1
00:00:07,216 --> 00:00:08,634
నేను కచ్చితంగా వస్తాను.

2
00:00:09,135 --> 00:00:11,971
నాకు తెలిసిన వ్యక్తికి చెప్పి
టేబుల్ బుక్ చేయమన్నాను.

3
00:00:13,097 --> 00:00:14,515
ఈ రాత్రికి కాల్ చేస్తాను, బేబి.

4
00:00:18,060 --> 00:00:20,563
"ప్లీజ్ బేబి, నాకొక వ్యక్తి తెలుసు."

5
00:00:21,313 --> 00:00:22,356
గ్యాస్ కార్డ్ తీసుకోవడం గుర్తుందా,

6
00:00:22,440 --> 00:00:23,733
లేక వెనక్కు తిరిగిరాగానే నీ మ్యాటర్
ప్లాన్స్...

7
00:00:23,816 --> 00:00:25,526
...మాత్రమే ప్లాన్ చేసుకుంటున్నావా?

8
00:00:25,609 --> 00:00:27,278
చూడు హ్యారీ, నీలాంటి సన్నాసులకు...

9
00:00:27,361 --> 00:00:28,654
అర్ధం కాదు, అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో.

10
00:00:28,738 --> 00:00:31,782
ఎన్నో కబుర్లు చెబితే కాని పనవ్వద్దు,
గ్యాస్ కార్డ్ కూడా తీసుకున్నాను.

11
00:00:31,866 --> 00:00:35,202
ఇంకెందుకు ఆలస్యం? సాయంత్రంలోగా
ఎడారి దాటాలి.

12
00:00:35,286 --> 00:00:37,204
బోష్ మాట్లాడుతున్నాను.

13
00:00:38,372 --> 00:00:40,624
ఎప్పుడు? వెనక్కు పంపించండి.

14
00:00:42,668 --> 00:00:44,837
-నాష్. -కేసు సాల్వ్ చేసానని మనతో
చెప్పడానికి వస్తున్నాడా?

15
00:00:47,757 --> 00:00:48,758
కార్ల్.

16
00:00:51,385 --> 00:00:53,846
ఫోన్ చేయాల్సింది, ఇప్పుడే వెగాస్
బయలుదేరబోతున్నాం.

17
00:00:53,929 --> 00:00:54,972
నీ వ్యక్తిని పట్టుకోవడానికి వెళ్తున్నారా?

18
00:00:55,055 --> 00:00:57,016
ఎక్స్ట్రాడిషన్ గురించి హియరింగ్ రేపు
పొద్దున్న ఉంది.

19
00:00:57,099 --> 00:00:59,059
నీకు ఒక్క నిమిషం టైం ఉంటే ఆ విషయం
గురించే మాట్లాడడానికి వచ్చాను.

20
00:00:59,143 --> 00:01:01,103
-ఒక్క నిమిషం, తప్పకుండా.
-కొంచెం పక్కకు పోయి మాట్లాడుదామా?

21
00:01:05,357 --> 00:01:06,358
సీటు తీసుకో.

22
00:01:08,068 --> 00:01:12,323
నిన్న నువ్వు టోని అలెన్ గురించి అడిగావు
గుర్తుందా?

23
00:01:15,117 --> 00:01:16,035
ఉంది.

24
00:01:18,120 --> 00:01:19,663
ఏం చెప్పాలనుకుంటున్నావ్?
అప్పుడు ఎందుకు వెళ్లిపోయావ్?

25
00:01:20,539 --> 00:01:21,624
ఓకే.

26
00:01:21,707 --> 00:01:23,834
ఆరు నెలల క్రితం
నేను ఒక రోజు రౌండ్స్ కు వెళ్ళాను.

27
00:01:24,376 --> 00:01:28,130
చల్లని సాయంత్రం, నా కార్ అద్దాలు దించి
ఉన్నాయి. అలెన్ ఇల్లు దాటుతున్నాను,

28
00:01:29,089 --> 00:01:31,258
లోపలి నుండి అరుపులు వినపడ్డాయి.

29
00:01:31,342 --> 00:01:33,677
ఇద్దరు మనషులు, తగాదా పడుతున్నట్టు
అనిపించింది.

30
00:01:33,761 --> 00:01:35,221
అయితే నువ్వు లోపలికి వెళ్ళి
చూడాలనుకున్నావు.

31
00:01:35,304 --> 00:01:39,058
అవును, కార్ పార్క్ చేసి అలెన్ ఇంటి వైపు
వెళ్ళాను.

32
00:01:39,141 --> 00:01:43,604
అలెన్, ఇంకో వ్యక్తి లోపల ఉన్నారు,
చూడడానికి హోం ఆఫీస్ లాగా ఉంది.

33
00:01:44,104 --> 00:01:45,189
దేని గురించి తగాదా పడుతున్నారో చెప్పగలవా?

34
00:01:45,856 --> 00:01:46,774
డబ్బు.

35
00:01:47,149 --> 00:01:49,735
ఇంకో వ్యక్తి నా డబ్బెక్కడ? నా డబ్బెక్కడ?
అని అరుస్తున్నాడు.

36
00:01:49,819 --> 00:01:52,947
అలెన్ "నేను నిన్ను మోసం చేయలేదు, దేవుడి
మీద ఒట్టు." అంటూ ప్రాధేయపడుతున్నాడు.

37
00:01:53,030 --> 00:01:54,031
ఇంకో వ్యక్తి? గేటు దగ్గర పేరు రిజిస్టర్
రాసాడా?

38
00:01:54,406 --> 00:01:57,785
నేను లాగ్ మొత్తం చెక్ చేసాను, ఆ రాత్రి
అలెన్ ఇంటికి ఎవరు వచ్చినట్టు సంతకం లేదు.

39
00:01:58,410 --> 00:01:59,995
అయితే, తను టోనీతో పాటు వచ్చి ఉంటాడు.

40
00:02:00,079 --> 00:02:01,705
అయితే ఇప్పుడు ఇది నాకెందుకు చెబుతున్నావు?

41
00:02:03,249 --> 00:02:07,002
రేపు నువ్వెవరినో అరెస్ట్ చేయడానికి వెగాస్
వెళ్తున్నావని తెలిసింది...

42
00:02:07,086 --> 00:02:09,630
మనమెప్పుడు నేరాలు చేసే వ్యక్తుల
గురించి మాట్లాడుకుంటాం కదా,

43
00:02:09,713 --> 00:02:12,633
అప్పుడు అలెన్ తో పోట్లాడినవాడు
గుర్తొచ్చాడు.

44
00:02:13,133 --> 00:02:15,219
వాడు కూడా నేరం చేయగల మనిషే అనిపించింది.

45
00:02:15,302 --> 00:02:16,428
వెగాస్ మనిషిలాగా ఉన్నాడా?

46
00:02:16,512 --> 00:02:18,848
అవును, చూడడానికి అలాగే గ్యాంగ్ స్టర్ లాగా
ఉన్నాడు.

47
00:02:19,223 --> 00:02:20,683
వాన్ని గుర్తుపట్టగలవా?

48
00:02:21,767 --> 00:02:23,018
అనుకుంటున్నాను.

49
00:02:24,186 --> 00:02:25,145
నాతో రా.

50
00:02:28,482 --> 00:02:29,567
వీళ్ళెవరు కాదు.

51
00:02:29,650 --> 00:02:30,901
-సరిగ్గా చూసావా?
-చూసాను.

52
00:02:32,903 --> 00:02:34,613
వీడే, నేను చూసింది.

53
00:02:35,364 --> 00:02:37,032
-కచ్చితంగా చెప్పగలవా?
-అనుమానమే లేదు.

54
00:02:38,200 --> 00:02:40,536
ఓకే, మేము చూస్తాం.
నిజంగా ధన్యవాదాలు.

55
00:02:40,619 --> 00:02:41,620
థాంక్స్, నేను కరక్టేనా...

56
00:02:41,704 --> 00:02:43,247
వాడు అలాంటోడే కదా?

57
00:02:43,914 --> 00:02:46,000
మేము మాట్లాడినప్పుడు గొడవ గురించి
అడుగుతాము.

58
00:02:47,293 --> 00:02:48,377
ఓకే.

59
00:02:49,879 --> 00:02:52,590
నేను బయలుదేరుతాను...వెగాస్ లో మీకంతా
మంచే జరగాలి.

60
00:02:52,673 --> 00:02:54,049
-థాంక్స్.
-యా.

61
00:02:54,133 --> 00:02:56,093
-ఈ విషయం చెప్పినందుకు థాంక్స్.
-యా, జాగ్రత్తగా వెళ్ళండి.

62
00:03:04,101 --> 00:03:05,227
జోయి మార్క్స్

63
00:03:30,419 --> 00:03:33,005
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

64
00:03:33,088 --> 00:03:35,215
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

65
00:03:35,549 --> 00:03:37,760
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

66
00:03:38,385 --> 00:03:40,471
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

67
00:03:41,138 --> 00:03:43,307
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

68
00:03:43,849 --> 00:03:45,893
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

69
00:03:46,310 --> 00:03:48,604
నాకు వదిలెయ్యాలని అనిపించట్లేదు

70
00:03:48,687 --> 00:03:50,022
నేను వదిలెయ్యను

71
00:03:56,028 --> 00:03:59,198
బోష్

72
00:04:03,077 --> 00:04:05,245
నాలాగే

73
00:04:16,340 --> 00:04:17,591
మనకు టైముందా?

74
00:04:17,675 --> 00:04:19,009
మూడు గంటల వరకు చెక్ ఇన్ కాలేము.

75
00:04:19,093 --> 00:04:20,844
మన దగ్గర రైకోవ్ ఉన్నాడు

76
00:04:20,928 --> 00:04:24,640
అవును పళ్ళెంలో వడ్డించిన పంది మాసంలాగా,
అంతా ఎఫ్.బీ.ఐ దయ

77
00:04:24,723 --> 00:04:26,225
ఫెడ్స్ ఈ విషయంలో చాలా బాగా పని చేసారు.

78
00:04:27,309 --> 00:04:30,354
రైకోవ్ మార్క్స్ ను ఇస్తాడు. మార్క్స్
రష్యన్స్ గురించి ఏదైనా చెబుతాడు.

79
00:04:30,437 --> 00:04:32,731
ఆ సమాచారం తీవ్రవాదులకు వ్యతిరేకంగా
జరిగే పోరాటంలో ఉపయోగపడొచ్చు.

80
00:04:32,815 --> 00:04:33,732
కచ్చితంగా.

81
00:04:33,816 --> 00:04:36,694
కాని లైలా ను ఎలాగైనా పట్టుకొని
దానికి ఏం తెలుసో కనుక్కోవాలి.

82
00:04:37,277 --> 00:04:38,821
ఇవన్ని చూడడానికి ఇళ్ళలాగా ఉన్నాయి.

83
00:04:38,904 --> 00:04:41,615
అవును, కాని టోనీ ట్యాక్స్ పేపర్స్ మీద
ఆఫీస్ అని రాసాడు.

84
00:04:42,157 --> 00:04:43,492
అప్పటి నుండి ఏం వింటున్నావు?

85
00:04:43,909 --> 00:04:47,162
సోనీ రోలీన్స్, మైల్స్ డేవిస్ ఆల్బం ఆల్బం
బ్యాగ్

86
00:04:47,246 --> 00:04:49,415
బాగుంది, ఆల్బం పేరు?

87
00:04:49,498 --> 00:04:51,458
"డాక్సీ." సోనీ రాసాడు.

88
00:04:52,084 --> 00:04:54,128
-నీకు మ్యూజిక్ గురించి బాగా తెలుసు కదా.
-కొంచెం తెలుసు.

89
00:04:54,211 --> 00:04:55,879
ఎప్పుడూ పాతవేనా, కొత్తవేమైనా వింటుంటావా?

90
00:04:55,963 --> 00:04:57,673
వినడానికి ప్రయత్నిస్తున్నాను.

91
00:04:57,756 --> 00:04:59,008
పక్కన ఆపు, ఇదే.

92
00:05:14,898 --> 00:05:15,816
ఏదో ఆఫీస్.

93
00:05:26,493 --> 00:05:27,953
ఇది జీవితమంటే, ఏమంటావు హ్యారీ?

94
00:05:28,037 --> 00:05:29,121
మనమెక్కడ తప్పు చేసాం?

95
00:05:29,204 --> 00:05:31,582
మనం కూడా పూల్ పక్కన ఈ అమ్మాయిలతో
గడపాల్సిన వాళ్ళం.

96
00:05:31,665 --> 00:05:33,959
నిజంగా వారంట్ అవసరం లేదా?

97
00:05:34,043 --> 00:05:35,669
లేదు, తనతో మాట్లాడాలి.

98
00:05:35,753 --> 00:05:38,172
ఈ మధ్యే హత్యకు గురికాబడ్డ ఒక వ్యక్తితో
తనకు లైంగిక సంభందం ఉంది.

99
00:05:38,255 --> 00:05:40,257
హత్యా? బాబోయ్.

100
00:05:40,591 --> 00:05:41,800
తనెలా ఉందో కనుక్కోవడానికి వచ్చాం.

101
00:05:41,884 --> 00:05:44,094
తప్పకుండా, బాగానే ఉండాలని
ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను.

102
00:05:46,096 --> 00:05:47,431
చివరి సారి ఎప్పుడు చూసారు?

103
00:05:47,514 --> 00:05:49,641
పది రోజులు లేదా రెండు వారాలు అయి ఉంటుంది.

104
00:05:49,725 --> 00:05:50,893
తను రెంట్ ఎలా పే చేస్తుంది?

105
00:05:50,976 --> 00:05:52,728
నెల మొదట్లోనే డిపాజిట్ చేస్తుంది...

106
00:05:52,811 --> 00:05:54,646
వచ్చే నెల నుండి ఉండకపోవచ్చు.

107
00:05:54,730 --> 00:05:56,482
నాకు కూడా తను వెనక్కు వచ్చేలాగ
అనిపించటం లేదు.

108
00:05:56,565 --> 00:05:58,525
తను ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా
ఫాం నింపిందా?

109
00:05:58,609 --> 00:06:00,277
కొన్ని కాగితాలు నింపింది.

110
00:06:00,360 --> 00:06:01,570
ఒకసారి ఆ కాగితాలు చూడాలి.

111
00:06:01,653 --> 00:06:02,654
నా ఆఫీసులో ఉన్నాయి.

112
00:06:02,738 --> 00:06:04,448
బయటకు వెళ్ళేప్పుడు చూస్తాం. థాంక్స్

113
00:06:06,909 --> 00:06:08,952
పూల్ పక్కన అమ్మాయిలను ఎప్పుడు
ఇంటర్వ్యూ చేద్దాం హ్యారీ?

114
00:06:10,954 --> 00:06:12,331
పాత్రలు కడగకుండా వదిలేసింది.

115
00:06:15,459 --> 00:06:18,712
సెల్ ఫోన్ ఆపేసి సింకులో పడేసింది,
అందుకే మనకు తన లొకేషన్ దొరకలేదు.

116
00:06:19,338 --> 00:06:20,297
తెలివైంది.

117
00:06:25,219 --> 00:06:26,136
అవేమిటి?

118
00:06:26,929 --> 00:06:29,640
అర్మేనియన్ భాషలో ఉన్నాయి,
ఏదో మతపరమైనది కావచ్చు

119
00:06:32,351 --> 00:06:34,728
చిన్నపాప లైలా. వెనక బామ్మ కావచ్చు?

120
00:06:35,229 --> 00:06:38,148
అదైతే ఎల్.ఏ కాదు...ఏదో పాత టౌన్.

121
00:06:54,957 --> 00:06:55,874
నన్ను గుర్తుపట్టారా?

122
00:07:00,170 --> 00:07:02,840
లక్కీ ని కొట్టిన వెదవవు నువ్వే కదా.

123
00:07:02,923 --> 00:07:04,133
మేము లైలా కోసం చూస్తున్నాం.

124
00:07:04,633 --> 00:07:06,927
-తన రూంలో చూడండి?
-ఎక్కువ మాట్లాడకు, తను లేదని నీకు తెలుసు.

125
00:07:07,010 --> 00:07:09,054
-ఎక్కడి వెళ్ళింది?
-నాకు తెలియదు.

126
00:07:09,388 --> 00:07:11,598
టోనీ చనిపోయాడని తెలియగానే వెళ్ళిపోయింది.

127
00:07:11,682 --> 00:07:12,933
-తను వెళ్ళడం నువ్వు చూసావా?
-లేదు.

128
00:07:13,016 --> 00:07:14,059
మరి నీకెలా తెలుసు?

129
00:07:14,852 --> 00:07:16,436
తన కార్ కనబడలేదు!

130
00:07:16,520 --> 00:07:17,980
ఎక్కడికి పోయుంటుంది?

131
00:07:19,231 --> 00:07:21,441
తన దేవుడు కూడా పోయాడు కదా? ఎవరికి తెలుసు?

132
00:07:21,525 --> 00:07:22,943
దేవుడని ఎందుకన్నావ్?

133
00:07:23,026 --> 00:07:26,238
నార్త్ వెగాస్ లో విదేశీ అమ్మాయిలతో కలిసి
నీచమైన చోట పని చేస్తుంటే...

134
00:07:27,364 --> 00:07:29,741
టోనీ తనను బయటకు లాగి కాపాడాడు.

135
00:07:29,825 --> 00:07:30,993
వేశ్యా గృహమా?

136
00:07:31,410 --> 00:07:33,036
అలాంటిదే.

137
00:07:35,873 --> 00:07:37,833
ఇంకా డీటెయిల్స్ కోసం చూస్తున్నాం.

138
00:07:37,916 --> 00:07:38,959
ఎప్పుడు?

139
00:07:39,626 --> 00:07:41,753
ఈ రాత్రికి.
వాళ్ళే కాల్ చేసి చెబుతామన్నారు.

140
00:07:41,837 --> 00:07:43,463
'మో' గురించి ఏమైనా తెలిసిందా?

141
00:07:44,047 --> 00:07:45,757
యా, అదే పని మీద ఉన్నాను.

142
00:07:46,884 --> 00:07:50,220
తన అసలు పేరు మరీన్ ఓ గ్రేడీ అని తెలిసింది.

143
00:07:50,721 --> 00:07:52,556
మంచి పోలీస్ ఆఫీసర్.

144
00:07:53,056 --> 00:07:54,266
గుడ్ వర్క్.

145
00:07:54,349 --> 00:07:55,642
ఇప్పుడే కదా మొదలు పెట్టింది.

146
00:07:56,059 --> 00:07:58,228
చూద్దాం ఈ రాత్రి పార్టీలో ఎవరు కనబడతారో.

147
00:07:58,729 --> 00:08:01,064
-లా ను ఎప్పుడు కలుస్తున్నావు మళ్ళీ?
-రెండు రోజుల తరువాత.

148
00:08:02,900 --> 00:08:04,526
చేసే పని నీకు నచ్చుతుందా?

149
00:08:04,610 --> 00:08:05,652
నచ్చుతుంది.

150
00:08:09,406 --> 00:08:10,365
చూడు, నాకు...

151
00:08:11,074 --> 00:08:14,203
నాకు తెలుసు, నా నీడ నుండి బయటపడి, నీకంటూ
డిపార్ట్మెంట్లో,

152
00:08:14,286 --> 00:08:16,455
ఒక గుర్తింపు తెచ్చుకోవడం కష్టంగానే
ఉంటుంది.

153
00:08:20,042 --> 00:08:23,754
ఈ కేసు నాకొక మంచి అవకాశం
నన్ను నిరూపించుకోవడానికి.

154
00:08:23,837 --> 00:08:26,381
ఏమైనా చేసి, ఆ దొంగ నా కొడుకును పట్టుకుంటే.

155
00:08:26,465 --> 00:08:27,883
నాకు నమ్మకం ఉంది.

156
00:08:32,971 --> 00:08:33,931
వెల్, థాంక్స్.

157
00:08:41,605 --> 00:08:43,565
ఇది నీకు బ్రోతల్ హౌస్ లాగా కనబడుతుందా?

158
00:08:43,649 --> 00:08:45,859
కాని ఇదే అడ్రస్ ఉంది తన రెంటల్
అప్లికేషన్లో.

159
00:08:45,943 --> 00:08:47,027
పూల్ కూడా లేదు.

160
00:08:59,790 --> 00:09:00,999
అందరూ జాగ్రత్తగా వినండి.

161
00:09:01,875 --> 00:09:03,961
మేము లైలా అనే అమ్మాయికోసం చూస్తున్నాం.

162
00:09:04,628 --> 00:09:06,505
తను ఇక్కడే ఉండి పనిచేసేది.

163
00:09:06,588 --> 00:09:07,923
మర్యాదగా నోరు మూసుకొని కూర్చోండి

164
00:09:08,006 --> 00:09:09,967
తనెక్కడ ఉందో తెలుసా?
తనతో మాట్లాడాలి.

165
00:09:10,050 --> 00:09:12,261
తెలియదని చెప్పండి లేకపోతే మార్క్స్ కు
చెబుతాను.

166
00:09:12,344 --> 00:09:13,887
వాడు మీ నాలుకలు కోస్తాడు.

167
00:09:13,971 --> 00:09:16,181
నువ్వు మార్క్స్ కోసం పనిచేస్తావు.
ఇది వాడి ప్లేసు.

168
00:09:16,265 --> 00:09:17,391
ఇది నా ప్లేస్.

169
00:09:19,142 --> 00:09:21,144
హే, బయటకు వెళ్ళిపో, వెళ్ళు.

170
00:09:22,104 --> 00:09:23,188
చూడు, నువ్వు ఇలాగే కథలు చెబుతుంటే

171
00:09:23,272 --> 00:09:24,273
రోజంతా ఇక్కడే కూర్చొని వింటాను. నాకు వేరే
పని లేదు.

172
00:09:24,356 --> 00:09:26,441
బిజినెస్ ఏమైందని మార్క్స్ అడిగితే
నువ్వు...

173
00:09:26,525 --> 00:09:28,068
చిక్కుల్లో పడతావు.

174
00:09:30,696 --> 00:09:33,156
మీరు వెతుకుతున్న లైలా.

175
00:09:33,240 --> 00:09:36,076
తను చాలా క్రితమే వెళ్ళిపోయింది,
రెండు సంవత్సరాలయ్యింది.

176
00:09:36,159 --> 00:09:38,120
-ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? -తనొక డ్యాన్సర్,
స్ట్రిప్ క్లబ్ వెళ్లుంటుంది.

177
00:09:38,203 --> 00:09:39,246
డాలీస్?

178
00:09:39,329 --> 00:09:40,539
తనకొక వ్యక్తి కలిసాడు.

179
00:09:40,622 --> 00:09:42,082
నీ నోరు మూసుకో.

180
00:09:42,457 --> 00:09:45,085
నువ్వే మూసుకో, లేదా నువ్వు పోలీసులతో
మాట్లాడావని మార్క్స్ తో చెబుతాను.

181
00:09:45,168 --> 00:09:46,253
పిచ్చిదనా.

182
00:09:46,336 --> 00:09:47,170
అవ్లా పిచ్చిదనా.

183
00:09:47,254 --> 00:09:48,297
కస్టమర్?

184
00:09:48,380 --> 00:09:50,424
కస్టమర్ లిలిత్తో ప్రేమలో పడ్డాడు.

185
00:09:50,507 --> 00:09:51,758
లిలిత్? అది తన అసలు పేరా?

186
00:09:51,842 --> 00:09:53,385
లిలిత్ సరోయన్.

187
00:09:53,468 --> 00:09:54,720
పిచ్చిదనా, నోరుమూయ్యవే.

188
00:09:55,345 --> 00:09:56,430
నువ్వే నోరు మూసుకో.

189
00:09:56,513 --> 00:09:57,931
లిలిత్ సరోయన్, ఎక్కడ ఉందో తెలుసా?

190
00:09:58,307 --> 00:10:01,226
నాకు తెలియదు, వెళ్ళిపొండి.

191
00:10:02,894 --> 00:10:04,187
అవ్లా దాన.

192
00:10:04,271 --> 00:10:05,105
ఇక్కడి నుండి వెళ్ళిపో!

193
00:10:06,398 --> 00:10:08,150
పాపం వాళ్ళ పరిస్థితి చూసి జాలేసింది.

194
00:10:08,734 --> 00:10:10,652
వీళ్ళను బలవంతంగా తీసుకొని వచ్చుంటారా?

195
00:10:10,736 --> 00:10:12,237
ఎవరో ఒకరు వీళ్ళతో మాట్లాడి,

196
00:10:12,321 --> 00:10:15,741
వీళ్ళను బలవంతంగా ఉంచారా? పాస్పోర్టులు ఎవరి
దగ్గర ఉన్నాయో కనుక్కోవాలి.

197
00:10:15,824 --> 00:10:17,159
మరి జోయ్ మార్క్స్?

198
00:10:17,242 --> 00:10:20,245
ఇది వాడి ప్లేసే,
ఫెల్టన్ ను చూసుకోమని చెబుతాను.

199
00:10:20,954 --> 00:10:23,623
ఇక్కడ మనుషులెలా బ్రతుకుతారు?
మొత్తం ఎడారే.

200
00:10:24,041 --> 00:10:25,250
ఎల్.ఏ కూడా ఎడారే.

201
00:10:25,334 --> 00:10:27,336
-కాని పక్కనే సముద్రం ఉంది.
-అయినా కూడా ఎడారే.

202
00:10:27,711 --> 00:10:29,046
నీకు ఎల్.ఏ అంటే ఇష్టం అనుకున్నాను?

203
00:10:29,129 --> 00:10:31,048
ఇష్టమే,
అయినంత మాత్రాన ఎడారి కాకుండా పోదు కదా.

204
00:11:09,628 --> 00:11:11,254
హే, కొత్త కళ్ళజోళ్ళు తీసుకుందామా?

205
00:11:12,297 --> 00:11:13,423
రే-బాన్స్?

206
00:11:13,840 --> 00:11:16,593
నువ్వు మీ నాన్నలాగే.

207
00:11:16,676 --> 00:11:17,719
అవును.

208
00:11:18,845 --> 00:11:22,349
చూడు, అక్కడ ఒక ఆప్టికల్ షాప్ ఉంది,
మెట్ల గుండా పోదాం.

209
00:11:22,891 --> 00:11:24,351
మూడో ఫ్లోర్లో ఉంది. నడుద్దాం పద.

210
00:11:24,434 --> 00:11:25,977
కొంచెం వ్యాయామం కూడా అవుతుంది.

211
00:11:26,061 --> 00:11:27,437
నేను చాలా వ్యాయామం చేస్తాను.

212
00:11:27,521 --> 00:11:30,482
అవును, ఫోన్ నొక్కి నొక్కి నీ వేళ్ళు చాలా
గట్టిబడ్డాయి.

213
00:11:31,108 --> 00:11:32,067
జోకులా.

214
00:11:33,443 --> 00:11:35,153
-పందెం పెట్టుకుందామా?
-వద్దు తల్లి.

215
00:11:58,593 --> 00:11:59,719
ఇంకేమైనా కావాలా?

216
00:12:00,053 --> 00:12:02,389
వద్దు నాక్కావలసినవన్నీ తీసుకున్నాను .

217
00:12:02,764 --> 00:12:04,724
-గుడ్ డే ఆఫీసర్.
-ఆల్ రైట్.

218
00:12:07,561 --> 00:12:08,603
పోరా గుండు.

219
00:12:40,594 --> 00:12:43,597
హే, మీరు జార్జ్ కు కాల్ చేసారు.
మెసేజ్ వదిలేయండి, నేను కాల్ చేస్తాను.

220
00:12:45,265 --> 00:12:46,224
హే.

221
00:12:47,684 --> 00:12:49,895
అవకాశం దొరికినప్పుడు నాకు కాల్ చెయ్?

222
00:12:49,978 --> 00:12:52,272
ఈ రాత్రికి నీ ప్లాన్స్ ఏంటో
కనుక్కోమంది మీ అమ్మ.

223
00:12:58,945 --> 00:13:01,698
కావలసిన వస్తువలన్ని కొనుక్కున్నావా?

224
00:13:01,781 --> 00:13:04,034
కొనుకున్నాను.
ఇంకా కొన్ని దొరకలేదు.

225
00:13:05,035 --> 00:13:06,328
పర్లేదు, ఇంకా వెతుకుదాం.

226
00:13:06,411 --> 00:13:08,288
-కాఫీ తాగుదామా?
-యా.

227
00:13:08,371 --> 00:13:09,789
-పోయే దారిలో?
-తప్పకుండా.

228
00:13:09,873 --> 00:13:11,541
-తాగుదాం.
-ఓకే, గుడ్.

229
00:14:10,308 --> 00:14:11,476
హే, నిజానికి ఈ కొత్త కాంట్రాక్ట్...

230
00:14:11,560 --> 00:14:14,187
మనిద్దరికి వేరు వేరు రూములు ఇవ్వాలని
చెప్పింది కదా.

231
00:14:14,271 --> 00:14:16,273
అవును, కాని ఎవడో దెబ్బేసాడు.

232
00:14:16,773 --> 00:14:18,692
క్రేట్,
బ్యారెల్ కన్నా నాతో కలిసుండడం బెటర్ లే.

233
00:14:18,775 --> 00:14:19,609
అవును.

234
00:14:20,694 --> 00:14:22,487
హే, జెర్రీ నీ టూత్ బ్రష్ కలర్ ఏంటి?

235
00:14:22,571 --> 00:14:23,697
నీలం, ఎందుకు?

236
00:14:25,615 --> 00:14:26,575
ఏం లేదులే.

237
00:14:29,286 --> 00:14:30,620
మీ ఫ్యామిలిని కలుస్తున్నావా ఈ రాత్రి?

238
00:14:30,704 --> 00:14:31,913
నువ్వు కూడా రా.

239
00:14:31,997 --> 00:14:33,748
నాకు వేరే పనుంది.

240
00:14:33,832 --> 00:14:35,917
-హియరింగ్ పొద్దున్నతొమ్మిదికి.
-నేను చేరుకుంటాను.

241
00:14:41,423 --> 00:14:44,009
హే, హనీ, మ్యాడి?

242
00:14:44,926 --> 00:14:45,927
డాడీ?

243
00:14:46,469 --> 00:14:50,015
మ్యాడీ, ఏమయ్యింది?
మ్యాడీ, ఏం జరుగుతుంది?

244
00:14:50,098 --> 00:14:52,058
మేము బాగానే ఉన్నాం...
అని చెప్పమంటున్నాడు

245
00:14:52,142 --> 00:14:54,185
అమ్మ నేను ఇద్దరం బాగానే...

246
00:14:54,269 --> 00:14:56,187
మ్యాడీ?మ్యాడీ?

247
00:14:56,271 --> 00:14:58,064
చెప్పేది జాగ్రత్తగా విను.

248
00:14:58,148 --> 00:14:59,566
-ఎవరు?
-హ్యారీ?

249
00:15:00,191 --> 00:15:02,485
-ఏం కావాలి నీకు?
-పోలీసులకు ఫోన్ చేయొద్దు.

250
00:15:02,569 --> 00:15:06,489
వాళ్ళకేమైనా జరిగితే నీ ప్రాణాలు తీస్తా...

251
00:15:06,573 --> 00:15:08,575
హ్యారీ? ఏమయ్యింది?
ఏం జరుగుతుంది?

252
00:15:09,826 --> 00:15:12,370
-హ్యారీ ఏం జరుగుతుంది?
-మ్యాడీ, ఎలనార్ ను ఎవరో కిడ్నాప్ చేసారు.

253
00:15:12,454 --> 00:15:14,914
-ఎవరు? ఎందుకు?
-తెలియదు, మార్క్స్.

254
00:15:14,998 --> 00:15:16,082
షిట్, వెగాస్ పోలీసులకు ఫోన్ చేద్దాం.

255
00:15:16,166 --> 00:15:18,501
వద్దు,
వద్దు పోలీసులకు ఫోన్ చేయొద్దని చెప్పాడు.

256
00:15:18,585 --> 00:15:19,669
వాళ్ళు ఎప్పుడు అలాగే అంటారు.

257
00:15:19,753 --> 00:15:23,173
చూడు, వాడు ఎవడో తెలిసేవరకు నేను
ఎలాంటి చాన్స్ తీసుకొను.

258
00:15:23,590 --> 00:15:24,591
నా మాట విను.

259
00:15:24,674 --> 00:15:26,676
ఇది మన ఊరు కూడా కాదు,
ఎక్కడి నుండి మొదలు పెట్టాలో కూడా తెలియదు.

260
00:15:26,760 --> 00:15:27,636
నాకు తెలుసు.

261
00:15:31,556 --> 00:15:33,350
-ఎక్కడికి వెళ్తున్నాం?
-ఎలనార్ ఇంటికి.

262
00:15:35,602 --> 00:15:37,729
తన దగ్గర ఒక యాప్ ఉంది...
అది మ్యాడీ ఫోన్ ట్రాక్ చేస్తుంది.

263
00:15:40,357 --> 00:15:42,317
కొంచెం చూసుకొని నడుపు.

264
00:15:51,660 --> 00:15:53,745
పైనెవరు లేరు. ల్యాప్ ట్యాప్?

265
00:15:54,204 --> 00:15:55,163
కిచెన్.

266
00:16:05,924 --> 00:16:07,759
క్లియర్. హ్యారీ, దొరికింది.

267
00:16:08,718 --> 00:16:09,803
పాస్వర్డ్ అడుగుతుంది.

268
00:16:10,845 --> 00:16:12,847
ఏ-కె-క్యూ-జే-టెన్ ప్రయత్నించు.

269
00:16:15,392 --> 00:16:18,269
జీరో, వన్, వన్, జీరో, జీరో, వన్.

270
00:16:19,562 --> 00:16:21,731
-నీకెలా తెలుసు?
-మ్యాడీ బర్త్ డే.

271
00:16:22,482 --> 00:16:23,400
పైకి జరుపు.

272
00:16:25,694 --> 00:16:26,945
అదే, ఓపెన్ చెయ్.

273
00:16:27,404 --> 00:16:30,073
అది హోమ సెక్యూరిటి సిస్టం. వెనకెళ్ళు.

274
00:16:32,242 --> 00:16:34,285
ముందుకు, ప్లే.

275
00:16:43,920 --> 00:16:46,256
మీ ఇద్దరిని చంపే వరకు వదలను కొడకల్లారా.

276
00:17:00,395 --> 00:17:03,523
ట్రాకింగ్ యాప్.
తను ఎక్కడుందో చెబుతుంది.

277
00:17:03,606 --> 00:17:05,191
తను ఫోన్ చేసాక, స్విచ్ ఆఫ్ చేసి ఉంటారు.

278
00:17:05,275 --> 00:17:08,445
కనెక్ట్ టూ రిమోట్ డివైజ్,
డివైజ్ నాట్ ఫౌండ్.

279
00:17:08,528 --> 00:17:09,487
షిట్.

280
00:17:09,571 --> 00:17:11,865
హిస్టరీ లాగ్, కాల్ చేసినప్పుడు తను
ఎక్కడుందో కనుక్కోవచ్చు.

281
00:17:16,244 --> 00:17:18,788
-అక్కడ.
-కైల్ కెనాన్ రోడ్, 157.

282
00:17:18,872 --> 00:17:19,873
ఇక్కడి నుండి 20 మైళ్ళు.

283
00:17:19,956 --> 00:17:21,082
చీకటి పడుతుంది.

284
00:17:47,317 --> 00:17:48,359
నైస్ రైడ్.

285
00:17:48,985 --> 00:17:50,153
అద్దె కారిది.

286
00:18:18,264 --> 00:18:19,140
జెర్రీ.

287
00:18:26,147 --> 00:18:27,273
ఇది మ్యాడీ ఫోన్.

288
00:18:42,914 --> 00:18:44,332
వెనకాల సంచీ ఉంది.

289
00:18:54,300 --> 00:18:56,553
ఏంటిది?

290
00:18:56,636 --> 00:18:59,597
అది క్యాన్ ఓపెనర్, మూసుకొని తీసుకోరా.

291
00:19:04,185 --> 00:19:05,353
యా, ఇవ్వెక్కడి నుండి వచ్చాయి?

292
00:19:05,436 --> 00:19:06,938
నీకెందుకు ఆ విషయాలన్నీ?

293
00:19:07,021 --> 00:19:08,731
-నాకు తెలియాలి.
-వాటితో ఏం సమస్య రాదు, సరేనా?

294
00:19:08,815 --> 00:19:11,693
అవి మేము వాడినవి కాదు...
వేరే నేరస్థులు వాడినవి.

295
00:19:13,486 --> 00:19:14,904
ఇంతకు మనం ఎక్కడికి వెళ్తున్నాం?

296
00:19:14,988 --> 00:19:18,491
డ్రాప్ హౌస్ దగ్గరికి, వారానికొకసారి పిక్
చేసుకుంటారు. అది రేపే.

297
00:19:18,575 --> 00:19:21,578
అందుకే ఈ రాత్రికి మనం లేపేయాలి.

298
00:19:21,661 --> 00:19:22,996
నువ్వు క్రౌడ్ కంట్రోల్ చేయాలి జూనియర్.

299
00:19:23,079 --> 00:19:25,498
ఎవడైనా దగ్గరికి వస్తే ఆలోచించకుండా
కాల్చేయ్, అర్ధమవుతుందా?

300
00:19:25,582 --> 00:19:26,958
యా, అవుతుంది, మో.

301
00:19:28,668 --> 00:19:29,711
అర్ధమవుతుంది.

302
00:19:36,134 --> 00:19:37,260
బోష్.

303
00:19:37,343 --> 00:19:38,303
డిటెక్టివ్.

304
00:19:39,012 --> 00:19:40,930
-ఎవరు మాట్లాడేది?
-అది నీకనవసరం.

305
00:19:41,306 --> 00:19:44,934
మార్క్స్ కు చెప్పు,
నా కుటుంబం మీద చేయి పడినా...

306
00:19:45,018 --> 00:19:47,604
ఒక గీత పడిన మీ అందరిని లేపేసి...

307
00:19:48,313 --> 00:19:50,607
శవం కూడా దొరకకుండా కాల్చి బూడిద చేస్తాను.

308
00:19:50,690 --> 00:19:55,111
కొంచెం శాంతంగా విను డిటెక్టివ్
ఎవరికి ఏమి జరగదు.

309
00:19:55,194 --> 00:19:56,321
చెప్పు వింటున్నా.

310
00:19:56,404 --> 00:20:00,325
రేపు పొద్దున్న హియరింగ్ తర్వాత రైకావ్
నీ కస్టడీలో ఉంటాడు.

311
00:20:01,075 --> 00:20:03,453
వాన్ని నువ్వు మాకు అప్పగించాలి.

312
00:20:04,746 --> 00:20:08,291
అప్పగిస్తే నా కుటుంబాన్ని
ఎలా వెనక్కు ఇస్తారు?

313
00:20:08,374 --> 00:20:10,627
మేము చెప్పినట్లు చేస్తే ఇస్తాము.

314
00:20:11,461 --> 00:20:15,173
కాలిఫోర్నియా బార్డర్ దగ్గర
లారీలు ఆగే స్టాప్ ఉంది.

315
00:20:15,506 --> 00:20:19,052
అక్కడ గ్యాస్ నింపడానికి నీ బండి పక్కకు
దింపు.

316
00:20:19,928 --> 00:20:24,641
నెవాడా స్టేట్ పోలీసులకు థాంక్స్ చెప్పి
వాళ్ళను వెనక్కు పంపించు.

317
00:20:25,016 --> 00:20:28,019
అలాగే నీ పార్ట్నర్ను కాఫీ కోసం పంపించు.

318
00:20:29,145 --> 00:20:32,065
నువ్వు ట్యాంక్ నింపేటప్పుడు
కొన్ని సంఘటనలు జరుగుతాయి.

319
00:20:32,732 --> 00:20:34,275
రైకోవ్ మాతో వస్తాడు.

320
00:20:35,318 --> 00:20:36,819
నీ కుటుంబం నీతో వస్తుంది.

321
00:20:42,909 --> 00:20:44,035
మంచిది.

322
00:20:45,662 --> 00:20:48,039
మ్యాడీ ఎలనాన్ ను వదిలేయాలంటే
రైకోవ్ కావాలంటున్నాడు మార్క్స్.

323
00:20:48,122 --> 00:20:49,707
రైకోవ్ జారిపోతాడని భయపడుతున్నాడు.

324
00:20:49,791 --> 00:20:51,668
అదే అయి ఉంటుంది...కనుక్కోవాలి.

325
00:20:51,751 --> 00:20:53,628
అయితే రైకోవ్ దగ్గర ఏదో పెద్ద విషయమే
ఉండాలి.

326
00:20:54,128 --> 00:20:55,421
వెగాస్ మెట్రోకు ఫోన్ చేద్దాం.

327
00:20:55,505 --> 00:20:56,756
వద్దు, పోలీసులు వద్దు.

328
00:20:56,839 --> 00:20:58,508
పోలీసులు కాకపోతే, ఎఫ్,బీ,ఐ కి చెబుదాం.

329
00:20:58,591 --> 00:21:01,344
ఎవరు వద్దు, ఇది నా కుటుంబం.

330
00:21:33,876 --> 00:21:34,752
వీధిని చూస్తూ ఉండు.

331
00:21:50,143 --> 00:21:51,185
షిట్.

332
00:21:53,896 --> 00:21:54,939
ఫ్లోర్ మీద పడుకోండి.

333
00:22:11,748 --> 00:22:13,332
ఏంటి? మళ్ళీ కొట్టు. పద

334
00:22:14,625 --> 00:22:15,835
పదా, పోదాం.

335
00:22:16,461 --> 00:22:17,879
పద

336
00:22:24,927 --> 00:22:26,220
వెళ్ళు, 'మొ,' వెళ్ళు.

337
00:22:26,763 --> 00:22:28,097
తలలు దించుకొండి!

338
00:22:35,730 --> 00:22:36,564
మార్క్స్.

339
00:22:39,275 --> 00:22:42,278
అతని మనుషులు నా మాజీ భార్యను,
కూతురును కిడ్నాప్ చేసారు.

340
00:22:42,361 --> 00:22:44,864
నిన్ను అప్పగిస్తే వాళ్ళను ఏమీ చేయనని
హామీ ఇచ్చాడు.

341
00:22:45,490 --> 00:22:46,949
సోదాపు, నువ్వలా చేయవని నాకు తెలుసు.

342
00:22:48,451 --> 00:22:49,494
అందుకే నాకు నీ సహాయం కావాలి.

343
00:22:49,577 --> 00:22:51,871
నా కుటుంబాన్ని వెనక్కు తెచ్చుకోవడానికి
నువ్వు నాకు ఏదైనా సమాచారం ఇవ్వు

344
00:22:51,954 --> 00:22:55,333
లేదా నిన్ను కచ్చితంగా ఆ మార్క్స్ గానికి
అప్పచెబుతాను.

345
00:23:00,129 --> 00:23:01,339
ఈ నా కొడుకులు ఎవరు?

346
00:23:06,302 --> 00:23:09,013
సోదరులు, పేర్లు సామోయాన్స్, టాం, జెర్రీ.

347
00:23:09,555 --> 00:23:11,891
వాళ్ళ పేర్లు పలకాలంటే చాలా కష్టం.

348
00:23:11,974 --> 00:23:13,142
ఎక్కడ దొరుకుతారు?

349
00:23:14,477 --> 00:23:17,230
ఎడారిలో ఒక సేఫ్ హౌస్ ఉంది...
ట్యూల్ స్ప్రింగ్స్.

350
00:23:17,313 --> 00:23:18,940
ఇలాంటి పనుల కోసం అప్పుడప్పుడు వాడుతూ
ఉంటారు.

351
00:23:19,023 --> 00:23:20,483
అక్కడికి ఎలా వెళ్ళాలో చెప్పు.

352
00:23:39,418 --> 00:23:41,629
-హలో?
-లెఫ్టినెంట్ లావ్, డిప్యూటి చీఫ్ ఇర్వింగ్.

353
00:23:42,338 --> 00:23:44,173
-చీఫ్
-నా కొడుకు ఫోన్ నేను ట్రాక్ చేస్తున్నాను.

354
00:23:44,507 --> 00:23:45,675
నీకు కాల్ ఏమైనా చేసాడా?

355
00:23:45,758 --> 00:23:47,260
అతను ప్రోటోకాల్ ఫాలో చేస్తున్నాడు, సర్.

356
00:23:47,343 --> 00:23:49,804
పొద్దున్న మెసేజ్ పంపించాను,
ఇంతవరకు రిప్లై ఇవ్వలేదు.

357
00:23:49,887 --> 00:23:51,139
మీరేం కంగారు పడాల్సిన పనిలేదు, చీఫ్.

358
00:23:51,681 --> 00:23:53,391
రేపు ఉదయం కాల్ చేస్తాడని అనుకుంటున్నాము.

359
00:23:54,016 --> 00:23:55,268
మేము కూడా ట్రాక్ చేస్తున్నాము.

360
00:23:56,519 --> 00:23:57,687
థాంక్యూ, లెఫ్టినెంట్.

361
00:24:49,739 --> 00:24:51,199
నాకేం కనబడడం లేదు.

362
00:24:53,242 --> 00:24:54,368
అందరూ లోపలే ఉన్నారు.

363
00:26:04,647 --> 00:26:06,607
ముందు రూమ్, సోఫాలో కూర్చొని ఉన్నారు.

364
00:26:07,358 --> 00:26:10,403
-సామోన్స్?
-అవును. టీవీ చూస్తున్నాడు.

365
00:26:11,487 --> 00:26:13,489
ఒకరిని కట్టేసారు...
రెండవ వ్యక్తి గురించి తెలియదు.

366
00:26:16,534 --> 00:26:17,410
నా దగ్గరొక ఉపాయం ఉంది.

367
00:26:24,333 --> 00:26:26,043
ఏం జరుగుతుంది?

368
00:26:30,840 --> 00:26:32,008
అలా కొడితే రాదు.

369
00:26:34,010 --> 00:26:35,970
నువ్వు అడ్డుంటే కనబడడం లేదు.

370
00:26:36,304 --> 00:26:37,638
మళ్ళీ గాలి గట్టిగా వస్తుందేమో.

371
00:26:37,722 --> 00:26:39,348
పోయి డిష్ చెక్ చేయి.

372
00:26:41,434 --> 00:26:42,810
వెంట గన్ తీసుకెళ్ళు.

373
00:27:10,546 --> 00:27:12,548
-టామా, జెర్రీయా?
-టాం.

374
00:27:12,631 --> 00:27:13,674
ఇంట్లో ఎవరున్నారు?

375
00:27:13,758 --> 00:27:14,800
మా అన్న

376
00:27:15,134 --> 00:27:16,052
ఇంకా ఎవరున్నారు

377
00:27:17,219 --> 00:27:19,889
-ఏం వెపన్ ఉంది తన దగ్గర?
-ఏ 44

378
00:27:56,717 --> 00:27:58,969
కదిలితే చస్తావు.

379
00:28:00,471 --> 00:28:03,265
శబ్దం చేయకుండా నేల మీద పడుకో, మెల్లగా.

380
00:28:22,118 --> 00:28:22,952
క్లియర్.

381
00:28:25,287 --> 00:28:26,580
అంతా సరిగానే ఉంది.

382
00:28:28,457 --> 00:28:29,583
అంతా సరిగానే ఉంది.

383
00:28:29,667 --> 00:28:31,585
-నాన్న!
-నీకేం కాదు బేబీ, నీకేం కాదు.

384
00:28:38,843 --> 00:28:39,969
హ్యారీ ఏం చేస్తున్నావు?

385
00:28:40,052 --> 00:28:42,471
పోలీసులకు కాల్ చేస్తున్నాను,
ఈ చెత్తను తీసుకెళతారు.

386
00:28:42,555 --> 00:28:45,099
ఓకే, కాల్ చేసే ముందు
నీతో ఒకసారి మాట్లాడాలి.

387
00:28:45,182 --> 00:28:46,725
-ఓకే.
-ఓకే.

388
00:28:47,143 --> 00:28:49,603
ఇపుడే వస్తాను,
వెంటనే వస్తాము.

389
00:28:49,937 --> 00:28:51,605
-చూసుకుంటావు కదా?
-నేను చూసుకుంటాను.

390
00:29:02,366 --> 00:29:03,451
ఎలినార్?

391
00:29:07,329 --> 00:29:08,581
నాకు ఇంకా వణుకు ఆగడం లేదు

392
00:29:10,541 --> 00:29:12,001
పర్లేదు.

393
00:29:13,961 --> 00:29:16,922
పర్లేదు.

394
00:29:17,506 --> 00:29:19,925
నువ్వు పోలీసులను పిలవడం నాకు ఇష్టం లేదు.

395
00:29:21,844 --> 00:29:24,513
ఎలనార్, నిన్ను, నా కూతురును కిడ్నాప్
చేసిన వ్యక్తులను...

396
00:29:24,597 --> 00:29:26,265
ఏమి చేయకుండా వదిలేయమంటావా?

397
00:29:26,348 --> 00:29:29,268
జోయ్ మార్క్స్ కు వ్యతిరేకంగా మన కూతురు
సాక్ష్యం చెప్పటం నాకు ఇష్టం లేదు...

398
00:29:29,351 --> 00:29:30,936
-మనం తనను కాపాడుకోవచ్చు.
-లేదు.

399
00:29:31,020 --> 00:29:32,563
నువ్వు వేరే ఏదైనా ఆలోచించు. ఓకే?

400
00:29:32,646 --> 00:29:35,357
ఎందుకంటే నేను సాక్ష్యం ఇవ్వను,
నా కూతురు కూడా ఇవ్వదు.

401
00:29:37,943 --> 00:29:41,447
ఓకే, కాని నువ్వు, మ్యాడీ రేపు ఉదయం లోపు
వెగాస్ వదిలి పోవాలి.

402
00:29:41,530 --> 00:29:42,364
ఎక్కడికి వెళ్ళమంటావు?

403
00:29:42,448 --> 00:29:45,242
ఎల్.ఏ. ఇదంతా అయిపోయేవరకు
నా ప్లేసులో ఉండండి.

404
00:29:50,289 --> 00:29:51,332
ఓకే.

405
00:29:54,793 --> 00:29:57,880
జెర్రీ, ఇద్దరిని కార్లో కూర్చోబెట్టు.

406
00:29:57,963 --> 00:29:59,715
హోటల్ వెళ్ళే ముందు ఇంటికి వెళ్లి...

407
00:29:59,798 --> 00:30:01,550
వాళ్ళ సామానులు తీసుకుందాం.

408
00:30:03,511 --> 00:30:04,512
హ్యారీ

409
00:30:06,514 --> 00:30:08,599
వెళ్ళు, నేను తొందరగానే వస్తాను.

410
00:30:33,749 --> 00:30:36,961
నువ్వు నా కూతురు
తల మీద తుపాకి పెట్టావు కదా.

411
00:32:35,287 --> 00:32:36,538
పైన లాక్ కొంచెం గట్టిగా ఉంటుంది.

412
00:32:36,955 --> 00:32:37,956
నేను చూసుకుంటాను.

413
00:32:38,040 --> 00:32:39,208
హియరింగ్ ఈ రోజు పొద్దున్న ఉంది.

414
00:32:39,291 --> 00:32:42,211
సాయంత్రంలోగా మేము కార్లో ఎల్.ఏ చేరుకుంటాం,
డిన్నర్ టైంకు వస్తాం.

415
00:32:42,294 --> 00:32:44,046
గ్రేట్, క్షేమంగానే వస్తారు అనుకుంటున్నాను.

416
00:32:44,129 --> 00:32:47,132
ఎలనార్...మాకు ఏం జరగదు.

417
00:32:48,384 --> 00:32:51,387
బిల్లెట్స్ పోలీసులను పంపి మిమ్మల్ని
ఎయిర్పోర్ట్ దగ్గర పిక్ చేసుకుంటారు

418
00:32:51,470 --> 00:32:53,681
అలాగే నా ఇంటి దగ్గర దింపుతారు.

419
00:32:54,765 --> 00:32:56,642
ఓకే

420
00:32:58,060 --> 00:32:59,561
నాన్న, మాతో రావచ్చు కదా నాన్న.

421
00:32:59,645 --> 00:33:00,479
బంగారం, నేనిప్పుడు రాలేను.

422
00:33:00,562 --> 00:33:03,190
-లేదు, నాన్న ప్లీజ్.
-బంగారం, రాలేను.

423
00:33:04,233 --> 00:33:05,984
చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి.

424
00:33:06,568 --> 00:33:07,945
నేను ప్రామీస్ చేస్తున్నాను.

425
00:33:08,570 --> 00:33:10,948
ఇంకోసారి ఈ వ్యక్తులు
మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు.

426
00:33:12,491 --> 00:33:14,743
-నన్ను నమ్ముతావా?
-ఓకే.

427
00:33:14,827 --> 00:33:15,911
చూడు,

428
00:33:16,453 --> 00:33:19,206
మీ అమ్మ జరిగిన సంఘటన పట్ల చాలా కోపంగా
ఉంది...

429
00:33:19,289 --> 00:33:23,377
కాని ఇంకోసారి నా వల్ల మీకు ఎలాంటి ప్రమాదం
జరగదని హామీ ఇస్తున్నాను, సరేనా?

430
00:33:24,962 --> 00:33:25,879
సరే నాన్న.

431
00:33:27,840 --> 00:33:29,425
నువ్వు మాకోసం వస్తావని కూడా తెలుసు.

432
00:33:38,767 --> 00:33:39,852
రాత్రిలోగా ఇంటికి వచ్చేస్తాను.

433
00:33:42,312 --> 00:33:43,939
తొందరగా సెక్యూరిటి చెక్ ఇన్ చేయాలి.

434
00:33:46,483 --> 00:33:48,986
ఎలనార్, ఇంట్లో క్యాబిన్లో ఒక పెట్టె ఉంది.

435
00:33:49,069 --> 00:33:51,238
అందులో ఒక తుపాకి ఉంది...

436
00:33:51,321 --> 00:33:53,365
ఎక్కడున్నాయో తెలిస్తే
మంచిదని చెబుతున్నాను.

437
00:33:53,449 --> 00:33:54,283
ఓకే

438
00:33:56,493 --> 00:33:57,369
ఓకే

439
00:34:09,757 --> 00:34:10,924
డిటెక్టివ్ బోష్?

440
00:34:11,008 --> 00:34:14,219
డేవ్ వారెన్, రైకోవ్ తరపు న్యాయవాదిని.
కేసులోకి వెళ్ళేముందు...

441
00:34:14,303 --> 00:34:16,180
ఏంటి? నువ్వు వాదించటం లేదా?

442
00:34:16,263 --> 00:34:17,222
వాదించి మాత్రం ఏం లాభం?

443
00:34:17,306 --> 00:34:18,932
హత్య చేసిన ఆయుధం ఉంది...అది నా క్లయింట్
చేసాడని మీరుసాక్ష్యం కూడా సృష్టించారు.

444
00:34:19,016 --> 00:34:22,269
అది అతనికి ఎలా వచ్చింది, అక్కడ ఎవరు
పెట్టారు అనేది వేరే విషయం.

445
00:34:22,352 --> 00:34:25,606
కాని దానికన్నా ముందు తనను తీసుకెళ్ళేప్పుడు
మీరిచ్చే రక్షణ గురించి మాట్లాడాలి.

446
00:34:25,689 --> 00:34:27,232
దారిలో ఎక్కడా ఆగకుండా తీసుకెళ్తాం.

447
00:34:28,025 --> 00:34:29,485
నాకు కూడా అదే కావాలి.

448
00:34:32,237 --> 00:34:36,575
కేస్ నెంబర్ 6205. స్టేట్ వర్సుస్ రైకోవ్

449
00:34:36,658 --> 00:34:37,701
థాంక్యూ, టెస్.

450
00:34:39,995 --> 00:34:42,539
ఇది ఎక్స్ట్రాడిషన్ కు సంభందించిన కేసు,
స్టేట్ రడీగా ఉందా?

451
00:34:42,623 --> 00:34:43,749
స్టేట్ సిద్ధంగా ఉంది. జడ్జ్.

452
00:34:43,832 --> 00:34:45,542
డెవిడ్ వారెన్ ముద్దాయి
తరపున వాదిస్తున్నాడు.

453
00:34:45,626 --> 00:34:46,919
యువర్ హానర్,

454
00:34:47,002 --> 00:34:49,046
నా క్లయింట్ తన కున్న చట్ట పరమైన హక్కు
ప్రకారంగా...

455
00:34:49,129 --> 00:34:51,715
కాలిఫోర్నియా కు తనను తరలించడాన్ని
నిరసిస్తున్నాడు.

456
00:34:51,799 --> 00:34:52,716
నోట్ చేసుకున్నాను.

457
00:34:53,217 --> 00:34:54,718
టెస్, తర్వాత కేసు?

458
00:35:08,565 --> 00:35:09,775
ఇప్పుడే వస్తాను.

459
00:35:10,692 --> 00:35:11,693
హ్యారీ.

460
00:35:14,029 --> 00:35:14,863
చెప్పండి, సర్.

461
00:35:17,950 --> 00:35:21,370
అలాగే, సర్,
ఈ సాయంత్రం కేసు పూర్తికాగానే...హే!

462
00:35:22,037 --> 00:35:22,955
మార్క్స్.

463
00:35:23,705 --> 00:35:25,707
ఇంకోసారి నా కుటుంబం జోలికి వస్తే,

464
00:35:25,791 --> 00:35:28,585
నీ కాళ్ళు, చేతులు నరికి వీల్ చెయిర్లో
కూర్చోబెడతాను.

465
00:35:34,216 --> 00:35:36,593
అయితే రాత్రి ఏం జరిగిందో నాకు
చెప్పాలనుకోవటం లేదన్న మాట?

466
00:35:36,677 --> 00:35:38,345
అవును, అనుకోవటం లేదు. పద.

467
00:35:50,232 --> 00:35:51,233
బోష్.

468
00:35:51,942 --> 00:35:54,987
లిలిత్ సరోయన్ బండి గురించి వెతికితే
మాకో ఆధారం దొరికింది.

469
00:35:55,070 --> 00:35:57,573
2012, అల్టిమా... ఈ అడ్రస్ మీద
రిజిస్టర్ అయ్యింది.

470
00:35:58,657 --> 00:36:00,409
టోనీ అల్లెన్స్ వెగాస్ ఆఫీస్, కార్ కోసం
వెతుకుతున్నారా?

471
00:36:00,492 --> 00:36:02,703
ఆల్రెడీ దొరికింది...మన దగ్గరే వారం
రోజుల నుండి ఉంది.

472
00:36:02,786 --> 00:36:04,454
తను గ్రేహౌండ్ స్టేషన్ దగ్గర వదిలేసింది.

473
00:36:04,538 --> 00:36:06,123
చ, తను ఎక్కడైనా ఉండవచ్చు.

474
00:36:06,206 --> 00:36:08,542
అయితే, మేము వేలిముద్రల గురించి
వెతకడానికి ల్యాబ్ కు పంపిస్తాం.

475
00:36:08,625 --> 00:36:10,836
-థాంక్స్.
-డిటెక్టివ్, మనం డీల్ గుర్తుందిగా.

476
00:36:10,919 --> 00:36:12,087
రైకోవ్ విషయంలో మనిద్దరం పార్ట్నర్స్.

477
00:36:12,170 --> 00:36:15,048
ఒకవేళ వాడు మార్క్స్ గురించి ఏదైనా రహస్యాలు
చెబితే ముందు నాకే కాల్ చేయాలి.

478
00:36:15,132 --> 00:36:16,008
అలాగే.

479
00:36:16,425 --> 00:36:19,344
నెవాడ ట్రూపర్స్ బార్డర్ వరకు సెక్యూరిటి
ఇస్తారు...

480
00:36:19,428 --> 00:36:20,387
మంచిది.

481
00:36:27,394 --> 00:36:28,395
ఎందుకు చాలా సంతోషంగా ఉన్నావు?

482
00:36:28,478 --> 00:36:29,688
ఎందుకు ఉండకూడదు?

483
00:36:29,771 --> 00:36:32,274
నీ మీద పెద్ద మర్డర్ కేస్ ఉంది...
భయం కావడం లేదా?

484
00:36:32,357 --> 00:36:34,776
-నేను చేయలేదు అనడానికి సాక్ష్యం ఉంది.
-కాని మేము వేరే విన్నాము.

485
00:36:34,860 --> 00:36:36,737
టోనీ అల్లెన్ను చంపడానికి నాకు ఎలాంటి
కారణం లేదు.

486
00:36:36,820 --> 00:36:39,323
జోయ్ మార్క్స్ చెప్పాడు, నువ్వు చంపావు.
అదే కారణం.

487
00:36:39,406 --> 00:36:41,199
నా లాయర్ మీ సెర్చ్ వారెంట్ చింపి
పడేస్తాడు.

488
00:36:41,283 --> 00:36:43,535
అలాగే నిన్ను కూడా బోష్... ఆ తుపాకిని నాకు
అంటగట్టినందుకు.

489
00:36:43,619 --> 00:36:45,787
అది నాది కాదని నిరూపించబడితే,
నేను ఇంటికెళ్ళిపోతాను.

490
00:36:45,871 --> 00:36:48,415
ఒకవేళ నువ్వనుకున్నట్టు జరగకపోతే?

491
00:36:48,498 --> 00:36:51,209
జోయ్ మార్క్స్ నిన్ను చంపాలనుకుంటున్నాడు...

492
00:36:51,293 --> 00:36:53,712
నువ్వు ఎక్కడ సందుల్లో ఉన్న,
దాక్కున్న చంపేస్తాడు.

493
00:36:54,212 --> 00:36:56,298
-అందుకే మాకు సహాయం చేయి.
-మీకా, చావడం నయం.

494
00:37:15,776 --> 00:37:19,071
రైకోవ్, ల్యూక్. వెగాస్ నుండి ఎక్ట్రాడిషన్
కేసులో తీసుకొని రాబడ్డాడు.

495
00:37:19,404 --> 00:37:23,742
నువ్వు ఇతన్ని ఎవరు కలవకుండా చాలా
జాగ్రత్తగా చూసుకోవాలి... అర్ధమయ్యిందా?

496
00:37:23,825 --> 00:37:25,452
వీన్ని తీసుకెళ్ళడానికి పోలీసులు
వచ్చినప్పుడు...

497
00:37:25,535 --> 00:37:29,331
జోన్ డోయ్ లాడ్జింగ్లో ఉంచి
జాగ్రత్తగా చూసుకోమని చెప్పాలి.

498
00:37:37,297 --> 00:37:38,173
హ్యారీ.

499
00:37:38,840 --> 00:37:40,634
ఇప్పుడు కాదు, మ్యాంక్. నేను ఇంటికెళ్ళాలి.

500
00:37:40,717 --> 00:37:42,177
బిల్లెట్స్ నిన్ను చూడాలనుకుంటుంది.

501
00:37:42,260 --> 00:37:45,806
బిల్డింగ్లో అడుగు పెట్టగానే నిన్ను
లాక్కొని రమ్మని చెప్పింది.

502
00:37:45,889 --> 00:37:48,350
-నన్ను చూడలేదని చెప్పు.
-నేను అలా చెప్పలేను, బడ్డీ.

503
00:37:48,433 --> 00:37:52,104
"ఆ బోష్ తలకాయ తీసుకొని రా."
ఆమె చెప్పిన కచ్చితమైన పదాలు.

504
00:37:52,187 --> 00:37:53,063
షిట్.

505
00:38:00,487 --> 00:38:01,488
లెఫ్టినెంట్?

506
00:38:02,322 --> 00:38:04,992
అప్పుడే వెళ్ళిపోతున్నావా?
నాకు ఫుల్ రిపోర్ట్ ఇవ్వాలి కదా?

507
00:38:05,075 --> 00:38:07,119
నేను ఇంటికెళ్ళాలి.
నా కుటుంబం ఎదురు చూస్తుంది.

508
00:38:07,202 --> 00:38:08,161
ఎలా ఉన్నారు వాళ్ళు?

509
00:38:08,578 --> 00:38:11,039
ఈరోజు పొద్దున్న ఎయిర్పోర్ట్ దగ్గర
వదిలేసినప్పుడు కూడా చాలా భయంగా ఉన్నారు.

510
00:38:11,123 --> 00:38:12,833
వెల్, నేను అర్ధం చేసుకోగలను.

511
00:38:12,916 --> 00:38:16,044
అలాగే రాత్రి తీసుకున్న ఇంకొన్ని నిర్ణయాల
గురించి కూడా నేను అర్ధం చేసుకోగలను.

512
00:38:16,128 --> 00:38:17,337
చాలా మంచిది, ఓకే.

513
00:38:17,421 --> 00:38:20,716
కాని నువ్వు ఎలనార్ తో మాట్లాడి ఆ దుండగుల
మీద కేస్ పెట్టేలాగా చూడాలి.

514
00:38:21,717 --> 00:38:24,970
వాళ్ళను అలా వదిలేయడం పొరపాటు,
కాని నువ్వు చెప్పావని ఒప్పుకున్నాను.

515
00:38:25,053 --> 00:38:26,179
చెప్పి వృధా, తన మనసు మార్చుకోదు.

516
00:38:26,263 --> 00:38:27,764
వాళ్ళు జైల్లో ఉండాల్సిన వ్యక్తులు.

517
00:38:27,848 --> 00:38:31,852
చూడు, ఇంతా జరిగాక జోయ్ మార్క్స్ వాళ్ళను
వదిలేస్తాడు అని నేను అనుకోను.

518
00:38:31,935 --> 00:38:33,812
చావు రాబోతుందనే విషయం వాళ్ళకు
కూడా తెలియదు.

519
00:38:35,856 --> 00:38:37,524
ఇప్పుడు కూడా నీకు ఫుల్ రిపోర్ట్ కావాలా?

520
00:38:40,068 --> 00:38:41,194
లేదు, వద్దులే.

521
00:38:42,404 --> 00:38:44,489
కాని ఈ విషయం భవిష్యత్తులో మనల్ని
ఇబ్బంది పెట్టకుంటే చాలు.

522
00:38:44,573 --> 00:38:45,407
పెట్టదు.

523
00:38:47,534 --> 00:38:49,745
-వెళ్ళు, నీ కుటుంబం ఎదురు చూస్తుంది.
-థాంక్స్, గ్రేస్.

524
00:38:56,626 --> 00:38:57,627
నాన్న.

525
00:38:57,711 --> 00:38:59,629
నా ఇంట్లో మీరేం చేస్తున్నారు?

526
00:39:02,049 --> 00:39:03,467
హే, ఇల్లు సౌకర్యంగానే ఉందా?

527
00:39:03,550 --> 00:39:04,760
మేము గెస్ట్ రూంలో ఉన్నాము.

528
00:39:04,843 --> 00:39:06,428
గుడ్, టవల్స్ దొరికాయా?

529
00:39:06,511 --> 00:39:07,929
ఇంతకు ముందు ఎక్కడుండేవో అక్కడే
ఉన్నాయి.

530
00:39:08,013 --> 00:39:09,181
నేను ఫుడ్ తెచ్చాను.

531
00:39:09,723 --> 00:39:11,349
-ఏం ఫుడ్ తెచ్చారు?
-మెక్సికన్.

532
00:39:11,433 --> 00:39:14,478
పోక్విటో మాస్, ఎల్.ఏ లో మంచి మెక్సికన్
ఫుడ్.

533
00:39:14,561 --> 00:39:16,146
అలాగే నీకు కొత్త ఫోన్.

534
00:39:17,939 --> 00:39:19,149
థాంక్స్, నాన్న.

535
00:39:20,525 --> 00:39:23,195
నువ్వెళ్ళి గిన్నెల్లో పెట్టు...నేను మీ
అమ్మ టేబుల్ మీద సదురుతాం.

536
00:39:23,278 --> 00:39:24,237
ఓకే.

537
00:39:26,156 --> 00:39:27,574
నేను ప్లేట్స్ తీసుకొస్తాను.

538
00:39:40,754 --> 00:39:41,963
తను బానే ఉందా?

539
00:39:42,047 --> 00:39:46,009
తెలియదు, చూడడానికైతే బాగానే ఉంది.

540
00:39:46,802 --> 00:39:49,763
నాకు తెల్సిన ఒక సైక్రియాటిస్ట్ ఉంది,
నేను కూడా పోయిన సంవత్సరం వెళ్ళాను.

541
00:39:49,846 --> 00:39:52,224
నన్నేమైనా తనతో మాట్లాడమంటావా?

542
00:39:52,307 --> 00:39:54,684
ఇంకో రెండు రోజులు చూద్దాం.

543
00:39:54,768 --> 00:39:56,019
ఎక్స్ట్రాడిషన్ ఎలా జరిగింది?

544
00:39:56,478 --> 00:39:59,147
రొటీన్, రైకోవ్ ఒప్పుకోలేదు,
వెనక్కు తెచ్చి కేసు బుక్ చేసాం

545
00:39:59,231 --> 00:40:00,732
అలాగైతే మేము ఇంటికి వెళ్ళిపోవచ్చా?

546
00:40:01,691 --> 00:40:02,526
అప్పుడే కాదు.

547
00:40:05,779 --> 00:40:07,072
ఇదెక్కడ దొరికింది?

548
00:40:07,781 --> 00:40:11,368
బీరువా వెనుక,
మనం క్యాటలిన ట్రిప్లో కొన్నది.

549
00:40:12,160 --> 00:40:15,205
ఎగిరే చేప ఉంటుందంటే నువ్వు నమ్మలేదు.

550
00:40:15,288 --> 00:40:16,498
ఇప్పడు కూడా నమ్మను.

551
00:40:19,709 --> 00:40:21,795
-కిచెన్ కొత్తగా మార్చినట్టు ఉన్నావు.
-అవును.

552
00:40:24,297 --> 00:40:25,382
బాగుంది.

553
00:40:29,427 --> 00:40:31,096
ఇక్కడికి రావడం ఏదోలా ఉంది...

554
00:40:32,055 --> 00:40:33,265
నిజమే కదా.

555
00:40:33,348 --> 00:40:36,518
వాడు ఒక్క కంటితో చూస్తూ ఇంట్లో నుండి
బయటకు పరిగెత్తుకొని వచ్చాడు.

556
00:40:36,601 --> 00:40:39,479
గోడకు కూడా గుద్దుకున్నాడు.

557
00:40:39,563 --> 00:40:41,106
రిలే, నువ్వొక చెత్త వెదవవి.

558
00:40:42,607 --> 00:40:44,234
-హే, నిన్న రాత్రి?
-యా?

559
00:40:44,317 --> 00:40:46,444
మీరేవరినైనా అక్కడ వదిలేసి వచ్చారా?

560
00:40:46,528 --> 00:40:48,655
లేదు, బ్రో, కేవలం సీలింగ్ పడేసాం.

561
00:40:48,738 --> 00:40:50,866
-వాళ్ళ దృష్టిలో పడుతుంది.
-అవును, నేను అదే అనుకుంటున్నాను.

562
00:40:51,741 --> 00:40:54,369
యా...ఆ దుమ్మంతా నా ముక్కులో దూరింది.

563
00:40:54,452 --> 00:40:56,329
భరించడం కష్టం అయిపోయింది.

564
00:40:59,666 --> 00:41:01,626
-ఏమిటిది?
-ఇది నీ వాటా.

565
00:41:03,378 --> 00:41:04,337
వెల్, మంచిది.

566
00:41:05,130 --> 00:41:06,089
యప్.

567
00:41:12,512 --> 00:41:13,555
క్యాప్!

568
00:41:14,139 --> 00:41:16,099
-క్యాప్.
-ఎలా జరుగుతుంది?

569
00:41:16,433 --> 00:41:20,061
బాగానే జరుగుతుంది. మీరెలా ఉన్నారు?

570
00:41:20,812 --> 00:41:22,022
బాగానే ఉన్నాము.

571
00:41:24,024 --> 00:41:25,317
ఇర్వింగ్,

572
00:41:25,734 --> 00:41:27,652
రాత్రి నువ్వు చాలా బాగా పని చేసావని
చెప్పారు.

573
00:41:27,736 --> 00:41:29,404
యా, నువ్వు చూసి ఉండాల్సింది.

574
00:41:29,487 --> 00:41:32,699
సినిమాల్లో హీరోలాగా కుమ్మేసాడు.

575
00:41:33,533 --> 00:41:36,119
యా, థాంక్యూ.

576
00:41:36,620 --> 00:41:39,998
అలాగే డబ్బులిచ్చినందుకు థాంక్స్

577
00:41:40,373 --> 00:41:41,416
డబ్బులు.

578
00:41:42,918 --> 00:41:46,213
ఇంకా మంచి రోజులు ముందున్నాయి. మంచి రోజులు

579
00:41:49,841 --> 00:41:53,845
ఆ రోజులకు తలుపులు తీసే తాళానివి నువ్వే.

580
00:41:59,100 --> 00:42:00,352
మీతో కలిసినందుకు నాకు సంతోషంగా ఉంది.

581
00:42:00,435 --> 00:42:02,729
ఓహ్, సారీ.

582
00:42:03,521 --> 00:42:05,023
నువ్వు ఇంకా అప్పుడే మాలో కలిసిపోలేదు.

583
00:42:06,983 --> 00:42:08,068
ఏంటి, ఇంకా లేదా?

584
00:42:10,904 --> 00:42:14,074
లేదు, అంతకు ముందు నువ్వు ఇంకొక పని చేయాలి

585
00:42:15,408 --> 00:42:19,287
ఎవరినైనా తీసుకునే ముందు మేము ఒక
ఉత్సవం చేస్తాం.

586
00:42:19,371 --> 00:42:22,374
దాన్ని మేము 'ఐరన్ రోడియో' అని పిలుస్తాము.

587
00:42:24,876 --> 00:42:28,380
రోడియో?
అంటే, గుర్రాలను స్వారీ చేయడం లాంటిదా ?

588
00:42:28,463 --> 00:42:30,048
యా, ఇంచుమించు అలాంటిదే.

589
00:42:30,131 --> 00:42:32,634
మంచిది,
కాని గుర్రాన్ని స్వారీ చేయడం రాదు...

590
00:42:34,719 --> 00:42:36,471
కాని నేను చూపెట్టబోయే దాన్ని
నువ్వు స్వారీ చేయగలవు.

591
00:43:00,829 --> 00:43:02,580
కమాన్ మ్యాన్, నీ ఒంటి మీద కోటు తీయి.

592
00:43:02,664 --> 00:43:05,208
అలాగే ఇంకా ఆయిల్లో తడవకూడనివి ఏమైనా ఉంటే
పక్కన పెట్టు.

593
00:43:10,005 --> 00:43:12,674
మీరందరూ నిజంగా ఇది చేసారా?

594
00:43:12,757 --> 00:43:14,676
అందరం. ఓ గ్రాడీ కూడా.

595
00:43:16,011 --> 00:43:17,470
నేను చూసి ఉండాల్సింది.

596
00:43:33,862 --> 00:43:35,363
షిట్, మ్యాన్.

597
00:44:21,076 --> 00:44:22,952
పైకి ఎక్కురా గుండోడా.

598
00:45:03,576 --> 00:45:04,994
స్వారీ మొదలుపెట్టు!

599
00:45:44,159 --> 00:45:46,202
-ఏంటిది?
-వాళ్ళు రహస్యంగా ఏదో పెట్టారు.

600
00:45:46,286 --> 00:45:47,662
చా.

601
00:45:49,122 --> 00:45:50,165
దాన్ని నాశనం చేయగలవా?

602
00:45:50,832 --> 00:45:51,791
వాన్ని బిసిగా ఉంచండి.

