1
00:00:06,424 --> 00:00:08,092
బోష్‌లో గత సీజన్లో జరిగిన కథ...

2
00:00:08,426 --> 00:00:10,344
ఏ విమానాశ్రయానికైనా
ఈ సమాచారం అందుతోందా?

3
00:00:10,428 --> 00:00:13,180
నేను డిటెక్టివ్ హ్యారీ బోష్, ఎల్ఏపీడీ.

4
00:00:13,264 --> 00:00:14,515
దూకాల్సిన టైమయింది, పోలీస్.

5
00:00:14,640 --> 00:00:19,520
గాలిలో జరిగిన ఘటనలో, ఒకరు చనిపోయారు,
మరొకరు మిస్ అయ్యారు.

6
00:00:19,603 --> 00:00:22,565
నేను వైట్‌మేన్ విమానాశ్రయానికి
వస్తున్నానని చెప్పండి. అవుట్.

7
00:00:23,315 --> 00:00:24,567
ఎవరిని అయినా చంపారా?

8
00:00:24,692 --> 00:00:27,111
అవును. వాళ్లు నన్ను చంపబోయారు.

9
00:00:27,194 --> 00:00:28,154
ఇప్పటికి ఎంతమందిని చంపారు?

10
00:00:28,237 --> 00:00:30,114
ఎందుకు అలాంటి ప్రశ్న అడుగుతున్నావు?

11
00:00:31,115 --> 00:00:32,491
అతని పేరు గ్యారీ వైజ్.

12
00:00:33,284 --> 00:00:34,744
అతను నా ఇన్ఫార్మర్.

13
00:00:35,703 --> 00:00:37,830
ఇందులో నీ తప్పు లేదు, జే.

14
00:00:38,330 --> 00:00:39,665
కానీ అలాగే అనిపిస్తోంది.

15
00:00:39,707 --> 00:00:40,624
ఏం జరిగింది?

16
00:00:40,708 --> 00:00:43,335
అతను మార్కోస్, ఏరియస్‌లతో మాట్లాడడం
ఎవరో చూసి ఉండవచ్చు.

17
00:00:43,836 --> 00:00:46,172
విషయం ఏంటంటే, వాళ్లను నేనే కలిపాను.

18
00:00:46,255 --> 00:00:48,215
స్కైలర్ హత్య కేసులో పని చేశావా?

19
00:00:48,299 --> 00:00:50,217
మా ఆఫీసులో ఎవరో
దానిని దర్యాప్తు చేస్తున్నారట.

20
00:00:50,301 --> 00:00:51,260
చాండ్లర్ స్క్రెయిబర్ మల్లిన్స్
&amp; అసోసియేట్స్, ఎల్ఎల్‌పీ

21
00:00:51,343 --> 00:00:52,261
దానికే ఆధారం లేదు. అంతా చెత్త.

22
00:00:52,344 --> 00:00:54,764
నేను ఎప్పుడూ సాక్ష్యాలు సృష్టించలేదు.
ఎప్పుడూ కూడా.

23
00:00:54,847 --> 00:00:55,931
నిన్ను నమ్ముతాను.

24
00:00:56,015 --> 00:00:57,016
కుడివైపు క్లియర్‌గా ఉంది.

25
00:00:57,308 --> 00:00:58,184
ఆగు!

26
00:01:00,644 --> 00:01:01,687
క్రేట్ ఇంకా బ్యారెల్.

27
00:01:01,771 --> 00:01:04,940
పనికిరాని వాళ్లని తప్పించేందుకు
ఇది సరైన అవకాశం.

28
00:01:05,024 --> 00:01:06,650
రిటైర్ అవమని మనం వాళ్ళని ఒత్తిడి చేయలేం.

29
00:01:06,734 --> 00:01:07,943
అలా కాదు, వారిని
ఇక్కడి నుంచి మార్చవచ్చు.

30
00:01:08,360 --> 00:01:09,403
ఎక్కడకు?

31
00:01:09,487 --> 00:01:11,906
నియామకాలకా? ఆ చెత్త విభాగానికా?

32
00:01:11,989 --> 00:01:14,992
కేసులు దాటేయడమా?
ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడమా?

33
00:01:15,075 --> 00:01:16,786
లేదు. అవన్నీ చెత్త విషయాలు!

34
00:01:17,495 --> 00:01:19,079
నన్ను నేను కాల్చేసుకుంటాను!

35
00:01:19,163 --> 00:01:21,165
చార్లీ హోవన్. డీఈఏ.

36
00:01:21,248 --> 00:01:23,375
-అండర్‌కవర్‌గా ఉన్నావా?
-పద్నాలుగు నెలలుగా.

37
00:01:23,959 --> 00:01:26,086
ఆ నీలం రంగు ఏంటి?

38
00:01:26,170 --> 00:01:28,047
మా ముందుస్తు పోలింగ్‌లో
మీరు వీటిలో ఆధిక్యంలో ఉన్నారు.

39
00:01:28,130 --> 00:01:31,717
మేయర్ ఎన్నికలలో పోలీస్ చీఫ్‌లకు
అంతగా విజయాలు దక్కలేదని మీకు తెలుసు.

40
00:01:31,801 --> 00:01:33,093
ఎవరో గణాంకాలు మార్చుతున్నారు.

41
00:01:33,677 --> 00:01:34,637
నేను దీన్ని చూస్తాను.

42
00:01:34,720 --> 00:01:36,180
ఇది నిజంగా జరుగుతుందని
మీరు అనుకుంటున్నారా?

43
00:01:36,263 --> 00:01:37,223
ఏమిటి?

44
00:01:38,349 --> 00:01:39,683
లోపలి విషయాలు బయట పెట్టడం.

45
00:01:42,645 --> 00:01:45,564
డీఏ ఆఫీసులో ఎవరి నుంచో
పొద్దున నాకు టెక్ట్స్ మెసేజ్ వచ్చింది.

46
00:01:46,106 --> 00:01:47,525
నీకు లీక్ చేసింది ఎవరు?

47
00:01:47,608 --> 00:01:49,235
ఆ సంగతి చెప్పలేనని
నీకు తెలుసుగా.

48
00:01:49,318 --> 00:01:51,529
కోర్టు ముందుకు తెచ్చిన విషయం
ఉపసంహరించబడింది.

49
00:01:51,612 --> 00:01:55,241
డిటెక్టివ్ బోష్, మీకు మంచి జరగాలని
కోరుకుంటున్నాను, సర్.

50
00:01:55,324 --> 00:01:57,743
మీరు నా కోర్టు రూమ్‌లోకి
ఎప్పుడైనా రావచ్చు.

51
00:01:57,827 --> 00:01:58,828
ధన్యవాదాలు, యువర్ ఆనర్.

52
00:01:59,286 --> 00:02:02,456
మ్యాడీ నా దగ్గర ఇంటర్న్‌గా చేయవచ్చు.
ప్రతిపక్షం పని తీరు చూడవచ్చు.

53
00:02:02,540 --> 00:02:03,874
నువ్వేం చేశావో నాకు తెలుసు.

54
00:02:04,917 --> 00:02:06,752
ఏం జరుగుతోంది?
నీ లవర్‌తో సమస్యా?

55
00:02:06,836 --> 00:02:08,587
-ఎందుకంటే నీలో కొంత ఒత్తిడి గమనించాను...
-అతనితో కాదు.

56
00:02:09,296 --> 00:02:10,130
మీతోనే సమస్య.

57
00:02:10,214 --> 00:02:11,131
నాతోనా?

58
00:02:12,132 --> 00:02:13,425
నేనేం చేశాను?

59
00:02:13,509 --> 00:02:14,844
ఏం చేయలేదు.

60
00:02:15,094 --> 00:02:16,387
మీరు మీలా ఉన్నారంతే.

61
00:02:16,470 --> 00:02:18,931
గ్యారీ వైజ్ అపార్ట్‌మెంట్ తనిఖీ
చేస్తుండగా ఆసక్తికరమైన విషయం బయటపడింది.

62
00:02:19,014 --> 00:02:20,266
మాకు స్మిత్ &amp; వెస్సన్ 9 మిల్
తుపాకి దొరికింది.

63
00:02:20,349 --> 00:02:21,976
డ్రగ్స్ కేసులో పోలీసులు
స్వాధీనం చేసుకున్నది.

64
00:02:22,017 --> 00:02:23,435
మళ్లీ అది రోడ్ల మీదకు ఎలా వచ్చింది?

65
00:02:23,519 --> 00:02:24,687
మంచి ప్రశ్న.

66
00:02:24,770 --> 00:02:26,272
అది పోలీసు శాఖ లోపలి
పని అయ్యి ఉండాలి.

67
00:02:26,689 --> 00:02:28,899
గ్యారీకి వీళ్ళతో ఏంటి సంబంధం?

68
00:02:29,483 --> 00:02:30,568
వాళ్లు నా కొడుకును ఎందుకు చంపారు?

69
00:02:30,901 --> 00:02:31,986
నీకు సమాచారం ఇచ్చిన వారి పేరు?

70
00:02:32,319 --> 00:02:35,072
జాక్ ఆవ్రిల్. సౌత్ బే‌లో 7-ఎలెవెన్స్
చైన్‌ను నడుపుతాడు.

71
00:02:35,155 --> 00:02:36,198
తెలిసినట్లే ఉందా, లేక...

72
00:02:39,118 --> 00:02:40,202
నువ్వు ఎవరని అనుకుంటున్నానో,
ఆ వ్యక్తివేనా?

73
00:02:40,286 --> 00:02:41,453
ఆ వ్యక్తి ఎవరు?

74
00:02:41,912 --> 00:02:44,623
జాక్ ఆవ్రిల్. పెషన్ విల్‌కి చెందిన కసాయి.

75
00:02:45,541 --> 00:02:47,459
మా అమ్మ సోదరుడిని చంపినవాడు.

76
00:02:48,085 --> 00:02:49,420
అతని పేరేంటి?

77
00:02:49,795 --> 00:02:51,088
ఆంట్వాన్ హెక్టర్.

78
00:02:53,007 --> 00:02:54,174
నేను కాదు.

79
00:02:55,885 --> 00:02:58,095
మా నాన్న.

80
00:02:59,221 --> 00:03:01,056
దొంగిలించిన ఆయుధాలు లోపలి వాళ్ల పనే.

81
00:03:01,140 --> 00:03:02,224
ఎల్ఏపీడీ డ్రగ్ బస్ట్ నుంచి
చోరీ అయిన తుపాకుల స్వాధీనం

82
00:03:02,308 --> 00:03:04,059
అది చేసిన వాళ్ళకు,
బయటపడతారని భయం ఉంది.

83
00:03:04,143 --> 00:03:05,185
అవినీతిపరులైన పోలీసులా?

84
00:03:05,686 --> 00:03:06,687
అలాగే అనిపిస్తోంది.

85
00:03:08,063 --> 00:03:09,064
ఎవరు?

86
00:03:09,148 --> 00:03:12,443
ఈ గొప్ప నగర వీధుల్లో పాట్రోల్ చేసి
చాలా అనుభవం గడించాను.

87
00:03:12,526 --> 00:03:14,904
నేను పోలీసును,
ఎప్పటికీ పోలీసుగానే ఉంటాను.

88
00:03:15,487 --> 00:03:17,323
కానీ ఇవాళ మీ ముందు నిలబడి

89
00:03:17,698 --> 00:03:21,035
లాస్ ఏంజెల్స్‌కు మేయర్‌గా
పోటీ చేయబోతున్నాను అని ప్రకటిస్తున్నాను.

90
00:03:21,118 --> 00:03:22,286
నన్ను రక్షించగలనని అనుకుంటున్నావా?

91
00:03:22,369 --> 00:03:23,662
నువ్వు బాగున్నావా?

92
00:03:24,371 --> 00:03:25,998
నాతో మాట్లాడకు. వెళ్ళిపో.

93
00:03:26,081 --> 00:03:28,000
అలా ప్రయత్నించిన వ్యక్తివి
నువ్వు మాత్రమే అనుకుంటున్నావా?

94
00:03:28,083 --> 00:03:30,502
ఎక్కువ డోస్ తీసుకుంది.
911కి కాల్ చెయ్!

95
00:03:30,586 --> 00:03:32,838
ఆమె చేతిపై రెస్ట్ ఇన్ పీస్ టాటూ చూసాను.
డైసీ ఎవరు?

96
00:03:32,922 --> 00:03:34,465
ఆమె కూతురు.

97
00:03:34,757 --> 00:03:36,634
ఆమెను హత్య చేసారు. దాదాపు 10 ఏళ్ల క్రితం.

98
00:03:36,717 --> 00:03:37,843
క్లేటన్, డైసీ

99
00:03:38,260 --> 00:03:39,595
అప్పుడు ఆమె వయసు 14 ఏళ్ళు.

100
00:03:39,678 --> 00:03:42,431
నేను డ్రగ్స్‌కి బానిస అయ్యాను.
తనకు బోర్ కొట్టేసి పారిపోయింది.

101
00:03:42,514 --> 00:03:43,515
తర్వాత ఒక రోజు...

102
00:03:44,058 --> 00:03:46,602
తను వెళ్లి, మళ్లీ తిరిగి రాలేదు.

103
00:03:48,520 --> 00:03:49,980
పోలీసులకు ఆమె శవం దొరికింది.

104
00:03:51,690 --> 00:03:53,067
కానీ ఆమె హంతకుడు దొరకలేదు.

105
00:04:00,240 --> 00:04:03,786
పదకొండు నెలల తర్వాత

106
00:04:06,497 --> 00:04:10,751
సెయింట్ అగాథస్ ఆసుపత్రి

107
00:04:24,056 --> 00:04:25,975
హెచ్చరిక - రేడియోధార్మిక పదార్థాల ప్రాంతం
అనధికార సిబ్బందికి ప్రవేశం లేదు

108
00:05:17,693 --> 00:05:19,403
అలీషా
దొరికాయా?

109
00:05:23,115 --> 00:05:24,408
దొరికాయి - దారిలో ఉన్నాను

110
00:05:24,491 --> 00:05:25,701
త్వరగా వస్తే మంచిది

111
00:06:10,579 --> 00:06:11,622
అలీషా?

112
00:06:16,001 --> 00:06:17,169
డిక్కీ తెరువు.

113
00:06:26,053 --> 00:06:27,304
అది ఎక్కడుంది?

114
00:06:27,387 --> 00:06:30,349
దగ్గర్లోనే ఉంది.
ఆమెను మీరు వదిలి పెట్టగానే ఇస్తాను.

115
00:06:30,891 --> 00:06:31,767
అది మరచిపో.

116
00:06:33,477 --> 00:06:35,020
ఆమె సురక్షితంగా ఉందని నాకు తెలియాలి.

117
00:06:35,979 --> 00:06:37,815
వద్దు. వద్దు. ప్లీజ్.

118
00:06:39,066 --> 00:06:40,651
మీకు నేను కావాలి.

119
00:07:31,285 --> 00:07:34,413
బోష్

120
00:08:00,731 --> 00:08:02,441
హే. నువ్వు ఇక్కడికి తొందరగా వచ్చావు.

121
00:08:03,442 --> 00:08:05,152
ఈ రోజు త్వరగా పని ప్రారంభించాలనుకున్నాను.

122
00:08:05,944 --> 00:08:06,987
డైసీ క్లేటనా?

123
00:08:08,071 --> 00:08:08,906
అవును.

124
00:08:08,989 --> 00:08:10,866
ఆ దిక్కుమాలిన కార్డులు ఎన్నిసార్లు
పరిశీలించావో తెలుసా?

125
00:08:11,450 --> 00:08:12,743
మరోసారి చేస్తే వచ్చే నష్టం లేదు.

126
00:08:13,368 --> 00:08:14,244
ఏమైనా తెలిసిందా?

127
00:08:15,537 --> 00:08:16,747
ఇంత వరకు లేదు.

128
00:08:17,372 --> 00:08:20,375
నువ్వు మరుగున పడిన గతం మర్చిపోతానంటే,

129
00:08:20,459 --> 00:08:21,919
నీకొక కొత్త కేసు ఇస్తాను.

130
00:08:23,420 --> 00:08:24,671
తరువాతి కేసుకి వేగా, పియర్స్‌లు
లైన్‌లో ఉన్నారనుకున్నాను.

131
00:08:24,755 --> 00:08:26,256
అవును, ఇంకా వాళ్లే
దానిపై పని చేస్తున్నారు,

132
00:08:26,340 --> 00:08:28,967
కానీ వాళ్ళు శరీర భాగాల కేసులో
హాజరు కావాలని సమన్ పంపారు.

133
00:08:29,051 --> 00:08:31,178
బిలెట్స్ నిన్ను, ఎడ్గర్‌ను
నాయకత్వం వహించుమన్నాడు.

134
00:08:31,261 --> 00:08:32,596
-సరే.
-మంచిది.

135
00:08:41,396 --> 00:08:43,315
ఈ దద్దమ్మలు ఎక్కడున్నారు?

136
00:08:44,524 --> 00:08:45,859
నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలా?

137
00:08:50,739 --> 00:08:51,823
కాల్ వస్తుంది
బోష్

138
00:08:53,325 --> 00:08:54,409
హ్యారీ.

139
00:08:55,160 --> 00:08:57,871
-మనకొక కేసు వచ్చింది.
-తరువాతి కేసు పియర్స్, వేగాలకి అనుకున్నా.

140
00:08:58,705 --> 00:09:00,290
లేదు, తరువాత వాళ్ళు
కోర్టుకు వెళ్ళాల్సి రావచ్చు.

141
00:09:01,333 --> 00:09:03,835
-నాకు అడ్రస్ మెసేజ్ చేయి.
-నువ్వు అక్కడికి వచ్చాక కలుస్తాను.

142
00:09:06,463 --> 00:09:08,548
-నువ్వు వెళ్లాలా?
-తక్షణమే.

143
00:09:13,595 --> 00:09:15,764
హాలీవుడ్

144
00:09:31,029 --> 00:09:32,155
బోష్.

145
00:09:39,955 --> 00:09:41,373
ఏదైనా గుర్తొస్తుందా?

146
00:09:42,666 --> 00:09:43,875
ఓవర్‌లుక్.

147
00:09:44,835 --> 00:09:46,044
ఆమె పేరు గుర్తొచ్చిందా?

148
00:09:46,295 --> 00:09:47,421
ఆ నటిదా?

149
00:09:47,879 --> 00:09:48,839
కాదు.

150
00:09:50,590 --> 00:09:51,633
లిండా ఫాస్టర్.

151
00:09:56,555 --> 00:09:58,348
ఇప్పటివరకు ఏం తెలుసుకున్నావో చెప్పు.

152
00:09:58,432 --> 00:10:00,267
జాగర్ రెండు గంటల క్రితం రిపోర్ట్ చేశాడు.

153
00:10:00,350 --> 00:10:01,351
గుర్తించారా?

154
00:10:01,768 --> 00:10:04,187
డాక్టర్ స్టాన్లీ కెంట్, 42.

155
00:10:04,271 --> 00:10:06,315
భార్య అలీషా కెంట్, అదే చిరునామా.

156
00:10:07,024 --> 00:10:08,317
అతని ఫోన్ కూడా వెతికి తెచ్చాం.

157
00:10:08,400 --> 00:10:10,819
అతని భార్యకు
పాస్‌వర్డ్ తెలిస్తే తప్ప ఉపయోగం లేదు.

158
00:10:10,902 --> 00:10:12,237
నా భార్యకు నాది తెలుసు.

159
00:10:12,654 --> 00:10:13,905
నీ భార్యకు నీ పాస్‌వర్డు తెలుసా?

160
00:10:13,989 --> 00:10:16,658
తప్పకుండా. నీ భర్తకు నీది తెలుసా?

161
00:10:16,950 --> 00:10:17,868
నిజంగా అంటున్నావా?

162
00:10:17,951 --> 00:10:18,952
ఏదేమైనా అన్‌లాక్ చేయండి.

163
00:10:19,578 --> 00:10:20,662
ఆ పోర్ష కారు సంగతేంటి?

164
00:10:20,746 --> 00:10:24,791
ఒక వ్యాపార సంస్థ పేరుపై ఉంది.
కే&amp;కే మెడికల్ ఫిజిసిస్ట్స్.

165
00:10:25,459 --> 00:10:26,877
మెడికల్ ఫిజిసిస్ట్ అంటే ఏంటి?

166
00:10:42,392 --> 00:10:43,769
ఇవి ఏవో బరువైన వాటి వల్ల ఏర్పడ్డాయి.

167
00:10:52,194 --> 00:10:53,236
హేయ్, పెద్దోడా.

168
00:10:53,904 --> 00:10:54,863
హేయ్, హ్యారీ.

169
00:10:55,322 --> 00:10:57,157
ఇంకా చనిపోయిన సమయం
నిర్ణయించే ప్రయత్నంలో ఉన్నాను.

170
00:10:59,785 --> 00:11:00,994
దాదాపుగా ఎప్పుడు?

171
00:11:04,373 --> 00:11:06,375
అర్ధరాత్రికి కాస్త అటూ ఇటూ.

172
00:11:08,335 --> 00:11:09,628
ప్లాస్టిక్ ఉంగరాలు దేనికి?

173
00:11:10,295 --> 00:11:11,296
తెలియదు.

174
00:11:13,507 --> 00:11:16,051
క్రాకర్ జాక్ డబ్బాలో దొరికే బొమ్మలవంటివి.

175
00:11:17,719 --> 00:11:19,930
చనిపోయిన ఖచ్చితమైన
సమయం కోసం మళ్ళీ కలుస్తాను.

176
00:11:21,264 --> 00:11:23,517
తల వెనుక రెండుసార్లు కాల్చారు.

177
00:11:23,600 --> 00:11:27,854
మొహానికి తగిలేలా ముందుకు పడ్డాడు.
చెంప, నుదురుపై చర్మం గీసుకుపోయింది.

178
00:11:27,938 --> 00:11:29,272
బుల్లెట్లు బయటకు వచ్చిన గాయాలు లేవు.

179
00:11:30,023 --> 00:11:31,066
చిన్న కాలిబర్.

180
00:11:31,942 --> 00:11:34,111
మరణశిక్ష అమలు తరహాలో
మోకాళ్లపై కూర్చోపెట్టి కాల్చేశారు.

181
00:11:35,695 --> 00:11:38,073
అతని భార్య యొక్క అత్యవసర
క్షేమ సమాచారం తెలుసుకున్నారా?

182
00:11:38,156 --> 00:11:38,990
ఇంకా లేదు.

183
00:11:42,077 --> 00:11:43,578
అదేంటి, పాట్స్? ఐడీ ట్యాగా?

184
00:11:47,082 --> 00:11:48,542
సెయింట్ అగాథస్.

185
00:11:48,625 --> 00:11:49,751
దాన్ని తిప్పు.

186
00:11:51,378 --> 00:11:52,379
స్వైప్ కార్డ్.

187
00:11:53,380 --> 00:11:54,631
సరే. ధన్యవాదాలు, పాట్స్.

188
00:11:58,135 --> 00:11:59,511
సెయింట్ అగాథస్‌కు వెళ్ళండి.

189
00:11:59,594 --> 00:12:02,931
ఒకవేళ కెంట్‌కు అక్కడ ఆఫీసుంటే, దానికి తాళం
వేసి, అన్నింటికీ సెర్చ్ వారెంట్ తీసుకోండి.

190
00:12:03,014 --> 00:12:05,892
ఫోన్, ఈమెయిల్, స్వైప్ కార్డ్,
ఇంకా ప్రతి ఒక్కటి.

191
00:12:05,976 --> 00:12:07,978
-భార్య సంగతి ఏంటి?
-ఆ సంగతి నేను చూసుకుంటాను.

192
00:12:10,689 --> 00:12:13,066
హ్యాండ్సప్. వెనక్కి తిరగండి.

193
00:12:13,150 --> 00:12:14,276
మోకాళ్ళ మీద.

194
00:12:16,611 --> 00:12:17,612
మంచిది.

195
00:12:17,696 --> 00:12:20,407
అదిగో. కదలొద్దు.

196
00:12:20,490 --> 00:12:22,659
చేతుల కింద పెట్టు. ఇదిగో.

197
00:12:26,329 --> 00:12:27,664
వెనక్కి తిరుగు.

198
00:12:27,747 --> 00:12:29,666
ఇవి పట్టుకో.

199
00:12:30,292 --> 00:12:32,169
పైకి లేచి నిల్చో.

200
00:12:33,879 --> 00:12:36,339
ఇక్కడ ఏముంది?

201
00:12:37,549 --> 00:12:40,051
చెత్త నా కొడకా.

202
00:12:40,844 --> 00:12:42,929
ఒకవేళ వాళ్లు డబ్బు, తుపాకులను
నమోదు చేయకపోతే దొరికిపోయినట్లే.

203
00:12:43,013 --> 00:12:44,973
సందేహం లేదు, వాళ్ళు నమోదు చేయరు.

204
00:12:46,349 --> 00:12:47,893
మార్కోస్ మన వైపు ఎందుకు చూస్తున్నాడు?

205
00:12:47,976 --> 00:12:49,728
వాడో అనుమానపు వెధవ.

206
00:12:50,562 --> 00:12:51,730
మనం ఉన్నామని వాడికి తెలిసిపోయింది.

207
00:12:52,689 --> 00:12:55,400
వాడి ఛాతీ వెనుక రోమాలు
నిక్కబొడుచుకుంటున్నాయి.

208
00:12:55,775 --> 00:12:56,985
నీకు అనుమానం.

209
00:13:04,159 --> 00:13:07,162
బోష్ - బాధితుడి భార్య కోసం అత్యవసర
సంక్షేమ తనిఖీ 2647 లేక్ హాలీవుడ్ డ్రైవ్

210
00:13:07,245 --> 00:13:08,455
దారిలో ఉన్నాను

211
00:13:13,919 --> 00:13:14,836
ఎవరూ లేరు కదా?

212
00:13:15,504 --> 00:13:16,338
ఇక వెళ్ళు.

213
00:13:26,014 --> 00:13:27,599
-రాన్.
-హే.

214
00:13:27,682 --> 00:13:30,060
-మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది.
-మీకు వీళ్లు తెలుసనుకుంటాను.

215
00:13:30,685 --> 00:13:32,187
నిజానికి తెలుసు.

216
00:13:32,270 --> 00:13:34,439
ఎల్‌ఏపీడీలో ఉత్తమమైన వాళ్లు.
దూరమవడం బాధాకరం.

217
00:13:34,731 --> 00:13:37,275
అది చెత్త. మర్యాదపూర్వకంగా చెప్తున్నాను.

218
00:13:38,360 --> 00:13:39,945
-డిటెక్టివ్ రాజర్స్.
-చీఫ్.

219
00:13:40,028 --> 00:13:42,572
-బిజీగా ఉన్నావా?
-నా స్వానుభవ చరిత్ర రాస్తున్నాను.

220
00:13:44,282 --> 00:13:45,867
-డిటెక్టివ్ జాక్సన్.
-చీఫ్.

221
00:13:45,951 --> 00:13:47,160
నాకే ఓటేస్తావని నమ్మవచ్చా?

222
00:13:47,244 --> 00:13:48,787
అంటే, ఇంకా నేను ఎల్‌ఏలో నివసిస్తుంటే.

223
00:13:49,538 --> 00:13:50,664
నేను మర్చిపోయాను.

224
00:13:50,956 --> 00:13:52,999
అయితే, వాల్నట్ క్రీక్‌లో జీవితం ఎలా ఉంది?

225
00:13:53,333 --> 00:13:55,544
అంత గొప్పగా ఏమీ లేదు.పెటలూమ.

226
00:13:56,044 --> 00:13:57,420
లాస్ ఏంజెల్స్‌లో
మీకు జీతం ఇంకా బాగానే ఉంది.

227
00:13:57,504 --> 00:14:00,882
సామాన్యుల దగ్గర నిధుల సేకరణ.
చందా అంతా వంద డాలర్లలోపే.

228
00:14:00,966 --> 00:14:03,134
నేను వెయ్యి డాలర్లు ఇద్దామనుకున్నాను.

229
00:14:04,678 --> 00:14:07,264
ఇర్వింగ్‌ఫర్‌మేయర్.కామ్.
అంతా ఒకే పదం.

230
00:14:08,431 --> 00:14:10,225
మంచిది. మీరు కేక్ తింటూ ఉండండి.

231
00:14:12,852 --> 00:14:14,563
మీరొకరిని తప్పక కలవాలి.

232
00:14:15,397 --> 00:14:16,690
రే థాకర్.

233
00:14:17,524 --> 00:14:20,527
-చీఫ్ ఇర్వింగ్. జెన్.
-మిస్టర్ థాకర్.

234
00:14:20,610 --> 00:14:22,904
చాలా సంతోషం. దయచేసి కూర్చోండి.

235
00:14:27,701 --> 00:14:29,369
మనం ఎప్పుడూ కలవలేదంటే నమ్మలేక పోతున్నాను.

236
00:14:29,452 --> 00:14:31,580
మేయర్ రామోస్ ప్రచారాలకు రే పని చేశాడు.

237
00:14:31,663 --> 00:14:33,373
-రెండింటికి.
-రికార్డులు సృష్టించాడు.

238
00:14:34,583 --> 00:14:36,209
మీకు కూడా అలాగే చేయాలనుకుంటున్నాను.

239
00:14:38,545 --> 00:14:40,547
అది అంతగా అవసరం అనుకోవడం లేదు.

240
00:14:40,630 --> 00:14:42,799
మాకు చిన్న దాతల విధానం
బాగానే పని చేస్తుంది.

241
00:14:42,882 --> 00:14:45,385
చీఫ్, మీరు ఎక్కువగా యోగ్యత వల్ల ర్యాంకులు,

242
00:14:45,468 --> 00:14:48,638
ప్రమోషన్‌లు వచ్చే వృత్తి జీవితం గడిపారు.

243
00:14:49,389 --> 00:14:51,141
ఎక్కువగా ప్రతిభ వల్ల. కొంచెం అటు ఇటు.

244
00:14:51,683 --> 00:14:53,226
ఇది మీకు కొత్త ప్రపంచం.

245
00:14:53,768 --> 00:14:55,937
సర్వోత్తముడే ఎప్పుడూ గెలవాలని లేదు.

246
00:14:57,355 --> 00:14:59,691
మొత్తానికి ఇది డబ్బుతో ముడిపడిన విషయం.

247
00:15:00,609 --> 00:15:03,361
మీరు మేయర్ కావడానికి
తగిన నిధులు రే సేకరించగలడు.

248
00:15:05,905 --> 00:15:07,949
నాపై కాస్త
మెరుపు దాడి జరిగినట్లు అనిపిస్తుంది.

249
00:15:09,284 --> 00:15:11,578
జాక్ కిల్లొరాన్ పోటీకి దిగబోతున్నాడు.

250
00:15:11,911 --> 00:15:14,205
కిల్లొరాన్? కారు డీలరా?

251
00:15:14,539 --> 00:15:18,835
తెల్లవాడు, సొంత ఖర్చు పెట్టుకుంటున్నాడు.
అతను వ్యాలీలో మిమ్మల్ని దెబ్బ తీస్తాడు.

252
00:15:19,586 --> 00:15:23,340
తూర్పు లాస్ ఏంజెల్స్ సుసన్నా లోపెజ్
కంచుకోట. మీరిద్దరూ దక్షిణ భాగం పంచుకోవాలి.

253
00:15:24,049 --> 00:15:27,719
లిబరల్ వెస్ట్‌సైడ్‌లో
ఆధిపత్యం ఉన్న వాళ్లే విజేతలవుతారు.

254
00:15:28,428 --> 00:15:30,263
వాళ్ళిద్దరికీ బాగా డబ్బుంది.

255
00:15:32,641 --> 00:15:34,017
దాంతోపాటే తెల్లతోలు ఉంది.

256
00:15:36,061 --> 00:15:37,437
అది వాస్తవం.

257
00:16:09,552 --> 00:16:11,096
ఎల్‌ఏపీడీ, ఇంట్లో ఎవరైనా ఉన్నారా?

258
00:16:14,349 --> 00:16:15,350
మిసెస్ కెంట్?

259
00:16:20,647 --> 00:16:22,357
తలుపు. తలుపు తెరువు.

260
00:16:26,986 --> 00:16:28,655
ఎల్‌ఏపీడీ, ఇంట్లో ఎవరైనా ఉన్నారా?

261
00:16:35,578 --> 00:16:36,705
ఎవరూ లేరు.

262
00:16:42,794 --> 00:16:43,795
ఎవరూ లేరు.

263
00:16:43,878 --> 00:16:44,879
ఎవరూ లేరు.

264
00:16:48,174 --> 00:16:49,008
ఎవరూ లేరు.

265
00:16:50,969 --> 00:16:52,053
ఎవరూ లేరు.

266
00:16:54,097 --> 00:16:57,517
మిసెస్ కెంట్, నేను హ్యారీ బోష్, ఎల్‌ఏపీడీ.
మీకే ప్రమాదం లేదు.

267
00:16:59,185 --> 00:17:00,353
మిమ్మల్ని నేను చూసుకుంటాను.

268
00:17:02,272 --> 00:17:03,481
నేను చూసుకుంటాను.

269
00:17:07,944 --> 00:17:09,028
కదలకుండా ఉండండి.

270
00:17:12,782 --> 00:17:15,034
-నా భర్త ఎక్కడున్నాడు?
-ఫర్వాలేదు, నేను చూసుకుంటాను.

271
00:17:15,452 --> 00:17:17,036
అతను ఎక్కడున్నాడు?

272
00:17:19,330 --> 00:17:21,916
మీరు బాగానే ఉన్నారా? మెల్లగా. ఉండండి.

273
00:17:22,500 --> 00:17:24,461
-కూర్చోండి.
-కాస్త కళ్ళు తిరుగుతున్నాయి. పర్వాలేదు.

274
00:17:24,544 --> 00:17:26,588
సరే. మీకు ఏం కావాలి?

275
00:17:26,671 --> 00:17:27,547
నాకు...

276
00:17:28,965 --> 00:17:31,593
నా బట్టలు బీరువాలో ఉన్నాయి.

277
00:17:36,222 --> 00:17:37,223
ఇదిగో తీసుకోండి.

278
00:17:42,270 --> 00:17:43,438
దయచేసి,

279
00:17:43,730 --> 00:17:44,814
చెప్పండి,

280
00:17:45,815 --> 00:17:47,442
నా భర్త క్షేమంగా ఉన్నాడా?

281
00:17:50,028 --> 00:17:52,405
ఇంకెవరైనా నియమించుకునేలోగా
మీరు అతన్ని నియమించుకోవాలి.

282
00:17:56,493 --> 00:17:57,535
దాని గురించి ఆలోచిస్తాను.

283
00:17:59,704 --> 00:18:01,122
మరీ ఎక్కువ రోజులు ఆలోచించకండి.

284
00:18:10,882 --> 00:18:12,467
మీరిక్కడ ఎంత కాలంగా ఉంటున్నారు?

285
00:18:30,360 --> 00:18:32,237
అప్పుడు డ్రైవ్ వేలో కారు ఉంది.

286
00:18:33,780 --> 00:18:36,783
నేను స్టాన్ అనుకున్నాను.
ఇద్దరు వ్యక్తులు తోసుకుంటూ లోనికి వచ్చారు.

287
00:18:38,117 --> 00:18:39,494
వాళ్ళెలా ఉంటారో వివరించగలరా?

288
00:18:39,577 --> 00:18:44,374
వాళ్ళ ముఖాలు చూడలేకపోయాను.
స్కీ మాస్కులు, గ్లౌజులు వేసుకున్నారు.

289
00:18:45,333 --> 00:18:48,211
వాళ్లు నన్ను మానభంగం చేసి...
చంపేస్తారనుకున్నాను.

290
00:18:49,754 --> 00:18:50,797
వాళ్లు...

291
00:18:51,464 --> 00:18:53,925
నా జుట్టు పట్టుకుని
బాత్ రూంలోకి లాక్కుని వెళ్ళి,

292
00:18:54,467 --> 00:18:55,969
నా గొంతుపై కత్తి పెట్టి,

293
00:18:56,052 --> 00:18:59,597
వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే
నా గొంతు కోసేస్తామన్నారు.

294
00:18:59,681 --> 00:19:00,723
ఏమడిగారు?

295
00:19:01,057 --> 00:19:02,225
నా కారు తాళం చెవులు,

296
00:19:02,934 --> 00:19:04,602
ఇంకా నా సెల్ ఫోన్ పాస్‌వర్డ్.

297
00:19:05,478 --> 00:19:07,772
నా బుర్ర పని చేయలేదు.
పాస్‌వర్డ్ గుర్తు తెచ్చుకోలేకపోయాను.

298
00:19:08,731 --> 00:19:12,235
ఒకడు నన్ను లాగిపెట్టి కొట్టాడు,
దాంతో వాళ్లకు పాస్‌వర్డ్ ఇచ్చాను.

299
00:19:12,318 --> 00:19:13,778
వాళ్లు నన్ను కట్టేశారు.

300
00:19:14,404 --> 00:19:15,697
వాళ్లు మాట్లాడిన తీరును బట్టి,

301
00:19:16,406 --> 00:19:19,158
వాళ్లు నల్ల, తెల్ల, లాటినోలలో
ఏ జాతి వారో చెప్పగలరా?

302
00:19:19,242 --> 00:19:22,745
అవును, అందులో ఒకడు తప్పకుండా తెల్లవాడే.
వాడి మణికట్టుపై పచ్చబొట్టు ఉంది.

303
00:19:23,413 --> 00:19:24,372
ఒక సంఖ్య.

304
00:19:25,748 --> 00:19:26,749
308.

305
00:19:31,379 --> 00:19:33,256
వాళ్లు మిమ్మల్ని కట్టేసిన తర్వాత ఏమైంది?

306
00:19:33,339 --> 00:19:36,634
వాళ్లు నా సెల్ ఫోన్‌తో
నా ఫోటో తీసి, స్టాన్‌కు పంపారు.

307
00:19:37,844 --> 00:19:39,137
ఆ తర్వాత వెళ్లిపోయారు.

308
00:19:41,639 --> 00:19:43,224
-ఈ ఫోన్ మీదేనా?
-ఇది మీకు ఎక్కడ దొరికింది?

309
00:19:43,308 --> 00:19:45,268
-గ్యారేజ్‌లో.
-నాకు అది తిరిగి ఇస్తారా, ప్లీజ్?

310
00:19:45,852 --> 00:19:48,438
ఇది సాక్ష్యం.
వీలైనంత త్వరగా మీకు తిరిగి ఇస్తాం.

311
00:19:48,897 --> 00:19:49,731
సరే.

312
00:19:50,565 --> 00:19:52,191
వాళ్ళకేం కావాలో అసలు చెప్పారా?

313
00:19:52,525 --> 00:19:53,401
లేదు.

314
00:19:54,360 --> 00:19:55,778
బహుశా డబ్బు అనుకుంటాను.

315
00:19:57,071 --> 00:19:58,615
మీ భర్త ఏం చేస్తుంటారు?

316
00:19:59,157 --> 00:20:00,783
అతను మెడికల్ ఫిజిసిస్ట్.

317
00:20:01,784 --> 00:20:02,952
అతను వ్యవహరించేది...

318
00:20:05,580 --> 00:20:06,789
ఒకప్పుడు వ్యవహరించింది...

319
00:20:08,750 --> 00:20:11,044
క్యాన్సర్ చికిత్సలో వాడే
రేడియోధార్మిక పదార్థాలను.

320
00:20:11,753 --> 00:20:13,129
సీజియం, ఇరిడియం.

321
00:20:13,713 --> 00:20:16,132
ఈ పదార్థాలు విలువైనవా?

322
00:20:16,883 --> 00:20:18,426
కాదు, అవి ప్రమాదకరమైనవి.

323
00:20:19,469 --> 00:20:21,012
అవి చాలా విషపూరితమైనవి.

324
00:20:21,471 --> 00:20:23,264
అవి పడకూడని వాళ్ల చేతిలో పడితే...

325
00:20:26,142 --> 00:20:27,936
వాళ్లు దాని కోసం వచ్చారంటారా?

326
00:20:30,521 --> 00:20:31,814
నేను మీకొకటి చూపిస్తాను.

327
00:20:35,693 --> 00:20:40,490
అవును, అవి రేడియేషన్ ఉంగరాలు.
ఎంత రేడియేషన్ సోకిందో తెలుసుకోవడానికి.

328
00:20:42,075 --> 00:20:43,618
అవి స్టాన్ చేతులు.

329
00:20:45,411 --> 00:20:46,454
ఓరి దేవుడా.

330
00:20:57,840 --> 00:20:58,883
అతను ఎక్కడికి వెళ్ళాడు?

331
00:20:59,384 --> 00:21:00,677
న్యూక్లియర్ మెడ్ ల్యాబ్.

332
00:21:02,971 --> 00:21:04,180
సీసీటీవీ లేదా?

333
00:21:04,263 --> 00:21:06,307
లేదు. దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను.

334
00:21:09,560 --> 00:21:11,062
అతను ఏం లాక్కుని పోతున్నాడు?

335
00:21:11,145 --> 00:21:11,980
కంటెయినర్.

336
00:21:13,314 --> 00:21:15,858
రేడియోధార్మిక పదార్థాలను
రవాణా చేసే సీసపు కంటెయినర్.

337
00:21:17,735 --> 00:21:18,820
మాకు ల్యాబ్ చూపించండి.

338
00:21:24,784 --> 00:21:25,618
ఏంటి?

339
00:21:26,285 --> 00:21:28,621
ఈ పదార్థాలను యాక్సెస్ చేసే సమయం కాదది.

340
00:21:28,705 --> 00:21:31,666
ఈ రోజుల్లో సీజియం ఎవరూ వాడడం లేదు,
అది పాత తరం.

341
00:21:39,549 --> 00:21:40,383
పోయాయి.

342
00:21:42,176 --> 00:21:43,928
సరుకు మొత్తం పోయింది.

343
00:21:44,595 --> 00:21:46,222
రికార్డ్‌లో అతను ఒకటే తీసుకున్నట్లు ఉంది.

344
00:21:47,265 --> 00:21:49,100
32 సీజియం తీసుకున్నాను
క్షమించండి - ఎస్‌కే

345
00:21:49,183 --> 00:21:51,352
నోట్‌లో అతను 32 తీసుకున్నట్లు ఉంది.

346
00:22:00,111 --> 00:22:01,571
ఏ సమయంలో అతను సేఫ్ ఖాళీ చేశాడు?

347
00:22:02,530 --> 00:22:03,948
నిన్న రాత్రి 10:38కి.

348
00:22:04,782 --> 00:22:06,784
-ఎఫ్‌బీఐ ఏజెంట్లు వచ్చారు.
-ఎఫ్‌బీఐ?

349
00:22:09,078 --> 00:22:10,955
మీ దగ్గరకు ఏ క్షణానైనా రావచ్చు.

350
00:22:14,417 --> 00:22:16,044
అదిగో వచ్చేశారు.

351
00:22:16,127 --> 00:22:17,336
తర్వాత ఫోన్ చేయి.

352
00:22:19,964 --> 00:22:23,885
జెంటిల్మెన్. జాక్ బ్రెన్నర్, ఎఫ్‌బీఐ,
స్పెషల్ ఏజెంట్ ఇన్ ఛార్జ్.

353
00:22:23,968 --> 00:22:25,803
ఏజెంట్లు మ్యాక్స్‌వెల్, రీస్.

354
00:22:25,887 --> 00:22:27,388
మీరు బోష్, ఎడ్గర్‌లు.

355
00:22:27,472 --> 00:22:29,766
మీరు ఎక్కడ ఉంటారో మీ లెఫ్టినెంట్ చెప్పారు.

356
00:22:29,849 --> 00:22:30,933
ఇప్పుడే నేర స్థలం నుండి వచ్చాం.

357
00:22:31,392 --> 00:22:32,393
చాలా తొందరగా చేశారు.

358
00:22:32,477 --> 00:22:34,395
స్టాన్లీ కెంట్ వాచ్ లిస్ట్‌లో ఉన్నాడు.

359
00:22:34,479 --> 00:22:35,813
ఇప్పటి వరకు నీకు తెలిసింది చెప్పు.

360
00:22:35,897 --> 00:22:37,523
మిసెస్ కెంట్ చెప్పిన దాన్ని బట్టి,

361
00:22:37,607 --> 00:22:40,485
నిన్న రాత్రి వాళ్ల ఇంట్లోకి ఇద్దరు మనుషులు
చొరబడి, ఆమెకు కత్తి పెట్టారు.

362
00:22:40,568 --> 00:22:43,488
డాక్టర్ కెంట్‌కు అతని భార్య ఫోన్ నుండి

363
00:22:43,571 --> 00:22:45,531
ఆమెను కట్టేసి, నోరు మూసేసిన
ఫోటోతో, డిమాండ్ సందేశం పంపారు.

364
00:22:45,615 --> 00:22:47,200
వాళ్ల డిమాండ్ ఏంటి?

365
00:22:47,283 --> 00:22:48,826
"మాకు సీజియం ఇవ్వాలి, లేదంటే."

366
00:22:48,910 --> 00:22:49,952
అది అతను ఇచ్చాడు.

367
00:22:50,036 --> 00:22:53,623
సెయింట్ అగాథస్‌లోని న్యూక్లియర్ మెడిసిన్
ల్యాబ్ నుండి ముప్పై రెండు ట్యూబులు పోయాయి.

368
00:22:53,831 --> 00:22:55,541
-సీజియం జాడ ఏమైనా దొరికిందా?
-లేదు.

369
00:22:56,584 --> 00:22:59,962
కానీ కెంట్ కారు డిక్కీలో బరువైన కంటెయినర్
పెట్టిన గుర్తులున్నాయి.

370
00:23:00,755 --> 00:23:04,050
నేర స్థలానికి అత్యవసర ఆసుపత్రి స్పందన
బృందాన్ని జాడ కనిపెట్టడానికి పంపించాము.

371
00:23:04,133 --> 00:23:05,051
జాడ కనిపెట్టారా?

372
00:23:05,134 --> 00:23:07,512
సీజియం కంటెయినర్‌లో ఉన్నంత వరకు
దాన్ని కనిపెట్టలేము.

373
00:23:08,137 --> 00:23:09,639
కానీ వాళ్లు దాన్ని బయటకు తీసి వాడితే...

374
00:23:09,722 --> 00:23:10,681
ఎలా వాడుతారు?

375
00:23:11,307 --> 00:23:13,643
ఆయుధంగా. సరైన వాతావరణంలో విడుదల చేస్తే

376
00:23:14,393 --> 00:23:16,479
విపత్తే. సామూహిక ప్రాణనష్టం.

377
00:23:17,688 --> 00:23:19,899
ఎల్ఏఎక్స్, సిటీ హాల్, డాడ్జర్ స్టేడియం?

378
00:23:19,982 --> 00:23:22,819
300 సంవత్సరాల వరకు
వాడుకోవడానికి పనికి రావు.

379
00:23:22,902 --> 00:23:23,736
దేవుడా.

380
00:23:24,237 --> 00:23:25,863
ఆ దుండగుల గురించి మిసెస్ కెంట్ ఏమంటుంది?

381
00:23:25,947 --> 00:23:28,866
పెద్దగా ఏమీ లేదు. మొహాలు కనిపించలేదు.
మాస్కులు, గ్లౌజులు వేసుకున్నారు.

382
00:23:29,450 --> 00:23:31,160
మాట్లాడిన దాన్నిబట్టి వాళ్లు తెల్లవాళ్ళు.

383
00:23:31,744 --> 00:23:32,995
నేను ఆ డిమాండ్ సందేశం చూడాలి.

384
00:23:33,788 --> 00:23:36,082
మిసెస్ కెంట్ సిద్ధం కాగానే
ఆమెను ఇంటర్వ్యూ చెయ్యండి.

385
00:23:36,165 --> 00:23:37,917
నేర స్థలానికి
మొత్తం ఫోరెన్సిక్ బృందాన్ని పంపి,

386
00:23:38,000 --> 00:23:39,794
-సెయింట్ అగాథస్ నుండి అప్‌డేట్ పంపండి.
-సరే.

387
00:23:39,877 --> 00:23:42,839
ఎల్ఏపీడీ ప్రధాన నేర విభాగం ఇంకా,
హాలీవుడ్ హత్యా విభాగాన్ని చర్చకు పిలవండి.

388
00:23:46,634 --> 00:23:49,720
నా కేసులో దేశ భద్రత పేరుతో
ఎఫ్‌బీఐ కలుగజేసుకుంటుందా?

389
00:23:50,138 --> 00:23:51,848
మన సహకారం
కొనసాగించాలని ఆశిస్తున్నాను, డిటెక్టివ్.

390
00:23:52,390 --> 00:23:54,142
-నా హత్య కేసుపై పని చేస్తాను.
-మేము అదే కోరుకుంటున్నాము.

391
00:23:54,225 --> 00:23:55,977
దాపరికం లేకుండా చెప్తున్నా,
మీరు కనుక్కున్నది మాకు చెప్పాలి.

392
00:23:56,310 --> 00:23:58,855
దాపరికం లేకపోవడం ఇద్దరికీ వర్తిస్తుంది.

393
00:23:58,938 --> 00:24:00,648
-మేము నీతో సమాచారం పంచుకుంటాము.
-సరే.

394
00:24:02,483 --> 00:24:04,360
నువ్వు సమర్థుడైన డిటెక్టివ్ అని విన్నాను.

395
00:24:06,404 --> 00:24:07,446
నా పని నేను చేస్తాను.

396
00:24:07,530 --> 00:24:09,407
నీకు ఎఫ్‌బీఐతో సంబంధాలు అంతగా బాగాలేవు.

397
00:24:09,532 --> 00:24:11,075
అవును, అంటే,

398
00:24:11,159 --> 00:24:12,827
నీకు పరిస్థితులు తెలుసు.

399
00:24:12,910 --> 00:24:14,412
నిన్ను పోనీలే అని ఊరుకున్నాం.

400
00:24:15,121 --> 00:24:17,123
నేనలా ఎక్కువ ఆలోచించకుండా చేస్తాను.

401
00:24:22,670 --> 00:24:24,338
వాళ్లకు పచ్చ బొట్టు గురించి తెలుసంటావా?

402
00:24:24,422 --> 00:24:26,382
మిసెస్ కెంట్‌తో మాట్లాడాక తెలుసుకుంటారు.

403
00:24:27,550 --> 00:24:30,219
308. అది ఏమైనా కావచ్చు.

404
00:24:30,303 --> 00:24:33,848
ఏరియా కోడ్, రోజువారి సమయం, బ్యాటింగ్ సగటు.

405
00:24:33,931 --> 00:24:35,141
ఐక్యూ.

406
00:24:37,018 --> 00:24:39,729
"మేము చెప్పింది చేయి.
మొత్తం సీజియం. పోలీసులకు చెప్పొద్దు."

407
00:24:40,521 --> 00:24:41,731
దాంతో వాళ్లు ఏం చేస్తారు?

408
00:24:42,231 --> 00:24:45,776
నగరాన్ని నిర్బంధించడం.
32 పేలుడు పదార్థాలు తయారు చేయడం.

409
00:24:45,860 --> 00:24:49,405
నీటినంతటినీ కలుషితం చేయడం. రేడియోధార్మిక
బాంబు తయారు చేయడం. ఆకాశమే హద్దు.

410
00:24:49,488 --> 00:24:52,909
ప్రధాన నేరాల విభాగం, స్పెషల్ ఏజెంట్
ఇన్ ఛార్జ్‌లతో సమావేశం ఏర్పాటు చేశాను.

411
00:24:52,992 --> 00:24:55,745
అవును, బ్రెన్నర్. మనతో
సమాచారం పంచుకుంటానని మాట ఇచ్చారు.

412
00:24:55,828 --> 00:24:57,371
ఆ మాటకి ఎంత విలువుందో మనందరికీ తెలుసు.

413
00:24:58,623 --> 00:25:02,210
వాళ్లు మనల్ని పట్టించుకోరు. మన నుండి
సమాచారం దాస్తారు, నకిలీ సమాచారం ఇస్తారు.

414
00:25:02,293 --> 00:25:03,252
నీ హత్య కేసుపై పని చేయి.

415
00:25:03,628 --> 00:25:04,795
నా ఉద్దేశ్యం అదే.

416
00:25:10,384 --> 00:25:12,303
ఎంత హింసాత్మక వివాదం.

417
00:25:18,059 --> 00:25:20,228
ఉచితంగా చేసే కేసు ఒకటుంది.
నువ్వు దాని మీద పని చేయి.

418
00:25:20,645 --> 00:25:22,647
ఇది అక్రమ శిక్షపై వేసిన దావా.

419
00:25:22,730 --> 00:25:25,942
బాధితుల పరిహార నిధికి
దరఖాస్తు చేస్తున్నాం.

420
00:25:26,317 --> 00:25:27,360
మన క్లయింట్ బాధితుడా?

421
00:25:27,443 --> 00:25:29,445
హత్య కేసులో తప్పుగా శిక్ష వేశారు.

422
00:25:30,029 --> 00:25:33,824
పదేళ్లు జైల్లో ఉన్నాడు.
డీఎన్‌ఏ పుణ్యమా అని బయటపడ్డాడు.

423
00:25:33,908 --> 00:25:36,494
జైల్లో ఉన్న కాలానికి
పరిహారం పొందే హక్కు ఉంది.

424
00:25:36,577 --> 00:25:37,995
నేనేం చేయాలి?

425
00:25:38,079 --> 00:25:40,331
విచారణ సాక్ష్యాన్ని చదివి సారాంశం రాయి.

426
00:25:40,414 --> 00:25:42,750
-నేనది చేయగలను.
-చాలా పత్రాలు ఉన్నాయి.

427
00:25:43,417 --> 00:25:44,585
శ్రద్ధగా చేయి.

428
00:25:45,753 --> 00:25:47,046
కావలసినంత సమయం తీసుకో.

429
00:25:48,589 --> 00:25:49,840
అర్థమైంది.

430
00:25:53,719 --> 00:25:55,179
అతనికి ఎంత పొందే అర్హత ఉంది?

431
00:25:56,138 --> 00:25:58,099
అది రాష్ట్ర శాసనాన్ని బట్టి ఉంటుంది.

432
00:25:58,641 --> 00:26:02,019
తప్పుడు నిర్బంధంలో
గడిపిన ప్రతి రోజుకు 140 డాలర్లు.

433
00:26:03,062 --> 00:26:04,021
పది సంవత్సరాలు.

434
00:26:04,105 --> 00:26:07,191
140కి 3,650 రెట్లు...

435
00:26:07,566 --> 00:26:09,694
ఐదు లక్షల డాలర్లకంటే కాస్త ఎక్కువ.

436
00:26:10,611 --> 00:26:12,113
అదేమంత పెద్ద మొత్తం అనిపించడం లేదు.

437
00:26:12,697 --> 00:26:14,073
అది పెద్ద మొత్తం కాదు.

438
00:26:14,573 --> 00:26:15,825
అది ప్రారంభం మాత్రమే.

439
00:26:19,578 --> 00:26:21,539
బోష్ నేరుగా నాకు రిపోర్ట్ చేయాలి.

440
00:26:21,622 --> 00:26:23,958
అతను మీకు
సమాచారం ఇచ్చేలా చూస్తాను, చీఫ్.

441
00:26:24,041 --> 00:26:26,836
వాయిస్ మెయిల్, సందేశాలు వద్దు.
నాకే వ్యక్తిగతంగా అందించాలి.

442
00:26:26,919 --> 00:26:29,964
ఆ నిమిషం వరకు జరిగిందంతా చెప్పాలి,
లెఫ్టినెంట్. స్పష్టంగా అర్థమైంది కదా?

443
00:26:30,548 --> 00:26:31,674
అర్థమైంది, సార్.

444
00:26:34,927 --> 00:26:36,304
-రెండు షాట్‌లా?
-మూడు.

445
00:26:37,179 --> 00:26:38,306
ప్రాణం కాపాడావు.

446
00:26:39,015 --> 00:26:41,183
ఇంకా ఎనిమిది గంటలు చేయాలి,
ఇప్పటికే అలసిపోయాను.

447
00:26:42,601 --> 00:26:45,896
తొమ్మిదేళ్ల పిల్లాడికి
కపాలం ఫ్రాక్చర్ అయ్యింది.

448
00:26:45,980 --> 00:26:47,148
బ్రతుకుతాడా?

449
00:26:47,732 --> 00:26:49,108
తప్పకుండా.

450
00:26:49,525 --> 00:26:51,444
నీ పని ఎలా చేస్తావో నాకు తెలియదు.

451
00:26:52,278 --> 00:26:53,571
నీ పని ఎలా ఉంది?

452
00:26:55,114 --> 00:26:56,282
కొత్త పని ఎవరికొచ్చిందో చెప్పుకో?

453
00:26:57,116 --> 00:26:58,576
ఏదైనా ఆసక్తికరమైనదా?

454
00:26:58,659 --> 00:26:59,785
లేదు. ఎప్పుడూ ఉండేదే.

455
00:26:59,869 --> 00:27:04,332
హత్య, జైలు, తప్పుడు శిక్ష,
డీఎన్‌ఏ నిర్దోషత్వం, ప్రధాన వ్యాజ్యం.

456
00:27:04,415 --> 00:27:05,875
-విసుగ్గా ఉంది.
-అవును.

457
00:27:08,127 --> 00:27:09,795
తినడానికి రహస్యంగా బయటకు రాగలవా?

458
00:27:10,838 --> 00:27:13,424
అంతా గందరగోళంగా ఉంది.
అంటే, అందరూ అందుబాటులో ఉండాలి.

459
00:27:14,008 --> 00:27:15,343
-ఏం జరుగుతున్నది?
-నాకు తెలియదు.

460
00:27:15,426 --> 00:27:18,220
ఎబోలా? తట్టు? టైఫాయిడ్ జ్వరం?

461
00:27:18,888 --> 00:27:20,389
ఎవరికి తెలుసు?

462
00:27:20,473 --> 00:27:23,059
నా స్నేహితుడు సీడర్స్‌లో
కూడా అదే పరిస్థితి అని మెసేజ్ పంపాడు.

463
00:27:28,898 --> 00:27:30,775
మార్కోస్, ఏరియస్‌లు తుపాకులు బుక్ చేశారు.

464
00:27:31,400 --> 00:27:32,860
డబ్బు కూడా. ప్రతి రూపాయి.

465
00:27:32,943 --> 00:27:33,944
ఛ.

466
00:27:35,029 --> 00:27:37,490
నువ్వు చెప్పేది నిజమే కావచ్చు.
వాళ్లకు మన గురించి తెలిసిందేమో.

467
00:27:38,157 --> 00:27:39,075
మనం చాలా దగ్గరలో ఉన్నాం.

468
00:27:40,701 --> 00:27:41,535
డ్రింక్ తీసుకో.

469
00:27:42,620 --> 00:27:43,913
నాకొక కేసు ఉంది.

470
00:28:11,023 --> 00:28:13,025
హే. డిన్నర్ ఎలా ఉంది?

471
00:28:13,359 --> 00:28:15,069
డిన్నర్‌కు మూడు షాట్‌ల లాటే తీసుకున్నాం.

472
00:28:15,152 --> 00:28:17,988
అతను బయటకు రాలేకపోయాడు. తొమ్మిదేళ్ల
పిల్లాడికి కపాలం ఫ్రాక్చర్ అయ్యింది.

473
00:28:18,072 --> 00:28:19,198
యాక్సిడెంటా?

474
00:28:19,824 --> 00:28:20,866
బహుశా కాకపోవచ్చు.

475
00:28:21,200 --> 00:28:22,576
అతనిది కష్టమైన ఉద్యోగం.

476
00:28:22,993 --> 00:28:25,704
పిల్లల నర్సా?
అందుకు తగినంత చెల్లించలేరు.

477
00:28:26,705 --> 00:28:28,666
అంటే అతను డిన్నర్ చేసే వాడని కాదు.

478
00:28:29,041 --> 00:28:31,877
ఆస్పత్రిలో అందరూ అందుబాటులో
ఉండాలని చెప్పారు. మిగతా ఆస్పత్రుల్లోనూ.

479
00:28:31,961 --> 00:28:33,712
-అదెలా?
-నాకు తెలియదు.

480
00:28:34,171 --> 00:28:36,966
ఆంటోనియో ఏదో జరుగుతోందని అనుకుంటున్నాడు.
ఒక రకమైన ఆకస్మిక రోగవ్యాప్తి కావచ్చు.

481
00:28:37,925 --> 00:28:39,468
దేవుడా. అది కాదని ఆశిద్దాం.

482
00:28:41,470 --> 00:28:42,513
ఎక్కడికైనా వెళ్తున్నారా?

483
00:28:43,681 --> 00:28:45,724
కొత్త కేసు. టీమ్ అంతా పని చేస్తుంది.

484
00:28:45,808 --> 00:28:47,601
స్నానం చేసి బట్టలు
మార్చుకోవడానికి వచ్చాను.

485
00:28:48,394 --> 00:28:49,854
నేను ఎప్పుడు తిరిగి వస్తానో తెలియదు.

486
00:28:51,021 --> 00:28:52,148
అందుబాటులో ఉండండి.

487
00:28:52,773 --> 00:28:53,858
మాటిస్తున్నాను.

488
00:28:56,152 --> 00:28:57,570
నా కోసం కోల్ట్రేన్‌కు అన్నం పెడతావా?

489
00:28:58,487 --> 00:28:59,572
నాకు ఆ పద్ధతి తెలుసు.

490
00:29:06,412 --> 00:29:07,371
అది మీ కేసులో భాగమా?

491
00:29:08,664 --> 00:29:10,040
నాకు తెలియదు. బహుశా కావచ్చు.

492
00:29:12,543 --> 00:29:14,253
-శుభరాత్రి.
-శుభరాత్రి.

493
00:29:23,804 --> 00:29:25,890
జెర్రీ, ఇది చూడు.

494
00:29:29,226 --> 00:29:31,520
నేను "308"ని పచ్చబొట్టు అని
కాల్‌గ్యాంగ్‌ డేటాబేస్‌లో వెతికాను.

495
00:29:31,604 --> 00:29:35,065
"రస్ ఏబోర్న్, వ్యాన్ నైస్,
సార్వభౌమ పౌరుడు."

496
00:29:35,232 --> 00:29:38,402
ఫోల్సమ్. లంచం, తప్పుడు పత్రాలు దాఖలు చేసిన
నేరాలపై మూడు నుండి ఐదు ఏళ్లు శిక్షపడింది.

497
00:29:39,236 --> 00:29:40,613
మూడు సున్నా ఎనిమిదా?

498
00:29:40,696 --> 00:29:43,240
అవును, యూసీసీలోని
సెక్షన్ 308 ఉపయోగించుకొని

499
00:29:43,324 --> 00:29:46,452
స్థానిక, రాష్ట్ర, ఫెడరల్ చట్టాల నుండి
మినహాయింపు పొందవచ్చని

500
00:29:46,535 --> 00:29:48,621
సార్వభౌమ పౌరులు తమని
తాము అనుకునే వారు కొందరు నమ్ముతారు.

501
00:29:48,704 --> 00:29:50,164
అవి చాలా ఎక్కువ మినహాయింపులు.

502
00:29:50,247 --> 00:29:53,501
ఇంగ్లీష్ సాధారణ చట్టం కానిది ఏదైనా
వాళ్లు తిరస్కరిస్తారు.

503
00:29:53,584 --> 00:29:54,668
వారికి మినహాయింపు ఉంది.

504
00:29:55,377 --> 00:29:58,964
-పన్నులు.
-పన్నులు. వ్యాపార ఒప్పందాలు.

505
00:29:59,715 --> 00:30:00,758
ఆస్తి దస్తావేజులు.

506
00:30:00,841 --> 00:30:03,219
వాళ్లు తమ సొంత
లైసెన్స్ ప్లేట్లను తయారు చేసుకుంటారు,

507
00:30:03,302 --> 00:30:05,513
వారి స్వంత కరెన్సీని ముద్రించుకుంటారు.

508
00:30:05,596 --> 00:30:07,723
జనాల ఆస్తిని కబ్జా చేస్తారు.

509
00:30:07,806 --> 00:30:09,433
ఇది చూడు.

510
00:30:12,686 --> 00:30:15,439
"డ్రైవింగ్ లైసెన్స్ గాని
బీమాగాని అక్కరలేదు."

511
00:30:15,523 --> 00:30:18,567
నాకది నచ్చింది.
డీఎమ్‌వీ దగ్గర లైనులో నిలబడాల్సిన పనిలేదు.

512
00:30:18,651 --> 00:30:20,861
హత్య? హత్య సంగతి ఏంటి?
వీళ్లకు దాని నుంచి కూడా మినహాయింపు ఉందా?

513
00:30:20,945 --> 00:30:22,613
హత్య సాధారణ చట్టం పరిధిలోకి వస్తుంది.

514
00:30:22,696 --> 00:30:24,532
అంటే హంతకుడు ఇంకా బాధ్యుడే.

515
00:30:24,615 --> 00:30:25,616
అవును.

516
00:30:34,667 --> 00:30:37,836
అయితే, బ్యూరోతో, హాలీవుడ్ హత్యా విభాగంతో
ప్రధాన నేరల విభాగంతో అనుసంధానం అవుతుంది.

517
00:30:38,629 --> 00:30:39,797
అవును, సార్.

518
00:30:40,756 --> 00:30:43,676
నగరమంతా తీవ్ర భయభ్రాంతులు
వ్యాపించకుండా నివారించడానికి,

519
00:30:44,426 --> 00:30:48,264
వీలైనంతవరకు ఈ చెత్త సంగతి
బయటకు పొక్కకుండా ప్రయత్నిద్దాం.

520
00:30:49,306 --> 00:30:50,140
సార్.

521
00:30:53,936 --> 00:30:55,896
మిసెస్ కెంట్ క్షేమంగా ఉన్నారా?

522
00:30:55,980 --> 00:30:57,648
భయంకరమైన షాక్‌కు గురై ఉండాలి.

523
00:30:58,107 --> 00:31:00,109
ఆ రాత్రి అసాధారణమైనది ఏదైనా గమనించారా?

524
00:31:01,360 --> 00:31:03,612
వాస్తవానికి, నేను కుక్కను
ఆలస్యంగా తిప్పుకుని వచ్చాను.

525
00:31:03,696 --> 00:31:04,697
ఈ చుట్టుపక్కల.

526
00:31:04,780 --> 00:31:06,907
-అది ఏ సమయంలో?
-అర్ధరాత్రి.

527
00:31:07,408 --> 00:31:09,618
మూల మలుపులో ఒక కారు ఆగి ఉంది.

528
00:31:09,702 --> 00:31:11,453
ఒక రకమైన నల్లని సెడాన్.

529
00:31:12,204 --> 00:31:14,623
-వింత లైసెన్స్ ప్లేట్ ఉంది.
-వింతగా అంటే ఎలా?

530
00:31:14,707 --> 00:31:16,709
నిజమైన దానిలా అనిపించలేదు.

531
00:31:16,792 --> 00:31:19,545
ఇంట్లో చేసినట్టుంది.
కాగితంతోనో, కార్డుబోర్డుతోనో చేసినట్టుంది.

532
00:31:20,629 --> 00:31:21,797
ఇది కొత్త కారా?

533
00:31:21,880 --> 00:31:24,049
డీఎమ్‌వీ కాగితంతో చేసిన
తాత్కాలిక ప్లేట్లు జారీ చేస్తుంది.

534
00:31:24,133 --> 00:31:25,634
అది కొత్త కారులా అనిపించలేదు.

535
00:31:25,718 --> 00:31:27,136
మీరు నంబర్ గమనించారా?

536
00:31:27,219 --> 00:31:29,763
నంబర్ లేదు,
కేవలం స్లాష్‌లు, డాష్‌లు ఉన్నాయి.

537
00:31:30,848 --> 00:31:34,393
నకిలీ ప్లేట్లు. పచ్చబొట్టు.
ఖచ్చితంగా సార్వభౌమ ఉద్యమకారులే.

538
00:31:34,476 --> 00:31:36,061
అలాగే అనిపిస్తుంది.

539
00:31:40,566 --> 00:31:42,067
ఎవరు వచ్చారో చూడు.

540
00:31:45,070 --> 00:31:46,155
డిటెక్టివ్‌లు.

541
00:31:47,281 --> 00:31:48,699
ఏ పని మీద వచ్చారు?

542
00:31:48,782 --> 00:31:50,200
చుట్టుపక్కల విచారిస్తున్నాం.

543
00:31:50,284 --> 00:31:51,660
మీరు కెంట్ వాచ్ లిస్టులో ఉన్నాడన్నారు.

544
00:31:52,244 --> 00:31:54,538
మేము అతని రేడియోధార్మిక పదార్థ
వాడకాన్ని పర్యవేక్షించాం.

545
00:31:54,622 --> 00:31:57,541
అతన్ని కలిసి, నిబంధనలు
పాటిస్తున్నాడని నిర్ధారించుకున్నాం.

546
00:31:57,625 --> 00:31:59,418
ప్రత్యేకించి కెంట్‌నా?

547
00:31:59,501 --> 00:32:00,919
కెంట్ వంటి వైద్యులను.

548
00:32:01,003 --> 00:32:02,212
అతనికెప్పుడైనా బెదిరింపులు వచ్చాయా?

549
00:32:02,838 --> 00:32:05,466
ఇది ముప్పుతో కూడిన వాతావరణం, డిటెక్టివ్.

550
00:32:05,549 --> 00:32:06,884
దాన్ని అక్కడే వదిలేద్దాం.

551
00:32:06,967 --> 00:32:08,761
అయితే మేము తిరిగి వచ్చి

552
00:32:08,844 --> 00:32:11,221
మిసెస్ కెంట్‌తో మాట్లాడుతాం.

553
00:32:11,305 --> 00:32:13,265
ప్రస్తుతానికి అది సాధ్యం కాదు.

554
00:32:13,349 --> 00:32:14,224
ఎందుకు కాదు?

555
00:32:14,975 --> 00:32:18,437
ఆమె ఇక్కడ లేదు.
ఆమెను ప్రస్తుతానికి రక్షణ గృహంలో ఉంచాం.

556
00:32:20,606 --> 00:32:22,483
మాకు విషయాలు తెలుపుతున్నందువల్ల
పెద్దగా లాభం లేదు.

557
00:32:24,526 --> 00:32:25,819
-హే, బోష్?
-ఏంటి?

558
00:32:29,490 --> 00:32:32,409
నాకు ఎలియనోర్ విష్ తెలుసని
చెప్పాలని అనుకుంటున్నాను.

559
00:32:32,493 --> 00:32:33,661
నేను ఆమెతో కలిసి పని చేశాను.

560
00:32:34,828 --> 00:32:36,038
ఆమె గొప్ప వ్యక్తి.

561
00:32:37,164 --> 00:32:38,415
అవును, గొప్ప వ్యక్తే.

562
00:32:43,212 --> 00:32:46,507
నిన్న ఘటనా స్థలంలో నువ్వు,
బోష్ దేని గురించి మాట్లాడుతున్నారు?

563
00:32:46,590 --> 00:32:48,050
ఓవర్‌లుక్.

564
00:32:48,133 --> 00:32:50,052
అందమైన ఉదయం. నిన్నటిలాంటి రోజు.

565
00:32:50,135 --> 00:32:51,762
ఘటనాస్థలానికి నేనే ముందు వెళ్లాను.

566
00:32:51,845 --> 00:32:54,264
స్త్రీ, 20 ఏళ్లు, తన కారులో ఉంది.

567
00:32:55,516 --> 00:32:57,643
గుండెల్లో తుపాకీ గాయం.

568
00:32:57,726 --> 00:33:00,771
బోష్ రాగానే ముందు చేసిన పని
శవాన్ని కదిలించడం.

569
00:33:01,605 --> 00:33:02,773
అవకాశమే లేదు.

570
00:33:03,565 --> 00:33:06,276
మరణ విచారణాధికారి వచ్చేదాకా శవాన్ని
తాకవద్దనేది మనకు నేర్పించే మొదటి పాఠం.

571
00:33:06,360 --> 00:33:07,194
కదా?

572
00:33:07,611 --> 00:33:09,822
అప్పుడు సీటు కింద చెయ్యి పెట్టి
తుపాకీ తీశాడు.

573
00:33:10,656 --> 00:33:11,907
ఆత్మహత్య.

574
00:33:11,990 --> 00:33:13,659
తనకు తాను గుండెలో కాల్చుకుంది.

575
00:33:13,742 --> 00:33:15,661
బోష్‌కు తెలుసు. అతని మనసుకి తెలిసింది.

576
00:33:16,286 --> 00:33:17,830
అక్కడికక్కడే పరిష్కరించాడు.

577
00:33:19,665 --> 00:33:20,916
మీరు ఇక్కడున్నారు.

578
00:33:20,999 --> 00:33:21,959
లెఫ్టినెంట్.

579
00:33:22,042 --> 00:33:23,544
-మీరు కోర్టుకు బయలుదేరుతున్నారా?
-అవును.

580
00:33:23,627 --> 00:33:24,461
పియర్స్.

581
00:33:25,003 --> 00:33:26,171
-ఏంటి?
-నీ కాలర్.

582
00:33:26,255 --> 00:33:29,633
దేవుడా, ఈ మగాళ్ళు.
నా మాజీ భర్తకు కూడా ఇలా చేయాల్సి వచ్చేది.

583
00:33:30,467 --> 00:33:32,052
ఇదిగో. చక్కగా ఉన్నావు.

584
00:33:32,386 --> 00:33:34,304
-మరి నువ్వు కూడా.
-ధన్యవాదాలు.

585
00:33:34,888 --> 00:33:38,058
వినండి, మీరు గొప్ప పని చేసారు. మీరిద్దరూ.

586
00:33:38,142 --> 00:33:43,397
అంటే, మనసుకు అనిపించినట్లు చేయద్దు,
మంచి పోలీసు పని చేయండి. సరేనా?

587
00:33:43,480 --> 00:33:45,315
వాళ్లను ముప్పుతిప్పలు పెట్టండి.

588
00:33:50,946 --> 00:33:52,489
నేను ఎప్పుడూ అలా చేయనని మాటిస్తున్నాను.

589
00:33:52,573 --> 00:33:54,908
-ఏంటి?
-నీ కాలర్ సరి చేయడం.

590
00:33:54,992 --> 00:33:56,910
-నువ్వు ఆమెకు ఇష్టమైన దానివి.
-ఊరుకో.

591
00:33:56,994 --> 00:33:59,496
-నిజంగా.
-నిజంగా ఊరుకో.

592
00:33:59,580 --> 00:34:01,039
ఆమెకు హద్దు పద్దు తెలియదు.

593
00:34:01,123 --> 00:34:03,250
-ఆమె అందరితో అలా చేస్తుంది.
-అది నీకు ఇబ్బందిగా ఉండదా?

594
00:34:03,333 --> 00:34:04,418
మరీ అంతగా కాదు.

595
00:34:04,501 --> 00:34:06,712
-ఆమె అలా ముట్టుకోవడం నాకు నచ్చదు.
-ఎవరు?

596
00:34:07,045 --> 00:34:08,297
నా కజిన్, సార్.

597
00:34:08,380 --> 00:34:10,048
ఆమె జనాన్ని ముట్టుకోకుండా ఉండలేదు.

598
00:34:12,468 --> 00:34:14,219
ఈ వారం కోర్టులో అదృష్టం వరించనీ.

599
00:34:14,553 --> 00:34:15,929
ధన్యవాదాలు, సార్.

600
00:34:20,058 --> 00:34:21,977
అది నిరాశపరిచింది.

601
00:34:22,060 --> 00:34:23,604
ఖచ్చితంగానా?

602
00:34:23,687 --> 00:34:25,355
ముందు జాగ్రత్త మేలు.

603
00:34:26,774 --> 00:34:28,859
మా బామ్మలాగా మాట్లాడుతున్నారు, తెలుసా?

604
00:34:28,942 --> 00:34:31,528
"గోటితో పోయేది,
గొడ్డలి దాకా తీసుకు రావద్దు."

605
00:34:32,279 --> 00:34:33,113
ఎంత కాలం?

606
00:34:34,364 --> 00:34:35,741
ఎంత కాలం పడితే అంత.

607
00:34:36,200 --> 00:34:37,785
పరిస్థితులు చల్లబడే వరకు.

608
00:34:38,410 --> 00:34:40,579
మధ్యలో ఎక్కడికైనా వెళ్లాల్సి రావచ్చు.

609
00:34:43,123 --> 00:34:44,166
అర్థం చేసుకోగలను.

610
00:34:45,459 --> 00:34:47,211
మేము బయటపడే ప్రమాదం ఎంత ఉంది?

611
00:34:49,213 --> 00:34:50,339
సున్నా.

612
00:34:50,422 --> 00:34:52,466
నేను సున్నాను నమ్మను.

613
00:34:53,467 --> 00:34:55,677
సున్నా గ్యారెంటీ.

614
00:34:57,721 --> 00:34:59,431
సున్నా ఉండదు.

615
00:35:21,119 --> 00:35:24,998
అతనికి స్పష్టంగా చెప్పు.
మనం మంచిగా చెల్లిస్తాం, అదే ఒప్పందం.

616
00:35:25,082 --> 00:35:27,084
-నేను కట్టుబడి ఉండను.
-అస్సలు కాదు.

617
00:35:27,167 --> 00:35:29,378
అతనికి గాని, అతను తీసుకువచ్చే దాతలకు గాని.

618
00:35:29,461 --> 00:35:31,213
అది ముందు నుంచే అర్థం కావాలి.

619
00:35:31,296 --> 00:35:32,673
రేకు అది తెలుసు.

620
00:35:32,756 --> 00:35:37,636
విరాళం చిన్నదైనా పెద్దదైనా నాతో పని
చేయించుకోలేరు నన్ను కొనలేరు.

621
00:35:37,719 --> 00:35:39,304
అది చెప్పాల్సిన పని లేదు.

622
00:35:39,388 --> 00:35:42,266
నేనిది స్పష్టంగా చెబుతున్నాను.

623
00:35:43,225 --> 00:35:46,979
ఇది ఈ నగర భవిష్యత్తుకు పెట్టుబడి.

624
00:36:00,158 --> 00:36:02,327
నేను బోష్‌ను. మెసేజ్ పంపండి.

625
00:36:03,996 --> 00:36:04,997
ఎక్కడ?

626
00:36:06,081 --> 00:36:07,165
నేను చూసుకుంటాను.

627
00:36:08,834 --> 00:36:10,460
ఎవరి మీదైనా దాడి జరిగిందా?

628
00:36:10,544 --> 00:36:12,296
సన్‌సెట్ ఇంకా లాస్ పాల్మస్.

629
00:36:13,005 --> 00:36:15,215
అది అశుభసూచక ప్రాంతం.

630
00:36:15,340 --> 00:36:17,843
-నువ్వనేది...
-టెడ్డీ హాబ్స్?

631
00:36:17,926 --> 00:36:18,844
అవును.

632
00:36:19,970 --> 00:36:22,514
-కచ్చితంగా చెప్పగలను.
-నేను కూడా.

633
00:36:23,891 --> 00:36:25,183
-చీఫ్!
-చీఫ్!

634
00:36:31,857 --> 00:36:33,483
డిటెక్టివ్ కమాండర్

635
00:36:34,693 --> 00:36:35,819
చీఫ్.

636
00:36:36,153 --> 00:36:38,739
నాకు బోష్ ఎందుకు ఫోన్ చేయలేదు?

637
00:36:44,328 --> 00:36:46,705
వారు తమని తాము 308 స్క్వాడ్రన్
అని పిలుచుకుంటారు.

638
00:36:46,788 --> 00:36:50,834
మనం మాట్లాడుతున్నది డజను కంటే తక్కువ ఉన్న
చిన్న సెల్, ఇంకా రెండు కుటుంబాల గురించి.

639
00:36:51,543 --> 00:36:52,836
సాంఘిక ప్రసార మాధ్యమాలా?

640
00:36:52,920 --> 00:36:54,546
ఈ మధ్యన వాళ్లు జోరు పెంచారు.

641
00:36:54,630 --> 00:36:55,547
వట్టి మాటలకంటే ఎక్కువా?

642
00:36:55,631 --> 00:36:58,133
బహిరంగంగా హింసకు దిగలేదు, ఇంతవరకు.

643
00:36:58,258 --> 00:37:02,262
కానీ వాస్తవ ప్రపంచంలో స్థానిక
సార్వభౌమాధికారులు రెచ్చగొట్టడం పెరిగింది.

644
00:37:02,387 --> 00:37:06,808
ముఖ్యంగా పోలీసులతో గొడవలు.
ట్రాఫిక్ ఆపడాలు, స్టేషన్ పై దండయాత్రలు.

645
00:37:06,892 --> 00:37:09,603
గత నెల వ్యాలీలో ఒకటి జరిగింది.
వ్యాన్ నైస్.

646
00:37:09,686 --> 00:37:11,229
308 వాళ్లు ఆ సంఘటనలో పాల్గొన్నారు.

647
00:37:11,313 --> 00:37:12,147
వాళ్లు ఎక్కడ దొరుకుతారు?

648
00:37:12,230 --> 00:37:14,691
వాళ్లు పోలీసులను ఇబ్బంది పెట్టే పనిలో
లేకుంటే, బహిరంగంగా కనిపిస్తారా?

649
00:37:15,442 --> 00:37:17,986
వాళ్ల సాహిత్యాన్ని పంచుతూ,
వాళ్ల సిద్ధాంతాలను ప్రచారం చేస్తారు.

650
00:37:18,070 --> 00:37:19,446
-తమలో చేర్చుకోవడానికి.
-కచ్చితంగా.

651
00:37:19,529 --> 00:37:21,615
ప్యాన్‌కేక్ బ్రేక్‌ఫాస్ట్‌లు,
బార్బెక్యూలు.

652
00:37:23,033 --> 00:37:24,201
కాల్ వస్తుంది
ఇర్వింగ్

653
00:37:25,452 --> 00:37:26,787
నేను ఎక్కడ మొదలు పెట్టాలి?

654
00:37:39,633 --> 00:37:41,218
ఇదిగో, బంగారం.

655
00:37:43,053 --> 00:37:46,223
సరే, రివర్‌సైడ్‌ను మర్చిపోవద్దు.
అది నీకు పరవాలేదు కదా, క్రేవర్?

656
00:37:46,306 --> 00:37:48,225
లేక నీకు కాస్త ఇబ్బందికరంగా ఉంటుందా?

657
00:37:48,642 --> 00:37:51,186
నువ్వు ఏది చెప్తే అది, హేదర్.
నేను చేయగలను.

658
00:38:13,834 --> 00:38:15,544
నిన్ను ఇంతకు ముందు ఇక్కడ చూడలేదు.

659
00:38:15,627 --> 00:38:19,965
ఇక్కడ నాలాంటి వారు దొరుకుతారని
ఒక స్నేహితుడు చెప్పాడు.

660
00:38:20,298 --> 00:38:22,843
-నీకు దొరకవచ్చు.
-నేను చూస్తాను.

661
00:38:23,760 --> 00:38:25,137
నీ పేరేంటి?

662
00:38:27,097 --> 00:38:28,432
నా స్నేహితులు నన్ను బ్యారెల్ అంటారు.

663
00:38:30,350 --> 00:38:32,728
నేను గోడ మీది పిల్లుల్ని
చూడగానే గుర్తుపడతాను.

664
00:38:32,811 --> 00:38:35,272
సమయం దగ్గర పడుతోంది, సోదరా.
ఏ పక్షమో తేల్చుకోవాలి.

665
00:38:35,981 --> 00:38:37,816
సార్వభౌమ పౌరులా?

666
00:38:39,026 --> 00:38:40,277
నేను సరైన చోట ఉన్నానా?

667
00:38:43,030 --> 00:38:45,449
మా చిన్న సమావేశం గురించి
ఎలా తెలుసుకున్నావు?

668
00:38:45,866 --> 00:38:46,867
రస్ ఏబోర్న్.

669
00:38:47,451 --> 00:38:49,911
అది నిజమేనా? పెద్దాయన రస్ ఎలా ఉన్నాడు?

670
00:38:49,995 --> 00:38:51,121
అంత బాగా లేడు.

671
00:38:51,204 --> 00:38:52,998
అవును. కోర్కరన్ కఠినమైన ప్రదేశం.

672
00:38:53,623 --> 00:38:56,501
ఫోల్సమ్. అతను
ఫోల్సమ్ జైలులో చిక్కుకున్నాడు.

673
00:38:57,252 --> 00:38:59,379
సమయం ఎంతకూ గడవదు.

674
00:39:03,842 --> 00:39:05,719
రస్‌కు పచ్చబొట్టు ఉంది.

675
00:39:07,179 --> 00:39:09,473
308. నేను వెతుకుతున్నది అతని కోసమే.

676
00:39:09,556 --> 00:39:11,475
308 వాళ్లు.

677
00:39:12,267 --> 00:39:14,061
అవును. ఏంటి?

678
00:39:15,353 --> 00:39:16,605
నువ్వు పోలీసువా?

679
00:39:17,564 --> 00:39:19,357
నీ నడవడి పోలీసుల్లా ఉంది.

680
00:39:20,025 --> 00:39:21,318
ఒకవేళ అయితే?

681
00:39:21,860 --> 00:39:22,819
నువ్వు పోలీసువేనా?

682
00:39:23,820 --> 00:39:27,199
నేను రస్ కలిసింది అలాగే.
అతనికి నకిలీ ప్లేట్ రాసిచ్చాను.

683
00:39:27,574 --> 00:39:28,658
నీ దుంప తెగ.

684
00:39:29,659 --> 00:39:32,913
-అది సరే. ఇక్కడ పోలీసులున్నారు.
-నేనూ అదే విన్నాను.

685
00:39:32,996 --> 00:39:34,915
ఏదైనా గుర్తింపు చూపించు.

686
00:39:34,998 --> 00:39:36,124
పోయి చావు.

687
00:39:36,917 --> 00:39:39,211
ఆ పనికిమాలిన దానితో నా నాలుక గీసుకుంటాను.

688
00:39:39,294 --> 00:39:42,547
స్వతంత్రుడికి ప్రభుత్వం ఇచ్చిన
గుర్తింపు కార్డు అక్కర్లేదు.

689
00:39:49,763 --> 00:39:50,806
నువ్వు తాగుతావా?

690
00:39:51,181 --> 00:39:52,349
తప్పకుండా.

691
00:39:54,601 --> 00:39:58,188
కనోగా పార్కులో ఒక పానశాల ఉంది.

692
00:39:59,147 --> 00:40:02,317
బార్‌టెండర్ మందు చాలా ఎక్కువ పోస్తాడు.

693
00:40:02,400 --> 00:40:04,194
నేను వెళ్ళి చూస్తాను.

694
00:40:06,446 --> 00:40:08,198
హే! ధన్యవాదాలు, సోదరా.

695
00:40:08,281 --> 00:40:09,533
స్వతంత్ర వ్యక్తులు

696
00:40:09,616 --> 00:40:10,867
బార్బెక్యూ ఎలా ఉంది?

697
00:40:10,951 --> 00:40:12,994
అది ఎంత ఘోరంగా ఉండొచ్చు?

698
00:40:13,745 --> 00:40:15,330
-మళ్ళీ కలుద్దాం.
-మళ్ళీ కలుద్దాం.

699
00:40:24,756 --> 00:40:28,260
ఏదైనా తేడా వచ్చిందంటే నా పని అయిపోయినట్లే.

700
00:40:29,928 --> 00:40:32,681
మహా నాయకులు సంక్షోభంలోనే రాటుదేలుతారు.

701
00:40:35,809 --> 00:40:37,686
అది స్వలాభం కోసం
చేస్తున్నట్లు అనిపిస్తుందని తెలుసు.

702
00:40:39,062 --> 00:40:42,274
వాస్తవానికి అన్నిటికీ మించి
ఈ నగర పౌరుల గురించి ఆందోళన చెందుతున్నాను.

703
00:40:42,399 --> 00:40:46,278
నాకు తెలుసు. వాళ్లకు కూడా తెలుసు.

704
00:40:58,248 --> 00:40:59,749
కచ్చితంగా నీకు వద్దా?

705
00:40:59,833 --> 00:41:01,626
మనకు ఇది కావాలని దేవుడికి తెలుసు.

706
00:41:01,710 --> 00:41:02,586
నేను తాగలేను.

707
00:41:03,545 --> 00:41:04,379
ఎందుకు తాగలేవు?

708
00:41:05,964 --> 00:41:07,424
నేను గర్భవతిని.

709
00:41:27,819 --> 00:41:28,945
నేను...

710
00:41:32,282 --> 00:41:33,533
ఆశ్చర్యపోయాను.

711
00:41:34,409 --> 00:41:35,493
నేను కూడా.

712
00:41:37,621 --> 00:41:39,331
లోపం లేనిది ఏదీ లేదు.

713
00:41:40,916 --> 00:41:42,584
ఆశ్చర్యపోవడం కాకుండా?

714
00:41:43,919 --> 00:41:45,253
నాకు తెలియదు.

715
00:41:50,550 --> 00:41:52,928
జూన్, నాకు ఆ బిడ్డకు తాత వయసుంటుంది.

716
00:41:53,136 --> 00:41:55,597
-ఎవరు పట్టించుకుంటారు?
-పాపనో బాబో పట్టించుకోవచ్చు.

717
00:41:56,514 --> 00:41:57,682
వాడు పట్టించుకోడు.

718
00:41:59,059 --> 00:42:00,393
వాడా?

719
00:42:04,105 --> 00:42:05,273
వాడు.

720
00:42:13,448 --> 00:42:15,408
అంతా అయోమయంగా ఉంది.

721
00:42:15,492 --> 00:42:18,578
మన్నించు, నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు.

722
00:42:24,876 --> 00:42:27,128
బంగారం, నువ్వు
ఈ పట్టణం నుండి వెళ్లిపోవాలి.

723
00:42:27,212 --> 00:42:28,129
పిచ్చిగా మాట్లాడకు.

724
00:42:28,213 --> 00:42:31,800
కొన్ని రోజులే, ఇది ముగిసే వరకు.

725
00:42:31,883 --> 00:42:35,053
ఓక్లాండ్‌లోని మా ఆంటీకి
ఫోన్ చేయవచ్చనుకుంటా.

726
00:42:35,512 --> 00:42:38,056
అవును, ఆ పని చేయి. ఆమెకు ఫోన్ చేయి.

727
00:42:46,773 --> 00:42:48,066
కాల్ వస్తుంది
బోష్

728
00:42:52,070 --> 00:42:53,697
నువ్వు ఎక్కడ తగలబడ్డావు?

729
00:43:19,264 --> 00:43:22,142
-ఎక్కువ సేపు పట్టింది.
-లెక్క తప్పు వచ్చింది.

730
00:43:22,225 --> 00:43:24,019
ఇక్కడి నుండి వెళ్లి పోదాం పద.

731
00:43:26,938 --> 00:43:28,606
తెలివి తక్కువ దద్దమ్మ.

732
00:43:32,902 --> 00:43:35,780
ఆగు, ఇద్దరు జమైకన్‌లు.

733
00:43:39,659 --> 00:43:41,578
-ఏంటి సంగతి, దోస్త్?
-ఏంటి సంగతి?

734
00:43:46,166 --> 00:43:48,001
ఇప్పుడు ఇది సున్నా.

735
00:44:08,605 --> 00:44:09,898
నా ఫోన్.

736
00:44:11,024 --> 00:44:12,192
హలో?

737
00:44:14,319 --> 00:44:15,945
దారిలో ఉన్నాను.

738
00:44:16,738 --> 00:44:18,198
నువ్వు వెళ్లాలా?

739
00:44:18,281 --> 00:44:19,616
నువ్వు కూడా.

740
00:44:19,908 --> 00:44:21,076
ఏంటి?

741
00:44:42,639 --> 00:44:44,140
బెనెట్.

742
00:44:54,317 --> 00:44:55,652
ఇప్పుడు ఇది మాది.

743
00:44:56,319 --> 00:44:58,238
మీకు అంతర్గత వ్యవహారాల విభాగం నుండి
ఏది కావాలంటే అది.

744
00:45:00,949 --> 00:45:02,283
సాక్షులు ఉన్నారా?

745
00:45:02,367 --> 00:45:05,370
డజన్ల కొద్దీ. కానీ ఎవరు నోరు విప్పడం లేదు.

746
00:45:18,341 --> 00:45:19,384
మన్నించు.

747
00:45:20,802 --> 00:45:23,555
మిన్ను విరిగి మీద పడుతుంది.
నేను ఘటనా స్థలానికి వెళ్ళాలి.

748
00:45:24,722 --> 00:45:26,933
ఈ ఇద్దరు డిటెక్టివ్‌లు,

749
00:45:27,016 --> 00:45:28,393
వాళ్లు నీకు తెలుసా?

750
00:45:29,227 --> 00:45:30,770
జె. ఎడ్గర్ వాళ్ల గురించి ప్రస్తావించాడు.

751
00:45:30,854 --> 00:45:32,272
విచారణ జరుగుతోందా?

752
00:45:33,440 --> 00:45:35,859
దానికి దీనికి సంబంధం ఉందో లేదో
ఇప్పుడే చెప్పలేం.

753
00:45:35,942 --> 00:45:37,235
మీకు ఆలస్యం చేయను.

754
00:45:38,194 --> 00:45:39,737
నీకు సీజియం గురించి
ఏమైనా ఆధారాలు దొరికాయా?

755
00:45:39,821 --> 00:45:43,783
బహుశా. తమను తాము 308 అని
పిలుచుకునే సార్వభౌమ పౌరుల ముఠా.

756
00:45:43,867 --> 00:45:45,326
ఎఫ్‌బీఐ ఏజెంట్లు కూడా
వారి గురించి పరిశోధిస్తున్నారా?

757
00:45:46,744 --> 00:45:50,415
మనం అనుకోవచ్చు, కానీ అది ఎలా ఉంటుందో
మీకు తెలుసు. ఎఫ్‌బీఐ ఏజెంట్లు.

758
00:45:51,249 --> 00:45:53,668
వీలయినంత సమాచారం నీకు అందిస్తాను.
దానిపై పని చేస్తూ ఉండు.

759
00:45:54,669 --> 00:45:55,837
ఇంకా, బోష్...

760
00:45:57,172 --> 00:45:58,882
నువ్వు నాకు సమాచారం అందిస్తూ ఉండు.

