1
00:00:03,607 --> 00:00:05,318
నా పేరు ఫ్రాంక్ రెమ్నిక్,

2
00:00:05,902 --> 00:00:07,987
ఆర్-ఈ-ఎం-ఎన్-ఐ-సీ-కే.

3
00:00:09,697 --> 00:00:12,784
నేను అలాస్కా డిస్ట్రిక్ట్ కి
సూపర్వైజర్ డెప్యూటీ యుఎస్ మార్షల్ ని,

4
00:00:12,867 --> 00:00:14,911
నేను యుకాన్ ఫ్లాట్స్ లో ఇప్పుడు నెలకొన్న పరిస్థితిని

5
00:00:14,994 --> 00:00:17,080
- మీకు క్లుప్తంగా వివరిస్తాను…
- కాస్త గట్టిగా చెప్పండి.

6
00:00:21,376 --> 00:00:22,961
ప్రశ్నలేవీ అడగకండి.

7
00:00:27,549 --> 00:00:31,886
నిన్న సుమారుగా ఉదయం ఏడు గంటలకి,

8
00:00:32,804 --> 00:00:35,473
సన్న బాడీ గల ఒక జెట్ విమానం కూలి,

9
00:00:36,724 --> 00:00:38,726
ఈగల్ సమ్మిట్ కి 38.5 కిలోమీటర్లు,

10
00:00:40,061 --> 00:00:42,272
సర్కిల్ కి వాయువ్య దిశలో
22.5 కిలోమీటర్ల దూరంలో పడింది.

11
00:00:43,481 --> 00:00:46,234
శిథిలాలు మూడు కిలోమీటర్ల రేడియస్ లో
పడి ఉంటాయని అంచనా వేస్తున్నాం.

12
00:00:46,860 --> 00:00:48,403
ఇప్పుడు పెద్దగా వివరాలేవీ తెలీదు,

13
00:00:49,571 --> 00:00:53,032
కానీ సదరు విమానం, ఖైదీలను రవాణా చేసే జేపాట్స్ వాళ్ళదని,

14
00:00:53,116 --> 00:00:55,410
అందులో 52 మంది ఖైదీలను,
ఎనిమిది మంది సెక్యూరిటీ సిబ్బందిని

15
00:00:55,493 --> 00:00:57,620
తరలిస్తున్నారని పక్కాగా చెప్పగలను.

16
00:00:58,746 --> 00:01:00,999
ప్రాణాలతో ఎందరు బయటపడ్డారు,
వారి వివరాలేంటని ఇంకా తేల్చే పనిలో ఉన్నాం,

17
00:01:01,082 --> 00:01:03,835
కానీ ప్రాణాలతో కొందరు బయటపడ్డారని,
వారు ప్రమాదకరమైన వారని గమనించండి.

18
00:01:05,168 --> 00:01:08,673
క్షణక్షణానికి మారుతున్న ఈ పరిస్థితిని అదుపులోకి
తీసుకురావడానికి మార్షల్స్, ఫెయిర్ బ్యాంక్స్ పోలీసులు,

19
00:01:08,756 --> 00:01:10,508
అలాస్కా రాష్ట్ర పోలీసులందరూ కలిసి పని చేస్తున్నారు.

20
00:01:10,592 --> 00:01:11,593
ఫెయిర్ బ్యాంక్స్ కోసం ప్రార్థించండి

21
00:01:11,676 --> 00:01:13,219
టాననా వ్యాలీలో సెల్యూలర్, ఇంకా

22
00:01:13,303 --> 00:01:16,681
డేటా కమ్యూనికేషన్లు పని చేయడం లేదని
మీ అందరికీ తెలిసే ఉంటుంది,

23
00:01:16,764 --> 00:01:20,018
అందుకే స్థానిక వార్తాపత్రిక వాళ్ళు, మీడియా వాళ్ళు
ఈ వార్తని అందరికీ తెలిసేలా చేయాలని కోరుతున్నాం.

24
00:01:20,101 --> 00:01:21,185
జనాలకి తెలియజేయాలని కోరుతున్నాం.

25
00:01:21,769 --> 00:01:23,521
విమానం కూలిన చోటు దరిదాపుల్లోకి వెళ్ళవద్దు.

26
00:01:23,605 --> 00:01:26,774
ఇంటి లోపలే ఉండే వీలుంటే, ఆ పనే చేయండి, సరేనా?

27
00:01:26,858 --> 00:01:28,776
తెలియని వారికి దూరంగా ఉండండి.

28
00:01:30,528 --> 00:01:32,572
విమానం కూలిన చోటుకు, ఫెయిర్ బ్యాంక్స్ కి మధ్య

29
00:01:32,655 --> 00:01:35,325
చాలా దూరం ఉందని నాకు తెలుసు, కానీ…

30
00:01:37,577 --> 00:01:39,579
వీళ్ళు చాలా ప్రమాదకరమైన ఫెడరల్ ఖైదీలు,

31
00:01:40,830 --> 00:01:45,335
మన ప్రాపర్టీని తీసుకోవడానికి కానీ,
ఎవరినైనా బంధించడానికి కానీ ఏమాత్రం వెనుకాడరు.

32
00:01:49,714 --> 00:01:53,927
కాబట్టి ఇంట్లోనే ఉండండి, విపత్తుకు
సంసిద్ధమై ఉండండి, క్షేమంగా ఉండండి. సరేనా?

33
00:01:54,010 --> 00:01:55,136
- అంతే.
- ఫ్రాంక్, ఆగండి.

34
00:01:55,220 --> 00:01:58,223
- మీ భార్య సంగతేంటి? ఆమెని బందీగా తీసుకున్నారా?
- రేడియోలో మాట్లాడింది ఎవరో చెప్పగలరా?

35
00:01:58,306 --> 00:02:00,308
రేడియోలో ఎవరు మాట్లాడారు?

36
00:02:07,190 --> 00:02:08,440
- ఇవ్వు!
- ఇచ్చేయ్.

37
00:02:08,524 --> 00:02:09,859
- ఇప్పుడు నా వంతు!
- నువ్వు దరిద్రుడివి!

38
00:02:09,943 --> 00:02:11,903
హేయ్! ఏంటి ఆ భాష?

39
00:02:11,986 --> 00:02:12,987
జేక్, వాడికి ఇచ్చేయ్…

40
00:02:13,071 --> 00:02:15,240
రమ్-రమ్, కాస్త ఆ వీడియోను ఆపుతావా?

41
00:02:15,323 --> 00:02:16,908
వాతావరణం గురించి తెలుసుకోవాలని అన్నావు కదా.

42
00:02:21,913 --> 00:02:24,123
- ఎందుకంత చిరాకు తెప్పిస్తావు?
- హేయ్! మీరు కొట్టుకోవడం ఆపుతారా?

43
00:02:24,207 --> 00:02:25,333
లారా!

44
00:02:27,585 --> 00:02:29,128
తలుపులకు లాక్ వేయండి!

45
00:02:29,212 --> 00:02:31,047
లేదు, లేదు. కాస్త వినండి.

46
00:02:31,130 --> 00:02:32,173
నన్ను ఎక్కించుకోండి!

47
00:02:32,257 --> 00:02:33,550
వెళ్లిపో, లేదా కాల్చేస్తాను.

48
00:02:35,552 --> 00:02:37,303
వెళ్లిపొమ్మన్నాను కదా.

49
00:02:37,971 --> 00:02:39,514
పోలీసులు.

50
00:02:39,597 --> 00:02:42,267
- నా దగ్గర డబ్బులున్నాయి. క్యాష్ తీసుకోండి.
- ఏం చేస్తున్నాడు అతను?

51
00:02:42,350 --> 00:02:44,018
- దయచేసి తీసుకోండి.
- బాబోయ్…

52
00:02:44,102 --> 00:02:45,395
- ఇదంతా మీకే. నిజంగా.
- …చాలా డబ్బులున్నాయి.

53
00:02:45,478 --> 00:02:47,522
మిమ్మల్నేమీ చేయను. ప్లీజ్.

54
00:02:48,106 --> 00:02:49,607
నన్ను పోలీసుల దగ్గరికి తీసుకెళ్లండి.

55
00:03:00,493 --> 00:03:01,619
ఫెయిర్ బ్యాంక్స్ కి స్వాగతం

56
00:03:05,707 --> 00:03:06,875
సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ

57
00:04:03,056 --> 00:04:04,265
మార్షల్ భార్యని హావ్లాక్ అపహరించాడా?

58
00:04:04,349 --> 00:04:05,600
సీఐఏ ప్రధాన కార్యాలయం
లాంగ్లీ, వర్జీనియా

59
00:04:05,683 --> 00:04:08,394
ఏంటి, సిడ్! ఆ వెనుకబడిన
చిన్న ఊరు అంతా రెమ్నిక్ చేతిలోనే ఉంటుంది.

60
00:04:08,478 --> 00:04:11,397
అతను నీకు సాయం చేయడమే మనకి కావాలి,
భార్య కోసం వెతుక్కుంటూ ఉంటే మనకెలా సాయపడతాడు!

61
00:04:11,481 --> 00:04:14,192
ఆమె బందీగా ఉందని బెదిరిస్తూ,
అతను తనకి కావాల్సిన పనులు చేయించుకుంటాడు.

62
00:04:14,275 --> 00:04:15,610
- అది మనకి మంచిదే కావచ్చు.
- సిడ్,

63
00:04:15,693 --> 00:04:18,947
ఓ గంటలో, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన
అసిస్టెంట్ ఏజీకి ఈ పరిస్థితి గురించి వివరించబోతున్నా.

64
00:04:19,030 --> 00:04:22,242
- నాకు ఫలితాలు కావాలి, వ్యూహాలు కాదు.
- అతడిని ఆ విమానంలోకి ఎందుకు ఎక్కించారు?

65
00:04:22,325 --> 00:04:24,077
హావ్లాక్ ని హంఫ్రీస్ కి పంపించి ఉండవచ్చు కదా?

66
00:04:24,160 --> 00:04:27,539
జపాన్, దక్షిణ కొరియాలు అలాస్కా కంటే చాలా దగ్గర కదా.

67
00:04:27,622 --> 00:04:28,665
ఎందుకు స్వదేశానికి తీసుకురావడం?

68
00:04:29,207 --> 00:04:31,376
ఆ వివరాలను నీకు చెప్పలేనని తెలుసు కదా.

69
00:04:35,129 --> 00:04:36,589
ఇది హ్యాకింగ్ గురించే కదా.

70
00:04:37,173 --> 00:04:39,968
మన బ్యాకప్ సర్వర్లలోని ఒకదాని ద్వారా
అతను ఏజెన్సీ డేటాబేస్ ని యాక్సెస్ చేసినట్టు

71
00:04:40,051 --> 00:04:41,719
మన ఎనలిస్టులు నిర్ధారించారు.

72
00:04:42,345 --> 00:04:43,680
ఎందుకు? దేని కోసం వెతికాడు?

73
00:04:45,139 --> 00:04:46,975
వెతకలేదు. దొరికింది.

74
00:04:47,976 --> 00:04:52,313
హావ్లాక్ "ఆర్కైవ్ 6" అనే
ఒక రహస్యమైన ఫైల్ ని తీసుకున్నాడు.

75
00:04:52,939 --> 00:04:54,232
ఆర్కైవ్ 6?

76
00:04:55,692 --> 00:04:56,901
ఆర్కైవ్ 6 అంటే ఏంటి?

77
00:04:57,735 --> 00:04:58,987
అది మన వ్యూహాలు, పద్ధతుల మాన్యువల్.

78
00:04:59,070 --> 00:05:03,575
ఆట్వాటర్ ప్రోటోకాల్ కింద,
మనం చంపేసిన ప్రతి శత్రువుకు సంబంధించిన

79
00:05:03,658 --> 00:05:08,329
వివరాలు అందులో ఉన్నాయి. ప్రస్తుతం
చంపే పనిలో ఉన్న, చంపాల్సిన టార్గెట్ల లిస్టుతో సహా.

80
00:05:08,413 --> 00:05:10,248
అయితే, అతను ఏజెన్సీపై యుద్ధం ప్రకటించాడా?

81
00:05:10,331 --> 00:05:12,417
ఆ ఆర్కైవ్ బయటపడినా,

82
00:05:13,042 --> 00:05:17,839
దాన్ని అతను ఎక్స్ ఛేంజ్ చేసినా, అమ్మినా
తదనంతర పరిణామాలు భయంకరంగా ఉంటాయి.

83
00:05:18,423 --> 00:05:19,841
నువ్వు అతడిని కనుగొనాల్సిందే, సిడ్.

84
00:05:19,924 --> 00:05:21,384
హావ్లాక్ ఆచూకీని కనుగొను.

85
00:05:21,467 --> 00:05:23,094
- హేయ్. హేయ్.
- ఆర్కైవ్ ని కనిపెట్టు లేదా…

86
00:05:23,177 --> 00:05:25,763
- నేను మళ్ళీ కాల్ చేస్తాను.
- హా, నువ్వు కాల్ చేయాల్సింది నాకు.

87
00:05:25,847 --> 00:05:27,807
నువ్వు ఇక మాట్లాడటం మొదలుపెడితే మంచిది.

88
00:05:27,891 --> 00:05:29,475
ఇప్పుడే… ఇప్పటికిప్పుడే, సరేనా?

89
00:05:29,559 --> 00:05:31,978
అతను ఇక్కడ ఎందుకు ఉన్నాడు?
నా భార్యని ఎందుకు అపహరించాడు?

90
00:05:34,314 --> 00:05:36,816
- ఇది నా మిషన్ కాదు.
- ఇది మిషనేమీ కాదు, సరేనా?

91
00:05:36,900 --> 00:05:40,278
ఇది నా జీవితం.
నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా భార్యని

92
00:05:40,361 --> 00:05:42,697
కిడ్నాప్ చేశాడు. ఎందుకో నాకు తెలియాలి.

93
00:05:42,780 --> 00:05:44,866
ఎందుకంటే, సీఐఏ పొరపాటు చేసింది.

94
00:05:45,742 --> 00:05:48,077
హావ్లాక్ ని స్వదేశానికి తీసుకొచ్చే ఆపరేషన్ విఫలమైంది.

95
00:05:48,161 --> 00:05:49,454
దాన్ని సరి చేయడానికే నేను ఇక్కడికి వచ్చా.

96
00:05:49,537 --> 00:05:52,457
నువ్వు సరి చేస్తావా? అవునా?
మరి అతడిని కాల్చేయమని చెప్పావే!

97
00:05:53,124 --> 00:05:54,167
అతడిని చంపాలని చూశావు కూడా.

98
00:05:54,250 --> 00:05:56,878
- నీపై నమ్మకం లేదని అతను అన్నాడు.
- మేము గూఢచారులం. అబద్ధాలు ఆడతాం.

99
00:05:56,961 --> 00:05:59,047
అంటే నేను నిన్ను కూడా నమ్మకూడదు, అంతే కదా?

100
00:05:59,130 --> 00:06:00,757
- చూడు, నా విధేయతపై నీకు అనుమానంగా ఉంటే…
- హా?

101
00:06:00,840 --> 00:06:02,675
…అలా అనుమానించేవారు చాలా మందే
ఉన్నారు. కానీ ఒకటి తెలుసుకో,

102
00:06:02,759 --> 00:06:05,094
నీ భార్య నీకు దక్కాలంటే, నీకున్న ఏకైక దారి నేనే.

103
00:06:05,929 --> 00:06:07,472
అయితే, నాకు చెప్పు, సరేనా? ఇప్పుడు మనమేం చేయాలి?

104
00:06:07,555 --> 00:06:08,556
ఇప్పటికిప్పుడు మనమేం చేయాలి?

105
00:06:08,640 --> 00:06:10,516
- అతను సంప్రదించేదాకా వేచి ఉందాం.
- వేచి ఉండమంటున్నావా?

106
00:06:10,600 --> 00:06:13,061
ఎక్స్ ఛేంజ్ కి రెడీ అని అతనికి చెబుదాం.
బెదిరించి పనులు చేయించుకోవడానికి ఆమె అతనికి కావాలి.

107
00:06:13,144 --> 00:06:14,229
కాబట్టి, ఆమెని ఏమీ చేయడు.

108
00:06:14,312 --> 00:06:15,980
ఇది నీకెలా తెలుసు? హా?

109
00:06:17,232 --> 00:06:18,316
అవునులే.

110
00:06:18,983 --> 00:06:20,485
అతనికి శిక్షణ ఇచ్చింది నువ్వే కదా.

111
00:06:21,069 --> 00:06:23,488
నా సహాయం పొందాలంటే, నేను నీకు నచ్చాల్సిన పని లేదు.

112
00:06:25,156 --> 00:06:26,574
కానీ నీకు నా సాయమైతే కావాలి.

113
00:06:36,376 --> 00:06:38,920
ముందు సెల్ టవర్ దగ్గరి నుండి ప్రారంభిద్దాం, సరేనా?
అతను అక్కడికి వెళ్లాడని తెలిసింది కదా.

114
00:06:39,003 --> 00:06:40,171
పెరీమీటర్ ని సెట్ చేయండి.

115
00:06:40,255 --> 00:06:42,048
సారా కారును ట్రేస్ చేయడానికి
ఇతర డిపార్టుమెంటులకు నోటీసు పంపు.

116
00:06:43,383 --> 00:06:45,134
ఈ దరిద్రుడి వల్ల మనకి డానీ దూరమయ్యాడు, హాచ్.

117
00:06:45,218 --> 00:06:46,344
నా భార్యని కూడా దూరం చేసుకోలేను.

118
00:06:47,428 --> 00:06:48,596
- సరే, అంతా ఓకే కదా?
- హా.

119
00:06:48,680 --> 00:06:50,431
- సరే. కానివ్వు.
- నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?

120
00:06:50,515 --> 00:06:52,016
ఈ తతంగం అంతటినీ మొదలుపెట్టడానికి వెళ్తున్నా.

121
00:06:54,811 --> 00:06:58,106
టిప్ లైన్ ని యాక్టివేట్ చేశాం. ఎన్.టీ.ఎస్.బీ వాళ్ళు
విమానం కూలిన చోటికి వెళ్లి విచారణ చేస్తున్నారు.

122
00:06:58,189 --> 00:07:01,234
గాంజ్ తో కూడా మాట్లాడా, ఇక్కడ మొబైల్ టవర్ ని
ఏర్పాటు చేయడానికి తను ఏటీ&టీ వాళ్ళతో మాట్లాడుతున్నాడు.

123
00:07:01,317 --> 00:07:03,194
- సూపర్. హావ్లాక్ ఏమైనా సంప్రదించాడా?
- ఇంకా లేదు,

124
00:07:03,278 --> 00:07:05,864
- కానీ మేము రేడియోలను పర్యవేక్షిస్తూ ఉన్నాం.
- రెండో ఛానెల్ జోలికి వెళ్ళవద్దు.

125
00:07:05,947 --> 00:07:07,282
- పోయినసారి అతను అదే ఛానెల్ వాడాడు. సరేనా?
- హా.

126
00:07:07,365 --> 00:07:08,783
సూపర్వైజర్ డెప్యూటీ రెమ్నిక్?

127
00:07:09,701 --> 00:07:10,952
నేను డెప్యూటీ మార్షల్ స్టీవెన్ కోల్ ని.

128
00:07:11,035 --> 00:07:12,871
- సియాటిల్ గాలింపు టాస్క్ ఫోర్స్ లో పని చేస్తున్నా.
- మంచిది.

129
00:07:12,954 --> 00:07:15,290
చూడండి, ఎక్కడ వెతకాలో చెప్పండి, వేట మాకు వదిలేయండి.

130
00:07:15,373 --> 00:07:18,167
అదంత తేలిక కాదు.
మనకి ఏటీవీలు కావాలి, స్నో మెషిన్లు కావాలి.

131
00:07:18,251 --> 00:07:19,335
వాటన్నిటినీ రవాణా చేయడానికి ట్రక్ కావాలి.

132
00:07:19,419 --> 00:07:21,963
నీటి సరఫరా, సెల్ సిగ్నల్స్ లేవు,
ఇంధనం సంగతి ఇక సరేసరి.

133
00:07:22,046 --> 00:07:24,716
అయ్యయ్యో, మీ కౌబాయ్స్ అందరూ
గుర్రాల మీద తిరుగుతుంటారు అనుకున్నానే.

134
00:07:24,799 --> 00:07:27,552
హా. జేన్, ఇతను కోల్. కోల్, ఈమె జేన్.

135
00:07:27,635 --> 00:07:29,721
చూడండి, మీరు నాకు ఒక పని చేసి పెట్టగలరా?

136
00:07:30,763 --> 00:07:33,892
హెన్రీ డేల్ సిక్లర్ అనే ఒక ఖైదీకి సంబంధించిన
పూర్తి వివరాలు సేకరించి నాకు ఇవ్వగలరా?

137
00:07:33,975 --> 00:07:35,643
- సిక్లర్? సరే.
- అవును.

138
00:07:35,727 --> 00:07:38,021
- అతను ముఖ్యమైన వాడా?
- ఇప్పుడేం కాదులే. అతను లొంగిపోయాడు.

139
00:07:38,104 --> 00:07:40,440
ఈ ఉదయం ఒక మహిళ దగ్గర
లొంగిపోయాడు. ఆమెకి డబ్బులు ఇచ్చాడు.

140
00:07:41,149 --> 00:07:43,568
సరే. ఒకరిని వెతకాల్సిన పని మనకి తగ్గిందిలే.

141
00:07:44,319 --> 00:07:46,321
అతను ఆమెని చంపేసి,
ఆ కారును తీసుకొని పరారై పోయి ఉండవచ్చు.

142
00:07:46,905 --> 00:07:49,365
కానీ అతనలా చేయలేదు. అతని వివరాలను సేకరించండి.

143
00:07:49,449 --> 00:07:51,784
ఏదీ మిస్ కాకుండా ఉండేలా
చూసుకుందాం, సరేనా? అలాగే ఇక్కడికి స్వాగతం!

144
00:07:51,868 --> 00:07:53,953
- అలాగే. హేయ్, ఫ్రాంక్?
- హా?

145
00:07:54,037 --> 00:07:55,622
మీ భార్య గురించి తెలిసింది.

146
00:07:55,705 --> 00:07:57,207
ఆమెకి ఏమీ కాకూడదని కోరుకుంటున్నా.

147
00:07:57,790 --> 00:07:59,709
ఆమెని అపహరించిన వాడికి నరకమంటే ఏంటో చూపిద్దాం మనం.

148
00:07:59,792 --> 00:08:01,461
రెండో ఛానెల్ జోలికి వెళ్ళకండి.

149
00:08:01,544 --> 00:08:02,629
సరే.

150
00:08:03,630 --> 00:08:04,631
జేన్,

151
00:08:05,465 --> 00:08:07,133
ఇంత మందికి ఆహారం ఎక్కడి నుండి తీసుకురావాలి మనం?

152
00:08:08,760 --> 00:08:10,637
- ఫ్రాంక్.
- హా.

153
00:08:10,720 --> 00:08:12,931
ఎరిన్, సారీ, నేను కారును పంపాల్సి వచ్చింది.

154
00:08:13,014 --> 00:08:14,891
- సారీ ఎందుకులే. రాత్రంతా నిద్రే లేదు.
- హా, అర్థం చేసుకోగలను.

155
00:08:14,974 --> 00:08:16,392
- పిల్లల గురించి ఏమైనా తెలిసిందా?
- ఇంకా లేదు.

156
00:08:16,476 --> 00:08:18,353
కానీ వాళ్లిద్దరూ స్కూల్ నుండి
కలిసే వెళ్లిపోయారని స్కూల్ నిర్ధారించింది.

157
00:08:18,436 --> 00:08:20,813
- ఓరి దేవుడా.
- వాళ్ళ సెల్ ఫోన్స్ ని ట్రేస్ చేస్తాం.

158
00:08:20,897 --> 00:08:22,440
- అసలు ఇదంతా ఎలా జరుగుతోంది?
- తెలీట్లేదు అదే.

159
00:08:22,524 --> 00:08:24,067
వాళ్ళు పాత నేనానా హైవేలో పెట్రోల్ పట్టుకోవడానికి ఆగారట,

160
00:08:24,150 --> 00:08:25,151
- దాని తర్వాతి సంగతి తెలీదు.
- హా.

161
00:08:25,235 --> 00:08:27,237
- దేవుడా, వాళ్ళెక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసు.
- నీ క్యాబిన్ కా?

162
00:08:27,320 --> 00:08:29,739
- అవును. క్యాబిన్ గురించి నీకెలా తెలుసు?
- ఊర్లోని వాళ్లందరికీ తెలుసు, ఫ్రాంక్.

163
00:08:29,822 --> 00:08:31,366
పర్వాలేదులే. ఏదేమైనా, వాళ్ళు అక్కడికి…

164
00:08:31,449 --> 00:08:33,368
మధ్యాహ్నం బయలుదేరారు,
ఈ గోల మొదలవ్వక ముందే చేరుకొని ఉంటారు.

165
00:08:33,450 --> 00:08:34,993
అందుకే వాళ్ళు మనకి కాల్ చేయలేదు.

166
00:08:35,078 --> 00:08:36,704
జేన్, అక్కడికి ఒక పోలీసును పంపుతావా?

167
00:08:36,788 --> 00:08:39,123
ఫ్రాంక్! సారా గురించి ఒక అప్డేట్.

168
00:08:39,207 --> 00:08:41,416
మనకొక ఆధారం దొరికింది. వాళ్ళు మీ ఇంటికి వెళ్లారు.

169
00:08:42,834 --> 00:08:45,380
తను ఎక్కడ ఉంది, హా?
ఏం జరుగుతోంది? ఎక్కడ తను?

170
00:08:45,463 --> 00:08:47,465
మీ పక్కింటి వ్యక్తి అతడిని
మీ ఇంటి ముందు ఉండగా చూశాడు. అతనే.

171
00:08:47,549 --> 00:08:49,968
ఫ్రాంక్, నువ్వు ఇది చూడాలి.

172
00:08:53,805 --> 00:08:55,723
ఒక వీడియో రికార్డ్ చేసినట్టున్నాడు.

173
00:08:55,807 --> 00:08:58,226
ఏదైనా డిమాండ్ చేయడానికో,
లేదా నీ భార్య బతికే ఉందని చూపించడానికో కావచ్చు.

174
00:08:59,102 --> 00:09:00,353
కానీ టేప్ లేదు.

175
00:09:01,521 --> 00:09:04,649
అతను మార్షల్స్ డేటాబేస్ ని యాక్సెస్ చేయడానికి
నీ కంప్యుటర్ లోకి లాగిన్ అయ్యాడని అనుకుంటున్నాం.

176
00:09:04,732 --> 00:09:06,776
విమానంలో ప్రయాణించిన వారి లిస్టు కోసం కూడా.

177
00:09:06,860 --> 00:09:08,903
నీ వ్యక్తిగత వస్తువులని కూడా వెతికినట్టున్నాడు.

178
00:09:08,987 --> 00:09:10,488
నీ బట్టలని, తుపాకీని భద్రపరిచే సేఫ్ ని వెతికాడు.

179
00:09:13,449 --> 00:09:14,450
అబ్బా.

180
00:09:15,285 --> 00:09:17,579
అందరూ బయటకు వెళ్ళండి. వెళ్ళండి త్వరగా.

181
00:09:17,662 --> 00:09:18,746
అందరూ బయటకు పదండి.

182
00:09:22,500 --> 00:09:23,501
నువ్వు ఉండు.

183
00:09:26,296 --> 00:09:29,465
సరే మరి, వాళ్ళు
నిన్న రాత్రంతా ఇక్కడే ఉన్నారు. ఎందుకు?

184
00:09:32,302 --> 00:09:33,803
ఒక ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు.

185
00:09:33,887 --> 00:09:36,890
ఎవరి బట్టలని అయినా, ఎవరి ఆయుధాలని అయినా
తీసుకుని వెళ్లి ఉండవచ్చు. నావే ఎందుకు?

186
00:09:36,973 --> 00:09:39,601
రికార్డింగ్ చేసి, టేపును ఎందుకు ఉంచలేదు?

187
00:09:39,684 --> 00:09:41,102
అతను నిన్ను గమనిస్తున్నాడు, ఫ్రాంక్.

188
00:09:42,103 --> 00:09:44,314
నిన్ను అర్థం చేసుకోవాలనుకుంటున్నాడు. అతను…

189
00:09:45,231 --> 00:09:48,693
నీకేవి ముఖ్యమైనవో తెలుసుకోవాలని,
నువ్వు ఎలా స్పందిస్తావో చూడాలని అనుకుంటున్నాడు.

190
00:10:06,336 --> 00:10:07,587
నీ భార్యదేనా అది?

191
00:10:07,670 --> 00:10:09,339
అవును, తన హారానికి లాకెట్ లా తగిలించుకుంది దీన్ని.

192
00:10:20,183 --> 00:10:21,184
ఇది నకిలీది.

193
00:10:24,520 --> 00:10:27,357
నా దగ్గర డబ్బులు లేనప్పుడు ప్రపోజ్ చేశా.
తర్వాత అసలైన డైమండ్ రింగ్ ఇవ్వాలనుకున్నా,

194
00:10:27,440 --> 00:10:30,276
కానీ ఒక డైమండ్ కోసం లోన్ తీసుకోవడానికి
తను అస్సలంటే అస్సలు ఒప్పుకోలేదు.

195
00:10:31,236 --> 00:10:33,488
టేపును కనుగొంటాం. నీ భార్యని కూడా కనుగొంటాం.

196
00:10:34,072 --> 00:10:35,698
తను క్షేమంగానే ఉందని పక్కాగా చెప్పగలను.

197
00:10:38,201 --> 00:10:39,786
నిన్ను ఎలా నమ్మను?

198
00:11:18,324 --> 00:11:19,409
ఫ్రాంక్, హాయ్.

199
00:11:20,159 --> 00:11:21,536
హాయ్.

200
00:11:22,662 --> 00:11:23,663
అతనికి…

201
00:11:24,289 --> 00:11:25,957
అతనికి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి.

202
00:11:33,047 --> 00:11:35,049
మైక్రోవేవ్ లో పెట్టవద్దు!
ఓవెన్ లో 175 డిగ్రీల వద్ద 20 నిమిషాలు బేక్ చేయి

203
00:11:56,154 --> 00:11:57,572
ఇది నేరం జరిగిన చోటని నీకు తెలుసు కదా.

204
00:11:58,489 --> 00:11:59,657
హా, నాకు ఆకలిగా ఉంది.

205
00:11:59,741 --> 00:12:01,284
హా, నువ్వు తినేది ఆధారం అయ్యుండొచ్చు.

206
00:12:06,873 --> 00:12:07,874
మ్.

207
00:12:13,129 --> 00:12:14,214
వంకాయా?

208
00:12:15,089 --> 00:12:16,090
అవును.

209
00:12:16,633 --> 00:12:19,135
నేను చివరి కొలెస్టరాల్ టెస్ట్ చేయించుకున్నప్పుడు
తను దానితో వంటలు చేయడం ప్రారంభించింది.

210
00:12:25,099 --> 00:12:26,643
నేను ఇంటికి వచ్చి ఉండాల్సింది.

211
00:12:28,019 --> 00:12:29,312
తను అన్నట్టు ఇంటికి వచ్చి ఉండాల్సింది.

212
00:12:29,395 --> 00:12:30,855
హా, తన ఆచూకీ మనం తప్పక కనిపెడతాం.

213
00:12:31,689 --> 00:12:33,399
వాడు ఇక్కడికి వచ్చాడు, హాచ్.

214
00:12:33,483 --> 00:12:35,360
నా ఇంటికి వచ్చాడు వాడు.

215
00:12:36,110 --> 00:12:37,695
- హేయ్. శాంతించు, నన్ను చూడు.
- దరిద్రుడు…

216
00:12:37,779 --> 00:12:39,781
మనం తన ఆచూకీని
తప్పక కనిపెడతాం. ఓసారి ఇలా చూడు, ఫ్రాంక్.

217
00:12:41,074 --> 00:12:44,077
ఏది ఏమైనా, తనని, లూక్ ని తప్పక కనిపెడతాం మనం.

218
00:12:46,079 --> 00:12:47,872
క్లింట్ ఇప్పుడు క్యాబిన్ కి వెళ్తూ ఉన్నాడు.

219
00:12:48,373 --> 00:12:49,582
పిల్లలకి కూడా ఏమీ కాదు.

220
00:12:51,543 --> 00:12:52,544
సరేనా?

221
00:12:57,048 --> 00:12:59,551
ఈ ఊర్లోని జనాలకు, పరిస్థితి
ఎంత దారుణంగా మారబోతోందో అస్సలు తెలీదు.

222
00:13:16,818 --> 00:13:17,819
కీరా?

223
00:13:47,056 --> 00:13:48,641
క్రిస్మస్ అలంకరణలు కనిపించాయి.

224
00:13:49,142 --> 00:13:51,477
శాంటా బొమ్మలు చాలా ఉన్నాయి.

225
00:13:53,229 --> 00:13:54,564
ఏం చేస్తున్నావు?

226
00:13:54,647 --> 00:13:58,651
ఇరుక్కున్న బండిని బయటకు తీయడానికి పార కోసం
వెతుకుతున్నా. అప్పుడు మనం వెళ్లిపోవచ్చు కదా.

227
00:14:01,237 --> 00:14:04,490
నిన్న రాత్రి బాగా గడిచింది, కదా?

228
00:14:04,574 --> 00:14:05,909
అవును. బాగా గడిచింది.

229
00:14:05,992 --> 00:14:10,413
కానీ మనం ఇక్కడ ఇరుక్కుపోయాం,
నాకేమో ఆకలేస్తోంది, నీ దగ్గర ప్లాన్ ఏదీ లేదు.

230
00:14:12,290 --> 00:14:13,291
శాంటా సూప్ చేసుకుందామా?

231
00:14:13,374 --> 00:14:16,252
లూక్, నేను చాలా సీరియస్ గా మాట్లాడుతున్నా.

232
00:14:20,298 --> 00:14:22,425
అంతా రొమాంటిక్ గా ఉండాలని
ఇలా చేశా, అర్థమైందా? మనం ఇక్కడ

233
00:14:22,508 --> 00:14:25,511
- ఇరుక్కుపోతామని నేనేం అనుకోలేదు.
- నువ్వు అనుకోలేదులే.

234
00:14:25,595 --> 00:14:27,847
- అంటే?
- నువ్వు ఏమీ ఆలోచించవు అసలు.

235
00:14:28,848 --> 00:14:30,850
- నేను ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటా. నీ ఉద్దేశం ఏంటి?
- లేదు.

236
00:14:30,934 --> 00:14:32,435
- నువ్వు ఏదీ గమనించవు అసలు.
- నేను…

237
00:14:36,189 --> 00:14:38,024
- ఎందుకు ఇలా అంటున్నావు?
- లూక్!

238
00:14:38,107 --> 00:14:39,108
ఏంటి?

239
00:14:39,192 --> 00:14:41,110
నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా
వాతావరణాన్ని చెక్ చేసి ఉండేవాళ్ళు,

240
00:14:41,194 --> 00:14:42,904
కొంత ఆహారాన్ని తెచ్చి ఉండేవాళ్ళు,
పెట్రోల్ పట్టించి ఉండేవాళ్ళు,

241
00:14:42,987 --> 00:14:45,990
టైర్లకు పెట్టడానికి స్నో చెయిన్స్ కూడా
తెచ్చి ఉండేవాళ్ళేమో, ఎందుకంటే ఇది అలాస్కా కదా.

242
00:14:46,699 --> 00:14:47,700
కానీ నువ్వు ఇవేమీ చేయలేదు.

243
00:14:50,578 --> 00:14:53,122
సెల్ సిగ్నల్ లేదు, ఎవరూ సాయం కోసం రావట్లేదు.

244
00:14:53,206 --> 00:14:55,124
కాబట్టి మంచును తవ్వి
కారును బయటకి తీసి, బయలుదేరుదాం.

245
00:14:56,960 --> 00:14:58,294
దేవుడా!

246
00:15:11,015 --> 00:15:14,435
నువ్వు నోరు తెరిచావని
అనిపించినా చాలు, నీ కంఠం కోసేస్తాను.

247
00:15:15,895 --> 00:15:17,564
పద. నడువు.

248
00:15:23,611 --> 00:15:25,029
ఆ రేడియో ఎక్కడిది?

249
00:15:25,697 --> 00:15:26,698
దొంగిలించా.

250
00:15:27,740 --> 00:15:29,033
ఈ ఇద్దరు సన్నాసులు ఎక్కడ దొరికారు?

251
00:15:29,117 --> 00:15:30,451
ఎక్కడ దొరికితే ఏంటిలే!

252
00:15:31,327 --> 00:15:32,453
ఏమంటున్నారు రేడియోలో?

253
00:15:32,537 --> 00:15:35,456
కాస్త ముందుకు వెళ్తే, నదిపై ఓ వంతెన ఉంది,
అక్కడ చాలా మంది పోలీసులు ఉన్నారట.

254
00:15:37,250 --> 00:15:40,920
ఆ రేడియో నాకు ఇవ్వండి,
మీ సంకెళ్లని తెంచడానికి ప్రయత్నం చేస్తా, ఏమంటారు?

255
00:15:59,355 --> 00:16:00,440
ఫ్రాంక్, హాయ్.

256
00:16:01,232 --> 00:16:02,442
హాయ్.

257
00:16:03,985 --> 00:16:04,986
అతనికి…

258
00:16:05,862 --> 00:16:07,238
అతనికి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి.

259
00:16:08,656 --> 00:16:10,325
విమానంలో…

260
00:16:10,408 --> 00:16:12,744
ఒక ఖైదీ ఉన్నాడు.

261
00:16:12,827 --> 00:16:16,247
అతను 12ఏ సీట్లో కూర్చున్నాడు.

262
00:16:18,416 --> 00:16:20,001
అతని ఆచూకీని నువ్వు కనిపెట్టి,

263
00:16:20,084 --> 00:16:23,504
ఇతనికి అప్పగిస్తే, నన్ను వదిలేస్తాడు.

264
00:16:24,923 --> 00:16:26,090
అతని ప్రాణానికి నా ప్రాణం అన్నమాట.

265
00:16:29,427 --> 00:16:33,890
ఆ ఖైదీని ఏడవ పంప్ స్టేషన్ కి
ఒకటిన్నర కిలోమీటరు ఉత్తరం వైపుకి తీసుకురా.

266
00:16:34,682 --> 00:16:37,518
మార్కర్ 452 దగ్గరికి రావాలి.
పోలీసులు ఎవరినీ తీసుకురాకు.

267
00:16:38,102 --> 00:16:39,354
ఒక్కడివే రా.

268
00:16:40,230 --> 00:16:42,232
ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకి.

269
00:16:42,857 --> 00:16:43,942
ఫ్రాంక్, ఐ లవ్ యూ.

270
00:16:46,736 --> 00:16:48,196
ఇది చాలా ముఖ్యం, ఫ్రాంక్.

271
00:16:49,197 --> 00:16:51,533
మనిద్దరం ఒకరినొకరం
నమ్మవచ్చో లేదో దీని ద్వారా తెలిసిపోతుంది.

272
00:16:53,576 --> 00:16:54,911
నీ భార్యంటే నీకు ప్రాణమనే అనుకుంటున్నా.

273
00:16:55,495 --> 00:16:57,121
12ఏ సీట్లో కూర్చున్నవాడిని
అప్పగిస్తావనే అనుకుంటున్నా.

274
00:16:58,831 --> 00:17:02,627
నువ్వు ఆ పని చేయకపోతే, సారాని
మర్చిపోవలసిందే అని కూడా తెలుసుకో.

275
00:17:15,348 --> 00:17:16,683
దీన్ని మా ఇంటి నుండి దొంగిలించావు కదా.

276
00:17:17,308 --> 00:17:19,936
12ఏలో కూర్చున్న ఖైదీ పేరు, హెన్రీ డేల్ సిక్లర్.

277
00:17:20,019 --> 00:17:22,605
- వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటో నాకు తెలీలేదు…
- నువ్వు పోలీసుల ఆధారాన్ని దొంగిలించావు.

278
00:17:23,313 --> 00:17:24,398
నిన్ను కాపాడటానికే.

279
00:17:24,482 --> 00:17:27,026
నీ భార్యని నీ చెంతకు చేర్చేందుకే,
ఒకవేళ ఇది పోలీసులకే చిక్కి ఉంటే…

280
00:17:27,110 --> 00:17:28,528
పోలీసులు నా భార్య కోసం గాలిస్తున్నారు.

281
00:17:28,611 --> 00:17:30,196
నేను కూడా పోలీసునే.

282
00:17:33,032 --> 00:17:36,244
మాకు కొన్ని నియమాలు, పద్ధతి ఏడ్చాయి,
సీఐఏ లాగా కాదు మేము.

283
00:17:37,579 --> 00:17:38,955
హావ్లాక్, నీకు ఆ నియమాలను ఉల్లంఘించే అవకాశం

284
00:17:39,038 --> 00:17:40,164
- ఇస్తున్నాడు.
- నీకర్థం కావట్లేదు.

285
00:17:40,248 --> 00:17:42,959
నీ నమ్మకాన్ని నిరూపించుకునే అవకాశం ఇస్తున్నాడు.
నిజంగానే నేను సాయపడాలనే చూస్తున్నా.

286
00:17:43,042 --> 00:17:45,295
- దేవుడా.
- అతను చెప్పినట్టు చేస్తే…

287
00:17:45,378 --> 00:17:46,963
వాడితో నేను బేరసారాలాడే ప్రసక్తే లేదు.

288
00:17:47,046 --> 00:17:48,798
నీకు నీ భార్య కావాలా, వద్దా?

289
00:17:48,882 --> 00:17:51,885
చెప్తున్నా కదా, ఫ్రాంక్.
ఈ వ్యూహాలే నేను అతనికి నేర్పింది.

290
00:17:51,968 --> 00:17:55,054
హావ్లాక్ బలహీనతలను పసిగట్టి,
వాటిని తన స్వప్రయోజనానికి వాడుకుంటాడు.

291
00:17:55,847 --> 00:17:58,850
సారా విషయంలో వాడు చేసేది
కేవలం ఇచ్చిపుచ్చుకునే యవ్వారమే.

292
00:17:58,933 --> 00:18:01,436
ఆధిపత్యాన్ని చూపించుకోవడానికే,
అతను ఇలా బందీలను వాడుకుంటాడు,

293
00:18:01,519 --> 00:18:04,689
అది మనకి మంచిదే,
ఎందుకంటే మనం తెలివిగా వ్యవహరిస్తే,

294
00:18:04,772 --> 00:18:07,400
అతను చెప్పింది చేస్తే, సారాని దక్కించుకోవచ్చు.

295
00:18:07,483 --> 00:18:08,568
తర్వాతి ప్రామాణీకరణ:
కౌంట్ డౌన్ రీసెట్

296
00:18:12,447 --> 00:18:13,448
హెన్రీ సిక్లర్.

297
00:18:13,531 --> 00:18:15,867
నీ భార్య కోసం ఆ ఖైదీని పంపిస్తావా లేదా?

298
00:18:22,081 --> 00:18:23,791
హెన్రీ డేల్ సిక్లర్.

299
00:18:23,875 --> 00:18:26,836
సెక్యూరిటీలు, నగదు బదిలీలలో మోసాలకు పాల్పడినందుకు,
మనీ లాండరింగ్ కి పాల్పడినందుకు కేసులున్నాయి.

300
00:18:26,920 --> 00:18:28,504
అండర్ వరల్డ్ కి ఆడిటర్ గా పని చేశాడు.

301
00:18:28,588 --> 00:18:30,882
నేర సంస్థలకు ఫైనాన్షియల్ ఆడిట్లు చేసి,

302
00:18:30,965 --> 00:18:32,967
సంస్థలో అంతర్గతంగా
ఎవరు డబ్బులు కాజేస్తున్నారో పట్టించేవాడు.

303
00:18:33,051 --> 00:18:34,385
ఇతడిని ఎవరూ మిస్ అవ్వాలనుకోరు.

304
00:18:34,469 --> 00:18:37,555
గమ్మత్తైన విషయం ఏంటంటే, సిక్లర్, తన క్లయింట్స్
నుండే డబ్బులు కాజేస్తున్నాడని బయటపడింది.

305
00:18:37,639 --> 00:18:40,183
అందుకని వాళ్ళు అతడిని వేటాడి,
బతికి ఉండగానే తగలబెట్టేశారు.

306
00:18:40,266 --> 00:18:42,936
ఆ దరిద్రుడు ఒక నెల కోమాలో ఉండి,
రెండు చేతులనూ కోల్పోయాడు.

307
00:18:43,019 --> 00:18:44,729
అప్పట్నుంచీ పరారీలో ఉన్నాడు.

308
00:18:45,396 --> 00:18:47,482
- ఎవరు ఆమె?
- నా తోక. ఇంతకీ ఎవరి తరఫున పని చేసేవాడు?

309
00:18:48,066 --> 00:18:49,943
ఏ సంస్థకి పని చేయలేదు అని అడగాలి.

310
00:18:50,026 --> 00:18:52,362
వాళ్ళ తరఫున పని చేయడమే కాదు,
వాళ్ళ దగ్గరి నుండి నొక్కేశాడు కూడా.

311
00:18:52,445 --> 00:18:53,947
ఏ క్షణమైనా మనోడు బకెట్ తన్నవచ్చు.

312
00:18:55,490 --> 00:18:56,824
మీ తోక ఏ శాఖలో పని చేస్తోంది?

313
00:18:56,908 --> 00:18:58,368
- స్టేట్ డిపార్టుమెంట్.
- తొక్కేం కాదు.

314
00:18:58,451 --> 00:19:00,828
- తను సీఐఏ ఏజెంట్. ఈమె అతని దరిదాపుల్లో ఉండకూడదు.
- సరే.

315
00:19:01,329 --> 00:19:02,664
మీరు అతని కోసమే వచ్చారా?

316
00:19:04,332 --> 00:19:05,583
మాకు ఒక నిమిషం ఏకాంతం ఇస్తారా?

317
00:19:06,459 --> 00:19:07,544
అలాగే.

318
00:19:09,504 --> 00:19:11,589
- ఇతనెవరో నీకు తెలుసా?
- అతడిని ఇదే నేను మొదటిసారి చూడటం.

319
00:19:11,673 --> 00:19:12,924
ఒకసారి అతడిని చూడు.

320
00:19:13,007 --> 00:19:14,634
అతనికి ఇతర ఖైదీలంటే భయమే లేదు.

321
00:19:15,176 --> 00:19:17,220
ఏదో కారణం ఉండే ఇక్కడికి వచ్చాడు. ఏదో ప్లాన్ ఉంది.

322
00:19:17,887 --> 00:19:18,888
మనం ఇతడిని అప్పగించేయాలి.

323
00:19:19,556 --> 00:19:22,559
చూడు, ఒక నేరస్థుడిని అప్పగించి, నా భార్యను
తెచ్చుకోవడమనేది అంత తేలికైన విషయం కాదు, సరేనా?

324
00:19:23,476 --> 00:19:25,812
నేను ఆ పని చేస్తే, మళ్ళీ హావ్లాక్
అదే పని చేయడు అనడానికి గ్యారంటీ ఏంటి?

325
00:19:25,895 --> 00:19:27,981
నా కొడుకును, నా మిత్రులని,
ఈ ఊర్లోని ఎవరినైనా అతను అపహరించవచ్చు.

326
00:19:28,064 --> 00:19:30,525
- సరే.
- లేదు, లేదు. నేను మాట్లాడటం ఇంకా పూర్తి కాలేదు.

327
00:19:30,608 --> 00:19:34,362
సరేనా? నువ్వు ఇక్కడ నా అతిథివి, నా సలహాదారురాలివి.

328
00:19:34,445 --> 00:19:37,991
సరేనా? నా ఖైదీతో కానీ,
నా మనుషులతో కానీ మాట్లాడటానికి వీల్లేదు.

329
00:19:38,074 --> 00:19:42,161
హావ్లాక్ గురించి ఏమైనా తెలిస్తేనే మాట్లాడాలి,
లేదంటే నా తోకలా నిశ్శబ్దంగా ఉండాలి.

330
00:19:42,245 --> 00:19:43,246
అర్థమైందా?

331
00:19:45,206 --> 00:19:47,500
- నీ సలహాదారురాలిగా ఒక సలహా…
- చెప్పు.

332
00:19:48,751 --> 00:19:50,753
నువ్వు ఇతడిని అప్పగించేయాలి.

333
00:19:51,421 --> 00:19:52,422
నా మాటని నమ్ము.

334
00:19:55,174 --> 00:19:56,301
నమ్మకం.

335
00:19:57,719 --> 00:19:59,470
చాలా గమ్మత్తైన విషయం అది.

336
00:20:00,096 --> 00:20:02,932
నమ్మకం అనేది, ఆపరేషన్లో ఉన్న
ప్రతి నెట్వర్క్ కి కూడా చాలా ముఖ్యమైనది.

337
00:20:03,725 --> 00:20:06,394
ఎందుకంటే, ప్రతి నెట్వర్క్ కి
భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి,

338
00:20:06,477 --> 00:20:10,398
అది అమరిక సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు,
లేదా టార్గెట్ చేసి దాడులు చేయడం వల్ల కావచ్చు.

339
00:20:10,940 --> 00:20:13,109
ఎవరైనా మనం నమ్మే నెట్వర్క్ కి సంబంధించి,
ఒక ఉదాహరణ ఇవ్వగలరా?

340
00:20:14,986 --> 00:20:17,030
- చెప్పు.
- సెల్ ఫోన్లు?

341
00:20:17,113 --> 00:20:18,865
లేదు. సెల్ ఫోన్లను…

342
00:20:18,948 --> 00:20:21,117
నిజం చెప్పాలంటే, నేను ఏ సెల్ ఫోన్ నెట్వర్క్ ని కూడా

343
00:20:21,201 --> 00:20:23,453
పెద్దగా నమ్మను, కాబట్టి సారీ.
ఇంకో ఉదాహరణని చెప్పండి.

344
00:20:23,995 --> 00:20:24,996
నువ్వు చెప్పు.

345
00:20:25,079 --> 00:20:26,456
- ఎయిర్లైన్స్?
- ఏమన్నారు?

346
00:20:26,539 --> 00:20:27,665
- ఎయిర్లైన్స్.
- ఎయిర్లైన్స్.

347
00:20:28,416 --> 00:20:30,084
అవును. దేవుడా. ఎయిర్లైన్స్.

348
00:20:30,585 --> 00:20:33,463
అవి టేకాఫ్ సరిగ్గా చేస్తాయని
మనం నమ్ముతాం. నేను అయితే నమ్ముతా.

349
00:20:33,546 --> 00:20:35,965
అవి ల్యాండింగ్ సరిగ్గా చేస్తాయని నమ్ముతాం.
మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయని నమ్ముతాం.

350
00:20:36,049 --> 00:20:37,550
మన ప్రాణాలకి ఏమీ కాదని నమ్ముతాం.

351
00:20:37,634 --> 00:20:39,093
కానీ వైమానిక రంగంపై మీకు నమ్మకం పోవడానికి

352
00:20:39,177 --> 00:20:41,721
ఎన్ని విమానాలు కూలాల్సి ఉంటుంది?

353
00:20:41,804 --> 00:20:44,474
ఎన్ని? నేను మీకు కొన్ని గణాంకాలు ఇస్తాను.

354
00:20:44,557 --> 00:20:48,561
ప్రతి రోజు లక్ష కమర్షియల్ విమానాలు తిరుగుతూ ఉంటాయి.

355
00:20:49,896 --> 00:20:51,606
వైమానిక రంగంపై మీకు నమ్మకం పోవడానికి

356
00:20:51,689 --> 00:20:53,900
- విమానాల కూలు రేటు ఎంత శాతం ఉండాలి…
- నాలుగు.

357
00:20:56,444 --> 00:20:58,947
- నాలుగు శాతం. బాగానే గెస్ చేశారు.
- నాలుగు విమానాలు.

358
00:21:00,156 --> 00:21:02,492
సెప్టెంబర్ 11, 2001.

359
00:21:05,954 --> 00:21:09,958
సెప్టెంబర్ 11వ తేదీన .004% విమానాలని హైజాక్ చేశారు.

360
00:21:12,210 --> 00:21:15,380
ఆ తర్వాతి మూడు రోజుల పాటు,
ప్రపంచవ్యాప్తంగా ఒక్క విమానం కూడా గాల్లోకి ఎగరలేదు.

361
00:21:17,674 --> 00:21:19,175
మనం ఆ వ్యవస్థపై నమ్మకం కోల్పోయాం.

362
00:21:21,636 --> 00:21:25,473
మన నమ్మకాన్ని పోగొట్టడానికి, ఏ చెడు వ్యక్తి అయినా
ప్రతి విమానాన్ని కూల్చాల్సిన పని లేదు.

363
00:21:26,474 --> 00:21:30,812
కూలే అవకాశం ఉంది అన్న ఆలోచనని పెంచితే సరిపోతుంది.

364
00:21:31,813 --> 00:21:33,857
దీన్ని జరగకుండా ఎలా ఆపగలం
అనే దానికి సంబంధించిన అధ్యయనాన్నే,

365
00:21:33,940 --> 00:21:36,359
"పుంజుకోగల సామర్థ్యం తాలూకు
అధ్యయనం" అని అంటారు.

366
00:21:41,489 --> 00:21:42,657
థ్యాంక్యూ. ఎక్స్ క్యూజ్ మీ.

367
00:21:44,701 --> 00:21:48,037
మీ లెక్చర్ చాలా ఆసక్తికరంగా ఉంది.
పుంజుకోగల సామర్థ్యం, ప్రపంచాంతాం మొదలైనవి.

368
00:21:49,539 --> 00:21:51,875
- థ్యాంక్యూ. మిస్…
- విటేకర్.

369
00:21:52,542 --> 00:21:53,918
పీఎండీ ఇండస్ట్రీస్.

370
00:21:54,002 --> 00:21:56,087
మీకు కాఫీ ఏమైనా ఇప్పించే అవకాశం ఇస్తారా?

371
00:21:56,838 --> 00:21:57,839
మిస్టర్ సిక్లర్.

372
00:21:58,965 --> 00:22:00,592
నేను ఫ్రాంక్ రెమ్నిక్.

373
00:22:00,675 --> 00:22:02,510
నేను ఇక్కడ ఇంఛార్జీ అయిన యుఎస్ మార్షల్ ని.

374
00:22:03,845 --> 00:22:07,557
హావ్లాక్ మా ఇంట్లో నీ ఫైల్ కోసం వెతికాడని నాకు తెలుసు.

375
00:22:07,640 --> 00:22:10,268
కాబట్టి, నువ్వు, హావ్లాక్ ఒకరికొకరు
ఎలా తెలుసో చెప్పు, హెన్రీ.

376
00:22:12,312 --> 00:22:13,313
సరే.

377
00:22:15,106 --> 00:22:17,650
మరి ఎందుకు లొంగిపోయావు అని అయినా చెప్తావా?

378
00:22:19,944 --> 00:22:21,863
నీలాంటి పోలీసోడు సంవత్సరానికి ఎంత సంపాదిస్తాడు?

379
00:22:21,946 --> 00:22:23,948
డెబ్భై వేల డాలర్లా? పోనీ ఎనభై వేల డాలర్లా?

380
00:22:24,032 --> 00:22:25,074
తను ఎక్కడ ఉంది, హెన్రీ?

381
00:22:25,158 --> 00:22:27,911
కానీ కామెడీ ఏంటంటే, అంత
తక్కువ జీతంతో కూడా మీరు వీరోచితంగా పని చేసేస్తారు.

382
00:22:29,204 --> 00:22:31,998
మీరు ప్రాణాలను పణంగా పెడతారు.
కానీ వచ్చేది మాత్రం చాలీచాలని జీతం.

383
00:22:32,081 --> 00:22:33,917
- హా.
- అయినా కానీ ఎందుకు ఈ ఉద్యోగం చేయడం?

384
00:22:35,501 --> 00:22:38,338
మాకు 57 ఏళ్లకే రిటైర్మెంట్ ఉంటుంది. అది తప్పనిసరి.

385
00:22:38,421 --> 00:22:39,839
చచ్చేదాకా జీవిత, ఆరోగ్య బీమా సదుపాయాలుంటాయి.

386
00:22:41,549 --> 00:22:43,259
దాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే
ఆ జీతం పర్వాలేదనే అనిపిస్తుంది.

387
00:22:44,427 --> 00:22:47,597
కానీ నువ్వు బ్యాక్ గ్రౌండ్ చెక్ దశని దాటలేవులే,

388
00:22:47,680 --> 00:22:49,140
కాబట్టి ఇంకోసారి అడుగుతున్నా.

389
00:22:49,224 --> 00:22:53,478
హావ్లాక్ గురించి, అతను
అపహరించిన మహిళ గురించి నాకు చెప్పు.

390
00:22:55,563 --> 00:22:57,440
ఆమె నీ భార్య అని నాకు తెలుసు.

391
00:22:58,066 --> 00:22:59,609
ఆమె ప్రమాదంలో ఉందని కూడా తెలుసు.

392
00:22:59,692 --> 00:23:02,028
- నేను అదే విన్నాను మరి.
- అది నీకు హావ్లాక్ చెప్పాడా?

393
00:23:02,111 --> 00:23:03,863
తను కత్తిలా ఉంటుందని కూడా తెలుసు.

394
00:23:03,947 --> 00:23:05,698
హెన్రీ, నీకు సాయపడాలనే చూస్తున్నా నేను, సరేనా?

395
00:23:07,367 --> 00:23:10,411
ఒరేయ్, నాకు నీ సాయం అక్కర్లేదు.
నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి.

396
00:23:10,495 --> 00:23:13,248
- హావ్లాక్ తోనా?
- నీ బాస్ కి కాల్ చేయి. అతనే చెప్తాడు.

397
00:23:14,165 --> 00:23:15,792
విసిరేసినట్టు ఉండే ఈ తొక్కలో ప్రాంతం నుండి

398
00:23:15,875 --> 00:23:17,418
- నేను సాయంత్రానికల్లా వెళ్ళిపోతా.
- అవునా?

399
00:23:20,755 --> 00:23:22,840
అబ్బో. మనోడికి కోపం వచ్చిందే.

400
00:23:22,924 --> 00:23:25,635
- అవును, కోపం వచ్చింది.
- సరే. ఒకటి చెప్పనా?

401
00:23:25,718 --> 00:23:27,679
నీ పిచ్చిది ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుందా?

402
00:23:27,762 --> 00:23:30,098
- అవును.
- దగ్గరకు రా. చెప్తాను.

403
00:23:30,682 --> 00:23:32,183
- నాకు నిజం తెలుసు. అవును.
- అవునా?

404
00:23:32,267 --> 00:23:34,018
- ఓకే.
- ఇక్కడికి రా. దగ్గరికి రావాలి.

405
00:23:34,686 --> 00:23:36,354
- రహస్యంగా చెవిలో చెప్తా.
- అవునా? వచ్చా.

406
00:23:38,356 --> 00:23:39,566
తాళం చెవులు!

407
00:23:40,984 --> 00:23:43,444
ఏంటి? ఏం పీకుతావురా? హా?

408
00:23:43,528 --> 00:23:44,988
నన్ను గాయపరచగలనని అనుకుంటున్నావా?

409
00:23:45,071 --> 00:23:46,698
బాధ అంటే ఏంటో నాకు తెలీదని అనుకుంటున్నావా?

410
00:23:46,781 --> 00:23:48,157
రేయ్, నాపై హత్యాయత్నం జరిగింది రా.

411
00:23:48,241 --> 00:23:51,286
నన్ను తగలబెట్టేశారు. కానీ నేను చావలేదు.

412
00:23:51,369 --> 00:23:54,414
నాకేం కాదు. నన్ను ఎవరూ ఏం చేయలేరు.

413
00:23:54,497 --> 00:23:57,542
కాబట్టి, మీ బాస్ కి కాల్ చేసి,
నన్ను తీసుకెళ్లడానికి వచ్చే బండి ఎక్కడ ఉందో కనుక్కో.

414
00:23:57,625 --> 00:23:58,626
ఒకసారి చుట్టూ సరిగ్గా చూడు.

415
00:23:59,711 --> 00:24:00,712
ఓకే, ఎక్కడ ఉన్నావు?

416
00:24:01,880 --> 00:24:04,549
ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నావు.
నీకు ఇక్కడ హక్కులేం ఉండవు.

417
00:24:04,632 --> 00:24:05,800
నువ్వు ఇక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలీదు.

418
00:24:07,594 --> 00:24:10,430
మళ్ళీ వస్తాను, అప్పుడు
నాకేం చెప్పాలో ఆలోచించుకుని చెప్పు,

419
00:24:11,180 --> 00:24:14,017
ఎందుకంటే, నాకు తెలిసినంత వరకు,
నిన్ను బయటకు తీసుకుని వెళ్లి వదిలేస్తే,

420
00:24:15,101 --> 00:24:17,604
దిక్కూమొక్కూ లేక ఎటు వెళ్ళాలో తెలీక చస్తావు.

421
00:24:23,818 --> 00:24:24,819
తలుపు తెరవండి.

422
00:25:07,904 --> 00:25:09,948
జంతువు, కదా? ఇది ఒక జంతువు పనే అయ్యుంటుంది.

423
00:25:10,031 --> 00:25:11,616
ఆ గీతలు చూడు.

424
00:25:13,117 --> 00:25:15,662
ఇప్పుడే చేద్దాం? ఇతడిని డాక్టర్ కి చూపించాలి.

425
00:25:18,498 --> 00:25:19,541
ఎక్కడి నుండి వచ్చాడు ఇతను?

426
00:25:20,041 --> 00:25:22,210
- హైకరా?
- ఇంత దూరం హైకింగ్ చేసుకుంటూ వచ్చాడా?

427
00:25:23,127 --> 00:25:24,420
బహుశా వేటకి వచ్చాడేమో.

428
00:25:24,504 --> 00:25:27,423
అయితే, తుపాకీ ఎక్కడ? ఇంకా ఇతని స్నో మెషిన్ ఎక్కడ?

429
00:25:27,507 --> 00:25:29,759
- లేదా ఇతని స్నేహితులు…
- అబ్బా. అవేం నాకు తెలీదు, లూక్. సరేనా?

430
00:25:30,343 --> 00:25:32,595
నాకు తెలిసిందల్లా,
మన దగ్గర ఫోన్ కానీ, కారు కానీ ఏవీ లేవు.

431
00:25:32,679 --> 00:25:35,056
మనమేమీ చేయకపోతే, ఇతని ప్రాణాలు పోతాయి.

432
00:25:45,316 --> 00:25:47,735
- ఏం జరుగుతోంది?
- ఫ్రాంక్, మాకు ఒకడు దొరికాడు.

433
00:25:51,239 --> 00:25:53,324
బాబోయ్, షూటర్.
నువ్వు గడ్డకట్టుకుపోయిన వ్యక్తిని కాల్చావు.

434
00:25:53,408 --> 00:25:54,409
లేదు.

435
00:25:54,492 --> 00:25:56,369
కాల్చినప్పుడు అతను గడ్డకట్టుకుపోయి
ఉన్నాడని మాకు తెలీలేదు.

436
00:25:56,452 --> 00:25:57,620
ప్రమాదకరమైన వ్యక్తిలా అనిపించాడు.

437
00:25:58,288 --> 00:25:59,873
అవును, పీట్, అంతే.

438
00:26:01,791 --> 00:26:04,210
గడ్డకట్టిన శవం కోసం ఒక బాడీ బ్యాగ్ తెస్తారా?

439
00:26:04,294 --> 00:26:07,130
- ఏమైనా రివార్డ్ ఉందా?
- లేదు. రివార్డ్ ఏమీ లేదు. మీరందరూ ఇంటికి వెళ్ళండి.

440
00:26:07,213 --> 00:26:09,549
మిత్రులారా, ఒక ఖైదీ శవం వచ్చింది.

441
00:26:10,300 --> 00:26:11,801
డ్రైవర్ వాంగ్మూలం తీసుకోండి.

442
00:26:11,885 --> 00:26:14,512
- ఫ్రాంక్, నాకేం అనిపిస్తోందంటే…
- అది మంచి ఐడియానే అంటావా?

443
00:26:15,722 --> 00:26:18,057
- నన్ను డెప్యుటీగా పెట్టుకో.
- కుదరదు.

444
00:26:18,141 --> 00:26:20,476
నేనందరినీ అడుగుతూ ఉన్నా. సూర్యాస్తమయంలోగా
ఇక్కడికి 15-20 మందిని తీసుకురాగలను.

445
00:26:20,560 --> 00:26:22,896
షూటర్, అదేం వద్దు.
ఇది "గన్ స్మోక్" షో కాదు, షూటర్.

446
00:26:22,979 --> 00:26:24,314
మనమేం ఇక్కడ సైన్యాన్ని తయారు చేయట్లేదు.

447
00:26:24,939 --> 00:26:26,149
చూడు, నీకు సాయం చేయాలని ఉంటే,

448
00:26:26,816 --> 00:26:28,276
రోడ్ల శాఖలో పని చేసే మీ అన్నయ్యకి కాల్ చేయి.

449
00:26:28,359 --> 00:26:31,196
వెంటనే ఇక్కడికి డజన్
పోర్టబుల్ టాయిలెట్లను పంపమని చెప్పు.

450
00:26:31,863 --> 00:26:34,365
ఆ పని చేసి పెట్టు దయచేసి… థ్యాంక్యూ.

451
00:26:53,051 --> 00:26:55,053
నీ డిమాండ్లకు ఫ్రాంక్ తలొగ్గే రకం కాదు.

452
00:26:58,806 --> 00:27:01,059
నా భర్త ఒక ఖైదీని ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయడు.

453
00:27:01,142 --> 00:27:03,811
అతని నమ్మకానికి అది విరుద్ధమైన చర్య.

454
00:27:03,895 --> 00:27:06,648
అతను చేసిన ప్రమాణాలన్నింటికీ కూడా.

455
00:27:10,193 --> 00:27:11,528
నీకు కూడా ప్రమాణం చేశాడు,

456
00:27:12,904 --> 00:27:13,905
కదా?

457
00:27:21,871 --> 00:27:23,206
కానివ్వు.

458
00:27:38,388 --> 00:27:41,641
- బ్రాడ్ఫర్డ్ ని మాట్లాడుతున్నా.
- జాక్. ఎత్తి మంచి పని చేశావు.

459
00:27:41,724 --> 00:27:43,226
నీకు ఫోన్ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా.

460
00:27:43,309 --> 00:27:44,769
దరిద్రుడా.

461
00:27:44,852 --> 00:27:45,937
సిడ్నీని పక్కకు పెట్టేసి

462
00:27:46,020 --> 00:27:48,565
నేరుగా నీకు కాల్ చేస్తున్నా కదా,
నేనేం ప్రోటోకాల్ ని ఉల్లంఘించట్లేదు కదా.

463
00:27:48,648 --> 00:27:51,276
విమానాన్ని కూల్చేసినప్పుడే
నువ్వు ప్రోటోకాల్ ని తుంగలో తొక్కావు.

464
00:27:51,359 --> 00:27:53,736
- కథ బాగుంది. అందరికీ అదే చెప్పుకో.
- అతనే. నా సెల్ కి కాల్ చేశాడు.

465
00:27:53,820 --> 00:27:55,071
ఐఎస్ఎమ్ఐ నంబర్ కనిపెట్టు.

466
00:27:55,780 --> 00:27:58,658
- ఈ నంబర్ ఎక్కడిది నీకు?
- అది తర్వాత చెప్తాలే, జాక్. నువ్వు బిజీగా ఉన్నావు అసలే.

467
00:27:58,741 --> 00:28:00,285
నేనూ బిజీగా ఉన్నా, కాబట్టి రెండు ముక్కల్లో చెప్తా.

468
00:28:01,035 --> 00:28:02,370
నీ సెల్ కి ఒక లింకుని మెసేజ్ చేశా.

469
00:28:02,453 --> 00:28:04,581
నా కాల్ ని ట్రాక్ చేస్తున్న పిస్తాకి దాన్ని తెరవమని చెప్పు.

470
00:28:04,664 --> 00:28:05,957
అతను అసలు నెట్వర్క్ నే వాడట్లేదు.

471
00:28:07,584 --> 00:28:09,586
తర్వాతి ప్రామాణీకరణ:

472
00:28:10,545 --> 00:28:13,047
- ఏంటిది?
- నా బీమా.

473
00:28:13,590 --> 00:28:16,926
విషయం ఏంటంటే, నీ అదృష్టం బాగుంది, అందుకే
నేను యాక్సిడెంట్ నుండి ప్రాణాలతో బయటపడ్డాను, జాక్.

474
00:28:17,552 --> 00:28:18,803
కానీ నీకు మళ్ళీ అదృష్టం కలిసి రాదులే.

475
00:28:19,679 --> 00:28:21,431
నాకు ఏమైనా అయితే,

476
00:28:22,015 --> 00:28:25,226
నేను ఈ సైట్లో ప్రతి 72 గంటలకు
ఒకసారి కోడుని ఎంటర్ చేయకపోతే,

477
00:28:25,894 --> 00:28:29,022
ఒక అలారం యాక్టివేట్ అవుతుంది.

478
00:28:29,105 --> 00:28:32,150
ఆర్కైవ్ 6లో ఉండే సమాచారం అంతా

479
00:28:32,233 --> 00:28:35,612
కొంత మందికి ఆటోమేటిక్ గా పంపబడుతుంది,
మీరు సీఐఏలో చేసే రహస్య ఆపరేషన్లపై

480
00:28:35,695 --> 00:28:37,530
వాళ్ళు స్పెషల్ ఫోకస్ పెట్టగలరు.

481
00:28:37,614 --> 00:28:39,032
పనికిమాలిన వెధవ.

482
00:28:39,115 --> 00:28:41,034
నువ్వు జనాల జీవితాలతో ఆడుకుంటున్నావు.

483
00:28:42,076 --> 00:28:46,956
ఇదెలా పని చేస్తుందో నీకు అర్థమవ్వడమే నాకు కావాలి.

484
00:28:47,040 --> 00:28:50,627
నువ్వు చస్తే, ఈ ఆర్కైవ్ బయటకు వస్తుంది.
ఇదెలా పని చేస్తుందో నాకు అర్థమైంది.

485
00:28:50,710 --> 00:28:52,128
మంచిది. నీకు అది తెలిస్తే చాలు.

486
00:28:52,879 --> 00:28:55,048
నేను ఇక ఉంటా. నాకు చాలా పనులు ఉన్నాయి ఇవాళ.

487
00:28:55,924 --> 00:28:57,926
నువ్వు మరీమరీ అడిగావని సిడ్నీకి చెప్తాలే.

488
00:29:00,678 --> 00:29:03,556
ఈ సైట్ ఎక్కడ హోస్ట్ అవుతుందో
తెలుసుకొని, దాన్ని షట్ డౌన్ చేసేయ్.

489
00:29:03,640 --> 00:29:04,807
వెంటనే ఆ పని కానివ్వు.

490
00:29:43,596 --> 00:29:44,764
అబ్బా.

491
00:29:46,057 --> 00:29:47,100
సారా.

492
00:29:49,310 --> 00:29:50,436
భలే దానివే.

493
00:29:52,146 --> 00:29:53,189
సారా.

494
00:29:54,732 --> 00:29:55,733
అరె.

495
00:29:57,777 --> 00:29:59,153
తెలుసు కదా సేఫ్టీ ఆఫ్ లో ఉందని…

496
00:30:26,055 --> 00:30:29,517
- తను ఫీల్డులో ఉన్నట్టు ఎవరెవరికి తెలుసు?
- నా టీమ్ కి, స్కెలిటన్ క్రూకి.

497
00:30:29,601 --> 00:30:31,686
అసిస్టెంట్ అటార్నీ జనరల్, వారి అభిప్రాయమేమైనా చెప్పారా?

498
00:30:32,395 --> 00:30:33,771
న్యాయశాఖకి ఏమీ తెలీదు.

499
00:30:33,855 --> 00:30:35,732
వాళ్ళని కవర్ కోసమే సృష్టించాం.

500
00:30:35,815 --> 00:30:37,609
ఇన్స్పెక్టర్ జనరల్ కి ఇంకో ఇంటర్వ్యూ కావాలట.

501
00:30:38,443 --> 00:30:40,904
ఆమె హావ్లాక్ ని ఇక్కడికి
తెచ్చేదాకా వాళ్లకి తెలీకుండా దాచగలం.

502
00:30:40,987 --> 00:30:42,739
ఏ మనిషికైతే సహాయం చేసిందని స్కోఫీల్డ్ పై ఆరోపణలున్నాయో,

503
00:30:42,822 --> 00:30:45,700
ఆ మనిషిని వేటాడటానికే తనని పంపించారని
వాళ్ళకి తెలుసుకోవడానికి ఎంత సమయం పడుతుంది అంటావు?

504
00:30:47,744 --> 00:30:48,745
దాన్ని మేము ఒప్పుకోముగా.

505
00:30:48,828 --> 00:30:50,997
కానీ విమానం కూలలేదని చెప్పలేవుగా, జాక్.

506
00:30:51,915 --> 00:30:53,333
పైగా ఇప్పుడు ఆర్కైవ్ బయటపడే ప్రమాదముంది.

507
00:30:54,792 --> 00:30:57,921
లీక్ జరిగిందని, ఈ విషయంలో
నువ్వు పరిధి దాటి ప్రవర్తించావు,

508
00:30:58,004 --> 00:30:59,088
అది అర్థం చేసుకోవచ్చు,

509
00:30:59,631 --> 00:31:01,758
కానీ నువ్వు స్కోఫీల్డ్ ని కాపాడలేవు.
తనని నువ్వు ఇక్కడికి రప్పించాలి.

510
00:31:01,841 --> 00:31:03,593
- అతడిని తను పట్టుకోగలదు.
- నిజం చెప్పు.

511
00:31:03,676 --> 00:31:06,804
ఆమె నాన్నకి మాటిచ్చావు కాబట్టి, ఆమెని పంపించావా?

512
00:31:07,388 --> 00:31:09,682
లేదా, తనని అక్కడికి పంపించి
బలిపశువును చేయాలనుకుంటున్నావా?

513
00:31:12,060 --> 00:31:13,978
- నాకొక వారం ఇవ్వు.
- నీకు రెండ్రోజులు ఇస్తున్నా.

514
00:31:14,896 --> 00:31:17,232
నువ్వు తెలివైన దానివే అయితే,
తనని నిజంగానే బలిపశువు చేసేస్తావు.

515
00:31:26,282 --> 00:31:27,575
జేన్, ఏంటి అప్డేట్?

516
00:31:27,659 --> 00:31:29,077
పోలీసుల విషయంలో క్లింట్ కి కాస్త ఆలస్యమైంది.

517
00:31:29,160 --> 00:31:30,870
- ఇంకో గంటలో లూక్ దగ్గరికి వెళ్ళిపోతారట.
- అవునా?

518
00:31:30,954 --> 00:31:32,914
ఇంకో విషయం, సహాయక బృందాలకు
ఫ్లైట్ డెక్ రికార్డర్ కనిపించింది.

519
00:31:32,997 --> 00:31:34,374
ఈ రోజు చివరికల్లా అది ఇక్కడికి వచ్చేస్తుంది.

520
00:31:34,457 --> 00:31:35,542
- మంచిది.
- ఆహారం అదిరింది.

521
00:31:35,625 --> 00:31:37,043
- చాలా ఆకలిగా ఉంది.
- థ్యాంక్యూ, ఫ్రాంక్.

522
00:31:37,126 --> 00:31:38,628
ఇంకా, గవర్నర్ మళ్ళీ కాల్ చేసింది.

523
00:31:38,711 --> 00:31:39,754
ఆమెకి ఒక స్టేట్మెంట్ కావాలట.

524
00:31:39,837 --> 00:31:42,382
- వారెవ్వా. బార్బెక్యూ.
- జేన్, ఏంటి…

525
00:31:42,465 --> 00:31:44,717
ఎందుకు అందరూ అంత వింతగా ప్రవర్తిస్తున్నారు?

526
00:31:49,180 --> 00:31:51,307
అందరికీ ఆహారం సంగతి
చూడమన్నావని స్కూల్ డిస్ట్రిక్ట్ కి కాల్ చేశా,

527
00:31:51,391 --> 00:31:52,892
కానీ ఫుడ్ సర్వీస్ లని బంద్ చేసేశారట వాళ్ళు.

528
00:31:52,976 --> 00:31:56,479
అప్పుడే, చర్చిలో కేర్ మినిస్ట్రీ వాళ్ళు అంత్యక్రియలకు
భోజన ఏర్పాట్లు చేస్తారని నాకు గుర్తొచ్చింది,

529
00:31:56,563 --> 00:31:58,106
అలాగే నా దగ్గర పీటీఏ వాళ్ళ ఫోన్ ట్రీ ఉంది, కాబట్టి…

530
00:31:58,857 --> 00:32:00,692
ఫ్రాంక్, నేను చెప్పేది వింటున్నావా?
దేని కోసం వెతుకుతున్నావు?

531
00:32:00,775 --> 00:32:03,111
గే ఏడెన్, పొయ్యి మీద మటన్ కూర
చేస్తుంది కదా, అదేమైనా తెచ్చిందా?

532
00:32:12,453 --> 00:32:13,454
ఓకే.

533
00:32:25,508 --> 00:32:27,010
ఆ లెగ్ పీస్ మొత్తాన్ని లాగించేయ్.

534
00:32:30,763 --> 00:32:31,890
ఎలా ఉన్నావు?

535
00:32:31,973 --> 00:32:33,433
ఆహారం కంటే బాగానే ఉన్నాలే.

536
00:32:33,516 --> 00:32:36,352
సలాడ్ ఇక్కడ దొరకదని
నువ్వు అన్నమాట ముమ్మాటికీ నిజమే.

537
00:32:37,854 --> 00:32:41,357
అంతే కాకుండా, ఇక్కడ ఛీజ్ తో కానీ,
ఛీజ్ లాంటి పదార్థంతో కానీ

538
00:32:41,441 --> 00:32:43,526
పూసిన కూరగాయలు కూడా లేవు.

539
00:32:53,286 --> 00:32:54,662
ఇది హావ్లాక్ పంపించాడు.

540
00:32:55,330 --> 00:32:56,831
నీ భార్య కోసం ఆ ఖైదీని అప్పగిస్తావా?

541
00:33:02,795 --> 00:33:03,796
హావ్లాక్ గురించి చెప్పు.

542
00:33:04,672 --> 00:33:07,342
- నాకు తెలిసినదంతా చెప్పా కదా.
- లేదు. అతనేం చేశాడో మాత్రమే చెప్పావు నువ్వు.

543
00:33:07,425 --> 00:33:08,843
అసలు అతనికేం కావాలి? వ్యక్తిగతంగా.

544
00:33:11,387 --> 00:33:14,474
- అతనికేం కావాలో మాకు పూర్తిగా తెలీదు.
- ఊహించి చెప్పు.

545
00:33:15,558 --> 00:33:17,393
నువ్వేదో యుద్ధం అని అన్నావు కదా?

546
00:33:17,977 --> 00:33:19,062
ఏ ఉద్దేశంతో అన్నావు?

547
00:33:22,649 --> 00:33:26,653
హావ్లాక్ కి కూడా, చాలా మంది
అమెరికన్లలాగానే అనిపిస్తోంది అనుకుంటా.

548
00:33:27,487 --> 00:33:28,738
కోపం. మోసపోయామన్న ఫీలింగ్.

549
00:33:28,821 --> 00:33:32,242
ఈ దేశంలో జవాబుదారీతనం నామరూపాలు
లేకుండా పోయిందని అనుకుంటున్నాడు అనుకుంటా.

550
00:33:32,867 --> 00:33:34,327
నాకు కూడా అలాగే అనిపిస్తోంది.

551
00:33:36,955 --> 00:33:41,167
అంతే కాకుండా, సీఐఏ, విఫలమవుతోన్న
మన ప్రభుతాన్ని సూచిస్తోందని అతను భావిస్తున్నాడు.

552
00:33:42,126 --> 00:33:43,836
అందుకని సీఐఏపై యుద్ధం ప్రకటిస్తున్నాడా?

553
00:33:44,629 --> 00:33:48,675
హావ్లాక్ అదృశ్యమయిపోయే ముందు,
అతను ఒక సీఐఏ సర్వర్ ని హ్యాక్ చేశాడు,

554
00:33:48,758 --> 00:33:52,011
ఆర్కైవ్ 6 అనే ఫైల్ లోని సమాచారాన్ని అంతా కాపీ చేశాడు.

555
00:33:52,095 --> 00:33:53,429
ఆర్కైవ్ 6 అంటే ఏంటి అసలు?

556
00:33:54,430 --> 00:33:56,516
అది మేము చేసే పనులకు
సంబంధించిన రహస్య బ్లూప్రింట్.

557
00:33:56,599 --> 00:33:59,143
మేము చంపాలనుకునే వాళ్ళు, మా వాళ్లు,
ఇంఫార్మర్లు, పద్ధతులు అన్నీ ఉంటాయి.

558
00:34:00,061 --> 00:34:01,479
దాన్ని అతను అమ్మాలనుకుంటున్నాడా?

559
00:34:02,105 --> 00:34:03,857
అతని ప్లాన్ ఏంటో మాకు తెలీదు.

560
00:34:03,940 --> 00:34:05,733
ఆర్కైవ్ ని అడ్డం పెట్టుకొని, తనని తాను కాపాడుకోవడానికి

561
00:34:05,817 --> 00:34:08,653
బెదిరింపులకు పాల్పడుతన్నాడని ఇటీవలే నాకు తెలిసింది.

562
00:34:08,736 --> 00:34:10,196
అతను చస్తే, మేము చస్తామని బెదిరిస్తున్నాడు.

563
00:34:10,280 --> 00:34:12,865
అతనికేమైనా అయితే, ఆర్కైవ్ బయటపడిపోతుంది.

564
00:34:13,740 --> 00:34:17,579
అంటే, ఆర్కైవ్ కి ఎవరైనా కొనుగోలుదారుడిని
సెట్ చేయడంలో అతను సిక్లర్ సాయం కావాలనుకుంటున్నాడా?

565
00:34:17,662 --> 00:34:19,414
సిక్లర్, నేరస్థుల కోసం డబ్బును హవాలా మార్గంలో తరలిస్తాడు.

566
00:34:19,497 --> 00:34:21,583
అతని సాయం కోరుతున్నాడేమో అని అనిపించడం సహజమే.

567
00:34:21,666 --> 00:34:23,251
లేదా, హావ్లాక్ కి ఈ ఖైదీ అడ్డు ఏమో.

568
00:34:25,044 --> 00:34:27,589
అంటే, మీవాడికి, ఇంకా సీఐఏ పతనానికి మధ్యలో

569
00:34:27,671 --> 00:34:29,591
అడ్డుగా ఉండేది

570
00:34:30,173 --> 00:34:33,928
యుకాన్ మంచు గడ్డపై స్వేచ్ఛగా
తిరుగుతున్న, చేతులు లేని ఒక నేరస్థుడేమో.

571
00:34:35,430 --> 00:34:36,430
అది నీకు తేలికైనదిలా అనిపించవచ్చు,

572
00:34:36,514 --> 00:34:39,017
కానీ మిగతా నాగరిక ప్రపంచానికి,
అదంత సింపుల్ విషయంలా అనిపించదు.

573
00:34:41,227 --> 00:34:42,769
నువ్వు ఇదంతా అలా అనుకుంటున్నావు అన్నమాట.

574
00:34:42,854 --> 00:34:44,939
మేము చాలా సింపుల్ అని.

575
00:34:45,773 --> 00:34:46,941
నేను అన్నది అది కాదు.

576
00:34:47,025 --> 00:34:48,234
కాదు, కానీ నీ ఉద్దేశం అదే.

577
00:34:48,860 --> 00:34:50,278
మేము పల్లెటూరోళ్ళం, కదా?

578
00:34:51,946 --> 00:34:54,199
మాకు చదువు, సంస్కారం,
మంచితనం అంటే ఏంటో తెలీదు.

579
00:34:54,740 --> 00:34:56,159
కృతజ్ఞత ఉండదు, ఉదాహరణగా…

580
00:34:56,910 --> 00:34:59,329
ఉదాహరణగా అక్కడ ఉన్న బుచ్ కటర్స్ ని
మనం తీసుకోవచ్చు. హా, వాళ్ళే.

581
00:34:59,913 --> 00:35:02,248
పోయిన వేసవిలో బుచ్ దివాళా తీసేశాడు.
దాదాపుగా ఉన్నదంతా కోల్పోయాడు.

582
00:35:02,332 --> 00:35:03,958
అక్కడ ఉన్న ట్రక్కులో ఉండే పంది అతను తెచ్చిందే,

583
00:35:04,042 --> 00:35:06,461
అతనికి, లిండాకి రెండు మోర్ట్ గేజ్
రుణాలున్నా కానీ అది తెచ్చారు.

584
00:35:06,544 --> 00:35:08,546
నీకు, నాకు, ఇక్కడున్న వాళ్లందరికీ ఆహారం తెచ్చాడు.

585
00:35:09,797 --> 00:35:11,966
అక్కడ మధ్యలో ఉన్న వ్యక్తి కనిపిస్తున్నాడా? ఓలూ.

586
00:35:12,967 --> 00:35:16,846
పోయిన ఏడాది, శాన్ డియేగోలో
అతనికి ఒక బ్యాంక్ లో ఉద్యోగం వచ్చింది.

587
00:35:16,930 --> 00:35:19,349
కానీ ఈ పల్లెటూర్లో ఉన్న అతని అంకుల్ కి
సాయపడాలని ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాడు.

588
00:35:22,310 --> 00:35:23,478
అక్కడున్న సూ…

589
00:35:24,646 --> 00:35:26,397
పోయిన వేసవిలో భర్తని కోల్పోయింది.

590
00:35:27,273 --> 00:35:29,108
ఇప్పుడు చర్చికి వెళ్లే ఆడవాళ్లే
ఆమెకి కుటుంబ సభ్యులు.

591
00:35:29,692 --> 00:35:30,693
ఇక్కడ…

592
00:35:33,112 --> 00:35:34,113
మేమేం విధిలేక ఉండట్లేదు.

593
00:35:34,781 --> 00:35:36,282
మా ఇష్టప్రకారమే ఉంటున్నాం.

594
00:35:37,408 --> 00:35:39,035
సంప్రదాయం అంటే ఇలానే ఉంటుంది.

595
00:35:39,577 --> 00:35:40,870
బట్టలు తర్వాతి తరాలకు వెళ్తాయి.

596
00:35:41,454 --> 00:35:42,956
పాత్రలు తర్వాతి తరాలకు వెళ్తాయి.

597
00:35:43,039 --> 00:35:44,040
అక్కడ నీలి రంగు పాత్ర ఉంది కదా,

598
00:35:44,123 --> 00:35:46,167
లూక్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి వచ్చినప్పుడు,

599
00:35:46,251 --> 00:35:47,919
అందులో చేపల ఫ్రైని తిన్నట్టు నాకు బాగా గుర్తు.

600
00:35:53,091 --> 00:35:56,928
చూడు, నీకు నా సాయం కావాలన్నా…

601
00:35:58,263 --> 00:36:01,683
ఇక్కడున్న వారి సహాయం కావాలన్నా,

602
00:36:02,767 --> 00:36:04,978
మేము ఇక్కడ విధి లేక ఏమీ లేమని,
కావాలనే, ఇష్టప్రకారమే ఉంటున్నామని

603
00:36:05,061 --> 00:36:06,145
నువ్వు గ్రహించాలి.

604
00:36:06,813 --> 00:36:08,398
జవాబుదారీగా ఉండాలని కావాలనే ఉంటున్నాం.

605
00:36:10,817 --> 00:36:13,403
కానీ మీ హావ్లాక్ అది ఎప్పుడో
అర్థం చేసుకున్నాడు అనుకుంటా.

606
00:36:16,114 --> 00:36:17,282
అవును, అది నిజమే.

607
00:36:18,032 --> 00:36:19,784
అందుకే అతను నిన్ను ఎంచుకున్నాడు.

608
00:36:21,494 --> 00:36:23,496
హేయ్, హెన్రీ సిక్లర్…

609
00:36:24,747 --> 00:36:26,499
అతను ఎందుకు లొంగిపోయాడో నాకు తెలుసు.

610
00:36:28,793 --> 00:36:29,794
నీకు అదృశ్యమైపోవాలనుంది.

611
00:36:29,878 --> 00:36:31,296
నా దగ్గరికి రావద్దు.

612
00:36:31,379 --> 00:36:33,256
హా, అందుకే నువ్వు లొంగిపోయావు.

613
00:36:33,882 --> 00:36:35,675
అందుకే నువ్వు ప్రభుత్వానికి
సాక్ష్యాలు ఇస్తానని ఒప్పుకున్నావు,

614
00:36:35,758 --> 00:36:38,469
ఎందుకంటే, న్యాయశాఖ నీకు
సాక్షుల పరిరక్షణ ప్రోగ్రామ్ ద్వారా కొత్త జీవితం ఇవ్వనుంది.

615
00:36:38,553 --> 00:36:40,972
నువ్వు నా కాళ్ళు మొక్కాలి.
నా వల్ల చాలా మంది నేరస్థులు జైలుపాలవుతారు.

616
00:36:41,055 --> 00:36:42,515
ముందు నువ్వు విచారణ దాకా వెళ్ళాలి కదా, హెన్రీ.

617
00:36:42,599 --> 00:36:44,142
- బెదిరిస్తున్నావా?
- నిజం చెప్తున్నా.

618
00:36:44,225 --> 00:36:46,311
అంటే, నువ్వు ఇక్కడ ఉన్నావని కానీ,
లొంగిపోయావని కానీ ఎవరికీ తెలీదు.

619
00:36:46,394 --> 00:36:48,521
ఆసలు నువ్వు విమానం కూలిన ఘటనలో
బతికి బయటపడ్డావన్నదే ఎవరికీ తెలీదు.

620
00:36:48,605 --> 00:36:49,772
- అంతే కదా?
- హావ్లాక్ గురించి చెప్పు.

621
00:36:49,856 --> 00:36:51,149
అతనెవరో నాకు తెలీదు.

622
00:36:51,232 --> 00:36:52,400
మరి అతను నీకెందుకు సాయపడుతున్నాడు?

623
00:36:52,483 --> 00:36:54,485
ఫెడరల్ ఏజెంట్స్ కన్నా మంచి డీల్ ఇస్తాను అన్నాడా?

624
00:36:54,569 --> 00:36:55,570
నీకు క్యాష్ ఏమైనా ఇచ్చాడా?

625
00:36:55,653 --> 00:36:58,156
ఎమర్జెన్సీల కోసమని నా ఇనుప చేతుల్లో
క్యాష్ ఎప్పుడూ పెట్టుకుంటా.

626
00:36:58,239 --> 00:37:00,074
దానికి, హావ్లాక్ అనే వ్యక్తికి ఏ సంబంధమూ లేదు.

627
00:37:00,158 --> 00:37:01,993
- అతని కోసం ఏం చేస్తున్నావు, హెన్రీ?
- ఒట్టేసి చెప్తున్నా.

628
00:37:02,076 --> 00:37:03,995
- అతనికి మనీ లాండరింగ్ చేస్తున్నావా?
- నేను సాక్ష్యాలిచ్చి,

629
00:37:04,078 --> 00:37:06,831
దీనికంతటికీ దూరంగా వెళ్ళిపోయి, సాక్షుల పరిరక్షణ
కింద కొత్త జీవితం జీవిస్తానని డీల్ చేసుకున్నా.

630
00:37:06,915 --> 00:37:09,417
మరి అలాంటి డీల్ ని, ముక్కూ ముఖం
తెలియని వాడి కోసం వదులుకుంటానా?

631
00:38:06,975 --> 00:38:08,101
ఏం చేస్తున్నావు?

632
00:38:31,958 --> 00:38:33,209
హేయ్, ఏం జరుగుతోంది?

633
00:38:35,962 --> 00:38:37,171
తెలీదు. అదేదో నువ్వే చెప్పరాదూ.

634
00:38:39,465 --> 00:38:41,801
అదీ… అదీ…

635
00:38:42,802 --> 00:38:43,887
హేయిస్, లూక్ దగ్గరికి చేరుకున్నాడా?

636
00:38:45,054 --> 00:38:46,306
ఏ క్షణంలోనైనా చేరుకోవచ్చు.

637
00:38:46,389 --> 00:38:47,390
మంచిది.

638
00:38:54,606 --> 00:38:55,690
ఒకటి చెప్పనా…

639
00:38:57,400 --> 00:38:59,736
ఫ్రాంక్, నాకు నీ గురించి ఆందోళనగా ఉంది.

640
00:39:02,113 --> 00:39:03,573
ఏం జరుగుతోంది అసలు ఇక్కడ?

641
00:39:18,463 --> 00:39:21,299
సారాని కిడ్నాప్ చేసిన వ్యక్తి సంప్రదించాడు.
ఒక డీల్ కావాలట అతనికి.

642
00:39:24,260 --> 00:39:26,095
సిక్లర్ ని అప్పజెప్పితే, సారాని వదిలేస్తాడట.

643
00:39:29,057 --> 00:39:30,433
మన ఖైదీతో అతనికేం పని?

644
00:39:31,059 --> 00:39:32,143
ఏమో.

645
00:39:35,271 --> 00:39:37,398
- మరేం చేద్దాం అనుకుంటున్నావు?
- భలేవాడివే, అలా నేను చేయలేను.

646
00:39:38,316 --> 00:39:39,651
అక్కడ ఉండేది సారా.

647
00:39:43,780 --> 00:39:46,699
నేను సిక్లర్ ని అప్పజెప్పేస్తే, నమ్మిన
సిద్ధాంతాలని పక్కకు పెట్టేసినట్టే అవుతుంది, హాచ్.

648
00:39:48,535 --> 00:39:49,953
భలేవాడివే. మనం మార్షల్స్.

649
00:39:51,579 --> 00:39:52,580
మనం నమ్మే సిద్ధాంతాలన్నీ…

650
00:39:52,664 --> 00:39:53,998
నేను ఆ పని చేస్తే, అతను గెలిచినట్టే.

651
00:39:55,291 --> 00:39:58,711
చూడు, నువ్వు తెల్లోళ్ళు కొట్టే సోది కొడుతున్నావు.

652
00:40:00,630 --> 00:40:02,131
మనం ఆ దరిద్రుడిని అప్పజెప్పేద్దాం.

653
00:40:02,799 --> 00:40:04,676
సారాన్ని తెచ్చేసుకుందాం. ఇవాళే.

654
00:40:10,682 --> 00:40:12,016
నీ దగ్గర ఇంకేదైనా మంచి ఐడియా ఉందా?

655
00:40:37,834 --> 00:40:39,586
నేను దాన్ని చూసి చాలా ఏళ్లయింది.

656
00:40:41,462 --> 00:40:44,883
నేను మూడో క్లాసుకు వెళ్తున్నప్పుడు
మొదటి రోజున మా అమ్మ ఇది ఇచ్చి,

657
00:40:44,966 --> 00:40:47,719
ఇది అదృష్టం కలిగిస్తుందని నాకు నచ్చజెప్పింది, కానీ…

658
00:40:49,512 --> 00:40:51,347
ఇప్పుడు ఇది పని చేయట్లేదు అనుకుంటా.

659
00:41:04,319 --> 00:41:05,820
ఏం జరుగుతోందో చెప్తావా?

660
00:41:07,780 --> 00:41:08,865
అది పిచ్చిగా ఉంటుందిలే.

661
00:41:11,868 --> 00:41:15,830
నువ్వు గమనించావో లేదో,
నాకన్నా పిచ్చిగా ఎవరూ ఆలోచించరు.

662
00:41:16,414 --> 00:41:17,415
అందులో పిస్తాని నేను.

663
00:41:20,919 --> 00:41:24,339
హోంకమింగ్ లో నా డ్రెస్ గురించి ఆలోచిస్తున్నా.

664
00:41:24,422 --> 00:41:27,342
ఇది నా ఫైనల్ ఇయర్,
దీని తర్వాత హోంకమింగ్ ని నేను చూడలేను.

665
00:41:27,425 --> 00:41:29,677
చెప్పాగా అది పిచ్చిగా ఉంటుంది అని.

666
00:41:29,761 --> 00:41:30,887
ఇక్కడ ఒకడు చావుబతుకుల మధ్య ఉంటే,

667
00:41:30,970 --> 00:41:32,972
నేనేమో మనం మిస్ అయిన డ్యాన్స్
గురించి ఆలోచిస్తూ ఉన్నా.

668
00:41:33,056 --> 00:41:35,308
లేదు. లేదు. అది పిచ్చి ఆలోచన ఏమీ కాదు.

669
00:41:38,519 --> 00:41:41,523
వచ్చే ఏడాది ఈ సమయానికి,
నువ్వు వేరే కాలేజీలో ఏక్కడో ఉంటావు.

670
00:41:41,606 --> 00:41:44,275
నేనేమో హోటల్ లో వెయిట్రెస్ గానో,
ఫ్యాక్టరీలో పని చేస్తూనో ఉంటూ,

671
00:41:44,359 --> 00:41:47,612
అప్పుడు ఆ తొక్కలో డ్యాన్స్ కి
వెళ్లుంటే అయిపోయి ఉండేదని బాధపడుతూ ఉంటా.

672
00:42:12,595 --> 00:42:13,596
హేయ్, ఫ్రాంక్.

673
00:42:14,639 --> 00:42:15,640
నీ గురించి కాస్త కంగారుపడ్డా.

674
00:42:15,723 --> 00:42:17,559
హా, నువ్వు అడిగిన ఖైదీని తీసుకొచ్చా.

675
00:42:18,226 --> 00:42:19,352
హా, అది నాకు కనిపిస్తోంది.

676
00:42:19,936 --> 00:42:22,272
పైప్ లైన్ వెంటే ఉత్తరం వైపు వెళ్తూ ఉండు. ఆ తర్వాత…

677
00:42:22,355 --> 00:42:23,982
ఆగాగు కాస్త.

678
00:42:24,065 --> 00:42:25,775
రైజర్ 452 దగ్గర ఆగాలని అన్నావు కదా.

679
00:42:25,859 --> 00:42:28,862
అవును. ఇప్పుడు పైప్ లైన్ వెంట
ఉత్తరం వైపు వెళ్తూ ఉండమని అంటున్నా.

680
00:42:34,367 --> 00:42:35,910
నా భార్య ఏది?

681
00:42:40,415 --> 00:42:41,624
నాతో ఉంది.

682
00:42:42,458 --> 00:42:43,543
మీకేమైనా కనిపిస్తోందా?

683
00:42:45,086 --> 00:42:46,337
ఇంకా ఏం లేదు. ఇంకాసేపు ఆగుదాం.

684
00:42:48,214 --> 00:42:49,507
సియెర్రా, మీకు ఏమైనా కనిపిస్తోందా?

685
00:42:50,884 --> 00:42:52,051
లేదు. అంతా ప్రశాంతంగా ఉంది ఇక్కడ.

686
00:42:52,135 --> 00:42:55,555
ఫ్రాంక్, ఇంకో ఇరవై అడుగులు వేశాక,
పశ్చిమం వైపు తిరుగు.

687
00:42:56,055 --> 00:42:57,056
ఇంతకీ మేమెక్కడికి వెళ్ళాలి?

688
00:42:57,140 --> 00:42:58,600
హుడ్ సరిగ్గా వేసుకో.

689
00:42:58,683 --> 00:43:01,102
ఇక్కడ నిజంగానే అంతా చాలా అందంగా ఉంది, ఫ్రాంక్.

690
00:43:03,521 --> 00:43:06,274
ఈ చోటంటే నీకు ఎందుకు అంత ఇష్టమో
ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతోంది.

691
00:43:06,858 --> 00:43:08,943
ఒకటి చెప్పనా? నువ్వేమనుకున్నా నాకు అనవసరం.

692
00:43:09,027 --> 00:43:10,945
ఫ్రాంక్, భలేవాడివే. అలా అనకు.

693
00:43:11,029 --> 00:43:13,323
నేను చెప్పిన దాన్ని పట్టించుకున్నావు
కాబట్టే ఇక్కడికి వచ్చావు నువ్వు.

694
00:43:13,406 --> 00:43:15,408
నీలో నాకు నచ్చింది అదే, ఫ్రాంక్.

695
00:43:17,160 --> 00:43:18,494
నీకు బాధ్యత ఉంది.

696
00:43:19,913 --> 00:43:21,289
మేము చేరుకున్నామా?

697
00:43:21,372 --> 00:43:22,540
ఇంకాస్త నడవండి.

698
00:43:23,208 --> 00:43:25,335
నువ్వు వాల్టర్ కోట్స్ కి అభిమానివని గ్రహించాను.

699
00:43:25,418 --> 00:43:28,922
చాలా అద్భుతమైన పుస్తకం అది.
ఎన్నో అంశాలు ఉన్నాయి అందులో.

700
00:43:29,797 --> 00:43:32,550
నువ్వు "అలాస్కా"ని చదివావు, కదా?

701
00:43:33,468 --> 00:43:36,638
కోట్స్ రచనలు, ప్రకృతి ముందు
మనిషి ఎంత అల్ప జీవో తెలుపుతాయి.

702
00:43:36,721 --> 00:43:37,722
ఏమంటావు?

703
00:43:38,973 --> 00:43:41,184
అందుకే నీకు ఈ ప్రాంతం చాలా నచ్చింది అనుకుంటా.

704
00:43:41,935 --> 00:43:44,938
నువ్వు అంత ముఖ్యమైన వాడివి
కాదని అనిపిస్తుంది నీకు ఇక్కడ.

705
00:43:45,647 --> 00:43:46,981
అలా అనిపించకుండా ఉండటం కష్టమేలే.

706
00:43:47,065 --> 00:43:49,108
నువ్వు అందుకే ఇక్కడ ఉంటున్నావేమో అని అనిపిస్తోంది.

707
00:43:49,192 --> 00:43:51,778
ఎందుకంటే, నీకు ముఖ్యమైన వాడివి
కాకుండా ఉండటమే ఇష్టం, కదా?

708
00:43:53,613 --> 00:43:54,614
ఎందుకు?

709
00:43:58,159 --> 00:44:01,412
ఎందుకంటే, నువ్వు ఇంకేదో చోట
ముఖ్యమైన వాడివి అయి ఉండాలి, ఫ్రాంక్.

710
00:44:04,582 --> 00:44:07,001
నువ్వు దేని నుండో దాక్కుంటున్నావని
నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది.

711
00:44:09,671 --> 00:44:10,880
దేని నుండి దాక్కుంటున్నావు?

712
00:44:13,758 --> 00:44:15,176
నువ్వు ఇక్కడికి రాలేదు, కదా?

713
00:44:20,682 --> 00:44:21,683
రాలేదు.

714
00:44:22,267 --> 00:44:24,018
అసలు వస్తానని నేను అననే లేదు, ఫ్రాంక్.

715
00:44:24,102 --> 00:44:25,103
నీ యెంకమ్మ!

716
00:44:25,728 --> 00:44:26,938
మనల్ని పక్కదారి పట్టించేశాడు, సరేనా?

717
00:44:27,021 --> 00:44:29,190
వాడికి కావాల్సింది సిక్లర్ కాదు.
అసలు వాడికి ఆ అవసరమే లేదు.

718
00:44:29,274 --> 00:44:30,859
మనం అన్నింటికీ దూరంగా ఉండాలని ఈ ప్లాన్ వేశాడు.

719
00:44:30,942 --> 00:44:32,819
- దేనికి దూరంగా?
- తెలీదు!

720
00:44:32,902 --> 00:44:35,947
మనకి ఆధారాలు ఎక్కడి నుండి లభిస్తాయి.
శిథిలాల క్షేత్రం, బేస్ క్యాంప్, మీరే చెప్పాలి.

721
00:44:36,030 --> 00:44:37,115
ఫ్లైట్ డెక్ రికార్డర్.

722
00:44:37,198 --> 00:44:39,033
యాక్సిడెంట్ సైట్ నుండి
ఎన్.టీ.ఎస్.బీ వాళ్ళు దాన్ని తీసుకెళ్తున్నారు.

723
00:44:39,117 --> 00:44:40,159
వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకి తెలియాలి.

724
00:44:40,243 --> 00:44:42,579
రేడియో ద్వారా వాళ్లకి
సందేశం పంపండి. డ్రైవర్లకు తెలియజేయండి.

725
00:44:43,288 --> 00:44:44,706
పదండి! త్వరపడండి!

726
00:44:47,500 --> 00:44:48,501
ఎక్కడ ఉన్నారు వాళ్ళు?

727
00:44:49,252 --> 00:44:51,087
ఫ్రాంక్, నాకు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియాలి.

728
00:44:51,170 --> 00:44:52,505
ఆరవ నంబర్ హైవేలో. చాటనికా దగ్గర.

729
00:44:52,589 --> 00:44:54,632
- పదండి! త్వరగా వెళ్ళాలి!
- స్టీస్ హైవేని క్లోజ్ చేసేయండి.

730
00:44:54,716 --> 00:44:57,886
ట్రాన్స్ పాండర్ కి పింగ్ చేయండి.
ఆ పరికరం సరిగ్గా ఎక్కడ ఉందో నాకు తెలియాలి.

731
00:44:57,969 --> 00:44:58,970
ఇప్పటికిప్పుడే!

732
00:45:22,869 --> 00:45:23,870
ఎన్.టీ.ఎస్.బీ

733
00:46:50,373 --> 00:46:51,666
నా భార్య ఎక్కడ?

734
00:46:52,792 --> 00:46:54,419
నిన్ను ఇప్పుడే ఒక ప్రశ్న అడిగా.

735
00:46:54,502 --> 00:46:56,170
నా భార్య ఎక్కడ?

736
00:47:18,067 --> 00:47:21,321
హాట్ చాక్లెట్, వేడి వేడి కాఫీ. థ్యాంక్యూ.

737
00:47:25,617 --> 00:47:27,952
టీమ్ లోని అందరికీ మీ ప్రొఫైల్ నచ్చింది.

738
00:47:28,036 --> 00:47:30,371
మీరు ఎన్ఎస్ఆర్ఐలో చేసిన కంట్రిబ్యూషన్లు, మీ ఫెలోషిప్,

739
00:47:30,997 --> 00:47:33,416
స్టాటిక్ డేటా శాంప్లింగ్ పై మీరు పబ్లిష్ చేసిన పేపర్…

740
00:47:33,499 --> 00:47:34,626
నన్ను పనిలోకి తీసుకోవాలనుకుంటున్నారా?

741
00:47:34,709 --> 00:47:36,544
మీకు చాలా డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాం.

742
00:47:36,628 --> 00:47:38,880
కాంట్రాక్టుల గురించి మాట్లాడే అధికారం నాకు లేదు,

743
00:47:38,963 --> 00:47:42,383
కానీ మా ఆఫర్ దేనితో ప్రారంభం అవుతుందంటే…

744
00:47:47,388 --> 00:47:49,140
ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేనెప్పుడో ఊహించా.

745
00:47:51,434 --> 00:47:52,936
ఇది మీకు ఎలా కనిపించవచ్చో అర్థం చేసుకోగలను,

746
00:47:53,519 --> 00:47:55,188
కానీ నేను ఒక్క చట్టాన్ని కూడా ఉల్లంఘించలేదు.

747
00:47:56,105 --> 00:47:57,148
మీరేమంటున్నారో అర్థం కావట్లేదు.

748
00:47:57,232 --> 00:47:59,901
బెర్లిన్ లోని ఆసుపత్రి సిస్టమ్స్ పై
జరిగిన రాంసమ్ వేర్ అటాక్…

749
00:48:01,319 --> 00:48:02,737
అది ఎథికల్ హ్యాకింగ్ లో భాగంగా జరిగినదే.

750
00:48:04,864 --> 00:48:06,616
వాళ్ళ ఫైర్ వాల్ ని దాటి
ముందుకెళ్లడానికి నాకు డబ్బులు ఇచ్చారు.

751
00:48:06,699 --> 00:48:08,326
దాన్ని నిరూపించడానికి నా వద్ద కాంట్రాక్ట్స్ కూడా ఉన్నాయి.

752
00:48:08,409 --> 00:48:10,245
కేపీ ఫైనాన్షియల్ విషయంలో జరిగింది కూడా అదే.

753
00:48:10,328 --> 00:48:11,996
నేను పోలీస్ అని అనుకుంటున్నారా?

754
00:48:12,080 --> 00:48:13,331
షూలు బాగా సౌకర్యవంతంగా ఉన్నాయి.

755
00:48:14,457 --> 00:48:16,209
క్రాస్-బాడీ బ్యాగ్. మీ కళ్ళు.

756
00:48:16,793 --> 00:48:17,919
నా కళ్ళకు ఏమైంది?

757
00:48:18,002 --> 00:48:20,004
మీరు నా కళ్ళలోకే చూస్తున్నారని అనిపించడానికి

758
00:48:20,088 --> 00:48:21,673
నా టెంపుల్ కి చాలా దగ్గరగా చూస్తున్నారు,

759
00:48:21,756 --> 00:48:26,010
కానీ చుట్టుపక్కల ఏం జరుగుతోందో
గమనించడానికి మీ చూపును కాస్త పక్కకి తిప్పారు.

760
00:48:28,054 --> 00:48:30,765
నేను నైతికపరంగా కొన్ని గీతలను దాటి ఉండవచ్చు,
కానీ ఒక్క చట్టాన్ని కూడా ఉల్లంఘించలేదు.

761
00:48:31,349 --> 00:48:32,517
సీల్ శిక్షణలో బాగానే నేర్చుకున్నట్టున్నారు.

762
00:48:32,600 --> 00:48:35,061
నేను తప్పు చేసినట్టు మీరు నిరూపించలేరు.

763
00:48:36,563 --> 00:48:39,065
మనం ఏకాంతంగా ఉండే చోటికి వెళ్లి
మాట్లాడుకుంటే మంచిదేమో.

764
00:48:39,148 --> 00:48:40,441
నాకు ఆసక్తి లేదు.

765
00:48:41,401 --> 00:48:42,902
నేనేం చెప్పబోతున్నానో మీకు తెలీదు కదా.

766
00:48:42,986 --> 00:48:45,405
మీ దృష్టిలో పడ్డానని అర్థమైంది,

767
00:48:45,488 --> 00:48:49,033
ఎందుకంటే, మీరు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో,
వారికి నేను చేసే పనులు చాలా ఇబ్బందిని కలిగించేవే.

768
00:48:50,869 --> 00:48:53,413
మీరు నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారని
తెలుసు, కానీ నేను చేసేవి ఏంటో మీరు నిరూపించలేరు,

769
00:48:53,496 --> 00:48:55,248
ఎందుకంటే, నేను అవి ఎలా చేస్తున్నానో మీకు తెలీదు.

770
00:48:55,331 --> 00:48:57,333
అందుకే మీరు ఇక్కడికి వచ్చారు.

771
00:48:59,711 --> 00:49:00,795
నన్ను పనిలోకి తీసుకోవడానికి.

772
00:49:02,297 --> 00:49:05,717
అందుకే నేను ఇందాక చెప్పాను, నాకు ఆసక్తి లేదు అని.

773
00:49:08,553 --> 00:49:09,804
మరి ఎందుకు వచ్చారు ఇక్కడికి?

774
00:49:11,931 --> 00:49:13,016
నాకు చాక్లేట్ అంటే ఇష్టం.

775
00:49:20,481 --> 00:49:21,482
కాబట్టి…

776
00:49:23,401 --> 00:49:26,487
నేను ఆనందంతో ఉప్పొంగిపోతున్నానని
మీ పై అధికారులకు చెప్పండి,

777
00:49:27,989 --> 00:49:29,991
కానీ నేనెవరి కిందా పని చేయను, నాకు నేనే బాస్.

778
00:49:31,576 --> 00:49:33,912
సీఐఏలో అయితే ఖచ్చితంగా పని చేయను.

779
00:49:37,457 --> 00:49:39,042
మిమ్మల్ని కలవడం బాగుంది, మిస్…

780
00:49:39,626 --> 00:49:40,668
- స్కోఫీల్డ్.
- స్కోఫీల్డ్.

781
00:49:40,752 --> 00:49:42,962
సిడ్నీ స్కోఫీల్డ్.

782
00:49:47,634 --> 00:49:49,219
మీ ఇంటికి హ్యాపీ జర్నీ.

783
00:50:08,488 --> 00:50:10,740
హేయ్. నేనే.

784
00:50:13,368 --> 00:50:14,536
మనకి కావాల్సిన వాడు దొరికాడు.

785
00:51:03,626 --> 00:51:05,628
- హేయ్.
- ఏంటిది?

786
00:51:06,629 --> 00:51:07,714
హోంకమింగ్.

787
00:51:08,214 --> 00:51:09,883
అదొక్క సంగీతమే దొరికింది.

788
00:51:09,966 --> 00:51:11,467
ఫుల్ ఆటో స్టాప్
టేప్ కౌంటర్

789
00:51:14,804 --> 00:51:16,014
డ్యాన్స్ చేద్దామా?

790
00:51:18,725 --> 00:51:19,726
హా.

791
00:51:29,819 --> 00:51:32,655
ఫెయిర్ బ్యాంక్స్ కోసం ప్రార్థించండి

792
00:51:35,074 --> 00:51:37,076
ఎన్.టీ.ఎస్.బీ

793
00:51:37,160 --> 00:51:38,328
ఆధారాలు

794
00:51:38,411 --> 00:51:41,414
ఫ్లైట్ రికార్డర్
తెరవవద్దు

795
00:51:52,508 --> 00:51:55,511
లొంగిపోయాడు
హెన్రీ డేల్ సిక్లర్

796
00:52:01,392 --> 00:52:03,186
ఎడ్వార్డ్ పోర్టర్

797
00:52:03,269 --> 00:52:04,979
రస్సెల్ ప్రైస్

798
00:52:05,063 --> 00:52:06,064
చనిపోయాడు

799
00:52:06,147 --> 00:52:09,484
కొవింగ్టన్

800
00:52:16,074 --> 00:52:17,992
- నువ్వు పారిపోవాలి.
- నాన్నా, లేదు.

801
00:52:18,076 --> 00:52:19,160
నది వెంబడే వెళ్ళు.

802
00:52:19,244 --> 00:52:22,038
అలా వెళ్తే, హైవే వస్తుంది, సరేనా?

803
00:52:22,121 --> 00:52:23,289
ఈ పని నువ్వు చేయగలవు.

804
00:52:26,251 --> 00:52:27,585
ఐ లవ్ యూ.

805
00:52:34,717 --> 00:52:35,718
- నీతో, నాతో
- వెళ్ళు.

806
00:53:08,668 --> 00:53:10,086
ఫ్రాంక్, నేను హేయిస్ ని.

807
00:53:10,169 --> 00:53:11,546
క్లింట్, చేరుకున్నావా?

808
00:53:11,629 --> 00:53:13,631
హేయ్, ఫ్రాంక్. ఇప్పుడే చేరుకున్నా.

809
00:53:14,591 --> 00:53:16,426
మీ అబ్బాయి కనిపించాడు. ఒక అమ్మాయితో ఉన్నాడు అతను.

810
00:53:16,509 --> 00:53:19,429
శివారులోని ఓ రోడ్డులో వాళ్ళ కారు ఇరుక్కుపోయినట్టుంది.

811
00:53:19,512 --> 00:53:21,681
రోడ్డు అంతా మంచుతో ఉంది,
కాబట్టి నేను క్యాబిన్ దాకా హైక్ చేసుకుంటూ వెళ్ళాలి.

812
00:53:21,764 --> 00:53:24,183
కానీ ఇద్దరూ బాగానే ఉన్నట్టున్నారు.

813
00:53:24,893 --> 00:53:26,686
మంచి విషయం చెప్పావు, క్లింట్.
చాలా చాలా థ్యాంక్స్, సరేనా?

814
00:53:26,769 --> 00:53:27,979
అదరగొట్టేశావు, మిత్రమా.

815
00:53:28,813 --> 00:53:31,524
మేము కారును తవ్వి బయటకు తీసే
ప్రయత్నం చేస్తాం. కానీ వాతావరణం సహకరించకపోతే,

816
00:53:32,442 --> 00:53:34,611
రాత్రి ఇక్కడే పడుకొని, రేపు వస్తా.

817
00:53:35,320 --> 00:53:37,322
వాళ్ళిద్దరినీ చేరుకున్నాక నీకు కాల్ చేస్తా.

818
00:53:38,823 --> 00:53:40,491
సరే, మంచి ప్లానే అది.

819
00:53:41,492 --> 00:53:42,785
హేయ్, చూడు, క్లింట్…

820
00:53:44,037 --> 00:53:46,539
లూక్ కి సారా గురించి ఏమీ చెప్పకు, సరేనా?

821
00:53:47,874 --> 00:53:49,000
అంతే కాకుండా,

822
00:53:50,460 --> 00:53:53,296
నేనేమీ వాడి మీద కోపంగా లేనని వాడికి అర్థమయ్యేలా చేయి.

823
00:53:53,796 --> 00:53:54,797
సరేనా?

824
00:53:55,798 --> 00:53:57,383
తప్పకుండా, ఫ్రాంక్. ఉంటా మరి.

825
00:54:08,561 --> 00:54:09,646
- ఫ్రాంక్.
- హా.

826
00:54:29,791 --> 00:54:34,629
ఫ్రాంక్ కోసం

827
00:55:43,865 --> 00:55:45,867
సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్

