1
00:00:22,210 --> 00:00:24,212
మిత్రులారా, నిశ్శబ్దంగా ఉండండి.

2
00:00:24,295 --> 00:00:25,421
ఒకసారి జాగ్రత్తగా వినండి.

3
00:00:26,464 --> 00:00:27,966
అటు వైపు. అక్కడ ఏదో ఉంది.

4
00:00:57,370 --> 00:01:00,248
- అయ్య బాబోయ్!
- దేవుడా.

5
00:01:01,165 --> 00:01:02,667
అతను బాగానే ఉన్నాడా?

6
00:01:04,543 --> 00:01:05,587
రండి!

7
00:01:08,089 --> 00:01:11,342
- నాకు సాయపడండి.
- అతడిని పక్కకు తిప్పు. జాగ్రత్త.

8
00:01:11,426 --> 00:01:12,719
శ్వాస ఆడుతోంది.

9
00:01:14,429 --> 00:01:15,847
డ్వేన్! నన్ను చూడు.

10
00:01:15,930 --> 00:01:18,016
మత్తు కాస్త దించుకుని, నీ స్నో మెషీన్ ని తీసుకురా.

11
00:01:18,099 --> 00:01:19,183
- వెళ్ళు!
- సరే. సరే.

12
00:01:38,077 --> 00:01:39,704
యు.ఎస్. మార్షల్

13
00:01:39,787 --> 00:01:41,873
ఫ్రాంక్ కోసం

14
00:01:56,179 --> 00:01:58,473
హేయ్, ఏం జరుగుతోంది?

15
00:01:59,557 --> 00:02:00,975
సారా కారు ఇక్కడే ఎక్కడో ఉంది.

16
00:02:02,268 --> 00:02:03,269
దాన్ని కనుగొందాం.

17
00:02:03,353 --> 00:02:05,021
అందరినీ పిలిపించు.

18
00:02:05,104 --> 00:02:06,272
సరే.

19
00:02:08,315 --> 00:02:09,399
ఓకే, అందరూ వినండి.

20
00:02:09,484 --> 00:02:12,237
పరారీలో ఉన్న మన ఖైదీ,
ఇరవై నిమిషాల క్రితం ఈ వంతెన మీదకి వచ్చాడు.

21
00:02:12,320 --> 00:02:16,741
సూర్యోదయం 9:30కి అవుతుంది,
అంటే అతనికి దాక్కోడానికి 16 గంటల సమయం ఉంది,

22
00:02:16,824 --> 00:02:19,118
ఆ తర్వాత మనం పూర్తి స్థాయిలో గాలింపు జరుపుతాం.

23
00:02:19,202 --> 00:02:21,412
కాబట్టి అతను పరారీలో ఉండగా, మనం సంసిద్ధం అవుదాం.

24
00:02:21,496 --> 00:02:22,580
డాబ్సన్, రేడియో ద్వారా

25
00:02:22,664 --> 00:02:25,333
ఈ ప్రాంతానికి, బోల్డర్ హిల్ కి మధ్యలో ఉండే
ప్రతీ ఫిషింగ్ బోటుకి ఒక హెచ్చరిక పంపు.

26
00:02:25,416 --> 00:02:27,377
నదిలో గాలింపు చేయడంలో సాయం కోసం
ఎంత మంది వస్తారో చూద్దాం.

27
00:02:27,460 --> 00:02:31,381
మీకు ఎవరికైనా చిన్న విమాన పైలట్స్
తెలిసి ఉంటే, సూర్యోదయం నుండి

28
00:02:31,464 --> 00:02:33,091
ఆరవ హైవేని తమ రన్వేగా వాడుకోవచ్చని వాళ్లకి తెలపండి.

29
00:02:33,174 --> 00:02:34,801
ఆ మార్గంలోని ట్రాఫిక్ అంతా విమానాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

30
00:02:34,884 --> 00:02:37,053
ఇంధనం ఎక్కించుకోవడం సెంట్రల్ దగ్గర జరుగుతుంది.

31
00:02:37,136 --> 00:02:40,473
ఏ ట్యాంకర్ అయినా 320 కిలోమీటర్ల పరిధిలో ఉంటే,
దాన్ని అక్కడికి పంపించే ఏర్పాట్లు చేయండి.

32
00:02:41,015 --> 00:02:42,684
మన వేట సూర్యదయం మొదలవ్వగానే ప్రారంభం అవుతుంది,

33
00:02:42,767 --> 00:02:45,270
మళ్ళీ ఎనిమిది గంటలలోపే చీకటి పడిపోతుంది,
ఆలోపు మనం పని పూర్తి చేసేయాలి.

34
00:02:45,353 --> 00:02:48,106
కాబట్టి స్నో-షూస్ కానీ, స్నో-ప్లో బళ్ళు కానీ,
స్నో మెషిన్స్ కానీ ఉంటే,

35
00:02:48,189 --> 00:02:49,899
అవి తెల్లవారే లోపు మన ముందు ఉండాలి, సరేనా?

36
00:02:49,983 --> 00:02:51,985
ఈ గాలింపు మీదే నా భార్య ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి.

37
00:03:00,076 --> 00:03:01,202
ఫెయిర్ బ్యాంక్స్ కి స్వాగతం

38
00:03:05,290 --> 00:03:06,457
సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ

39
00:04:18,071 --> 00:04:19,239
లూక్?

40
00:04:19,322 --> 00:04:20,406
ఇక్కడే ఉన్నావా?

41
00:04:29,207 --> 00:04:30,250
లూక్?

42
00:04:34,254 --> 00:04:35,421
హలో?

43
00:04:50,979 --> 00:04:52,063
నేను హేయిస్ ని, బేస్ కి కాల్ చేస్తున్నా.

44
00:04:54,357 --> 00:04:55,441
నేను హేయిస్ ని, బేస్ కి కాల్ చేస్తున్నా.

45
00:04:56,317 --> 00:04:57,318
బేస్?

46
00:04:58,069 --> 00:04:59,237
బేస్, నా మాటలు వినిపిస్తున్నాయా?

47
00:05:38,401 --> 00:05:40,737
హేయ్, ఇక్కడ టైరు గుర్తులున్నాయి.

48
00:05:40,820 --> 00:05:42,405
ఇక్కడ ఏదో ఉంది. రండి!

49
00:05:55,376 --> 00:05:57,295
#1 అమ్మ

50
00:05:58,046 --> 00:05:59,297
అబ్బా.

51
00:06:00,548 --> 00:06:03,259
కార్లో ఎవరూ లేరు.
ఈ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకొని సీల్ వేయండి.

52
00:06:03,968 --> 00:06:05,678
ఇక్కడికి కొంత మంది డెప్యూటీలని పిలిపించండి!

53
00:06:05,762 --> 00:06:07,639
ఒక్క అంగుళం కూడా వదలకుండా
వెతకండి, సరేనా? నాకొక క్లూ కావాలి.

54
00:06:07,722 --> 00:06:10,558
హాచ్, షూటర్ బ్రౌన్ కి కాల్ చేయి.
వాడికి, వాడి పిల్ల స్నేహితులకి

55
00:06:10,642 --> 00:06:12,894
ఇక్కడికి వచ్చి, ఈ దరిద్రుడిని
వెతకడంలో సాయపడమని చెప్పు.

56
00:06:56,896 --> 00:06:57,897
పద! పద!

57
00:07:24,674 --> 00:07:26,009
నీ మక్కెలు కూడా ఇరగదీయాలా?

58
00:07:26,092 --> 00:07:27,176
తేల్చుకుందాం రా, ముసలోడా.

59
00:07:32,223 --> 00:07:34,058
- వదలండి.
- అతడిని లేవనివ్వవద్దు. దొరికాడు.

60
00:07:34,142 --> 00:07:35,226
ఏంటి?

61
00:07:38,229 --> 00:07:39,314
లూక్ గురించి ఏమైనా తెలిసిందా?

62
00:07:39,397 --> 00:07:41,024
లేదు, కానీ ఒక కొత్త అప్డేట్.

63
00:07:41,107 --> 00:07:43,860
ఉదయం సరిగ్గా ఏడు గంటలు దాటాక,
బర్చ్ క్రీక్ కి దక్షిణం వైపున చేపలు పడుతూ ఉన్న

64
00:07:43,943 --> 00:07:45,695
ముగ్గురు వ్యక్తులు మన పోలీసుల కంటపడ్డారు.

65
00:07:45,778 --> 00:07:47,447
- సరే.
- వాళ్ళు స్నో మెషిన్లను నడుపుతూ ఉన్నారు.

66
00:07:47,530 --> 00:07:48,531
తాగిన మత్తులో ఉన్నారు.

67
00:07:48,615 --> 00:07:50,867
వాళ్ళతో ఒక అబ్బాయి కనిపించాడు,
వాళ్లకి ఐస్ లో కనిపించాడట.

68
00:07:50,950 --> 00:07:53,953
- అబ్బాయి అంటే?
- అబ్బాయే. పినోకియోలా అనుకో.

69
00:07:54,037 --> 00:07:55,038
ఐస్ పై ఒంటరిగా ఉన్నాడు.

70
00:07:55,121 --> 00:07:57,123
అతనికి ద్వితీయ స్థాయి
హిమఘాతము తగిలిందని వైద్యులు చెప్పారు,

71
00:07:57,207 --> 00:07:58,625
ఏదో జంతువు గోళ్ళ గుర్తులు కూడా ఉన్నాయి.

72
00:07:58,708 --> 00:07:59,918
అతని పేరు, కేలబ్.

73
00:08:19,896 --> 00:08:22,941
నీకు అది మార్ష్ మెల్లోస్ లేకుండా
ఎవరు ఇచ్చారో ఏమో కానీ, అలా తినకూడదు.

74
00:08:29,364 --> 00:08:31,699
వద్దు, వద్దు. కొద్ది సేపు వాటిని అలానే వదిలేయాలి.

75
00:08:35,203 --> 00:08:36,621
ఎందుకు వదిలేయాలి?

76
00:08:37,829 --> 00:08:40,458
అప్పుడు అవి చక్కగా, మెత్తగా అవుతాయి.

77
00:08:40,541 --> 00:08:43,378
అవి ఇంకాస్త మెత్తగా, తడిగా అవుతాయి.

78
00:08:43,461 --> 00:08:45,171
అది మీకెలా తెలుసు?

79
00:08:45,255 --> 00:08:47,423
వయస్సు పెరిగాక, కొన్ని అలా తెలిసిపోతాయి, అంతే.

80
00:08:50,134 --> 00:08:51,386
నా పేరు ఫ్రాంక్.

81
00:08:55,431 --> 00:08:56,516
నీ బూట్స్ బాగున్నాయి.

82
00:08:58,810 --> 00:09:00,061
హా, నావి పాతవి.

83
00:09:00,937 --> 00:09:02,188
అంత వెచ్చగా ఉండవు.

84
00:09:05,024 --> 00:09:06,734
ఈ ట్రిప్ కోసమని మీ అమ్మానాన్నలు తీసిచ్చారా అవి?

85
00:09:07,944 --> 00:09:09,279
అవును.

86
00:09:10,071 --> 00:09:11,197
మీ ఊరేంటి?

87
00:09:12,198 --> 00:09:13,199
న్యూయార్క్.

88
00:09:15,285 --> 00:09:16,286
న్యూయార్క్ మెట్స్ టీమ్ అభిమానివా?

89
00:09:16,369 --> 00:09:17,704
- కాదు.
- కాదా?

90
00:09:18,788 --> 00:09:21,583
నీ వయస్సెంత, తొమ్మిదేళ్లా పదేళ్లా?

91
00:09:21,666 --> 00:09:23,126
- ఎనిమిదేళ్లు.
- ఎనిమిదేళ్లా?

92
00:09:23,209 --> 00:09:25,545
- అవును.
- చూడటానికి కాస్త పెద్దోడిలా ఉన్నావు.

93
00:09:27,005 --> 00:09:28,506
నా కొడుక్కి 17 ఏళ్ళు.

94
00:09:29,549 --> 00:09:32,552
అతను నీ వయస్సులో ఉన్నపుడు,
మేము ఎప్పుడూ క్యాంపింగ్ కి వెళ్తూనే ఉండేవాళ్ళం.

95
00:09:33,595 --> 00:09:34,596
కలిసి అన్నమాట.

96
00:09:35,263 --> 00:09:36,681
నువ్వు క్యాంపింగ్ కి మీ అమ్మానాన్నలతో వచ్చావా?

97
00:09:36,764 --> 00:09:37,807
మా నాన్నతో వచ్చా.

98
00:09:37,891 --> 00:09:40,226
- మీ నాన్నతోనా? సరే. మంచిది.
- హా. నాన్నతో.

99
00:09:40,935 --> 00:09:42,103
ఇప్పుడు మీ నాన్న ఎక్కడ ఉన్నాడు?

100
00:09:45,356 --> 00:09:46,774
వాళ్ళు బందీగా తీసుకున్నారు.

101
00:09:47,567 --> 00:09:48,735
ఎవరు?

102
00:09:51,613 --> 00:09:52,822
చెడ్డ వాళ్ళు.

103
00:09:54,407 --> 00:09:55,575
వాళ్ళు గొడవ పడుతూ ఉన్నారు.

104
00:09:58,328 --> 00:10:02,332
మా నాన్న నన్ను పారిపొమ్మన్నాడు.

105
00:10:03,958 --> 00:10:06,085
నాకు పారిపోవాలని లేదు, కానీ…

106
00:10:08,922 --> 00:10:09,923
ఇప్పుడు తీసుకో.

107
00:10:15,303 --> 00:10:16,721
ఒకటి చెప్పనా?

108
00:10:18,264 --> 00:10:20,266
నాకు బాధ కానీ, భయం కానీ వేసినా,

109
00:10:22,101 --> 00:10:24,520
మార్ష్ మెల్లోలు తింటే కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది.

110
00:10:31,027 --> 00:10:32,028
ఒకటి తీసుకుంటారా?

111
00:10:33,613 --> 00:10:35,281
- తీసుకోవచ్చా?
- హా.

112
00:11:16,823 --> 00:11:18,491
నువ్వు పారిపోయి మంచి పని చేశావు.

113
00:11:20,451 --> 00:11:22,453
నువ్వు వెళ్లి సాయంగా కొంత మందిని
తీసుకొస్తావని మీ నాన్నకి తెలుసు.

114
00:11:23,580 --> 00:11:26,583
కేలబ్, మీరు క్యాంపింగ్ కి
వెళ్లిన చోటు ఏంటో నీకేమైనా గుర్తుందా?

115
00:11:28,668 --> 00:11:30,670
- తెలీదు నాకు.
- ఇంకేమైనా గుర్తుందా?

116
00:11:32,630 --> 00:11:34,591
- ఒక నది ఉంది.
- నదా?

117
00:11:34,674 --> 00:11:36,676
- సూపర్. ఇంకేమైనా గుర్తుందా?
- హా.

118
00:11:53,401 --> 00:11:54,485
ఇతను…

119
00:11:56,362 --> 00:11:58,615
మా నాన్నను బందీగా తీసుకుంది ఇతనే.

120
00:12:16,758 --> 00:12:18,968
నడుస్తూ ఉండు. నాకు కనిపించాలి.

121
00:12:29,520 --> 00:12:30,522
వణక్కం.

122
00:12:32,232 --> 00:12:33,358
నీ పేరేంటి, మిత్రమా?

123
00:12:45,370 --> 00:12:47,372
నువ్వు గాలింపు బృందంలో సభ్యుడివా?

124
00:12:50,291 --> 00:12:52,752
లేదు. క్యాంపింగ్ కోసం వచ్చా.

125
00:12:54,045 --> 00:12:56,130
తుఫాను వల్ల వెనుదిరిగి వెళ్తున్నా.

126
00:12:59,425 --> 00:13:01,052
ఇప్పుడు నువ్వు నా బందీవి అయిపోయావు.

127
00:13:01,636 --> 00:13:04,180
- తుపాకీ దించు.
- అంత సీన్ లేదు.

128
00:13:04,973 --> 00:13:07,392
హేయ్, ఒకసారి వచ్చి చూడండి. నాకొకటి కనిపిస్తోంది.

129
00:13:18,653 --> 00:13:20,238
ఏంటది?

130
00:13:26,953 --> 00:13:28,788
ఆ ముద్దొచ్చే జింకలు కనిపిస్తున్నాయా?

131
00:13:29,706 --> 00:13:31,124
అవి ఫోర్టీ మందకి చెందినవి.

132
00:13:31,207 --> 00:13:32,876
పార్కుపైన్ కారిబూ, ఇవి ఒకే జాతికి చెందినవి.

133
00:13:32,959 --> 00:13:36,379
వలస విషయానికి వస్తే, నేల మీద
సంచరించే మ్యామల్స్ లో ఇవే టాప్.

134
00:13:37,505 --> 00:13:40,091
గెర్హార్డ్, మీరు నార్తర్న్ లైట్స్ గురించి అడిగారు కదా.

135
00:13:40,174 --> 00:13:41,676
నేను చెక్ చేశా, ఈ రాత్రికి

136
00:13:41,759 --> 00:13:44,429
మనకి ఆ లైట్స్ మరింత అద్భుతంగా కనిపిస్తాయట.

137
00:13:44,512 --> 00:13:45,597
అదృష్టవంతులు మీరు.

138
00:13:46,598 --> 00:13:48,016
ఏం కనిపిస్తోంది, జ్యులిన్?

139
00:13:49,517 --> 00:13:51,853
ఇంకో బొహీమియన్ వ్యాక్స్ వింగ్ పక్షి కనిపించిందా?

140
00:14:04,657 --> 00:14:07,785
మాంటీ, డైనింగ్ కంపార్టుమెంట్లోకి రా.

141
00:14:08,453 --> 00:14:09,829
తక్షణమే.

142
00:14:23,843 --> 00:14:25,678
చెప్తున్నా కదా, ఏమీ కాదు.

143
00:14:25,762 --> 00:14:26,930
ఏమీ కాదు, అంతా సర్దుకుంటుంది.

144
00:14:36,481 --> 00:14:37,482
అయ్య బాబోయ్.

145
00:14:43,488 --> 00:14:44,489
కానివ్వు!

146
00:14:44,572 --> 00:14:45,657
అసలు ఎవరు వీళ్ళు?

147
00:14:45,740 --> 00:14:47,116
ఏమో, తెలుసుకోవాలని కూడా నాకు లేదు.

148
00:14:47,200 --> 00:14:48,493
- పద. త్వరగా పోనివ్వు.
- ఆ పని మీదే ఉన్నా.

149
00:14:48,576 --> 00:14:50,370
- అది తుపాకీయా?
- హాయ్, హలో!

150
00:14:51,996 --> 00:14:52,997
బ్రోక్!

151
00:14:58,127 --> 00:14:59,671
- అదిమి పట్టుకో.
- సరే.

152
00:15:00,547 --> 00:15:01,548
వాడు నన్ను కాల్చాడు.

153
00:15:08,012 --> 00:15:09,097
గుడ్ మార్నింగ్!

154
00:15:12,475 --> 00:15:13,518
హేయ్.

155
00:15:14,269 --> 00:15:15,687
దాన్ని పక్కకు పడేయ్.

156
00:15:19,774 --> 00:15:21,401
పక్కకు పడేయ్.

157
00:15:31,494 --> 00:15:32,495
సరే.

158
00:15:49,512 --> 00:15:52,849
మనం 24 గంటల్లోగా మార్చేయాలి,
లేదంటే అతను ఇక మనకి దొరకడు.

159
00:15:53,516 --> 00:15:57,312
క్రాల్ సెక్యూరిటీ వాళ్లకి కనుక నేను దొరికితే,
ప్రాగ్ కి నా శవం వెళ్తుంది.

160
00:15:57,395 --> 00:15:59,480
అప్పటికి, నిన్ను అందరూ మర్చిపోతారులే.

161
00:15:59,564 --> 00:16:02,066
గురువారం, నీకు పొత్తికడుపులో నొప్పి వచ్చి,
నువ్వు కాన్సులేట్ కి కాల్ చేస్తావు,

162
00:16:02,150 --> 00:16:03,151
వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేస్తారు.

163
00:16:03,234 --> 00:16:05,695
శుక్రవారం, ఎమర్జెన్సీ లాపరోటమీ సర్జరీ
కోసం నిన్ను స్వదేశానికి తీసుకెళ్తారు.

164
00:16:05,778 --> 00:16:07,614
నేను తిన్నదేదైనా తేడా చేయడం వల్ల ఇలా జరిగిందంటావా?

165
00:16:07,697 --> 00:16:09,532
సర్జరీ చేసినా నీ ప్రాణాలు నిలవవు.

166
00:16:12,452 --> 00:16:15,246
- ఇక్కడ ఇంకా ఎంత సేపు ఉంటావు?
- నా విమానానికి ఇంకా ఆరు గంటలు ఉంది.

167
00:16:16,497 --> 00:16:17,665
మనం ఓల్డ్ సిటీకి వెళ్ళాలి.

168
00:16:18,875 --> 00:16:20,084
అస్సలు వెళ్ళకూడదు.

169
00:16:20,168 --> 00:16:21,753
నువ్వు బొహీమియాకి చెందిన చారిత్రక రాజధానిలో ఉన్నావు,

170
00:16:21,836 --> 00:16:24,339
అదికూడా ఒక వారమే ప్రాణాలతో ఉండే వ్యక్తితో.

171
00:16:25,965 --> 00:16:28,801
ఈ చావబోయే వ్యక్తి ఆఖరి కోరికని మన్నించవా?

172
00:16:37,936 --> 00:16:39,354
ఒక విషయం,

173
00:16:40,605 --> 00:16:42,232
నువ్వు ఇక్కడ ఉండటం నాకు ఓకే అన్నట్టు,

174
00:16:42,315 --> 00:16:44,108
బ్యూరో వాళ్ళ దగ్గర ప్రవర్తించకు.

175
00:16:44,192 --> 00:16:46,945
నా భార్యని అపహరించిన వాడి గురించి
నీకు తెలుసు కాబట్టే, నువ్వు ఇంకా ఇక్కడ ఉన్నావు.

176
00:16:47,028 --> 00:16:49,030
తను మాకు చిక్కిన వెంటనే, నువ్వు వెళ్ళిపోవాలి.

177
00:16:51,032 --> 00:16:52,534
నీకు కోపంగా ఉందని నాకు అర్థమైంది.

178
00:16:53,451 --> 00:16:55,286
కానీ బ్యూరో వాళ్ళు మన దగ్గర రహస్యంగా ఉండకూడదు.

179
00:16:55,370 --> 00:16:56,871
అదుగో, మళ్ళీ "మన" అంటున్నావు.

180
00:16:56,955 --> 00:16:58,873
ఒకటి గుర్తుంచుకో, మనిద్దరం కలిసి పని చెయ్యట్లేదు.

181
00:16:58,957 --> 00:17:01,292
నాకు కావాల్సిన వాడు నీ పరిధిలో ఉన్నాడు.

182
00:17:01,918 --> 00:17:02,961
మన వల్ల వాళ్లకి ముప్పు ఉంది.

183
00:17:03,044 --> 00:17:04,254
ఎవరికి?

184
00:17:04,337 --> 00:17:05,504
సీఐఏ వాళ్లకి.

185
00:17:06,589 --> 00:17:10,176
ఆ జేపాట్స్ విమానాన్ని ఎందుకు మళ్లించారో
నేను తప్ప నీకెవరైనా చెప్పారా?

186
00:17:10,969 --> 00:17:13,638
హావ్లాక్ ని విమానం ఇక్కడ
ఎందుకు ఎక్కించారో ఎవరైనా చెప్పారా?

187
00:17:15,557 --> 00:17:18,685
నేను నీ అధికారాన్ని పట్టించుకోలేదని
నీకు అనిపిస్తే క్షమించు,

188
00:17:18,768 --> 00:17:21,271
కానీ మనిద్దరికీ మొత్తం విషయం చెప్పట్లేదు.

189
00:17:21,354 --> 00:17:24,023
ఫ్రాంక్, నువ్వు కమాండ్ సెంటర్ కి రావాలి.

190
00:17:24,107 --> 00:17:25,774
అబ్బాయి వాళ్ళ నాన్న గురించి మాకొక ఆధారం దొరికింది.

191
00:17:27,610 --> 00:17:28,903
నీకు సాయం చేయనివ్వు, ఫ్రాంక్.

192
00:17:28,987 --> 00:17:30,071
మనం కలిసి పని చేయట్లేదు.

193
00:17:30,864 --> 00:17:33,283
నా భార్య వచ్చాక, నువ్వు
ఎక్కడి నుండి వచ్చావో, అక్కడికే వెళ్ళిపోవాలి.

194
00:17:33,950 --> 00:17:35,034
వస్తున్నా.

195
00:17:40,290 --> 00:17:42,125
అల్యెస్కా అడ్వెంచర్స్ నుండి ఒక సందేశం అందింది.

196
00:17:42,208 --> 00:17:45,211
వాళ్ల బండి ఒకటి, ఆరు రోజుల
ఆర్కిటిక్ సర్కిల్ టూర్లో భాగంగా,

197
00:17:45,295 --> 00:17:47,881
విమానం కూలిన చోటుకు
ఎనిమిది కిలోమీటర్ల రేడియస్ లోకి వచ్చిందట.

198
00:17:47,964 --> 00:17:49,841
ఒక గంట క్రితం ఆ బండికి,
వీళ్ళకి రేడియో కమ్యూనికేషన్ కట్ అయిందట.

199
00:17:52,093 --> 00:17:53,136
ఏంటిది?

200
00:17:53,219 --> 00:17:54,679
దాన్ని టండ్రా బగ్గీ అని అంటారు.

201
00:17:54,762 --> 00:17:56,764
ఒక స్థానిక ఎక్విప్మెంట్ ప్రొవైడర్
దాన్ని ఉత్తరం వైపు యాత్రల కోసం,

202
00:17:56,848 --> 00:17:59,851
అంటే కారీబూ మందలు, వన్య ప్రాణులు,
నార్తర్న్ లైట్స్ వంటి వాటిని చూడటానికి ఇస్తుంటాడు.

203
00:17:59,934 --> 00:18:01,853
అందులో ప్రయాణించే ఓ వ్యక్తి చెల్లి కూడా
ఈ యాత్రలో భాగం కావాల్సింది,

204
00:18:01,936 --> 00:18:03,605
కానీ ఆరోగ్యం బాగాలేకపోవడంతో, రాలేదు.

205
00:18:03,688 --> 00:18:05,273
వాళ్ళ సెల్ ఫోన్ల ఖాతా ఒకటే.

206
00:18:05,356 --> 00:18:07,942
ఆమె కెమెరా నుండి 40 నిమిషాల క్రితం
ఈ ఫోటోలు అప్ లోడ్ అయ్యాయి.

207
00:18:08,026 --> 00:18:10,486
అదృష్టవశాత్తూ, ఆమె
ఫెయిర్ బ్యాంక్స్ పోలీసు శాఖకి కాల్ చేసింది.

208
00:18:10,570 --> 00:18:13,406
- ప్యాసింజర్ల లిస్ట్ వచ్చిందా?
- ప్యాసింజర్లు, సిబ్బంది మొత్తం 21 మంది ఉన్నారు.

209
00:18:13,489 --> 00:18:14,657
అంటే, 21 మంది బందీలు.

210
00:18:15,241 --> 00:18:16,242
ఇదుగో లిస్ట్.

211
00:18:16,326 --> 00:18:19,329
ఆ అబ్బాయి, ఇతను వాళ్ళ నాన్న
అని చెప్పాడు. పేరు, శామ్ బేకర్ అట.

212
00:18:19,412 --> 00:18:20,788
ఇంకా అతని కుటుంబాన్ని సంప్రదించే పనిలో ఉన్నాం.

213
00:18:20,872 --> 00:18:23,166
- మిగతా వాళ్ళు ఎవరు?
- ఆ బండోడి పేరు, అర్జెంటో వోల్పే.

214
00:18:23,249 --> 00:18:27,003
అతను మాఫియా డాన్ కి రైట్ హ్యాండ్. వ్యభిచారం,
మానవ అక్రమ రవాణాల్లో ఆరు కేసులకు జైలు పాలయ్యాడు.

215
00:18:27,086 --> 00:18:29,339
అతని వెనుకనున్న వాడి పేరు, ఎడ్వర్డ్ పోర్టర్.

216
00:18:29,422 --> 00:18:30,423
రేనోకి చెందిన మెజీషియన్,

217
00:18:30,506 --> 00:18:32,342
ఒక ప్రదర్శన ఇచ్చేటప్పుడు
అతని అసిస్టెంట్ నీట మునిగి చనిపోయింది.

218
00:18:32,425 --> 00:18:34,510
ఆమె అతని భార్య కూడా. ఆ సమయంలో
ఆమెకి వేరొకరితో సంబంధం ఉండిందట.

219
00:18:34,594 --> 00:18:35,595
క్రూరమైన హత్యకు శిక్ష పడింది.

220
00:18:35,678 --> 00:18:37,430
ఇతని పేరు స్పెన్సర్ టాడ్ కొవింగ్టన్.

221
00:18:37,513 --> 00:18:39,557
దేశీయ ఉగ్రవాది.
ఎన్ కౌంటర్లో ఇద్దరు మార్షళ్ళని చంపేశాడు.

222
00:18:39,641 --> 00:18:41,059
ఈ ఫోటోలు ఎక్కడివి నీకు?

223
00:18:41,142 --> 00:18:42,936
అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ ఉందా?

224
00:18:43,019 --> 00:18:46,814
అక్కడ శాటిలైట్ ఆధారిత వై-ఫై హాట్ స్పాట్ ఉంది.
సిగ్నల్ అప్పుడప్పుడూ సరిగ్గా ఉండదు కానీ, ఓకే.

225
00:18:46,898 --> 00:18:47,899
అతను అక్కడ ఉన్నాడు.

226
00:18:48,775 --> 00:18:49,859
హావ్లాక్ ఉన్నాడు అక్కడ.

227
00:18:49,943 --> 00:18:51,444
ఓకే, ఎక్విప్ మెంట్ ప్రొవైడర్స్ ని సంప్రదిద్దాం.

228
00:18:51,528 --> 00:18:54,447
డ్రైవర్ ని కాంటాక్ట్ చేయలేకపోతే,
కనీసం వాళ్ళ సిగ్నల్ ని అయినా ట్రేస్ చేద్దాం.

229
00:18:54,531 --> 00:18:57,617
హాచ్ నువ్వు ఫోర్ట్ యుకాన్ పోలీసులతో కలిసి పని చేయి.

230
00:18:57,700 --> 00:19:00,245
ఈ బందీలను మనం క్లోజప్ లో
చూసే అవకాశం ఉందేమో ప్రయత్నించు.

231
00:19:00,328 --> 00:19:02,372
మిత్రులారా, వీళ్ళు భూమ్మీద
ఓ మారుమూల ప్రదేశంలో ఉన్నారు.

232
00:19:02,455 --> 00:19:05,291
వాళ్ళకది తెలిస్తే, పరిస్థితి
మరింత భయంకరంగా తయారవుతుంది.

233
00:19:17,762 --> 00:19:20,348
ఒక్క నిమిషం. మీరు ఎక్కడ వేటాడుతూ ఉన్నారు?

234
00:19:23,184 --> 00:19:24,519
నాకు తెలీదు.

235
00:19:25,270 --> 00:19:26,813
కానీ దగ్గర్లో ఒక కాలువ ఉంది కదా.

236
00:19:26,896 --> 00:19:28,773
అది సన్న కాలువ.

237
00:19:28,857 --> 00:19:31,985
లోయ అడుగున ఉంది.

238
00:19:32,861 --> 00:19:34,279
మరి మీ మిత్రుల సంగతేంటి?

239
00:19:35,029 --> 00:19:36,364
తుఫాను వల్ల వాళ్ళు మీకు దూరమయ్యారా?

240
00:19:38,700 --> 00:19:40,159
నా మెదడు…

241
00:19:41,536 --> 00:19:43,037
సరిగ్గా పని చేయట్లేదు.

242
00:19:43,663 --> 00:19:44,998
నాకు ఏమీ తెలీట్లేదు.

243
00:19:45,707 --> 00:19:47,333
మీరు బతికి ఉన్నారంటే అదృష్టమే.

244
00:19:49,377 --> 00:19:51,462
- ఎక్కడికి వెళ్తున్నావు?
- మరిన్ని కట్టెలు తీసుకురావడానికి.

245
00:20:16,946 --> 00:20:18,281
ఇంతకీ నేనెక్కడ ఉన్నాను?

246
00:20:19,199 --> 00:20:20,450
మింటో దగ్గర.

247
00:20:23,620 --> 00:20:24,704
అలాస్కాలో.

248
00:20:27,832 --> 00:20:29,459
అలాస్కాకి రావడం గుర్తు లేదా మీకు?

249
00:20:31,794 --> 00:20:33,963
దురదృష్టం నా వెంటే ఉంది అనుకుంటా.

250
00:20:34,672 --> 00:20:36,507
హా, నాకు కూడా అప్పుడప్పుడూ అలానే అనిపిస్తుంది.

251
00:20:39,010 --> 00:20:42,013
ఇంకొన్నిసార్లు అయితే, ఏదేమైనా,
పరిస్థితులు ఇంతే, మార్చలేమని అనిపిస్తూ ఉంటుంది.

252
00:20:42,639 --> 00:20:44,057
అంటే?

253
00:20:45,391 --> 00:20:46,643
మా అమ్మానాన్నలనే తీసుకుందాం.

254
00:20:48,019 --> 00:20:50,021
వాళ్ళు అన్నీ సరిచేసేయగలరని అనుకుంటూ ఉంటారు.

255
00:20:52,565 --> 00:20:55,068
- బహుశా వాళ్ళు తెలివైన వాళ్లేమో.
- ఏమో.

256
00:20:56,778 --> 00:20:58,863
జనాలని బాగు చేయడం మా అమ్మ డ్యూటీ.

257
00:20:59,531 --> 00:21:01,032
ఆమె నర్సు.

258
00:21:01,950 --> 00:21:05,703
మా నాన్న ఎప్పుడూ నన్ను కాపాడాలని చూస్తుంటాడు.

259
00:21:07,830 --> 00:21:09,415
అతను ఏ పని చేస్తుంటాడు?

260
00:21:09,499 --> 00:21:10,917
అతను మార్షల్.

261
00:21:11,000 --> 00:21:12,293
పోలీసు లాగా అన్నమాట.

262
00:21:13,670 --> 00:21:14,754
ఏదేమైనా.

263
00:21:16,256 --> 00:21:18,508
వాళ్ళు నన్ను కాపాడాలనే చూస్తుంటారు ఎప్పుడూ.

264
00:21:18,591 --> 00:21:20,009
నన్ను భద్రంగా ఉంచాలని అన్నమాట.

265
00:21:21,302 --> 00:21:23,137
కానీ ప్రపంచం ఉండటమే దారుణంగా ఉన్నట్టు,

266
00:21:24,556 --> 00:21:26,558
ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది.

267
00:21:28,476 --> 00:21:31,104
మనం నియమాలని ఎంత ఫాలో అయినా,
ప్రమాదాలను ఎంతలా నివారించుకున్నా,

268
00:21:31,187 --> 00:21:34,023
పెద్ద తేడా ఏమీ ఉండదని అనిపిస్తూ ఉంటుంది.

269
00:21:36,276 --> 00:21:38,361
జరిగే దారుణాలు జరుగుతూనే ఉంటాయనుకుంటా.

270
00:21:41,573 --> 00:21:43,241
నువ్వన్నది నిజమే అనుకుంటా.

271
00:22:12,520 --> 00:22:14,689
యు.ఎస్. మార్షల్

272
00:22:22,739 --> 00:22:24,574
రొమెరో, ఐసాక్

273
00:22:38,963 --> 00:22:41,633
మీ నాన్నని కనిపెట్టడానికి
మేము మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం, సరేనా?

274
00:22:42,467 --> 00:22:43,718
కానీ దానికి ఒకట్రెండు రోజులు పట్టవచ్చు,

275
00:22:43,801 --> 00:22:48,556
అంటే, ఆలోపు నువ్వు ఈ ఊర్లో
ఒక కుటుంబం దగ్గర ఉండాలని అర్థం.

276
00:22:49,766 --> 00:22:52,227
కానీ అలా ఉండాల్సి వస్తుందని
నీకు ముందే తెలుసు, కదా?

277
00:22:54,562 --> 00:22:56,064
ఎందుకలా అనుకుంటున్నారు?

278
00:22:58,149 --> 00:22:59,359
నొప్పిగా ఉంటుంది కాబట్టి.

279
00:23:00,568 --> 00:23:01,945
నా గడ్డం కూడా నొప్పిగా ఉంది.

280
00:23:02,654 --> 00:23:03,655
అవునా?

281
00:23:04,614 --> 00:23:05,698
నొప్పిగానే ఉంటుందిలే.

282
00:23:08,117 --> 00:23:09,869
మీ మోకాలికి గాయం ఎలా అయింది?

283
00:23:14,999 --> 00:23:16,251
ఒక పిచ్చి పని చేసేటప్పుడు.

284
00:23:17,710 --> 00:23:19,379
నేను చేయకూడని పిచ్చి పని చేసేటప్పుడు అన్నమాట.

285
00:23:21,506 --> 00:23:23,508
దాని వల్ల నేను చావు అంచుల దాకా వెళ్ళొచ్చా.

286
00:23:23,591 --> 00:23:24,842
- చావు అంచుల దాకానా?
- హా.

287
00:23:26,719 --> 00:23:31,641
ఇప్పుడు నాకు ఇక్కడ నొప్పి పుట్టినా,
లేదా నా పాత గాయాలని చూసినా…

288
00:23:33,685 --> 00:23:36,437
నేను ప్రాణాలతో ఉన్నానంటే
అది అదృష్టమే అని అనిపిస్తూ ఉంటుంది.

289
00:23:37,105 --> 00:23:38,940
నాకు కూడా ఒక మచ్చ ఏర్పడుతుంది అంటారా?

290
00:23:39,649 --> 00:23:41,192
అదృష్టముంటే, ఏర్పడుతుంది.

291
00:23:41,943 --> 00:23:42,944
హా.

292
00:23:45,947 --> 00:23:47,115
సారా ఆచూకీ కనిపెట్టేశాం అనుకుంటా.

293
00:23:56,165 --> 00:23:57,166
నేను పైకి వెళ్తా.

294
00:24:03,006 --> 00:24:04,007
ఫ్రాంక్!

295
00:24:10,054 --> 00:24:11,598
పైకి రా! ప్రమాదమేమీ లేదు!

296
00:24:15,810 --> 00:24:17,145
- నువ్వు బాగానే ఉన్నావా?
- బాగానే ఉన్నా.

297
00:24:17,228 --> 00:24:19,314
- ఏం పర్వాలేదా?
- ఏం పర్వాలేదు.

298
00:24:36,122 --> 00:24:39,918
చెప్పా కదా. బాగానే ఉన్నాను.
నేను ఆసుపత్రికి వెళ్లాల్సిన పని లేదు.

299
00:24:40,001 --> 00:24:43,087
బంగారం, నేను బాధపడకూడదనే
ఇలా ప్రవర్తిస్తూ, పెద్దగా ఏమీ జరగలేదన్నట్టు

300
00:24:43,171 --> 00:24:45,048
బిల్డప్ ఇస్తూ ఉంటే కనుక,
నాకేం నమ్మకం కుదరట్లేదని తెలుసుకో.

301
00:24:45,131 --> 00:24:46,758
డిస్ లొకేట్ అయి యథాస్థానానికి
వచ్చేసిన భుజానికి చికిత్స ఎందుకు!

302
00:24:46,841 --> 00:24:48,843
నాకేమీ… నేను బాగానే ఉన్నా. థ్యాంక్యూ. నేనేం…

303
00:24:48,927 --> 00:24:51,512
నేనేం వీరనారిలా ఫీల్ అవ్వట్లేదు.
బాగానే ఉన్నా. నాకేం కాలేదు.

304
00:24:51,596 --> 00:24:54,140
సరేనా? నా ఒంట్లో
నీరు తక్కువ అయి ఉండవచ్చు, అంతే.

305
00:24:54,224 --> 00:24:55,850
కిమ్, నాకు ఓ బనానా బ్యాగ్ ఇస్తావా?

306
00:24:55,934 --> 00:24:57,143
- సరే.
- థ్యాంక్యూ.

307
00:24:57,852 --> 00:24:59,479
ఎక్స్ క్యూజ్ మీ. మిస్ రెమ్నిక్?

308
00:24:59,562 --> 00:25:01,356
- ఇప్పుడు కాదు.
- నా పేరు, సిడ్నీ స్కోఫీల్డ్.

309
00:25:01,439 --> 00:25:03,233
జరిగిన దాని గురించి మీతో కొంచెం మాట్లాడాలి.

310
00:25:03,316 --> 00:25:04,734
నువ్వు ఇక్కడికి రాకూడదు.

311
00:25:04,817 --> 00:25:06,861
- నిన్ను అపహరించిన వ్యక్తి గురించి మాట్లాడాలి.
- హాచ్, తనని తీసుకెళ్ళిపో.

312
00:25:06,945 --> 00:25:09,280
- తనని ఇక్కడి నుండి తీసుకెళ్ళిపో.
- పదండి. వెళ్లిపోండి.

313
00:25:12,367 --> 00:25:13,535
నన్ను క్షమించు, సరేనా?

314
00:25:15,119 --> 00:25:16,746
లూక్ ఎలా ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడా?

315
00:25:18,289 --> 00:25:19,624
లూక్ క్యాబిన్లో ఉన్నాడు.

316
00:25:19,707 --> 00:25:22,418
- అంతా ఓకేనా?
- మన మన్మథుడు, హోంకమింగ్ ఈవెంట్ కి డుమ్మా కొట్టాడు.

317
00:25:22,502 --> 00:25:25,004
అక్కడికి కీరా మూర్ ని తీసుకెళ్లాడు.
వెళ్తూ ఉండగా, మంచులో కారు ఇరుక్కుపోయింది.

318
00:25:25,088 --> 00:25:27,549
పర్వాలేదులే. వాళ్లిద్దరినీ తీసుకురావడానికి
క్లింట్ హేయిస్ అక్కడికి వెళ్ళాడు.

319
00:25:27,632 --> 00:25:29,425
- అది సరే, కానీ వాడు బానే ఉన్నాడా?
- బానే ఉన్నాడు.

320
00:25:30,009 --> 00:25:31,553
ఈ పరిస్థితి గురించి వాడికేమీ తెలీదు.

321
00:25:34,264 --> 00:25:36,724
- సారా…
- మీరందరూ కాస్త ఆగండి.

322
00:25:36,808 --> 00:25:38,268
నాపై అతిగా దృష్టి పెట్టడం ఆపండి, సరేనా?

323
00:25:38,351 --> 00:25:40,770
నాకు ఐవీల సంగతి…

324
00:25:40,853 --> 00:25:43,273
నువ్వు పుట్టక ముందు నుండి తెలుసు. థ్యాంక్యూ.

325
00:25:45,024 --> 00:25:46,609
సరే, హేయ్, హేయ్, హేయ్.

326
00:25:46,693 --> 00:25:48,695
కానివ్వు. ఇలా రా. ఇలా రా.

327
00:25:54,951 --> 00:25:56,077
నాకు ఇది దొరికింది.

328
00:26:01,457 --> 00:26:02,792
నేను ఎప్పట్నుంచో అనుకుంటున్నా.

329
00:26:04,294 --> 00:26:07,297
ఈ నకిలీ వజ్రాన్ని పడేసి
అసలైన వజ్రాన్ని కొనాల్సిన సమయం వచ్చేసిందని.

330
00:26:09,841 --> 00:26:14,178
ఫ్రాంక్ రెమ్నిక్, 17 ఏళ్ల క్రితం నేనేం చెప్పాను?

331
00:26:15,597 --> 00:26:18,016
ఆ ఉంగరం గురించి నువ్వు నన్ను
మొదటిసారి అడిగినప్పుడు, నేనేం అన్నాను?

332
00:26:19,684 --> 00:26:20,768
నువ్వు…

333
00:26:22,896 --> 00:26:24,731
నీకు వజ్రం అక్కర్లేదని అన్నావు.

334
00:26:24,814 --> 00:26:26,149
అవును.

335
00:26:26,232 --> 00:26:27,567
నీకు కావాల్సింది నేనేనని అన్నావు.

336
00:26:27,650 --> 00:26:33,865
ఉదయం లేవగానే మొదటగా నువ్వు కనబడాలని,

337
00:26:34,741 --> 00:26:36,576
పడుకునే ముందు ఆఖరిగా నువ్వే కనబడాలని అన్నా.

338
00:26:41,080 --> 00:26:42,498
నువ్వే నాకు అన్నీ.

339
00:26:49,547 --> 00:26:51,966
తనని నేను మర్చిపోలేకపోతున్నా.

340
00:27:06,898 --> 00:27:10,485
మళ్లీ నీకు ఈ పరిస్థితిని
తీసుకొచ్చినందుకు చాలా బాధగా ఉంది.

341
00:27:12,862 --> 00:27:14,322
నాకు తెలుసు నీకు బాధగా ఉందని.

342
00:27:14,405 --> 00:27:15,406
నాకు తెలుసు.

343
00:27:16,866 --> 00:27:18,201
కానీ మనం లూక్ ని ఇంటికి తీసుకొచ్చుకోవాలి.

344
00:27:18,284 --> 00:27:20,703
మన కుటుంబం అంతా మళ్ళీ ఒకచోటికి చేరుకోవాలి.

345
00:27:21,412 --> 00:27:23,498
ఇక మిగతాది… మిగతా సంగతి మళ్ళీ చూసుకోవచ్చు.

346
00:27:30,838 --> 00:27:32,924
నీకేమీ కాలేదు, అది చాలు నాకు.

347
00:27:34,551 --> 00:27:37,011
ఆర్కిటిక్ టూ, మొబైల్ కమాండ్ నుండి
మాట్లాడుతున్నా. నా మాటలు వినిపిస్తున్నాయా?

348
00:27:40,890 --> 00:27:42,350
ఆర్కిటిక్ టూ, మొబైల్ కమాండ్ నుండి మాట్లాడుతున్నా.

349
00:27:44,477 --> 00:27:45,645
ఆర్కిటిక్ టూ, నా మాటలు వినిపిస్తున్నాయా?

350
00:27:50,400 --> 00:27:51,985
ఆర్కిటిక్ టూ, మొబైల్ కమాండ్ నుండి మాట్లాడుతున్నా.

351
00:27:52,527 --> 00:27:53,653
ఆర్కిటిక్ టూ, నా మాటలు వినిపిస్తున్నాయా?

352
00:27:59,951 --> 00:28:01,411
ఆర్కిటిక్ టూ, మొబైల్ కమాండ్ నుండి మాట్లాడుతున్నా.

353
00:28:01,995 --> 00:28:03,288
ఆర్కిటిక్ టూ, నా మాటలు వినిపిస్తున్నాయా?

354
00:28:03,371 --> 00:28:04,747
బండిని ఆఫ్ చేసేయ్.

355
00:28:04,831 --> 00:28:06,499
ఆఫ్ చేసేయ్! ఇప్పుడే ఆఫ్ చేసేయ్!

356
00:28:10,545 --> 00:28:12,130
పైకి లే. త్వరగా.

357
00:28:12,213 --> 00:28:14,132
లే. పద. పద. లే త్వరగా!

358
00:28:15,049 --> 00:28:16,050
పద.

359
00:28:25,977 --> 00:28:27,061
ఇక నోరు తెరువు.

360
00:28:27,645 --> 00:28:28,980
ఎవరు నువ్వు?

361
00:28:32,025 --> 00:28:33,026
హేయ్.

362
00:28:33,109 --> 00:28:34,485
ఏం జరుగుతోంది?

363
00:28:34,569 --> 00:28:36,613
ఎఫ్.బీ.ఐ వాళ్ళు రేడియోలో
ఈ బండి కోసం వెతుకుతూ ఉన్నారు,

364
00:28:36,696 --> 00:28:39,240
ఈ బండి మిస్ అయిందని తెలిసే
అవకాశం లేక ముందు నుండే వెతుకుతున్నారు.

365
00:28:40,325 --> 00:28:41,951
ఇతని వల్లే అని నాకు అనిపిస్తోంది.

366
00:28:42,035 --> 00:28:44,329
- ఎవరతను?
- మన విమానంలోని వ్యక్తే.

367
00:28:44,412 --> 00:28:47,040
కళ్ళకి ముసుగు, ఒంటి నిండా
సంకెళ్లు ఉన్న వ్యక్తి ఇతనే.

368
00:28:48,917 --> 00:28:50,460
మాట్లాడు, మేధావి.

369
00:28:51,127 --> 00:28:53,087
ఎందుకు నీకు అన్ని సంకెళ్లు వేశారు?

370
00:28:54,255 --> 00:28:55,256
పెద్ద పిస్తావా నువ్వు?

371
00:28:55,340 --> 00:28:56,341
పెంటగన్/నెట్ మెయిన్ ఫ్రేమ్
ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్

372
00:29:10,146 --> 00:29:12,148
చచ్చావురా నా చేతిలో!

373
00:29:30,583 --> 00:29:31,626
శాంతించు.

374
00:29:32,335 --> 00:29:33,753
ఇప్పుడు నువ్వే నాయకుడివి.

375
00:29:41,636 --> 00:29:44,055
ఎఫ్.బీ.ఐ

376
00:29:44,138 --> 00:29:46,891
వాళ్ళు ఆధారాలని తీసుకెళ్తున్నారు.
ఇంకా నిర్ధారణకు రాని వాటిని కూడా.

377
00:29:46,975 --> 00:29:49,477
- నేను చెప్పేది ఆలకిస్తున్నావా?
- ఫోన్ చేయి. నీ పలుకుబడిని వాడు.

378
00:29:49,561 --> 00:29:54,566
బ్యూరో వాళ్ళు నిఘా సమాచారాన్ని పంచుకుంటేనే హావ్లాక్ ని
పట్టుకోవడం వీలవుతుందని ఓడీఎన్ఐ వాళ్లకి చెప్పు.

379
00:29:54,649 --> 00:29:57,485
సిడ్, వాళ్ళు విచారణ ఆపేస్తున్నారు. అంతా ముగిసింది.

380
00:29:57,569 --> 00:29:58,862
న్యాయవాదులు మాట్లాడాలనుకుంటున్నారు.

381
00:29:58,945 --> 00:30:00,071
నేను అక్కడికి రావట్లేదు.

382
00:30:00,154 --> 00:30:01,739
సిడ్నీ, మీ కాల్ రికార్డులు మా దగ్గర ఉన్నాయి.

383
00:30:01,823 --> 00:30:04,242
హావ్లాక్, ప్యారిస్ లో మన జట్టుని
వదిలేసి వెళ్లిపోయే ముందు,

384
00:30:04,325 --> 00:30:05,910
ఒక బర్నర్ ఫోన్ నుండి

385
00:30:05,994 --> 00:30:07,620
- నీకొక కాల్ వచ్చిందని మాకు తెలుసు.
- అయితే?

386
00:30:07,704 --> 00:30:08,913
నువ్వు అతడిని హెచ్చరించావా?

387
00:30:08,997 --> 00:30:10,582
ఏంటి? లేదు. నేను హావ్లాక్ తో మాట్లాడనే…

388
00:30:10,665 --> 00:30:12,876
- మీరిద్దరూ టచ్ లో ఉన్నారా?
- లేదని చెప్పా కదా.

389
00:30:12,959 --> 00:30:15,420
నిన్ను నమ్మే ఏకైక వ్యక్తిని నేనే.

390
00:30:15,503 --> 00:30:17,630
కానీ ఒకటి మాత్రం నిజం,

391
00:30:17,714 --> 00:30:20,884
నువ్వు హావ్లాక్ కి సాయపడలేదు అన్నది
నిజమని అనిపించట్లేదు.

392
00:30:20,967 --> 00:30:23,261
నువ్వు ఇక్కడికి రావాలి, సిడ్.
వచ్చి, ప్రశ్నలకు సమాధానం ఇవ్వు.

393
00:30:23,344 --> 00:30:24,679
ఏం దాస్తున్నావు నువ్వు?

394
00:30:24,762 --> 00:30:27,056
- బ్యూరో వాళ్ళు ఆధారాలను ఎందుకు తీసుకెళ్తున్నారు?
- మీ నాన్న కోసమైనా రా.

395
00:30:27,140 --> 00:30:28,141
ఆయన సృష్టించిన లెగసీని,

396
00:30:28,224 --> 00:30:30,435
ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని నువ్వు కాలరాస్తున్నావు.

397
00:30:30,518 --> 00:30:31,936
నేను జైలుకు వెళ్లకుండా ఉండాలంటే,

398
00:30:32,020 --> 00:30:34,314
అక్కడికి హావ్లాక్ ని తీసుకురావడం తప్ప మరో దారి లేదని

399
00:30:34,397 --> 00:30:37,066
మా నాన్న అర్థం చేసుకుంటాడు.

400
00:30:40,445 --> 00:30:41,696
నీతో ఒక నిమిషం మాట్లాడొచ్చా?

401
00:30:45,283 --> 00:30:48,161
జరిగిన దాన్ని గుర్తు తెచ్చుకోండి.
ఇంటి నుండి అటకకు షిఫ్ట్ అయిన తర్వాత,

402
00:30:48,244 --> 00:30:49,621
అతనేం ప్రింట్ చేశాడు?

403
00:30:50,705 --> 00:30:51,831
నంబర్లను.

404
00:30:51,915 --> 00:30:53,374
బ్యాంక్ కి చెందినవా?

405
00:30:53,458 --> 00:30:56,002
కావచ్చు. నాకు సరిగ్గా కనిపించలేదు.

406
00:30:56,085 --> 00:30:57,670
సరే. అతను వెళ్లిపోయే ముందు,

407
00:30:57,754 --> 00:31:01,591
నీకేమైనా ఇచ్చాడా? ఇది చాలా ముఖ్యమైనది.

408
00:31:01,674 --> 00:31:02,967
ఏమైనా సూచనలని కానీ.

409
00:31:03,051 --> 00:31:04,385
ఏదైనా సందేశాన్ని కానీ.

410
00:31:04,469 --> 00:31:05,470
లేదు.

411
00:31:05,553 --> 00:31:07,222
ఫ్రాంక్ కి ఏమైనా చెప్పమన్నాడా?

412
00:31:07,305 --> 00:31:08,431
కాస్త ఆగుతారా?

413
00:31:09,307 --> 00:31:10,683
తప్పకుండా.

414
00:31:10,767 --> 00:31:11,851
నేను సూటిగా చెప్పేస్తున్నా.

415
00:31:11,935 --> 00:31:15,647
నేను ఇక్కడికి మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి రాలేదు.

416
00:31:15,730 --> 00:31:17,524
మిమ్మల్ని ప్రశ్నలు అడగడానికి వచ్చా.

417
00:31:19,234 --> 00:31:20,610
సరే.

418
00:31:21,319 --> 00:31:22,695
మమ్మల్నే ఎందుకు?

419
00:31:22,779 --> 00:31:24,405
నాకు అర్థం కాలేదు.

420
00:31:24,489 --> 00:31:26,574
అతను మా ఇంట్లో ఉన్నప్పుడు,

421
00:31:28,201 --> 00:31:30,537
ఏదో నోట్ చేసుకుంటున్నట్టుగా అనిపించింది.

422
00:31:30,620 --> 00:31:34,290
నా భర్త గురించి, మా జీవితాల గురించి,
మేమెవరం, మేమెలా జీవిస్తున్నాం అనే దాని గురించి.

423
00:31:34,374 --> 00:31:38,753
మా గురించిన సమాచారాన్నంతా
అతను ఎక్కించుకుంటున్నట్టు అనిపించింది.

424
00:31:39,712 --> 00:31:43,216
మీ భర్త గురించి పూర్తిగా తెలుసుకోవాలని
హావ్లాక్ ప్రయత్నిస్తున్నాడు అనుకుంటా,

425
00:31:44,217 --> 00:31:48,471
ఎందుకంటే, అతను ఫ్రాంక్ లో ఓ బలహీనతని
కనిపెట్టాడు, దాన్ని వాడుకోవచ్చని అనుకుంటున్నాడు.

426
00:31:49,597 --> 00:31:53,059
అతను ఫ్రాంక్ నమ్మకాన్ని
సంపాదించడానికి ప్రయత్నిస్తాడని అనుకుంటున్నా.

427
00:31:53,142 --> 00:31:56,980
ఆ తర్వాత ఫ్రాంక్ ని మభ్యపెట్టి, నియంత్రణలోకి తెచ్చుకొని,

428
00:31:57,063 --> 00:32:01,192
అతడిని అడ్డం పెట్టుకుని,
తనకి కావాల్సిన పని చేయించుకోవచ్చని అతని ప్లాన్.

429
00:32:02,819 --> 00:32:04,362
ఏంటి ఆ పని?

430
00:32:05,613 --> 00:32:06,865
నాకు కూడా తెలీదు.

431
00:32:07,490 --> 00:32:08,908
లేదు, నీకు తెలుసు.

432
00:32:11,035 --> 00:32:12,537
కానీ చెప్పవు, అంతే.

433
00:32:13,371 --> 00:32:16,124
ఫ్రాంక్ విషయానికి వస్తే, తన సంగతి తను చూసుకోగలడు.

434
00:32:16,207 --> 00:32:19,460
కానీ నీ గురించే నా దిగులు అంతా.

435
00:32:21,462 --> 00:32:24,090
ఎందుకంటే, ఇదంతా
నీ వల్లే జరుగుతోందని నాకు అనిపిస్తోంది.

436
00:32:25,133 --> 00:32:27,886
ఎందుకంటే, నీ దగ్గర కూడా
ఉన్న ఒక రహస్యాన్ని ఇతను…

437
00:32:29,137 --> 00:32:30,597
ఇతను వాడుకున్నాడు.

438
00:32:37,896 --> 00:32:39,063
నీ అంచనా పొరపాటు కావాలనే నాకూ ఉంది.

439
00:32:52,327 --> 00:32:53,369
హేయ్, ఫ్రాంక్.

440
00:32:54,495 --> 00:32:55,747
సారా ఆచూకీ దొరికిందా?

441
00:32:55,830 --> 00:32:57,540
కారు నావిగేషన్ ద్వారానే కనిపెట్టారు, కదా?

442
00:32:59,000 --> 00:33:00,752
హా. తను క్షేమంగానే ఉంది.

443
00:33:00,835 --> 00:33:02,420
మంచిది. నాకు సంతోషంగా ఉంది.

444
00:33:02,962 --> 00:33:06,549
నేను మాట మీద నిలబడే మనిషిని అని
నీకు చూపించాలి, అది నాకు చాలా ముఖ్యం.

445
00:33:06,633 --> 00:33:09,928
నేను అడిగిన పని నువ్వు చేశావు,
కాబట్టి నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నా.

446
00:33:10,011 --> 00:33:11,763
ఓకే, ఇప్పుడు మనిద్దరం
ఒకరినొకరం తెగ నమ్మేస్తున్నాం కాబట్టి,

447
00:33:11,846 --> 00:33:14,057
నా అభ్యర్థనని మన్నిస్తావా కాస్త?

448
00:33:14,599 --> 00:33:15,850
నీకు బందీలు కావాలి కదా.

449
00:33:15,934 --> 00:33:17,936
మాకొక ట్రాన్స్ మిషన్ లభించింది.
వాళ్ళే అని అనుకుంటున్నాం.

450
00:33:18,019 --> 00:33:19,687
ఫియాస్కో సరస్సుకు 48 కిలోమీటర్ల దూరంలో ఉంది అది.

451
00:33:19,771 --> 00:33:20,855
సరే. పోలీసులకి తెలపండి ఆ విషయం.

452
00:33:20,939 --> 00:33:23,399
కుదిరితే, రోడ్డు సిస్టమ్ నుండి అతనెంత
దూరంలో ఉన్నాడో కనుక్కునే ప్రయత్నం చేద్దాం.

453
00:33:23,483 --> 00:33:24,484
లైన్లో ఉన్నావా?

454
00:33:24,567 --> 00:33:27,362
మీ టీమ్ మా సిగ్నల్ ని ట్రేస్ చేసే పనిలో ఉన్నారు కదా.

455
00:33:27,445 --> 00:33:28,530
మేమెక్కడ ఉన్నామో తెలిసిపోయిందా?

456
00:33:29,113 --> 00:33:31,658
- హా, ఇంకాసేపట్లో తెలిసిపోతుంది.
- సరే, అయితే త్వరగా కానిచ్చేద్దాం.

457
00:33:32,283 --> 00:33:34,869
నాకు సిడ్నీ జీనోగేట్ పాస్ కోడ్ కావాలి.

458
00:33:35,828 --> 00:33:37,413
తను అక్కడ ఉందనే అనుకుంటున్నా.

459
00:33:37,497 --> 00:33:40,708
హేయ్, సిడ్నీ. నీ పాస్ కోడ్ నీకు తెలుసు, కదా?

460
00:33:41,876 --> 00:33:44,087
నాకు అది ఇవ్వు. నేను కావాల్సినంత సహకరిస్తా.

461
00:33:44,170 --> 00:33:45,421
నేను ఇవ్వలేను.

462
00:33:45,505 --> 00:33:47,173
- జీనోగేట్ అంటే ఏంటి?
- అదొక డిజిటల్ ఆర్కైవ్.

463
00:33:47,257 --> 00:33:49,717
నేను తయారు చేసి, ఫీల్డులోకి దింపిన
ప్రతి అస్సెట్ కి చెందిన గుర్తింపులను,

464
00:33:49,801 --> 00:33:51,844
చిరునామాలని అతని చేతిలో పెట్టినట్టు అవుతుంది.

465
00:33:51,928 --> 00:33:54,347
ఆ కోడ్ ని కనుక నాకు ఇవ్వకపోతే,
నేను జనాలని కాల్చడం మొదలుపెడతా.

466
00:33:54,430 --> 00:33:56,266
- నాకు పాస్ కోడ్ ఇవ్వాలి.
- నేను చచ్చినా ఇవ్వను.

467
00:33:56,349 --> 00:33:58,393
- అతను చెప్పింది విన్నావు కదా.
- జోక్ అనుకుంటున్నావా?

468
00:33:58,476 --> 00:34:00,144
చెప్పేది జాగ్రత్తగా విను, ఫ్రాంక్.

469
00:34:06,901 --> 00:34:08,486
ఈసారి ఇతని తలని కాలుస్తా.

470
00:34:08,570 --> 00:34:10,947
దరిద్రుడా.

471
00:34:11,030 --> 00:34:12,949
ఆగు. మనిద్దరం మాట్లాడుకుందాం.
ఒక నిమిషం సమయం ఇవ్వు.

472
00:34:13,032 --> 00:34:15,660
నాకు మాట్లాడాలని లేదు, ఫ్రాంక్. నాకు సిడ్నీ కోడ్ కావాలి.

473
00:34:15,743 --> 00:34:17,495
- అతను ఊరికే బెదిరిస్తున్నాడంతే.
- నాకు పాస్ కోడ్ కావాలి.

474
00:34:17,579 --> 00:34:19,664
సీఐఏ ఏజెంట్లు ఒక్కొక్కరు చావడం కావాలా?

475
00:34:19,747 --> 00:34:20,999
ఇప్పుడు అతను ఆ వ్యక్తిని చంపేస్తాడు.

476
00:34:21,082 --> 00:34:22,208
హేయ్, సిడ్నీ.

477
00:34:22,292 --> 00:34:25,044
కొందరి ప్రాణాలని కాపాడే
అరుదైన అవకాశం నీ ముందు ఉంది.

478
00:34:27,921 --> 00:34:30,173
అతనికి పాస్ కోడ్ ఇవ్వు.

479
00:34:30,258 --> 00:34:32,176
నేను నీకు పది సెకన్లు ఇస్తా.

480
00:34:33,303 --> 00:34:34,304
పది.

481
00:34:36,014 --> 00:34:37,682
- తొమ్మిది.
- కాస్త శాంతించు, బాసూ.

482
00:34:39,100 --> 00:34:40,142
ఎనిమిది.

483
00:34:40,226 --> 00:34:41,727
- అతను కాల్చడు.
- అతనికి పాస్ కోడ్ ఇవ్వు.

484
00:34:41,811 --> 00:34:43,313
- ఏడు.
- అతను ఆ బందీలని చంపడు.

485
00:34:43,396 --> 00:34:44,479
ఆరు.

486
00:34:45,689 --> 00:34:46,858
అయిదు.

487
00:34:47,816 --> 00:34:49,151
నాలుగు.

488
00:34:49,818 --> 00:34:51,362
నువ్వు నాకు మరో దారి ఇవ్వట్లేదు, సిడ్నీ.

489
00:34:52,488 --> 00:34:53,488
మూడు.

490
00:34:53,573 --> 00:34:55,200
నిన్ను వేడుకుంటున్నా. ప్లీజ్.

491
00:34:56,659 --> 00:34:59,621
- రెండు.
- విక్టర్, మైక్, సెవెన్, లీమా, జూలూ.

492
00:34:59,704 --> 00:35:00,705
ఒకటి.

493
00:35:00,788 --> 00:35:02,790
విక్టర్, మైక్, సెవెన్, లీమా, జూలూ.

494
00:35:04,334 --> 00:35:05,501
తేలిగ్గా అయిపోయింది కదా?

495
00:35:18,890 --> 00:35:20,058
మరి ఆ పోలీస్ ఏమైపోయాడు?

496
00:35:20,141 --> 00:35:21,768
అదే నేను కూడా చెప్పేది. ఎక్కడికి వెళ్ళుంటాడు?

497
00:35:21,851 --> 00:35:23,561
అయితే నువ్వు… నువ్వు అతనెవరని అనుకుంటున్నావు?

498
00:35:23,645 --> 00:35:25,563
ఆ వ్యక్తి ఇక్కడికి వేటాడటానికి రాలేదు,

499
00:35:25,647 --> 00:35:27,482
- అతనికి మిత్రులు ఎవరూ లేరు.
- అయితే, మనం వెళ్ళిపోవాలి.

500
00:35:27,565 --> 00:35:29,776
- ట్రక్కును తీసుకెళదాం…
- దానిలో టౌనుకి వెళ్లే ప్రయత్నం చేద్దాం.

501
00:35:35,114 --> 00:35:36,115
మరి అతనికేం చెపుదాం?

502
00:35:51,089 --> 00:35:52,507
మళ్ళీ ఎప్పుడు వస్తారు?

503
00:35:55,593 --> 00:35:57,262
ఇరవై నిమిషాల్లో వచ్చేస్తాం.
ఇంకా తక్కువ సమయమే పట్టవచ్చు.

504
00:35:58,596 --> 00:36:00,682
మేము బ్యాటరీని తీసి, దాన్ని ఛార్జర్ కి పెడతాం.

505
00:36:01,307 --> 00:36:03,309
అయితే, ఒక బ్యాటరీ ఛార్జర్ ని వెతుక్కుంటారా?

506
00:36:04,644 --> 00:36:05,979
అంటే, మేము…

507
00:36:06,062 --> 00:36:08,398
గ్యారేజీలో ఒక పాత బూస్ట్ జంపర్ దొరికింది,

508
00:36:08,481 --> 00:36:11,693
అందులో అదనపు ఛార్జ్ ఉందని
ఆశిస్తున్నాం, ఎందుకంటే బహుశా…

509
00:36:12,735 --> 00:36:15,196
- బహుశా ఏంటి?
- బహుశా…

510
00:36:15,280 --> 00:36:17,365
బహుశా మీకు కావాల్సింది ఇదేమో.

511
00:36:18,491 --> 00:36:21,411
బహుశా మీ పిల్ల పిశాచులు నాతో అబద్ధం ఆడుతున్నారేమో.

512
00:36:22,704 --> 00:36:26,082
బహుశా మీరు మూసుకొని ఇక్కడ కూర్చోవాలేమో.

513
00:36:38,845 --> 00:36:41,014
మిత్రులారా, మనకి ఆ బండికి సంబంధించిన
డిజైన్ అందిందని విన్నాను.

514
00:36:41,890 --> 00:36:43,516
- దాన్ని మనం ఎలా అడ్డుకోవచ్చు?
- అడ్డుకోలేం.

515
00:36:43,600 --> 00:36:45,685
అది వజ్రం కన్నా గట్టిది.

516
00:36:45,768 --> 00:36:47,937
కెవ్లర్ బెల్ట్ గల టైర్లు. స్టీల్ ఫ్రేమ్.

517
00:36:48,021 --> 00:36:51,232
ఇది చాలా దృఢమైనది.
ఏ పోలీస్ బారికేడ్ కూడా దీన్ని ఆపలేదు.

518
00:36:51,316 --> 00:36:53,151
ఒకవేళ ఆపగలిగినా, దాన్ని మనం చేరుకోలేం.

519
00:36:53,234 --> 00:36:54,611
అది రోడ్డు సిస్టమ్ కి 96 కిమీ దూరంలో ఉన్నాయి.

520
00:36:54,694 --> 00:36:56,070
అయితే, వాళ్ళ లొకేషన్ మనకి తెలుసా?

521
00:36:56,154 --> 00:36:57,572
వాళ్ళ రేడియో సిగ్నల్ ని లొకేట్ చేశాం.

522
00:36:57,655 --> 00:36:59,407
ఈ వెర్రోళ్ళు, జైలుకు వెళ్లడం కన్నా

523
00:36:59,490 --> 00:37:00,491
చలిలో చావడానికే సిద్ధంగా ఉన్నారు.

524
00:37:00,575 --> 00:37:03,161
వాళ్ళ చెర నుండి ఈ బందీలను మనం విడిపించాలి.

525
00:37:03,244 --> 00:37:04,579
సరే, పోలీసులకి తెలియజేద్దాం.

526
00:37:04,662 --> 00:37:07,207
ఒక విమానంలో గాల్లోకి వెళ్లి,
ఈ బండిని లొకేట్ చేసే ప్రయత్నం చేద్దాం.

527
00:37:07,290 --> 00:37:08,374
దాన్ని అడ్డుకునే ప్లాన్ ఏమైనా ఉందా?

528
00:37:08,458 --> 00:37:10,126
అస్సలు లేదు.

529
00:37:12,545 --> 00:37:14,047
హేయ్, నిన్ను ఒకటి అడగవచ్చా?

530
00:37:14,130 --> 00:37:15,131
అడుగు.

531
00:37:15,215 --> 00:37:16,674
ఇతను సెల్యూలర్ కమ్యూనికేషన్స్ లేకుండా చేశాడు,

532
00:37:16,758 --> 00:37:18,635
ఫ్లైట్ రికార్డర్ ని తీసుకెళ్లాడు. ఎందుకు?

533
00:37:19,260 --> 00:37:20,511
వేరే దారేదీ లేక అలా చేశాడేమో.

534
00:37:20,595 --> 00:37:23,514
ఒకవేళ అది కారణం కాకపోతే?
ఒకవేళ ఇదంతా ఏదైనా పెద్ద ప్లాన్ లో భాగం అయితే?

535
00:37:23,598 --> 00:37:26,351
ఎఫ్.బీ.ఐ వాళ్ళు ప్రింటర్ తో సహా,
అన్నింటినీ తీసుకెళ్లిపోయేది అందుకేనేమో?

536
00:37:27,268 --> 00:37:28,269
ప్రింటర్ ఏంటి?

537
00:37:28,353 --> 00:37:30,855
హావ్లాక్ దగ్గర సారా బందీగా ఉన్నప్పుడు
అతను ఒక ప్రింటర్ ని వాడాడు.

538
00:37:30,939 --> 00:37:33,149
ఒక అసోసియేట్ నుండి ప్లాన్స్ సంపాదించి
ప్రింట్ చేసి ఉంటాడని అనుకుంటున్నారు.

539
00:37:33,233 --> 00:37:34,275
ఇది నీకెలా తెలిసింది?

540
00:37:36,277 --> 00:37:37,487
నీ భార్య స్కోఫీల్డ్ కి చెప్పింది.

541
00:37:38,363 --> 00:37:40,198
నా భార్య స్కోఫీల్డ్ తో మాట్లాడిందా?

542
00:37:40,990 --> 00:37:42,116
హా, మాట్లాడా.

543
00:37:44,911 --> 00:37:45,954
తనకేం కావాలట?

544
00:37:49,749 --> 00:37:55,088
నన్ను అడ్డు పెట్టుకొని
నిన్ను వాడుకుంటాడని ఆమె కంగారుపడింది.

545
00:37:57,590 --> 00:37:58,591
అలా వాడుకున్నాడా మరి అతను?

546
00:37:59,759 --> 00:38:00,760
లేదు.

547
00:38:04,097 --> 00:38:06,057
నేను అతని దగ్గర ఉన్నా కదా…

548
00:38:06,724 --> 00:38:09,978
అతని లాంటి వాడు ఇప్పటి దాకా నీకు ఎదురవ్వనే లేదు.

549
00:38:10,520 --> 00:38:12,772
మన కుటుంబానికి నేనేమీ కానివ్వను.

550
00:38:12,856 --> 00:38:16,276
నా దగ్గరికి చేరుకోవడానికి
అతనికి ఒక రోజు కూడా పట్టలేదు.

551
00:38:17,110 --> 00:38:20,113
మన కొడుకు ఎక్కడ ఉన్నాడో ఆ దేవునికే తెలియాలి.

552
00:38:21,614 --> 00:38:26,703
మన కుటుంబం ఇప్పటికే చాలా అనుభవించింది,
ఇది నిన్నెక్కడ కబళించేస్తుందో అని భయంగా ఉంది, ఫ్రాంక్.

553
00:38:26,786 --> 00:38:30,957
మళ్ళీ ఇప్పుడు, అది కూడా ఏంతో కష్టపడి
ఈ స్థితికి వచ్చాక, తిరోగమన బాట పట్టడం నాకు ఇష్టం లేదు.

554
00:38:31,040 --> 00:38:33,459
బంగారం, బంగారం, ఓకే. నీ బాధ అర్థమైంది.

555
00:38:34,711 --> 00:38:37,046
మనం దీని నుండి బయటపడతాం.
ప్రతీసారీ బయటపడుతూనే ఉన్నాం కదా.

556
00:38:41,426 --> 00:38:44,178
ఇక్కడున్నారా? మీకోసం నేను వెతకని చోటంటూ లేదు.

557
00:38:44,262 --> 00:38:45,430
చెప్పు.

558
00:38:45,513 --> 00:38:46,681
లూక్, ఇద్దరూ ఉన్నారు, మాట్లాడు.

559
00:38:47,807 --> 00:38:48,808
లూక్?

560
00:38:49,809 --> 00:38:51,144
లూక్? బంగారం?

561
00:38:52,061 --> 00:38:53,104
ఎక్కడ ఉన్నావు?

562
00:38:53,187 --> 00:38:55,190
ట్రూపర్ హేయిస్ తో క్యాబిన్లో ఉన్నాను.

563
00:38:56,107 --> 00:38:58,943
ఇక్కడ వాతావరణం బాగాలేదు.
త్వరలోనే ఇక్కడి నుండి బయలుదేరుతాం.

564
00:39:00,028 --> 00:39:02,280
నువ్వు బాగానే ఉన్నావా? కీరా కూడా అక్కడే ఉందా?

565
00:39:02,947 --> 00:39:04,991
హేయ్, మిసెస్ రెమ్నిక్. నేను కూడా ఉన్నా.

566
00:39:05,074 --> 00:39:07,410
మేము బాగానే ఉన్నాం.
ఇక్కడ చల్లగా ఉంది, కానీ బాగానే ఉన్నాం.

567
00:39:08,912 --> 00:39:10,330
నేను ఈ చెత్త పని చేసి ఉండాల్సింది కాదు.

568
00:39:11,206 --> 00:39:13,208
దాని గురించి తర్వాత మాట్లాడుకుందాంలే, సరేనా?

569
00:39:14,042 --> 00:39:15,543
నేను ఇక్కడికి వచ్చి ఉండాల్సింది కాదు.

570
00:39:15,627 --> 00:39:18,046
లూక్, బంగారం, నువ్వు బాగా ఉన్నావు,
మాకు అదే చాలు, సరేనా?

571
00:39:18,129 --> 00:39:21,341
నువ్వు… నువ్వు నీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్
చేస్తూ ఉండు. ప్రశాంతంగా ఉండు. సరేనా?

572
00:39:21,424 --> 00:39:22,717
అన్నట్టు, హేయ్, క్లింట్,

573
00:39:22,800 --> 00:39:26,221
వాళ్ళని క్షేమంగా ఇంటికి తీసుకురా, సరేనా?
మీరు జాగ్రత్త. మీరంటే మాకు చాలా ఇష్టం.

574
00:39:27,013 --> 00:39:28,097
నువ్వంటే కూడా చాలా ఇష్టం, అమ్మా.

575
00:39:28,181 --> 00:39:29,182
లవ్ యూ, నాన్నా.

576
00:39:29,265 --> 00:39:30,266
సరే, బాగా మాట్లాడారు.

577
00:39:42,487 --> 00:39:43,863
ఇప్పుడు కష్టమైన పని విషయానికి వద్దాం.

578
00:40:03,174 --> 00:40:06,010
నీకు ఇందులో భాగం ఉందని
వాళ్ళు అన్నారని ఇంతకుముందు అన్నావు కదా.

579
00:40:07,428 --> 00:40:08,513
"వాళ్ళు" అంటే ఎవరు?

580
00:40:10,139 --> 00:40:16,646
రహస్య సమాచారాన్ని దొంగిలించి, పారిపోవడంలో
హావ్లాక్ కి నేను సాయపడ్డానని సీఐఏ అనుకుంటోంది.

581
00:40:16,729 --> 00:40:19,732
ఇప్పుడు మా మధ్య ఉన్న సంబంధంపైనే
దర్యాప్తు చేస్తూ ఉన్నారు.

582
00:40:19,816 --> 00:40:21,234
అయినా కానీ నిన్ను ఇక్కడికి పంపించారా?

583
00:40:21,317 --> 00:40:24,195
అవును. ఒక స్నేహితురాలు పంపించింది.

584
00:40:24,279 --> 00:40:25,822
నేను అయితే ఆమెని స్నేహితురాలనే అనుకున్నా.

585
00:40:25,905 --> 00:40:29,117
ఇప్పుడు అక్కడికి వచ్చేసి,
వాళ్ళ న్యాయవాదులతో మాట్లాడమని చెప్తోంది.

586
00:40:29,200 --> 00:40:30,785
మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు?

587
00:40:30,869 --> 00:40:32,662
నేను వెళ్ళిపోతే, హావ్లాక్ గెలుస్తాడు.

588
00:40:33,246 --> 00:40:36,249
అతని ప్లాన్ ని కొనసాగిస్తాడు.

589
00:40:41,129 --> 00:40:42,130
కాబట్టి…

590
00:40:43,172 --> 00:40:44,507
మనం అతడిని పట్టుకుంటాంలే.

591
00:40:46,718 --> 00:40:48,386
అది అంత తేలికైన యవ్వారం కాదు.

592
00:40:49,012 --> 00:40:50,513
హా, ఎందుకు తేలిక కాదు?

593
00:40:53,016 --> 00:40:54,434
మా నాన్న వల్ల.

594
00:40:57,520 --> 00:40:58,771
మా నాన్న,

595
00:40:59,689 --> 00:41:01,149
హావ్లాక్ ని తయారుచేశాడు.

596
00:41:02,317 --> 00:41:03,735
ఈ ఆపరేషన్ అంతటికీ సూత్రధారి ఆయనే.

597
00:41:04,485 --> 00:41:07,238
లేని ఫిరాయింపుదారులని ఉపయోగించి,
శత్రువులని ఉచ్చులోకి లాగే ఐడియా ఆయనదే.

598
00:41:07,322 --> 00:41:12,160
9/11 ఘటన తర్వాత
ఆయన రూపొందించిన రహస్యమైన ప్రోగ్రామే అది.

599
00:41:13,286 --> 00:41:14,787
మీ నాన్నగారు గూఢాచారా?

600
00:41:14,871 --> 00:41:16,956
ఆయన స్వదేశం కోసం ప్రాణాలొదిలాడు.

601
00:41:18,583 --> 00:41:23,922
ఆయన రూపొందించిన ప్రోగ్రామునే ఆయుధంగా
మలుచుకొని నన్ను అంతం చేయాలని చూస్తున్నారు.

602
00:41:33,348 --> 00:41:35,141
అయితే, ఇది ఆయన పేరుకు సంబంధించిన సమస్యనా?

603
00:41:35,225 --> 00:41:37,310
అతని త్యాగానికి సంబంధించిన విషయం.

604
00:41:38,478 --> 00:41:41,147
దాని కారణంగా మా కుటుంబం చేసిన
త్యాగాలకు సంబంధించిన విషయం.

605
00:41:49,155 --> 00:41:51,324
మా నాన్నని హత్య చేశాక…

606
00:41:54,327 --> 00:41:57,956
మా అమ్మ అందరినీ దూరం పెట్టేసి, ఒంటరిగా ఉండసాగింది.

607
00:41:58,540 --> 00:41:59,791
మానసికంగా కృంగిపోయింది.

608
00:42:01,459 --> 00:42:04,629
తనని చూసుకోవడానికి,
మా అక్క తన భర్తని వదిలేసినంత పని చేసింది.

609
00:42:07,298 --> 00:42:09,717
నేను ఒక్కప్పుడు ఎలా ఉండే దాన్నో
నువ్వు ఊహించలేవు కూడా.

610
00:42:15,932 --> 00:42:17,767
ఇప్పుడు ఆయన పేరుకు మచ్చ తేనివ్వలేను నేను.

611
00:42:24,107 --> 00:42:28,778
మాకు ఒక పాప ఉండేది, రెండు వారాల్లో
తనకి తొమ్మిదేళ్లు నిండుతాయి అనగా, తను చనిపోయింది.

612
00:42:33,908 --> 00:42:35,493
దానికి కారణాలు వెతుక్కున్నా. దాన్ని…

613
00:42:37,996 --> 00:42:38,997
దాన్ని నేను అంగీకరించలేకపోయా.

614
00:42:40,248 --> 00:42:45,253
కానీ నిజం ఏంటంటే, తను చనిపోవడానికి నేనే కారణం.

615
00:42:49,382 --> 00:42:51,467
- అది నిజం అయ్యుండదు.
- నేను చేసిన పని వల్ల తను చనిపోయింది.

616
00:42:52,802 --> 00:42:53,887
నా వృత్తి వల్ల.

617
00:42:58,099 --> 00:42:59,183
తన పేరేంటి?

618
00:43:01,561 --> 00:43:04,564
ర్యూబీ. ర్యూబీ గ్రేస్.

619
00:43:07,734 --> 00:43:10,361
ఈ ఉద్యోగం వల్ల
నేనేం కోల్పోవలసి వచ్చిందో తలుచుకుంటూ

620
00:43:10,445 --> 00:43:12,280
నన్ను నేను తిట్టుకోకుండా ఉండని రోజంటూ లేదు.

621
00:43:18,620 --> 00:43:21,372
అయితే, మనిద్దరికీ ఒక విషయంలో
ఏకాభిప్రాయం కుదిరింది అన్నమాట.

622
00:43:21,456 --> 00:43:23,166
అలా అని నేను చెప్పను, కానీ…

623
00:43:25,668 --> 00:43:27,921
నేనే కనుక నీ స్థానంలో ఉంటే,
హావ్లాక్ లేకుండా అక్కడికి వెళ్ళను.

624
00:43:30,882 --> 00:43:32,217
అతనెక్కడ ఉన్నాడో నాకు తెలుసు కూడా.

625
00:43:33,384 --> 00:43:34,719
అతడిని ఎలా పట్టుకోవాలో తెలుసా నీకు?

626
00:43:36,054 --> 00:43:37,055
నా దగ్గర ఒక ఉపాయం ఉంది.

627
00:43:46,648 --> 00:43:49,317
జీనోగేట్ పోర్టల్
సిడ్నీ స్కోఫీల్డ్ కి సుస్వాగతం

628
00:43:50,944 --> 00:43:53,613
కాంటాక్ట్స్

629
00:43:55,657 --> 00:43:57,075
ఆర్మెన్ జ్దాంకో

630
00:44:01,913 --> 00:44:05,333
మెసేజ్: నేను టాంగియర్స్ కి చెందిన
నీ ఫ్రెండ్ ని మాట్లాడుతున్నా. మనకి ఓ సమస్య ఎదురైంది.

631
00:44:07,126 --> 00:44:09,379
ఏంటి ఆ శబ్దం? మీకు వినబడుతోందా?

632
00:44:16,511 --> 00:44:17,804
బండిని ఆపు.

633
00:44:20,348 --> 00:44:22,600
దేవుడా.

634
00:44:22,684 --> 00:44:24,519
వెనక్కి తిప్పు! వెనక్కి తిప్పు!

635
00:44:24,602 --> 00:44:26,312
తిప్పి ఎక్కడికని వెళ్ళాలి, మహానుభావా?

636
00:44:30,942 --> 00:44:32,360
బండిని ఆపు.

637
00:44:36,990 --> 00:44:38,116
మనం తప్పనిసరిగా మాట్లాడుకోవాలి.

638
00:44:38,199 --> 00:44:41,953
రేపు రాత్రి పది గంటలకి
బ్లూబర్డ్ వద్ద కాంటాక్ట్ చేస్తాను.

639
00:44:57,302 --> 00:44:58,636
ఎవరతను?

640
00:45:04,726 --> 00:45:06,519
మీ వద్ద బందీలుగా ఉన్న వారి
గురించి మాట్లాడాలనుకుంటున్నా.

641
00:45:07,103 --> 00:45:08,938
వారిని సురక్షితంగా పంపించేయాలనుకుంటున్నా.

642
00:45:18,907 --> 00:45:20,783
మీరు ఎక్కడికీ వెళ్ళలేరు, అది మీకు కూడా తెలుసు.

643
00:45:21,868 --> 00:45:24,120
ఇక్కడ ఒక రోడ్డు లేదు. పెట్రోల్ లేదు.

644
00:45:24,871 --> 00:45:27,874
వెచ్చదనం లేదు. ఆహారం లేదు.

645
00:45:28,583 --> 00:45:30,418
సరిహద్దుకు కూడా బోలెడంత దూరం వెళ్ళాలి.

646
00:45:31,127 --> 00:45:33,046
మీరు యుకాన్ కి వెళ్లినా,

647
00:45:33,838 --> 00:45:35,924
అక్కడ కూడా పెద్దగా ఏమీ ఉండదు.
అంతా ఇలానే ఉంటుంది.

648
00:45:36,799 --> 00:45:40,303
నన్ను ఎక్కనివ్వండి. కూర్చుని మాట్లాడుకుందాం.

649
00:45:40,386 --> 00:45:41,763
నాకు ఏదో తేడా కొడుతోంది.

650
00:45:42,805 --> 00:45:44,057
ఇదొక ఉచ్చు.

651
00:45:47,977 --> 00:45:50,980
సరే, ఫ్రాంక్. మాట్లాడుకుందాం.

652
00:46:01,282 --> 00:46:02,283
నేను ఎక్కుతున్నా.

653
00:46:10,959 --> 00:46:12,085
నాకు అతను కావాలి.

654
00:46:12,669 --> 00:46:13,753
శామ్.

655
00:46:21,511 --> 00:46:24,472
నా కొడుకు. నా కొడుకు, కేలబ్ మీ దగ్గర ఉన్నాడా?

656
00:46:24,556 --> 00:46:26,432
- మీ కొడుకు బాగానే ఉన్నాడు. సరేనా?
- అవునా?

657
00:46:26,516 --> 00:46:28,601
- మీకోసమే ఎదురు చూస్తున్నాడు.
- ఓరి దేవుడా.

658
00:46:44,659 --> 00:46:46,286
నీకు దారులన్నీ మూసుకుపోయాయి.

659
00:46:46,870 --> 00:46:48,204
నా గురించి కంగారుపడిపోకు, ఫ్రాంక్.

660
00:46:48,872 --> 00:46:50,623
మేమే నీ గురించి కంగారుపడాలి.

661
00:46:52,000 --> 00:46:54,085
బేస్మెంటులో నీ చిట్టి రహస్యం ఒకటి ఉంది కదా.

662
00:46:57,839 --> 00:46:59,173
నేను నీకు సాయపడగలను, ఫ్రాంక్.

663
00:47:01,926 --> 00:47:03,094
ఏం చేశావు నువ్వు?

664
00:47:04,095 --> 00:47:06,639
ఆ శబ్దం వినబడిందా? బయట ఎవరో ఉన్నారు.

665
00:47:09,142 --> 00:47:10,393
సారాకి తెలుసా?

666
00:47:13,271 --> 00:47:14,439
ఏం చేశావు నువ్వు?

667
00:47:14,522 --> 00:47:16,524
నిన్ను కాపాడా, ఫ్రాంక్.

668
00:47:17,734 --> 00:47:18,818
ఎందుకంటే, నాకు నీ అవసరముంది.

669
00:47:19,777 --> 00:47:21,279
ఇప్పుడు నీకు నా అవసరముంది.

670
00:47:24,532 --> 00:47:27,535
నీ చిట్టి రహస్యం, నేనెవరికీ చెప్పనులే.

671
00:47:29,412 --> 00:47:31,539
అలాస్కాలో భద్రంగా ఉంది.

672
00:49:43,213 --> 00:49:44,547
అబ్బా!

673
00:50:10,240 --> 00:50:11,449
బండి దిగు!

674
00:50:15,662 --> 00:50:16,913
వద్దు, లీవై.

675
00:51:23,479 --> 00:51:24,397
అయ్య బాబోయ్!

676
00:52:01,935 --> 00:52:03,394
ఆ పని చేయకు, ఫ్రాంక్.

677
00:52:04,562 --> 00:52:06,231
బాబోయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా?

678
00:52:27,794 --> 00:52:28,795
అతడిని కాల్చు!

679
00:52:30,171 --> 00:52:31,548
కాల్చేయ్!

680
00:52:31,631 --> 00:52:32,924
తను కాల్చదు, ఫ్రాంక్.

681
00:52:33,007 --> 00:52:34,717
- ఎందుకు కాల్చను?
- కాల్చు!

682
00:52:34,801 --> 00:52:36,219
తనకి నిజం కావాలి.

683
00:52:57,115 --> 00:52:58,783
- అది నీ ట్యాక్సీయే అనుకుంటా.
- దేవుడా.

684
00:52:58,867 --> 00:53:01,870
ఆలస్యమైపోయింది. చచ్చానుపో.

685
00:53:03,329 --> 00:53:05,456
ఓకే. ట్యాక్సీ.

686
00:53:06,332 --> 00:53:08,418
ట్యాక్సీ వచ్చింది. ట్యాక్సీ వచ్చేసింది.

687
00:53:11,254 --> 00:53:12,255
- బ్యాగ్.
- హా.

688
00:53:12,338 --> 00:53:15,049
- నా బ్యాగ్ ఎక్కడ?
- నీ ఫ్లైట్ మిస్ కాదులే.

689
00:53:17,051 --> 00:53:19,387
నేనెందుకు ఉద్యోగానికి ఒప్పుకున్నానని ఇందాక అడిగావు కదా.

690
00:53:21,055 --> 00:53:22,640
అందుకు కారణం, నువ్వే.

691
00:53:24,601 --> 00:53:25,810
ఎందుకంటే నువ్వు పిచ్చిపిచ్చిగా…

692
00:53:27,395 --> 00:53:28,646
ఓ పద్ధతి లేకుండా ఉంటావు, ఇంకా…

693
00:53:31,524 --> 00:53:33,193
నాకలా రూల్స్ ఫాలో అవ్వకుండా ఉండటం నచ్చుతుంది.

694
00:53:48,249 --> 00:53:49,584
ఇప్పుడు మనం ముద్దు పెట్టుకోలేదు.

695
00:53:50,919 --> 00:53:51,920
సరే.

696
00:53:52,503 --> 00:53:55,506
నిజంగా చెప్తున్నా. ఇది జరగనే లేదు.

697
00:54:02,013 --> 00:54:03,097
మనం అతడిని కనుగొంటాంలే.

698
00:54:04,891 --> 00:54:05,892
కానీ అప్పటికి ఆలస్యమైపోతుంది.

699
00:54:12,106 --> 00:54:14,067
అయితే, విమానం ఎక్కి, మీ ఊరికి తిరిగి వెళ్ళిపోతావా?

700
00:54:15,360 --> 00:54:16,861
నిన్ను ఒకటి అడగవచ్చా?

701
00:54:17,862 --> 00:54:18,905
అడుగు.

702
00:54:20,698 --> 00:54:22,700
నీ వీపు మీద ఉన్న గాయం మచ్చలకి,

703
00:54:22,784 --> 00:54:24,869
మీ కూతురు ఉదంతానికి ఏమైనా లింక్ ఉందా?

704
00:54:27,580 --> 00:54:29,582
దాని గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాంలే.

705
00:54:33,461 --> 00:54:34,629
అలాగే.

706
00:54:40,176 --> 00:54:41,261
గుడ్ లక్, ఫ్రాంక్.

707
00:54:57,277 --> 00:54:59,279
ఫెయిర్ బ్యాంక్స్ అగ్నిమాపక శాఖ అంబులెన్స్

708
00:55:00,738 --> 00:55:04,117
శామ్. మీ అబ్బాయికి
మీరొక పెంపుడు కుక్కని తెచ్చివ్వాలి అనుకుంటా.

709
00:55:05,034 --> 00:55:06,035
వాడికి ఇవ్వాల్సిన వాటి లిస్టులో అది కూడా ఉంది.

710
00:55:06,953 --> 00:55:09,247
- చాలా పెద్ద లిస్టులే అది.
- పెద్దదే అయ్యుంటుంది.

711
00:55:11,749 --> 00:55:15,753
- థ్యాంక్యూ. మీరు చేసిన సాయానికి.
- దానిదేముందిలే. థ్యాంక్యూ.

712
00:55:18,006 --> 00:55:20,758
ఓకే. ఆ గాయాన్ని ఓసారి చూస్తా.

713
00:55:25,054 --> 00:55:27,807
ఖచ్చితంగా మచ్చ ఏర్పడుతుంది? ఏమంటావు?

714
00:55:27,891 --> 00:55:28,975
- హా.
- సరే మరి.

715
00:55:34,898 --> 00:55:36,191
జాగ్రత్తగా ఉండండి, ఫ్రాంక్.

716
00:55:36,274 --> 00:55:37,358
మీరు కూడా, శామ్.

717
00:56:06,679 --> 00:56:09,807
నీ చిట్టి రహస్యం, నేనెవరికీ చెప్పనులే.

718
00:56:09,891 --> 00:56:12,393
అలాస్కాలో భద్రంగా ఉంది.

719
00:56:18,274 --> 00:56:20,109
అలాస్కా - ద వైల్డ్
వాల్టర్ కోట్స్

720
00:56:27,659 --> 00:56:29,744
మన రహస్యం

721
00:56:40,630 --> 00:56:42,465
ఫెయిర్ బ్యాంక్స్, అలాస్కా

722
00:56:58,398 --> 00:57:00,275
నువ్వు వెళ్ళకుండా ఇక్కడే ఉంటున్నావని చెప్పారు.

723
00:57:01,526 --> 00:57:03,152
- హేయ్, ఫ్రాంక్.
- నాకేమీ వద్దులే, థ్యాంక్స్.

724
00:57:05,822 --> 00:57:06,823
మరి…

725
00:57:11,327 --> 00:57:12,579
ఇప్పుడేం చేస్తావు?

726
00:57:16,624 --> 00:57:20,295
నేను అతడిని పట్టుకుంటా.

727
00:57:21,337 --> 00:57:23,172
ఆ పని మనిద్దరం కలిసి చేస్తే బాగుంటుందేమో.

728
00:57:25,216 --> 00:57:26,217
నువ్వు అన్నది నిజమే.

729
00:57:26,301 --> 00:57:28,803
ఆ విమానం ఇక్కడికి రావడానికి కారణమేంటో
వాషింగ్టన్ లో ఉండేవాళ్ళు నాకెప్పటికీ చెప్పరు.

730
00:57:29,387 --> 00:57:30,638
ఎఫ్.బీ.ఐ వాళ్ళు కావాలనే నాకు చెప్పరు,

731
00:57:30,722 --> 00:57:35,518
ఇక మీవాడేమో వ్యక్తిగతంగా
గెలుకుతున్నాడు, అది నాకు నచ్చట్లేదు.

732
00:57:37,478 --> 00:57:40,106
ఆ విమానం ఇక్కడ కూలడానికి
బలమైన కారణమే ఉందని మనిద్దరికీ తెలుసు,

733
00:57:40,190 --> 00:57:42,859
వాడు కూడా ఎక్కడికీ వెళ్లడు,
కాబట్టి నేను వాడిని అడ్డుకోవాలి, అందుకు…

734
00:57:45,403 --> 00:57:46,654
మనిద్దరం కలిసి పని చేయాలి.

735
00:57:46,738 --> 00:57:49,991
నీ ఖైదీ, నా అధికారంలో ఉన్న చోటు.

736
00:57:51,326 --> 00:57:54,746
ఆధారాలు మనకి అందుబాటులో లేనప్పుడు,
మనమెంత చేసినా లాభం ఉండదు.

737
00:58:02,295 --> 00:58:03,630
సిమ్ కార్డా?

738
00:58:03,713 --> 00:58:06,132
నా భార్యని కిడ్నాప్ చేసినప్పుడు,
హావ్లాక్ ఉపయోగించిన ప్రింటరులోనిది ఇది.

739
00:58:06,216 --> 00:58:08,426
నీతి, నిజాయితీ అని మాట్లాడేవాడు ఆధారాన్ని దొంగిలించాడే?

740
00:58:08,509 --> 00:58:11,221
అతను ప్రింట్ చేసింది, ఆ సిమ్ కార్డులో ఉంది.

741
00:58:14,432 --> 00:58:16,851
మనం ఈ పని కొనసాగిస్తే,

742
00:58:17,894 --> 00:58:20,021
పరిస్థితులు అల్లకల్లోలం అవుతాయని
నువ్వు అర్థం చేసుకోవాలి.

743
00:58:20,104 --> 00:58:21,439
నువ్వు రెడీగా ఉన్నట్టున్నావుగా.

744
00:58:21,523 --> 00:58:25,360
లేదు, నేను నిజంగానే అంటున్నా.
వీడు ఏమేం చేయగలడో నా కళ్లారా చూశాను నేను.

745
00:58:26,194 --> 00:58:27,904
అతను నీ కుటుంబాన్ని అడ్డుగా పెట్టుకుంటాడు.

746
00:58:28,530 --> 00:58:30,114
మీ ఇంట్లోకి వైరస్ లా చొరబడతాడు.

747
00:58:30,823 --> 00:58:32,492
అతని దృష్టిలో,

748
00:58:33,117 --> 00:58:35,370
నీ ఆత్మీయులందరూ వాడి టార్గెట్స్.

749
00:58:35,954 --> 00:58:37,705
నువ్వు ప్రేమించే వాళ్ళందరి మనస్సులో విషం నాటుతాడు.

750
00:58:39,207 --> 00:58:41,751
ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే,
నీ జీవితంలోకి నువ్వు ఆహ్వానించబోయే…

751
00:58:41,834 --> 00:58:42,835
పట్టుబడ్డాడు
కొవింగ్టన్

752
00:58:42,919 --> 00:58:46,297
…ప్రమాదం గురించి నిన్నుహెచ్చరించాలనుకుంటున్నా.

753
00:58:48,466 --> 00:58:50,343
అతనంటే ఎందుకు నీకంత భయం?

754
00:58:52,720 --> 00:58:54,222
ఎందుకంటే, అతని గురించి నాకు బాగా తెలుసు.

755
00:58:55,098 --> 00:58:56,975
అతని బాధితురాలివా నువ్వు?

756
00:58:59,519 --> 00:59:00,520
అతని మొదటి బాధితురాలిని.

757
00:59:07,610 --> 00:59:08,862
ఇప్పుడు మనం ముద్దు పెట్టుకోలేదు.

758
00:59:10,363 --> 00:59:11,906
అతని గురించి పట్టించుకుంటున్నావా?

759
00:59:13,366 --> 00:59:14,659
ఒకప్పుడు పట్టించుకునే దాన్ని.

760
00:59:14,742 --> 00:59:16,327
ఇప్పుడు మనం ముద్దు పెట్టుకోలేదు.

761
00:59:20,623 --> 00:59:21,791
ఇప్పటికీ పట్టించుకుంటున్నానేమో.

762
00:59:37,098 --> 00:59:38,182
ఎందుకని?

763
00:59:43,313 --> 00:59:44,731
ఎందుకంటే, నేనతని భార్యని కాబట్టి.

764
01:00:47,168 --> 01:00:49,170
సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్

