1
00:00:16,955 --> 00:00:20,166
ఐల్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్, అలాస్కా

2
00:00:26,089 --> 00:00:28,091
క్లియరెన్స్, నవంబర్ 207 నుండి మాట్లాడుతున్నా.

3
00:00:28,174 --> 00:00:30,718
వాషింగ్టన్ డల్లస్ ప్రయాణానికి అవసరమయ్యే
ఐఎఫ్ఆర్ ని నోట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.

4
00:00:30,802 --> 00:00:33,263
యుఎస్ఎమ్ 207,
క్లియరెన్స్ డెలివరీ నుండి మాట్లాడుతున్నా.

5
00:00:33,346 --> 00:00:35,598
మీరు వాషింగ్టన్ డల్లస్ కి ప్రయాణమవ్వవచ్చు.
నిర్ణీత రన్ వేలో టేకాఫ్ చేయండి.

6
00:00:35,682 --> 00:00:36,849
జైళ్ల శాఖ

7
00:02:46,938 --> 00:02:48,523
అయ్య బాబోయ్. ఏమైంది?

8
00:02:53,653 --> 00:02:55,530
కాపాడండి! కాపాడండి!

9
00:02:55,613 --> 00:02:59,576
నవంబర్ 207 ఇంజిన్ కి మంటలు అంటుకున్నాయి.
వెంటనే ల్యాండ్ అవ్వడానికి దిశలు చెప్పండి.

10
00:03:19,846 --> 00:03:21,514
నన్ను సురక్షితమైన చోటుకు తీసుకెళ్లండి!

11
00:03:46,414 --> 00:03:47,832
- హేయ్, బుడ్డోడా.
- హేయ్.

12
00:03:48,541 --> 00:03:51,502
- ఏమైంది? నిద్ర పట్టట్లేదా?
- పట్టట్లేదు.

13
00:03:52,295 --> 00:03:53,379
మనం వాటిని చూడలేకపోయాం కదా.

14
00:03:55,340 --> 00:03:58,927
నార్తర్న్ లైట్స్ శాశ్వతంగా ఏం వెళ్లిపోవు.

15
00:03:59,010 --> 00:04:01,554
అంటే, వాటిని చూడటానికి
మనం వచ్చే సంవత్సరం రావచ్చు అన్నమాట.

16
00:04:01,638 --> 00:04:02,680
అవును.

17
00:04:05,892 --> 00:04:06,893
నాన్నా.

18
00:04:10,605 --> 00:04:12,398
పరుగెత్తు. పరుగెత్తు, పరుగెత్తు!

19
00:04:27,872 --> 00:04:30,458
విమానంలో ప్రెషర్ పోతోంది. ఎత్తు దించక తప్పదు.

20
00:04:35,463 --> 00:04:38,091
ప్రెషర్ మామూలు స్థితికి వస్తోంది. వేగం స్టేబుల్ అవుతోంది.

21
00:06:14,646 --> 00:06:15,897
రెండు వేలడుగుల ఎత్తులో ఉన్నాం.

22
00:06:15,980 --> 00:06:18,816
కిందికి దిగుతున్నాం. నేలని బలంగా తాకవచ్చు,
అందరూ దేన్ని అయినా గట్టిగా పట్టుకోండి.

23
00:07:04,112 --> 00:07:07,156
ఫెయిర్ బ్యాంక్స్, అలాస్కా

24
00:07:09,534 --> 00:07:11,411
భవిష్యత్తుకు బంగారు బాట
అలాస్కా

25
00:07:29,929 --> 00:07:31,556
- గుడ్ మార్నింగ్, బాబ్.
- గుడ్ మార్నింగ్, ఫ్రాంక్.

26
00:07:32,765 --> 00:07:33,850
కానివ్వు.

27
00:08:05,965 --> 00:08:07,217
అయ్య బాబోయ్.

28
00:08:10,386 --> 00:08:11,304
హేయ్, బంగారం.

29
00:08:11,930 --> 00:08:14,599
మనిద్దరం ఇవాళ లంచ్ కి చౌడర్ హౌస్ కి వెళదామా?

30
00:08:14,682 --> 00:08:16,684
అయ్యో, నాకంత అదృష్టం ఎక్కడిది?
ఇవాళ నాకు డబుల్ షిఫ్ట్ ఉంది.

31
00:08:16,768 --> 00:08:18,811
నీ థర్మల్ ఇన్నర్స్ ఎక్కడ ఉన్నాయో కనిపించాయి.

32
00:08:18,895 --> 00:08:20,647
ఓకే, కావాలంటే నీకు లంచ్ తీసుకొచ్చి ఇస్తాను.

33
00:08:21,231 --> 00:08:23,733
నిన్న రాత్రి ఉతికిన బట్టలను
ఆరబెట్టమన్నాను కదా, ఆ బట్టల్లో ఉన్నాయి అవి.

34
00:08:23,816 --> 00:08:25,527
హేయ్, లూక్, త్వరగా కానివ్వు. ఇప్పటికే ఆలస్యమైంది.

35
00:08:26,194 --> 00:08:28,321
నేను రాత్రి 12:30కి రావచ్చా?

36
00:08:28,404 --> 00:08:30,740
- నీకు తెలుసు కదా అర్ధరాత్రి దాటాక…
- జరిగే మంచి పనులు ఏవీ ఉండవు.

37
00:08:30,823 --> 00:08:33,700
అది తెలుసు, కానీ ఇవాళ హోంకమింగ్ గేమ్ ఉంది,
అదయ్యాక అందరూ డెవన్ వాళ్ళింటికి వెళ్తున్నారు.

38
00:08:33,785 --> 00:08:36,036
- వెళ్ళని వాడిని నేనొక్కడినే కావాలని నాకు లేదు.
- అతను అన్నదానిలో న్యాయముంది.

39
00:08:36,913 --> 00:08:40,791
మీ నాన్నకి ఓకే అయితే నాకు కూడా ఓకే.
కానీ సరిగ్గా సమయానికి వచ్చేసేయాలి, సరేనా?

40
00:08:40,875 --> 00:08:42,834
ఇక బయలుదేరు. ఆలస్యమైపోయింది నీకు.

41
00:08:43,545 --> 00:08:45,255
అయితే, లంచ్ కి అస్సలు కుదరదంటావా?

42
00:08:46,381 --> 00:08:47,966
ఏంటి ఉదయం నుండి లంచ్-లంచ్ అంటున్నావు?

43
00:08:48,049 --> 00:08:50,969
ఎందుకలా నవ్వుతున్నావు?
కొంపదీసి స్ట్రోక్ ఏమైనా వస్తోందా నీకు?

44
00:08:57,267 --> 00:08:58,518
క్యాబిన్ మనది అయిపోతోంది.

45
00:08:59,936 --> 00:09:01,437
మన ఆఫర్ ని వాళ్ళు అంగీకరించారు.

46
00:09:01,521 --> 00:09:03,606
ఓరి దేవుడా. ఓరి నాయనోయ్.

47
00:09:04,232 --> 00:09:05,233
ఎప్పుడు కాల్ చేశాడు?

48
00:09:05,316 --> 00:09:07,318
కాల్ చేయలేదు. ఉదయం మెసేజ్ పెట్టాడు.

49
00:09:07,402 --> 00:09:09,279
అయితే, నిజంగానే కొంటున్నామా?

50
00:09:09,362 --> 00:09:11,197
అరె, భలేదానివే, అది మనకే రాసిపెట్టుంది.

51
00:09:11,281 --> 00:09:14,659
మరి అంత డబ్బు మనకి ఎక్కడిది?

52
00:09:16,703 --> 00:09:17,912
నా ట్రక్కును అమ్మేస్తా.

53
00:09:17,996 --> 00:09:20,123
నా కిడ్నీలని, లివర్ ని అమ్మేస్తా.

54
00:09:21,499 --> 00:09:22,584
భలేదానివే.

55
00:09:22,667 --> 00:09:25,003
లంచ్ సమయంలో టామ్ దాని గురించే మాట్లాడదాం అన్నాడు.

56
00:09:25,879 --> 00:09:28,590
సరే. మరి, ఆఫీస్ సంగతి?

57
00:09:28,673 --> 00:09:32,135
- ఆఫీసుకు ఏమైంది?
- ఈ పని పెట్టుకుంటే, దానిపై ఏకాగ్రత పెట్టలేవు.

58
00:09:32,802 --> 00:09:35,638
హ, నాకు గుర్తున్నంత వరకు, ఈ ఊర్లో
అవాంఛనీయ సంఘటనలు పెద్దగా జరగలేదనే చెప్పాలి.

59
00:09:36,556 --> 00:09:38,433
ఈ ఉద్యోగాన్ని నేను ఎల్లకాలం
చేయలేను. ముసలోడిని అయిపోతున్నా.

60
00:09:39,559 --> 00:09:41,394
భవిష్యత్తు గురించి కూడా
ఆలోచించడం మొదలుపెట్టాలి కదా.

61
00:09:43,438 --> 00:09:44,814
మార్షల్స్ అంటే నీకు కుటుంబంతో సమానం.

62
00:09:44,898 --> 00:09:46,024
మానేశాక కూడా ఆ బంధం కొనసాగుతుంది.

63
00:09:46,107 --> 00:09:47,901
అంతా ఠక్కున అయిపోదు, కానీ…

64
00:09:50,278 --> 00:09:51,988
ఇదే మంచి సమయం అనిపిస్తోంది.

65
00:09:52,071 --> 00:09:53,573
లూక్ బానే ఉన్నాడు.

66
00:09:53,656 --> 00:09:55,742
అతనికి పీడకలలు వచ్చి చాలా నెలలు అయింది.

67
00:09:56,326 --> 00:09:58,286
మనిద్దరి మధ్య కూడా అంతా బాగానే ఉంది, కాబట్టి…

68
00:10:00,163 --> 00:10:01,789
- హా.
- ఇక అంతా నీ చేతుల్లో ఉంది.

69
00:10:03,791 --> 00:10:05,084
నిజంగానే అంటున్నావా?

70
00:10:05,168 --> 00:10:07,337
ఒక లాడ్జిని నడపాలని ఉందని
మనం టీనేజర్లుగా ఉన్నప్పటి నుండి

71
00:10:07,420 --> 00:10:08,338
నువ్వు అంటూనే ఉన్నావు.

72
00:10:08,421 --> 00:10:09,797
ఏం మాట్లాడుతున్నావు!

73
00:10:09,881 --> 00:10:11,424
నిజంగానే అంటున్నావా అని అడుగుతావేంటి?

74
00:10:11,507 --> 00:10:14,344
నీకు కావాల్సింది అదే. మనకి
కావాల్సింది అదే. నాకు కావాల్సింది అదే.

75
00:10:17,388 --> 00:10:18,389
నాకు ఓకే.

76
00:10:19,432 --> 00:10:21,601
- హా. హా.
- అదరగొట్టేశానా?

77
00:10:21,684 --> 00:10:23,394
- అదరగొట్టేశావు. హా.
- అదరగొట్టేశానా?

78
00:10:25,605 --> 00:10:28,942
ఫెయిర్ బ్యాంక్స్ కు స్వాగతం
అలాస్కాలో మంచితనానికి పుట్టినిల్లు

79
00:10:29,025 --> 00:10:30,735
తెరిచి ఉంది

80
00:10:35,907 --> 00:10:36,991
సరే మరి.

81
00:10:37,867 --> 00:10:41,538
నీకు ఇష్టమైనది తెచ్చా, పోటుగాడా. క్రీమీ డోనట్స్ తెచ్చా.

82
00:10:41,621 --> 00:10:44,249
ప్లేన్ గా ఉండే కస్టర్డ్ డోనట్స్ తేలేదు.

83
00:10:44,958 --> 00:10:46,668
- ఖుషీ-ఖుషీగా ఉన్నట్టున్నావే.
- శుభోదయం, జేన్.

84
00:10:47,377 --> 00:10:48,419
వెన్ను నొప్పి ఎలా ఉంది?

85
00:10:48,503 --> 00:10:50,797
ఇబ్బందిగానే ఉంది, కానీ గుర్తు చేసినందుకు థ్యాంక్స్.

86
00:10:50,880 --> 00:10:53,341
నేను ఇంకా జ్యూస్ డైట్ ఫాలో అవుతున్నానని
తెలిసే నువ్వు డోనట్స్ తెచ్చావు కదా.

87
00:10:53,424 --> 00:10:54,968
నువ్వు తిన్నట్టు యానీకి తెలీదులే. తీసుకో.

88
00:10:55,051 --> 00:10:56,844
యానీకి అన్నీ తెలుసు.

89
00:10:56,928 --> 00:10:59,347
- చాక్లెట్ డోనట్ ఏమైనా ఉందా?
- ఉంది.

90
00:11:00,056 --> 00:11:01,057
ఇక్కడికి ఏ పని మీద వచ్చారు మీరు?

91
00:11:01,140 --> 00:11:03,351
నేను, నోరా తొక్కుడుబిళ్ల ఎలా ఆడాలో నేర్చుకున్నాం,

92
00:11:03,434 --> 00:11:05,853
కాబట్టి, నేను ప్రాక్టీస్ చేయడానికని,
పెయింట్ వేసి ఒక స్పెషల్ రాయిని తీసుకొచ్చింది.

93
00:11:05,937 --> 00:11:07,230
భలేగా ఉంది.

94
00:11:07,313 --> 00:11:09,774
ఇక నాకేమో ఆపుకోలేనంత ఉద్వేగం వచ్చేసి,
నా బుర్ర పని చేయడం ఆగిపోయింది,

95
00:11:09,858 --> 00:11:11,609
కాబట్టి, అలా కాఫీకి వెళదామని,

96
00:11:11,693 --> 00:11:14,070
దార్లో నాన్న ఆఫీసుకి వెళ్లి స్పెషల్ రాయిని
ఇచ్చేద్దామని అనుకున్నాం, కదా?

97
00:11:14,779 --> 00:11:17,156
ఇది చాలా బాగుంది. దీనికి నువ్వే పెయింట్ వేశావా?

98
00:11:17,740 --> 00:11:19,868
మా నాన్నకి తొక్కుడుబిళ్ల అంటే చాలా ఇష్టం.

99
00:11:19,951 --> 00:11:21,744
అవును, మీ నాన్నకి ఇష్టమైనది
ఇంకోటి ఉంది, అదేంటో తెలుసా?

100
00:11:22,328 --> 00:11:23,621
డోనట్స్.

101
00:11:23,705 --> 00:11:25,331
- ఆయనకి అవంటే ఇష్టం. ప్రాణం.
- అబ్బా. లేదు.

102
00:11:25,415 --> 00:11:28,501
కానీ నాన్న డోనట్ అస్సలు తినడు.
ఎందుకంటే, నాన్న ఇంకో కేజీ తగ్గితే,

103
00:11:28,585 --> 00:11:32,005
ఆయనకి బెడ్ రూమ్ లో మరిచిపోలేని కానుకని ఇస్తాను.

104
00:11:32,088 --> 00:11:33,381
నాన్నకి బై చెప్పు.

105
00:11:33,464 --> 00:11:35,008
బై, నాన్నా. లవ్ యూ.

106
00:11:35,091 --> 00:11:36,134
బై.

107
00:11:36,217 --> 00:11:37,343
బై, అమ్మాయిలూ.

108
00:11:37,969 --> 00:11:40,722
- హలో? హేయ్, టామ్.
- నా రాయి నాకు ఇచ్చేయ్.

109
00:11:40,805 --> 00:11:42,682
- హా.
- తీసుకో. ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకో.

110
00:11:43,266 --> 00:11:44,517
ఫ్రాంక్.

111
00:11:44,601 --> 00:11:45,852
గుడ్ మార్నింగ్, ఫ్రాంక్.

112
00:11:45,935 --> 00:11:46,978
- మార్నింగ్.
- ఎక్కడ?

113
00:11:47,061 --> 00:11:48,938
డోనట్స్ తో పాటు డబ్బులు కూడా తెచ్చావా?

114
00:11:49,022 --> 00:11:51,024
- ఎందుకు?
- నువ్వు నాకు 20 డాలర్లు ఇవ్వాలి.

115
00:11:51,107 --> 00:11:54,027
- అయ్యయ్యో. ఆమె కోర్టుకు రాలేదా?
- రాలేదు.

116
00:11:54,110 --> 00:11:56,070
ఫ్రాంక్, అగ్నిమాపక శాఖ చీఫ్ కాల్ చేశాడు.

117
00:11:56,154 --> 00:11:58,406
ఉత్తరం వైపు ఎక్కడో పొగ వస్తోందట,
కానీ వాళ్లకది సరిగ్గా కనిపించట్లేదట.

118
00:11:58,489 --> 00:12:00,241
హెలికాప్టర్లో వెళ్లి చూడగలవా అని అడుగుతున్నాడు.

119
00:12:01,910 --> 00:12:02,911
వెళ్లి చూసొద్దాం పదండి.

120
00:12:13,546 --> 00:12:15,048
తొక్కుడుబిళ్లనా? నిజంగా?

121
00:12:15,840 --> 00:12:17,050
ఆ ఆటని "సెసమీ స్ట్రీట్" షోలో చూశా.

122
00:12:18,343 --> 00:12:20,386
ఒకటి చెప్పనా, డానీ,
నువ్వు ఒక కేజీ తగ్గినా, తగ్గకపోయినా,

123
00:12:20,470 --> 00:12:22,472
ఎప్పటికీ నా ప్యారే దోస్త్ వి మాత్రం నువ్వే.

124
00:12:25,391 --> 00:12:26,392
అయ్య బాబోయ్.

125
00:12:26,476 --> 00:12:28,478
- అది…
- హేయ్, ఫ్రెడ్.

126
00:12:28,561 --> 00:12:30,104
దానికి దగ్గరగా దించు.

127
00:14:19,672 --> 00:14:21,633
- ఇక్కడ ఒకరు బతికే ఉన్నారు!
- ఉచ్చు ఇది.

128
00:14:23,801 --> 00:14:25,303
- హా?
- ఇది ఉచ్చు.

129
00:14:26,888 --> 00:14:28,932
హెలికాప్టర్ ఇంజిన్ ఆఫ్ చేయవద్దు!

130
00:14:29,015 --> 00:14:31,601
- కానివ్వండి, ఇతడిని లేపండి! పైకి లేపండి!
- లేపండి!

131
00:14:31,684 --> 00:14:33,686
పదండి! పదండి!

132
00:15:15,812 --> 00:15:17,146
కదలకు!

133
00:15:20,316 --> 00:15:21,943
కాల్చి పడేయ్!

134
00:15:24,362 --> 00:15:25,572
తుపాకీని కింద పడేయ్!

135
00:15:38,334 --> 00:15:40,378
రా, హాచ్. ఇతడిని హెలికాప్టర్ ఎక్కిద్దాం పద.

136
00:15:40,461 --> 00:15:41,629
- కానివ్వు, డానీ.
- పదండి.

137
00:15:46,885 --> 00:15:48,428
- కానివ్వు. లే, డానీ.
- కానివ్వు.

138
00:15:48,511 --> 00:15:51,264
డానీ, పైకి లే! కానివ్వు, ఇతడిని పైకి లేపు!

139
00:15:53,266 --> 00:15:54,434
దగ్గరకు రాకండి!

140
00:15:55,393 --> 00:15:56,477
లే, పైకి లే.

141
00:15:57,687 --> 00:15:58,605
దగ్గరకు రాకండి!

142
00:15:58,688 --> 00:16:00,690
దగ్గరకు రాకండి. దగ్గరకు రాకండి.

143
00:16:53,117 --> 00:16:54,202
నేను చూడలేను!

144
00:17:06,755 --> 00:17:08,258
పైకి లేవాలి. లేవాలి.

145
00:17:08,340 --> 00:17:09,967
హెలికాప్టర్ దగ్గరికి వెళ్దాం! పదండి!

146
00:17:10,051 --> 00:17:13,053
పదండి! హెలికాప్టర్ ఎక్కండి. పదండి.

147
00:17:14,222 --> 00:17:16,224
- పదండి. పదండి!
- ఎక్కండి. ఎక్కండి!

148
00:17:18,268 --> 00:17:21,604
హెలికాప్టర్ ఎక్కండి! హెలికాప్టర్ ఎక్కండి.

149
00:17:21,687 --> 00:17:23,523
ఇక పద, ఫ్రెడ్. త్వరగా కానివ్వు.

150
00:17:24,148 --> 00:17:25,567
పద! ఇక పద!

151
00:17:25,649 --> 00:17:28,820
కానివ్వు. డాన్, నువ్వు బాగానే ఉన్నావా?
పద! పద త్వరగా!

152
00:17:32,991 --> 00:17:34,075
పద! త్వరగా కానివ్వు.

153
00:17:58,016 --> 00:18:00,852
సీఐఏ హెడ్ క్వార్టర్స్
లాంగ్లీ, వర్జీనియా

154
00:18:08,067 --> 00:18:09,068
సీఐఏ
గ్రిఫిన్, మార్క్

155
00:18:16,951 --> 00:18:18,119
ఆట్వాటర్ తాలూకు ఫ్లైట్ కూలింది.

156
00:18:20,079 --> 00:18:21,956
- ఎప్పుడు?
- గంట కూడా అయ్యుండదు.

157
00:18:22,040 --> 00:18:23,917
- ఫ్లైట్ కమ్యూనికేషన్స్ సిస్టమ్? డేటాలింక్స్?
- ఏవీ పని చేయట్లేదు.

158
00:18:24,000 --> 00:18:26,169
మంచిది. "ఎన్ఆర్ఓ"కి ఏం తెలుసో కనుక్కో.

159
00:18:26,252 --> 00:18:29,047
ఎంత మంది చనిపోయారో తెలిశాక,
నోరీకి చెప్పి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి…

160
00:18:29,130 --> 00:18:31,382
మీకు అర్థం అవుతున్నట్టు లేదు.
ఆపరేషన్ ఇంకా యాక్టివ్ గానే ఉంది.

161
00:18:31,466 --> 00:18:32,592
విమానం కూలింది అన్నావు కదా.

162
00:18:32,675 --> 00:18:34,677
కూలిన తర్వాతే కమ్యూనికేషన్ సిస్టమ్స్
పని చేయకుండా పోయాయి.

163
00:18:34,761 --> 00:18:36,429
కాబట్టి, అందరూ చావలేదని భావిస్తున్నాం.

164
00:18:36,512 --> 00:18:39,766
- దేవుడా. అంటే, మన బండారం బయటపడే అవకాశముంది.
- ఎఫ్ఏఏ వాళ్లకి ఇంకా ఏమీ తెలీదు.

165
00:18:39,849 --> 00:18:41,434
నువ్వు స్కోఫీల్డ్ ని పిలిపించాలి.

166
00:18:41,517 --> 00:18:43,186
ఓకే, అది అస్సలు మంచి ఆలోచన కాదు.

167
00:18:43,269 --> 00:18:44,938
ఇది మన అధికార పరిధిలో లేని విషయం.

168
00:18:45,021 --> 00:18:47,899
స్కోఫీల్డ్ కి దీని గురించి బాగా తెలుసు.
తను అయితే వెళ్లి పని కానించగలదు.

169
00:18:47,982 --> 00:18:49,400
అసలు హావ్లాక్ ని తయారు చేసిందే తను.

170
00:18:49,484 --> 00:18:51,402
నా దృష్టిలో ఇది తన సమస్యే.

171
00:18:51,486 --> 00:18:55,615
కాబట్టి, తనని వెతికి, తను ఏ బార్లో ఉన్నా,
ఎంత మత్తులో ఉన్నా, ఇక్కడికి తీసుకురావాలి మీరు.

172
00:19:22,058 --> 00:19:23,184
వోడ్కా

173
00:19:37,115 --> 00:19:38,700
పుట్టిన రోజు శుభాకాంక్షలు, జోయి

174
00:19:45,331 --> 00:19:47,292
సిడ్నీ ఆంటీ, మీరు వచ్చేశారు!

175
00:19:47,375 --> 00:19:49,127
రాకుండా ఎలా ఉంటా!

176
00:19:49,210 --> 00:19:52,046
ఈ ఏడాదిలోనే అత్యంత పెద్ద పుట్టినరోజు పార్టీకి
రాకుండా ఉంటానని నిజంగానే అనుకున్నావా?

177
00:19:52,130 --> 00:19:54,507
- కేకు ఎక్కడ?
- టై మెట్ల మీద పడి పెదవికి దెబ్బ తగిలించుకున్నాడు.

178
00:19:54,591 --> 00:19:56,342
- ఒకసారి చూడండి వచ్చి.
- అయ్య బాబోయ్!

179
00:19:57,176 --> 00:19:58,887
తనకి కానుకగా చేప ఇస్తున్నావా?

180
00:19:58,970 --> 00:20:00,263
నిన్ను చూడటం కూడా బాగుంది, అక్కా.

181
00:20:00,346 --> 00:20:02,599
జోయి, వాళ్ళ నాన్న పీటాలో వాలంటీర్లుగా పని చేస్తున్నారు.

182
00:20:03,099 --> 00:20:06,436
అడవి నుండి దొంగతనంగా ఎత్తుకొచ్చేసిన
ఒక ఫారిన్ చేపని ఎందుకు ఇస్తున్నావు కానుకగా?

183
00:20:07,604 --> 00:20:08,771
అదొక మామూలు చేప, అంతే.

184
00:20:09,355 --> 00:20:11,024
మూడు, నాలుగు, అయిదు. కానివ్వండి!

185
00:20:12,317 --> 00:20:13,818
కేసు విషయం ఎక్కడి దాకా వచ్చింది?

186
00:20:14,861 --> 00:20:16,779
నేను ఆఫీసు విషయాల గురించి
మాట్లాడకూడదని తెలుసు కదా.

187
00:20:16,863 --> 00:20:19,616
నీ కేసును ఇన్స్పెక్టర్ జనరల్ కి
పంపిస్తారని నేథన్ అంటున్నాడు.

188
00:20:19,699 --> 00:20:20,700
అది అతనికి ఎవరు చెప్పారు?

189
00:20:20,783 --> 00:20:24,412
నీపై ఆరోపణలు నిజమైతే,
దేశద్రోహం కింద నీకు శిక్ష పడవచ్చు అన్నాడు.

190
00:20:27,582 --> 00:20:31,169
ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు. చూస్తుంటే…

191
00:20:35,632 --> 00:20:36,799
మీరు ఏజెంట్ స్కోఫీల్డా?

192
00:20:37,425 --> 00:20:38,259
కావచ్చు.

193
00:20:38,343 --> 00:20:40,053
మేడమ్, మీరు మాతో రావాలి.

194
00:20:40,136 --> 00:20:41,971
ఇది ఆట్వాటర్ ప్రోటోకాల్ కి సంబంధించినది.

195
00:20:44,641 --> 00:20:48,186
సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా

196
00:20:54,275 --> 00:20:56,694
దేశానికి సేవ చేస్తూ అమరులైన

197
00:20:56,778 --> 00:20:58,947
సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ సభ్యుల జ్ఞాపకార్థం

198
00:20:59,781 --> 00:21:01,741
మీ నాన్న చాలా మంచి వాడు, సిడ్.

199
00:21:03,117 --> 00:21:04,536
మేము కూడా అతడిని మిస్ అవుతున్నాం.

200
00:21:09,582 --> 00:21:10,917
నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారు?

201
00:21:11,000 --> 00:21:15,713
చైనీస్ సరిహద్దుకు 20,000 కిలోమీటర్ల దూరంలో,
ఖాబరావ్స్క్ బయట అతడిని పట్టుకున్నాం.

202
00:21:16,214 --> 00:21:19,551
ప్రభుత్వం ఆ విషయాన్ని బయటకు రానివ్వలేదు,
అదే సమయంలో మా బృందాలు రంగంలోకి దిగాయి.

203
00:21:19,634 --> 00:21:23,721
మేము అతడిని అలాస్కాలోని స్థావరానికి తరలించాం,
ఆ తర్వాత రహస్యంగా తరలిస్తున్న విమానంలోకి ఎక్కించాం.

204
00:21:24,305 --> 00:21:26,182
అప్పుడే అంతా గడబిడ అయింది.

205
00:21:26,766 --> 00:21:28,434
ఈ మిషన్ ని రహస్యంగా సాగిస్తూ ఉన్నాం.

206
00:21:28,518 --> 00:21:32,313
జేపాట్స్ రవాణా అయితే మరింత రహస్యంగా
పని కానివ్వవచ్చని డివిజన్ భావించింది.

207
00:21:32,397 --> 00:21:34,816
మార్షల్స్ కి కానీ, పైలట్లకు కానీ మిషన్ వివరాలేవీ తెలీవు.

208
00:21:34,899 --> 00:21:38,111
హావ్లాక్ ని తీసుకురావడానికి
మీరు జైళ్ల శాఖకి చెందిన విమానాన్ని పంపించారా?

209
00:21:38,194 --> 00:21:39,279
ఇది నాల్గవ స్థాయి ఆపరేషన్.

210
00:21:39,362 --> 00:21:41,781
ఐల్సన్ స్థావరంలోని
చీఫ్ మార్షల్ సార్జెంట్ కి కూడా ఈ మిషన్ గురించి తెలీదు.

211
00:21:41,865 --> 00:21:45,952
సమస్య ఏంటంటే, ఏడు గంటలకు
విమానానికి, రేడార్ కి కనెక్షన్ కట్ అయిపోయింది.

212
00:21:46,035 --> 00:21:48,454
శాటిలైట్ చిత్రాలను బట్టి,
కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారని తెలుస్తోంది,

213
00:21:48,538 --> 00:21:51,249
అంటే, హావ్లాక్ తన ప్రతాపం చూపే అవకాశం ఉంది.

214
00:21:51,833 --> 00:21:53,418
ఇది మీకు సమస్యాత్మకమైన విషయమే ఏమో.

215
00:21:54,252 --> 00:21:55,670
ఇది మన సమస్య, సిడ్నీ.

216
00:21:55,753 --> 00:21:57,922
లేదు. నా సమస్యేమీ కాదు.
నన్ను బయటకు పంపించేశారు మీరు.

217
00:21:58,006 --> 00:22:00,091
ఇప్పుడు మళ్ళీ నాకు నీ అవసరం ఉంది.

218
00:22:08,308 --> 00:22:10,393
అలాస్కా రాష్ట్ర పోలీసు శాఖ

219
00:22:11,269 --> 00:22:12,604
రండి!

220
00:22:27,744 --> 00:22:29,204
కానివ్వండి, త్వరగా కానివ్వండి.

221
00:22:30,330 --> 00:22:31,831
అందరూ ఇలా రండి.

222
00:22:32,415 --> 00:22:34,542
ఇక్కడి నుండి మూడు కిలోమీటర్ల దూరంలో
ఒక విమానం కూలిపోయి ఉంది.

223
00:22:34,626 --> 00:22:35,835
అది రవాణా విమానం.

224
00:22:35,919 --> 00:22:39,047
రెండు ఇంజిన్లు ఉన్నాయి దానికి, అంటే
అందులో సుమారుగా వంద ఖైదీలు పట్టే అవకాశముంది.

225
00:22:39,130 --> 00:22:41,090
- "ఖైదీలు" అంటే?
- అది జేపాట్స్ వాళ్ళ విమానం.

226
00:22:41,174 --> 00:22:43,134
అంటే, జస్టిస్ ప్రిజనర్
ఏలియన్ ట్రాన్స్ పొర్టేషన్ అని అర్థం.

227
00:22:43,218 --> 00:22:46,179
వాటి ద్వారా కోర్టు విచారణలకు, వేరే జైళ్లకు ఖైదీలను
దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తుంటారు…

228
00:22:46,262 --> 00:22:47,639
అక్కడ ఖైదీలు ఉన్నారా?

229
00:22:47,722 --> 00:22:49,682
మామూలు ఖైదీలు కాదు. వాళ్ళు ఫెడరల్ ఖైదీలు.

230
00:22:49,766 --> 00:22:53,937
విదేశీ, దేశీ, ఆడ, మగా ఉన్నారు, సాయుధులున్నారు,
వాళ్ళు చాలా హింసాత్మకమైన, ప్రమాదకరమైనవాళ్ళు.

231
00:22:54,020 --> 00:22:56,648
కాబట్టి స్వేచ్ఛగా బతకడానికి ఇది
తమకి దక్కిన సువర్ణావకాశంగా కొందరు భావిస్తారు.

232
00:22:57,232 --> 00:22:59,943
ఒక్కో నిమిషం గడిచే కొద్దీ,
మన సమస్యలు కూడా పెరుగుతూనే ఉంటాయి.

233
00:23:00,026 --> 00:23:02,153
కాబట్టి అన్నింటికన్నా ముందు,
లోయని మనం దిగ్బంధించాలి.

234
00:23:02,237 --> 00:23:03,947
స్టీస్ ని రెండు వైపులా మూసేయండి.

235
00:23:04,030 --> 00:23:05,532
మనకి ఒక కమాండ్ పోస్ట్ అవసరం అవుతుంది.

236
00:23:05,615 --> 00:23:08,326
అక్కడ నీళ్లు, కరెంట్ మొదలైనవి ఉండాలి,
వైమానిక రవాణాకు సరిపడా చోటు అక్కడ ఉండాలి.

237
00:23:08,409 --> 00:23:10,787
- పదకొండవ హైవే పక్కన ఉండే యుకాన్ రివర్ క్యాంప్.
- అది చాలా దూరం. ఇంకేం ఉన్నాయి?

238
00:23:10,870 --> 00:23:13,122
ఎంపైర్ సిమెంట్ ఫ్యాక్టరీ అయితే ఓకేనా?
ఆరవ రహదారికి అర కిలోమీటరు దూరంలో ఉంటుంది.

239
00:23:13,206 --> 00:23:15,083
- దాన్ని సెట్ చేసుకుందాం. ఓకే.
- ఓకే.

240
00:23:15,166 --> 00:23:16,709
ఎవరైనా ఆసుపత్రికి కాల్ చేయండి.

241
00:23:16,793 --> 00:23:18,461
ఎమర్జెన్సీ ప్రోటోకాల్ ని అమలు చేయమని చెప్పండి.

242
00:23:18,545 --> 00:23:19,712
ఓకే, వాళ్లకి…

243
00:23:20,255 --> 00:23:23,091
వాళ్లకి తాకిడి, హడావిడి
ఎక్కువ అవుతుందని హెచ్చరించండి.

244
00:23:30,682 --> 00:23:31,683
పోలీసు

245
00:23:34,602 --> 00:23:36,479
ఫ్రాంక్ తో లంచ్ ప్రోగ్రామ్
ఇప్పుడు కుదరదు అనుకుంటా.

246
00:23:37,480 --> 00:23:38,731
ఎందుకు? ఏమైంది?

247
00:23:38,815 --> 00:23:39,858
ఒక యాక్సిడెంట్ జరిగిందట.

248
00:23:39,941 --> 00:23:41,985
ఖైదీల రవాణాకు సంబంధించినది ఏదో.

249
00:23:42,068 --> 00:23:43,486
ఎమర్జెన్సీ ప్రోటోకాల్ ని
రన్ చేయాలని డాక్టర్ లిన్ చెప్పారు.

250
00:23:43,570 --> 00:23:45,572
మూడవ అంతస్థును పూర్తిగా
లాక్ చేయాలని మాట్లాడుకుంటున్నారు.

251
00:23:55,748 --> 00:23:59,002
ఫ్రాంక్, నువ్వు బాగానే ఉన్నావా? ఏం జరుగుతోంది?
ఏదో యాక్సిడెంట్ జరిగిందని అంటున్నారు.

252
00:23:59,085 --> 00:24:00,253
జేపాట్స్ వాళ్ళ విమానం కూలిపోయింది.

253
00:24:00,336 --> 00:24:02,297
డానీకి గాయమైంది.
ఎయిర్ అంబులెన్స్ కోసం ఎదురుచూస్తున్నాం.

254
00:24:02,380 --> 00:24:03,965
- ఎలాంటి గాయం అయింది?
- ఒక్క నిమిషం ఆగు.

255
00:24:04,048 --> 00:24:05,633
మీ ఆఫీసు నుండి ఖైదీల లిస్ట్ అందింది.

256
00:24:06,301 --> 00:24:07,844
నాకు ఫోటోలు కావాలి. అరె, నాకు ఫోటోలు కావాలి.

257
00:24:07,927 --> 00:24:10,597
ఖైదీల కుటుంబ సభ్యుల పేర్లు, నేర చరిత్రలతో
కూడిన వివరాలను పంపమని హెడ్ క్వార్టర్స్ కి చెప్పు.

258
00:24:10,680 --> 00:24:11,848
నేను చనిపోయిన వారెవరో గుర్తించాలి కదా.

259
00:24:11,931 --> 00:24:13,266
- అవును.
- నాకు ఫోటోలు కావాలి.

260
00:24:13,349 --> 00:24:16,603
- ఫ్రాంక్, ఏమైందో చెప్పు.
- డానీని కత్తితో పొడిచారు.

261
00:24:16,686 --> 00:24:19,772
ఈ విషయం ఎవరైనా యానీకి చెప్పాల్సి ఉంటుంది.
కాసేపట్లో అతడిని మీ హాస్పిటల్ లోనే అడ్మిట్ చేస్తారు.

262
00:24:20,315 --> 00:24:21,900
సరే. నీ సంగతేంటి? నువ్వు బాగానే ఉన్నావా?

263
00:24:22,901 --> 00:24:24,402
లూక్ కి ఏమైనా ప్రమాదమా?

264
00:24:24,485 --> 00:24:26,279
లూక్ స్కూల్ లో క్షేమంగానే ఉన్నాడు.
నేను కూడా బాగానే ఉన్నా.

265
00:24:26,362 --> 00:24:28,198
థర్మల్ ఇన్నర్ వేర్ వేసుకొని ఉంటే బాగుండు, అంతే.

266
00:24:29,616 --> 00:24:32,076
చూడు, హనీ, నాకు పనుంది, ఉంటా.
వీలైనప్పుడు కాల్ చేస్తా.

267
00:24:32,160 --> 00:24:33,703
- ఫ్రాంక్?
- చెప్పు.

268
00:24:33,786 --> 00:24:37,916
జాగ్రత్త, సరేనా? అదనపు బలగాలు
వచ్చేదాకా జాగ్రత్తగా ఉండు.

269
00:24:37,999 --> 00:24:40,126
హనీ, అదనపు బలగాలంటే మేమే, ఇంకెవరూ రారు.

270
00:24:41,711 --> 00:24:45,089
అలాస్కాలోని సూపర్వైజర్ డెప్యూటీ పేరు, ఫ్రాంక్ రెమ్నిక్.

271
00:24:45,173 --> 00:24:48,301
అతనికి వీలైనంత తక్కువగా చెప్పు,
అలా అని అతడిని పూర్తిగా దూరం పెట్టకు.

272
00:24:48,384 --> 00:24:49,886
అక్కడ మనకి అధికారాలు లేవు.

273
00:24:49,969 --> 00:24:52,180
అక్కడ అంతా ఆ కౌబాయ్ చేతిలోనే ఉంటుంది.

274
00:24:52,680 --> 00:24:53,556
మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి?

275
00:24:53,640 --> 00:24:57,268
అతను అలాస్కాలో
ఏదో మారుమూల ప్రాంతంలో పుట్టి పెరిగాడు.

276
00:24:57,352 --> 00:25:00,230
చికాగోలో గాలింపు టాస్క్ ఫోర్సులో ఆరేళ్ళు పని చేశాడు,

277
00:25:00,313 --> 00:25:02,357
కానీ ఆ నగర వాతావరణం, జనాలు అతనికి పడలేదు.

278
00:25:02,440 --> 00:25:04,609
మళ్ళీ ఆ మంచు ప్రాంతానికే బదిలీ అయ్యాడు,

279
00:25:04,692 --> 00:25:08,696
అప్పటి నుండి, ఐదేళ్లలో
అతని సర్వీస్ తుపాకీని రెండే సార్లు వాడాడు.

280
00:25:08,780 --> 00:25:10,073
అతని నేతృత్వంలో, ఒక్క చావు కూడా జరగలేదు.

281
00:25:10,156 --> 00:25:12,242
ఇలాంటి ఘటనని అతనెప్పుడూ ఎదుర్కోలేదు.

282
00:25:12,325 --> 00:25:13,826
కాబట్టి అతనిపై అతనికి అపనమ్మకం ఏర్పడవచ్చు.

283
00:25:14,577 --> 00:25:16,204
వాళ్ళ బలహీనతను వాడుకో.

284
00:25:16,788 --> 00:25:19,457
అతనికి నీ సాయం కావాలి అనిపించేలా చేయి.

285
00:25:20,583 --> 00:25:21,709
చాలా స్నేహంగా మెలగాలి, అర్థమైంది.

286
00:25:21,793 --> 00:25:23,670
నన్ను చూసుకోవడానికి వచ్చే ఎఫ్.బీ.ఐ వాళ్ళు ఎవరు?

287
00:25:24,170 --> 00:25:27,131
యాంకరేజ్ లో ఉండే ఇద్దరు ఏజెంట్లు
వస్తున్నారు. వాళ్ళ పేర్లు బోల్టన్, షా.

288
00:25:27,215 --> 00:25:28,341
వాళ్లకి మిషన్ గురించి చెప్పాం.

289
00:25:28,424 --> 00:25:30,677
- వాళ్ళు నీకోసం అక్కడ ఎదురుచూస్తుంటారు.
- అతను ఫోన్ చేస్తున్నాడు.

290
00:25:32,053 --> 00:25:34,514
ఒకటి గుర్తుంచుకో, అతని అవసరం మనకి ఉంది.

291
00:25:34,597 --> 00:25:39,644
మార్షల్స్ మనల్ని దూరం పెట్టేస్తే,
ఇది మనకి చాలా పెద్ద తలనొప్పిగా మారుతుంది.

292
00:25:46,609 --> 00:25:48,236
మిస్టర్ రెమ్నిక్, నా పేరు సిడ్నీ స్కోఫీల్డ్.

293
00:25:48,319 --> 00:25:50,822
నేను వస్తున్నానని
యాంకరేజ్ ఫీల్డ్ ఆఫీస్ వాళ్ళు మీకు చెప్పే ఉంటారు.

294
00:25:50,905 --> 00:25:53,199
చెప్పారు. కానీ మీరు ఏ శాఖలో
పని చేస్తున్నారు అనేది మాత్రం చెప్పలేదు.

295
00:25:53,283 --> 00:25:54,951
అర్థం చేసుకోగలను. అది కాస్త సంక్లిష్టమైన విషయం.

296
00:25:55,034 --> 00:25:57,203
నేను మల్టీఏజెన్సీ టాస్క్ ఫోర్సులో పని చేస్తున్నా.

297
00:25:57,287 --> 00:25:58,580
అది చట్టవిరుద్ధ ఆపరేషన్ కి కోడ్ పేరా?

298
00:25:58,663 --> 00:25:59,789
ఇప్పుడేం జరగవచ్చు అనేదానికి సంబంధించి

299
00:25:59,873 --> 00:26:01,624
వెల్లడించగల సమాచారాన్ని
మీకు పంపించే ప్రయత్నం చేస్తున్నా, నాకు…

300
00:26:01,708 --> 00:26:03,376
జేపాట్స్ ని మార్షల్స్ చూసుకుంటారు, సీఐఏ కాదు.

301
00:26:03,459 --> 00:26:06,588
సురక్షితం కాని లైన్లో దాని గురించి
నేను మాట్లాడలేను, కానీ ఒకమాట,

302
00:26:06,671 --> 00:26:08,798
మీకు పరిస్థితిని వివరించడానికి,
కావాల్సిన వనరులని అందించడానికి,

303
00:26:08,882 --> 00:26:10,425
నేను అక్కడికే వస్తున్నా.

304
00:26:10,508 --> 00:26:13,303
అప్పటిదాకా, ఆ ప్రాంతాన్ని
సీల్ చేసేసి, సురక్షితంగా ఉంచండి.

305
00:26:13,386 --> 00:26:14,596
ఆ పని చేయగలరా?

306
00:26:14,679 --> 00:26:16,347
మిస్ స్కోఫీల్డ్, ఇది అలాస్కా.

307
00:26:16,431 --> 00:26:17,682
ఇక్కడ ప్రాంతాలకి సీల్స్ వేయడం అసాధ్యం.

308
00:26:27,525 --> 00:26:30,195
ఫెయిర్ బ్యాంక్స్ కు స్వాగతం
మంచితనానికి మారుపేరైన నగరం

309
00:26:32,822 --> 00:26:34,365
కీరా
ప్రీక్యాల్కులస్ క్లాస్ ఎలా సాగింది?

310
00:26:34,449 --> 00:26:35,867
బోర్ కొట్టేసింది
వస్తున్నావా?

311
00:26:38,411 --> 00:26:39,579
- బూ!
- హేయ్!

312
00:26:39,662 --> 00:26:40,663
హేయ్.

313
00:26:40,747 --> 00:26:41,873
హేయ్, కోట్ తెచ్చుకున్నావా?

314
00:26:41,956 --> 00:26:43,458
అది నా లాకర్లో ఉంది. ఎక్కడికి వెళ్తున్నాం?

315
00:26:44,083 --> 00:26:45,418
గేమ్ ప్రారంభోత్సవ ఈవెంట్ కి మనం వెళ్లట్లేదు.

316
00:26:46,169 --> 00:26:47,170
ఎందుకు?

317
00:26:48,796 --> 00:26:50,632
అది సర్ప్రైజ్, సరేనా? పద.

318
00:26:50,715 --> 00:26:51,799
హోంకమింగ్

319
00:26:56,596 --> 00:26:58,014
గుడ్ మార్నింగ్, హస్కీలారా.

320
00:26:58,097 --> 00:27:00,850
నేను ప్రిన్సిపల్ కెనేగీని,
మీకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను.

321
00:27:00,934 --> 00:27:03,978
ఈ పరిసర ప్రాంతంలో ఒక అనుకోని ఘటన జరిగిందట,

322
00:27:04,062 --> 00:27:05,563
పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారట,

323
00:27:05,647 --> 00:27:08,608
అలాస్కా రాష్ట్ర పోలీసు శాఖలో పని చేసే ఆఫీసర్ మార్క్స్,

324
00:27:08,691 --> 00:27:10,485
ఆ పరిస్థితి గురించి చెప్పడానికి వచ్చారు.

325
00:27:12,111 --> 00:27:13,738
థ్యాంక్యూ, ప్రిన్సిపల్ కెనేగీ.

326
00:27:14,739 --> 00:27:21,120
ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా, యుకాన్ ఫ్లాట్స్ లో జరిగిన
ఒక సంఘటనని మేము కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాం.

327
00:27:21,204 --> 00:27:25,333
ఇక్కడ మీరు సురక్షితంగానే ఉంటారు,
కానీ ఎందుకైనా మంచిదని…

328
00:27:26,000 --> 00:27:26,960
అమ్మ

329
00:27:27,043 --> 00:27:29,212
…మేము స్కూల్ ని నిర్బంధంలో
ఉంచుతున్నాం, స్ట్రిక్టుగా కాదులెండి.

330
00:27:29,295 --> 00:27:32,423
దురదృష్టవశాత్తు, నార్త్ స్టార్ పై
ఈరాత్రి జరగబోయే మ్యాచ్ తో పాటుగా,

331
00:27:32,507 --> 00:27:36,386
రేపు రాత్రి జరగబోయే
హోంకమింగ్ డ్యాన్స్ కూడా వాయిదా పడతాయి.

332
00:27:37,303 --> 00:27:38,388
హస్కీలకు జయహో.

333
00:27:45,270 --> 00:27:48,106
మార్షల్ గ్రేంజర్. మీ వల్లే నేను ప్రాణాలతో ఉన్నాను.

334
00:27:48,189 --> 00:27:51,734
నా పేరు ఫ్రాంక్ రెమ్నిక్,
నేను సూపర్వైజర్ డెప్యూటినీ. ఎలా ఉంది మీకు?

335
00:27:51,818 --> 00:27:54,153
మిగతావాళ్ల ఆచూకీ తెలిసిందా? వాళ్ళని మనం వదిలేయకూడదు.

336
00:27:55,113 --> 00:27:56,114
ముగ్గురు మార్షల్స్ చనిపోయారు.

337
00:27:56,948 --> 00:27:58,491
ఒక పైలట్ కూడా చనిపోయాడు.

338
00:27:58,575 --> 00:27:59,909
ఇంకా 18 మంది జాడ తెలీట్లేదు.

339
00:27:59,993 --> 00:28:01,411
సరే, అయితే వాళ్ళు చనిపోయారంటారా?

340
00:28:01,494 --> 00:28:03,705
ఇప్పుడు ఉష్ణోగ్రత 15 డిగ్రీలు ఉంది,
కాబట్టి పరిస్థితి బాగాలేదనే చెప్పాలి.

341
00:28:03,788 --> 00:28:05,498
వాల్, మాకు రెండు నిమిషాలు ఏకాంతం ఇస్తావా?

342
00:28:05,582 --> 00:28:06,583
థ్యాంక్యూ.

343
00:28:09,544 --> 00:28:11,421
మిమ్మల్ని ఎయిర్ అంబులెన్స్ లో
ఫెయిర్ బ్యాంక్స్ కి పంపుతున్నాం.

344
00:28:11,504 --> 00:28:12,505
సరే.

345
00:28:12,589 --> 00:28:15,717
కానీ వెళ్లే ముందు, అసలేం జరిగిందో నాకు చెప్పండి.

346
00:28:15,800 --> 00:28:18,094
ఒక ఖైదీ సంకెళ్లు తెంచుకుని,
విమానం కూలిపోయేలా చేశాడు.

347
00:28:18,177 --> 00:28:19,137
ఏ ఖైదీ?

348
00:28:19,637 --> 00:28:22,557
ఏమో. మేము మధ్యలో షెడ్యూల్ లో లేని
ఓ చోట ఆగడానికి విమానాన్ని మళ్ళించాం.

349
00:28:22,640 --> 00:28:23,474
ఏ చోటికి?

350
00:28:23,558 --> 00:28:25,602
- అదొక వైమానిక స్థావరం అనుకుంటా…
- వైమానిక స్థావరమా? ఎక్కడ?

351
00:28:25,685 --> 00:28:27,604
- ఎక్కడో మారుమూలన ఉంది.
- పశ్చిమ తీరానికి ఎంత దూరంలో ఉంది?

352
00:28:27,687 --> 00:28:29,105
- తెలీదు.
- సరే. సర్లే.

353
00:28:29,189 --> 00:28:31,274
మీరేం చూశారో చెప్పండి చాలు.

354
00:28:33,902 --> 00:28:35,820
అతని ముఖానికి ముసుగు వేసి ఉంది.

355
00:28:35,904 --> 00:28:36,779
ఒంటి నిండా సంకెళ్లున్నాయి.

356
00:28:38,907 --> 00:28:40,491
అతడిని "హావ్లాక్" అని పిలిచారు.

357
00:28:43,369 --> 00:28:45,663
అతను చాలా ముఖ్యమైన వాడని,
అనధికారికంగా తరలిస్తున్నారని చెప్పారు.

358
00:28:46,372 --> 00:28:47,540
అయినా కానీ మీరు ఎక్కించుకున్నారా?

359
00:28:47,624 --> 00:28:48,499
లేదు.

360
00:28:49,250 --> 00:28:50,710
ఇతరులతో పాటు కూర్చోబెట్టలేదు. వెనుక కూర్చోబెట్టాం.

361
00:28:50,793 --> 00:28:53,254
- ఏ అధికారంతో మీరు…
- అతడిని సీటుకు కట్టేశాం, అలా ఎప్పుడూ చేయలేదు మేము.

362
00:28:53,338 --> 00:28:55,173
ఒక ఖైదీని అలా కట్టేయడం ప్రోటోకాల్ కి విరుద్ధం.

363
00:28:56,007 --> 00:28:58,426
కానీ అతనికి తెలుసన్నట్టుగా అనిపించింది.

364
00:28:58,968 --> 00:29:00,011
ఏం తెలుసన్నట్టుగా?

365
00:29:00,887 --> 00:29:02,263
మేము అతడిని అడ్డుకునే అవకాశమే లేదు అని.

366
00:29:03,306 --> 00:29:06,142
అతనికి ఉన్నంత తెలివి ఎవరికీ లేదు.

367
00:29:06,226 --> 00:29:08,853
అతని పాదాలు నేలని తాకగానే, స్వేచ్ఛ
లభిస్తుందని అతను చాలా నమ్మకంగా ఉన్నట్టు

368
00:29:08,937 --> 00:29:10,355
అనిపించింది.

369
00:29:13,233 --> 00:29:14,067
ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్

370
00:29:14,150 --> 00:29:16,569
- ఫ్రాంక్. ఎయిర్ అంబులెన్స్ వచ్చేసింది.
- సరే, ఒక క్షణం.

371
00:29:18,196 --> 00:29:19,405
ఒకటి సూటిగా చెప్పండి,

372
00:29:20,240 --> 00:29:22,825
మీ జేపాట్స్ విమానం షెడ్యూల్ లో లేని ఒక చోట ఆగిందని,

373
00:29:22,909 --> 00:29:24,994
లిస్టులో లేని ఒక దోషిని మీరు ఎక్కించుకున్నారని,

374
00:29:25,078 --> 00:29:27,413
పైగా అతను మన అధికార పరిధిలోని వ్యక్తి కాదని,

375
00:29:27,497 --> 00:29:29,666
- అయినా మీరేమీ అడగలేదని అంటున్నారా?
- హా, అవును.

376
00:29:30,250 --> 00:29:31,292
ఫ్రాంక్, వాళ్ళు బయలుదేరాలి.

377
00:29:35,338 --> 00:29:36,839
ఒకటి మాత్రం పక్కాగా చెప్పగలను.

378
00:29:36,923 --> 00:29:38,716
విమానాన్ని కూల్చింది అతనే.

379
00:29:45,682 --> 00:29:47,016
ఏమంటున్నాడు అతను?

380
00:29:47,559 --> 00:29:48,685
ఏమో.

381
00:29:50,019 --> 00:29:52,063
అతనితో ఎవరినైనా పంపించి, అతని వాంగ్మూలం తీసుకోమను.

382
00:29:53,147 --> 00:29:54,232
డానీకి ఎలా ఉంది?

383
00:29:55,608 --> 00:29:56,860
హేయ్.

384
00:29:56,943 --> 00:29:58,736
మీరు రక్తస్రావాన్ని నియంత్రణలోకి తెచ్చారని విన్నా.

385
00:29:59,779 --> 00:30:01,197
ఇవాళ నీ అదృష్టం పండిందోయ్.

386
00:30:01,281 --> 00:30:03,950
మనిద్దరిదీ పండిందని విన్నాను. అభినందనలు.

387
00:30:05,034 --> 00:30:06,536
అదే, క్యాబిన్ గురించి తెలిసింది.

388
00:30:06,619 --> 00:30:08,121
నిన్న రాత్రి పోకర్ ఆడేటప్పుడు టామ్ చెప్పాడు.

389
00:30:08,997 --> 00:30:10,331
సారా, ఇంకా నీ విషయంలో ఆనందంగా ఉంది.

390
00:30:10,915 --> 00:30:13,418
ప్రతి మార్షల్ కనే కలనే నువ్వు నిజం చేసుకున్నావు.

391
00:30:13,501 --> 00:30:14,502
ఏంటి ఆ కల, డాన్?

392
00:30:15,169 --> 00:30:16,462
బతికి బట్టకట్టడమే కదా?

393
00:30:16,546 --> 00:30:18,548
చివరికి ఇంటికి వెళ్లి నీ భార్యతో గడపడమే కదా?

394
00:30:18,631 --> 00:30:20,216
అక్కడ కాస్త జాగ్రత్తగా ఉండు.

395
00:30:20,300 --> 00:30:21,551
నీ గమ్యస్థానానికి దగ్గర్లోనే ఉన్నావు.

396
00:30:47,076 --> 00:30:49,662
సరే మరి. అందరూ వినండి.
వేరే ఊళ్ళ నుండి బృందాలు వస్తున్నాయి.

397
00:30:49,746 --> 00:30:52,415
లోవర్ టాననా వాసుల ప్రాంతానికి మీ అందరికీ స్వాగతం,

398
00:30:52,498 --> 00:30:55,001
ఈ ప్రాంతాన్నే ఫెయిర్ బ్యాంక్స్
నార్త్ స్టార్ బరో అని కూడా పిలుస్తారు.

399
00:30:55,084 --> 00:30:57,420
మా మనుషులని గౌరవంగా చూస్తే,
మిమ్మల్ని కూడా వాళ్ళు గౌరవంగా చూస్తారు.

400
00:30:57,503 --> 00:31:00,173
నేను, మార్షల్ రెమ్నిక్ కలిసి ఈ రిపోర్ట్ ని
తయారు చేశాము, కానీ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి,

401
00:31:00,256 --> 00:31:02,884
ఎప్పటికప్పుడు అందే సమాచారాన్ని బట్టి
పరిస్థితిని మెరుగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం.

402
00:31:02,967 --> 00:31:05,053
జైళ్ల శాఖ నుండి ఖైదీల ఫోటోలు,
ఫైళ్లు ఇంకా అందుతూ ఉన్నాయి,

403
00:31:05,136 --> 00:31:07,180
అవన్నీ మాకు అందాకే, మీకు ఇవ్వగలం.

404
00:31:07,722 --> 00:31:11,559
ఇప్పటిదాకా మాకు తెలిసిన సమాచారం ప్రకారం,
ఈ విమానంలోకి 52 మంది ఖైదీలు ఎక్కారు,

405
00:31:11,643 --> 00:31:13,728
వారిలో 23 మంది చనిపోయారు,
పదకొండు మందిని అదుపులోకి తీసుకున్నాం,

406
00:31:13,811 --> 00:31:17,899
అంటే, ఇంకా 18 మంది మిస్ అవుతున్నారు,
వాళ్ళు పరారీలో ఉండవచ్చు కూడా.

407
00:31:17,982 --> 00:31:20,068
సరే, నిమిష నిమిషానికి కొత్త సమాచారం అందుతోంది.

408
00:31:20,151 --> 00:31:21,152
కాబట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి,

409
00:31:21,236 --> 00:31:24,113
సమాచారాన్ని షేర్ చేయండి,
కానీ ఇదంతా త్వరగా చేయాలి, సరేనా?

410
00:31:24,197 --> 00:31:25,615
రోజురోజుకీ పగటి సమయం ఎనిమిది నిమిషాలు తగ్గుతోంది.

411
00:31:25,698 --> 00:31:27,992
వాళ్ళని మనం ఇప్పుడు కనుగొనలేకపోతే,
చీకట్లో గాలించాల్సి వస్తుంది.

412
00:31:28,076 --> 00:31:30,245
అదీ విషయం, థ్యాంక్యూ.

413
00:31:32,497 --> 00:31:33,373
మిస్టర్ రెమ్నిక్?

414
00:31:33,456 --> 00:31:34,374
చెప్పండి.

415
00:31:34,457 --> 00:31:37,252
మనం ఫోన్లో మాట్లాడుకున్నాం. నా పేరు, సిడ్నీ స్కోఫీల్డ్.

416
00:31:37,335 --> 00:31:38,545
నా పేరు ఫ్రాంక్.

417
00:31:38,628 --> 00:31:39,796
మిస్టర్ రెమ్నిక్ అని మా నాన్నని పిలుస్తారు.

418
00:31:39,879 --> 00:31:41,297
సరే, ఫ్రాంక్.

419
00:31:41,381 --> 00:31:43,216
ఈ పరిస్థితి గురించి మాకేం చెప్పగలరు మీరు?

420
00:31:43,716 --> 00:31:46,678
బ్లాక్ బాక్స్ దొరికాక మరింత సమాచారం
లభిస్తుంది, కానీ క్లుప్తంగా చెప్పాలంటే,

421
00:31:46,761 --> 00:31:50,848
ఒక ప్రమాదకరమైన వ్యక్తి కోసమని రన్ చేస్తున్న
రహస్య మిషన్ లో భాగంగా విమానాన్ని వేరే చోటకు మళ్లించారు.

422
00:31:50,932 --> 00:31:52,225
అంతే చెప్పగలరా నాకు?

423
00:31:52,308 --> 00:31:55,228
నా టీమ్ ఒక రిపోర్ట్ ని తయారు చేస్తోంది,
ఒక గంటలో అది మీ చేతికి వస్తుంది.

424
00:31:55,311 --> 00:31:58,773
ఇప్పుడు న్యాయశాఖ ప్యాసింజర్లందరి
ఆడిట్ తప్పక చేయాల్సిందే అంటోంది,

425
00:31:58,857 --> 00:32:00,692
చనిపోయినవారిని, అదుపులో ఉన్నవారిని,
మిస్ అయిన వారందరినీ పరిగణించాలి.

426
00:32:00,775 --> 00:32:02,151
సరే, ఆ పని చేయగలం, కానీ

427
00:32:02,235 --> 00:32:05,530
నాకు అర్థం కాని విషయం ఏంటంటే,
జేపాట్స్ విమానాన్ని సీఐఏ ఎందుకు ఉపయోగిస్తోంది?

428
00:32:05,613 --> 00:32:07,907
- అది రహస్యం, కానీ అదంతా మీకిచ్చే రిపోర్టులో ఉంటుంది.
- నాకర్థం కావట్లేదు.

429
00:32:07,991 --> 00:32:09,659
రవాణాలన్నింటినీ మార్షల్స్ చూసుకుంటూ ఉంటారు,

430
00:32:09,742 --> 00:32:11,995
అయినా కానీ, ఏ ఆపరేషన్ గురించీ
మాకు సమాచారం అందలేదు.

431
00:32:12,078 --> 00:32:13,955
- మీకు చాలా ప్రశ్నలు ఉంటాయని నాకు తెలుసు…
- హా.

432
00:32:14,038 --> 00:32:15,623
…వాటన్నింటికీ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను,

433
00:32:15,707 --> 00:32:19,627
కానీ మనం ఇప్పుడు అనేక ఏజెన్సీలతో పని చేయాల్సి
వస్తోంది, కాబట్టి అంతా గందరగోళంగా ఉంది.

434
00:32:22,589 --> 00:32:23,965
ఇవేనా మీకు దొరికిన వాళ్ళందరి శవాలు?

435
00:32:24,048 --> 00:32:25,049
ఇప్పటిదాకా ఇవే.

436
00:32:26,175 --> 00:32:28,678
శిథిలాలు ఒకటిన్నర కిలోమీటరు రేడియస్ లో
పడి ఉండవచ్చు, ఆ రేడియస్ ఎక్కువే ఉండవచ్చు కూడా.

437
00:32:30,513 --> 00:32:31,931
టోపీ భలే గమ్మత్తుగా ఉంది.

438
00:32:36,769 --> 00:32:37,937
మీరు పైలట్ కదా, ఫ్రాంక్.

439
00:32:38,688 --> 00:32:40,106
శిథిలాలు ఎక్కడెక్కడ పడ్డాయో చూశారు కదా.

440
00:32:40,190 --> 00:32:43,067
ఇది యాక్సిడెంట్ లా అనిపిస్తోందా?
ఏదో గడబిడ జరిగినట్టు అనిపిస్తోందా?

441
00:32:43,151 --> 00:32:44,402
ఏదో గడబిడ జరుగుతోంది.

442
00:32:44,485 --> 00:32:46,613
అంటే, ఇంత ఉత్తరం వైపు,
ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు?

443
00:32:51,576 --> 00:32:52,952
ఇతడిని గొంతు పిసికి చంపేశారు.

444
00:32:53,536 --> 00:32:56,080
ఎర్రటి మచ్చ ఉంది. హాయోయిడ్ ఎముక విరిగిపోయింది.

445
00:32:56,664 --> 00:32:58,708
నేను అదుపులో ఉన్న ఖైదీలతో మాట్లాడాలి.

446
00:32:58,791 --> 00:33:01,127
హా, ఇదంతా హావ్లాక్ చేసి ఉంటాడు అంటారా?

447
00:33:01,920 --> 00:33:02,962
ఏమన్నారు?

448
00:33:04,714 --> 00:33:06,674
మీరు వెతుకుతోంది అతని కోసమే కదా? హావ్లాక్ కోసమే కదా?

449
00:33:06,758 --> 00:33:08,176
ఆ పేరు మీకెలా తెలిసింది?

450
00:33:09,177 --> 00:33:11,012
యాక్సిడెంట్ లో ఒక మార్షల్ ప్రాణాలతో బయటపడ్డాడు.

451
00:33:11,596 --> 00:33:13,389
మీరు వైమానిక స్థావరంలో ఎక్కించుకుంది హావ్లాక్ నే కదా?

452
00:33:13,473 --> 00:33:14,599
నేను ఆ మార్షల్ ని కలవాలి.

453
00:33:14,682 --> 00:33:17,435
వాళ్ళు విమానాన్ని మళ్లించేవారు కాదు.
ఆ అధికారం వాళ్లకి లేదు.

454
00:33:17,518 --> 00:33:20,021
- మిషన్ వివరాలన్నీ…
- రిపోర్టులో ఉంటాయి. అది వందసార్లు చెప్పుంటారు మీరు.

455
00:33:20,104 --> 00:33:23,775
చూడండి, నేను మిమ్మల్ని చిన్నచిన్న ప్రశ్నలే
అడుగుతున్నా, కానీ మీరు ఏదీ స్పష్టంగా చెప్పట్లేదు.

456
00:33:24,651 --> 00:33:25,735
బేస్ క్యాంపులో మాట్లాడుకుందాం.

457
00:33:25,818 --> 00:33:27,862
ఈ ఉదయం చావు అంచుల దాకా వెళ్లిన
నా మిత్రుడి గురించి మాట్లాడుకుందాం,

458
00:33:27,946 --> 00:33:29,822
ఇప్పుడు అతను ఆసుపత్రికి వెళ్తున్నాడు.

459
00:33:29,906 --> 00:33:30,949
ఓ భార్య, ఓ పాప ఉన్నారు అతనికి.

460
00:33:31,032 --> 00:33:35,495
దయచేసి అర్థం చేసుకోండి, సరైన అనుమతి లేకుండా
మిషన్ వివరాల గురించి నేను చట్టప్రకారం మాట్లాడలేను…

461
00:33:35,578 --> 00:33:37,872
మీరు నాకు సగం-సగం సమాచారం చెప్తే కుదరదు, సరేనా?

462
00:33:37,956 --> 00:33:39,999
ఇక్కడ జరిగేదేంటో అర్థం చేసుకోగలను.

463
00:33:40,083 --> 00:33:43,002
నేను 18 మంది ఖైదీల కోసం గాలిస్తున్నాను,
కానీ సీఐఏ వాళ్ళ దృష్టంతా ఒకరి మీదనే ఉంది.

464
00:33:43,503 --> 00:33:45,797
ఇక్కడ నాకు అర్థం కాని విషయాలు చాలా జరుగుతున్నాయి,

465
00:33:45,880 --> 00:33:48,758
కానీ నాకు తెలిసిందేంటో చెప్పనా?
ఈ ప్రాంతం గురించి నాకు బాగా తెలుసు.

466
00:33:48,841 --> 00:33:50,009
ఇది చాలా ప్రమాదకరమైనది.

467
00:33:50,593 --> 00:33:52,804
ఇక్కడ చలి, క్రూరమృగాల దాకా అక్కర్లేదు,

468
00:33:52,887 --> 00:33:55,014
పద్దెనిమిది గంటల చీకటికే ప్రాణాలు పోతాయి.

469
00:33:56,474 --> 00:33:57,684
ఇక్కడి జనాలు వేరుగా ఉంటారు.

470
00:33:58,351 --> 00:34:00,645
చాలా మంది దగ్గర ఫోన్లు ఉండవు.
కానీ తుపాకులు చాలా మంది దగ్గర ఉంటాయి.

471
00:34:01,145 --> 00:34:02,814
వాళ్ళని కాపాడతానని నేను ప్రమాణం చేశాను.

472
00:34:03,940 --> 00:34:05,525
ఆ ప్రమాణానికి నేను కట్టుబడి ఉన్నాను.

473
00:34:06,192 --> 00:34:07,861
ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోండి.

474
00:34:07,944 --> 00:34:09,445
ఇక్కడి వాళ్ళ ప్రాణాల కన్నా,

475
00:34:09,528 --> 00:34:12,282
వాళ్ళ భద్రతా కన్నా
మీ రహస్యానికే మీరు ఎక్కువ ప్రాధాన్యతనిస్తే,

476
00:34:12,365 --> 00:34:14,033
నేను మీతో కలిసి పని చేయలేను.

477
00:34:14,117 --> 00:34:15,618
- మిస్టర్ రెమ్నిక్…
- అలా మా నాన్నని పిలుస్తారు.

478
00:34:16,119 --> 00:34:17,871
హా. ఫ్రాంక్.

479
00:34:19,289 --> 00:34:20,539
ఉన్న విషయం చెప్తున్నా, ఫ్రాంక్.

480
00:34:21,124 --> 00:34:22,792
నేనేం ఇష్టపూర్వకంగా ఇక్కడికి రాలేదు,

481
00:34:22,876 --> 00:34:25,503
నన్ను పంపించిన వారిని రక్షించాలని కూడా నాకు లేదు.

482
00:34:26,004 --> 00:34:29,006
కాబట్టి, మీకేం కావాలో అడగండి.

483
00:34:30,925 --> 00:34:32,218
ముందు హావ్లాక్ గురించి చెప్పండి.

484
00:34:33,760 --> 00:34:34,762
మూడేళ్ళ క్రితం,

485
00:34:34,845 --> 00:34:38,557
ఒక బయటి వ్యక్తి, సీఐఏలో పాతుకుపోయి రహస్యాలను
శత్రువులకు చేరవేస్తున్నాడని పుకార్లు వచ్చాయి.

486
00:34:38,641 --> 00:34:41,977
సిద్ధాంతపరమైన విభేదాలతో శత్రువుల పక్షాన చేరి,

487
00:34:42,562 --> 00:34:44,147
రహస్యాలను లాభం కోసం కాకుండా,

488
00:34:44,229 --> 00:34:49,568
అమెరికా ప్రభుత్వ స్థిరత్వాన్ని దెబ్బ తీసి,
దాన్ని కూలదోయాలన్న పన్నాగంలో భాగంగా అన్నమాట.

489
00:34:49,651 --> 00:34:51,571
అతను సమాచారాన్ని సరిగ్గా సమయానికి చేరవేసేవాడు,

490
00:34:51,653 --> 00:34:56,618
దాని వల్ల ఎంత నష్టం జరిగేదంటే, అతడిని పట్టుకోవడానికి
న్యాయశాఖ మల్టీ-ఏజెన్సీ టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేసింది,

491
00:34:56,700 --> 00:35:00,413
కానీ అసలు నిజం ఏంటంటే,
ఈ ఫిరాయింపుదారుడు వల్ల ఏ ముప్పూ లేదు.

492
00:35:00,496 --> 00:35:03,333
ఆట్వాటర్ ప్రోటోకాల్ అనే రహస్యమైన ఆపరేషన్ లో భాగంగా,

493
00:35:03,416 --> 00:35:06,586
భయం కలిగించాలన్న ఉద్దేశంతో
సిఐఏ సృష్టించిన కల్పిత వ్యక్తే అతను.

494
00:35:06,669 --> 00:35:11,049
నిఘా సమాచారాన్ని లీక్ చేసే
ఇలాంటి ఫిరాయింపుదారులను కొందరిని ఏజెన్సీ సృష్టించింది,

495
00:35:11,132 --> 00:35:14,135
లీక్ చేసి, శత్రువులని రప్పించి,
వాళ్ళని హతమార్చాలన్నదే ఏజెన్సీ లక్ష్యం.

496
00:35:15,011 --> 00:35:17,639
అలాంటి ఒక ఫిరాయింపుదారుడే, లీవై టేలర్ హార్ట్ మన్.

497
00:35:17,722 --> 00:35:20,141
అతని కోడ్ పేరు, హావ్లాక్.

498
00:35:20,892 --> 00:35:23,895
అన్నిట్లో ముందుండే ఆ వ్యక్తిని ఆయుధంగా మార్చి,

499
00:35:23,978 --> 00:35:26,105
ప్రోగ్రామ్ కి జీవం పోసే పనిని నాకు అప్పగించారు.

500
00:35:26,189 --> 00:35:31,402
హావ్లాక్ కి వివిధ ఆయుధాల వాడకంలో, క్రూరంగా
చంపడంలో శిక్షణ ఇప్పించాను, అనేక భాషలను నేర్పించాను.

501
00:35:31,486 --> 00:35:33,154
గత రెండేళ్లుగా,

502
00:35:33,238 --> 00:35:35,949
హావ్లాక్, నిఘా సమాచారాన్ని ఉచ్చుగా వాడి,

503
00:35:36,032 --> 00:35:39,869
యూరప్ లో, బాగా తూర్పుగా ఉన్న దేశాల్లోని
టార్గెట్లను ఆకర్షించి, చంపేసేవాడు.

504
00:35:39,953 --> 00:35:44,249
పోయిన నెల వరకు అంతా బాగానే సాగింది,
ఆ తర్వాత, కథ కాస్తా నిజమైంది.

505
00:35:44,332 --> 00:35:45,667
హావ్లాక్ అదృశ్యమయిపోయాడు.

506
00:35:45,750 --> 00:35:48,628
అతనితో పాటే రహస్యమైన నిఘా సమాచారం కూడా పోయింది.

507
00:35:48,711 --> 00:35:52,131
ఎందుకో తెలీదు కానీ, మా మంచి మనిషి
ఫిరాయించేసి, కథను నిజం చేసేశాడు.

508
00:36:03,268 --> 00:36:06,771
రెండు రోజుల క్రితం, చైనా-రష్యా సరిహద్దుల్లో
అతడిని అదుపులోకి తీసుకున్నారు.

509
00:36:06,855 --> 00:36:09,315
సీఐఏ అతడిని స్వదేశానికి తీసుకువస్తోంది,

510
00:36:09,399 --> 00:36:13,236
ఇంతలో ఆ విమానం కూలిపోయి, మీ ప్రాంతంలో వచ్చి పడింది.

511
00:36:16,322 --> 00:36:20,076
కానీ చెప్తున్నా కదా, హావ్లాక్ ప్లాన్ ఏంటో కానీ,

512
00:36:20,159 --> 00:36:24,038
ముప్పై వేల అడుగుల ఎత్తు నుండి
తప్పించుకోవడం అనేది ఆరంభం మాత్రమే.

513
00:36:27,375 --> 00:36:28,960
దీని కోసమే వెతుకుతున్నావా, ముసలోడా?

514
00:36:39,804 --> 00:36:40,805
ఇదుగో.

515
00:36:42,599 --> 00:36:45,310
నేను మీ హావ్లాక్ గురించి,
ఆ విమానం గురించి చాలా ఆలోచించాను.

516
00:36:46,811 --> 00:36:49,606
అతనెలా చేయగలిగాడు ఆ పని?
ఎవరైనా సాయం చేసి ఉంటారంటారా?

517
00:36:49,689 --> 00:36:50,773
ఎలాంటి సహాయమని మీ ఉద్దేశం?

518
00:36:50,857 --> 00:36:52,275
- అంటే…
- ఏంటిది?

519
00:36:53,026 --> 00:36:55,320
ఇది పొటాటో స్పామ్ చౌడర్.

520
00:36:55,403 --> 00:36:56,779
ఇది ఈ ఉత్తర ప్రాంతంలో దొరికే ప్రత్యేకమైన వంటకం.

521
00:36:56,863 --> 00:36:59,532
వావ్. నోరూరిపోతోంది.

522
00:37:00,658 --> 00:37:02,744
కానీ, ఈ వంటకం చేయడంలో మా బామ్మని తలదన్నేవారు లేరు.

523
00:37:02,827 --> 00:37:05,955
కానీ, ఆమె చర్చిలోని వంటకాల పుస్తకం నుండి
రామీ బ్లాక్ జాక్ రెసిపీని దొంగిలించింది అనుకోండి.

524
00:37:06,998 --> 00:37:08,166
తినండి. మీకు శక్తి కావాలి కదా.

525
00:37:09,584 --> 00:37:11,836
నాకు తెలీని మాంసం నేను ఎక్కువగా తినను.

526
00:37:11,920 --> 00:37:12,921
ఇక్కడ సలాడ్ దొరుకుతుందా?

527
00:37:13,004 --> 00:37:14,339
మేము సలాడ్ చేసుకోము.

528
00:37:15,089 --> 00:37:16,382
స్పామ్ అంటే పంది మాంసం.

529
00:37:17,217 --> 00:37:19,427
అంటే, భలే వారే! ఒకసారి ఆలోచించండి.

530
00:37:20,762 --> 00:37:23,514
ఆ పేలుడు పదార్థాలను విమానంలోకి
ఎక్కించడానికి ఎవరైనా అతనికి సాయపడి ఉండాలి కదా.

531
00:37:23,598 --> 00:37:25,225
ఇంకో దారే లేదు.

532
00:37:26,517 --> 00:37:27,852
ఒక్క నిమిషం అండి. ఈ ఫోన్ మాట్లాడి వస్తా.

533
00:37:31,105 --> 00:37:32,106
చెప్పు.

534
00:37:41,783 --> 00:37:44,077
- నేను ఇప్పుడే వస్తా.
- సరే, థ్యాంక్యూ.

535
00:37:44,661 --> 00:37:46,079
డానీకి బాగానే ఉందా?

536
00:37:46,871 --> 00:37:50,583
అంతర్గత రక్తస్రావం అయినట్టు గుర్తించారు.
ఎమర్జెన్సీ ఆపరేషన్ చేస్తున్నారు అతనికి. అక్కడికే వెళ్తున్నా.

537
00:37:50,667 --> 00:37:51,876
ఓరి దేవుడా.

538
00:37:52,544 --> 00:37:54,712
హేయ్, లూక్ ఏమైనా కాల్ చేశాడా?
ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు వాడు.

539
00:37:54,796 --> 00:37:56,756
లేదు, లూక్ బాగానే ఉన్నాడు.
వాడికేం కాదు. వాడి స్కూల్ లో లాక్ డౌన్ ఉంది.

540
00:37:57,340 --> 00:37:58,466
చూడు, నువ్వు డానీ సంగతి చూసుకో.

541
00:37:58,550 --> 00:38:00,009
- నేను లూక్ సంగతి చూసుకుంటా.
- సరే.

542
00:38:06,391 --> 00:38:08,601
హాయ్, జేన్. నేనే. చెప్పేది విను, నాకొక సాయం కావాలి.

543
00:38:08,685 --> 00:38:11,855
స్కూల్ నుండి అందరినీ పంపించేసేటప్పుడు,
లూక్ ని పికప్ చేసుకుని, మీ ఇంటికి తీసుకెళ్తావా?

544
00:38:11,938 --> 00:38:13,690
- తప్పకుండా.
- సూపర్.

545
00:38:13,773 --> 00:38:14,941
డానీకి ఎలా ఉంది?

546
00:38:15,024 --> 00:38:16,734
డానీకి ఏమీ బాగాలేదు. అతనికి ఆపరేషన్ చేయబోతున్నారు.

547
00:38:16,818 --> 00:38:18,611
చూడు, నేను నీకు అప్డేట్ చేస్తూ ఉంటా, సరేనా?

548
00:38:19,279 --> 00:38:20,280
బై.

549
00:38:21,865 --> 00:38:22,991
సారా మీ భార్యనా?

550
00:38:23,074 --> 00:38:24,075
హా, అవును.

551
00:38:26,077 --> 00:38:27,161
మీకు ఎలా ఉంది?

552
00:38:27,912 --> 00:38:29,789
చూడగలిగితే బాగుండు.

553
00:38:30,582 --> 00:38:31,457
హా.

554
00:38:31,541 --> 00:38:33,126
నన్ను ఇక్కడ బాగా చూసుకుంటున్నారు.

555
00:38:33,209 --> 00:38:34,085
ఇక్కడ బాగా చూసుకుంటారు.

556
00:38:34,168 --> 00:38:36,880
ఇతర మార్షల్స్ ఆచూకీ తెలిసిందా?

557
00:38:37,964 --> 00:38:38,965
వాళ్ళు బాగానే ఉన్నారా?

558
00:38:39,465 --> 00:38:43,803
అయ్యో! అయ్యయ్యో!

559
00:38:54,189 --> 00:38:55,190
అయ్యో.

560
00:39:00,445 --> 00:39:01,654
చాలా దారుణం జరిగిపోయింది.

561
00:39:08,244 --> 00:39:11,414
ఇలా ఎలా జరగనిచ్చావు, ఫ్రాంక్?

562
00:39:11,497 --> 00:39:13,833
చనిపోయాడు! నాకు దూరమైపోయాడు!

563
00:39:14,751 --> 00:39:16,294
నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు!

564
00:39:19,214 --> 00:39:22,008
వెళ్ళిపోయాడు. చనిపోయాడు.

565
00:39:47,075 --> 00:39:48,576
నాకు భయంగా ఉంది.

566
00:39:49,202 --> 00:39:50,870
మనకి ఏమైనా అవుతుందేమో అని భయంగా ఉంది.

567
00:39:52,121 --> 00:39:53,206
లూక్ విషయంలో భయంగా ఉంది.

568
00:39:53,289 --> 00:39:54,290
లేదు, లూక్ కి ఏమీ కాదు.

569
00:39:54,374 --> 00:39:56,459
నేను జేన్ తో మాట్లాడా. లూక్ ని
స్కూల్ నుండి తను పికప్ చేసుకుంటుంది.

570
00:39:56,543 --> 00:39:58,670
నా ఉద్దేశం అది కాదు,
నేనేమంటున్నానో నీకు బాగా తెలుసు.

571
00:40:01,631 --> 00:40:04,175
గతంలో ఒకసారి మన కుటుంబాన్ని
ఒక గాడిలోకి తెచ్చాను, మళ్ళీ…

572
00:40:06,719 --> 00:40:08,179
మళ్ళీ అలా నేను చేయలేను.

573
00:40:11,057 --> 00:40:12,267
నేను ప్రమాణం చేశాను.

574
00:40:16,646 --> 00:40:19,566
నాకు కూడా ఒక మాటిచ్చావు,

575
00:40:20,525 --> 00:40:21,526
మన కొడుక్కి మాటిచ్చావు.

576
00:40:22,443 --> 00:40:23,486
ఒకసారి లూక్ ని చూడు.

577
00:40:23,570 --> 00:40:25,655
ఇప్పుడు మందులు తీసుకోవట్లేదు.
మళ్ళీ మామూలు స్థితికి వచ్చేశాడు.

578
00:40:25,738 --> 00:40:26,948
ఇక నువ్వు? ఒకసారి నిన్ను చూసుకో.

579
00:40:27,031 --> 00:40:29,659
నువ్వు… నువ్వు ఇప్పుడు
నడవగలుగుతున్నావు, మాట్లాడగలుగుతున్నావు.

580
00:40:29,742 --> 00:40:32,203
అంటే, ఒకప్పుడు ఏమేం అనుభవించావో మర్చిపోయావా?

581
00:40:33,955 --> 00:40:35,206
అనుక్షణం తలుచుకుంటూనే ఉంటా.

582
00:40:36,291 --> 00:40:38,167
ఇది నిన్ను కబళించేస్తుంది.

583
00:40:41,087 --> 00:40:42,422
నాకది తెలుస్తోంది.

584
00:40:43,131 --> 00:40:44,632
ఇప్పటికే అది ప్రారంభమైంది కూడా.

585
00:40:45,925 --> 00:40:48,928
కానీ ఈ విషయంలో నువ్వు ఒక్కడివే
అంత చిత్తశుద్ధితో పోరాడాల్సిన పని లేదు, బంగారం.

586
00:40:50,805 --> 00:40:55,351
నువ్వు మార్షల్స్ కి నీ జీవితంలో 18 ఏళ్ళు అర్పించావు.

587
00:40:56,019 --> 00:40:57,478
నీ కుటుంబానికి, అంటే మాకు…

588
00:41:02,233 --> 00:41:03,693
మాకు నువ్వు కావాలి.

589
00:41:16,247 --> 00:41:17,248
హా.

590
00:41:21,920 --> 00:41:22,921
నేను…

591
00:41:23,838 --> 00:41:27,508
లంచ్ కి ఇంటికి వెళ్లాను,
నీ థర్మల్ ఇన్నర్ వేర్ ని డ్రయ్యర్ లో వేశా.

592
00:41:29,719 --> 00:41:30,887
నువ్వు లేకపోతే నేనేమైపోతానో ఏమో!

593
00:41:30,970 --> 00:41:32,931
చలికి గడ్డకట్టుకు చస్తావేమో.

594
00:41:33,014 --> 00:41:34,182
అందులో సందేహమే లేదు.

595
00:41:34,265 --> 00:41:35,725
అలా అయినా చస్తావు, లేదా ఆకలితో మాడి అయినా చస్తావు.

596
00:41:43,107 --> 00:41:44,817
హాచ్

597
00:41:46,110 --> 00:41:47,904
- చెప్పు.
- ఒక అప్డేట్ ఉంది.

598
00:41:48,446 --> 00:41:49,614
సరే. వస్తున్నా.

599
00:41:51,282 --> 00:41:52,325
నేను వెళ్ళాలి.

600
00:41:53,159 --> 00:41:54,244
టెలికమ్యూనికేషన్ శాఖ కాల్ చేసింది.

601
00:41:54,327 --> 00:41:55,411
యాంకరేజ్ లోని వాతావరణ శాఖ,

602
00:41:55,495 --> 00:41:57,664
దానికి చెందిన ఒకానొక అబ్జర్వర్ నుండి
ఓపెన్ సిగ్నల్ వస్తోందని రిపోర్ట్ చేస్తోంది.

603
00:41:57,747 --> 00:41:58,748
వారు కాపాడమంటున్నారేమో.

604
00:41:58,831 --> 00:42:00,458
కానీ ఆ సిగ్నల్ ఎక్కడి నుండి వస్తోంది?

605
00:42:00,542 --> 00:42:02,418
వీనటైకి దక్షిణాన ఉన్న టవర్ నుండి వస్తోందని చెప్పారు.

606
00:42:02,502 --> 00:42:04,504
వాతావరణ శాఖకి ఆరుగురు అబ్జర్వర్లతో కాంట్రాక్ట్ ఉంది.

607
00:42:04,587 --> 00:42:07,090
మేము అయిదు మంది అబ్జర్వర్లతో మాట్లాడాం.
మేము సంప్రదించలేకపోయింది ఎవరంటే…

608
00:42:07,173 --> 00:42:08,049
జెబ్ వెబ్బర్.

609
00:42:08,132 --> 00:42:09,133
జెబ్ వెబ్బర్ ఎవరు?

610
00:42:09,217 --> 00:42:11,177
హాచ్, విమానం కూలిన చోటుకు
అతను ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు.

611
00:42:11,261 --> 00:42:14,055
ఎవరైనా అంత వేగంగా కాళ్ల మీద వెళ్లిపోగలరా?

612
00:42:14,138 --> 00:42:15,848
హావ్లాక్ వెళ్లగలడు. ఇంతకీ జెబ్ వెబ్బర్ ఎవరు?

613
00:42:15,932 --> 00:42:17,433
అతను ఒక ముసలి డాగ్ స్లెడ్ డ్రైవర్.

614
00:42:17,517 --> 00:42:19,352
అలాస్కాయే మారుమూలన ఉంటుంది,
ఈయన అలాస్కాలో మారుమూల ఉంటాడు.

615
00:42:19,435 --> 00:42:22,480
అతను తన కుటుంబ ఫామ్ హౌసులో ఉంటూ,
స్లెడ్ డాగ్స్ ని చూసుకుంటూ ఉంటాడు.

616
00:42:22,564 --> 00:42:25,441
విమానం కూలిన చోటు నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో

617
00:42:25,525 --> 00:42:27,819
రేడియో, ఇంకా స్లెడ్ డాగ్స్ గల
అవుట్ పోస్ట్ ఒకటుందని అంటున్నారా?

618
00:42:28,778 --> 00:42:29,821
ఖచ్చితంగా హావ్లాక్ వెళ్ళుంటాడు.

619
00:43:07,358 --> 00:43:08,484
ఏం చేశావు నువ్వు?

620
00:43:33,301 --> 00:43:34,344
అంతా ఓకే.

621
00:43:34,427 --> 00:43:35,762
ఓకే అని ఎలా అంటావు! ఇరుక్కుపోయాం మనం.

622
00:43:38,806 --> 00:43:39,849
నీ ఫోన్ పని చేస్తోందా?

623
00:43:42,769 --> 00:43:43,978
మనం నడవాలి.

624
00:44:17,011 --> 00:44:19,305
ఇది చాలా బాగుంది.

625
00:44:20,682 --> 00:44:22,767
మీ అమ్మానాన్నలు కొన్న క్యాబిన్ ఇదేనా?

626
00:44:22,850 --> 00:44:24,310
ఇంకా సెల్ సిగ్నల్ రాలేదు.

627
00:44:25,144 --> 00:44:26,396
ల్యాండ్ లైన్ పని చేస్తోందా?

628
00:44:27,230 --> 00:44:28,231
డిస్ కనెక్ట్ అయిపోయింది.

629
00:44:28,314 --> 00:44:30,441
ఈ క్యాబిన్ జూన్ నుండి అమ్మకంలో ఉంది.

630
00:44:32,610 --> 00:44:33,820
మా నాన్నకి పిచ్చ కోపం వస్తుంది.

631
00:44:36,531 --> 00:44:37,824
మన కోసం ఇదంతా ప్లాన్ చేశావా?

632
00:44:38,449 --> 00:44:40,201
అవును. ఇదే సర్ప్రైజ్.

633
00:44:52,130 --> 00:44:55,508
ఇక్కడి నుండి హైక్ చేసుకుంటూ వెళదాం.
క్యాబిన్ ఒక ముప్పావు కిలోమీటరు దూరంలో గుట్టపై ఉంటుంది.

634
00:44:56,092 --> 00:44:57,594
అబ్బా! ఇది అంటుకుంటోంది.

635
00:44:58,553 --> 00:45:00,972
- ఏంటి?
- తుపాకీ అంటుకుంటోంది.

636
00:45:01,055 --> 00:45:02,849
దాన్ని లోపలే ఉంచేశారా మీరు?

637
00:45:02,932 --> 00:45:05,184
- లేదు.
- కండెన్సేషన్ వల్ల ఫ్రీజ్ అవుతుంది.

638
00:45:05,268 --> 00:45:06,269
హా, తెలుసు.

639
00:45:06,936 --> 00:45:09,147
మినరల్ ఆధారిత లూబ్రికెంట్ ని
వాడుతూ ఉండటం కూడా కారణం కావచ్చు.

640
00:45:09,230 --> 00:45:11,065
ఏదేమైనా, నా దగ్గర ఇంకో తుపాకీ లేదు, కాబట్టి…

641
00:45:12,942 --> 00:45:14,110
మీ తుపాకీని అతనికి ఇవ్వండి.

642
00:45:14,861 --> 00:45:17,113
సరే. జోక్ బాగుంది. గుడ్ లక్.

643
00:45:17,197 --> 00:45:19,657
అతను ఒక ఫెడరల్ ఏజెంట్,
యుఎస్ మార్షల్స్ కి ఒక దాడిలో సాయపడుతున్నాడు.

644
00:45:19,741 --> 00:45:21,826
మీరు సీఐఏ, చట్టప్రకారం
ఇక్కడ మీకు ఏ అధికారమూ లేదు.

645
00:45:21,910 --> 00:45:24,120
- ఆయనకి మీ తుపాకీ ఇవ్వండి.
- ఇవ్వకపోతే అరెస్ట్ చేస్తారా ఏంటి?

646
00:45:30,168 --> 00:45:31,461
సరే.

647
00:45:31,544 --> 00:45:32,754
ఆయుధం లేకపోయినా నేను వస్తాను.

648
00:45:33,338 --> 00:45:34,881
ఆయుధం లేకపోయినా మీరు మేనేజ్ చేసుకోగలరులే.

649
00:46:25,056 --> 00:46:26,891
నువ్వు బాగానే ఉన్నావా, జెబ్? అతనెక్కడ?

650
00:46:42,365 --> 00:46:43,366
హాచ్!

651
00:47:09,017 --> 00:47:10,351
వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు.

652
00:47:18,151 --> 00:47:19,652
- షా.
- నాకేం పర్లేదు.

653
00:47:23,531 --> 00:47:24,657
కదలకు!

654
00:47:24,741 --> 00:47:26,201
- దగ్గరకు రావద్దు.
- కదలకు!

655
00:47:26,284 --> 00:47:28,077
- తుపాకీని పడేయ్!
- ఒట్టేసి చెప్తున్నా, ఇతడిని కాల్చేస్తా.

656
00:47:28,161 --> 00:47:29,704
సరే, ఆవేశపడకు!

657
00:47:29,787 --> 00:47:31,414
- తుపాకీ కింద పెట్టేయ్!
- నేను మళ్ళీ జైలుకు వెళ్లను.

658
00:47:32,498 --> 00:47:33,791
ప్రశాంతంగా, నిదానంగా ఆయుధం పెట్టేయ్.

659
00:47:33,875 --> 00:47:35,376
- అతడిని కాల్చేయండి, ఫ్రాంక్.
- తనని నోర్మూసుకోమను.

660
00:47:35,460 --> 00:47:36,753
ఓకే, నిన్ను చుట్టుముట్టేశారని కనిపిస్తోందిగా.

661
00:47:37,462 --> 00:47:40,381
నిన్ను క్షేమంగా అప్పజెప్పడమే నా బాధ్యత.

662
00:47:40,465 --> 00:47:43,426
అలా చేయాలంటే, నువ్వు తుపాకీని కింద పెట్టేయాలి.

663
00:47:43,509 --> 00:47:44,844
అతను నీ బంధీని చంపేస్తాడు!

664
00:47:44,928 --> 00:47:46,679
కాల్చి పారేయండి!

665
00:47:46,763 --> 00:47:48,514
నేను నిన్ను కాపాడగలను.

666
00:47:48,598 --> 00:47:50,141
సరేనా? నువ్వు ముఖ్యమైనవాడివని బాగా తెలుసు.

667
00:47:50,225 --> 00:47:51,768
అందుకే ఆమె ఇక్కడికి వచ్చింది.

668
00:47:56,648 --> 00:47:58,024
తుపాకీని కింద పెట్టేయ్.

669
00:47:58,107 --> 00:47:59,734
నువ్వు, నేను కూర్చొని మాట్లాడుకుందాం.

670
00:48:08,284 --> 00:48:09,327
దీన్ని లాక్కెళ్లండి!

671
00:48:10,453 --> 00:48:12,205
జెబ్, కుక్కని ఆపు.

672
00:48:12,288 --> 00:48:14,040
జెబ్, దాన్ని ఆపు.

673
00:48:14,123 --> 00:48:15,917
జెబ్, నీ కుక్కని ఆపు!

674
00:48:16,000 --> 00:48:17,377
ఆపు దాన్ని.

675
00:48:49,033 --> 00:48:50,201
ఇతను హావ్లాక్ కాదు.

676
00:49:06,384 --> 00:49:09,262
శిథిలాల నుండి మరో మూడు శవాలను
మీరు వెలికి తీశారు అన్నారు కదా?

677
00:49:09,846 --> 00:49:10,847
అక్కడ ఉన్నాయి అవి.

678
00:49:31,784 --> 00:49:35,288
ఏజెంట్ బోల్టన్ చావుతో పోరాడుతున్నాడు,
కానీ ఆ ఖైదీ మాత్రం చనిపోయాడు.

679
00:49:36,039 --> 00:49:37,916
పూల మాల కోసం డబ్బులు కావాలా?

680
00:49:37,999 --> 00:49:39,542
ఇది జోక్ కాదు, సరేనా?

681
00:49:39,626 --> 00:49:42,170
వీళ్ళని ప్రాణాలతో అప్పగించడానికి
నాకు జీతం ఇస్తున్నారు, మీ వల్ల నా కనుసన్నల్లో

682
00:49:42,253 --> 00:49:43,254
ఒక ఫెడరల్ ఖైదీ చనిపోయాడు.

683
00:49:44,130 --> 00:49:45,882
సిబ్బందికి సంబంధించిన మీ ఫైళ్లని ఒకసారి ఇస్తారా?

684
00:49:46,549 --> 00:49:47,926
హేయ్. నేను చెప్పింది విన్నారా?

685
00:49:48,676 --> 00:49:49,719
విన్నాను.

686
00:50:00,480 --> 00:50:03,525
మనం ఇంతకుముందు చూసిన
ఖైదీయే ఇతను. ఎర్రటి మచ్చ…

687
00:50:07,237 --> 00:50:09,364
- గొంతు నులిమి చంపారని సూచిస్తోంది.
- అయితే?

688
00:50:11,824 --> 00:50:14,035
కానీ ఇతని మణికట్టుపై గాయాలేవీ లేవు.

689
00:50:14,118 --> 00:50:17,205
ఇతనికి సంకెళ్లు ఉండి, తిరిగి
పోరాడి ఉంటే, గాట్లు తప్పక పడి ఉండేవి.

690
00:50:17,705 --> 00:50:20,375
వాళ్ళు ఇతనిపై మూకుమ్మడి దాడి చేసుంటారు.
ఆ ఖైదీలు ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నారు.

691
00:50:21,084 --> 00:50:23,878
అవును, కానీ ఇతను ఖైదీ కాదు.

692
00:50:25,213 --> 00:50:26,214
ఏంటి?

693
00:50:27,465 --> 00:50:28,299
డెప్యూటీ యుఎస్ మార్షల్
గ్రేంజర్, రాబర్ట్

694
00:50:28,383 --> 00:50:29,259
గ్రేంజర్? అసాధ్యం.

695
00:50:29,342 --> 00:50:31,678
లేదు, నేను గ్రేంజర్ తో మాట్లాడాను.
విమానం ఎలా కూలిందో అతనే చెప్పాడు.

696
00:50:32,220 --> 00:50:33,596
మార్షల్ గ్రేంజర్.

697
00:50:34,097 --> 00:50:35,348
నా పేరు ఫ్రాంక్ రెమ్నిక్.

698
00:50:35,431 --> 00:50:37,016
అసలేం జరిగిందో నాకు చెప్పండి.

699
00:50:37,100 --> 00:50:39,477
ఒక ఖైదీ సంకెళ్లు తెంచుకుని,
విమానం కూలిపోయేలా చేశాడు.

700
00:50:39,561 --> 00:50:40,979
ఏ ఖైదీ?

701
00:50:41,062 --> 00:50:42,605
అతని ముఖానికి ముసుగు వేసి ఉంది.

702
00:50:43,648 --> 00:50:44,524
ఒంటి నిండా సంకెళ్లున్నాయి.

703
00:50:46,693 --> 00:50:48,111
అతడిని "హావ్లాక్" అని పిలిచారు.

704
00:50:53,491 --> 00:50:55,368
అతను చాలా ముఖ్యమైన వాడని,
అనధికారికంగా తరలిస్తున్నారని చెప్పారు.

705
00:50:58,037 --> 00:51:00,999
అతనికి ఉన్నంత తెలివి ఎవరికీ లేదు.

706
00:51:08,172 --> 00:51:09,299
గ్రేంజర్

707
00:51:11,217 --> 00:51:14,554
అతని పాదాలు నేలని తాకగానే, స్వేచ్ఛ లభిస్తుందని
అతను చాలా నమ్మకంగా ఉన్నట్టు అనిపించింది.

708
00:51:21,978 --> 00:51:23,104
థ్యాంక్యూ.

709
00:51:23,646 --> 00:51:25,982
- మందులు వేయడం నా బాధ్యత.
- అయ్యో, నేను థ్యాంక్స్ చెప్పింది అందుకు కాదు.

710
00:51:26,858 --> 00:51:29,194
మీరు, ఫ్రాంక్ నాకు ఎంత
ఉపకారం చేశారో మీకు కూడా తెలీదు.

711
00:51:30,028 --> 00:51:31,988
డాక్టర్ రైట్ మీ కాలికి చికిత్స అందించేటప్పుడు,

712
00:51:32,071 --> 00:51:34,824
మమ్మల్ని బండ బూతులు తిట్టుకుంటారులెండి.

713
00:51:37,785 --> 00:51:38,786
ఫ్రాంక్

714
00:51:39,954 --> 00:51:42,165
- ఫ్రాంక్?
- హేయ్, సారా. హమ్మయ్య. చెప్పేది జాగ్రత్తగా విను.

715
00:51:42,248 --> 00:51:43,625
జాగ్రత్తగా విను. మేమొక గార్డును చేర్చాం కదా.

716
00:51:43,708 --> 00:51:44,792
- హా?
- ఓకే, గ్రేంజర్.

717
00:51:45,501 --> 00:51:46,961
- అతని గురించి ఏం చెప్పాలి?
- గ్రేంజర్. ఓకే.

718
00:51:47,045 --> 00:51:49,714
అతను గార్డ్ కాదు, అతనొక ఖైదీ. ఖైదీ.

719
00:51:49,797 --> 00:51:53,092
ఆసుపత్రి నుండి బయటకు వచ్చి, దగ్గర్లో ఉన్న
పోలీసు ఆఫీసరుకు ఈ విషయం చెప్పు, సరేనా?

720
00:51:53,176 --> 00:51:54,385
నేనక్కడికే వస్తున్నా.

721
00:51:55,053 --> 00:51:56,095
సారా?

722
00:53:55,673 --> 00:53:57,592
- సారా ఆచూకీ దొరికిందా?
- లేదు.

723
00:53:58,218 --> 00:54:00,136
- కనీసం ఆధారం ఏదైనా దొరికిందా?
- లేదు.

724
00:54:00,220 --> 00:54:02,096
ఆగు, ఫ్రాంక్, లూక్ గురించి ఒకటి చెప్పాలి.

725
00:54:02,180 --> 00:54:03,306
లూక్ గురించి ఏం చెప్పాలి?

726
00:54:03,389 --> 00:54:05,683
అతను ఎక్కడికి వెళ్ళాడో తెలీట్లేదు. ఎక్కడికో వెళ్లిపోయాడు.

727
00:54:05,767 --> 00:54:07,602
స్కూల్ వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ చూశారు,

728
00:54:07,685 --> 00:54:09,896
లంచ్ అయ్యాక కీరా మూర్ తో స్కూల్ నుండి వెళ్ళిపోయాడు.

729
00:54:10,480 --> 00:54:12,690
అతని ఫోన్ ని ట్రేస్ చేయడానికి ట్రై చేయి, సరేనా?

730
00:54:12,774 --> 00:54:15,360
స్కూల్ లో ఒక మీడియా సమావేశం ఉంటే,
ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా.

731
00:54:15,443 --> 00:54:16,861
- సరే, ఫోన్ ని ట్రేస్ చేయడానికి ట్రై చేస్తా.
- సరే.

732
00:55:07,871 --> 00:55:08,913
మనం ముందే ఓ మాట అనుకున్నాం.

733
00:55:08,997 --> 00:55:10,540
రహస్యాలు ఉండకూడదని. కానీ మీరు అబద్ధమాడారు.

734
00:55:10,623 --> 00:55:11,624
ఫ్రాంక్, కాస్త శాంతించండి.

735
00:55:11,708 --> 00:55:13,626
అతని ఫోటో చూపించాలని మీకు అనిపించలేదా?

736
00:55:13,710 --> 00:55:16,045
నేను అతని ముఖాన్ని చూశాను, సిడ్నీ.
నేను గుర్తుపట్టి ఉండే వాడిని.

737
00:55:16,129 --> 00:55:17,130
మీరు కావాలనే ఫోటో చూపించలేదేమో.

738
00:55:17,213 --> 00:55:18,756
- అది పిచ్చి వాదన.
- అతనేం చేస్తున్నాడో మీకు తెలుసేమో.

739
00:55:18,840 --> 00:55:20,466
- అతని ప్లాన్ ఏంటో మీకు తెలుసేమో.
- మీరు కోపంలో ఉన్నారు.

740
00:55:20,550 --> 00:55:22,260
హేయ్, మీకేం తెలుసో చెప్పండి. ఏం తెలుసో చెప్పండి.

741
00:55:22,343 --> 00:55:25,638
ఇప్పుడు హావ్లాక్ ఏదో పన్నాగం
పన్నుతున్నాడని నాకు తెలుసు.

742
00:55:25,722 --> 00:55:30,268
మనకంటే అతను ముందంజలో ఉన్నాడు,
అలా ఉంటే, మనం అతడిని పట్టుకోలేం.

743
00:55:31,060 --> 00:55:32,353
మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు.

744
00:55:35,815 --> 00:55:38,651
సరే, ఒకటి చెప్పండి. నాకన్నా ముందే
మీరు అతడిని పట్టుకోవాలని ఎందుకంత ఆరాటపడుతున్నారు?

745
00:55:38,735 --> 00:55:39,736
ఎందుకు?

746
00:55:41,446 --> 00:55:42,614
అతడిని చంపేస్తారు.

747
00:55:44,824 --> 00:55:47,994
సీఐఏ వాళ్ళు అతడిని చంపడానికే
అతడిని స్వదేశానికి తీసుకురమ్మంటున్నారు,

748
00:55:48,077 --> 00:55:49,746
అతని లెక్క తేల్చేశాక,

749
00:55:49,829 --> 00:55:52,290
నన్ను కూడా లేపేస్తారు, ఎందుకంటే
నాకూ ఇందులో భాగముందని అనుకుంటున్నారు.

750
00:55:52,373 --> 00:55:55,919
కాబట్టి, ముందు నేను హావ్లాక్ ని
పట్టుకుని, ఎఫ్.బీ.ఐకి అప్పగిస్తే,

751
00:55:56,002 --> 00:55:58,963
నిజాన్ని నిరూపించడంలో వాళ్ళు నాకు సాయపడగలరు,
ఇక నా పాటికి నేను మామూలు జీవితం జీవించవచ్చు.

752
00:56:00,882 --> 00:56:02,133
మీ తొక్కలో జీవితం.

753
00:56:03,009 --> 00:56:04,761
మళ్ళీ మామూలు జీవితం జీవిస్తుందట.

754
00:56:05,470 --> 00:56:06,846
మనం తన ఆచూకీని తప్పక కనిపెడతాం, ఫ్రాంక్.

755
00:56:06,930 --> 00:56:09,515
లేదు, ఇక్కడ మనం అనే కాన్సెప్ట్ లేదు.

756
00:56:10,683 --> 00:56:12,060
మీకు ముందే చెప్పా,

757
00:56:12,143 --> 00:56:15,855
మీ రహస్యం వల్ల మనుషుల ప్రాణాలు ప్రమాదంలో పడితే,
నేను మీతో కలిసి పని చేయను అని.

758
00:56:15,939 --> 00:56:17,106
నా ప్రాణ మిత్రుడు చనిపోయాడు,

759
00:56:17,190 --> 00:56:19,234
నా కొడుకు ఏమైపోయాడో ఇంకా తెలీదు,
నా భార్యని వాడు కిడ్నాప్…

760
00:56:19,317 --> 00:56:21,444
- ఫ్రాంక్, అర్థం చేసుకోగలను. మీకు కోపంగా ఉంది.
- మిస్టర్ రెమ్నిక్!

761
00:56:23,071 --> 00:56:24,697
అలాస్కా నా అధికార పరిధిలో ఉంది.

762
00:56:25,365 --> 00:56:29,494
మీ ఫిరాయింపుదారుడు నా భార్యతో అడవిలో తిరుగుతూ, నేను
కాపాడతానని మాటిచ్చిన జనాల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నాడు.

763
00:56:29,577 --> 00:56:31,913
కాబట్టి, మీ వాడిని, మీరు దాచిపెడుతున్న
రహస్యాన్ని నేను తప్పక కనిపెడతాను,

764
00:56:31,996 --> 00:56:33,456
అందుకోసం,

765
00:56:33,540 --> 00:56:36,668
కూలిన విమాన శిథిలాలను ఏరుకొచ్చి,
మళ్ళీ దాన్ని కొత్త విమానంలా బిల్డ్ చేయడానికైనా నేను రెడీ.

766
00:56:36,751 --> 00:56:38,002
కానీ నేను మీతో ఇక పని చేయను.

767
00:56:38,086 --> 00:56:39,671
ఇక మీరు సెలవిస్తే,

768
00:56:39,754 --> 00:56:42,590
నేను పత్రికా సమావేశంలో మాట్లాడే పనిని,
ఇంకా గాలింపు చర్యలను కొనసాగించే పనిని చూసుకుంటా.

769
00:57:01,776 --> 00:57:02,777
- ఫ్రాంక్.
- హా.

770
00:57:02,861 --> 00:57:05,280
- సిగ్నల్స్ అన్నీ కట్ అయిపోయాయి.
- అంటే?

771
00:57:05,905 --> 00:57:07,699
ఒక బేస్ స్టేషన్ ధ్వంసమైందని భావిస్తున్నాం.

772
00:57:07,782 --> 00:57:10,535
అనేక ప్రొవైడర్లపై ప్రభావం పడింది.
ఇంటర్నెట్, సెల్ సిగ్నల్స్ ఏమీ రావట్లేదు.

773
00:57:11,578 --> 00:57:13,663
హేయ్, సిడ్. నువ్వు అక్కడ ఉన్నావా?

774
00:57:14,330 --> 00:57:15,790
హా, ఉండే ఉంటావులే.

775
00:57:15,874 --> 00:57:17,083
ఎవరో చెప్పుకో?

776
00:57:18,418 --> 00:57:22,797
ఏదేమైనా, నేను క్షేమంగా ఉన్నాను,
రంగంలోకి దిగేసి, కార్యాచరణను మొదలుపెట్టేశాను.

777
00:57:23,423 --> 00:57:25,300
కానీ అదంతా నీకు తెలుసు కదా, సిడ్?

778
00:57:26,050 --> 00:57:28,094
నేను కాల్ చేసింది నీతో మాట్లాడటానికి కాదని నీకు తెలుసు.

779
00:57:28,678 --> 00:57:30,346
నేను నీతో మాట్లాడటానికి కాల్ చేశా, ఫ్రాంక్.

780
00:57:31,723 --> 00:57:33,391
ఈ జగడంలోకి నిన్ను లాగినందుకు క్షమించు.

781
00:57:33,474 --> 00:57:37,145
విషయం ఏంటంటే, నాకు, సిడ్నీకి మధ్య ఉండే బంధం…

782
00:57:37,228 --> 00:57:40,231
ఎలా చెప్పను? చాలా అసహ్యంగా ఉంటుంది.

783
00:57:41,274 --> 00:57:43,026
కానీ అందులో చాలా మందికి ప్రమేయం ఉందిలే.

784
00:57:44,068 --> 00:57:47,155
విషయం ఏంటంటే, నాకు సీఐఏలో ఎవరి మీదా నమ్మకం లేదు.

785
00:57:47,780 --> 00:57:49,949
కానీ నువ్వు గంజాయి వనంలో తులసీ మొక్కవి, ఫ్రాంక్.

786
00:57:50,909 --> 00:57:51,910
నాకు నీపై నమ్మకం ఉంది.

787
00:57:53,328 --> 00:57:55,747
ఎందుకు నమ్మతున్నానంటే
నేను నీ భార్యతో కొంత సమయం పాటు గడిపాను.

788
00:57:57,165 --> 00:57:58,166
ఆమె నాకు నచ్చింది.

789
00:57:59,125 --> 00:58:00,793
అందుకే ఇంకా ఆమె ప్రాణాలతో ఉంది, ఫ్రాంక్.

790
00:58:01,419 --> 00:58:04,964
తను ప్రాణాలతో క్షేమంగా ఉంది కాబట్టి,
నువ్వు నాకు ఋణం ఉన్నట్టే లెక్క.

791
00:58:06,090 --> 00:58:08,301
కాబట్టి, నేను నా కోరికలేంటో చెప్తాను.

792
00:58:09,344 --> 00:58:12,764
ఇక నుండి నువ్వు నా ప్రతినిధివి, ఫ్రాంక్.

793
00:58:13,348 --> 00:58:15,516
మన మధ్య పరిచయం,
మనం ఊహించలేనంత స్థాయికి వెళ్తుంది.

794
00:58:16,184 --> 00:58:17,685
మనిద్దరం కలిసి చేయబోయే పనులు,

795
00:58:18,853 --> 00:58:21,481
ఈ ప్రపంచాన్ని మార్చేయగలవు.

796
00:59:53,239 --> 00:59:55,241
సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్

