోగ్రామ్.

324
00:23:10,036 --> 00:23:12,038
ఈ అస్సెట్లను ఆమె ఎలా సంపాదిస్తోందో నాకు తెలీదు, సిడ్.

325
00:23:12,121 --> 00:23:15,250
కానీ, వాళ్లలో ఎవరైనా బతికి ఉన్నారంటే,
దానికి కారణం వాళ్ళ ఆపరేషన్ ఇంకా ముగియకపోవడమే,

326
00:23:15,333 --> 00:23:19,212
ఒకసారి ఆపరేషన్ ముగిస్తే, వాళ్ళని ఆమె చంపించేస్తోంది.

327
00:23:19,295 --> 00:23:22,632
సిడ్, బ్రాడ్ఫర్డ్ మొదటి టార్గెట్లలో మీ నాన్న ఒకరు.

328
00:23:27,011 --> 00:23:29,305
స్కోఫీల్డ్, రాబర్ట్
చనిపోయాడు

329
00:23:31,182 --> 00:23:34,352
- మరి ఇప్పుడేం చేద్దాం?
- నేను పారిపోవాలి. అజ్ఞాతంలోకి వెళ్ళిపోతా.

330
00:23:35,395 --> 00:23:36,563
వేరే దారి ఏమైనా ఉందా?

331
00:23:37,146 --> 00:23:39,524
ఇది అందరికీ చెప్పేయవచ్చు. నిజాన్ని బయటపెట్టవచ్చు.

332
00:23:39,607 --> 00:23:40,692
అది చాలా ప్రమాదకరమైన పని.

333
00:23:41,693 --> 00:23:42,986
కానీ అదే సరైన పని.

334
00:23:43,069 --> 00:23:44,904
బ్రాడ్ఫర్డ్ చాలా శక్తిమంతమైనది.

335
00:23:44,988 --> 00:23:47,323
మనం చెప్పేవన్నీ కట్టుకథలని కొట్టిపారేస్తుంది.

336
00:23:47,407 --> 00:23:49,409
ఈ హ్యాకింగ్ చేసింది నువ్వేనని
వాళ్ళు ఖచ్చితంగా పసిగట్టగలరా?

337
00:23:49,492 --> 00:23:51,703
అది నా పనే అని నిరూపించే
డిజిటల్ ఫింగర్ ప్రింట్స్ చాలా ఉన్నాయి.

338
00:23:52,704 --> 00:23:54,080
ఆ డిజిటల్ ఫింగర్ ప్రింట్స్ ని నేను మార్చగలనేమో.

339
00:23:54,163 --> 00:23:55,707
లేదు, వెతకడం వరకూ ఓకే, సిడ్.

340
00:23:55,790 --> 00:23:57,792
ఆ ఆర్కైవ్ లోని కొంత భాగాన్ని నేను డౌన్ లోడ్ చేయగానే,

341
00:23:57,876 --> 00:23:59,919
నా సమాచారం బయటపడిపోయింది.
వాళ్ళు ఒక బృందాన్ని పంపిస్తారు.

342
00:24:01,212 --> 00:24:02,922
ఇక్కడికి వస్తారు వాళ్ళు. నన్ను చంపేస్తారు.

343
00:24:04,632 --> 00:24:05,717
నేను నిన్ను దూరం చేసుకోలేను.

344
00:24:07,427 --> 00:24:08,553
అయితే, నాతో వచ్చేయ్.

345
00:24:12,056 --> 00:24:14,058
ఇద్దరం ఎటైనా వెళ్ళిపోయి, కొత్త జీవితం ప్రారంభిద్దాం.

346
00:24:17,061 --> 00:24:18,146
నాకొక జీవితం ఉంది.

347
00:24:18,646 --> 00:24:19,731
నిజంగానా?

348
00:24:21,649 --> 00:24:23,484
నాతో ఉన్నావు కాబట్టి,
నువ్వు కూడా శత్రువు అయిపోతావు.

349
00:24:25,445 --> 00:24:27,155
వీళ్ళతో ఉంటే మనం కూడా నేరస్థులమే అవుతాం.

350
00:24:29,032 --> 00:24:30,158
నేను రాలేను.

351
00:24:30,867 --> 00:24:33,745
మనం వెళ్ళిపోతే,
బ్రాడ్ఫర్డ్ మన జోలికి అస్సలంటే అస్సలు రాదు.

352
00:24:33,828 --> 00:24:35,455
మన దగ్గర తన ఆయువుపట్టు ఉంది కాబట్టి.

353
00:24:35,955 --> 00:24:40,335
ఆర్కైవ్ ని బయటపెట్టేస్తామని బెదిరిస్తే,
తను మనల్ని ఏమీ చేయకపోవచ్చు.

354
00:24:46,090 --> 00:24:47,467
నువ్వంటే నాకు ప్రాణం, లీవై.

355
00:24:49,552 --> 00:24:52,597
కానీ మా నాన్న, నా కుటుంబం…

356
00:24:55,725 --> 00:24:57,644
నేను దీన్ని వదిలేసి రాలేను.

357
00:24:58,770 --> 00:25:01,981
దీన్ని సరిచేయాల్సిన బాధ్యత,
నిజాన్ని బయటపెట్టాల్సిన బాధ్యత నాకు ఉంది.

358
00:25:03,024 --> 00:25:04,442
నేను అన్నదాని గురించి ఆలోచించు.

359
00:25:10,198 --> 00:25:11,658
మనకి ఎక్కువ సమయం లేదు.

360
00:25:15,995 --> 00:25:17,038
వాషింగ్టన్, డీ.సీ.

361
00:25:17,121 --> 00:25:19,415
మీరంటే మీ నాన్నకి ప్రాణం.

362
00:25:19,499 --> 00:25:23,211
నాకు తెలుసు, అమ్మా.
నేను కొంత కాలం మీకు దూరంగా వెళ్లాల్సి రావచ్చు.

363
00:25:25,964 --> 00:25:27,298
మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తావు?

364
00:25:29,175 --> 00:25:30,635
తెలీదు.

365
00:25:34,389 --> 00:25:36,933
- ఏమైనా సమస్యలో ఇరుక్కున్నావా?
- లేదు.

366
00:25:37,725 --> 00:25:39,102
పనికి సంబంధించిన విషయంలే.

367
00:25:42,188 --> 00:25:43,273
నువ్వు అబద్దం చెప్తున్నావు.

368
00:25:46,276 --> 00:25:49,237
మీ నాన్న గురించే కదా. నిజంగా
ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నావు కదా.

369
00:25:50,780 --> 00:25:53,658
"నిజంగా ఏం జరిగిందో" అంటే?

370
00:26:06,045 --> 00:26:08,381
నిన్ను కానీ, మీ అక్కని కానీ నేను బాధపెట్టాలనుకోలేదు.

371
00:26:09,883 --> 00:26:12,677
మొదట్నుంచీ కూడా మిమ్మల్ని కాపాడాలన్న
ఉద్దేశమే తప్ప నాకు ఇంకేం లేదు.

372
00:26:18,892 --> 00:26:22,812
మీ దృష్టిలో మీ నాన్న హీరోలాగానే ఉండాలని,
అదే మంచిదని నాకు అనిపించింది.

373
00:26:24,689 --> 00:26:26,941
అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు?

374
00:26:27,025 --> 00:26:29,861
క్యాపిటల్ గజేట్
స్టార్స్, స్ట్రైప్స్, నవ్వులు

375
00:26:34,073 --> 00:26:36,701
అమ్మా, బాగానే ఉన్నావా?

376
00:26:45,835 --> 00:26:48,504
అమ్మా, నాతో, నాన్నతో ఉన్న ఈ వ్యక్తి ఎవరు?

377
00:26:49,130 --> 00:26:52,175
నీకు నిజం తెలియాల్సిన సమయం వచ్చింది అనుకుంటా.

378
00:26:53,551 --> 00:26:56,554
దక్షిణ బ్రాంక్స్, న్యూయార్క్

379
00:27:07,106 --> 00:27:08,274
విన్సెంట్ థియాగో?

380
00:27:17,992 --> 00:27:18,993
సిడ్నీ.

381
00:27:20,495 --> 00:27:24,207
మీ నాన్నని మొదటిసారిగా
నేను లండన్లో కలిసినప్పుడు నాకు 24 ఏళ్లే.

382
00:27:25,542 --> 00:27:27,919
చేతిలో చిల్లిగవ్వ లేని శరణార్థిని నేను.

383
00:27:28,920 --> 00:27:31,464
ఆయనకి టర్కిష్ భాష తెలిసినవాళ్ళు కావాల్సి వచ్చింది.

384
00:27:32,840 --> 00:27:34,300
మీరు అతని అనువాదకునిగా పని చేశారు కదా.

385
00:27:36,094 --> 00:27:41,975
భయంకరమైన ప్రదేశాల్లో, అలాగే అద్భుతమైన ప్రదేశాల్లో కూడా
మేమిద్దరమూ తిరిగాం, అలా మా మధ్య స్నేహం ఏర్పడింది.

386
00:27:43,142 --> 00:27:46,771
ఇరాన్, రష్యా, లెబనాన్.

387
00:27:48,231 --> 00:27:52,193
కానీ మా వృత్తి కారణంగా,
నాకు చాలా శత్రువులు తయారయ్యారు.

388
00:27:52,944 --> 00:27:55,154
నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది మీ నాన్నే.

389
00:27:55,238 --> 00:27:56,781
నా వీసా, బ్యాక్ గ్రౌండ్ తనిఖీలు,

390
00:27:56,865 --> 00:28:00,034
పౌరసత్వ పత్రాల విషయంలో ఆయన నాకు సహాయపడ్డాడు.

391
00:28:00,535 --> 00:28:05,373
వాషింగ్టన్ లో అతనితో పాటు
నేను ఆరేళ్ళు అనువాదకునిగా పని చేశా.

392
00:28:10,795 --> 00:28:14,757
ఆ తర్వాత ఆయన మాకు దూరమైపోయాడు.

393
00:28:16,175 --> 00:28:17,886
మీ ఉద్దేశం, ఆయన్ని హత్య చేశారు అనే కదా.

394
00:28:17,969 --> 00:28:22,307
మీ నాన్నని ఒక రహస్యాన్ని కాపాడటానికి
చంపేశారని నాకు అనిపించింది.

395
00:28:26,895 --> 00:28:28,521
ఏ రహస్యం?

396
00:28:28,605 --> 00:28:31,274
అది జాక్వెలిన్ బ్రాడ్ఫర్డ్ కి సంబంధించిన రహస్యమా?

397
00:28:32,192 --> 00:28:33,902
ఆర్కైవ్ 6?

398
00:28:38,114 --> 00:28:39,324
అలా బయటకు వెళ్దాం పద.

399
00:28:41,117 --> 00:28:44,871
మీ నాన్న ఆట్వాటర్ ప్రోటోకాల్ ని ప్రతిపాదించినపుడు,

400
00:28:44,954 --> 00:28:47,707
బ్రాడ్ఫర్డ్ తనకి అన్నివిధాలా అండగా నిలిచింది.

401
00:28:47,790 --> 00:28:49,250
ఆ ప్రోగ్రామ్ అసాధారణంగా,

402
00:28:49,334 --> 00:28:52,253
ఇంకా కాస్తంత క్రూరంగా ఉన్నట్టే అనిపించినా,
మనుషుల మధ్య తిరిగే కలుపు మొక్కలని

403
00:28:53,046 --> 00:28:56,216
ఏరేయడానికి అది ఉత్తమ మార్గమని
వాళ్లిద్దరూ అర్థం చేసుకున్నారు.

404
00:28:56,799 --> 00:29:01,554
మీ నాన్న దృష్టిలో, ఆఖరి ప్రయత్నంగానే దాన్ని వాడాలి.

405
00:29:01,638 --> 00:29:04,641
ముప్పు కలిగించే వాళ్ళని జాగ్రత్తగా
లేపేయడానికి అదొక దారిగా చూశాడు ఆయన.

406
00:29:05,266 --> 00:29:07,518
కానీ బ్రాడ్ఫర్డ్ దాన్ని వేరే కోణంలో చూసింది.

407
00:29:07,602 --> 00:29:12,273
ప్రపంచ నలుమూలల ఉండే శత్రువులని,
ఏమాత్రం ఆలోచించకుండా, ఎడాపెడా లేపేయడానికి

408
00:29:12,357 --> 00:29:15,276
దాన్ని వాడుకోవచ్చు అని అనుకుంది,
అలాగే దాన్ని ప్రయోగించింది కూడా.

409
00:29:15,360 --> 00:29:19,280
తను ఎంత దూరం వెళ్లిందంటే,
దాన్ని రహస్యంగా ఉంచడానికి,

410
00:29:19,364 --> 00:29:21,741
తన సొంత ఏజెంట్లనే చంపించేసింది.

411
00:29:22,534 --> 00:29:26,996
కానీ, ఆ ప్రోగ్రామ్ నైతికపరమైన దుర్వినియోగానికి
గురవుతోందని మీ నాన్నకి అనుమానం మొదలైంది.

412
00:29:27,830 --> 00:29:33,211
మోసపోయిన ఫీలింగ్ ఆయనకి కలిగింది. ఆ దుర్వినియోగాన్ని
బయటపెట్టాలనుకున్నాడు, కానీ ఆధారాలు లేవు.

413
00:29:33,294 --> 00:29:37,966
కాబట్టి, యాక్సిడెంట్ లా కనిపించాలని
పథకం ప్రకారం చేసిన ఈ హత్యలపై దర్యాప్తు చేసి,

414
00:29:38,049 --> 00:29:40,134
నిఘా సమాచారాన్ని సేకరించడం మొదలుపెట్టాడు.

415
00:29:40,718 --> 00:29:45,056
బ్రాడ్ఫర్డ్, రాజకీయపరమైన శత్రువులని
లక్ష్యంగా చేసుకుంటోందని, ఆ హత్యల ద్వారా

416
00:29:45,932 --> 00:29:47,767
ఆర్థిక ప్రయోజనాలనూ పొందుతోందని
ఆయనకి అనుమానం వచ్చింది.

417
00:29:50,186 --> 00:29:52,856
మీ నాన్న సేకరించిన ఆ రవ్వంత సమాచారాన్ని నాకు ఇచ్చాడు,

418
00:29:52,939 --> 00:29:56,192
ఆయనకి ఏమైనా అయితే,
వాటిని చట్టపరిరక్షణ అధికారులకి ఇవ్వమని

419
00:29:57,777 --> 00:29:59,779
నాకు చెప్పాడు.

420
00:30:00,488 --> 00:30:02,323
విమాన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన
కుర్దిష్ మిలిటెంట్ నాయకుడు

421
00:30:03,157 --> 00:30:05,034
అతను లేనిపోనివి ఊహించుకుంటున్నాడేమో అనుకున్నా.

422
00:30:06,494 --> 00:30:10,081
ఒక వారం తర్వాత, ఆయన్ని ఆఫ్ఘనిస్తాన్ లో చంపేశారు.

423
00:30:10,164 --> 00:30:12,834
ఆయన్ని మాటు వేసి చంపారని
వాళ్ళు అన్నదే నిజం కావాలని కోరుకున్నా.

424
00:30:13,459 --> 00:30:16,588
కానీ మీ నాన్న సంస్మరణ సభలో ప్రజలందరి ముందు,
తనకి అస్సలు ఇష్టం లేని వ్యక్తిని

425
00:30:16,671 --> 00:30:19,757
బ్రాడ్ఫర్డ్ విపరీతంగా పొగడటం చూశాక,
అది మాటు వేసి చంపారన్నది అబద్ధమని అర్థమైంది.

426
00:30:19,841 --> 00:30:21,342
మీ అమ్మకి నేను నిజం చెప్పేశా,

427
00:30:21,426 --> 00:30:25,013
కానీ తను బ్రాడ్ఫర్డ్ అంటే భయపడిపోయింది,
ఆ విషయాన్ని అంతటితో వదిలేసి వెళ్లిపొమ్మని చెప్పింది.

428
00:30:25,638 --> 00:30:28,016
తన కూతుళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వమంది.

429
00:30:29,392 --> 00:30:31,769
వాళ్ళ దృష్టిలో వాళ్ళ నాన్న హీరోలాగానే ఉండాలి అని అంది.

430
00:30:32,854 --> 00:30:35,398
- కాబట్టి ఆ విషయాన్ని వదిలేశా.
- కానీ ప్రమాదం నీకు కూడా ఉండింది కదా.

431
00:30:35,481 --> 00:30:39,736
అందుకే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయా.
నా సమాచారాన్ని అంతా తుడిచేశా.

432
00:30:41,279 --> 00:30:44,282
సుమారుగా 20 ఏళ్ల పాటు, నిజానికి దూరంగా బతికా.

433
00:30:45,450 --> 00:30:48,578
బ్రాడ్ఫర్డ్ బండారం బయటపెట్టాలని

434
00:30:48,661 --> 00:30:50,997
నాకెంతో ఇష్టమైన మీ నాన్నకి జరిగిన దానికి
ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడిపోయా,

435
00:30:51,080 --> 00:30:54,792
కానీ నా దగ్గర కొంచెం సమాచారమే ఉంది. రుజువు లేదు.

436
00:30:57,003 --> 00:30:58,755
ఒకవేళ రుజువు ఉంటే?

437
00:30:59,255 --> 00:31:02,425
నేను నీకు హార్ట్ మన్ అనే
ఒక అస్సెట్ గురించి చెప్పా కదా,

438
00:31:02,508 --> 00:31:04,886
అతను లాంగ్లీ వాళ్ళ సర్వర్ ని హ్యాక్ చేశాడు,

439
00:31:04,969 --> 00:31:08,056
ఆర్కైవ్ 6 అనే ఫైల్ ని యాక్సెస్ చేశాడు.

440
00:31:10,266 --> 00:31:12,310
అందులో నువ్వు చెప్పినదంతా ఉంది.

441
00:31:13,102 --> 00:31:15,980
చంపమని బ్రాడ్ఫర్డ్ జారీ చేసిన ఆదేశాలు, తన అస్సెట్లు,

442
00:31:16,064 --> 00:31:18,775
తన ఆపరేషన్ల కోసం వాడిన అక్రమ డబ్బు,
అంతా అందులో ఉన్నాయి.

443
00:31:18,858 --> 00:31:23,363
నువ్వు ఆ ప్రోగ్రామ్ ని బయట పెట్టవచ్చు.
బ్రాడ్ఫర్డ్ కి శిక్షపడేలా చేయవచ్చు.

444
00:31:23,446 --> 00:31:24,697
అదంత తేలిక కాదు.

445
00:31:24,781 --> 00:31:29,953
తన రహస్యాన్ని కాపాడుకోవడానికి బ్రాడ్ఫర్డ్, ఎంత దూరమైనా
వెళ్తుంది అనడానికి మా నాన్నకి జరిగిందే ఉదాహరణ.

446
00:31:30,036 --> 00:31:32,247
అది రిస్కుతో కూడుకున్నదే, అందులో సందేహమే లేదు.

447
00:31:32,330 --> 00:31:35,124
ఈ ఆధారాన్ని వాడుకుని, మన ప్రాణాలను
కాపాడుకోవచ్చు. అదే సురక్షితమైన ఎత్తుగడ.

448
00:31:35,208 --> 00:31:36,626
అవకాశం ఉన్నప్పుడే అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే సరిపోతుంది.

449
00:31:37,460 --> 00:31:41,422
నేను అజ్ఞాతంలోకి వెళ్ళాను. నోరు తెరవకుండా ఉన్నాను.

450
00:31:41,506 --> 00:31:44,092
అలా ఎందుకు చేశానా అని బాధపడని రోజు లేదు.

451
00:31:44,842 --> 00:31:48,555
కానీ నా దగ్గర లేనిది నీ దగ్గర ఉంది. అదే ఆధారం.

452
00:31:48,638 --> 00:31:50,807
పరిస్థితులని మార్చే అవకాశం నీ ముందు ఉంది.

453
00:31:51,391 --> 00:31:53,226
మీ నాన్న ప్రారంభించిన దాన్ని ముగించు.

454
00:31:54,227 --> 00:31:56,646
దీని నువ్వు సరిచేయవచ్చు.

455
00:31:59,524 --> 00:32:02,068
ఎక్కడ ఉన్నావు? నీకోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

456
00:32:02,151 --> 00:32:05,196
- వాళ్ళు సోర్స్ ని కనిపెట్టారా?
- ఎందుకు ఇంత ఆలస్యమైంది?

457
00:32:05,280 --> 00:32:06,823
గ్రిఫిన్, అడిగినదానికి సమాధానం చెప్పు.

458
00:32:06,906 --> 00:32:08,992
హ్యాకింగ్ ఎక్కడి నుండి జరిగిందో వాళ్ళు కనిపెట్టారా లేదా?

459
00:32:12,036 --> 00:32:15,081
ఆ పని చేసింది అతనే, సిడ్. హ్యాక్ చేసింది హార్ట్ మనే.

460
00:32:15,707 --> 00:32:18,209
- నేను నమ్మను.
- మా దగ్గర ఆధారాలు ఉన్నాయి.

461
00:32:18,293 --> 00:32:21,337
ఫోరెన్సిక్స్ వాళ్ళు, ఆరు వేర్వేరు డిజిటల్ ఆర్టిఫ్యాక్స్ట్ ని
కనిపెట్టారు, అన్నీ అతనే అని చెప్తున్నాయి.

462
00:32:21,421 --> 00:32:23,631
నెట్వర్క్ ని హ్యాక్ చేసింది
అతనే అనడానికి మా దగ్గర ఆధారం ఉంది.

463
00:32:23,715 --> 00:32:25,216
క్షమించాలి, అసలు మీరెవరు?

464
00:32:25,300 --> 00:32:27,844
నా పేరు మైఖెల్ ఫిట్జెరాల్డ్.
నేను నిఘా శాఖకి డెప్యూటీ చీఫ్ ని.

465
00:32:27,927 --> 00:32:29,846
ఈమె మిసెస్ రోంబార్.

466
00:32:29,929 --> 00:32:31,556
ఇక్కడున్న మిస్టర్ క్యాంబెల్, ఓజీసీలో పని చేస్తున్నారు.

467
00:32:31,639 --> 00:32:33,516
మీ హక్కులని కాపాడాలనే ఉద్దేశంతోనే
ఇక్కడికి వచ్చాం, మిస్ స్కోఫీల్డ్.

468
00:32:33,600 --> 00:32:35,143
మీ పాత్ర లేదని నిర్ధారించడానికి.

469
00:32:35,226 --> 00:32:36,561
ఎందులో పాత్ర?

470
00:32:36,644 --> 00:32:39,022
- సీఐఏని హ్యాక్ చేసింది మీ అస్సెటే.
- అది ఇందాకే చెప్పారు కదా.

471
00:32:39,105 --> 00:32:41,524
అతనేం దొంగిలించాడో తెలుసుకోవాలని,
నీకేం తెలుసో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాం.

472
00:32:41,608 --> 00:32:43,067
చివరిసారి మీరెప్పుడు మాట్లాడుకున్నారు?

473
00:32:44,027 --> 00:32:45,945
సిడ్, ఇక్కడ నువ్వు ఫోన్లో మాట్లాడకూడదు.

474
00:32:46,029 --> 00:32:48,990
మనం ఏళ్ల తరబడి హార్ట్ మన్ కి
చాలా శక్తిమంతమైన నిఘా సమాచారాన్ని అందిస్తూ వచ్చాం.

475
00:32:49,073 --> 00:32:51,284
అతను చాలా కాలంగా
ఆ అబద్ధపు జీవితాన్నే జీవిస్తూ వస్తున్నాడు.

476
00:32:51,367 --> 00:32:54,537
ఇప్పుడు అతను మారిపోయి,
ఆ అబద్ధాన్నే నమ్మడం మొదలుపెడితే,

477
00:32:54,621 --> 00:32:56,789
అది ఏజెన్సీకి మంచిది కాదు.

478
00:32:56,873 --> 00:32:58,958
అయితే, నేను అతడిని సంప్రదించి,
ఇక్కడికి తీసుకువస్తాను.

479
00:32:59,042 --> 00:33:00,793
లేదు. మీరు అతడిని అస్సలు సంప్రదించకూడదు.

480
00:33:00,877 --> 00:33:03,296
మీకు నేను సాయపడగలను. అతను నన్ను నమ్ముతాడు.

481
00:33:03,379 --> 00:33:04,839
కానీ, లాయర్ కావాల్సింది నాకే ఏమో అన్న ఫీలింగ్

482
00:33:04,923 --> 00:33:06,841
నాకు కలగడం మొదలైంది.

483
00:33:06,925 --> 00:33:08,509
లాయరును సంప్రదించడం మంచిదే.

484
00:33:08,593 --> 00:33:11,346
ఏజెన్సీ లాయరే,
ఇంకో లాయర్ ని పెట్టుకోమని నాకు చెప్తున్నాడా?

485
00:33:11,429 --> 00:33:13,473
మిస్ స్కోఫీల్డ్, మిమ్మల్ని
చెడుగా చూపాలన్నది నా ఉద్దేశం కాదు,

486
00:33:13,556 --> 00:33:15,391
కానీ ఒకసారి మా దృష్టికోణం నుండి
చూసే ప్రయత్నం చేయండి.

487
00:33:15,475 --> 00:33:16,893
తెలియని కాలర్

488
00:33:17,393 --> 00:33:19,896
- మీరు ఆ ఫోన్ ని ఎత్తాలా?
- హా, ఎత్తాలి.

489
00:33:19,979 --> 00:33:22,774
మా అక్క కాల్ చేస్తోంది, మా అమ్మకి బాగాలేదు.
కాబట్టి, నేను మాట్లాడాలి.

490
00:33:26,236 --> 00:33:27,237
అది నీ పనేనని వీళ్ళకి తెలిసిపోయింది.

491
00:33:27,320 --> 00:33:29,614
నాకు తెలుసు. వాళ్లొక టీమ్ ని పంపారు.

492
00:33:29,697 --> 00:33:31,950
ఏ టీమ్? ఎక్కడ ఉన్నావు నువ్వు? అంతా ఓకేనా?

493
00:33:32,033 --> 00:33:33,159
వాళ్ళని చంపేశా. అందరినీ.

494
00:33:33,243 --> 00:33:35,495
నీకోసం, నాకోసం ఇంకో టీమ్ ని పంపుతారు.

495
00:33:35,578 --> 00:33:38,164
చంపమని ఆదేశాలు ఇచ్చారు, సిడ్. వాళ్లకి తెలుసు.

496
00:33:38,248 --> 00:33:40,625
- మనం అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాలి.
- ఎక్కడికని వెళ్తాం?

497
00:33:40,708 --> 00:33:44,128
నేను ఖబరాస్క్ లోని అన్యా హోటల్ లో
203వ గదిలో గురువారం దిగతా. నువ్వు అక్కడికి వచ్చేయ్.

498
00:33:44,212 --> 00:33:46,548
- లీవై, కాస్త ఆగు.
- చూడు, అప్పటికల్లా నేను ఒక ప్లాన్ ఆలోచించి పెడతా.

499
00:33:46,631 --> 00:33:47,924
డబ్బులను, పాస్ పోర్టులని సిద్ధం చేసేస్తా.

500
00:33:48,007 --> 00:33:50,343
మర్చిపోకు, ఖబరాస్క్ లోని అన్యా హోటల్ కి రావాలి.

501
00:33:50,426 --> 00:33:53,012
- మనిద్దరం కలిసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోదాం.
- లేదు, లేదు. చెప్పేది విను…

502
00:33:53,096 --> 00:33:54,264
ఐ లవ్ యూ, సిడ్.

503
00:33:55,056 --> 00:33:57,559
నేను వెళ్ళాలి. జాగ్రత్త.

504
00:34:20,622 --> 00:34:21,916
దేశానికి సేవ చేస్తూ

505
00:34:21,999 --> 00:34:23,084
అమరులైన వారి జ్ఞాపకార్థం

506
00:34:38,349 --> 00:34:40,226
సైబర్ కెఫే

507
00:35:17,096 --> 00:35:19,807
నువ్వు చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవాలి.

508
00:35:19,891 --> 00:35:24,479
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినవాడితో వెళ్లిపోవడమా?
గట్టిగా నిలబడి పోరాడటమా?

509
00:35:45,416 --> 00:35:47,710
- అతనే అని పక్కానా?
- పక్కా.

510
00:35:47,794 --> 00:35:50,380
అక్కడ ఫీల్డులో ఉన్న మన అస్సెట్లు
మీ ఆదేశం కోసం ఎదురు చూస్తున్నారు.

511
00:36:08,565 --> 00:36:11,067
తర్వాతి ప్రామాణీకరణ

512
00:36:14,988 --> 00:36:16,781
- హేయ్.
- వచ్చేశావు అన్నమాట.

513
00:36:16,865 --> 00:36:19,200
నేరుగా హోటల్ కి వచ్చేసేయ్. నీకు ఒక శుభవార్త చెప్పాలి.

514
00:36:19,284 --> 00:36:20,827
నేను ఆర్కైవ్ విషయంలో భలే ప్లాన్ వేశా.

515
00:36:20,910 --> 00:36:22,453
మన రక్షణ కోసం దాన్ని ఎలా వాడవచ్చో కనిపెట్టేశా.

516
00:36:22,537 --> 00:36:25,081
ఇది ఫైల్ ని పంపించే పోర్టల్ అన్నమాట,
ఫైళ్లని ఆటోమేటిగ్గా పంపేలా ట్రిగ్గర్ చేయవచ్చు.

517
00:36:25,164 --> 00:36:28,042
ప్రతి 72 గంటలకు
కొన్ని పాస్ వర్డులని ఎంటర్ చేస్తూ ఉండాలి.

518
00:36:28,126 --> 00:36:32,422
ఎంటర్ చేయకపోయినా… మనిద్దరిలో
ఎవరికైనా ఏమైనా అయినా, ఆర్కైవ్ అందరికీ వెళ్ళిపోతుంది.

519
00:36:32,505 --> 00:36:34,173
అటార్నీ జనరల్ కి, నిఘా వ్యవహారాల కమిటీకి,

520
00:36:34,257 --> 00:36:35,592
మీడియా ప్రముఖులకు.

521
00:36:35,675 --> 00:36:37,969
- అంటే, కౌంట్ డౌన్ స్విచ్చా?
- అవును, అంతే.

522
00:36:38,052 --> 00:36:39,512
మనం క్షేమంగా ఉండాలంటే అది అవసరం, సిడ్.

523
00:36:40,138 --> 00:36:42,056
నువ్వు ఇక్కడికి రాగానే, ఇదంతా బ్రాడ్ఫర్డ్ కి చెప్పేద్దాం.

524
00:36:43,224 --> 00:36:44,726
లీవై, నన్ను క్షమించు.

525
00:36:51,733 --> 00:36:52,901
నువ్వు ఇక్కడికి రాలేదు, కదా?

526
00:36:54,360 --> 00:36:55,403
లేదు.

527
00:36:57,322 --> 00:36:58,615
ఎక్కడ ఉన్నావు?

528
00:36:58,698 --> 00:37:00,867
ప్రోటోకాల్ విషయంలో నువ్వు అన్నది నిజమే.

529
00:37:01,576 --> 00:37:04,454
- బ్రాడ్ఫర్డే అంతా నడిపిస్తోంది.
- వద్దు, సిడ్.

530
00:37:05,121 --> 00:37:06,789
అమాయకుల ప్రాణాలు పోతున్నాయి.

531
00:37:06,873 --> 00:37:09,334
నువ్వు బ్రాడ్ఫర్డ్ ని ఎదిరించలేవు.
అది నీ ప్రాణాలకే ప్రమాదం.

532
00:37:09,417 --> 00:37:10,793
నాకు మరో దారి లేదు.

533
00:37:10,877 --> 00:37:13,922
మనిద్దరం పారిపోతే, ఇద్దరి ప్రాణాలూ నిలబడతాయి.

534
00:37:14,005 --> 00:37:18,468
నేను ఉండి, దీన్ని ఎదుర్కొంటే,
కొందరి ప్రాణాలైనా నిలబడే అవకాశం ఉంది కదా.

535
00:37:19,802 --> 00:37:23,389
నా జీవితమంతా అబద్ధాల మధ్యే పెరిగాను.

536
00:37:23,473 --> 00:37:24,515
ఇంట్లో, ఆఫీసులో.

537
00:37:24,599 --> 00:37:29,938
ఈ పనిలో భాగంగా నేను రకరకాల వేషాలు వేశాను,
అసలు ఇప్పుడు నేను ఎవరనేది నాకే తెలీట్లేదు.

538
00:37:31,648 --> 00:37:32,732
కానీ…

539
00:37:34,984 --> 00:37:37,445
కానీ నిజాన్ని ఎదుర్కొని,
ఒక ఆశయం కోసం నిలబడే అవకాశం…

540
00:37:39,739 --> 00:37:41,491
ఇప్పుడు నా ముందు ఉంది.

541
00:37:42,825 --> 00:37:45,245
నేను ఈ పని చేసేది,
ఇలా చేయమని నన్ను ఆదేశించారని కాదు,

542
00:37:45,328 --> 00:37:47,121
ఇదే సరైన పని కాబట్టి.

543
00:37:47,872 --> 00:37:49,666
ఇది నా నిర్ణయం కాబట్టి.

544
00:37:49,749 --> 00:37:52,043
సిడ్నీ, నేను లేకుండా ఒక్కదానివే
నువ్వు బ్రాడ్ఫర్డ్ తో తలపడలేవు.

545
00:37:52,126 --> 00:37:54,128
ఆర్కైవ్ నా దగ్గర ఉంది, నీ దగ్గర కాదు.

546
00:37:54,212 --> 00:37:56,673
అది నీకు ఇవ్వలేను, ఎందుకంటే
నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ ఉంది.

547
00:37:56,756 --> 00:37:58,800
నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావంటే,
నేను చూస్తూ కూర్చోలేను.

548
00:37:59,384 --> 00:38:02,053
బ్రాడ్ఫర్డ్ పై యుద్ధం ప్రకటించడమంటే,
పులి నోట్లో తల పెట్టడమే అని మనిద్దరికీ తెలుసు.

549
00:38:02,136 --> 00:38:04,472
లీవై, ఈ పని నేను చేయగలను.

550
00:38:06,516 --> 00:38:08,434
అదెలా చేయవచ్చో నాకు చూపించిందే నువ్వు.

551
00:38:09,352 --> 00:38:10,979
పట్టుదలతో ఎలా సాగాలో నువ్వే నేర్పావు నాకు.

552
00:38:11,479 --> 00:38:15,149
మొత్తం అడవినే దహించేయగల సత్తా

553
00:38:15,233 --> 00:38:17,819
ఒక చిన్న అగ్గిరవ్వకి ఉంటుందని చెప్పావు.

554
00:38:18,945 --> 00:38:20,613
నేను ఆ అగ్గిరవ్వని అయి…

555
00:38:22,365 --> 00:38:24,617
బ్రాడ్ఫర్డ్ నెట్వర్క్ ని తునాతునకలు చేసేస్తా.

556
00:38:25,201 --> 00:38:28,413
నా పని అయ్యాక, నిన్ను వెతుక్కుంటూ వస్తా.

557
00:38:34,168 --> 00:38:37,547
- లీవై, ఏదైనా మాట్లాడు.
- వాళ్ళు వచ్చేశారు.

558
00:38:37,630 --> 00:38:39,757
ఎవరు? ఎవరొచ్చారు?

559
00:38:39,841 --> 00:38:42,176
ప్రత్యేక బలగాలు.
వాళ్ళవో, మనవో. ఎవరివైనా ఒకటే అనుకో.

560
00:38:42,260 --> 00:38:43,261
కౌంట్ డౌన్ రీసెట్!

561
00:38:43,344 --> 00:38:45,179
అక్కడి నుండి వెంటనే వెళ్ళిపో. వెళ్ళిపో.

562
00:38:45,263 --> 00:38:47,515
సిడ్, నాకొక మాట ఇవ్వు.

563
00:38:47,599 --> 00:38:50,310
లీవై, వాళ్లకి నువ్వు చిక్కితే, చంపేస్తారు.

564
00:38:50,393 --> 00:38:51,603
వెళ్ళిపో అక్కడి నుండి.

565
00:38:55,398 --> 00:38:57,233
వెళ్ళిపో. దయచేసి వెళ్ళిపో.

566
00:38:57,317 --> 00:38:59,986
ఈ యుద్ధంలోకి నువ్వు దూరవని నాకు మాట ఇవ్వు.

567
00:39:02,780 --> 00:39:03,781
ఐ లవ్ యూ.

568
00:39:05,491 --> 00:39:06,784
ఐ లవ్ యూ టూ.

569
00:39:11,039 --> 00:39:12,540
లీవై?

570
00:39:15,877 --> 00:39:17,045
ఆపండి.

571
00:39:20,465 --> 00:39:22,258
ఆపండి! ఆపండి!

572
00:39:59,796 --> 00:40:01,798
దీని నుండి అతను తప్పించుకోలేడు.

573
00:40:01,881 --> 00:40:03,883
వీళ్ళు ఎలా పని చేస్తారో నాకు తెలుసు.

574
00:40:03,967 --> 00:40:08,429
ఒక కోడర్ల జట్టు ఆ కౌంట్ డౌన్ స్విచ్ ని
నిర్వీర్యం చేయడానికి ఎంతో సమయం పట్టదు.

575
00:40:08,930 --> 00:40:10,807
అతడికి నరకం చూపించడానికి
అస్సెట్లు ఎదురుచూస్తూ ఉంటారు.

576
00:40:12,100 --> 00:40:13,393
రక్తం వచ్చేలా కొట్టి, చంపేస్తారు.

577
00:40:14,060 --> 00:40:16,729
- నేనతని మాటలని విని ఉండాల్సింది.
- లేదు, అందులో ఎంత రిస్క్ ఉందో అతనికి తెలుసు.

578
00:40:16,813 --> 00:40:20,692
అవును. కానీ అతని చావుకు ఒక అర్థం ఉండాలని,
దానితో ఏదైనా మారితే బాగుంటుందని కోరుకుంటాడు కదా.

579
00:40:21,442 --> 00:40:22,610
కానీ ఇప్పుడు…

580
00:40:34,789 --> 00:40:37,709
అంతేగా. అతని మరణం.

581
00:40:37,792 --> 00:40:38,793
ఏం తట్టింది?

582
00:40:38,877 --> 00:40:41,170
లీవైకి చావు తప్పదు.

583
00:40:42,714 --> 00:40:44,591
కానీ దాన్ని మనం నియంత్రించగలిగితే? ఒకవేళ…

584
00:40:45,091 --> 00:40:47,218
ఒకవేళ అతని మరణమే పరిష్కారమైతే?

585
00:40:48,136 --> 00:40:50,930
లీవై, చైనా రష్యా సరిహద్దు దగ్గర పట్టుబడ్డాడు.

586
00:40:51,014 --> 00:40:53,224
లాంగ్లీ వాళ్ళు అతడిని రహస్యంగా తీసుకెళ్తారు.

587
00:40:53,308 --> 00:40:54,309
ఎలా తీసుకెళ్తారు?

588
00:40:54,392 --> 00:40:55,643
ఒక విమానంలో తీసుకెళ్తారు.

589
00:40:55,727 --> 00:40:57,312
కానీ ఆ విమానం ల్యాండ్ అవ్వకపోతే?

590
00:40:57,395 --> 00:41:02,066
సీఐఏ వాళ్ళు ఆ కౌంట్ డౌన్ స్విచ్చును
నిర్వీర్యం చేయక ముందే, ఆ విమానం కూలిపోతే?

591
00:41:02,692 --> 00:41:04,861
అతడిని చిత్రహింసలకు గురి చేయక ముందేనా?

592
00:41:04,944 --> 00:41:09,157
హావ్లాక్ దార్లో చనిపోతే,
కౌంట్ డౌన్ స్విచ్ యాక్టివేట్ అవుతుంది,

593
00:41:09,240 --> 00:41:11,659
అప్పుడు ఆర్కైవ్ 6 చేరాల్సిన వాళ్లకి చేరుతుంది.

594
00:41:12,160 --> 00:41:14,329
బ్రాడ్ఫర్డ్ బండారం బయటపడుతుంది.

595
00:41:14,412 --> 00:41:16,789
కానీ నువ్వు ప్రేమించిన వాడు చనిపోతేనే ఇవన్నీ సాధ్యం.

596
00:41:16,873 --> 00:41:18,791
అతను చచ్చిపోయినట్టే లెక్క.

597
00:41:23,671 --> 00:41:26,799
మీ నాన్న కోసం నేను ఏమైనా చేస్తా.

598
00:41:27,884 --> 00:41:29,052
నీ కోసం కూడా.

599
00:41:30,678 --> 00:41:32,639
కాబట్టి, ఈ ప్లాన్ గురించి నాకు చెప్పు.

600
00:41:33,264 --> 00:41:36,267
కిందటేడాది, ఏజెన్సీ కోసమని, నేను, లీవై కలిసి

601
00:41:36,351 --> 00:41:37,393
హత్యకు ఓ ప్లాన్ ని రూపొందించాం.

602
00:41:37,477 --> 00:41:41,272
విమాన ప్రమాదం ముసుగులో
హత్యలకి పాల్పడవచ్చన్నది ఐడియా అన్నమాట.

603
00:41:41,356 --> 00:41:43,483
మీరు కంట్రోల్ చేయగల యాక్సిడెంట్ అన్నమాట.

604
00:41:43,566 --> 00:41:45,693
మేము ఒక కోడర్ ని సంప్రదించి,
ఒక మాల్వేర్ ని రూపొందించాం.

605
00:41:45,777 --> 00:41:48,571
ఆ ప్రోగ్రామ్, ఇంధనం లీక్ అయ్యేలా చేసి,
విమానం పేలిపోయేలా చేస్తుంది.

606
00:41:48,655 --> 00:41:50,573
అయితే, ఆ ప్లాన్ కి కావాల్సినవన్నీ సిద్ధంగానే ఉన్నాయా?

607
00:41:50,657 --> 00:41:52,408
మనం అడుగులని వేగంగా వేయాలి.

608
00:41:52,492 --> 00:41:55,495
హావ్లాక్ ని రష్యా నుండి
బయటకు తేవాలని బ్రాడ్ఫర్డ్ చూస్తుంది.

609
00:41:55,578 --> 00:42:00,458
రష్యాకి దగ్గర్లోని బేస్ పేరు, ఐల్సన్ బేస్, అది ఫెయిర్ బ్యాంక్స్
బయట ఉంటుంది. మారుమూల ఉంటుంది, సురక్షితం కూడా.

610
00:42:00,959 --> 00:42:02,544
అతడిని దేశంలోకి తీసుకొచ్చాక,

611
00:42:02,627 --> 00:42:05,296
ఎవరి దృష్టీ పడకుండా ఉండాలని
అతడిని ప్రభుత్వ రవాణా ద్వారా తరలిస్తారు.

612
00:42:05,380 --> 00:42:07,674
కార్గో విమానం ద్వారా కానీ, ఇంధన ట్యాంకర్ ద్వారా కానీ.

613
00:42:07,757 --> 00:42:10,218
అలాస్కా నుండి
అనధికార డిటెన్షన్ సెంటరుకు తరలిస్తారు.

614
00:42:10,301 --> 00:42:12,220
అంటే, అతడిని ఏమైనా చేయాలంటే,

615
00:42:12,303 --> 00:42:13,680
- ఆ పని మనం అలాస్కాలోనే చేయాలి కదా?
- హా.

616
00:42:13,763 --> 00:42:15,932
నేను లాయర్లతో చాలా బిజీగా ఉంటా,

617
00:42:16,015 --> 00:42:18,059
కాబట్టి నువ్వు సెయింట్ పీటర్స్ బర్గ్ కి వెళ్లి,

618
00:42:18,142 --> 00:42:19,727
మాల్వేర్ ని రూపొందించిన వ్యక్తిని కలవాలి.

619
00:42:20,311 --> 00:42:22,105
అతని పేరు ఆర్మెన్ జెడాంకో.

620
00:42:22,188 --> 00:42:25,775
మాల్వేర్ నీ చేతికి వచ్చాక,
విమానం ఎక్కి, దాన్ని ఫెయిర్ బ్యాంక్స్ కి తీసుకెళ్ళు.

621
00:42:25,859 --> 00:42:28,695
ఆ దేశంలోకి వెళ్ళడానికి నీకున్న
నకిలీ పాస్ పోర్టులలో ఒకదాన్ని వాడు.

622
00:42:28,778 --> 00:42:31,698
ఏ హంగామా లేకుండా ఉండే మామూలు హోటల్ లో దిగు.
నువ్వు ఉన్నావని ఎవరికీ తెలీకూడదు.

623
00:42:32,198 --> 00:42:37,203
హలో, నేనే. వచ్చేశా.
అంతా షెడ్యూల్ ప్రకారమే జరుగుతోంది.

624
00:42:37,704 --> 00:42:43,126
హావ్లాక్ అమెరికా గడ్డపై అడుగుపెట్టక ముందే
నువ్వు ఆ పనిని చేయాలి. అది ముఖ్యం.

625
00:42:43,209 --> 00:42:45,211
మనకి మహా అయితే,
ఇంకో రెండు రోజుల సమయం ఉంటుంది.

626
00:42:45,295 --> 00:42:49,215
హావ్లాక్ విమానం అలాస్కా నుండి బయలుదేరక ముందే,
నువ్వు అందులోకి మాల్వేర్ ని ఎక్కించాలి.

627
00:42:57,390 --> 00:42:58,391
యు.ఎస్. వైమానిక దళం

628
00:42:58,474 --> 00:43:01,394
నేనే. విమానం దగ్గర ఉన్నా.

629
00:43:01,477 --> 00:43:03,187
ఇప్పుడే ల్యాండ్ అయింది.

630
00:43:04,814 --> 00:43:07,942
సిడ్నీ, ఈ పని పక్కాగా చేయాలనుకుంటున్నావా?

631
00:43:18,995 --> 00:43:19,996
పక్కా.

632
00:43:20,079 --> 00:43:21,789
ఎందుకంటే, ఇది ముగిశాక…

633
00:43:22,457 --> 00:43:23,708
లీవై ఎప్పుడో చనిపోయాడు.

634
00:43:23,791 --> 00:43:26,127
అతను అనధికార డిటెన్షన్ సెంటరుకి చేరాక,
ప్రాణాలతో బయటపడటం అసంభవం.

635
00:43:28,129 --> 00:43:30,048
కానీ దీని వలన అతని మరణంతో ఒక ఆశయం నెరవేరుతుంది.

636
00:43:31,382 --> 00:43:35,553
ఒక విషయం అర్థం చేసుకోవాలి,
ధర్మాన్ని, న్యాయాన్ని నిలబెట్టడంతో పాటు,

637
00:43:36,221 --> 00:43:38,389
మితిమీరిన అధికారంతో,
అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్న

638
00:43:38,473 --> 00:43:42,894
ఒక అవినీతిపరురాలి బండారాన్ని
బయటపెట్టాలనే మనం ఈ పని చేస్తున్నాం.

639
00:43:43,686 --> 00:43:45,438
కాబట్టి, నేను నూటికి నూరు శాతం పక్కా.

640
00:43:46,523 --> 00:43:47,982
ఇది నాకు చాలా బాధ కలిగించే విషయమే.

641
00:43:48,566 --> 00:43:51,444
కానీ, నాకు ఈ విషయంలో చాలా అంటే చాలా నమ్మకం ఉంది.

642
00:43:54,906 --> 00:43:56,282
పని అయ్యాక కాల్ చేస్తాను.

643
00:44:28,189 --> 00:44:30,108
ఫ్లైట్ కంట్రోల్స్ ఇంకా పని చెయ్యట్లేదు.

644
00:44:30,191 --> 00:44:31,526
మీ మాస్టర్ ప్రోగ్రామ్ ని షట్ డౌన్ చేయండి!

645
00:44:31,609 --> 00:44:32,652
అతడిని ఇక్కడి నుండి పంపేయ్.

646
00:44:32,735 --> 00:44:34,279
మీ మల్టీ మోడ్ రిసీవర్లో లోపం ఉంది.

647
00:44:34,362 --> 00:44:35,488
అది నీకెలా తెలుసు?

648
00:44:35,572 --> 00:44:37,991
మీ కంప్యుటర్లోకి మాల్వేర్ ఎక్కించారు.

649
00:44:38,074 --> 00:44:40,493
విమానాన్ని కూల్చాలని ఓ మాల్వేర్ ని ఎక్కించారు.

650
00:44:48,835 --> 00:44:51,504
ఎయిర్ డేటా యూనిట్ కరప్ట్ అయింది.
వాటిని రీసెట్ చేయలేరు.

651
00:44:51,588 --> 00:44:53,506
సెకండరీలని డిజేబుల్ చేసి, ఫ్లైట్ కంట్రోల్స్ ని ఆఫ్ చేసేయ్.

652
00:44:53,590 --> 00:44:54,883
ఎయిర్ డేటా యూనిట్లను సైకిల్ చేస్తున్నా.

653
00:44:54,966 --> 00:44:56,926
ఆ పని చేయవద్దు. ఆఫ్ చేసేయ్. వాటిని ఆఫ్ చేసేయ్.

654
00:44:57,010 --> 00:44:59,637
మన దగ్గర ఇంకా ట్రిమ్,
డిఫరెన్షియల్ థ్రస్ట్, రడ్డర్లు ఉన్నాయి.

655
00:45:00,930 --> 00:45:02,932
ఆరు వేల అడుగులు. హోల్డ్ చేద్దాం.

656
00:45:03,016 --> 00:45:04,392
- ముందు భాగాన్ని పైకి అందాం.
- సరే.

657
00:45:04,475 --> 00:45:09,105
- మూడు వేల అడుగులు. ముందు భాగాన్ని పైకి అందాం!
- హోల్డ్ చేద్దాం!

658
00:45:09,189 --> 00:45:10,231
నేలని తాకనుంది, సిద్ధంగా ఉండాలి!

659
00:45:27,999 --> 00:45:30,710
నా పుట్టినరోజు పార్టీకి మీరు రావాలి

660
00:45:53,775 --> 00:45:54,776
ఛ.

661
00:46:00,156 --> 00:46:01,407
హాయ్, అక్కా.

662
00:46:02,659 --> 00:46:04,494
ఏంటి? లేదు.

663
00:46:05,954 --> 00:46:07,539
లేదు, నేనేం మర్చిపోలేదు.

664
00:46:08,414 --> 00:46:11,751
గిఫ్ట్ కోసమని ఒక షాప్ కి వచ్చా.

665
00:46:12,502 --> 00:46:13,503
సరే.

666
00:46:15,588 --> 00:46:18,424
దార్లో ఉన్నా. కేకు కటింగ్ మొదలయ్యే లోపు వచ్చేస్తా.

667
00:46:41,948 --> 00:46:42,949
పని అయిందా?

668
00:46:43,032 --> 00:46:44,325
మనకి ఒక సమస్య ఎదురైంది.

669
00:46:44,409 --> 00:46:47,203
మనం అనుకున్నట్టు అది కార్గో విమానం కాదు.

670
00:46:47,287 --> 00:46:50,248
అది ఖైదీలను తరలించే విమానం, అది నిండుగా ఉంది.

671
00:46:50,874 --> 00:46:52,667
నిండుగా ఉంది అంటే?

672
00:46:52,750 --> 00:46:55,211
ఖైదీలు ఉన్నారు అందులో.
నేను తప్పక ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

673
00:46:55,295 --> 00:46:58,172
మన ప్లాన్ ని ఫాలో అయిపోయి, మాల్వేర్ ని ఇన్ స్టాల్ చేసేశా.

674
00:46:58,256 --> 00:46:59,340
ఏం చేశావు?

675
00:46:59,424 --> 00:47:02,844
ఇక్కడ సమస్య ఖైదీలు కాదు, విమానం.

676
00:47:02,927 --> 00:47:06,014
విమానం అనుకున్నట్టుగా కూలిపోలేదు.

677
00:47:06,097 --> 00:47:09,809
ప్రోగ్రామింగ్ పని చేయలేదు. ఏదో జరిగింది.

678
00:47:09,893 --> 00:47:13,062
వాళ్ళు క్రాష్ ల్యాండింగ్ చేశారు.
ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు.

679
00:47:13,146 --> 00:47:15,607
కొందరికి గాయాలయ్యాయి. కొందరు చనిపోయారు.

680
00:47:15,690 --> 00:47:18,693
కానీ, బతికి బయటపడ్డ వారిలో
హావ్లాక్ ఉన్నాడా లేదా అని తెలుసుకునే వీలు నాకు దొరకలేదు.

681
00:47:19,652 --> 00:47:21,070
ఇక నేను ఉంటా మరి.

682
00:47:47,931 --> 00:47:48,932
వోడ్కా

683
00:47:57,815 --> 00:47:59,359
ఆట్వాటర్ తాలూకు ఫ్లైట్ కూలింది.

684
00:48:04,864 --> 00:48:06,533
నువ్వు స్కోఫీల్డ్ ని పిలిపించాలి.

685
00:48:06,616 --> 00:48:08,493
అది అస్సలు మంచి ఆలోచన కాదు.

686
00:48:08,576 --> 00:48:11,829
హావ్లాక్ ని తయారు చేసిందే తను.
నా దృష్టిలో ఇది తన సమస్యే.

687
00:48:11,913 --> 00:48:15,166
హావ్లాక్ ని తీసుకురావడానికి
మీరు జైళ్ల శాఖకి చెందిన విమానాన్ని పంపించారా?

688
00:48:15,250 --> 00:48:17,377
శాటిలైట్ చిత్రాలను బట్టి,
కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారని తెలుస్తోంది,

689
00:48:17,460 --> 00:48:19,504
అంటే, హావ్లాక్ తన ప్రతాపం చూపే అవకాశం ఉంది.

690
00:48:19,587 --> 00:48:21,214
ఇది మీకు సమస్యాత్మకమైన విషయమే ఏమో.

691
00:48:22,173 --> 00:48:23,424
ఇది మన సమస్య, సిడ్నీ.

692
00:48:23,508 --> 00:48:26,761
అలాస్కాలోని సూపర్వైజర్ డెప్యూటీ పేరు, ఫ్రాంక్ రెమ్నిక్.

693
00:48:26,844 --> 00:48:28,012
నా పేరు సిడ్నీ స్కోఫీల్డ్.

694
00:48:28,096 --> 00:48:30,098
నా పేరు ఫ్రాంక్.
మిస్టర్ రెమ్నిక్ అని మా నాన్నని పిలుస్తారు.

695
00:48:30,181 --> 00:48:31,558
ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోండి.

696
00:48:31,641 --> 00:48:33,685
ఇక్కడి వాళ్ళ ప్రాణాల కన్నా,

697
00:48:33,768 --> 00:48:36,312
వాళ్ళ భద్రతకన్నా
మీ రహస్యానికే మీరు ఎక్కువ ప్రాధాన్యతనిస్తే,

698
00:48:36,396 --> 00:48:37,981
నేను మీతో కలిసి పని చేయలేను.

699
00:48:39,023 --> 00:48:40,066
నా భార్య ఎక్కడ?

700
00:48:40,859 --> 00:48:42,193
కానీ నీ గురించే నా దిగులు అంతా.

701
00:48:42,277 --> 00:48:44,988
ఎందుకంటే, ఇదంతా
నీ వల్లే జరుగుతోందని నాకు అనిపిస్తోంది.

702
00:48:45,071 --> 00:48:48,199
ఎందుకంటే, నీ దగ్గర ఉన్న
ఒక రహస్యాన్ని ఇతను వాడుకున్నాడు.

703
00:48:48,283 --> 00:48:50,743
కాబట్టి, మీ వాడిని,
నేను తప్పక కనిపెడతాను, అందుకోసం,

704
00:48:50,827 --> 00:48:53,329
ఆ విమాన శిథిలాలను ఏరుకొచ్చి
మళ్ళీ దాన్ని కొత్త విమానంలా బిల్డ్ చేయడానికైనా నేను రెడీ.

705
00:48:53,413 --> 00:48:55,582
విమానాన్ని బలవంతంగా
మాన్యువల్ కంట్రోల్ లోకి తెచ్చాడు.

706
00:48:55,665 --> 00:48:56,916
అతను కంట్రోల్ లోకి తీసుకున్నాడా?

707
00:48:57,000 --> 00:48:58,209
విమానాన్ని కాపాడాడు.

708
00:48:58,293 --> 00:49:00,712
విమానంలోని వారు ఎవరైనా బతికారంటే, అది అతని వల్లే.

709
00:49:00,795 --> 00:49:02,630
నువ్వంటే నాకు ప్రాణం, లీవై.

710
00:49:02,714 --> 00:49:05,800
తను అబద్ధమాడుతోంది.
ఆ దరిద్రుడితో పడక పంచుకుంటోంది.

711
00:49:05,884 --> 00:49:07,385
అధునాతన ఫేషియల్ ఇమేజ్ సెర్చ్ చేయగా,

712
00:49:07,468 --> 00:49:09,971
ఒక మేరీల్యాండ్ న్యూస్ పేపర్ వాళ్ళ
పాత ఎడిషన్లో దొరికింది.

713
00:49:10,054 --> 00:49:12,056
మన గురించి వీళ్ళకి తెలుసా?

714
00:49:12,140 --> 00:49:13,349
అది తన పనే, హాచ్.

715
00:49:13,433 --> 00:49:14,559
విమానాన్ని కూల్చింది తనే.

716
00:49:14,642 --> 00:49:16,269
అంతా తనే నడుపుతోంది.

717
00:49:16,352 --> 00:49:18,605
దీన్నంతటికీ కారణం స్కోఫీల్డే.

718
00:49:30,533 --> 00:49:32,410
నిన్ను చంపాలన్న ఉద్దేశం మొదట నాకు లేనే లేదు.

719
00:49:35,371 --> 00:49:39,083
నువ్వు ఎలాగూ చస్తావు అనే, నేను ఆ పని చేశా.

720
00:49:40,585 --> 00:49:43,046
నీ చావు వల్ల నిజం బయటపడుతుందని నాకు తెలుసు.

721
00:49:43,129 --> 00:49:44,881
కానివ్వు. తుపాకీని కింద పడేయ్.

722
00:49:44,964 --> 00:49:48,593
నేను బ్రాడ్ఫర్డ్ ని ఆపాలి, ఆర్కైవ్ విషయం బయటపెట్టాలి.

723
00:49:49,177 --> 00:49:53,806
విషయం ఏంటంటే…
నన్ను చంపడం వల్ల ఆర్కైవ్ బయటపడదు.

724
00:49:53,890 --> 00:49:56,517
బ్రాడ్ఫర్డ్ మనుషులు కౌంట్ డౌన్ ని ఆపేశారు.

725
00:49:57,227 --> 00:49:58,353
నువ్వు అబద్ధం చెప్తున్నావు.

726
00:49:59,646 --> 00:50:01,356
నా మరణం వల్ల ఏమీ ట్రిగ్గర్ కాదు.

727
00:50:01,439 --> 00:50:03,274
నీకు ఆర్కైవ్ ని ఇవ్వగలను.

728
00:50:04,067 --> 00:50:07,153
నన్ను నమ్మకపోతే, కాల్చేసేయ్.

729
00:50:12,158 --> 00:50:13,284
జాక్వెలిన్ బ్రాడ్ఫర్డ్

730
00:50:19,207 --> 00:50:20,416
బ్రాడ్ఫర్డ్.

731
00:50:20,500 --> 00:50:22,460
కౌంట్ డౌన్ ని ఆపేశారా?

732
00:50:23,878 --> 00:50:24,963
ఎక్కడ ఉన్నావు?

733
00:50:26,214 --> 00:50:27,215
అడిగినదానికి సమాధానం చెప్పు.

734
00:50:27,799 --> 00:50:31,135
అవును, ఆ కౌంట్ డౌన్ ని నిలిపేశాం.
హావ్లాక్ కి ఇప్పుడు యాక్సెస్ లేదు.

735
00:50:31,219 --> 00:50:33,388
విమానాన్ని కూల్చింది నువ్వే అని మాకు తెలిసింది, సిడ్.

736
00:50:33,972 --> 00:50:35,515
దాన్ని నిరూపించే డ్రైవ్ మా దగ్గర ఉంది.

737
00:50:36,349 --> 00:50:39,644
నేను నీకు ఎంతో చేశాను,
దానికి మోసంతో ఋణం తీర్చుకుంటున్నావా?

738
00:50:41,187 --> 00:50:43,356
మోసం గురించి మా నాన్నని చంపిన నువ్వు
మాట్లాడుతుంటే కామెడీగా ఉంది.

739
00:50:44,315 --> 00:50:45,567
మీ నాన్న తెలివైనవాడు,

740
00:50:45,650 --> 00:50:48,069
కానీ ఎప్పుడు పక్కకు తప్పుకోవాలో
తెలుసుకునేంత తెలివి లేకుండా పోయింది అతనికి.

741
00:50:49,237 --> 00:50:50,947
అది మీ బ్లడ్డులోనే ఉన్నట్టుంది.

742
00:50:51,614 --> 00:50:53,575
నిన్ను పట్టుకోవడానికి వస్తున్నాం, సిడ్నీ.

743
00:50:59,205 --> 00:51:01,916
ఇలా ఎదురెదురుగా ఉన్నప్పుడు
కాల్చడం కాస్త కష్టంగానే ఉంది, కదా?

744
00:51:02,000 --> 00:51:04,794
నాకు ఆర్కైవ్ ని ఇవ్వగలనని
అన్నావు కదా? ఎలా ఇవ్వగలవు?

745
00:51:05,378 --> 00:51:06,462
బ్రాడ్ఫర్డ్ నాకు యాక్సెస్ తీసేసినప్పుడు,

746
00:51:06,546 --> 00:51:09,841
నేను ఆర్కైవ్ ని ఒక హార్డ్ డ్రైవ్ లోకి ఎక్కించుకున్నాను.

747
00:51:32,447 --> 00:51:34,824
ఇలా ముగియాల్సి వస్తున్నందుకు సారీ.

748
00:51:35,700 --> 00:51:36,993
నాకు కూడా మనం కలిసి ఉండాలనే ఉంది.

749
00:51:37,076 --> 00:51:40,538
ఒకవేళ ఆ అవకాశం మనకి ఉంటే?
ఈ పోరు నువ్వు ఒక్కదానివే చేయాల్సిన పని లేకపోతే?

750
00:51:40,622 --> 00:51:41,664
ఏమంటున్నావు నువ్వు?

751
00:51:41,748 --> 00:51:43,541
బ్రాడ్ఫర్డ్ నిన్ను వేటాడేస్తుంది.

752
00:51:44,626 --> 00:51:46,586
ఎక్కడికి వెళ్లినా తన నుండి నువ్వు తప్పించుకోలేవు.

753
00:52:21,412 --> 00:52:22,497
మోకాళ్ళ మీద కూర్చో.

754
00:52:24,332 --> 00:52:25,333
కూర్చో!

755
00:52:32,298 --> 00:52:34,509
ఎక్కడ ఉంది తను? చెప్పు.

756
00:52:35,093 --> 00:52:36,553
తను వెళ్లిపోయింది, ఫ్రాంక్.

757
00:53:42,368 --> 00:53:44,370
సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్

